మంత్రి కేటీఆర్‌ పర్యటనలో ఉద్రిక్తత.. | ABVP Activists Arrested On KTR Visit At Karimnagar | Sakshi
Sakshi News home page

మంత్రి కేటీఆర్‌ పర్యటనలో ఉద్రిక్తత..

Published Tue, Jan 31 2023 12:06 PM | Last Updated on Tue, Jan 31 2023 3:08 PM

ABVP Activists Arrested On KTR Visit At Karimnagar - Sakshi

సాక్షి, కరీంనగర్‌: మంత్రి కేటీఆర్‌ కరీంనగర్‌ జిల్లా పర్యటనలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఏబీవీపీ కార్యకర్తలు మంత్రి కేటీఆర్‌ కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, ఏబీవీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 

ఈ సందర్భంగా ఓ జడ్పీటీసీ ఏబీవీపీ కార్యకర్తతో అనుచితంగా ప్రవర్తించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. మంత్రి కేటీఆర్‌ కరీంనగర్‌ పర్యటన నేపథ్యంలో పోలీసులు బీజేపీ, కాంగ్రెస్‌ నేతలను ముందస్తు అరెస్ట్‌లు చేశారు. ఈ అరెస్ట్‌లపై బీజేపీ హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement