East Godavari District News
-
వాడపల్లి వెంకన్నకు రూ 1.47 కోట్ల ఆదాయం
కొత్తపేట: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి ఆలయ హుండీల ద్వారా రూ.1,47,12,969 ఆదాయం వచ్చింది. దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఈ విషయం తెలిపారు. ఆలయంలోని హుండీలను 32 రోజుల అనంతరం దేవదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో సోమవారం తెరిచి, ఆదాయాన్ని వసంత మండపంలో లెక్కించారు. ప్రధాన హుండీల ద్వారా రూ.1,19,16,439, అన్నప్రసాదం హుండీల ద్వారా రూ.24,51,230 చొప్పున ఆదాయం వచ్చిందని ఈఓ వివరించారు. అలాగే, బంగారం 13 గ్రాములు, వెండి 1.380 కేజీలు, విదేశీ కరెన్సీ నోట్లు 64 వచ్చాయన్నారు. క్షేత్ర పాలకుడు అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామివారి ఆలయ హుండీల ద్వారా రూ.3,45,300 ఆదాయం వచ్చిందని తెలిపారు. వాడపల్లి వెంకన్న దర్శనానికి స్లాట్ విధానంఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనాల్లో సాధారణ భక్తులకు ప్రాధాన్యం కల్పించనున్నారు. దీనికోసం తిరుమల తరహాలో వచ్చే నెల 1 నుంచి ప్రతి శనివారం స్లాట్ విధానం అమలు చేయనున్నారు. దేవదాయ, ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు సోమవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. వీఐపీ సిఫారసు లేఖలతో వచ్చే భక్తులకు ఉదయం 7 నుంచి 8 గంటల వరకూ మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. చంటి పిల్లలు (తల్లి, రెండేళ్ల లోపు పిల్లలు), దివ్యాంగులకు (కాళ్లు లేకుండా పూర్తిగా నడవలేని వారు, చూపు పూర్తిగా కనపడని వారు, దివ్యాంగులతో పాటు ఒక సహాయకుడు) ఉదయం 11 నుంచి 12 గంటల వరకూ దర్శనం కల్పిస్తారు. ఈ దర్శనం పూర్తిగా ఉచితం. తిరిగి మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకూ వీఐపీ దర్శనాలకు అనుమతిస్తారు. సాయంత్రం 5 గంటల తరువాత సిఫారసు లేఖలపై దర్శనాలను అనుమతించరు. -
పోలీసు పీజీఆర్ఎస్కు 39 ఫిర్యాదులు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెస్సల్ సిస్టం(పీజీఆర్ఎస్)కు 39 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా నలుమూలల నుంచీ వచ్చిన ప్రజల నుంచి ఎస్పీ డి.నరసింహ కిశోర్ అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో నేరుగా జూమ్ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడి, ఫిర్యాదీల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వర న్యాయం అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎన్‌బీఎం మురళీకృష్ణ, ఎల్.అర్జున్, స్పెషల్ బ్రాంచి డీఎస్పీ బి.రామకృష్ణ, ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ పవన్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పీజీఆర్ఎస్కు 189 అర్జీలు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమానికి ప్రజలు 189 అర్జీలు సమర్పించారు. ఇందులో 93 రెవెన్యూ, 23 పంచాయతీరాజ్, 18 పోలీస్, 51 ఇతర శాఖలవి ఉన్నాయని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడుతో కలసి ప్రజల నుంచి ఆమె అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులనుద్దేశించి మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం తగదని, త్వరితగతిన పరిష్కరించడంపై దృష్టి సారించాలని అన్నారు. ప్రతి శాఖ పరిధిలో పరిష్కరించిన ఫిర్యాదులకు సంబంధించి తప్పనిసరిగా ఆడిట్ చేయించాలన్నారు. అర్జీలపై విచారణ అనంతరం తీసుకున్న చర్యలను సంబంధిత ఫిర్యాదీలకు వాట్సాప్‌లో తెలియజేయాలని, వాయిస్ మెసేజ్ కూడా పంపాలని చెప్పారు. -
దిగుబడి బాగున్నా దయనీయమే!
● ధాన్యం కొనండి మహాప్రభో అని వేడుకుంటున్న అన్నదాతలు ● టార్గెట్ మీరలేమంటున్న కొనుగోలు కేంద్రాల సిబ్బంది ● తలలు పట్టుకుంటున్న రైతులు గోకవరం: చివరి ధాన్యపు గింజ వరకు కొంటాం.. రైతు సంక్షేమమే లక్ష్యం.. ఇవీ నిత్యం కూటమి ప్రభుత్వం ఇచ్చే ప్రకటనలు. క్షేత్రస్థాయిలో అందుకు పూర్తి విరుద్ధం. కొనుగోలు కేంద్రాల వద్ద ఇంత ధాన్యమే కొనాలని లక్ష్యం విధిస్తే అంతకు మించి సరకును రైతులు తీసుకువస్తే ససేమిరా.. మేమింతే కొంటామని కొనుగోలు కేంద్రాల సిబ్బంది పొమ్మంటే అన్నదాత పరిస్థితి ఏమిటి? ఎవరైనా పంట వేస్తే దిగుబడి బాగా రావాలనే వేస్తారు. ఆశించినట్టే దిగుబడి వచ్చినా అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి అన్నట్టు పరిస్థితి ఉంటే ఆ రైతు ఎవరికి చెప్పుకోవాలి? ఇదే పరిస్థితి మండలంలోని తంటికొండ రైతులకు ఏర్పడింది. ఈ పరిస్థితిపై రైతులు సోమవారం అధికారులకు మొర పెట్టుకున్నారు. గ్రామానికి చెందిన రైతులు రబీసాగులో 876 ఎకరాల్లో ఎంటీయూ 1121 రకం ధాన్యాన్ని, 12 ఎకరాల్లో 1156 రకాన్ని పండించి ఈ–క్రాప్ నమోదు చేయించుకున్నారు. సుమారు 33,779 క్వింటాళ్లు దిగుబడి రాగా 16,110 క్వింటాళ్లు రైతుభరోసా కేంద్రం ద్వారా విక్రయించారు. అయితే వ్యవసాయశాఖ సిబ్బంది టార్గెట్ లేదని వారి వద్ద ఉన్న సుమారు 14,169 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేయలేదు. దళారులకు విక్రయిద్దామంటే గిట్టుబాటు ధర రావడం లేదని, ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే తాము అప్పులపాలవుతామని రైతులు అధికారుల వద్ద వాపోయారు. ధాన్యం టార్గెట్‌ను పెంచి తమ వద్ద ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని తహసీల్దార్ సాయిప్రసాద్, ఎంపీడీఓ గోవిందు, ఏఓ రాజేశ్వరిలను వేడుకున్నారు. దీనిపై అధికారులు మాట్లాడుతూ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామన్నారు. -
వీర్లపై వారి వైఖరేమిటో!
● నివేదిక సమర్పించి నాలుగు రోజులైనా వీడని సందిగ్ధత ● సింహగిరి చందనోత్సవం తరువాతేనని ఊహాగానాలు ● పరిశీలనలో ముగ్గురు ఆర్జేసీలు, ఒక డీసీ పేర్లు అన్నవరం: రత్నగిరిపై ఇటీవల నెలకొన్న వివాదాలు, ఈఓ వీర్ల సుబ్బారావు వ్యవహార శైలి, ఆయన కుమారుడి జోక్యం, తదితర అంశాలపై దేవదాయశాఖ అడిషనల్ కమిషనర్ కె.చంద్రకుమార్ విచారణ జరిపి నివేదిక సమర్పించి నాలుగు రోజులైనా తదుపరి చర్యలపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఆ శాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్‌కు ఇచ్చిన నివేదికలో సాక్షిలో వచ్చిన పలు కథనాల ఆధారంగా పలువురు ఉద్యోగుల అభిప్రాయాలను సెక్షన్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ నమోదు చేసిన రికార్డులను పొందుపరచారు. దేవస్థానంలో సూపరింటెండెంట్లు, ఏఈఓలతో 22వ తేదీ, మంగళవారం ఏడీసీ చంద్రకుమార్ సమావేశమై విచారణ నిర్వహించారు. తరువాత ఈఓ వీర్ల సుబ్బారావు తో కూడా ఆయన మాట్లాడారు. కమిషనర్ బిజీతో ఆలస్యం? కాగా, సింహాచలం దేవస్థానంలో ఈ నెల 30వ తేదీన అక్షయ తృతీయ సందర్భంగా చందనోత్సవ ఏర్పాట్లలో కమిషనర్ రామచంద్రమోహన్ తలమునకలైన ఉండడం వల్లే రత్నగిరి వ్యవహారాల్లో చర్యలు ఆలస్యమవుతున్నట్టు తెలుస్తోంది. 29వ తేదీ అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ప్రారంభం కానున్న చందనోత్సవానికి సుమారు 300 మంది సిబ్బందిని వివిధ దేవస్థానాల నుంచి డెప్యుటేషన్‌పై తరలించారు. ఈఓ బదిలీపై ఊహాగానాలు నివేదిక ఆధారంగా ఈఓ వీర్ల సుబ్బారావును రత్నగిరి నుంచి బదిలీ చేస్తారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే మే ఏడో తేదీ నుంచి సత్యదేవుని కల్యాణోత్సవాలు సాగనున్న నేపథ్యంలో ఈ ప్రక్రియ కొంత నెమ్మదించవచ్చనే అభిప్రాయాలు సైతం వినిపిస్తున్నాయి. పరిశీలనలో నలుగురి పేర్లు ఈఓ సుబ్బారావు బదిలీ జరిగితే ఆ స్థానంలో ఎవరిని నియమించాలనేదానిపై ఇప్పటికే కసరత్తు మొదలైనట్టు ప్రచారం జరుగుతోంది. గతంలో ఇక్కడ ఈఓలుగా పని చేసిన ముగ్గురు ఆర్జేసీల పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో ఇద్దరు దేవస్థానం ఈఓలుగా పనిచేస్తుండగా, ఒకరు సెలవులలో ఉన్నారు. మరో ఆర్జేసీ శాఖాపరమైన పోస్టులో ఉన్నారు. కాగా, గతేడాది డీసీగా పదోన్నతి పొందిన అధికారిని ఈఓగా నియమించాలని టీడీపీకి చెందిన మెట్ట ప్రాంత సీనియర్ ఎమ్మెల్యే సిఫారసు చేసినట్టు సమాచారం. ఆర్జేసీ పదోన్నతుల జాబితాలో ఆయన స్థానం రెండోది. అందువల్ల ఆయనను ఈఓగా నియమించి ఆ తరువాత పదోన్నతి కల్పిస్తారనే ప్రచారం సాగుతోంది. కొనసాగేలా ఈఓ పావులుకాగా, దేవస్థానం ఈఓగా తనను కొనసాగించాలని ఈఓ వీర్ల సుబ్బారావు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన ఇటీవల ఒక టీడీపీ మాజీ మంత్రి, సీనియర్ నాయకుడిని కలిసి వేడుకున్నారని ఆయన కమిషనర్‌తో మాట్లాడతానని హామీ ఇచ్చారని అంటున్నారు. అలాగే ఇతర ఎమ్మెల్యేలను కూడా ఆయన కలుస్తున్నట్టు సిబ్బంది చెప్తున్నారు. -
జాతీయ బోట్గేమ్ పోటీల్లో వర్షిత ప్రతిభ
పెదపూడి: భోపాల్‌లోని లోయర్లేక్ వేదికగా ఈ నెల 24 నుంచి 28 వరకు నిర్వహించిన 35వ జాతీయ కెనోయ్ స్ప్రింట్ (బోట్గేమ్) చాంపియన్‌షిప్ పోటీల్లో తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి చెందిన గొలుగూరి వర్షిత కాంస్య పతకం సాధించిందని ఆమె తల్లిదండ్రులు రాజేష్‌రెడ్డి, విజయలక్ష్మి సోమవారం తెలిపారు. అనపర్తిలో వారు మాట్లాడుతూ సబ్ జూనియర్ కె4 500 మీటర్ల విభాగంలో కాంస్య పతకం సాధించినట్టు తెలిపారు. వర్షిత ప్రస్తుతం విజయవాడలోని ఎన్ఎస్ఎం పాఠశాలలో 8వ తరగతి చదువుతోందన్నారు. -
ట్రిపుల్ ఐటీ సంరంభం..
● ఆర్జీయూకేటీ నోటిఫికేషన్ విడుదల ● ఆన్లైన్లో ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ● వచ్చేనెల 28 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన రాయవరం: రాజీవ్‌గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్(ఆర్జీయూకేటీ)లో 2025–26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల నోటిఫికేషన్ ఈ నెల 24న విడుదల చేశారు. 2024–25 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థుల చూపు అంతా ట్రిపుల్ ఐటీ వైపు మళ్లింది. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్‌లో భాగంగా రాష్ట్రంలో ఉన్న 4 వేల ట్రిపుల్ ఐటీ సీట్లలో జిల్లాకు ఎన్ని సీట్లు కేటాయిస్తారు.. ఎన్ని సీట్లు వస్తాయనే సందిగ్ధంలో విద్యార్థులు ఉన్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. జూన్ 11 నుంచి 17వ తేదీ వరకు స్పెషల్ కేటగిరీ (పీహెచ్/ఎన్సీసీ/స్పోర్ట్స్/భారత్ స్కౌట్స్) సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్దేశించిన ఐఐఐటీల్లో చేపట్టనున్నారు. అడ్మిషన్ల అనంతరం ఆగస్టు మొదటి వారంలో తరగతులు ప్రారంభిస్తారు. నాలుగు వేల సీట్లు రాష్ట్రంలోని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో ఒక్కో చోట వెయ్యి సీట్ల వంతున నాలుగు వేల సీట్లు ఉన్నాయి. వీటికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన పదో తరగతి పరీక్షల్లో ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణులైన 48,448 మంది మధ్య ఈ పోటో ఉంటుంది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకే అధిక సీట్లు.. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదివిన విద్యార్థులకే ట్రిపుల్ ఐటీలో అధిక సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఎంపిక ప్రక్రియ ఇలా ఎంపిక ప్రక్రియలో భాగంగా ఇరువురు విద్యార్థులకు మార్కులు సమానంగా వస్తే తొలుత గణితం, అనంతరం జనరల్ సైన్స్, తదుపరి ఇంగ్లిషు, ఆ తదుపరి సోషల్ స్టడీస్, ఫస్ట్ లాంగ్వేజన్లో అధిక మార్కులు వచ్చిన వారికి ప్రాధాన్యమిస్తారు. అప్పటికీ సమానంగా వస్తే పుట్టిన తేదీ ప్రకారం అధిక వయసు ఉన్న వారిని, హాల్ టికెట్ నంబర్ నుంచి పొందిన అత్యల్ప సంఖ్య ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్లో దరఖాస్తు ఇలా ట్రిపుల్ ఐటీలో చేరేందుకు ఆసక్తి ఉన్న వారు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఆర్జీయుకేటీ.ఇన్/ఏపీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. బీసీ, ఈడబ్ల్యూఎస్, ఓసీ విద్యార్థులకు దరఖాస్తు రుసుం రూ.300గా, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.200గా నిర్దారించారు. రిజర్వేషన్లు ఇలా ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లకు రిజర్వేషన్ నిబందనలు పాటిస్తారు. రాష్ట్రంలోని అభ్యర్థులకు 85 శాతం సీట్లు, మిగిలిన 15 శాతం సీట్లు రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు కేటాయిస్తారు. ఎస్సీ–15, ఎస్టీ–6, బీసీ(ఎ)–7, బీసీ (బి)–10, బీసీ (సి)–1, బీసీ (డి)–7, బీసీ (ఇ)–4, దివ్యాంగులు–5, ఆర్మీ ఉద్యోగుల పిల్లలు (సీఏపీ)–2, ఎన్సీసీ–1, స్పోర్ట్స్–0.5, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్–0.5 శాతం సీట్లు కేటాయిస్తారు. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ప్రత్యేక కేటగిరీల్లో బాలికలకు 33.1/3 శాతం సీట్లు కేటాయిస్తారు. ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్ తేదీ ఏప్రిల్ 24. ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరణ ఏప్రిల్ 27 నుంచి మే 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు. ఆన్లైన్ స్పెషల్ కేటగిరీ (చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్) విద్యార్థులకు సర్టిఫికెట్ల పరిశీలన మే 28, 29 తేదీలలో. స్పోర్ట్స్ కేటగిరి విద్యార్థులకు సర్టిఫికెట్ల పరిశీలన: మే28 నుంచి 30 వరకు. భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలన మే 29న. ఎన్సీసీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన మే 29 నుంచి 31 వరకు. ప్రొవిజినల్ సెలక్షన్ (స్పెషల్ కేటగిరీ కాని విద్యార్థులు) జూన్ 05. నూజివీడు క్యాంపస్‌కు ఎంపికై న వారి సర్టిఫికెట్ల పరిశీలన జూన్ 11, 12 తేదీలు ఆర్కే వ్యాలీ, ఇడుపులపాయ క్యాంపస్‌లకు ఎంపికై నవారికి జూన్ 12, 14 తేదీలు శ్రీకాకుళం క్యాంపస్‌కు ఎంపికై న వారికి జూన్ 16, 17 తేదీలలో ఎంపికై న విద్యార్థులు ఆయా క్యాంపస్‌ల్లో రిపోర్డు చేయాల్సిన తేదీ జూన్ 30 నాడు వైఎస్ చలువతో గ్రామీణ విద్యార్థులకు అత్యున్నత సాంకేతిక విద్యనందించేందుకు 2008లో అప్పటి ముఖ్యమంత్రి, దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఇడుపులపాయ, నూజివీడు, తెలంగాణ రాష్ట్రంలోని బాసరలో ట్రిపుల్ ఐటీలు ఏర్పాటు చేశారు. ప్రారంభంలో అధిక సీట్లు కేటాయించగా, 2010లో ఒక్కో ట్రిపుల్ ఐటీలో 1000 సీట్లు ఉండేలా కుదించారు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం బాసర ట్రిపుల్ ఐటీ తెలంగాణకు వెళ్లిపోవడంతో 2016లో ఒంగోలు, శ్రీకాకుళంలో ట్రిపుల్ ఐటీలు ప్రారంభించారు. ట్రిపుల్ ఐటీల్లో 26 జిల్లాల విద్యార్థులకు సమానంగా సీట్లు ఇచ్చేందుకు వర్శిటీ అధికారులు నిర్ణయించి 4వేల సీట్లలో ఓపెన్ కేటగిరీలో 600 సీట్లను స్థానికేతరులు, తెలంగాణ, ఎన్ఆర్ఐ, తదితరులకు కేటాయిస్తారు. మిగిలిన 3,400 సీట్లను 26 జిల్లాల వారికి సమానంగా కేటాయిస్తారు. జిల్లాకు కేటాయించే సీట్ల ఆధారంగా మెరిట్ విద్యార్థులకు అవకాశం లభించనుంది. -
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
కాకినాడ సిటీ: స్థానిక న్యూ పోర్ట్ రైల్వే స్టేషన్ రెండో నంబర్ ప్లాట్‌ఫాం దిగవన రైతుల పట్టాల వద్ద సోమవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు జీఆర్పీ ఎస్ఐ వాసు తెలిపారు. మృతుడికి సుమారు 35 ఏళ్ల వయసు ఉంటుందన్నారు. ఐదు అడుగుల మూడు అంగుళాల ఎత్తు, చామన ఛాయ కలిగి ఉండి బ్లూ కలర్ ట్రాక్ ఫ్యాంట్ సిమెంటు కలర్ టీషర్టు దానిపై ఫ్రంట్ సైడ్ బ్లాక్ అండ్ వైట్ డిజైన్ ఉందన్నారు. కుడికాలుకు దిష్టి పూసలతాడు, మెడలో ఎర్రతాడు, చేతికి ఎర్రతాడు ఉన్నాయ న్నారు. ఆచూకీ తెలిసిన వారు 85558 56876 నంబర్‌కు తెలియజేయాలని ఎస్ఐ కోరారు. -
పేదలను కొట్టు.. పెద్దలకు పెట్టు
● ఇదీ కూటమి పాలన తీరు ● దోమాడ బాధితులకు అండగా ఉంటాం ● న్యాయం జరిగే వరకూ పోరాడతాం ● వైఎస్సార్ సీపీ నేతలు వేణు, రాజా, సూర్యనారాయణరెడ్డిపెదపూడి: పెద్దలను కొట్టి పేదలకు పెట్టాలనేది ఒకప్పటి మాట అయితే.. నేడు ప్రతి జిల్లాలోనూ పేదలను కొట్టి పెద్దలకు పెట్టు అనే విధంగా కూటమి ప్రభుత్వ పాలన సాగుతోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ దుయ్యబట్టారు. అరాచక పాలన సాగిస్తూ, ఎస్సీలను, బీసీలను అణగదొక్కుతూ, వారు బతికే పరిస్థితి లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. దోమాడ గ్రామంలో అధికారులు నాలుగు రోజుల క్రితం పేదల ఇళ్లను దౌర్జన్యంగా కూల్చివేశారు. ఇళ్లు కోల్పోయిన 8 మంది బాధిత కుటుంబాలను మాజీ మంత్రి వేణు, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పార్టీ అనపర్తి నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ఆదివారం రాత్రి పరామర్శించారు. తొలగించిన ఇళ్ల శిథిలాలను పరిశీలించారు. ఇళ్ల తొలగింపు ఏవిధంగా జరిగిందో బాధితులను అడిగి తెలుసుకున్నారు. వారికి వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఒక్కో బాధిత కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం సమకూర్చారు. ఈ మొత్తాన్ని ఆయా కుటుంబాలకు వేణు, రాజా చేతుల మీదుగా అందజేశారు. కలెక్టర్ స్పందించాలి ఈ సందర్భంగా మాజీ మంత్రి వేణు మాట్లాడుతూ, దోమాడలో ఎస్సీ, శెట్టిబలిజ, నాయీ బ్రాహ్మణులు, చేనేత తదితర పేద కుటుంబాలను రోడ్డున పడేసి, వారి పొట్ట కొడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎస్సీలు, బీసీలు బతికే పరిస్థితి లేకుండా చేస్తున్నారన్నారు. దోమాడలో కేవలం ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం 70 ఏళ్లుగా నివసిస్తున్న పేదల ఇళ్లను అధికారులు తొలగించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని గాలికొదిలేసి, కేవలం రియల్ ఎస్టేట్ కోసం పని చేస్తోందని దుయ్యబట్టారు. బాధితులకు ఎటువంటి నోటీసులూ ఇవ్వకుండా, వారికి చెప్పకుండా తెల్లవారుజామున ఇళ్లు కూల్చివేయడం హేయమన్నారు. ఒక దివ్యాంగురాలు బాత్రూములో ఉండగా బయటకు లాక్కుని వచ్చి మరీ ఇల్లు కూల్చేశారన్నారు. మే 7న పెళ్లి చేసుకునే వారి ఇల్లు, హార్ట్ పేషెంట్ కుటుంబాల ఇల్లు కూల్చివేయడం అత్యంత దారుణమన్నారు. దీనిపై కాకినాడ జిల్లా కలెక్టర్ స్పందించి, నిజనిర్ధారణ కమిటీ వేసి, విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇంత పెద్ద సంఘటన జరిగినప్పుడు బాధితులను పరామర్శించడం స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కనీస బాధ్యత అని గుర్తు చేశారు. బాధితులకు న్యాయం జరిగేంత వరకూ ప్రభుత్వం పైన, దౌర్జన్యంగా పని చేసిన అధికారుల పైన పోరాటం చేస్తామని హెచ్చరించారు. నాలుగు రోజులుగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి బాధితులకు అండగా ఉండి, అన్ని సౌకర్యాలూ ఏర్పాటు చేయడం అభినందనీయమని వేణు అన్నారు. రియల్టర్ల కోసమే.. జక్కంపూడి రాజా మాట్లాడుతూ ఇళ్ల తొలగింపు ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ ప్రాంతానికి వెనుక ఉన్న ఆరెకరాల రియల్ ఎస్టేట్ వెంచర్ కోసమే ఈ ఇళ్లను తొలగించారనే విషయం అర్థమవుతోందన్నారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు ఉంటున్న ఇల్లు కూడా ప్రొహిబిటెడ్ స్థలంలో ఉందని చెప్పారు. అమరావతిలో చంద్రబాబు ఐదెకరాల్లో, పిఠాపురంలో పవన్ కల్యాణ్ 10 ఎకరాల్లో ఇళ్లు కట్టుకోవచ్చుగానీ, 70 ఏళ్లుగా అక్కడే ఉంటున్న పేదలు పది గజాల్లో జీవించకూడదా అని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డికి ఫోన్ చేసి, ‘గతంలో మీరు చేసిన ఆరోపణ తేల్చండి’ అని బెదిరించడం, పార్టీ కార్యకర్తలపై దాడులకు దిగడం వంటి వాటిపై పెట్టే దృష్టిని పేదల అభివృద్ధిపై పెట్టాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి హితవు పలికారు. రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అనే పేరు తొలగించుకుని, తెలుగుదేశం రియల్ ఎస్టేట్ ప్రైవేటు లిమిటెడ్ అని పెట్టుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. అమరావతి నుంచి దోమాడ వరకూ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయన్నారు. రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి స్పందించి, బాధితులకు పరిహారం అందించి, న్యాయం చేయాలని రాజా కోరారు. బాధితులను కనీసం పరామర్శించరా..? మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ, స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆదేశాలు లేకుండా అధికారులు ఈ దౌర్జన్య కాండ చేయరని ఆరోపించారు. బీజేపీ ప్రధాని దేశ రక్షణకు యుద్ధం చేస్తూంటే, స్థానిక ఎమ్మెల్యే ఆయన ప్రయోజనం కోసం పేదల ఇళ్లు, ఆస్తులు నేలమట్టం చేయడానికి పని చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల 25న పెదపూడి మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే వచ్చారని, ఇప్పుడు పెదపూడిలో బళ్లమ్మ అమ్మవారి దర్శనానికి వచ్చి కూడా బాధితుల వద్దకు కనీసంగా కూడా పరామర్శకు రాలేదని అన్నారు. తమ దీక్షను చూసి చిరునవ్వు నవ్వుకుంటూ రామేశ్వరం గ్రామం వెళ్లిపోయారని బాధితులు ఆవేదన చెందుతున్నారన్నారు. ఈ నెల 25న మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, బాధితులు తన వద్దకు వచ్చి విషయం చెప్పలేదనడం సరికాదన్నారు. బాధితుల కష్టాల్లో ఉంటే వచ్చి పరామర్శించాలే తప్ప వారు మీ వద్దకు రావాలనడం సరైన విధానం కాదని హితవు పలికారు. భవిష్యత్తులో బాధిత కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే ఆ శవానికి లే అవుట్లో దహన సంస్కారాలు చేస్తామని హెచ్చరించారు. ఈ బెంగతో ఎవరికి ఏమైనా అయితే లే అవుట్ యజమాని, ఎమ్మెల్యే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి అద్దంకి ముక్తేశ్వరరావు, జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి, పార్టీ మండల కన్వీనర్ గుత్తుల రమణ, పార్లమెంటరీ బీసీ సెల్ కన్వీనర్ కేతా శ్రీను, సర్పంచుల సమాఖ్య మండల అధ్యక్షుడు కోసూరి వాసు, ఎస్సీ సెల్ నియోజకవర్గ కన్వీనర్ సాంబత్తుల చంటి, ఎంపీటీసీ సభ్యుడు పేపకాయల వెంకట రమణ, తదితరులు పాల్గొన్నారు. -
డిప్యూటీ స్పీకర్ క్షమాపణ చెప్పాలి
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావుపై పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే, శాసన సభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని సీపీఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్ డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బి.పవన్‌తో కలిసి ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరంతరం ప్రజల పక్షాన పోరాడే సీపీఎం రాష్ట్ర కార్యదర్శిపై రఘురామ కృష్ణరాజు అధికార మదంతో మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని దుయ్యబట్టారు. పాలకోడేరు గ్రామంలో దాదాపు 800 మంది పేదల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేసిన రఘురామ కృష్ణరాజు.. బాధితులను పరామర్శించి, వారికి అన్నం పెట్టి, ఆదుకున్న సీపీఎంపై, పార్టీ రాష్ట్ర కార్యదర్శిపై బెదిరింపు మాటలు మాట్లాడటం తప్పని అన్నారు. ‘బతికిపోయావు అంటూ బెదిరింపులకు దిగడం ద్వారా ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారో పరిశీలించుకోవాలని హితవు పలికారు. గత ఐదేళ్లూ భయపడి నియోజకవర్గానికి దూరంగా ఢిల్లీలో దాక్కున్న రఘురామ.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శిని బెదిరించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ‘మీ ధైర్యం ఏమిటో రాష్ట్ర ప్రజలకు తెలుసు’ అని ఎద్దేవా చేశారు. బ్యాంకులకు కోట్లాది రూపాయలు ఎగ్గొట్టి సంపాదించిన సొమ్ముతో విర్రవీగుతూ మాట్లాడటం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని పేదల ఇళ్లు కూలగొట్టడం గురివింద గింజ సామెతను గుర్తు చేస్తోందని అన్నారు. ‘ఒక ఊళ్లో గుడిసెలు పీకితే తప్ప మరో ఊళ్లో మంచినీళ్లు అందించలేరా? దీనినే అభివృద్ధి, ప్రజా పరిపాలన అంటారా?’ అని అరుణ్ ప్రశ్నించారు. కూల్చిన చోటనే పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
దుర్గామాతలకు ఘనంగా హోమాలు
అన్నవరం: రత్నగిరి దుర్గామాతలుగా పూజలందుకుంటున్న వనదుర్గ అమ్మవారికి, తొలి పావంచా వద్ద కొలువైన కనకదుర్గ అమ్మవారికి చైత్ర అమావాస్య పర్వదినం సందర్భంగా ఆదివారం ఘనంగా ప్రత్యంగిర, చండీ హోమాలు నిర్వహించారు. ఉదయం 9 గంటలకు వనదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం పండితులు ప్రత్యంగిర హోమం ప్రారంభించి, 11 గంటలకు పూర్ణాహుతి నిర్వహించారు. అమ్మవారికి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి, ప్రసాదాలు నివేదించి, భక్తులకు పంపిణీ చేశారు. కాగా, పది రోజులుగా తొలి పావంచా వద్ద కనకదుర్గ అమ్మవారికి నిర్వహిస్తున్న చైత్ర మాస పూజలు ఆదివారం నిర్వహించిన చండీహోమంతో ముగిశాయి. ఉదయం 9 గంటలకు అమ్మవారికి పూజలు చేసిన అనంతరం చండీహోమం నిర్వహించారు. సత్యదేవుని ఆలయ ప్రధానార్చకుడు ఇంద్రగంటి నరసింహమూర్తి, వ్రత పురోహితులు పాలంకి పట్టాభి, చెల్లపిళ్ల ప్రసాద్, కనకదుర్గ ఆలయ అర్చకుడు చిట్టెం హరగోపాల్, పరిచారకులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. హోమం అనంతరం పండితులు వేదాశీస్సులు అందజేసి, ప్రసాదాలు నివేదించి భక్తులకు పంపిణీ చేశారు. కనకదుర్గ ఆలయం వద్ద అన్నదానం నిర్వహించారు. దేవస్థానం ఏఈఓ కె.కొండలరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. లోవకు పోటెత్తిన భక్తులు తుని: తలుపులమ్మ లోవకు ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ అమ్మవారిని 25 వేల మంది భక్తులు దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారని కార్యనిర్వహణాధికారి విశ్వనాథరాజు తెలిపారు. ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,21,500, పూజా టికెట్ల ద్వారా రూ.73,380, కేశఖండన టికెట్ల ద్వారా రూ.8,940, వాహన పూజలకు రూ.1,730, కాటేజీల ద్వారా రూ.33,060, విరాళాలు రూ.66,458 కలిపి మొత్తం రూ.3,05,068 ఆదాయం సమకూరిందని వివరించారు. గంధామావాస్య సందర్భంగా అమ్మవారిని, ఆలయాన్ని పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు. కలెక్టరేట్లో నేడు పీజీఆర్ఎస్కాకినాడ సిటీ: జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమం కాకినాడ కలెక్టరేట్ గ్రీవెన్స్ హాలులో సోమవారం ఉదయం 10 నుంచి ఒంటిగంట వరకూ నిర్వహిస్తారు. జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఆదివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులందరూ విధిగా హాజరు కావాలని ఆదేశించారు. అలాగే, మండల స్థాయిలో జరిగే పీజీఆర్ఎస్ కార్యక్రమానికి మండల స్థాయి అధికారులందరూ విధిగా ఉదయం 9.30 గంటలకే హాజరు కావాలని కలెక్టర్ స్పష్టం చేశారు. -
అగ్గిరవ్వలు
రగలనివ్వద్దుఅత్యవసర ఫోన్ నంబర్లు రాజమహేంద్రవరం 0883–2444101 ఆర్యాపురం 0883–2445101 నిడదవోలు 08813–221101 కొవ్వూరు 08813–231101 అనపర్తి 08857–227201 కోరుకొండ 0883–2496101 కాకినాడ 0884–2374571 పెద్దాపురం 08852–241299 పిఠాపురం 08869–251501 ప్రత్తిపాడు 08868–246709 తుని 08854–253601 జగ్గంపేట 08852–233388 నిడదవోలు: వేసవి ఎండల తీవ్రత నానాటికీ పెరుగుతోంది. ఇంట్లో ఏసీలు, కూలర్లు, ఫ్రిజ్‌ల వాడకం గణనీయంగా పెరుగుతోంది. విద్యా సంస్థలకు వేసవి సెలవులు కావడంతో కొన్ని ఇళ్లల్లో దాదాపు 24 గంటలూ ఏసీలు పని చేస్తూనే ఉన్నాయి. మరోవైపు చెట్టు చేమ, పొలాలు, గడ్డి, తాటాకు ఇళ్లు.. ఇలా ఆరుబయట ఉన్న అన్నీ ఎర్రటి ఎండకు ఎండిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితులన్నీ అగ్ని ప్రమాదాలకు ఆస్కారమిచ్చేవే. ఏమాత్రం చిన్న అజాగ్రత్తగా వ్యవహరించినా అగ్నిప్రమాదాల ముప్పు తప్పదు. ఈ తరుణంలో ప్రతి ఒక్కరూ చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే అగ్ని ప్రమాదాలను ముందస్తుగా నివారించే అవకాశం ఉంటుంది. ప్రాణ, ఆస్తి నష్టాల నుంచి బయటపడవచ్చును. ప్రమాదాలకు అవకాశాలిలా.. ● ఎండల తీవ్రతకు విద్యుత్ వినియోగం బాగా పెరుగుతోంది. దీంతో, ఓవర్ లోడుకు తట్టుకోలేని పాత విద్యుత్ వైర్లతో షార్ట్ సర్క్యూట్ల కారణంగా అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ● ఎలక్ట్రిక్ హోల్డర్లు, ఇసీ్త్ర పెట్టెలు, మిక్సీలు, వాషింగ్ మెషీన్లు వాడేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోయినా, వాటికి ఉద్దేశించిన ప్లగ్‌లు వాడకపోయినా ప్రమాదాలు జరిగే చాన్స్ ఉంటుంది. ● భవనాల్లో హోమ్ థియేటర్స్, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు వంటివి వాడేటప్పుడు కరెంట్ సరఫరాలో హెచ్చుతగ్గులు ఏర్పడి ప్రమాదాల జరగవచ్చు. ● విద్యుత్ లైన్ నుంచి తాటాకు ఇళ్లకు నేరుగా వైర్లు లాగడం వలన కూడా ప్రమాదాలు జరుగుతాయి. ● సెలవులు తదితర కారణాలతో ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఇంట్లోని విద్యుత్ మెయిన్ స్విచ్ ఆఫ్ చేయనందువలన ఒక్కోసారి షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదాలు జరగవచ్చు. ● పల్లెల్లో చాలా మంది ఆరుబయట భోజనాలు వండుకునే క్రమంలో పొయ్యి వెలిగించి, ఇంట్లో టీవీ చూస్తూనో మరో పని చేస్తూనో ఉంటారు. అదే సమయంలో గాలి ఉధృతికి ఆ పొయ్యి నుంచి నిప్పురవ్వలు ఎగసిపడి తాటాకు ఇళ్ల వంటివి అగ్నికి ఆహుతి కావచ్చు. ఇటువంటి ప్రమాదాలు అనేకం జరుగుతున్నాయి. ● వంట పూర్తయిన తర్వాత పొయ్యిలో నిప్పులను పూర్తిగా ఆర్పకపోవడం. ● ఇంట్లో వంట పూర్తవగానే గ్యాస్ స్టౌ ఆఫ్ చేస్తారు. కానీ, సిలిండర్‌కు ఉన్న రెగ్యులేటర్ ఆఫ్ చేయరు. ఈ చిన్నపాటి నిర్లక్ష్యంతో ఒక్కోసారి వంట గ్యాస్ లీకై పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ● గ్రామీణ ప్రాంతాల్లో చిమ్నీ లేని దీపాలు వాడటం వలన కూడా ప్రమాదాల జరగవచ్చు. ● అవగాహన లోపంతో పెంట కుప్పల్లో నిప్పులు వేయడంతో అవి గాలికి రాజుకుని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ● గ్రామీణ ప్రాంతాల్లో ఆరుబయట వేసిన మంటలను ఆర్పకపోవడం. ● కాల్చిన సిగరెట్లు, అగ్గిపుల్లలు ఆర్పివేయకుండా పడవేయడం కూడా ఒక్కోసారి పెద్ద ప్రమాదాలకు కారణమవుతుంది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మేలు ● ఇళ్లు, అపార్ట్మెంట్లు, పరిశ్రమలు, గిడ్డంగులు, ఆసుపత్రులు, కళాశాలలు, పాఠశాలల్లో అగ్నిమాపక నిబంధనలు కచ్చితంగా పాటించాలి. ● పాత విద్యుత్ వైరింగ్ మార్చుకోవాలి. ● పాఠశాలల్లో ప్రమాదాలు జరిగేటప్పుడు విద్యార్థులు బయటకు వచ్చే మార్గాలను యాజమాన్యం ముందస్తుగానే ఏర్పాటు చేయాలి. పై అంతస్తు నుంచి కిందకు దిగేందుకు మెట్లు విశాలంగా నిర్మించాలి. ● పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, ఫంక్షన్ హాల్స్, సినిమా థియేటర్ల యాజమాన్యాలు అగ్నిమాపక శాఖ నుంచి కచ్చితంగా నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) తీసుకోవాలి. అగ్ని ప్రమాదాలను నివారించడానికి అవసరమైన అన్ని పరికరాలనూ అందుబాటులో ఉంచుకోవాలి. ● వంట గదిలో అదనపు గ్యాస్ సిలిండర్లు, ఫ్రిజ్ లేకుండా చూసుకోవాలి. ● వంట పూర్తయిన వెంటనే సిలిండర్ రెగ్యులేటర్‌ను తప్పనిసరిగా ఆఫ్ చేయాలి. ● గ్యాస్ స్టౌవ్‌ను సిలిండర్ కంటే ఎత్తులో ఉంచాలి. ● వంట గదిలోకి వెళ్లేటప్పుడు నేరుగా కరెంటు స్విచ్‌లు వేయరాదు. గ్యాస్ వాసన వస్తోందేమో పరిశీలించాలి. అలా రాకపోతే స్విచ్ వేయవచ్చు. ఒకవేళ గ్యాస్ లీకయినట్లు అనుమానం వస్తే కిటికీలు, తలుపులు వెంటనే తెరవాలి. రెగ్యులేటర్ ఆఫ్ చేయాలి. ● ఇల్లు వదిలిపెట్టి దూర ప్రాంతాలకు వెళ్లి, ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తే గ్యాస్ రెగ్యులేటర్‌ను తప్పనిసరిగా తీసివేయాలి. ● ప్రతి ఇంట్లో కనీసం 200 లీటర్ల నీరు అందుబాటులో ఉంచుకోవాలి. ● గ్రామీణ పాంత్రాల్లో ఎండిన గడ్డిని వాములుగా వేయాలి. వాముల నుంచి ఇళ్లకు తప్పనిసరిగా 60 అడుగుల దూరం ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. ● బహిరంగ ప్రదేశాల్లో మంటలు వేయరాదు. ● పడుకునే ముందు వంట పొయ్యిని తప్పనిసరిగా ఆర్పివేయాలి. ● పూరిళ్లలో నివసించేవారు పొయ్యిలు, నిప్పులు పూర్తిగా ఆర్పివేయాలి. ● ఇళ్ల కప్పులు మరీ తక్కువ ఎత్తులో ఉండకుండా చూసుకోవాలి. ● నిద్రపోయే ముందు దీపాలు ఆర్పి, టార్చ్‌లైట్ అందుబాటులో ఉంచుకోవాలి. ● చిన్న పిల్లలకు అగ్గిపెట్టెలు, లైటర్లు అందుబాటులో ఉంచరాదు. వెంటనే స్పందిస్తాం అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. జిల్లాలోని ఏపీ విపత్తు స్పందన, అగ్నిమాపక కేంద్రాల్లో ఫైరింజన్లు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాయి. ప్రతి వాహనంలో 4,500 లీలర్ల నీటిని నిల్వ ఉంచి, ప్రమాదాల సమయంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెళ్లి, మంటలను అదుపు చేస్తాం. ఇళ్లు, అపార్ట్మెంట్లు, కర్మాగారాలు, గిడ్డంగులు, ఆసుపత్రులు, కళాశాలలు, పాఠశాలల్లో అగ్నిమాపక నిబంధనలు కచ్చితంగా పాటించాలి. ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నాం. – సీహెచ్ మార్టిన్ లూథర్ కింగ్, ఏపీ విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖ జిల్లా అధికారి, రాజమహేంద్రవరం మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్.. తీసుకోవాలి కేర్ వేసవిలో అగ్ని ప్రమాదాల ముప్పు చిన్నపాటి ముందు జాగ్రత్తలతో నివారణ అవగాహనతో నష్టాలు దూరంఅగ్ని ప్రమాదాల్లో గాయపడితే.. అగ్ని ప్రమాదాల్లో కాలి, గాయపడిన వారి దుస్తులకు నిప్పు అంటుకున్నట్లయితే పరుగెత్తనీయకుండా నేలపై దొర్లించాలి. అలా సాధ్యం కాకుంటే దుప్పటి చుట్టాలి. కాలిన శరీర భాగం మీద చల్లని నీరు పోయాలి. పొగతో నిండిన గదుల్లో మోచేతులు, మోకాళ్లపై పాకుతూ బయటకు రావాలి. ఆ సమయంలో నోటికి అడ్డంగా తడిగుడ్డ కట్టుకుని గాలి పీల్చడం ద్వారా పొగ, కార్బన్ డయాక్సెడ్ పీల్చకుండా ఆపవచ్చును. అగ్ని ప్రమాద సమయంలో బాత్ రూముల్లోకి వెళ్లకుండా ఆరుబయటకు వచ్చే ప్రయత్నం చేయాలి. 2022–25 మధ్య జిల్లావ్యాప్తంగా అగ్నిప్రమాదాల వివరాలు సంవత్సరం ప్రమాదాలు ఆస్తినష్టం కాపాడిన ఆస్తి 2022–23 385 రూ.65.76 కోట్లు రూ.34.73 కోట్లు 2023–24 402 రూ.44.50 లక్షలు రూ.52.04 కోట్లు 2024–25 302 రూ.94.72 లక్షలు రూ.38.89 కోట్లు ఈ నెల 1వ తేదీ వరకూ 39 రూ.45.89 లక్షలు రూ.96.27 లక్షలు -
విశిష్టమైనది సర్వ పృష్ఠ ఆప్తోర్యామ యాగం
అంబాజీపేట: లోక కళ్యాణాన్ని ఆకాంక్షిస్తూ 60 ఏళ్ల క్రితం నిర్వహించిన సర్వ పృష్ఠ ఆప్‌తో ర్యామ యాగాన్ని నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి దువ్వూరి ఫణి యజ్ఞేశ్వర యాజులు చెప్పారు. తొండవరంలో వైనతేయ నది తీరాన వేంచేసి ఉన్న శ్రీ ఉమా తొండేశ్వర స్వామి ఆలయ ప్రాంగణ సమీపంలో ఆదివారం సర్వ పృష్ఠ ఆప్తోర్యామ యాగం ప్రారంభమైంది. యాగకర్తలుగా దువ్వూరి వెంకట సూర్యప్రకాశ యజ్వ, కనకదుర్గ సోమపీధిని దంపతులు వ్యవహరిస్తున్నారు. యాగ విశిష్టతను ప్రాజెక్ట్ అధికారి యాజులు మాట్లాడుతూ అగ్నిదేవుని ద్వారా సమస్త దేవతలకు హవిస్సు భాగం అందించేందుకు సర్వ పుష్ఠ ఆప్తోర్యామ యాగం ఉపయోగపడు పడుతుందన్నారు. యాగంలో (మహాగ్నిచయనం) భాగంగా ప్రత్యేక ఆకారాలు కలిగిన వేయి ఇష్టకాలను (ఇటుకలను) ప్రత్యేక మంత్రాలతో అమర్చుతామని, ఇలా పేర్చిన ఇటుకలన్నీ గరుడ పక్షి ఆకారాన్ని సంతరించుకుంటాయని యాజులు వివరించారు. ఈ యాగంలో సమస్త దేవతలను ఆహ్వానించి వివిధ హోమద్రవ్యాలతో వారికి హవిస్సు భాగాన్ని అందిస్తామన్నారు. ఇలాంటి యాగం తన తాత అయిన దువ్వూరి యజ్ఞేశ్వర ఫౌండరీక యాజులు 60 ఏళ్ల క్రితం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురంలో నిర్వహించారని, ఇన్నాళ్లకు తన తండ్రి అయిన సూర్య ప్రకాశ సోమయాజులు నిర్వహించడం ఎంతో అరుదైన విషయమన్నారు. ఈ యాగంలో నమక చమకాలతో హోమం చేసి, పురుష సూక్తాలతో పరమాత్మను ధ్యానం చేస్తామన్నారు. ఈ క్రతువులో శతరుద్రీయహోమం (నమక ప్రశ్న) వల్ల ఘోర తనుశాంతి, వసోర్ధారా హోమం (చమక ప్రశ్న) వల్ల శాంతమైన తనువుకు ప్రీతి కలుగుతుందని యాజులు వివరించారు. అమావాస్య నాడు యాగ ప్రారంభం ఎంతో శక్తివంతం ఎంతో విశేషమైన సర్వ పృష్ఠ ఆప్తోర్యామ యాగాన్ని చైత్ర బహుళ అమావాస్య రోజున ప్రారంభించడం వల్ల ఎంతో శక్తివంతంగా మారుతుందని, కోరికలన్నీ ఈడేరుతాయని యాజులు వివరించారు. సమస్త మానవాళి సుఖశాంతులతో ఉంటారని, వారి కోరికలన్నీ సిద్ధిస్తాయని, ముఖ్యంగా తమిళనాడులో ఏ పనైనా అమావాస్య నాడే ప్రారంభించి విజయవంతంగా ముగిస్తారన్నారు. సమస్త దేవతలకు కూడా హవిస్సు కేటాయిస్తారన్నారు. 10 రోజుల పాటు జరిగే ఈ యాగంలో వివిధ కార్యక్రమాలు, క్రతువులు ఉంటాయన్నారు.టీటీడీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్ట్ అధికారి యజ్ఞేశ్వర యాజులు -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
అమలాపురం టౌన్: గడియ వేసి ఉన్న ఇళ్ల తలుపుల బోల్ట్లను తీయడంలో, ఐరన్ రాడ్లతో తలుపుల గెడలు తీయడంలో ఈ ముగ్గురు దొంగలు సిద్ధహస్తులు. ఇంట్లో వారు నిద్రిస్తుండగానే చడీ చప్పుడు లేకుండా చోరీ ముగించుకుని అక్కడ నుంచి జారుకుంటారు. తాము చోరీ చేయాల్సిన ఇంటి ప్రాంతంలో పగలు రెక్కీ నిర్వహిస్తారు. రాత్రి తాపీగా కారులో వచ్చి చోరీలకు పాల్పడుతుంటారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 32 చోరీలు చేసిన అంతర్రాష్ట్ర దొంగలు ముఠా ఇది. అమలాపురం పట్టణంలో 2023, 2024, 2025 సంవత్సరాల్లో చోరీలు చేసిన ఆ ముగ్గురి దొంగలను పట్టణ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.40 లక్షల విలువైన సొత్తును రికవరీ చేశారు. అమలాపురం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ బి.కృష్ణారావు ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో చోరీల చిట్టాను వివరించారు. వీరి నుంచి రూ.40 లక్షల విలువైన 400 గ్రాముల బంగారు ఆభరణాలు, 500 గ్రాముల వెండి వస్తువులు, ఆరు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం పమిడిపాడు గ్రామానికి చెందిన జంగా వెంకట్రావు, అదే జిల్లా రాజుపాలెం మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన దమ్ము సుధాకర్, గుంటూరు అర్బన్ జిల్లా శ్రీరామ్‌నగర్‌కు చెందిన కాట్ల కిషోర్‌బాబు అంతర్రాష్ట దొంగలు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో తాము దొంగిలించిన సొత్తును నగుదుగా మార్చుతున్న సమయంలో అమలాపురం పట్టణ పోలీసులు ఆదివారం ఉదయం అరెస్ట్ చేశారు. జిల్లా ఏఎస్పీ ఏవీఆర్‌పీబీ ప్రసాద్, అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్, పట్టణ సీఐ పి.వీరబాబుతో కలసి ఎస్పీ కృషారావు ఈ చోరీల వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలో 17 చోరీలు తెలంగాణ రాష్ట్రం మిర్యాలగూడ, నల్గొండ తదితర ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డ వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 17 చోరీలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 15 చోరీలకు పాల్పడ్డారు. మొత్తం 32 చోరీ కేసుల్లో వీరు నిందితులుగా ఉన్నారు. అమలాపురం పట్టణం గాంధీనగర్‌లో 2023 ఏప్రిల్‌లో మొదటి చోరీ, కురసాలవారివీధిలో 2024 ఆగస్టులో రెండో చోరీ, ఈ సంవత్సరం జనవరిలో మూడో చోరీ చేశారు. ఈ మూడు చోరీలకు సంబంధించి రూ.40 లక్షల సొత్తును రికవరీ చేశారు. నరసరావుపేటలో క్రికెట్ ఆటలో ఈ ముగ్గురికి పరిచయం ఏర్పడింది. కేసును ఛేదించిన పోలీసులకు నగదు రివార్డులు ఈ మూడు చోరీ కేసులను చాకచక్యంగా ఛేదించిన పోలీసు అధికారులు, క్రైమ్ పార్టీ సిబ్బందిని ఎస్పీ కృష్ణారావు అభినందించారు. వారికి నగదు రివార్డులు అందజేశారు. పట్టణ సీఐ పి.వీరబాబు, క్రైమ్ సీఐ ఎం.గజేంద్రకుమార్, పట్టణ ఎస్ ఎన్ఆర్ కిషోర్‌బాబు, క్రైమ్ ఎస్సై రాంబాబు, ఏఎస్సై అయితాబత్తుల బాలకృష్ణ, హెడ్ కానిస్టేబుళ్లు ఎంఎస్ రాజు, రమణ, కాని సాయి, శుభాకర్, ప్రసాద్, శ్రీనివాస్, అర్జున్, హరి, చిన్న ప్రసాద్‌లకు ఎప్పీ కృష్ణారావు నగదు రివార్డులు అందజేసి అభినందించారు. రూ.40 లక్షల సొత్తు రికవరీ ఎస్పీ కృష్ణారావు వెల్లడి -
ఆరు నెలలు తాగితే జీవితకాలపు భరోసా
తల్లి పాలు బిడ్డకు ఆరు నెలలు పట్టిస్తే యావత్ జీవిత కాలం రోగనిరోధక శక్తి లభిస్తుంది. మరే ఆహారం వల్లా ఇంతటి ప్రయోజనం సాధ్యం కాదు. అధికంగా పాలు ఉత్పత్తి అయ్యే తల్లుల పాలు వృథా కాకుండా సేకరించడం, పాలు అందుకోలేకపోతున్న శిశువులకు అందించడమే మిల్క్ బ్యాంక్ విధి. తల్లిపాలందించి పసివాళ్లలో పోషకాహార లోపాన్ని రూపుమాపడమే లక్ష్యం. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి, ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ ఎంపీఆర్ విఠల్, పీడియాట్రిక్స్ హెచ్‌వోడీ డాక్టర్ మాణిక్యాంబ సహకారంతో సేవలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. శిశువులకు పాలు కావాలనుకునే వారు, చనుబాలు దానం చేయాలనుకునే తల్లులు జీజీహెచ్‌లోని ఽమిల్క్ బ్యాంక్ ప్రతినిధులను సంప్రదించవచ్చు. – డాక్టర్ ఆమంచర్ల హర్షవర్దన్, ఽ దాత్రి మిల్క్ బ్యాంక్ కాకినాడ ఇన్చార్జి జీజీహెచ్ నుంచి పూర్తి సహాయ సహకారాలు ధాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జీజీహెచ్‌లో నిర్వహిస్తున్న మిల్క్ బ్యాంక్‌కు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నాం. పీడియాట్రిక్స్ హెచ్‌వోడీ డాక్టర్ మాణిక్యాంబ ఈ సేవలను పర్యవేక్షిస్తున్నారు. డాక్టర్ హర్షవర్దన్, మేనేజర్ మాధవ్ సంస్థ తరఫున ఎంతో బాధ్యతతో వ్యవహరిస్తూ తల్లులు, శిశువులకు ఎనలేని సేవలు అందిస్తున్నారు. అధునాతన పరికరాలతో శాసీ్త్రయ విధానాలను అనుసరిస్తూ పాలు శుద్ధి చేసి భద్రపరచడంలో నాణ్యతను కొనసాగిస్తున్నారు. – డాక్టర్ ఎంపీఆర్.విఠల్, ఇన్చార్జి సూపరింటెండెంట్, జీజీహెచ్ -
తిరుమలలో అవగాహన సదస్సుకు మంచి స్పందన
రాజమహేంద్రవరం రూరల్: కాతేరులోని తిరుమల విద్యాసంస్థల ప్రాంగణంలో ఆదివారం జరిగిన అవగాహన సదస్సుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన లభించిందని తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు అన్నారు. ఈ సదస్సుకు సుమారు 15వేలమంది హాజరయ్యారని తెలిపారు. ఈ సందర్భంగా తిరుమలరావు మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో మన పిల్లలు నిలబడాలంటే స్కూల్ స్థాయి నుంచే ఐఐటీ, నీట్ పరీక్షలకు సంబంధించిన సిలబస్‌ను వారికి అందించాలి. అప్పుడే వారు ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయగలుగుతారన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌కి దూరంగా ఉంచాలని అన్నారు. స్కూల్ స్థాయి నుంచే ఐఐటీ, మెడికల్ ఫౌండేషన్ అవసరంపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. తిరుమల విద్యాసంస్థల డైరెక్టర్ నున్న సరోజినిదేవి మాట్లాడుతూ పిల్లల ఎదుగుదలలో తల్లిదండ్రుల పాత్ర వెలకట్టలేనిదన్నారు. ప్రతి తల్లి తమ పిల్లలకు విలువలతో కూడిన విద్యను వారికి అందించే ప్రయత్నం చేయాలని తెలిపారు. తిరుమల విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్‌బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరి, పూర్వ విద్యార్థుల తల్లిదండ్రులు పెండ్యాల బుచ్చిబాబు, ఏఎన్వీ సత్యనారాయణ(నాని మాస్టారు) పాల్గొన్నారు. -
మాతృత్వానికి మరో మెట్టు!
కాకినాడ క్రైం: కాకినాడ జీజీహెచ్‌లో తల్లిపాలు పొందలేని శిశువులకు పాలందిస్తూ ధాత్రి మదర్ మిల్క్ బ్యాంక్ విశేష ఆదరణ పొందింది. వందలాది శిశువుల తల్లిపాల ఆకలిని తీరుస్తూ పసిమొగ్గల పాలిట మరో అమ్మగా అవతరించింది. కాకినాడ జీజీహెచ్, సుషేణ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ధాత్రి మిల్క్ బ్యాంక్ 2023 ఫిబ్రవరిలో వెలసింది. నాటి నుంచి తల్లిపాల సంబంధిత సేవల్లో తరిస్తూ తల్లికి దిగులు లేకుండా, బిడ్డ పోషణకు లోటు రాకుండా ఎనలేని సేవలందిస్తోంది. తల్లిపాలకు తల్లితో పనిలేదు శిశువు తల్లిపాలు తాగేందుకు తల్లితోనే పనిలేదు. మరో తల్లి దానం చేసిన పాలను శాసీ్త్రయ విధానంలో శుద్ధి చేసి, భద్ర పరిచి తల్లిపాలకు నోచుకోని పిల్లలకు అందిస్తారు. ఈ మదర్ మిల్క్ బ్యాంక్ ఎందరో పసిమొగ్గల జీవితాలను పౌష్టికం చేస్తోంది. ఫార్ములా ఫీడ్‌తో డబ్బా పాలకు స్వస్తి చెప్పడంతో పాటు భావితరాలలో పోషకాహార లోటును రూపుమాపడమే మిల్క్ బ్యాంక్ సేవల లక్ష్యం. ఏడాదిలో 102 మంది పిల్లలకు గడచిన ఏడాది కాలంలో జీజీహెచ్ మిల్క్ బ్యాంక్ ద్వారా 102 మంది శిశువులకు తల్లిపాలు అందించారు. తల్లి, తల్లి తరఫున కుటుంబ సభ్యులు లేదా వైద్య సిబ్బంది ఎవరు శిశువును మిల్క్ బ్యాంక్‌కు తీసుకువచ్చినా పాలు పడతారు. ఇంటి దగ్గర ఫీడ్ కోసం తల్లిపాలు అందిస్తారు. శిశువులకు పాల లోటెందుకు... పండంటి శిశువును ప్రసవించడం, ఆ శిశువుకి చనుబాలు అందిస్తూ తల్లిగా పునర్జన్మించడం ప్రతి సీ్త్రకి ఓ వరం. అయితే, అమ్మగా మారిన ప్రతి మహిళకు అది సాధ్యం కాదు. అందుకు వివిధ కారణాలు దోహదపడతాయి. తల్లి అనారోగ్యానికి గురి కావడం, పోషకాహార లోపంతో బాధపడుతుండడం, హార్మోన్ల అసమతుల్యత, సిజేరియన్ డెలివరీ, తల్లిలో ఒత్తిడి, ఆందోళన, ఛాతి సంబంధిత శస్త్రచికిత్సల కారణంగా పాలు ఉత్పత్తి కాకపోవచ్చు లేదా తక్కువ మొత్తంలో ఉత్పత్తి అవ్వొచ్చు. జీజీహెచ్‌లో కొనసాగుతున్న మదర్ మిల్క్ బ్యాంక్ సేవలు ఫార్ములా ఫీడ్‌కు స్వస్తి చెప్పేలా పసిపిల్లలకు తల్లి పాలు తల్లి నుంచి పాలు పొందలేని శిశువులకు వరం ఏడాది కాలంలో 102 మంది పిల్లలకు తల్లిపాల ప్రయోజనాలు ఏడాది కాలంలో... పాలు పొందిన శిశువులు – 102 మదర్ బ్యాంక్ ప్రయోజనాలు అందుకున్న తల్లులు – 1,457 మిల్క్ బ్యాంక్ ద్వారా తమ పాలను తామే శాసీ్త్రయ పద్ధతిలో చనుబాల నుంచి పొందినది 5,60,971 మిల్లీ లీటర్లు మిల్క్ బ్యాంక్ ద్వారా సేకరించిన పాలు 55,765 మిల్లీ లీటర్లు శిశువులకు అందించిన పాల మొత్తం 37,175 మిల్లీ లీటర్లు తల్లులు సందర్శన 9,284 శిశువుల సందర్శన 621 -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి)గండేరా (వెయ్యి) 23,000 గటగట (వెయ్యి) 19,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 21,000 గటగట (వెయ్యి) 18,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
20న సార్వత్రిక సమ్మె
రాజమహేంద్రవరం రూరల్: దేశవ్యాప్తంగా మే 20న చేపడుతున్న సార్వత్రిక సమ్మెను ప్రతి ఒక్కరు జయప్రదం చేయాలని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ సౌత్‌సెంట్రల్ జోన్ సంయుక్త కార్యదర్శి జి.కిషోర్‌కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం రాజమండ్రి మోడల్‌కాలనీలో ఎల్ఐసీ ఉద్యోగుల భవన్లో ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ రాజమండ్రి డివిజన్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయి విస్తృత కార్యనిర్వాహక సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న కిషోర్‌కుమార్ మాట్లాడుతూ మే20న జరిగే సార్వత్రిక సమ్మెలో సుమారు 10 కోట్ల మంది కార్మికులు దేశ వ్యాప్తంగా పాల్గొని కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొని వచ్చిన 4 లేబర్ కోడ్లు, ప్రజా వ్యతిరేక ఆర్థిక నిర్ణయాలపై తమ నిరసన తెలుపుతామన్నారు. ఈ సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. ముందుగా కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతులకు నివాళులర్పించారు. ఇన్సూరెన్‌న్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎం.కోదండరామ్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం ఉగ్రవాదం అంతం చేయడానికి తీసుకొన్న అన్ని నిర్ణయాలను సమర్థిస్తున్నామన్నారు. రాజమండ్రి డివిజన్ అధ్యక్షుడు మాథ్యూస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ప్రధాన కార్యదర్శి ఎస్.గనెయ్య, ఓబీసీ ఉద్యోగుల ప్రధాన కార్యదర్శి ఎ.కె.విశ్వనాథ్, రమేష్ బాబు, మహిళా కన్వీనర్ అర్.శిరీష , మచిలీపట్నం యూనియన్ సంయుక్త కార్యదర్శి కళాధర్, పీఎస్ఎన్ రాజులు మాట్లాడుతూ ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం సమ్మె విజయవంతం చేయాలని పిలుపు ఇచ్చారు. రాజమండ్రి డివిజన్ పరిధిలోని 20 బ్రాంచ్ ఆఫీసులలో పనిచేస్తున్న 100 మంది నాయకులు సభ్యులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
నల్లజర్ల: మండలంలోని పుల్లలపాడు వద్ద బైపాస్ రోడ్డుపై ఆదివారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయాలపాలయ్యారు. దేవరపల్లి గ్రామానికి చెందిన దాసుదుర్గాప్రసాద్, బిరదాఅంజి, జాజుమొగ్గలసాయిచరణ్తేజ కలసి కాలినడకన ద్వారకాతిరుమల శనివారం సాయంత్రం వెళ్తుండగా మార్గమధ్యలో పుల్లలపాడు వద్ద రాజమహేంద్రవరం నుంచి విజయవాడ వెళ్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో బిరదా అంజి మృతిచెందగా, దుర్గాప్రసాద్, సాయిచరణ్ చికిత్స పొందుతున్నారు. మృతుడు అంజి మోటారు సైకిల్ మెకానిక్‌గా పనిచేస్తుంటాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మోటారు సైకిల్‌ను ఢీకొన్న లారీ
ముమ్మిడివరం: మోటారు సైకిల్‌పై వస్తున్న నలుగురు యువకులను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో తీవ్రంగా గాయ పడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఐ.పోలవరం మండలం టి.కొత్తపల్లికి చెందిన ఉందుర్తి బాలు, కరప మండలం గొల్లపాలెంకు చెందిన ఖండవిల్లి రాజా, అయినవిల్లి మండలం శంకరాయగూడెంకు చెందిన నిడుమోలు ఉమామహేశ్వరరావు, టి.కొత్తపల్లికి చెందిన బొమ్మి వినోద్ ఆదివారం యానాం నుంచి ఒకే మోటారు సైకిల్‌పై తిరిగి వస్తుండగా 216 జాతీయ రహదారి అన్నంపల్లి టోల్‌ప్లాజా సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఉమామహేశ్వరరావును ఇంటి దగ్గర దింపేందుకు వారు వస్తుండగా ఈ ప్రమాదానికి గురయ్యారు. గాయపడిన వారిలో ఉందుర్తి బాలు పరిస్ధితి ఆందోళన కరంగా ఉంది. గాయపడిన వారిని 108 అంబులెన్స్‌లో అమలాపురం ఆసుపత్రికి తరలించారు. ముమ్మిడివరం ఎస్సై డి.జ్వాలా సాగర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.నలుగురికి తీవ్ర గాయాలుఒకరి పరిస్థితి విషమం -
చికిత్స పొందుతూ కార్మికుడి మృతి
యానాం: స్థానిక కనకాలపేటకు చెందిన కాలా సుబ్రహ్మణ్యం(40) ఈ నెల 23న విద్యుత్ షాక్‌కు గురికాగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. విద్యుత్ శాఖలో కాంట్రాక్టురు వద్ద పనిచేసే అతను విద్యుత్ స్తంభం మారుస్తున్న సందర్భంలో షాక్‌కు గురయ్యాడు. మృతుడు కొన్నేళ్లుగా విద్యుత్ కాంట్రాక్టర్ కొప్పాడి వెంకటేశ్వరరావు వద్ద పనిచేస్తున్నాడు. గోపాల్‌నగర్ శివారున ఉన్న అనుమతి లేకుండా ప్రభుత్వ స్థలంలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని మరో చోటుకు మారుస్తుండగా స్తంభం ఎక్కిన సుబ్రహ్మణ్యం హైటెన్షన్ విద్యుత్ తీగ తగలడంతో గాయపడ్డాడు. కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. అయితే ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లి మెరుగైన వైద్యం అందిస్తే బతికే అవకాశాలు ఉండేవని ఐదురోజుల పాటు జీజీహెచ్‌లోనే ఉంచారని స్థానికులు అంటున్నారు. మృతుడుకు భార్య, ఇద్దరు చిన్నపిల్లలైన కుమారై, కుమారుడు ఉన్నారు. కుటుంబ యజమాని మృతితో తమకు ఆధారం లేకుండాపోయిందని విద్యుత్‌శాఖ అధికారులు, ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని మృతిని భార్య నాగమణి కోరారు. కాంట్రాక్టరు నిర్లక్ష్యం వల్లే అనుమతులు లేకుండా చేసిన పని వల్ల ప్రమాదానికి గురై కార్మికుడు బలైపోయాడని స్థానికులు పేర్కొన్నారు.పట్టించుకోని విద్యుత్ శాఖ, కాంట్రాక్టరు -
ప్రభుత్వం హామీలు అమలుచేయాలి
అమలాపురం టౌన్: మున్సిపల్ కార్మికులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయా లని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.సుబ్బారాయుడు డిమాండ్ చేశారు. కార్మిక చట్టాలు, సంక్షేమం, ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రభుత్వాలతో పోరాడాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో శనివారం సాయంత్రం జరిగిన ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూని యన్ అనుబంధ సంఘం ఏఐటీయూసీ జిల్లా శాఖ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఉండవల్లి గోపాలరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో తొలుత కశ్మీర్ ఉగ్రదాడిలో మృతులకు శ్రద్ధాంజలి ఘటించారు. కార్మికుల సంక్షేమం, ఆర్థిక ప్రయోజనాల కోసం వచ్చే నెల ఐదున మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నట్లు సుబ్బారాయుడు ప్రకటించారు. ప్రతి మున్సిపాలిటీ వద్ద పారిశుధ్య కార్మికులు నిరసనలు తెలపాలని ఆయన పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కె.సత్తిబాబు మాట్లాడుతూ పారిశుధ్య కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వం పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. కార్మిక చట్టాల సవరణను కేంద్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని కోరూతూ మేడే రోజున నిరసన ప్రదర్శనలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ జిల్లా కన్వీనర్, జిల్లా ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వాసంశెట్టి సత్తిరాజు మాట్లాడుతూ మేడేను అన్ని వర్గాల కార్మికులు విజయవంతం చేయాలని కోరారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మకాయల శ్రీనివాసరావు 16 డిమాండ్లతో కూడిన అంశాలను సమావేశంలో ప్రవేశపెట్టారు. ఈ డిమాండ్లపై సమావేశం చర్చించింది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ డిమాండ్లను నెరవేర్చాలని తీర్మానం చేసింది. కార్మిక నాయకులు బుంగా కుమార్, రాయుడు సుబ్బలక్ష్మి ప్రసంగించారు. సమావేశం ముగిశాక స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట మే 5న మున్సిపల్ వర్కర్స్ యూనియన్ చేపట్టబోయే ఆందోళనలు జయప్రదం చేయాలని కోరుతూ కార్మిక నాయకులు కొద్ది సేపు ప్రదర్శన నిర్వహించారు. ● ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ● రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బారాయుడు -
ఆటోను ఢీకొన్న ట్రాక్టర్
● 9 మంది ఉపాధి కూలీలకు గాయాలు ● మెరుగైన వైద్యం కోసం నలుగురిని రాజమహేంద్రవరానికి తరలింపు కొత్తపేట: ఉపాధి పనికి వెళుతున్న మహిళా కూలీల ఆటోను ట్రాక్టర్ ఢీకొనడంతో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఏపీఓ ఎన్.ఆనంద్ తెలిపిన వివరాల మేరకు మండల పరిధిలోని అవిడి చప్పిడివారిపాలేనికి చెందిన 9 మంది మహిళా కూలీలు ఆ పంచాయతీ పరిధిలోని గోరింకల డ్రైన్ అభివృద్ధి పనికి శనివారం ఉదయం ఆటోలో బయలుదేరారు. గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో ఆ ఆటోను ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న కుడుపూడి నాగమణి, గుబ్బల నాగలక్ష్మి, చప్పిడి గౌరీలక్ష్మి, పితాని సత్యవతి, మట్టపర్తి నాగలక్ష్మి, ఇళ్ల వెంకటలక్ష్మి, గుబ్బల లక్ష్మి, జక్కంశెట్టి పెంటమ్మ, చోడి గన్నెమ్మ గాయపడ్డారు. వారిని స్థానికులు కొత్తపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమాచారాన్ని ఏపీఓ ఆ శాఖ ఉన్నతాధికారులకు నివేదించగా డ్వామా ఏపీడీ మల్లికార్జునరావు హుటాహుటిన కొత్తపేట ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించి వారి పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కుడుపూడి నాగమణి, గుబ్బల నాగలక్ష్మి, చప్పిడి గౌరీలక్ష్మి, పితాని సత్యవతికి తీవ్ర గాయాలు కాగా ఉన్నత వైద్యం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కలెక్టర్ ఆర్ మహేష్‌కుమార్ ఆదేశాల మేరకు స్థానిక ఆర్డీఓ పి. శ్రీకర్, డ్వామా పీడీ ఎస్.మధుసూదన్ రాజమహేంద్రవరం ఆస్పత్రికి వెళ్లి నలుగురు క్షతగాత్రులను పరామర్శించారు. -
తెలంగాణ వలస కూలీ అదృశ్యం
అమలాపురం టౌన్: తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ప్రాంతానికి చెందిన పాలత్య సుభాష్ అమలాపురం పట్టణానికి కూలీ పనుల కోసం వలస వచ్చి ఈ నెల 17న అదృశ్యమయ్యాడు. ఈ మేరకు శంషాబాద్ నుంచి అతని భార్య సరోజ అమలాపురానికి శనివారం వచ్చి తన భర్త అదృశ్యంపై పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పి.వీరబాబు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... 29 ఏళ్ల సుభాష్ అమలాపురంలో వలస కూలీగా జీవిస్తున్నాడు. 17వ తేదీన తాను పనిచేసే చోట కూలీ డబ్బులు తీసుకుని మా ఊరు వెళుతున్నానని చెప్పి వెళ్లాడు. అప్పటి నుంచి అతడి ఆచూకీ లేకుండా పోయింది. దీంతో అతని భార్య స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. 5.6 అడుగుల ఎత్తుతో ఉండే ఇతని ఆచూకీ తెలిస్తే పట్టణ పోలీస్ స్టేషన్లో 08856–231033, తన నంబర్ 9440796561కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సీఐ విజ్ఞప్తి చేశారు. -
భక్తవత్సలా.. గోవిందా..
కొత్తపేట: కోనసీమ తిరుమలగా ఖ్యాతికెక్కిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం శనివారం వేలాదిగా తరలివచ్చిన భక్తజనంతో మురిసిపోయింది. ఎక్కడ చూసినా కిక్కిరిసిన జనంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. గోవింద నామస్మరణతో క్షేత్రం మార్మోగింది. ప్రధానార్చకుడు ఖండవిల్లి ఆధిత్య అనంత శ్రీనివాస్ ఆధ్వర్యాన అర్చకులు, వేద పండితులు స్వామివారికి సుప్రభాత సేవ తదితర సేవలు నిర్వహించారు. స్వామివారిని సుగంధభరిత పుష్పాలతో విశేషంగా అలంకరించారు. శ్రీ వేంకటేశ్వర సహిత ఐశ్వర్యలక్ష్మీ హోమం నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. ఏడు శనివారాల నోములో భాగంగా మాడ వీధుల్లో ఏడు ప్రదక్షిణలు చేశాక, కోరిన కోర్కెలు తీరిన భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు కాలినడకన తరలి వచ్చి, మొక్కులు చెల్లించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు రావడంతో క్యూలైన్లు నిండిపోయాయి. భక్తుల సౌకర్యార్థం అదనపు ఏర్పాట్లలో భాగంగా మరో ఫ్లై ఓవర్ నిర్మించారు. వేంకటేశ్వరస్వామి దర్శించుకున్న భక్తులు ఆలయ ప్రాంగణంలో వేంచేసియున్న అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అన్నప్రసాదం స్వీకరించారు. దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యక్రధరరావు భక్తుల ఇబ్బందులను స్వయంగా పరిశీలించారు. స్వయంగా క్యూలైన్లో కలిసిపోయి, వారి మనోగతం తెలుసుకునే ప్రయత్నం చేశారు. వారితో పాటే స్వామి వారిని దర్శించుకున్నారు. సాయంత్రం 5 గంటల సమయానికి దేవస్థానానికి స్వామి వారి ప్రత్యేక దర్శనం, అన్నప్రసాద విరాళాలు, వివిధ సేవలు, లడ్డూ ప్రసాదం విక్రయం, ఆన్లైన్ ద్వారా రూ.49,60,411 ఆదాయం సమకూరిందని ఈఓ తెలిపారు. ● వాడపల్లికి భక్తజన శోభ ● స్వామివారిని వేలాదిగా దర్శించుకున్న భక్తులు ● రూ.49.60 లక్షల ఆదాయం -
రూ.20 వేల విలువైన మద్యం స్వాధీనం
కొత్తపేట: మద్యం అక్రమంగా విక్రయిస్తున్న ఇంటిపై దాడి చేసి రూ.20 వేలు విలువైన 110 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్టు రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్ తెలిపారు. శనివారం ఆయన స్థానిక పోలీస్ స్టేషన్లో వివరాలను వెల్లడించారు. కొత్తపేట మండలం వానపల్లి శివారు రామమోహనరావుపేటలో కుంచే రమేష్ అనే వ్యక్తి మద్యాన్ని అక్రమంగా తెచ్చి విక్రయిస్తున్నట్టు అందుకున్న సమాచారంతో ఎస్సై జి.సురేంద్ర సిబ్బందితో వెళ్లి దాడి చేశారు. దీంతో రమేష్ సమీప పంట పొలా ల నుంచి పరారయ్యాడు. అనంతరం అక్కడి నుంచి రూ.20 వేలు విలువైన 110 మద్యం సీసాలతో పాటు, అప్పటికే విక్రయించిన మద్యం నగదు రూ 6,270, రమేష్ పరారవుతూ చేజార్చుకున్న సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం అమలాపురం రూరల్: మండలం నడిపూడి కాలువలో శుక్రవారం గల్లంతైన సరెళ్ల సురేష్ మృతదేహం శనివారం కాలువలో లభ్యమైయింది. నడిపూడి శ్రీరామ్ నగర్‌కు చెందిన సురేష్ శుక్రవారం సాయంత్రం ప్రమాదవశాత్తు ప్రధాన పంట కాలువలో కాలుజారి పడ్డాడు. అతని కోసం స్థానికులు, పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. సర్పంచ్ చెల్లుబోయిన వెంకటేశ్వరరావు చొరవతో ఇరిగేషన్ శాఖ అధికారులతో మాట్లాడి కాలువలోని నీటి ప్రవాహాన్ని తగ్గించి సురేష్ కోసం గాలించారు. అయినా రాత్రివరకు మృతదేహం లభ్యం కాలేదు. శనివారం నీటి ప్రవాహాన్ని పెంచడంతో సురేష్ మృతదేహం నడిపూడి లాకుల వద్దకు కొట్టుకు వచ్చింది. మృతదేహాన్ని గుర్తించిన తాలూకా పోలీసులు కాలువ నుండి బయటకు తీశారు. సురేష్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు తాలూకా ఎస్సై శేఖర్‌బాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
రత్నగిరిపై భక్తుల సందడి
● సత్యదేవుని దర్శించిన 30 వేల మంది ● 1,500 వ్రతాల నిర్వహణ ● దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయంఅన్నవరం: పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులతో రత్నగిరి శనివారం సందడిగా మారింది. విద్యా సంస్థలకు వేసవి సెలవులు కావడంతో అధిక సంఖ్యలో విద్యార్థులు, వారి తల్లితండ్రులు ఆలయానికి వచ్చి, వ్రతాలాచరించి, సత్యదేవుని దర్శించుకున్నారు. స్వామివారి ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని దర్శించిన అనంతరం భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేశారు. రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. మొత్తం 30 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించుకున్నారు. వ్రతాలు 1,500 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. తిరుచ్చి వాహనంపై సత్యదేవుని ప్రాకార సేవ ఘనంగా నిర్వహించారు. దుర్గామాతలకు నేడు హోమాలు చైత్ర మాస అమావాస్యను పురస్కరించుకుని రత్నగిరి వనదుర్గ అమ్మవారికి ఆదివారం ఉదయం 9 గంటల నుంచి ప్రత్యంగిర హోమం నిర్వహించనున్నారు. అలాగే, రత్నగిరి తొలి పావంచా వద్ద కొలువైన కనకదుర్గమ్మ వారి ఆలయంలో ఉదయం 9 గంటల నుంచి చండీహోమం నిర్వహించనున్నారు. -
పాకిస్తానీలు నెలాఖరుకల్లా వెళ్లిపోవాలి
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో దేశంలోని పాకిస్తానీలను ఈ నెలాఖరుకల్లా తిరిగి వారి దేశానికి పంపించేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వారికిచ్చిన వీసాలను కేంద్రం రద్దు చేసిందని తెలిపారు. సాధారణ వీసాలపై వచ్చిన పాకిస్తానీలు ఆదివారం నాటికి, వైద్య వీసాలపై వచ్చిన వారు ఈ నెల 29 నాటికి దేశం విడిచి వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని వివరించారు. ఈ నెల 30 తర్వాత అటారీ సరిహద్దు మూసివేస్తున్నందున పాకిస్తాన్ నుంచి వివిధ వీసాలపై వచ్చిన వారిని గుర్తించి, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓలను ఆదేశించినట్లు కలెక్టర్ తెలిపారు. 28 నుంచి వేసవి విజ్ఞాన శిబిరం ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యాన స్థానిక ఆల్కాట్‌తోట శాఖా గ్రంథాలయంలో ఈ నెల 28 నుంచి జూన్ 6 వరకూ వేసవి విజ్ఞాన శిబిరం నిర్వహిస్తున్నారు. గ్రంథాలయాధికారి కొత్తపల్లి రమ్యశ్రీ శనివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఈ శిబిరంలో రోజూ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ కథలు చెప్పడం, కథలు చదవడం, చిత్రలేఖనం, క్రాఫ్ట్స్, స్పోకెన్ ఇంగ్లిష్ తదితర అంశాల్లో పాఠశాల విద్యార్థులకు శిక్షణ ఇస్తామని వివరించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలో విధ్వంసకర పాలనచాగల్లు: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో దాడులు, కేసులతో విధ్వంసకర పాలన నడుస్తోందని వైఎస్సార్ సీపీ కొవ్వూరు నియోజకవర్గం ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు విమర్శించారు. చాగల్లులో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. 2024 ఎన్నికల్లో అబద్ధపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలనూ నిలువునా ముంచారని అన్నారు. ప్రతిపక్ష నేతలు, సామాన్య ప్రజలపై దాడులు, కేసులు, అవినీతి, ఊరూరా బెల్ట్ షాపులు తప్ప అభివృద్ధి, సంక్షేమం శూన్యమని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. ఈ అరాచక పాలనను అన్ని వర్గాలూ గమనిస్తున్నాయని, వచ్చే ఎన్నికల్లో తప్పకుండా బుద్ధి చెబుతారని అన్నారు. రబీ ధాన్యాన్ని విక్రయించుకునేందుకు కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు పడుతున్నారని, వారు పండించిన ప్రతి గింజా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రాజన్న రాజ్యం రావాలంటే జగన్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని వెంకట్రావు కోరారు. -
ఎండగండం నుంచి.. కొండంత ఉపశమనం
సాక్షి, అమలాపురం: రోహిణీ కార్తె ఇంకా రానేలేదు.. అప్పుడే రోళ్లు పగిలేలా ఎండలు కాస్తున్నాయి. నడినెత్తిన చండమార్తాండుడు నిప్పులు కురిపిస్తూండటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఇలా మండుతున్న ఎండల నుంచి తక్షణ ఉపశమనాన్నిచ్చే దివ్యౌషధం కొబ్బరి బొండం. బొండాలు, నీళ్లు, కొబ్బరి నీళ్లతో చేసే జ్యూస్‌ల విక్రయాలతో చిరు వ్యాపారుల నుంచి కార్పొరేట్ కంపెనీల వరకూ పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నాయి. పోషకాల గని ● కొబ్బరి నీళ్లలో పోషకాలు, ఎలక్ట్రోలైట్లు అధికంగా ఉంటాయి. కొబ్బరి బొండం సైలెన్తో సమానం. ఒక బొండంలో దాదాపు 300 మిల్లీ గ్రాముల సోడియం ఉంటుంది. పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. ● మూత్ర సంబంధిత జబ్బులు, కిడ్నీలో రాళ్ల సమస్యకు ఇది చక్కగా పని చేస్తుంది. ● కొబ్బరి నీళ్లు ఒంట్లో వేడిని తగ్గిస్తాయి. దీనిని బెస్ట్ ఎనర్జీ డ్రింక్‌గా ఆరోగ్య నిపుణులు పేర్కొంటారు. ● బొండంలో ఉండే కొబ్బరి గుజ్జు గుండె జబ్బులు రానివ్వకుండా చేస్తుంది. వేసవిలో చెమట కాయలు, వేడి కురుపులు, చికెన్‌పాక్స్ వంటివి తగ్గడానికి దోహదపడుతుంది. ● లేత కొబ్బరిలో విటమిన్–ఎ, బి, సి సమృద్ధిగా లభిస్తాయి. ఐరన్, క్యాల్షియం, కార్బోహైడ్రేట్లు, రెబోఫ్లెవిన్, నియాసిన్, థయామిన్ అధికంగా ఉంటాయి. అక్కడి బొండాలకు డిమాండ్ ● డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాల్లో సుమారు 1.50 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతోంది. ఏడాదికి 105 కోట్ల కొబ్బరి కాయలు వస్తాయని అంచనా. కొబ్బరి కాయల్లో 15 శాతం మాత్రమే బొండాలుగా రైతులు విక్రయిస్తున్నారు. ● తూర్పు గోదావరి జిల్లాలోని కొవ్వూరు, చాగల్లు, పెరవలి, గోపాలపురం, కాకినాడ జిల్లాలో తుని, ఏలేశ్వరం, కోనసీమ జిల్లాలోని కొత్తపేట, పి.గన్నవరం వంటి మండలాల్లో మాత్రమే కొబ్బరి బొండం సేకరణ అధికంగా ఉంటుంది. ● ఎండలు పెరగడంతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి కొబ్బరి బొండాల ఎగుమతులు జోరందుకున్నాయి. మన రాష్ట్రంతో పాటు తెలంగాణలోని ముఖ్య నగరాలు, పట్టణాలకు బొండాలు ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి. ప్రస్తుత సీజన్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి రోజుకు 60 లారీలకు పైగా ఎగుమతి అవుతున్నాయి. ఎండల తీవ్రత మరింత పెరిగితే రోజుకు 100 లారీల వరకూ బొండాల ఎగుమతి జరుగుతుందని రైతులు చెబుతున్నారు. ● మార్చి మొదటి వారంలో బొండం రైతువారీ ధర రూ.12 ఉండగా ఇప్పుడది రూ.18కి పెరిగింది. ఎండలు పెరిగితే ఈ ధర రూ.20 వరకూ చేరుతుందని రైతులు ఆశపడుతున్నారు. ● కొబ్బరి కాయతో పోల్చుకుంటే బొండం అమ్మకాలే లాభసాటిగా ఉంటున్నాయని రైతులు చెబుతున్నారు. బొండం ఆరు నుంచి ఎనిమిది నెలలకు తయారవుతుంది. అదే పక్వానికి వచ్చే కొబ్బరి కాయకు పట్టే సమయం 12 నెలలు. అందువలన బొండాల ఉత్పత్తిని రైతులు త్వరగా అందుకుంటూ, నాలుగు డబ్బులు కళ్లజూస్తున్నారు. ● కొబ్బరి కాయలైతే రైతులే సేకరించాలి. దింపు, పోగువేత, రాశులు పోయడం ఇలా కాయకు రూ.2 వరకూ అవుతోంది. అదే బొండాలను వ్యాపారులు సొంత ఖర్చులు పెట్టుకుని తీసుకుంటారు. దీనివలన రైతులకు ఆ పెట్టుబడి బాధ తప్పుతోంది. షర్బత్‌ల నుంచి జ్యూస్‌ల వరకూ.. ఉమ్మడి జిల్లాతో పాటు హైదరాబాద్ వంటి నగరాల్లో కూడా బొండాలు విక్రయిస్తూ వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. బొండాలతో పాటు కొబ్బరి నీళ్లతో షర్బత్, నాటాడీకో వంటి కోకోనట్ జల్లీలతో పాటు కొబ్బరి నీళ్లు, గుజ్జుతో జ్యూస్‌లు కూడా తయారు చేస్తున్నారు. వాస్తవానికి కొబ్బరి జ్యూస్ తయారీ మొదలైంది రాజమహేంద్రవరంలోనే కావడం విశేషం. ఇప్పుడు ఈ వ్యాపారం అన్ని ప్రాంతాలకూ విస్తరించింది. కోకోనట్ జ్యూస్‌లలో సైతం స్ట్రాబెర్రీ, మ్యాంగో, డ్రాగన్, బనానా, కివీ, వాటర్ మిలన్, ఆపిల్ వంటి ఫ్లేవర్లతో ఆకట్టుకుంటున్నారు. ఆరోగ్యానికి ఔషధం కేవలం దప్పిక తీరడమే కాదు.. కొబ్బరి బొండం ఆరోగ్యానికి ఔషధం. వేసవిలో ఉపశమనం కోసమే కాదు.. ఏడాది పొడవునా ఆరోగ్యం కోసం కొబ్బరి బొండం తాగడం మంచిదే. దీనిలోని ఎలక్ట్రోలైట్లు, సోడియం, పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్, యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు తక్షణ శక్తినిస్తాయి. ఆరోగ్యానికి పలు రకాలుగా మేలు చేస్తాయి. – డాక్టర్ ఎన్‌బీవీ చలపతిరావు, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త, అంబాజీపేట కొబ్బరి బొండం.. దివ్యౌషధం వేసవి ఉష్ణోగ్రతలతో పెరుగుతున్న డిమాండ్ ఉమ్మడి ‘తూర్పు’న 1.50 లక్షల ఎకరాల్లో కొబ్బరి తోటలు భారీగా ఎగుమతులు చాగల్లు, ఏలేశ్వరం, కొత్తపేట బొండాలకు అధిక డిమాండ్ -
ధాన్యం రైతులకు అండగా పోరాటం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు రాజమహేంద్రవరం సిటీ: ధాన్యానికి గిట్టుబాటు ధర ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. మద్దతు ధరకు ధాన్యం కొనకపోవడంతో నష్టపోతున్న రైతులకు అండగా తమ పార్టీ అండగా నిలిచి పోరాడుతుందని చెప్పారు. రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బొండాల రకం ధాన్యం కొనకపోవడంతో రైస్ మిల్లర్ల వల్ల రైతులు నష్టపోతున్నారు. రైతు ధాన్యం పట్టుకెళ్తుంటే టార్గెట్ అయిపోయిందంటూ వెనక్కి పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు పండించిన చివరి గింజ వరకూ ప్రభుత్వ మద్దతు ధరకు కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనలో రైతులు సంతోషంగా ఉంటే ఇప్పుడు భయపడుతున్నారని, జిల్లా అధికార యంత్రాంగం, ప్రభుత్వం వెంటనే స్పందించాలని అన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్బీకేలు, ఈ–క్రాప్ బుకింగ్‌లు తీసేశారని విమర్శించారు. చంద్రబాబుతో పాటు కూటమి నాయకులు, పవన్ కల్యాణ్ కూడా బీసీలకు అనేక హామీలు ఇచ్చారన్నారు. మేనిఫెస్టోపై పవన్ కల్యాణ్ కూడా సంతకం చేశారని వేణు గుర్తు చేశారు. 50 సంవత్సరాలు పైబడిన బీసీ కుటుంబాల్లోని వారికి పెన్షన్ మంజూరు చేస్తామంటూ హామీ ఇచ్చారని, అప్పుడే ఏడాది కావస్తోందని, దీనిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఎక్కువ అప్పులు చేసిందంటూ తప్పుడు లెక్కలతో దుష్ప్రచారం చేశారని వేణు దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది నెలల్లో రూ.1.47 లక్షల కోట్ల అప్పులు చేసిందని చెప్పారు. పెన్షన్ల మాదిరిగానే మత్స్యకారులకు కూడా మత్స్యకార భరోసా కింద మరో రూ.20 వేల చొప్పున పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనేక కార్యక్రమాలను వదిలేసి, అప్పులు చేసి రాజధాని కట్టాలని మంత్రి నారాయణ అంటున్నారని, అందులో వచ్చే కమీషన్ల కోసం ఆరాటపడుతున్నారని ఆరోపించారు. పోలవరం 2027కు పూర్తయితే మంచిదేనన్నారు. విభజన హామీల్లో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్‌గా కేంద్రం ప్రకటించిందని, కానీ చంద్రబాబు సంపద సృష్టి కోసం దీనిని తీసుకున్నారని వేణు విమర్శించారు. -
సత్యదేవుని కల్యాణానికి చురుగ్గా ఏర్పాట్లు
● ఏడు రోజుల పాటు నిర్వహణ ● అంగరంగ వైభవంగా జరిగేలా చర్యలు అన్నవరం: రత్నగిరి సత్యదేవుని కల్యాణ మహోత్సవాలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. వచ్చేనెల ఏడో తేదీ వైశాఖ శుద్ధ దశమి నుంచి ప్రారంభం కానున్న ఉత్సవాలలో ఎనిమిదో తేదీ ఏకాదశి రాత్రి తొమ్మిది గంటల నుంచి 11–30 గంటల వరకు దివ్య కల్యాణం జరగనుంది. రోజుకొక కార్యక్రమం చొప్పున ఏడు రోజుల పాటు 13వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ఈఓ, దేవస్థానం సిబ్బంది మధ్య అంతరం పెరిగినప్పటికీ ఉత్సవ ఏర్పాట్లలో అంతా బిజీగా ఉన్నారు. శుభలేఖలు పంపిణీ ప్రారంభం సత్యదేవుని కల్యాణ మహోత్సవాల శుభలేఖలను వీఐపీలు, ప్రజాప్రతినిధులకు అందచేసి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే జిల్లా మంత్రి, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు శుభలేఖ అందచేసి ఆహ్వానించారు. ఇంకా జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్, ఎస్పీ ఇతర అధికారులకు అందజేయాల్సి ఉంది. రథం మరమ్మతులు పూర్తి కల్యాణ మహోత్సవాలలో భాగంగా మే 11న సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహించనున్న రథోత్సవానికి కోనసీమ జిల్లాకు చెందిన శ్రీ మాణిక్యాంబ శిల్పకళ ఉడ్ వర్క్స్‌కు చెందిన కొల్లాటి శ్రీనివాస్ బృందం మరమ్మతులు పూర్తి చేశారు. ఉత్సవానికి దగ్గర చేసి ట్రయల్‌రన్ నిర్వహిస్తామని డీఈఈ ఉదయ్ కుమార్ తెలిపారు. ధ్వజ స్తంభానికి అలంకరణ దాత ఆర్థిక సహకారంతో గత ఏడాది బంగారు పూత వేయించిన ధ్వజ స్తంభానికి కుండలాలు కనిపించేలా ఆలయానికి సమాంతరంగా శ్లాబ్‌కు రంధ్రం చేసి అద్దాన్ని అమర్చి మిగిలిన పనులను శనివారం పూర్తి చేశారు. కల్యాణ మహోత్సవాల మొదటి రోజు ధ్వజారోహణం చేసి కార్యక్రమాలు ప్రారంభించి, ఆరో రోజు ధ్వజావరోహణ చేస్తారు. విద్యుత్ అలంకరణలు ప్రారంభం సత్యదేవుని ఉత్సవాల సందర్భంగా విద్యుత్ అలంకరణలు చురుగ్గా సాగుతున్నాయి. స్వామివారి ఆలయం, రాజగోపురాలు, ఆలయ ప్రాంగణం, సత్రాలు, రామాలయం, తొలిపావంచా మెట్లుదారి తదితర ప్రాంతాల్లో విద్యుత్ అలంకరణ చేస్తున్నట్టు ఎలక్ట్రికల్ డీఈ వీ సత్యనారాయణ తెలిపారు. -
విద్యుత్ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి
● ఏపీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు ● ఘనంగా యూనియన్ నూతన జెండా ఆవిష్కరణ, చిహ్నం టవర్ ప్రారంభం రాజమహేంద్రవరం రూరల్: విద్యుత్‌శాఖలో పెండింగ్‌లో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలతో కూడిన న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సానా కృష్ణయ్య, ఎంవీ గోపాలరావు డిమాండ్ చేశారు. శుక్రవారం బొమ్మూరులోని 220 కేవీ సబ్‌స్టేషన్ వద్ద ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (రి.నెం.1104) 75 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్లాటినం జూబ్లీ వేడుకలు ఓఅండ్ ఎం ఏపీ ట్రాన్స్‌కో రాజమహేంద్రవరం ప్రాంతీయశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు సానా కృష్ణయ్య నూతనజెండాను ఆవిష్కరించగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవి.గోపాలరావు యూనియన్ చిహ్నం టవర్‌ను ప్రారంభించారు. కృష్ణయ్య, గోపాలరావు మాట్లాడుతూ పార్టీలు, కులాలకు అతీతంగా కార్మికులతో నడుస్తున్న ఏకై క యూనియన్ ఏపిఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ 1104 మాత్రమేనన్నారు. 75 సంవత్సరాలుగా కార్మికుల హక్కుల కోసం యూనియన్ చేసిన పోరాటాలను వారు గుర్తు చేసుకున్నారు. ఉద్యోగులు దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న మూడు డీఏలను వెంటనే చెల్లించాలని, 24గంటలపాటు విధినిర్వహణలో ఉండే ఉద్యోగులకు నగదు రహిత మెడికల్ పాలసీ అమలుచేయాలని, కాంట్రాక్టు కార్మికులకు సమానపనికి సమానవేతనం ఇవ్వాలని, కాంట్రాక్టు వ్యవస్థను రద్దుచేసి, డైరెక్టుగా జీతాలు ఇవ్వాలన్నారు. గత ప్రభుత్వంలో నియమితులైన 7,200 మంది ఎనర్జీ అసిస్టెంట్స్‌ను ఎలక్ట్రిసిటీ బోర్డు జేఎల్‌ఎంలుగా విలీనం చేయాలన్నారు. తమ డిమాండ్లను యాజమాన్యం, ప్రభుత్వం అమలు చేయకపోతే నిరసన కార్యక్రమాలు చేపడతామని కృష్ణయ్య,గోపాలరావు అన్నారు. రాష్ట్ర కార్యనిర్మాహక అధ్యక్షుడు ఎం.జగదీశ్వర్, ప్రాంతీయ మాజీ అధ్యక్షుడు కె. శ్రీనివాసులు, యం.డి. అబ్దుల్ గఫూర్, ప్రాంతీయ మాజీ కార్యదర్శి యం. శ్రీనివాసరావు , ఏసిఇపిడిసిఎల్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి యం. శ్రీనివాసులు మాట్లాడుతూ యూనియన్ సాధించిన విజయాలను కొనియాడారు. ఏపీ ట్రాన్స్‌కో ఎస్ఈ ఏ.గురుబాబు విద్యుత్ ఉద్యోగులు ఐక్యంగా ఉంటే డిమాండ్లును సాధించుకోవచ్చన్నారు. ప్రాంతీయ అధ్యక్ష,కార్యదర్శులు పినిపే సురేష్ బాబు,జగతా అచ్యుతరామయ్యలు మాట్లాడుతూ, ఈ ప్లాటినం జూబ్లీ వేడుకలను విజయవంతం చేసిన ఉద్యోగులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
న్యాయం చేయాలంటూ ఆందోళన కపిలేశ్వరపురం (మండపేట): మండపేట పట్టణం కేపీ రోడ్డులో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన స్వర్ణకారుడు మాదాబత్తుల సత్తిబాబు (40) కుటుంబానికి న్యాయం చేయాలంటూ శుక్రవారం కుటుంబ సభ్యులు, సహచర స్వర్ణకార వృత్తిదారులు ఆందోళన చేశారు. మండపేట టిడ్కో గృహ సముదాయం వద్ద నివాసం ఉంటున్న సత్తిబాబు పట్టణంలోని రథం సెంటర్లోని స్వర్ణకార దుకాణంలో వెండి పట్టీల తయారీ పని చేస్తున్నాడు. గురువారం రాత్రి పని ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా మోటారు సైకిల్ ఢీకొట్టింది. కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం సత్తిబాబు మృతి చెందాడు. కాగా సత్తిబాబు కుటుంబానికి న్యాయం చేయాలంటూ స్వర్ణకారులు, వెండి పనివార్లు కలువ పువ్వు సెంటర్లో మృతదేహంతో ఆందోళన చేపట్టారు. బంగారు వర్తకుల సంఘం అధ్యక్షుడు సంకా శ్రీనివాస్ రంగా, స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు వెదురుపర్తి రామకృష్ణ ప్రసాద్, కామాక్షి వెండి పనివార్ల సంఘం అధ్యక్షుడు అడపా వాసు, వైఎస్సార్ సీపీ నాయకులు కొమ్ము రాంబాబు, పతివాడ రమణ మాట్లాడుతూ మృతికి కారకుడైన వారిపై చట్టపరిధిలో చర్యలు తీసుకోవాలని, కుటుంబాన్ని ఆదుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఆందోళనకు మున్సిపల్ చైర్పర్సన్ పతివాడ నూక దుర్గారాణి సంఘీభావం తెలిపారు. ఆందోళనకారులతో పట్టణ సీఐ సురేష్ మాట్లాడారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
దారి దోపిడీ కేసులో నలుగురి అరెస్టు
కోటనందూరు: దారి దోపిడీ కేసులో నలుగురు యువకులను అరెస్టు చేశామని స్థానిక ఎస్సై టి.రామకృష్ణ తెలిపారు. వివరాల్లోకెళితే.. రాజమహేంద్రవరానికి చెందిన అల్లాది నాగేంద్రసాయి, గాలంకి కిరణ్‌బాబు లంబసింగి పర్యటనకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఈ నెల 22న తెల్లవారుజాయు 2 గంటల సమయంలో తుని–నర్సీపట్నం రోడ్డులో మండలంలోని కాకరాపల్లి స్సైసీ రెస్టారెంట్ ఎదురుగా వచ్చేసరికి గుర్తు తెలియని ఆరుగురు యువకులు రెండు స్కూటీలపై వచ్చి అడ్డగించారు. ఆరుగురులో ఒకరు వీరిని క్రికెట్ బ్యాట్‌తో బెదిరించగా మరొకరు వీరిని చెంపలపై కొట్టారు. మరొక వ్యక్తి న్యూస్ రిపోర్టర్‌గా చెప్పి ఫొటోలు తీశాడు. మిగిలివారు బాధితుల నుంచి బలవంతంగా పల్సర్ బైక్, రెండు సెల్ఫోన్లు, దుస్తుల బ్యాగు, రూ.1,400 నగదు దోచుకొని బెదిరించి పారిపోయారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం అనకాపల్లి జిల్లా నాతవరం మండలం గాంధీనగరం, తాండవ జంక్షన్ల మధ్య సమావేశమై దొంగిలించిన బైకును అమ్మి గంజాయి కొనుగోలు చేసేందుకు పన్నాగం పన్నుతున్నట్లు అందుకున్న సమాచారంతో తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు, ఎస్సై రామకృష్ణ సిబ్బందితో దాడి చేశారు. పెట్టం కామరాజు అలియాస్ వైన్షాప్నాని, గూటూరి సాయిదుర్గాప్రసాద్, సంగు నాగవెంకట భవానీ కుమార్, చింతా పవణ్కళ్యాణ్లను ఆరెస్టు చేశారు. చల్లా నాగశివమణికంఠ, ఏనుగుపల్లి రాజు పరారీలో ఉన్నారు. వీరంతా కాకినాడ పట్టణానికి చెందిన వారుగా గుర్తించారు. -
మాకు మానాన్నే కావాలి!
ఫ అమ్మ చెంతకు వెళ్లం ఫ లేకుంటే చంపేయండి ఫ ఇద్దరు చిన్నారుల వేదన రాజానగరం: ‘మా అమ్మ వద్దకు వెళ్లం, మమ్మల్ని మా నాన్నకు అప్పగించండి.. లేదంటే చంపేయండి. అమ్మకు అప్పగిస్తే చంపేస్తుంది’ అంటూ రోదిస్తూ ఇద్దరు చిన్నారులు అంటున్న మాటలు అందరి హృదయాలను కలచివేస్తున్నాయి. నవమాసాలు మోసి, జన్మనిచ్చిన తల్లి వివాహేతర సంబంధంతో భర్తను వదిలేసి, ప్రియుడితో ఉంటోంది. ఆ ప్రియుడు ఆమె పిల్లలతో చాకిరీ చేయించుకుంటూ, ఇష్టానుసారం కొడుతున్నా ఆ తల్లి హృదయం చలించడం లేదు. కనీసం ఆ తల్లిని కన్న తల్లి కూడా చోద్యం చూస్తూ కూతురి వివాహేతర సంబంధాన్ని వెనకేసుకొస్తున్న నేపథ్యంలో ఆ చిన్నారులు విసిగిపోయారు. పై విధంగా తమ నిర్ణయాన్ని వెల్లడించారు. రాజానగరం పోలీసు స్టేషన్ పరిధిలోని కొంతమూరులో జరిగిన ఈ సంఘటన వివరాలివీ.. కొంతమూరు చెంచు కాలనీలో ఉంటున్న అన్నెపు ధనలక్ష్మి, జయరామ్ దంపతులకు అన్నెపు తేజ కిరణ్ (10), భానుప్రకాష్ (8) సంతానం. ప్రస్తుతం వీరిద్దరూ రాజమహేంద్రవరం ఆర్యాపురంలోని నారాయణ స్కూల్లో 4, 2 తరగతులు చదువుతున్నారు. పెయింటర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న జయరామ్‌కు భార్య, పిల్లలంటే అమితమైన ప్రేమాభిమానాలున్నాయి. ధనలక్ష్మి ఒక కర్రీ పాయింట్లో పని చేస్తూండగా మందపల్లి ప్రవీణ్ కుమార్‌తో పరిచయం ఏర్పడింది. క్రమేపీ అతడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో భర్త, పిల్లలను పట్టించుకునేది కాదు. ఆమె ప్రవర్తనను సరి చేయాల్సిన తల్లి తులసమ్మ కూతురుకు వంత పాడి, అల్లుడు జయరామ్‌ను బయటకు పంపించేందుకు సాయపడింది. సుమారు ఏడాది నుంచి ప్రియుడితో కలసి ఉంటున్న ధనలక్ష్మి ఎదుటనే ఆ ఇద్దరు పిల్లలతో ఆమె ప్రియుడు సేవలు చేయించుకునేవాడు. చెప్పినట్టు చేయకపోతే కొట్టేవాడు. ఈ క్రమంలో జనవరి 25న బెల్డుతో ఇష్టానుసారం కొట్టడంతో చుట్టుపక్కల వారి ద్వారా విషయం తెలుసుకుని మేనమామ పాలవలస బాలమణికంఠ అక్కడకు వెళ్లి, ఆ ఇద్దరు పిల్లలను తన ఇంటికి తీసుకెళ్లాడు. ముందుగా రాజానగరం పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేసి, రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించాడు. అప్పటి నుంచీ వారిని తన ఇద్దరు పిల్లలతో సమానంగా చూసుకుంటున్నాడు. అయినప్పటికీ ధనలక్ష్మి పిల్లల గురించి పట్టించుకోకపోగా, వారి సంరక్షణ పేరుతో భర్త నుంచి నెలనెలా రూ.10 వేలు వసూలు చేస్తోంది. పిల్లల చదువులకు ఒక్క రూపాయి కూడా వినియోగించకపోవడంతో స్కూలు ఫీజులు రూ.38 వేల వరకూ పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో పిల్లల మేనమామ మణికంఠ శుక్రవారం రాజానగరం పోలీసులను మరోసారి ఆశ్రయించడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పిల్లలు తమ తండ్రి వద్దకు వెళ్లిపోతామంటున్నారని ఈ సందర్భంగా మణికంఠ చెప్పాడు. అందుకు తమ బావ కూడా సిద్ధంగానే ఉన్నారని, అయితే అది అధికారికంగా జరగాలని కోరుతున్నాడని అన్నాడు. పోలీసులు, చైల్డ్ వెల్ఫేర్ సంస్థ సమక్షంలో వారిని తండ్రికి అప్పగిస్తేనే వారి భవిష్యత్తు బాగుంటుందన్నాడు. ఇద్దరు చిన్నారులు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సమక్షంలో నిర్ణయం తీసుకుంటాం తండ్రి శ్రీకాకుళంలో ఉంటున్నాడు. అతనికి కబురు చేశాం. రెండు రోజులలో వస్తాడు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సమక్షంలో తల్లిదండ్రులిద్దరినీ పెట్టి, పిల్లల వయస్సును బట్టి వారు ఎవరి వద్ద ఉండాలనుకుంటున్నారో నిర్ణయం తీసుకుంటాం. లేకుంటే హోమ్‌కు అప్పగిస్తాం. – నారాయణమ్మ, ఎస్సై, రాజానగరం -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి)గండేరా (వెయ్యి) 20,000 గటగట (వెయ్యి) 18,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 19,000 గటగట (వెయ్యి) 17,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
‘వర్జీనియా’ రైతులకు
ఉపశమనం● మూడేళ్లకు లైసెన్స్ పునరుద్ధరణ ● వచ్చే పంట కాలం నుంచి అమలు ● 83,500 మందికి లబ్ధి ● కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ గెజిట్ ప్రచురణ దేవరపల్లి: వర్జీనియా పొగాకు రైతులకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తీపి కబురు చెప్పింది. పొగాకు సాగు చేయాలంటే రైతు పేరిట రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, బ్యారన్ నిర్వహణకు పొగాకు బోర్డు నుంచి లైసెన్స్ తీసుకోవలసి ఉంది. ఏటా పంట వేయడానికి ముందు అక్టోబర్, నవంబర్ నెలల్లో పొగాకు బోర్డు కార్యాలయలో వీటిని పునరుద్ధరించుకోవలసి ఉంది. దీని నిమిత్తం రైతులు బోర్డు నిర్ణయించిన రుసుం చెల్లించాల్సి ఉంటుంది. రైతులకు భారంగా మారిన ఈ విధానాన్ని రద్దు చేయాలని, మూడేళ్లకోసారి పునరుద్ధరించుకునేలా అవకాశం ఇవ్వాలని రైతు సంఘాలు చాలా కాలంగా కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాయి. దీనిని పరిగణనలోకి తీసుకుని, మూడేళ్ల వరకూ చెల్లుబాటయ్యేలా ఈ నెల 22న కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ గెజిట్ ప్రచురించిందని పొగాకు బోర్డు రీజినల్ మేనేజర్ (రాజమహేంద్రవరం) జీఎల్‌కే ప్రసాద్ శుక్రవారం తెలిపారు. మన రాష్ట్రంలో 2025–26 పంట కాలం నుంచి అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. దీనివలన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, బ్యారన్ నిర్వహణ లైసెన్స్ పునరుద్ధరణ మూడేళ్ల పాటు చెల్లుబాటు అవుతుందని వివరించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలో గుంటూరులోని పొగాకు బోర్డు కార్యాలయానికి అందనున్నాయని తెలిపారు. ఈ సవవరణ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లోని దాదాపు 91 వేల బ్యారన్లకు చెందిన 83,500 మంది రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది. రాజమహేంద్రవరం రీజియన్‌లోని ఐదు వేలం కేంద్రాల పరిధిలో 14,861 బ్యారన్లకు సంబంధించిన 12,861 మంది రైతులకు దీని ద్వారా ఉపశమనం కలగనుంది. -
పారిశ్రామిక పార్కులో సైట్ బుకింగులు ప్రారంభం
రాజానగరం: కలవచర్లలో 104 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న ఇండస్ట్రియల్ పార్కులో పరిశ్రమల ఏర్పాటుకు సైట్ బుకింగ్ చేసుకునే అవకాశాన్ని ఔత్సాహికులకు కల్పిస్తున్నామని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. సంబంధిత అధికారులతో కలసి శుక్రవారం ఆ ప్రాంతాన్ని సందర్శించిన ఆమె పరిశ్రమల ఏర్పాటుకు అక్కడ జరుగుతున్న మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఇక్కడ 390 సైట్స్ బుక్ చేసుకునే అవకాశం ఉందన్నారు. రిజర్వేషన్లను అనుసరించి సైట్స్ కేటాయిస్తారని తెలిపారు. ఇప్పటికే వేమగిరి, జేగురుపాడుకు చెందిన 197 మందికి అనుమతులు ఇచ్చామని సంబంధిత అధికారులు కలెక్టర్‌కు తెలిపారు. కార్యక్రమంలో జోనల్ మేనేజర్ రమణారెడ్డి, పరిశ్రమల అధికారి శ్రీవనిధర్ రామన్, విద్యుత్ శాఖ అధికారి కె.తిలక్‌కుమార్, ఏడీ ప్రదీప్‌కుమార్, తహసీల్దార్ జీఏఎల్‌ఎస్ దేవి తదితరులు పాల్గొన్నారు. -
లోక్ అదాలత్ వాయిదా
● జూలై 5న నిర్వహణ ● జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): వచ్చే నెల 10న నిర్వహించ తలపెట్టిన జాతీయ లోక్ అదాలత్‌ను జూలై 5వ తేదీకి వాయిదా వేశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత ఈ విషయం తెలిపారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ఎకై ్సజ్ అధికారులతో జిల్లా న్యాయస్థానం ఆవరణలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, జూలై 5న జిల్లావ్యాప్తంగా జరగనున్న లోక్ అదాలత్‌లో అధిక మొత్తంలో రాజీ పడదగిన ఎకై ్సజ్ కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఒకటో అదనపు సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్చార్జి కార్యదర్శి బి.పద్మ, తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాల ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారులు సీహెచ్ లావణ్య, ఎం.కృష్ణకుమారి, ఎస్కేడీవీ ప్రసాద్, పీఎన్ రాహుల్ తదితరులు పాల్గొన్నారు. డీపీఆర్ఓగా బాలకృష్ణ రాజమమహేంద్రవరం సిటీ: జిల్లా పౌర సంబంధాల అధికారి(డీపీఆర్ఓ)గా వై.బాలకృష్ణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం, కలెక్టర్ పి.ప్రశాంతిని ఆమె క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వానికి, పరిపాలనా యంత్రాంగానికి, మీడియాకు మధ్య వారధిగా డీపీఆర్ఓ కీలక పాత్ర పోషించాలని అన్నారు. బాలకృష్ణ ఏపీపీఎస్సీ ద్వారా ఎంపికై , జిల్లాలో నియమితులవడంపై అభినందనలు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను, ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకుని వెళ్లడంలో కీలక బాధ్యతలు నిర్వహించాలని సూచించారు. జిల్లా అధికారులతో సమన్వయం సాధించడం ద్వారా లక్ష్య సాధన సాధ్యమవుతుందన్నారు. నూతన డీపీఆర్ఓ బాలకృష్ణకు జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు, డీఆర్ఓ టి.సీతారామమూర్తి, కేఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్.భాస్కరరెడ్డి, ట్రాన్స్‌కో ఎస్ఈ కె.తిలక్ కుమార్, జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారి సీహెచ్ శ్రీనివాస్, డివిజనల్ పీఆర్ఓ ఎం.లక్ష్మణాచార్యులు తదితరులు అభినందించారు. -
మా అందరి పూర్వ జన్మ సుకృతం
మేము తొమ్మిది మంది అన్నదమ్ములం. ఆరుగురు చెల్లెళ్లు. గణేష్ శర్మ మా రెండో సోదరి భళ్లమూడి భాస్కరం, సూర్యనారాయణ దంపతుల కుమార్తె కొడుకు. అతడి తండ్రి ధన్వంతరి, తల్లి మంగాదేవి. గణేష్‌ను నా చేతుల మీద పెంచాను. ద్వారకా తిరుమలలో ఆగమ శాస్త్రాలు అభ్యసించి, పరీక్షలో గోల్డ్ మెడల్ పొందాడు. అప్పుడే శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ అతడి విద్వత్తు చూసి కంచి పీఠానికి తీసుకుని వెళ్లి, చతుర్వేదాలు, ఉపనిషత్తులు నేర్పించారు. గణేష్ శర్మకు ఈ గౌరవం దక్కడం మా పూర్వజన్మ సుకృతం. – నాగాభట్ల కామేశ్వరశర్మ, వైదిక కార్యక్రమాల పర్యవేక్షకుడు, అన్నవరం దేవస్థానం -
కంచితో మంచి అనుబంధం
● వీర వేంకట సత్యనారాయణ స్వామి స్వయంభువుగా వెలసిన అన్నవరం దేవస్థానానికి, కంచి కామకోటి పీఠానికి ఎప్పటి నుంచో అనుబంధం ఉంది. రత్నగిరిపై సత్యదేవుడు ఆవిర్భవించి 134 సంవత్సరాలు పూర్తి కాగా అప్పటి నుంచీ దేవస్థానంలో వైదిక కార్యక్రమాల రూపకల్పన, ప్రతి కీలక పరిణామాల్లో కంచి కామకోటి పీఠాధిపతులు సూచనలు అందిస్తున్నారు. వారు భక్తులకు, దేవస్థానం అధికారులకు ఇస్తున్న సూచనలు, అనుగ్రహ భాషణలు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. ● నడిచే దేవుడిగా పేరొందిన కంచి పీఠం 68వ అధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి సుమారు 50 ఏళ్ల క్రితం కంచి నుంచి పాదయాత్ర చేస్తూ అన్నవరం వచ్చారు. ఆయన కూడా వందల సంఖ్యలో భక్తులతో పాటు ఏనుగులు, గుర్రాలు, ఆవులు కూడా నడుస్తూ వచ్చాయి. అన్నవరంలో ఆయన మూడు రోజులు బస చేశారు. స్థానిక సుబ్రహ్మణ్యస్వామి వారి ఆలయంలో పీఠం ఏర్పాటు చేసి, స్వామీజీ పూజలు చేశారు. ఆ సమయంలో సత్యదేవుని ఆలయానికి వచ్చి, దేవస్థానంలో అనేక వైదిక కార్యక్రమాల గురించి మార్గనిర్దేశం చేశారు. పలువురు పండితులకు అన్నవరంలో ఆయన చేతుల మీదుగా సన్మానం చేశారు. స్వామీజీ అన్నవరం నుంచి పాదయాత్రగా తుని వెళ్తూ, మార్గం మధ్యలో ఎర్రకోనేరు వద్ద సూర్యాస్తమయం కావడంతో అక్కడ సంధ్యావందనానికి ఆగిపోయారని నాడు స్వామీజీతో యాత్రలో పాల్గొన్న అన్నవరం దేవస్థానం వైదిక కార్యక్రమాల పర్యవేక్షకుడు నాగాభట్ల కామేశ్వరశర్మ తెలిపారు. -
ప్రధానికి షర్మిల వెంటనే క్షమాపణ చెప్పాలి
రాజమహేంద్రవరం సిటీ: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్ర దాడి ఘటనను రాజకీయం చేయడం ిపీసీసీ అధ్యక్షురాలు షర్మిలకు తగదని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మలా కిషోర్ అన్నారు. రాజమహేంద్రవరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. షర్మిల వెంటనే ప్రధానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జరిగిన ఘటన చాలా హేయమైనదని, దీనిని దేశవ్యాప్తంగా ప్రజలందరూ ముక్తకంఠంతో ఖండిస్తున్నారని అన్నారు. ఈ ఘటనను కూడా రాజకీయంగా ఉపయోగించుకోవాలని, దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించడం దారుణమని మండిపడ్డారు. మళ్లీ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే షర్మిలకు తగిన గుణపాఠం చెప్పడానికి మహిళా మోర్చా సిద్ధంగా ఉంటుందని నిర్మలా కిషోర్ హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి ప్రసన్న, జిల్లా అధ్యక్షురాలు మద్దిపాటి రజని పాల్గొన్నారు. -
ఉగ్రవాదులను ఉరి తీయాలి
● మతసామరస్యాన్ని కాపాడాలి ● పర్యాటకులపై ఉగ్ర దాడికి ముస్లిం మహిళా జేఏసీ ఖండన ● కొవ్వొత్తులతో ర్యాలీ సాక్షి, రాజమహేంద్రవరం: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం వద్ద పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని నిరసిస్తూ ముస్లిం ఐక్య వేదిక రాజమహేంద్రవరం శాఖ (జేఏసీ) ఆధ్వర్యాన మహిళలు శుక్రవారం రాత్రి పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక జాంపేటలోని ఆజాద్ చౌక్ వద్ద ముస్లిం జేఏసీ ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ ఎండీ హబీబుల్లా ఖాన్ నాయకత్వంలో ముస్లిం మహిళలు కొవ్వొత్తులతో ఈ ర్యాలీ నిర్వహించారు. ‘ఉగ్రవాదాన్ని అరికట్టాలి, నిందితులను కఠినంగా శిక్షించాలి, హిందూ ముస్లిం భాయీభాయ్, మేరా భారత్ మహాన్’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం మహిళలు మాట్లాడుతూ, ఉగ్రవాదుల చేతిలో అసువులు బాసిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరారు. అమాయక పర్యాటకులను ఉగ్రవాదులు హతమార్చారని, ప్రతి పౌరుడూ ఈ దాడిని ఖండించాలని అన్నారు. దేశంలోని ఉగ్రవాదులను అణచివేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని, తక్షణమే ఉగ్రవాద నిర్మూలనకు కేంద్రం మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 370 ఆర్టికల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ రద్దు చేసి కశ్మీర్‌ను అల్లకల్లోలం చేశారని అన్నారు. కశ్మీర్ ఉగ్రవా దాడికి కేంద్రం జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. హిందూ ముస్లింలు ఐక్యంగా జీవించే లౌకిక దేశం భారత్ అని అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు మతాల మధ్య చిచ్చు రేపి, దేశంలో అల్లకల్లోలం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఉగ్రవాదాన్ని ముస్లింలు ప్రేరేపిస్తున్నారంటూ బీజేపీ ఆరోపిస్తోందని, కానీ, పర్యాటకులకు అండగా మహమ్మద్ హుస్సేన్ అనే గుర్రపు స్వారీ చేసే వ్యక్తి ఉగ్రవాదులను అడ్డుకొని, అనేక మంది ప్రాణాలు కాపాడి, దేశం కోసం ప్రాణాలర్పించి, దేశ సమగ్రతను చాటి చెప్పాడని గుర్తు చేశారు. ఈ ర్యాలీలో ముస్లిం మహిళా నాయకులు ఆయేషా, షాపు, హీర, షాహిన, ముంతాజ్, ఫర్హిద్, షబ్నం తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షుల నియామకం
సాక్షి, రాజమహేంద్రవరం: వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాలకు జిల్లా అధ్యక్షులను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామక ప్రక్రియ జరిగింది. రైతు విభాగం జిల్లా అధ్యక్షుడిగా వల్లభనేని సత్యనారాయణ (గోపాలపురం), క్రిస్టియన్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడిగా ఎంఎస్ఎస్ఎన్ విజయ సారథి (రాజమహేంద్రవరం రూరల్), గ్రీవెన్స్ సెల్ జిల్లా అధ్యక్షుడిగా నాగళ్లపాటి శ్రీను (కొవ్వూరు), అంగనవాడీ వింగ్ అధ్యక్షురాలిగా కురుకూరి ధనలక్ష్మి (గోపాలపురం) నియమితులయ్యారు. తమ నియామకానికి సహకరించిన ఆయా నియోజకవర్గాల కో ఆర్డినేటర్లకు, జిల్లా అధ్యక్షులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. తమపై నమ్మకం ఉంచి, బాధ్యతలు అప్పగించిన అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పారు. వైఎస్సార్ సీపీ జిల్లా కమిటీ నియామకం రాజమహేంద్రవరం సిటీ: అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ సీపీ జిల్లా కమిటీలో పలువురిని వివిధ హోదాల్లో నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ జిల్లా కమిటీ ఉపాధ్యక్షులుగా బొప్పన సుబ్బారావు, అడబాల వెంకటేశ్వరరావు, బొండాల వెంకన్నబాబు, కాకర్ల వెంకటేశ్వరరావు, అడబాల సీతారామకృష్ణ, వీరమళ్ళ సత్యనారాయణ; ప్రధాన కార్యదర్శులుగా పతాన్ అన్సర్ బాషా, తడాల విష్ణు చక్రవర్తి, జుట్టా కొండలరావు (ఏడుకొండలు), కోర్ల ఉదయ భాస్కర్, కందుల శ్రీనాథ్; ట్రెజరర్‌గా యెజ్జు శ్రీనివాస్ కిరణ్ నియమితులయ్యారు. సెక్రటరీ ఆర్గనైజర్‌గా పెండ్ర పోశేశ్వరరావు, చాంద్ బాషా షేక్, పితాని హరికృష్ణ, ఎనుముల త్యాగరాజు, వాసంశెట్టి మాధవ, పడాల వీర వెంకట సత్యనారాయణరెడ్డి (పీవీ), జాలెం వెంకటేశ్వరరావు, గెడ్డం సూర్యప్రసాద్, పోతిరెడ్డి నాగరాజు, కసులూరి సతీష్, నీలపాల శివరామకృష్ణ, గిరజాల రామ, సూరిశెట్టి కుటుంబరావు, కేతినీడి అశోక్ కుమార్, జ్యోతుల లక్ష్మీనారాయణలను నియమించారు. సెక్రటరీ యాక్టివిటీగా కొల్లాటి ఇజ్రాయిల్, తాడి సూరారెడ్డి, ఎల్లా రామారావు, చోళ్ల శ్రీనివాస్, దుగ్గిరాల రమేష్‌బాబు, ముప్పిడి వెంకటరత్నం, కొప్పినీడి ప్రసాద్‌బాబు, తాడికొండ విష్ణుమూర్తి, ముద్దాల తిరుపతిరావు (అను), వంబోలు పోసిబాబు, మట్టా శ్రీనివాసరావు, కొల్లి రాజా రమాదేవి, టేకుమూడి త్రిమూర్తులు నియమితులయ్యారు. అధికార ప్రతినిధులుగా గనిశెట్టి సోమేశ్వరరావు, పెయ్యల రాజేష్, గాడా జగదీష్, సబ్బెళ్ల కృష్ణారెడ్డి, కుచ్చులపాటి కుమార్, గంధం సీహెచ్ఆర్ శేషసాయి నియమితులయ్యారు. -
మనం భారతీయులం.. మనది అఖండ భారతం
జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల దురాగతానికి బలైపోయిన పర్యాటకులకు జీఎస్ఎల్ వైద్య కళాశాల ప్రాంగణంలో వైద్య విద్యార్థులు గురువారం రాత్రి శ్రద్ధాంజలి ఘటించారు. కొవ్వొత్తులతో మౌన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం మైదానంలో భారతదేశం ఆకృతిలో మానవహారంగా ఏర్పడి ‘మనం భారతీయులం – మనది అఖండ భారతం’ అంటూ ఆంగ్ల, తెలుగు, తమిళ, మలయాళ, ఒడియా, కన్నడ, బెంగాలీ భాషల్లో ఉద్వేగభరితంగా నినదించారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ వి.గురునాథ్, డాక్టర్ జి.సునీల్, డాక్టర్ అప్పారావు, సూపరింటెండెంట్ డాక్టర్ టీవీఎస్పీ మూర్తి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. – రాజానగరం -
ఇన్నోవేషన్ హబ్‌కు రెండెకరాలు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): జిల్లా కేంద్రం రాజమహేంద్రవరంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుకు త్వరలో రెండెకరాల స్థలాన్ని గుర్తించనున్నామని కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె ఈ అంశంపై మాట్లాడారు. ఈ హబ్ ఫలవంతమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని, కార్యాచరణ లక్ష్యంగా గుర్తించిన వ్యక్తులకు పరిజ్ఞానాన్ని అందించే క్రమంలో, నూతన ఆవిష్కరణలు చేపట్టాలని అన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు, గ్రీన్ కోర్, ఓఎన్జీసీ, గెయిల్, ఇతర ఇన్నోవేటివ్ ఏజెన్సీలు, ఎన్ఐటీఏ, జేఎన్టీయూ నిపుణులు, పారిశ్రామిక ప్రోత్సాహక కమిటీ, ఇతర సమన్వయ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. జాతీయ పోటీలకు ఎంపిక నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ఏలూరులో ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకూ జరిగిన విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర స్థాయి పోటీల్లో కాకినాడ క్రీడాకారులు ప్రతిభ చూపి, 3 బంగారు, 2 రజత, 3 కాంస్య పతకాలు అందుకున్నారు. జి.సురేష్ కుమార్ 100, 200 మీటర్లు, కె.సత్యదుర్గ బోసే గేమ్, కె.ప్రేమ్‌కుమార్ 200, 100 మీటర్లు రన్నింగ్‌లో ప్రతిభ చూపి, ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. విజేతలను ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ జిల్లా కో ఆర్డినేటర్ చామంతి నాగేశ్వరరావు, సమగ్ర శిక్ష కార్యాలయ సిబ్బంది గురువారం అభినందించారు. -
వైద్య ధ్రువపత్రాల పరిశీలన
కాకినాడ క్రైం: త్వరలో ఉపాధ్యాయుల బదిలీలు జరగనున్న నేపథ్యంలో తమ వైద్య ధ్రువపత్రాల పరిశీలన కోసం బారులు తీరారు. గురువారం కాకినాడ జీజీహెచ్‌లో ఇందుకు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి గోదావరి జిల్లాలకు చెందిన 192 మంది ఉపాధ్యాయులు వైద్య ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎంపిఆర్ విఠల్ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసన్, డిప్యూటీ కలెక్టర్, అడ్మినిస్ట్రేటర్ శ్రీధర్, ఏఆర్ఎంవో డాక్టర్ లావణ్య పర్యవేక్షకులుగా వ్యవహరించారు. మరో రెండు రోజుల పాటు పరిశీలన కొనసాగనున్న నేపథ్యంలో సహాయం కోసం 97057 85454, 98490 31316 నంబర్లను సంప్రదించాలన్నారు. గుర్తు తెలియని వ్యక్తి మృతి కొవ్వూరు: సీతంపేట గ్రామంలో గట్టు సత్తెమ్మ తల్లి గుడి వెనుక గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గురువారం సాయంత్రం స్థానికులు గమనించారు. మృతుడి వయసు సుమారు 55 ఏళ్లు ఉండవచ్చునని భావిస్తున్నారు. అనారోగ్యంతో చనిపోయి ఉండవచ్చునని రూరల్ ఎస్సై కె.శ్రీహరిరావు తెలిపారు. మృతుడు చూడడానికి యాచకుడిగా కనిపిస్తున్నాడు. మృతదేహాన్ని కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. వివరాల కోసం 94407 96623 నంబర్లో సంప్రదించాలని ఆయన కోరారు. -
పుణ్యస్నానానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు..
ఏలేశ్వరం: ఏలేరు కాలువలో పుణ్యస్నానం చేసేందుకు దిగి అమ్మమ్మ, మనవడు మృతిచెందిన ఘటన మండలంలోని యర్రవరంలో జరిగింది. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసుల వివరాల ప్రకారం ప్రత్తిపాడుకు చెందిన అరట్లకోట సత్యవతి(52) ఏగులమ్మ గుడి వద్ద పనులు చేస్తుంటుంది. అమ్మవారి జాతర ఉండడంతో పుణ్యస్నానం చేసేందుకు కూతురు కుమారుడైన గోర్స వీరమనోజ్(12)తో కలిసి బుధవారం సాయంత్రం యర్రవరంలోని ఏలేరుకాలువలో స్నానం చేసేందుకు దిగింది. ప్రమాదవశాత్తు కాలువలో ఉన్న గోతుల్లో మునిగిపోవడంతో ఇద్దరూ మృత్యువాత పడ్డారు. కాలువలో పుణ్యస్నానం నిమిత్తం వచ్చి మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఎస్సై రామలింగేశ్వరరావు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ప్రత్తిపాడులో విషాద ఛాయలుప్రత్తిపాడు: యర్రవరం వద్ద ఏలేరు కాలువలో పడి అమ్మమ్మ, మనుమడు మృతి చెందడంతో ప్రత్తిపాడులో విషాద ఛాయలు అలముకున్నాయి. వీరి మరణం రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. గురువారం ఏలేశ్వరం పోలీసులు శవ పరీక్షకు ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు మృతదేహాలను తరలించారు. సమాచారం అందుకున్ని మృతుల బంధువులు సీహెచ్‌సీకి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రత్తిపాడు సెంటర్లో ఉండే శ్రీఏగులమ్మ అమ్మవారి ఆలయంలో సేవ చేసుకుంటున్న విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన అరట్లకట్ల సత్యవతి మృతి స్థానికులను కలచివేసింది. ఆమె ఆలయం, పరిసరాలను శుభ్రం చేసుకుంటూ కాలం గడిపేది. గురువారం శ్రీఏగులమ్మ వారి ఆలయంలో పందిరి రాట వేసే కార్యక్రమంలో పాల్గొనే ఉద్దేశంతో నదీ స్నానం చేస్తే మంచిదని భావించిన సత్యవతి తన మనుమడు వీర మనోజ్‌ను వెంటబెట్టుకుని, ఏలేరు నదీ స్నానమాచరించేందుకు బుధవారం సాయంత్రం యర్రవరం వెళ్లింది. ఆమె ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఆమె భర్త నాగేశ్వరరావు బంధువుల ఇంట గాలించాడు. గురువారం ఉదయం ఏలేరులో శవమై తేలడంతో నిశ్చేష్టుడయ్యాడు. ఇల్లాలు శవమై రావడంతో కన్నీరుమున్నీరుగా విలపించాడు. భర్త కమ్మరం పని చేసి, తెచ్చే సంపాదనతోనే కుటుంబం నడుస్తోంది. ఆమెకు ముగ్గురు కుమార్తెల సంతానం. వారందరికీ వివాహాలు చేసింది. ఆమె మరణం ఆలయ పరిసర ప్రజలను కలచివేసింది. కాగా సత్యవతి కుమార్తె గోర్స రమణమ్మ, రాజు దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. వడ్రంగి పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకునే రాజు పెద్ద కుమారుడు వీర మనోజ్ (12) స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. అమ్మమ్మకు సాయంగా వెళ్లి మృత్యువాత పడ్డాడు. చేతికి అందివస్తాడనుకొన్న కొడుకు తమను వదిలిపోవడంతో ఆ దంపతుల శోకానికి అంతులేకపోయింది. తమకు తల కొరివి పెడతాడనుకొన్న కొడుకుకు తామే కొరివి పెట్టాల్సి వస్తుందని భోరున విలపించారు. -
అప్పు రాబట్టుకునేందుకు బాలుడి కిడ్నాప్
చాకచక్యంగా పట్టుకున్న కోరంగి పోలీసులు తాళ్లరేవు: అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి రాబట్టేందుకు బాలుడిని కిడ్నాప్ చేసి అడ్డంగా బుక్కయిన వ్యక్తి ఉదంతమిది. కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని జి.వేమవరం గ్రామానికి చెందిన అయినవిల్లి కాళీకృష్ణ భగవాన్ రెండవ కుమారుడు ఫణివర్ధన్ రెండు రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. తండ్రి ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాకినాడ ఏఎస్పీ పాటిల్ దేవరాజ్ మనీష్ పర్యవేక్షణలో కాకినాడ రూరల్ సీఐ చైతన్యకృష్ణ, కోరంగి ఎస్సై పి.సత్యన్నారాయ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విచారణలో బాలుడు అదృశ్యం కాలేదని, కిడ్నాప్‌కు గురైనట్లుగా గుర్తించారు. బాలుడు తండ్రి కాళీకృష్ణ భగవాన్ మూడేళ్ల క్రితం చొల్లంగిపేట గ్రామానికి చెందిన కుంది అద్దాలు వద్ద రూ.1.20 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఎన్నిసార్లు అడిగినా ఇవ్వకపోవడంతో ఆ డబ్బులు రాబట్టుకునేందుకు కాళీకృష్ణ భగవాన్ రెండవ కుమారుడైన ఫణివర్ధన్ను కిడ్నాప్ చేసి ఉప్పాడ కొత్తపల్లి ప్రాంతంలో రెండు రోజులపాటు దాచాడు. అక్కడి నుంచి బాలుడు ఫణివర్ధన్ను చొల్లంగిపేటలోని తన స్వగృహానికి గురువారం తీసుకువచ్చాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు చాకచక్యంగా దాడిచేసి అతని బారినుంచి బాలుడిని కాపాడి తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించగా రిమాండ్ విధించినట్టు ఎస్సై తెలిపారు. -
నేడు గురుకుల ప్రవేశ పరీక్షలు
అమలాపురం రూరల్: ఏపీ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు శుక్రవారం ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షల నిర్వహణపై కాకినాడ జిల్లా తుని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ హేమలత, పరీక్ష కేంద్రాల ముఖ్య పర్యవేక్షకులు, అధికారులతో జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) రాజకుమారి కలెక్టరేట్లో గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, స్థానిక జెడ్పీ బాలికల హైస్కూల్, వెత్సవారి అగ్రహారంలోని మహాత్మా గాంధీ మున్సిపల్ హైస్కూల్ కేంద్రాల్లో గురుకుల ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గురుకుల పాఠశాలల్లో 5 నుంచి 8వ తరగతి వరకూ ప్రవేశాలకు బ్యాక్‌లాగ్‌కు సంబంధించి 40 మంది ఈ పరీక్షకు హాజరు కానున్నారన్నారు. గురుకుల జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలల ప్రవేశ పరీక్షకు 285 మంది హాజరు కానున్నారని తెలిపారు. 5, 6, 7, 8 తరగతుల ప్రవేశ పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, జూనియర్, డిగ్రీ కాలేజీల ప్రవేశ పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ జరుగుతుందని వివరించారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను అనుమతించాలని రాజకుమారి స్పష్టం చేశారు. సమావేశంలో ప్రవేశ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ బి.హనుమంతరావు, చీఫ్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. -
నిరుపయోగంగా నివేదన శాల
● రెండు నెలలైనా అమలు కాని ఈఓ నిర్ణయం ● దాత అసంతృప్తి అన్నవరం: స్థానిక వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో తుని పట్టణానికి చెందిన దాత చెక్కా సూర్యనారాయణ (తాతబాబు) రూ.30 లక్షలతో నిర్మించిన నివేదన శాల పునః ప్రారంభిస్తామని అధికారులు ప్రకటించి రెండు నెలలైనా అమలు కాలేదు. దీంతో అధికారుల తీరుపై దాత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దేవస్థానంలో స్వామివారి నివేదన శాల నిర్మించాలని తాతబాబును 2023 జూన్‌లో అప్పటి ఈఓ ఎస్ఎస్ చంద్రశేఖర్ అజాద్ కోరారు. ఆయన రూ.30 లక్షల వ్యయంతో సర్క్యులర్ మండపంపై నివేదనశాల నిర్మించారు. ఈ నిర్మాణానికి దేవస్థానం పండితులు కూడా ఆమోదం తెలిపారు. దీనిని 2023 ఆగస్టులో దాత చేతుల మీదుగా ప్రారంభించారు. ఆ తరువాత సత్యదేవుని నివేదనలన్నీ ఈ షెడ్డులోనే తయారు చేసి నివేదించేవారు. 2023 నవంబర్‌లో ఈఓ చంద్రశేఖర్ అజాద్ బదిలీ కాగా ఆయన స్థానంలో ప్రస్తుతం దేవదాయశాఖ ఇన్చార్జి కమిషనర్‌గా వ్యవహరిస్తున్న కె.రామచంద్రమోహన్ ఈఓగా బాధ్యతలు స్వీకరించారు. నివేదన శాల భూస్పర్శతో భూమి మీదనే ఉండాలని పండితులు సూచించడంతో పాత నివేదనశాల లోనే మళ్లీ నివేదనలు తయారు చేయాలని ఆయన ఆదేశించారు. దీంతో 2023 నవంబర్ నుంచి పాత నివేదనశాలను ఉపయోగిస్తున్నారు. ‘సాక్షి’ కథనంతో ఈఓ ప్రకటన ఫిబ్రవరి 21న ‘సాక్షి’ దినపత్రికలో నిరుపయోగంగా ఉన్న నివేదనశాలపై ‘దాతల ఆశయాలకు తూట్లు ’ శీర్షికన వార్త ప్రచురితమవడంతో ఈఓ వీర్ల సుబ్బారావు స్పందిస్తూ దాత చెక్కా తాతబాబు నిర్మించిన నివేదన షెడ్డు ను కూడా వినియోగంలోకి తేవాలని నిర్ణయించామని, పులిహోర, ఇతర ప్రసాదాలు తయారు చేయించి భక్తులకు పంపిణీ చేయిస్తామని చెప్పారు. ఇవి తయారు చేయడానికి ఒక కుక్, మరో సహాయకుడు అవసరం. వారిని నియమించడానికి ఎంఎల్సీ ఎన్నికల కోడ్ అడ్డుగా ఉందని తెలిపారు. ఇది జరిగి రెండు నెలలు దాటినా ఆచరణకు నోచుకోకపోవడంపై దాత సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మే ఏడో తేదీ నుంచి సత్యదేవుని కల్యాణ మహోత్సవాలు జరుగనున్నాయి. కనీసం ఆ ఉత్సవాల నాటికై నా ఈ నివేదనశాలను వినియోగంలోకి తేవాలని దాత కోరుతున్నారు. -
టెన్త్‌లో విద్యార్థుల సత్తా
జిల్లాలో పాఠశాలల వారీగా ఉత్తీర్ణత ఇలా... పాఠశాల హాజరైన పాసైన ఫెయిలైన వారు వారు వారు ఎయిడెడ్ 704 529 175 బీసీ వెల్ఫేర్ 109 106 3 ప్రభుత్వ 692 504 188 ట్రైబల్ వెల్ఫేర్ 36 33 3 మున్సిపల్ 1,425 1,078 347 ప్రైవేటు 10,102 9,871 231 ఏపీ ఆర్ఈఎస్ 83 83 0 సోషల్ వెల్ఫేర్ 368 359 9 జెడ్పీ 9,869 8,015 1,854 సాక్షి, రాజమహేంద్రవరం: పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో తూర్పుగోదావరి జిల్లా సత్తా చాటింది. 87.99 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో 6వ స్థానంలో నిలిచింది. గతేడాది ఫలితాల్లో 83.20 శాతం ఫలితాలతో 21వ స్థానంలో ఉన్న జిల్లా ఈ ఏడాది గణనీయ ప్రగతి సాధించి, 6వ స్థానాన్ని కై వసం చేసుకుంది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షలు రాసి ఉత్కంఠగా ఎదురుచూస్తున్న విద్యార్థులు ఫలితాలు విడుదలయ్యాయన్న సమాచారం అందిన వెంటనే వెబ్సైట్ల బాట పట్టారు. తల్లిదండ్రులు, విద్యార్థులు, పాఠశాలల ఉపాధ్యాయులు ఫలితాల అన్వేషణలో పడ్డారు. తమ పిల్లలకు ఫస్ట్ క్లాస్, ఉత్తమ మార్కులు సాధించారంటూ తమ ఆనందాన్ని బంధువులు, పిల్లలతో పంచుకున్నారు. ఉపాధ్యాయులు సైతం తమ పిల్లలు మంచి ఉత్తీర్ణత సాధించారంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. 87 శాతం ఉత్తీర్ణత తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 23,388 మంది విద్యార్థులు పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యారు. అందులో 20,578 మంది పాసయ్యారు. 2,810 మంది ఫెయిలయ్యారు. బాలికలు 10,268 (89.97 శాతం), బాలురు 10,310 (86.10 శాతం) మంది పాసైనట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో 72.83 శాతం ఉత్తీర్ణత సాధించగా.. ప్రైవేటు పాఠశాలల్లో 97.71 శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో 112 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. మిగిలిన వాటిల్లో సైతం మంచి ఫలితాలు వచ్చాయి. 95.67 శాతంతో అనపర్తి మండలం మొదటి స్థానంలో ఉండగా.. 76.7 శాతం ఉత్తీర్ణతతో చాగల్లు మండలం చివరి స్థానంలో ఉంది. మేనేజ్మెంట్ పాఠశాలల్లోనూ... ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ పాఠశాలల్లో సైతం ఈ ఏడాది ఉత్తీర్ణతా శాతం మెరుగ్గా ఉంది. ఎయిడెడ్ పాఠశాలల్లో 75.14 శాతం, బీసీ వెల్ఫేర్ 97.25, ట్రైబల్ వెల్ఫేర్‌లో అత్యధికంగా 91.67 శాతం, మున్సిపల్ 75.65 శాతం, ఏపీ ఆర్ఈఎస్ 100 శాతం, సోషల్ వెల్ఫేర్‌లో 97.55 శాతం, జిల్లా పరిషత్ 81.21 శాతం ఉత్తీర్ణత సాధించాయి. 16,846 మందికి ఫస్ట్‌క్లాస్ పదో తరగతి ఫలితాల్లో అత్యధిక శాతం మంది విద్యార్థులు మొదటి తరగతిలో పాసయ్యారు. 23,338 మంది పరీక్ష రాయగా.. 20,578 మంది పాసయ్యారు. అందులో 16,846 మంది మొదటి తరగతి, 2,411 మంది ద్వితీయ, 1,321 మంది తృతీయ తరగతిలో పాసయ్యారు. గత ప్రభుత్వ విధానాలతో.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విద్యా రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలతో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. విద్యార్థులు విద్యను అభ్యసించేందుకు అమ్మఒడి పథకంతో క్రమం తప్పకుండా ఆర్థిక సాయం చేపట్టింది. పాఠశాలలు తెరిచే సమయానికి జగనన్న విద్యాకానుక పథకంలో భాగంగా స్కూల్ బ్యాగులు, బూట్లు, బెల్టు ఇలా విద్యార్థికి అవసరమైన అన్ని వసతులు కల్పించింది. నాడు–నేడు పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దారు. పాఠశాలల్లో అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులు కల్పించింది. ప్రశాంత వాతావరణంలో విద్యను అభ్యసించే వెసులుబాటు కల్పించడంతో విద్యార్థులు విద్యపై దృష్టి సారించే అవకాశం దక్కింది. పక్కా ప్రణాళికతో విద్యాబోధన, అవసరమైన మేరకు ఉపాధ్యాయులను నియమించడం ఎంతగానో ఉపయుక్తంగా మారిందని విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర స్థాయి ఉత్తీర్ణత శాతంలో జిల్లా గణనీయ ప్రగతి ఊతమిచ్చిన గత ప్రభుత్వ విధానాలు, పథకాలు పది పరీక్షలు రాసిన విద్యార్థులు 23,388 ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు 20,578 ఫెయిల్ : 2,810 ఉత్తీర్ణత శాతం: 87.99 ఫస్ల్ క్లాస్: 16,846సెకండ్ క్లాస్ : 2,411 థర్డ్ క్లాస్ : 1,321 -
ధాన్యం కొనుగోలులో ఆంక్షలు తొలగించాలి
కొవ్వూరు: రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేసి అన్నదాతలను ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్, తలారి వెంకట్రావు డిమాండ్ చేశారు. ధాన్యం విక్రయించుకోవడంలో రైతులు ఎదుర్కొంటున్న అవస్థలపై వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో బుధవారం ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం ఈ– క్రాప్ ద్వారా ఎన్ని ఎకరాలు నమోదు చేస్తే అన్ని ఎకరాల్లో పండిన ధాన్యం అంతా ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఈ–క్రాప్ చేసిన ధాన్యం అంతా కొనుగోలు చేసిందని ఆయన గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఇంత వరకు కేవలం నలభై శాతం ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారన్నారు.రైతులకు తీవ్ర నష్టంప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయించి తక్కువ ధరకి ధాన్యాన్ని విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు. రూ.1,725 బస్తాను రైతు రూ.1,250 అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ లెక్కన రైతు ఎకరాకి రూ.15వేల నుంచి రూ.20వేల వరకు నష్టపోవాల్సి వస్తుందన్నారు. గతంలో సీజన్ ఆరంభానికి నెల రోజులు ముందే రైతు భరోసా పథకం కింద వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పెట్టుబడి సాయంగా రూ.13,500 అందజేసిందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రూ.20వేలు ఇస్తానని రైతులను నమ్మించి చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. కోకో పంటకు మద్దతు ధర లేక రైతులు అవస్థలు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అనంతరం ఆర్డీవో రాణి సుస్మితకు వినతిపత్రం అందజేశారు. మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ, తాళ్లపూడి ఎంపీపీ జొన్నకూటి పోసిరాజు, మాజీ ఏఎంసీ చైర్మన్ బండి పట్టాభి రామారావు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కంఠమణి రమేష్‌బాబు, జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు తోట రామకృష్ణ, మండల పార్టీ అధ్యక్షుడు చెల్లింకుల దుర్గామల్లేశ్వరరావు, సుంకర సత్యనారాయణ, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు గండ్రోతు సురేంద్రకుమార్ పాల్గొన్నారు. -
పత్రికా స్వేచ్ఛను కాపాడండి
కొవ్వూరు: ఏలూరు సాక్షి కార్యాలయంపై దాడి చేసి, సామగ్రి ధ్వంసం చేసిన నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కొవ్వూరు ప్రెస్ రిపోర్టర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. బుధవారం ఈ మేరకు ఆర్డీవో రాణి సుస్మితకు వినతిపత్రం అందజేశారు. పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, కార్యాలయాలపై దాడులను నియంత్రించాలని కోరారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ (ఏపీయుడబ్ల్యూజే) అనుబంధ సంస్ధ అయిన కొవ్వూరు ప్రెస్‌క్లబ్ ఈ దాడిని తీవ్రంగా ఖండించింది.ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు నల్లా స్వామి నాయుడు, ఉపాధ్యక్షుడు ఎస్వీవీ ఎస్ ప్రసాద్,గౌరవ అధ్యక్షుడు జీవీవీ సత్యనారాయణ, సంయుక్త, సహాయ కార్యదర్శులు జి.ఎర్రన్న, జి.రవికుమార్, మాజీ ప్రెస్‌క్లబ్ కార్యదర్శి ఏఎస్ ప్రకాష్,బి.భాను పాల్గొన్నారు. -
జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద దాడి అమానుషం
రాజమహేంద్రవరంసిటీ: ఉనికి కోసం అమాయక పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను తుద ముట్టించాలని, ఉగ్రవాదుల చేతిలో అసువులు బాసిన పర్యాటకుల ఆత్మలకు శాంతి చేకూర్చాలని వైఎస్సార్ సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో జమ్మూ కాశ్మీరులోని పహాలగాడ్ వద్ద పర్యాటకులపై జరిగిన దాడిని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. వేణుగోపాలకృష్ణ నాయకత్వంలో రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాండ్ జంక్షన్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించి ఉగ్రవాదుల చేతిలో అసువులు బాసిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని శాంతి ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వేణు మాట్లాడుతూ తమ ఉనికిని చాటుకునేందుకు ఉగ్రవాదులు అమాయక పర్యాటకులను హతమార్చారని, ప్రతి పౌరుడు ఈ దాడిని ఖండించాలన్నారు. ఉగ్రవాదాన్ని వైఎస్సార్సీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్నారు. మాజీ హోం శాఖ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ కాశ్మీర్లో పర్యాటకుల మీద కక్షపూరితంగా ఉగ్రవాదులు దాడులు చేయడం దారుణమైన విషయమన్నారు. మాజీ ఎంపీ, రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్‌రామ్ మాట్లాడుతూ ఉగ్రవాదులు పిరికిపంద చర్యలను దేశ పౌరులు ప్రతీ ఒక్కరూ వ్యతిరేకించాలన్నారు. మాజీ ఎమ్మెల్యే ,యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా మాట్లాడుతూ అమాయకుల మీద చేసిన దాడి చాలా బాధాకరమని భారత దేశంలో ఉన్న ప్రతి పౌరుడు దాడుల పట్ల స్పందించవలసిన అవసరం ఉందన్నారు. పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉగ్రవాద దాడి హేయం అన్నారు. మాజీ ఎమ్మెల్యే తలారి వెంకటరావు మాట్లాడుతూ ఉగ్రవాదంపై కేంద్రం కఠినంగా వ్యవహరించాలన్నారు. ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి మాట్లాడుతూ ఈ దాడి ప్రతి పౌరుడినీ కన్నీరు పెట్టించిందన్నారు. డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, నందెపు శ్రీను,తోట రామకృష్ణ, అడపా అనిల్, అన్ని నియోజక వర్గాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు వేణు ఉగ్రవాద దాడిని నిరసిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ -
వేలివెన్ను శశి.. ఫలితాలలో మేటి..
ఉండ్రాజవరం: శశి వేలివెన్నుకు చెందిన విద్యార్థులు పదో తరగతిలో అత్యుత్తమ ఫలితాలు, మార్కులు సాధించారని శశి విద్యాసంస్థల చైర్మన్ బూరుగుపల్లి రవికుమార్ బుధవారం తెలిపారు. జయవరపు ఉజ్వల్ కృష్ణసాయి, పడాల పడాల సహస్ర అక్షయ రెడ్డి 595 మార్కులు, తోట హేమాంజలి, మేడిద వర్షిత 594 మార్కులు, షేక్ చాందిని, బవిరిశెట్టి సాయి అక్షయ్, రాగోలు రామ్ కిరణ్ 592 మార్కులు, ఆలపాటి నిషిత 591 మార్కులు, కోడి వైష్ణవి దుర్గ, జెంగం రోహిత్, సుంకవల్లి శ్రీకర్, చిర్ల దేవిశ్రీప్రియ, పెంకే చేతన్ సాయి ఆశ్వర్, గుణ్ణం సింధు ప్రియ 590 మార్కులు సాధించారన్నారు. 580కి పైగా 84 మంది, 550కి పైగా 342 మంది, 500కి పైగా 636 మంది విద్యార్థులు మార్కులు సాధించారని తెలిపారు. ఆ విద్యార్థులను, అధ్యాపక బృందాన్ని రవికుమార్ తో పాటు వైస్ చైర్మన్ బూరుగుపల్లి లక్ష్మీసుప్రియ, ప్రిన్సిపాల్ షేక్ షానూర్ అభినందించారు. -
ఫొటో స్డూడియోలే వీరి టార్గెట్
దేవరపల్లి: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దుకాణాలు, ఫొటో స్టూడియోల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను దేవరపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాలోని ఆరుగురు సభ్యుల్లో ఒకరు మహిళ కావడం విశేషం. దేవరపల్లి పోలీస్ సర్కిల్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ బి.నాగేశ్వర్ నాయక్ ఆ వివరాలు వెల్లడించారు. గుంటూరుకు చెందిన షేక్ సమీర్ (పైజల్), విజయవాడలోని ప్రసాదంపాడుకు చెందిన అల్లాడి నాగమణికంఠ ఈశ్వర్(మణి), తెలంగాణాలోని కోదాడ మండలానికి చెందిన నాగదాసరి ఒమెసిన్మస్(సిమ్), చిలకలూరిపేటకు చెందిన రామిశెట్టి దేవీ ప్రసాద్, కోదాడకు చెందిన మునగంటి గోపి, పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడుకు చెందిన కొల్లి వెంకట సూర్యసత్యమణిసాయి ముఠాగా ఏర్పడి పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్నారు. వీరందరూ విజయవాడలో కారును అద్దెకు తీసుకుని దొంగతనాలకు ఉపయోగిస్తున్నారు. ఈ నెల 17వ తేదీ తెల్లవారుజామున 3 గంటల సమయంలో దేవరపల్లి మెయిన్ రోడ్డులోని ఆర్కే డిజిటల్ స్టూడియోలో, నిడదవోలులోని రెండు ఫొటో స్టూడియోల్లో దొంగతనం చేశారు. రెండుచోట్లా కెమెరాలు, కంప్యూటర్ పరికరాలు, రెండు హార్డ్ డిస్కులు, ప్రింటర్ దొంగిలించారు. ఈ చోరీలపై దేవరపల్లి, నిడదవోలు పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అద్దె కారులో రెక్కీ.. ముఠా సభ్యులందరూ ఒక కారును అద్దెకు తీసుకుని దాని నంబర్ ప్లేటు తీసేస్తారు. దొంగతనం చేయబోయే ప్రదేశంలో రెక్కీ నిర్వహిస్తారు. కొన్ని షాపులు, ఇళ్లను ఎంపిక చేసుకుని రాత్రి సమయంలో ఇనుపరాడ్డులను ఉపయోగించి షట్టర్లు, తాళాలను బద్దలుకొట్టి దొంగతనం చేస్తారు. దేవరపల్లిలో జరిగిన దొంగతనానికి సంబంధించి జరుగుతున్న దర్యాప్తులో భాగంగా బుధవారం ఎస్సై వి.సుబ్రహ్మణ్యం స్థానిక డైమండ్ జంక్షన్ వద్ద ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద రూ.5 లక్షల విలువైన కెమెరాలు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకుని, అరెస్ట్ చేసి కొవ్వూరు కోర్టుకు హాజరుపర్చిచారు. దొంగతనాలకు ఉపయోగిస్తున్న కారు, బుల్లెట్ వాహనాన్ని సీజ్ చేసినట్టు ఆయన తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో గోపాలపురం ఎస్సై కె.సతీష్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ భీమరాజు, కానిస్టేబుళ్లు బాలచంద్రరావు, సలీం, పండు, దుర్గారావు, గోపాలపురం స్టేషన్ సిబ్బంది కుమారస్వామి, గోవింద్, నాగేంద్ర, వెంకట్ ఎంతో సహకరించారన్నారు. నిందితులపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నట్టు తెలిపారు. విలువైన కెమెరాల చోరీ ఆరుగురు ముఠా సభ్యుల్లో ఒకరు మహిళ అరెస్టు చేసిన దేవరపల్లి పోలీసులు -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి)గండేరా (వెయ్యి) 20,000 గటగట (వెయ్యి) 18,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 19,000 గటగట (వెయ్యి) 17,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
శ్రీ ప్రకాష్ విద్యార్థుల అత్యున్నత ప్రతిభ
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో శ్రీ ప్రకాష్ విద్యార్థులు అత్యున్నత ప్రతిభ కనబరిచారు. నందవరపు భానుతేజస్ 594, సామిరెడ్డి గీతిక 593, కడిమి అర్చన 592, ఎస్.రుత్విక 592, ఎం.స్నేహిత్ 590 మార్కులు సాధించారని పాఠశాల డైరెక్టర్ సీహెచ్ విజయ్ ప్రకాష్ తెలిపారు. 550కు పైగా 91 మంది, 500కు పైగా 155 మంది మార్కులు సాధించి నూరుశాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. ఆ విద్యార్థులను శ్రీ ప్రకాష్ విద్యాసంస్థల అధినేత నరసింహారావు, ప్రిన్సిపాల్ మూర్తి అభినందించారు. ఆదిత్య విద్యాసంస్థల విజయభేరి బాలాజీచెరువు (కాకినాడ సిటీ): పదో తరగతి ఫలితాల్లో తమ విద్యార్థులు ఏబీబీవీ సత్యసూర్యతేజ, బి.మహిత్నాయక్ 596 మార్కులు సాధించారని ఆదిత్య విద్యాసంస్థల డైరక్టర్ ఎన్.శృతిరెడ్డి బుధవారం తెలిపారు. తమ విద్యాసంస్థల నుంచి 590కి పైగా 53 మంది, 550కు పైగా 465 మంది మార్కులు సాధించారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ శేషారెడ్డి,డైరక్ట్ ఎస్వీ రాఘవరెడ్డి అభినందించారు. బాలికపై యువకుడి లైంగిక దాడి అన్నవరం: అన్నవరంలో పదేళ్ల బాలికపై 20 ఏళ్ల యువకుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక పెట్రోల్ బంకు వెనుక గల ఒక ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలికను పక్కింటి ఆమె దుకాణానికి వెళ్లి పంచదార తెమ్మని పంపించింది. ఆ బాలిక దుకాణానికి వెళ్లి పంచదార కొనుగోలు చేసి ఇంటికి తెచ్చింది. ఆ సమయంలో పక్కింటి ఆమె ఇంట్లో లేదు. ఆమె కొడుకు 20 ఏళ్ల కొల్లు సతీష్ ఉన్నాడు. అతడు ఆ పంచదార వంటింట్లో పెట్టాలని చెప్పాడు. బాలిక వంటింట్లోకి వెళ్లగానే తలుపునకు గెడపెట్టి ఆ బాలిక మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం బాలిక తల్లికి ఆలశ్యంగా తెలియడంతో బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెద్దాపురం డీఎస్పీ శ్రీహరి రాజు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీహరి బాబు తెలిపారు. సుమారు 15 రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
శ్రీచైతన్య విద్యార్థుల ప్రభంజనం
రాజమహేంద్రవరం రూరల్: పదో తరగతి పరీక్ష ఫలితాలలో శ్రీచైతన్య విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారని శ్రీచైతన్య విద్యాసంస్థల రాజమండ్రి సిటీ బ్రాంచెస్ రీజినల్ ఇన్చార్జి వి.ఉదయ్ శంకర్ తెలిపారు. రాజమండ్రి మోరంపూడి బ్రాంచి విద్యార్థి 593 మార్కులతో మొదటి స్థానం, దివాన్ చెరువు బ్రాంచి విద్యార్థి కేటీఎస్ పార్వతి, ఆర్యాపురం బ్రాంచి విద్యార్థి ఎన్.జోష్మ 592 మార్కులతో ద్వితీయ స్థానం, 591 మార్కులతో బొమ్మూరు బ్రాంచి విద్యార్థి వీపీఎన్ తేజస్వి, 590 మార్కులతో సీతంపేట బ్రాంచ్ విద్యార్ధి గాయత్రి రాజ్యలక్ష్మి తరువాత స్థానాల్లో నిలిచారన్నారు. కోస్తా ఆంధ్ర ఎగ్జిక్యూటివ్ ఏజీఎం ఎంవీ సురేష్ విద్యార్థులను, తల్లితండ్రులను, ఉపాధ్యాయులను అభినందించారు. రాజమండ్రి సిటీ శ్రీ చైతన్య పాఠశాలల ప్రిన్సిపాళ్లు, అకాడమిక్ కో ఆర్డినేటర్ అరుణ్ కుమార్, డీన్లు, ఇన్చార్జిలు, ఉపాధ్యాయులు విద్యార్థులకు, తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. -
ఇండియన్ బ్యాంక్ జోనల్ మేనేజర్‌గా రాజ్‌కుమార్
రాజమహేంద్రవరం సిటీ: ఇండియన్ బ్యాంక్ జోనల్ మేనేజర్‌గా కత్తుల రాజ్‌కుమార్ బుధవారం రాజమహేంద్రవరంలోని జోనల్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఆయన కరీంనగర్ జోన్ నుంచి పదోన్నతిపై ఇక్కడకు బదిలీపై వచ్చారు. రాజమహేంద్రవరం జోన్ పరిధిలోని కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లోని 64 శాఖలకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తారు. ఇప్పటి వరకు జోనల్ కార్యాలయం పరిధిలో రూ.10,037 కోట్ల వరకు వ్యాపారం జరిగినట్లు బ్యాంక్ వర్గాలు తెలిపారు. తిరుమల విద్యాసంస్థల జయకేతనం రాజమహేంద్రవరం రూరల్: తిరుమల ఇంగ్లిషు మీడియం స్కూల్ విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో విజయభేరి మోగించారని ఆ విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు తెలిపారు. ఉప్పాల జశ్వంత్ పవన్, సీహెచ్ సుహ్రుత భరద్వాజ్, 596మార్కులు, దేవిరెడ్డి చైతన్య సహస్ర, చాగంటి లాస్ట హర్షిత, సారిక నందిని 595 మార్కులు, మేకా వంశిత, ఈడుపుగంటి దివ్యశ్రీ, బార సాత్విక, కూర్మాల తారకసాయి సూర్యఫణిశ్రీ వసంత్, లోట్ల హన్సుజ 594 మార్కులు చొప్పు సాధించారన్నారు. 590పైన 41 మంది, 580 పైన 326 మంది, 570 పైన 652 మంది, 560 పైన 900 మంది, 550 పైన 1078 మంది, 500 పైన 1,458 మంది విద్యార్థులు మార్కులు సాధించారన్నారు. అలాగే నూరుశాతం ఉత్తీర్ణత నమోదైందన్నారు. అత్యధిక మార్కులు వచ్చిన విద్యార్థులను నున్న తిరుమలరావు, డైరెక్టర్ నున్న సరోజనీదేవి, అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్‌బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరి అభినందించారు. -
పది ఫలితాల్లో విద్యార్థుల ప్రతిభ
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): పదవ తరగతి ఫలితాల్లో తమ పాఠశాల విద్యార్థులు కె.లాస్య, ఎంఎల్పీ సమన్విత 595 మార్కులు సాధించి ప్రతిభ చూపారని ప్రగతి విద్యాసంస్థల చైర్మన్ నూతలపాటి పూర్ణచంద్రరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీహెచ్.మధుమిత, జి.భువన 592 మార్కులు, జి.హిమబిందుసాయి, జీటీఎస్ హృతిక. కేవీ రాఘవ 591 మార్కులు సాఽధించారన్నారు. గణితం, సైన్స్‌లో వందకు వంద మార్కులు వచ్చాయని తెలిపారు. 591 మార్కులకు పైగా 7గురు, 580కు పైగా 21మంది, 570కు పైగా 41మంది, 560కు పైగా 62 మంది, 550కి పైగా 89 మంది, 540కు పైగా 114 మంది మార్కులు సాధించారన్నారు. -
పుస్తకం.. మహోన్నతం
● అక్షరమే అసలైన సంపద ● సమాజానికి వెలుగునిచ్చే దీపం ● పుస్తక రచనలో ఉమ్మడి జిల్లాకు ప్రత్యేక స్థానం ● నేడు ప్రపంచ పుస్తక దినోత్సవం సంతోషంగా ఉంది చదువుకునే రోజుల్లో సామాజిక ఉద్యమాలకు ఆకర్షితుడినై విద్యార్థి, యువజన సంఘాల్లో పని చేశాను. గత కాలపు ఉద్యమాలను గ్రంథస్తం చేయాలన్న నా కోరిక ఇటీవల తీరింది.‘నవ సమాజం కోసం’ పేరుతో నేను రాసిన పుస్తకం ఈ ఏడాది మార్చి 9న కాకినాడలో ఆవిష్కృతమై ఆదరణ పొందింది. – దువ్వా శేషబాబ్జీ, కాకినాడ కపిలేశ్వరపురం: సమాజానికి వెలుగునిచ్చేది అక్షరం. అది పుస్తకాల రూపంలో ప్రజల చెంతనే ఉంటుంది. అలాంటి పుస్తకాలు రూపొందించడానికి ఎందరో మహానుభావులు అక్షర సేద్యం చేస్తున్నారు. సమాజంలో విజ్ఞాన జ్యోతులు వెలిగించడానికి కృషి చేస్తున్నారు. పుస్తక రచనలో దారులెన్ని ఉన్నా సామాజిక ప్రయోజనమే అంతిమ లక్ష్యం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అనేక పుస్తక ప్రచురణా సంస్థలు, రచయితలు, కవులు సామాజిక ఉద్యమకారులు అలనాటి కందుకూరి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. మారుతున్న మానవ సమాజ పోకడలకు తమ రచనల ద్వారా అద్దంపడుతున్నారు. సమాజ హితం కోరుతూ సాగుతున్న పుస్తక ప్రచురణ, రచన తదితర అంశాలపై నేడు ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. పుస్తక దినోత్సవ నేపథ్యం ప్రపంచంలో సామాజిక సమస్యలు పెరిగిపోతున్న నేపథ్యంలో యునెస్కో స్పందించి పుస్తక పఠన ఆవశ్యకతను గుర్తించాలని ప్రపంచ దేశాలకు సూచించింది. కనుమరుగవుతున్న పుస్తక సంపదను కాపాడుకోవడానికి, భవిష్యత్తు తరాలకు జ్ఞానాన్ని పంచేందుకు యునెస్కో ఏప్రిల్ 23 ను ప్రపంచ పుస్తక దినోత్సవంగా ప్రకటించింది. ఆ రోజున సదస్సులు, సమావేశాలు, పరిశోధనాపరమైన అంశాలపై చర్చలు చేపట్టాలని సూచించింది. ఉమ్మడి జిల్లాకు ప్రత్యేక స్థానం రాజమహేంద్రవరం కేంద్రంగా సాహితీ సేవలు విస్తారంగా సాగేవి. సమాజంలో దుర్మార్గాలు పెరిగిపోయినప్పుడల్లా పుస్తకమే ప్రజలను మేల్కొలిపేది. ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం ‘నీతి కథామంజరి’ పేరుతో 158 కథలను సంకలనం చేస్తూ రాసిన పుస్తకం సీ్త్రల సమస్యలను వెలుగులోకి తెచ్చింది. ఆనాటి నుంచి నేటికీ జిల్లాలో సాహిత్య కృషి కొనసాగుతోంది. రాజమహేంద్రవరంతో పాటు కాకినాడ, పిఠాపురం, పెద్దాపురం, రామచంద్రపురం కొత్తపేట, అమలాపురం, యానాం ప్రాంతాల్లో పలు సాహితీ సంస్థలు, స్మారక సంస్థల ద్వారా పుస్తక ప్రచురణ, రచన, పఠన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పరిశోధనలకు చేదోడు చారిత్రక, సామాజిక అంశాలపై పరిశోధనలు చేసేవారికి జిల్లాలోని రూపుదిద్దుకున్న పుస్తకాలు దోహదపడతాయి. రాజమహేంద్రవరంలోని గౌతమి గ్రంథాలయం ఎంతో చారిత్రాత్మకమైంది. హైదరాబాద్ తెలుగు విశ్వ విద్యాలయానికి అనుబంధంగా నడుస్తున్న బొమ్మూరులోని తెలుగు సాహిత్యపీఠంలో సుమారు 50 వేల అరుదైన పుస్తకాలు ఉన్న గ్రంథాలయం ఉంది. కపిలేశ్వరపురం జమీందారీ దివాణం గ్రంథాలయంలోని పుస్తకాలను అధ్యయనం చేసిన పలువురు పీహెచ్డీ పట్టాలను పొందారు. సాంకేతికత తోడుగా.. పెరిగిన సాంకేతికతను పుస్తక పఠనం పెంచడానికి వినియోగించుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలోని అనేక మంది సామాజిక మాధ్యమాల్లో సాహిత్య గ్రూపులను ఏర్పాటు చేసి పుస్తకాల్లోని అంశాలపై చర్చలు జరుపుతున్నారు. కపిలేశ్వరపురం మండలం అంగరకు చెందిన పెద్దింశెట్టి రామకృష్ణారావు 250 మందితో పుస్తకం పేరుతో గ్రూపు ఏర్పాటు చేసి పుస్తకాలపై చర్చిస్తున్నారు. విజయవాడ, విశాఖపట్టణం కేంద్రంగా నడుస్తున్న మంచి పుస్తకం వాట్సాప్ గ్రూపుల్లో మన జిల్లాకు చెందిన అనేక మంది భాగస్వాములయ్యారు. పుస్తక రచన భార్య జ్ఞాపకార్థం మహనీయుల కృషికి అక్షర రూపం పలు రచనలు పుస్తకాన్ని రాయడమంటే పెద్ద చదువులు చదవాలనో, గ్రంథాలయాల్లో గంటల తరబడి గడపాలనో అనుకొంటే పొరబాటే. తన చుట్టూ జరుగుతున్న సంఘటనలకు అక్షర రూపం ఇస్తే చాలు. అలాంటి వారిలో రాజమహేంద్రవరానికి చెందిన దేవగుప్తపు పేరలింగం ఒకరు. ఆయన 13 పుస్తకాలను రచించగా వాటిలో కొన్నింటిని స్వతంత్రంగా ప్రచురించారు. తన సైకిల్‌కు ‘హేతువాద చైతన్య రథం’ అనే పేరుపెట్టి మూడు దశాబ్దాలకు పైగా సైన్స్, సామాజిక భావాలను ప్రచారం చేశారు. 82 ఏళ్ల వయసులో 2014 ఏప్రిల్ 14న తుదిశ్వాస విడిచే వరకూ తన ఇంటినే సైన్స్ గ్రంథాలయంగా నడిపారు. కాకినాడకు చెందిన రావు కృష్ణారావు మానవ సమాజ పరిణామ క్రమాన్ని నిర్దేశించే చలన సూత్రాలను విశ్లేషిస్తూ అనేక రచనలు చేశారు. రామచంద్రపురంలోని డాక్టర్ చెలికాని రామారావు స్మారక సమితి నిర్వాహకుడు డాక్టర్ చెలికాని స్టాలిన్ ప్రోత్సాహంతో ఈయన రచనలు అనేకం వెలుగులోకి వచ్చాయి. ఆధునిక బేతాళ కథలు, బతుకు పోరు కథా సంకలనం పుస్తకాలు తెలుగు పాఠకులను ఆలోచింపజేశాయి. కాకినాడ జిల్లా జగన్నాథగిరికి చెందిన ప్రజా నాట్యమండలి నాటక కళాకారుడు పోలిశెట్టి రామకృష్ణ తన భార్య జ్ఞాపకార్థం ఏడాదికో పుస్తకాన్ని వెలుగులోకి తీసుకొస్తున్నారు. పోలిశెట్టి అమ్మాజీ స్మారక సమితి పేరుతో సొంత ఖర్చులతో గత కాలపు ప్రఖ్యాత పుస్తకాలను ఆధునిక సాంకేతికతతో అచ్చు వేయించి ఉచితంగా అందజేస్తున్నారు. కవితా రావు ఇంగ్లిష్ రచన లేడీ డాక్టర్స్ పుస్తకాన్ని కాకినాడకు చెందిన డాక్టర్ పీఎస్ ప్రకాశరావు అదే పేరుతో తెలుగులోకి అనువదించారు. ఆనందిబాయి, కాదంబినీ గంగూలీ, రుక్మాబాయి రౌత్, హైమవతి సేన్, ముత్తు లక్ష్మీరెడ్డి, మేరీ పూనాన్ లూకోస్.. వైద్య వృత్తిని చేపట్టే క్రమంలో ఎదుర్కొన్న సామాజిక, సాహసోపేతమైన ఘటనలెన్నో ఆలోచింపజేస్తాయి. ఈ నెలలో ‘పరిచయాలు–సమీక్షలు’ పేరుతో మరో పుస్తకాన్ని తీసుకొచ్చారు. -
ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి
దేవరపల్లి: ఉపాధి పనులు చేస్తున్న కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. దేవరపల్లి మండలం బందపురంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన 45 మంది కూలీలు బందపురం–గొల్లగూడెం రోడ్డులో నీటి బోదెలు తవ్వుతున్నారు. ఆ సమీపంలోని చెట్టుపై ఉన్న తేనెటీగలు మూకుమ్మడిగా వారిపై దాడి చేశారు. దీంతో కూలీలు భయంతో పరుగులు తీశారు. తేనెటీగల దాడిలో సుంకర గంగరాజు తీవ్రంగా గాయపడ్డాడు. అతడికి దేవరపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు చికిత్స చేశారు. గంగరాజు కోలుకున్నాడని, ఎటువంటి ప్రమాదం లేదని ఏపీఏ ఆర్వీ శ్రీనివాసరావు తెలిపారు. కాకినాడ బార్ అధ్యక్షుడిగా సుబ్రహ్మణ్యం కాకినాడ లీగల్: కాకినాడ బార్ అసోసియేషన్ 2025–26 సంవత్సరం ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా జరిగాయి. అనంతరం అర్ధరాత్రి వరకూ కౌంటింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఏలూరి సుబ్రహ్మణం విజయం సాధించారు. జనరల్ సెక్రటరీగా చెక్కపల్లి వీరభద్రరావు (చంటి), ఉపాధ్యక్షుడిగా పెన్మెత్స రామచంద్రరాజు, జాయింట్ సెక్రటరీగా బండి నరేంద్ర, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా జోకా వీఎస్ విజయకుమార్, లైబ్రరీ సెక్రటరీగా మేడపాటి రామారెడ్డి, కోశాధికారిగా కోకా వెంకట కృష్ణారావు, లేడీస్ రిప్రజెంటీవ్‌గా జి.దివ్య శ్రీవిద్య, సీనియర్ కమిటీ మెంబర్‌గా నక్కా సంజీవ్ కుమార్, జూనియర్ కమిటీ సభ్యులుగా మర్ల ప్రవల్లిక, గుత్తుల మంగరాజు, షేక్ ప్రేమ్ నజీర్, దుళ్ల నాగబాబు విజయం సాధించారు. మొత్తం 1,160 ఓట్లకు గాను 1,013 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. సూపర్ సీనియర్ కమిటీ మెంబర్‌గా వేగుళ్ల వెంకట రమణమూర్తి, మహిళా కమిటీ మెంబర్‌గా కె.శ్రీవాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పామాయిల్ తోట దగ్ధంగోపాలపురం: విద్యుత్ హైటెన్షన్ తీగలు తగిలి సుమారు మూడెకరాల పామాయిల్ తోట దగ్ధమైన సంఘటన మంగళవారం గోపాలపురం గ్రామ శివార్లలో జరిగింది. గ్రామానికి చెందిన రైతు పోతుల రాజేష్ రెడ్డికి చెందిన పామాయిల్ తోటలో అంతర పంటగా అరటితోటను వేశారు. సాయంత్రం వీచిన ఈదురు గాలులకు పామాయిల్ తోట ఆకులు హైటెన్షన్ తీగలకు తగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సుమారు మూడు ఎకరాల తోట పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనలో సుమారు రూ.3 లక్షల ఆస్తినష్టం సంభవించింది. -
చేబ్రోలులో వ్యాధుల విజృంభణ
● వాంతులు, విరేచనాలతో పలువురికి అస్వస్థత ● ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులు ● గ్రామంలో వైద్య సిబ్బంది సర్వే పిఠాపురం: గొల్లప్రోలు మండలం చేబ్రోలులో రోగాలు ప్రబలి పలువురు అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, వాంతులు, విరేచనాలు, కీళ్ల నొప్పులు, రొంప, జలుబు, దగ్గు వంటి వ్యాధులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేబ్రోలు ప్రభుత్వ ఆస్పత్రితో పాటు గొల్లప్రోలు, పిఠాపురాల్లోని ప్రైవేటు ఆస్పత్రులలో వీరందరూ చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు వైద్య సిబ్బంది గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి బాధితులకు చికిత్స అందిస్తున్నామని పీహెచ్సీ వైద్యుడు జగదీష్ తెలిపారు. కారణమేమిటో! ఇటీవల పక్క మండలంలో జరిగిన ఒక శుభ కార్యానికి వెళ్లిన కొందరు అస్వస్థతకు గురయ్యారు. అలాగే గ్రామంలో జరిగిన వివిధ శుభకార్యాలలో భోజనాలు చేసిన వారికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో ఫుడ్ పాయిజన్ కావడమే దీనికి కారణమని భావిస్తున్నారు. స్థానికంగా వేసిన కొత్త బోరులోని నీరు తాగడం వల్ల వ్యాధులు ప్రబలాయని మరికొందరు చెబుతున్నారు. దీంతో ఆ నీటికి పరీక్షలు చేయించిన వైద్యాధికారులు, నీటి వల్ల కాదని చెబుతున్నారు. మాంసాహారం ఎక్కువగా తినడం వల్ల ఇలా జరిగి ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. గ్రామంలో సుమారు వంద మంది అనారోగ్యానికి గురైనట్టు గుర్తించామని వైద్య సిబ్బంది చెబుతుండగా, వారి సంఖ్య మరో వంద వరకూ ఉంటుందని గ్రామస్తులు అంటున్నారు. వాతావరణ మార్పులు, ఎండల తీవ్రత వల్ల కూడా ఇలా రోగాలు విజృంభించే అవకాశం ఉందని వైద్యాధికారులు అన్నారు. కాగా.. గ్రామంలో వ్యాధుల విజృంభణపై జెడ్పీటీసీ ఉలవకాయల నాగ లోవరాజు వైద్యులను ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. -
ఐపీఎస్ అధికారిగా సమాజ సేవ చేస్తా
పిఠాపురం: ఐపీఎస్ అధికారిగా సమాజ సేవ చేస్తానని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 94 ర్యాంకర్ చెక్క స్నేహిత్ తెలిపారు. పిఠాపురానికి చెందిన ఈ యువకుడి ఘనతను ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. ఈ సందర్భంగా స్నేహిత్ మాట్లాడుతూ చిన్ననాటి నుంచి తనకు ఐపీఎస్ అవ్వాలనే కోరిక ఉండేదని, అదే లక్ష్యంగా చదువుకున్నానన్నారు. తన విజయం వెనుక తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉందన్నారు. తల్లి మాధురి కుమునిది గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్నారని, తండ్రి వెంకట్ చిన్న వ్యాపారవేత్త అని తెలిపారు. కాగా..స్నేహిత్ ఐదో తరగతి వరకు పిఠాపురంలోని ఆదర్శ విద్యాలయలో చదువుకున్నాడు. ఆరో తరగతి నుండి ఇంటర్ వరకూ గుంటూరులోని భాష్యం విద్యాసంస్థల్లో చదివాడు. ఎంసెట్‌లో 31వ ర్యాంకు సాధించి, గుజరాత్లో ఎలక్ట్రికల్ ఇంజినీర్‌గా ఉత్తీర్ణుడయ్యాడు. సివిల్స్‌లో ఆప్షనల్ సబ్జెక్టుగా మ్యాథ్య్ తీసుకున్నాడు. ఢిల్లీలో కోచింగ్ తీసుకోవడంతో పాటు సొంతంగా చదివి సివిల్స్‌లో 94 ర్యాంకు సాధించాడు. చిన్ననాటి నుంచే చదువులో మేటికొవ్వూరు: నిడదవోలు విద్యుత్ డివిజన్ పరిధిలో కొవ్వూరు టౌన్ ఏఈ(డీ–1)గా పనిచేస్తున్న దొమ్మేటి జగదీశ్వరరావు కుమారుడు దొమ్మేటి వినయ్ 2024 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీస్‌లో 274వ ర్యాంకు సాధించాడు. జగదీశ్వరరావు రెండో కుమారుడు అయిన వినయ్ చిన్ననాటి నుంచే చదువులో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాడు. పదో తరగతిలో పదికి 9.8 శాతం మార్కులు, ఇంటర్మీడియెట్‌లో 1000కి 986 మార్కులు సాధించాడు. పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో నిట్‌లో బీటెక్ (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) పూర్తి చేసి, పదికి 8.8 శాతం మార్కులు దక్కించుకున్నాడు. యూపీఎస్సీలో మూడోసారి ప్రయత్నించి 274వ ర్యాంకు సొంతం చేసుకున్నాడు. ఇదంతా తన తల్లిదండ్రుల సహకారం, ప్రోత్సాహంతో సాధించానని వినయ్ చెబుతున్నాడు. జగదీశ్వరరావు మొదటి కుమారుడు సాయి సంతోష్ ఎంఎస్ పూర్తి చేసి ప్రస్తుతం జర్మనీలో ఉద్యోగం చేస్తున్నాడు. వినయ్ తల్లి దుర్గ గృహిణి. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే విజయం యూపీఎస్సీ 94 ర్యాంకర్ స్నేహిత్ -
పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
పెరవలి: పెళ్లి విషయంలో భార్య, కుమార్తె తన మాట వినడం లేదనే మనస్తాపంతో ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై ఎం.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. ముక్కామల గ్రామానికి చెందిన కమాడి ధర్మారావు (40)కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు పెళ్లి చేయాలని నిర్ణయించుకుని ఇటీవల ఓ సంబంధం తీసుకువచ్చాడు. అయితే భార్య, కుమార్తెలకు ఆ సంబంధం నచ్చలేదు. దీంతో నెల రోజులుగా వారికి నచ్చచెబుతూ వస్తున్నాడు. అయినా వారు ఒప్పుకోకపోవడంతో మనస్తాపం చెందిన ఈ నెల 20వ తేదీ పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే అతడిని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. భార్య కమాడి సావిత్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కల్యాణము చేతము రారండీ..
ఫ సత్యదేవుని కల్యాణోత్సవాలకు సన్నాహాలు ఫ నేడు దేవస్థానం, ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశం ఫ పలు అంశాలపై చర్చ అన్నవరం: సత్యదేవుని వార్షిక దివ్య కల్యాణ మహోత్సవాల దిశగా అధికారులు ఎట్టకేలకు అడుగులు వేస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై దేవస్థానం, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో రత్నగిరిపై బుధవారం సమన్వయ సమావేశం నిర్వహిస్తున్నారు. కల్యాణోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులతో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యే అవకాశం ఉన్నందున ఎటువంటి ఏర్పాట్లు చేయాలనే అంశాలపై ఈ సందర్భంగా సమీక్షించనున్నారు. పెద్దాపురం ఆర్డీఓ రమణి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశంలో పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు, దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొంటారు. ఉత్సవాలకు దేవస్థానం తరఫున చేపట్టే ఏర్పాట్లను ఈఓ ఈ సమావేశంలో వివరించనున్నారు. వీటిపై దృష్టి పెడితే మేలు ఫ వచ్చే నెల 7 నుంచి 13వ తేదీ వరకూ కల్యాణోత్సవాలు జరగనున్నాయి. 8వ తేదీ రాత్రి 9.30 గంటలకు సత్యదేవుని దివ్యకల్యాణం నిర్వహిస్తారు. దీనికి 10 వేల మందికి పైగా భక్తులు హాజరయ్యే అవకాశముంది. అయితే, స్వామివారి వార్షిక కల్యాణ వేదిక ముందున్న విశ్రాంతి షెడ్డులో సుమారు 2 వేల మంది మాత్రమే తిలకించే అవకాశం ఉంది. ఆ షెడ్డుకు ఇరువైపులా ఉన్న ఆవరణలో స్వామివారి కల్యాణాన్ని తిలకించేలా పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేస్తే మిగిలిన భక్తులకు సౌకర్యంగా ఉంటుంది. ఫ భక్తులకు మంచినీరు, కల్యాణానంతరం అన్నదాన పథకంలో ఉచిత ఫలహారం రెండుమూడు చోట్ల పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఫలహారం ప్యాకెట్లు రూపంలో పంపిణీ చేస్తే భక్తులు వాటిని తీసుకుని వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. ఫ కల్యాణానంతరం ఉచిత ప్రసాదం, తలంబ్రాలు ఒకేచోట మాత్రమే పంపిణీ చేస్తూండటంతో ఏటా భక్తుల తోపులాట జరుగుతోంది. అలా కాకుండా స్వామివారి సర్క్యులర్ మండపంతో పాటు మరో రెండుచోట్ల పంపిణీ చేయడం మేలు. ఫ భక్తులు భారీగా వచ్చే అవకాశమున్నందున వారిని నియంత్రించేందుకు సుమారు 500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయాలి. ఫ సత్యదేవుని దివ్యకల్యాణం జరిగే మే 8న ట్రాఫిక్ క్రమబద్ధీకరించాలి. చిన్న, ద్విచక్ర వాహనాలు మినహా మిగిలిన వాటిని సాధ్యమైనంత వరకూ కొండ దిగువనే నిలిపివేయాలి. భక్తులను కొండ మీదకు తరలించేందుకు సుమారు 20 బస్సులు వినియోగించాల్సిన అవసరం ఉంటుంది. ఫ పశ్చిమ, తూర్పు రాజగోపురాల పరిసరాల్లోని పార్కింగ్ స్థలాల వద్ద భక్తుల సౌకర్యార్థం ఎక్కువ సంఖ్యలో మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి. సుమారు వంద మంది అదనపు సిబ్బందితో పారిశుధ్య చర్యలు చేపట్టాలి. ఫ కల్యాణోత్సవాలు జరిగే ఏడు రోజులూ దేవస్థానానికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలి. ఫ ముందు జాగ్రత్తగా అగ్నిమాపక శకటంతో సిబ్బంది కల్యాణం రోజున రత్నగిరిపై ఉండాలి. ఫ ఉత్సవాల చివరి రోజైన మే 13న సత్యదేవుని శ్రీపుష్పయాగం స్వామివారి నిత్య కల్యాణ మండపంలో నిర్వహిస్తారు. ఆ కార్యక్రమం అనంతరం మహిళలకు రవికెల వస్త్రాలు పంపిణీ చేస్తున్న సమయంలో ఏటా గందరగోళం ఏర్పడుతోంది. దీని నివారణకు పక్కా చర్యలు చేపట్టాలి. ఫ ఇతర పెద్ద దేవస్థానాల్లో జరిగే ఉత్సవాల మాదిరిగానే సత్యదేవుని కల్యాణోత్సవాలకు కూడా చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్‌ను నియమిస్తే మేలు. మద్యం దుకాణాలు బంద్ చేయాలి గతంలో అన్నవరం మెయిన్ రోడ్డులో పాత బస్టాండ్ సమీపాన ఒకే ఒక్క మద్యం దుకాణం ఉండేది. ఈ ఏడాది బస్ కాంప్లెక్స్ వెళ్లే దారిలో మరో మద్యం దుకాణం కూడా ఏర్పాటు చేశారు. ఈ దుకాణాల ముందు నుంచే రథోత్సవం జరుగుతుంది. అందువలన కల్యాణోత్సవాలు జరిగే ఏడు రోజులూ అన్నవరంలో పంపా సత్రం వద్ద ఉన్న మద్యం దుకాణాలను 48 గంటల ముందు నుంచే బంద్ చేయించేందుకు చర్యలు తీసుకోవాలి. -
లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కరించాలి
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): వచ్చే నెల 10న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గంధం సునీత అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సమావేశ మందిరంలో ఆమె, ఆ సంస్థ కార్యదర్శి, ఒకటో అదనపు సీనియర్ సివిల్ జడ్జి బి.పద్మలు లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం చర్చించారు. పెండింగ్‌లో ఉన్న ఆయా సంస్థల సివిల్, కాంపౌండబుల్ క్రిమినల్ కేసులను గుర్తించి, ఆ జాబితాను జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు అందజేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. రాజీ పడదగిన అన్ని ఇతర కేసులనూ గుర్తించి, వాటి పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని అన్నారు. సమావేశంలో డీఆర్ఓ టి.సీతారామయ్య, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ బీఎస్ఎం వలి, డిప్యూటీ కమిషనర్ ఎస్వీ రమణ, ప్రభుత్వ న్యాయవాది సీహెచ్‌వీ ప్రసాద్ పాల్గొన్నారు. ఫైనాన్సియర్లు మ్యాపింగ్ చేసుకోవాలి అమలాపురం రూరల్: వాహనాల క్రయ విక్రయాలతో ప్రమేయం ఉన్న ఫైనాన్సియర్లు రవాణాశాఖ ప్రస్తుత వాహన్ సాఫ్ట్‌వేర్‌లో మ్యాపింగ్ చేసుకోవాలని జిల్లా రవాణాశాఖ అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు అన్నారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ ఇప్పటికే 60 శాతం ఫైనాన్సియర్ల మ్యాపింగ్ పూర్తయ్యిందని, మిగిలినవారు కూడా త్వరితగతిన పూర్తి చేసుకోవాలని ఆదేశించారు. -
పోప్ ఫ్రాన్సిస్ మరణం ప్రపంచానికి తీరని లోటు
దేవరపల్లి: రోమన్ కేథలిక్ అత్యున్నత మత గురువు పోప్ ఫ్రాన్సిస్ మరణం ప్రపంచానికి తీరని లోటని ఏలూరు మేత్రాసనం పీఠాధిపతి, విశాఖపట్నం అగ్రపీఠం అపోస్తోలిక పాలనాధికారి మోస్ట్ రెవరెండ్ జయరావు పొలిమెర అన్నారు. విశాఖపట్నం నుంచి మంగళవారం ఏలూరు వెళుతూ మార్గం మధ్యలో గౌరీపట్నం నిర్మలగిరి మేరీ మాత పుణ్యక్షేత్రంలో ఆయన కొద్దిసేపు ఆగారు. పోప్ ఫ్రాన్సిస్ చిత్రపటానికి బిషప్ జయరావు, పుణ్యక్షేత్రం డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ ఎస్.జాన్‌పీటర్ పూలమాల వేసి, నివాళులర్పించారు. మరణానికి కొన్ని గంటల ముందు పోప్ ఫ్రాన్సిస్ ఈస్టర్ పర్వదినాన భక్తులకు సందేశం ఇచ్చారని గుర్తు చేశారు. కరుణ, మానవత్వం, ఆధ్యాత్మిక ధైర్యానికి పోప్ ప్రతీక అని అన్నారు. కార్యక్రమంలో పుణ్యక్షేత్రం అన్నధాన ట్రస్ట్ చైర్మన్ కళ్ళే నాగేశ్వరరావు, పలువురు ఫాదర్లు పాల్గొన్నారు. -
ఆదికవి ఖ్యాతిని ఇనుమడింపజేయాలి
ఫ ఇన్‌కంట్యాక్స్ అదనపు కమిషనర్ మోహన్‌బాబు ఫ వేడుకగా నన్నయ వర్సిటీ ఆవిర్భావ దినోత్సవం రాజానగరం: ఆదికవి నన్నయ భట్టారకుని పేరిట ఏర్పడిన ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఖ్యాతిని మరింత ఇనుమడింపజేసే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని ఇన్‌కంట్యాక్స్ అదనపు కమిషనర్ ఎం.మోహన్‌బాబు అన్నారు. వర్సిటీ 19వ ఆవిర్భావ వేడుకలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పరిశోధన, ఆవిష్కరణలపై దృష్టి సారించి, భారతీయ సంస్కృతి, విభిన్న ఆలోచనలను గౌరవిస్తూ విద్యార్థులను ప్రపంచ పౌరులుగా తయారు చేయాలని సూచించారు. విద్యార్థులకు, అధ్యాపకులకు ధరిత్రీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మానవాళి మనుగడకు ప్రకృతి అందిస్తున్న వనరులను కాపాడుకుంటూ పర్యావరణ హితంగా ముందుకు సాగాలని అన్నారు. ఏటా 2.01 బిలియన్ టన్నుల ఘన వ్యర్థాలు ఉత్పత్తి అవుతుంటే, 13 మిలియన్ హెక్టార్లలో అటవీ ప్రాంతం పోతుందని చెప్పారు. మనిషి సృష్టిస్తున్న విధ్వంసంతో ఒక మిలియన్ జాతులు అంతరించిపోయే ప్రమాదం ఉందన్నారు. -
కోతకొచ్చిన కష్టాలు
ఫ నత్తనడకన దాళ్వా వరి కోతలు ఫ కూలీలు దొరకక, యంత్రాలు లేక ఇబ్బందులు ఫ ఇప్పటి వరకూ జరిగింది 48.3 శాతమే.. ఫ రైతుల బాధలు పట్టించుకోని ప్రభుత్వం పెరవలి: ప్రస్తుత రబీలో జిల్లా రైతులకు నాట్ల సమయంలో మొదలైన కష్టాలు కోతల వరకూ వచ్చినా తీరడం లేదు. ఏటా దాళ్వా వరి సాగుకు నీటి ఎద్దడి ఉంటుందని తెలిసినా ప్రభుత్వం సరైన ముందస్తు చర్యలు తీసుకోలేదు. ఫలితంగా కీలకమైన దశలో నీరందక శివారు వరి రైతులు నానా ఇక్కట్లూ ఎదుర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ముందస్తుగా మెరక పొలాల రైతులకు ఇంజిన్లు సమకూర్చి, కొన్నిచోట్ల నీటి తోడకాలు చేసేవారు. మరికొన్నిచోట్ల డీజిల్ అందించి, సాగునీరు తోడుకునేందుకు సహకరించేవారు. ఇంకొన్నిచోట్ల మురుగు కాలువలకు అడ్డుకట్టలు వేసి సాగునీరు అందేలా చర్యలు చేపట్టేవారు. ఈసారి కూటమి ప్రభుత్వ ఏలుబడిలో అటువంటి చర్యలు మచ్చుకై నా లేవని రైతులు చెబుతున్నారు. దీంతో, ఖర్చు ఎక్కువైనా బోర్లతో సాగునీరు అందించి పంట పండించారు. ఇప్పుడు వరి కోతల తరుణం వచ్చింది. కీలకమైన ఈ సమయంలో కోతలకు ఇటు కూలీలు దొరకక, అటు వరికోత యంత్రాల అవసరమైనన్ని లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. 28,287 హెక్టార్లలో.. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఈ ఏడాది దాళ్వా వరి దిగుబడులు 50 నుంచి 60 బస్తాల వరకూ వస్తున్నాయి. ఇది రైతులకు సంతోషంగానే ఉన్నా.. ఆ పంటను దక్కించుకోవడానికి నానా కష్టాలూ పడుతున్నారు. ఒకవైపు వాతావరణ మార్పులతో అడపాదడపా కురుస్తున్న వర్షాలతో నిండుగా పండిన పంట దక్కుతుందో లేదోనని వారు గుబులు చెందుతున్నారు. మరోవైపు కూలీలతో కోతలు కోయించడానికి సమయం చాలక.. వరి కోత యంత్రాలు దొరకక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫలితంగా జిల్లాలో వరి కోతలు ఇప్పటి వరకూ సగం కూడా పూర్తి కాలేదు. జిల్లావ్యాప్తంగా రబీ వరి సాగు 60,042 హెక్టార్లలో జరుగుతుందని వ్యవసాయ అధికారులు అంచనా వేయగా, 58,586 హెక్టార్లలో జరిగింది. ఇప్పటి వరకూ ఇందులో 28,287 హెక్టార్లలో అంటే 48.3 శాతం మాత్రమే వరి కోతలు జరిగాయి. గత ప్రభుత్వ హయాంలో ఈ సమయానికి వరి కోతలు 80 శాతం పైగా పూర్తయ్యేవి. రైతులు మూడో పంటకు కూడా సిద్ధమయ్యేవారు. ఈసారి ఆ పరిస్థితి కనిపించడం లేదు. కోత యంత్రాల అద్దెకు రెక్కలు రైతులు వారం రోజులుగా వరి కోతలు ముమ్మరంగా చేపడుతున్నారు. అయితే, అవసరమైన స్థాయిలో వరి కోత యంత్రాలు లేకపోవడం వారికి సమస్యగా మారింది. ఇదే అదనుగా దళారులు రంగప్రవేశం చేశారు. గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల నుంచి కోత యంత్రాలను కమీషన్లు, అధ్దె ప్రాతిపదికన తీసుకువచ్చి, రైతుల వద్ద అధిక ధరలు వసూలు చేస్తున్నారు. జిల్లాలో వరి కోత యంత్రాలు 240 ఉండగా ఇతర జిల్లాల నుంచి మరో 260 తీసుకుని వచ్చారు. రైతుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో కోత యంత్రాల యజమానులు ఒక్కసారిగా అద్దెలు పెంచేశారు. దాళ్వా వరి కోతల ప్రారంభంలో ఎకరానికి, గంటకు రూ.2,500 చార్జి చేసేవారు. ప్రస్తుతం దీనిని రూ.3 వేలకు పెంచేశారు. అదేమని రైతులు అడిగితే ఎవరైనా తక్కువకు వస్తే కోయించుకోండంటూ బదులిస్తున్నారు. దీంతో, చేసేది లేక రైతులు కోత యంత్రాల యజమానులు, దళారులు చెప్పిన రేటు చెల్లించుకుని, కోతలు కోయిస్తున్నారు. నాలుగు రోజులుగా జిల్లాలో యంత్రాలతో సగటున రోజుకు 5 వేల నుంచి 6 వేల ఎకరాల్లో వరి కోతలు జరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కోతలు ఎప్పటికి పూర్తవుతాయో అర్థం కాని దుస్థితిని రైతులు ఎదుర్కొంటున్నారు. కోతలు పూర్తయ్యేలోగా పంట వర్షార్పణం కాకుండా చూడాలంటూ దేవుళ్లకు మొక్కుకుంటున్నారు. మెషీన్లు లేక.. నానా కష్టాలూ పడి దాళ్వా వరి సాగు చేసినా సమయానికి కోత మెషీన్లు అందుబాటులో లేవు. దీంతో, కోతలు ఆలస్యమయ్యాయి. ఇప్పుడు ఇతర జిల్లాల నుంచి రావటంతో వేగంగా జరుగుతున్నాయి. – కొమ్మిశెట్టి వెంకటస్వామి, రైతు, కానూరు, పెరవలి మండలం ఖర్చు ఎక్కువ.. మిగులు తక్కువ గతంలో కోత మెషీన్‌కు ఎకరానికి, గంటకు రూ.2,500 తీసుకునే వారు ఇప్పుడు రూ.3 వేలు వసూలు చేస్తున్నారు. మెషీన్లకు ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడటంతో ఈ పరిస్థితి తలెత్తింది. దాళ్వా పంట పండినా ఖర్చులు అధికమవడంతో మిగులు తక్కువగా ఉంటుంది. – సాధనాల ఏడుకొండలు, వరి రైతు, కానూరు, పెరవలి మండలం జిల్లాలో మండలాల వారీగా వరి సాగు, కోతల వివరాలు (హెక్టార్లలో) సాగు కోతలు మండలం విస్తీర్ణం జరిగిన శాతం విస్తీర్ణం రాజమహేంద్ర 1,989 1,152 88.7 వరం రూరల్ కడియం 2,027 800 39.5 రాజానగరం 3,229 2,360 73.1 అనపర్తి 3,502 1,620 46.3 బిక్కవోలు 5,407 800 14.8 కోరుకొండ 2,251 1,125 50.0 గోకవరం 1,989 719 36.1 సీతానగరం 4,443 2,500 56.3 రంగంపేట 849 460 54.2 చాగల్లు 3,307 2,000 60.5 దేవరపల్లి 2,914 990 34.0 గోపాలపురం 2,221 686 30.9 కొవ్వూరు 4,436 3,202 72.2 నిడదవోలు 6,970 5,650 81.1 పెరవలి 3,305 1,032 31.2 తాళ్లపూడి 3,602 1,886 51.8 ఉండ్రాజవరం 4,783 810 16.9 నల్లజర్ల 2,133 564 26.4 -
గుండెపోటుతో ఉపాధి కూలీ మృతి
ఉప్పలగుప్తం: మండలంలోని గొల్లవిల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న యాండ్ర సత్యనారాయణ(64) సోమవారం గుండెపోటుతో మృతి చెందాడని ఇన్చార్జి ఏపీవో వీరబాబు తెలిపారు. గ్రామంలో ఉపాధి హామీ పనిచేస్తుండగా గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడని ’ఉపాధి సిబ్బంది ఎమ్.ధనలక్ష్మీ సమాచారం అందించడంతో ఘటనా ప్రదేశానికి వెళ్లి వైద్య సిబ్బందితో పరీక్షలు చేయగా మృతి చెందినట్టు నిర్ధారించారన్నారు. మృతుడికి గతంలో భార్య మరణించగా, ఇద్దరు కుమారులు ఉన్నారు. టెన్త్ ఫలితాలు మనమిత్ర, లీప్ మొబైల్ యాప్‌లో.. రాయవరం: పదవ తరగతి పరీక్షా ఫలితాలు బుధవారం ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. అభ్యర్థులు ఫలితాలను https:// bse.ap.gov.in, https://apopenschool.ap.gov.in/ వెబ్సైట్లతో పాటుగా, మనమిత్ర(వాట్సాప్), లీప్ మొబైల్ యాప్‌లో అందుబాటులో ఉంటాయి. వాట్సాప్ నంబరు 95523 00009కు హాయ్ అని మెసేజ్ పంపి, విద్యా సేవలను ఎంచుకోవాలి. అనంతరం ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఎంచుకుని, అభ్యర్థి రోల్ నంబరు నమోదు చేయడం ద్వారా విద్యార్థులు పది ఫలితాల పీడీఎఫ్ కాపీని పొందే వీలుంటుంది. -
ధరణీ రక్షతి రక్షితః
కపిలేశ్వరపురం: సకల జీవరాశులకూ ఆధారమైన ఈ ధరిత్రి ప్రమాదంలో ఉంది. కోటాను కోట్ల జీవులు నిన్న బాగా బతికాయి. నేడు ప్రమాదంలో పడ్డాయి. రేపు... ? ఈ ప్రశ్నకు సమాధానం కచ్చితంగా మనిషే చెప్పాలి. తన అవసరాలు కోసం అనివార్యమంటూ విచ్చలవిడి వినియోగంతో ధరిత్రిని ప్రమాదంలోకి నెట్టాడు. అందులోనే తాను నలిగిపోతూ జీవకోటి ఉనికినే ప్రశ్నార్థకం చేశాడు. ఈ ధరణిని మనం కాపాడితే అదే మనలను రక్షిస్తుందన్న విషయాన్ని మరచిపోతున్నాడు. ఆహ్లాదకరమైన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి సైతం పర్యావరణ పరంగా ముప్పు పొంచి ఉంది. నేడు ధరిత్రీ దినోత్సవం సందర్భంగా ఈ కథనం... నేపథ్యమిదీ... 84 లక్షల జీవరాశులున్న భూమిపై మానవులు సాగిస్తున్న విధ్వంసాన్ని ఆపాలన్న లక్ష్యంతో ఐక్యరాజ్యసమితి శ్రద్ధ వహించింది. ధరిత్రీ దినోత్సవాన్ని జరుపుకొంటూ ఆ సంస్థ సూచనలపై చర్చలు, సమావేశాలు, సమీక్షలు జరుపుతున్నారు. 2023లో ఎర్త్ డే థీమ్‌గా ‘మన గ్రహం కోసం ఖర్చు చేయండి’ అనే నిదానంతోనూ, 2024లో ప్లానెట్ వెర్సస్ ప్లాస్టిక్ అనే నినాదంతో కృషి చేసింది. ఈ ఏడాది ‘అవర్ పవర్, అవర్ ప్లానెట్’ నినాదంతో ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టనుంది. పోగుపడుతున్న చెత్తతో పర్యావరణానికి విఘాతం నాలుగు లక్షల జనాభా కలిగిన జిల్లా కేంద్రమైన కాకినాడలో రోజుకు 140 టన్నులు, రాజమహేంద్రవరంలో 145 టన్నులు, అమలాపురంలో 38 టన్నుల చెత్త తయారవుతోంది. సామర్లకోట, పెద్దాపురం పట్టణాల్లో రోజుకు సుమారుగా 28 టన్నులు చొప్పున, ఏలేశ్వరం నగర పంచాయతీలో 8 మెట్రిక్ టన్నుల చెత్త పోగుపడుతోంది. 40 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల ప్లాస్టిక్ వస్తువులు ప్రమాదకరం. పాలిథీన్ సంచులు, ఇతర వస్తువుల రీసైక్లింగ్ చేసేందుకు వీలుపడదు. ప్లాస్టిక్ బాటిళ్లు 450 ఏళ్లు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్‌లు వెయ్యి సంవత్సరాలు వరకూ భూమిలో కరగవు. ప్రపంచంలో దాదాపు 700 జాతులు ప్లాస్టిక్‌కు ప్రభావితమై అంతరించే దశలో ఉన్నాయి. శరీరంలోకి వెళ్లిన సూక్ష్మ స్థాయిలో ఉండే ప్లాస్టిక్ పాలిమర్ అవశేషాల వల్ల క్యాన్సర్, చర్మ , హార్మోన్లకు సంబంధించిన వ్యాధులొస్తాయి. ప్లాస్టిక్ పుల్లలు, ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ట్రేలు, ఫోర్కులు, చెంచాలు, ప్లాస్టిక్ స్వీట్ బాక్సులు, బడ్స్, బెలూన్లు, క్యాండీ, కత్తులు, అలంకరణకు వాడే థర్మోకోల్, ఆహ్వాన పత్రాలు, సిగరెట్ ప్యాకెట్లు, 100 మైక్రాన్ల లోపు ఉండే వీవీసీ బ్యానర్లు నిషేధ జాబితాలో వున్నాయి. ప్రమాదభరితంగా పారిశ్రామిక ఉద్గారాలు తూర్పుగోదావరి జిల్లాలో 38 మధ్య తరహా పరిశ్రమలు, కాకినాడలో 62, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఏడు మధ్య తరహా పరిశ్రమలున్నాయి. వాటికి తోడు అనేక చోట్ల భారీ పరిశ్రమలున్నాయి. హేచరీలు, పరిశ్రమలు విడుదల చేసే విషపూరితమైన రసాయనాలు సముద్రంలోకి చేరి గోదావరి, సముద్ర జలాలను కలుషితం చేస్తున్నాయి. అడుగంటుతున్న భూగర్భజలాలు అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఆక్వా సాగుతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. తాగునీరు కలుషితమైపోతోంది. మెట్ట ప్రాంతాల్లో సాగు నీరందక ఎత్తిపోతల పథకాలతో నీరందిస్తున్నారు. గోదావరి తీరాన ఉన్నప్పటికీ తాగునీటి సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి. కాలుష్యానికి బలవుతున్న జీవరాశులు... కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల్లో సూక్ష్మ, అతి సూక్ష్మ ధూళి కణాలు తీవ్రత ఎక్కువ. కాకినాడ జిల్లాలో జనవరి నెలలో 220 సముద్ర తాబేళ్లు మృతి చెందాయి. కొత్తపల్లి మండల పరిధిలోని తీర ప్రాంతంలో సముద్ర జలాలు కలుషితం కారణంగా సముద్ర తాబేళ్లు తరచూ మృత్యువాత పడుతూ ఒడ్డుకు చేరుకుంటున్నాయి. గతేడాది కోనసీమ జిల్లాలో సుమారు 984 ఆలివ్వ్ రిడ్లే తాబేళ్లు 1,02,740 గుడ్లను పెట్టాయి. వాటి నుంచి వచ్చిన 71,388 పిల్లలను సముద్రంలో వదిలారు. ఆక్వాతో అన్నీ సమస్యలే... ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉప్పునీటి చెరువుల్లో 20,110 ఎకరాల్లోనూ, మంచినీటి చెరువుల్లో 44,199 ఎకరాల్లోనూ ఆక్వా సాగు జరుగుతోంది. 201 రోయ్యల హేచరీలు, 13 ప్రాసెసింగ్ యూనిట్లు, నాలుగు ఫీడ్ మిల్లులు ఉన్నాయి. వీటి నుంచి పర్యావరణ సమస్యలు రావడమే కాకుండా మూడు పంటలు పండే భూములు ఆక్వా చెరువులుగా మారిపోతున్నాయి. ఆక్వా సాగుతో భూమి సారం దెబ్బతింటోంది. పర్యావరణ హితమైన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వైవిధ్య భరితమైంది. దేశం నలుమూలలకూ మొక్కలను సరఫరా చేసే కర్మాగారంగా కడియం నర్సరీలు నడుస్తున్నాయి. కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లికి చెందిన సుమారు 400 కుటుంబాలు 40 ఏళ్లుగా పలు రాష్ట్రాల్లో నర్సరీలను నిర్వహిస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 4.36 లక్షల ఎకరాల్లో వరి సాగుతో ఆహార ఉత్పత్తి చేస్తున్నారు. 161 కి.మీ. సాగరతీరం, 297 కి.మీ. గోదావరి నదీ పరివాహక ప్రాంతం ఉంది. కాకినాడ సమీప కోరంగి మడ అడవులు ప్రకృతి వైపరీత్యాల నుంచి జిల్లాను కాపాడుతున్నాయి. మడ అడవుల్లో 272 రకాల పక్షి జాతులు, 610 రకాల మత్స్య జాతులున్నాయి. గోదావరి సముద్ర కలిసే ప్రాంతంలో 300 రకాల చేపలుండటమే కాకుండా ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంతానోత్పత్తికి నిలయం. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని చిత్తడి నేలలు ఆహార క్షేత్రాలు కావడంతో శీతాకాలంలో జొన్నాడకు వందల సంఖ్యలో సైబీరియా నుంచి 1,600 కిలోమీటర్లు ప్రయాణించి బార్ హెడెడ్ గుస్గా పిలిచే వలస బాతులు సంచరిస్తుంటాయి. ఆటుపోట్లు, పౌర్ణమి సమయంలో రాత్రి నుంచి తెల్లవారుజాము వరకూ ఆలివ్‌రిడ్లే గుడ్లు పెట్టేందుకు వస్తుంటాయి. భూరక్షణపై ప్రభుత్వాల నిర్లక్ష్యం ప్రతిఘటిస్తున్న ప్రజలు నేడు ధరిత్రీ దినోత్సవం వైఎస్సార్ సీపీ హయాంలో ధరిత్రి రక్షణ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ధరిత్రీ రక్షణకు విశేష కృషి చేసింది. 2022 జూలై 1 ప్లాస్టిక్‌ను నిషేధిస్తూ చట్టం తీసుకొచ్చింది. క్షేత్ర స్థాయిలో పారిశుధ్యాన్ని మెరుగుపర్చింది. ఫలితంగా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ 2020లో స్వచ్ఛ సర్వేక్షణ్‌లో 51వ ర్యాంకును సాధించింది. 2021లో 41, 2022లో 97, 2023లో 59వ ర్యాంకులను పొందింది. మండపేట తదితర పురపాలక సంఘాలు సైతం ధరిత్రీ రక్షణలో గుర్తింపు పొందాయి. నిర్లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ధరిత్రీ పరిరక్షణ పట్ల కూటమి సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఉప్పాడ సముద్ర కోత నివారణకు డిజాస్టర్ మేనేజ్మెంట్ ద్వారా పరిశీలన జరిపి సుమారు రూ.2వేల కోట్లతో కోత నివారణతో పాటు, తీరాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దుతానంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇచ్చిన మాట నీటిమూటయ్యింది. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పచ్చని పంట పొలాలను ఆక్వా జోన్‌గా మార్చేందుకు చేసిన ప్రయత్నాలను ప్రజలు ప్రతిఘటించారు. పలు గ్రామ సభల్లో ఆక్వా జోన్ మాకొద్దంటూ తీర్మానాలు చేశారు. విఘాతానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యావరణ విఘాతానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఆక్వా సాగుతో ముప్పు వాటిల్లుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నప్పటికీ ఆక్వా జోన్లు ఏర్పాటు చేస్తామంటూ గ్రామసభలను నిర్వహించడం ప్రజా వ్యతిరేకమే. పర్యావరణ పరిరక్షణ చట్టాలను నిర్వీర్యం చేసే పాలనపై ప్రజలు తిరగబడే రోజు వస్తుంది. – కేవీవీ సత్యనారాయణ, కన్వీనర్, రాష్ట్ర పర్యావరణ పరిరక్షణ సబ్ కమిటీ, జనవిజ్ఞాన వేదిక అనుబంధం, యానాం -
విద్యార్థి జీవితంలో పుస్తకానికి ప్రాధాన్యం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ప్రతి విద్యార్థి జీవితంలో పుస్తకం ప్రాధాన్యం కలిగి ఉంటుందని ప్రముఖ విద్యావేత్త అమలారాయ్ పేర్కొన్నారు. కాకినాడ సురేష్‌నగర్ శ్రీప్రకాష్ సినర్జీ స్కూల్లో సోమవారం 2024–25 విద్యాసంవత్సరంలో విద్యతో పాటు పలు విభాగాల్లో ప్రతిభ చూపిన వారికి బహుమతులు ప్రదానం పేరుతో అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా అమలారాయ్ మాట్లాడుతూ విద్య అంటే తరగతి గదిలో ఉపాధ్యాయులు చెప్పినది వినడం, పుస్తకాలు పఠనం చేయడం మాత్రమే కాదని, మానసిక వికాసం కోసం ఉల్లాసం కోసం మనం ఆడే ఆటలు, పాటలు అన్నీ విద్యాభ్యాసమేనన్నారు. నేటి కాలంలో విధ్యాభ్యాసం కేవలం మార్కులు, ర్యాంకులు సాధనే ధ్యేయంగా మారిందని, ఇటువంటి సమయంలో విద్యతో పాటు సమానంగా వారికి అభిరుచి ఉన్న క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు శ్రీ ప్రకాష్ యాజమాన్యం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. పాఠశాల డైరక్టర్ సీహెచ్.విజయ ప్రకాష్ మాట్లాడుతూ విద్యాబోధన కంటే చదువుపై ఆసక్తిని కలిగించడం విద్యాసంస్థల ప్రధమ కర్తవ్యమన్నారు. వివిధ విభాగాల్లో ప్రతిభ చూపిన వారికి స్మార్ట్ షేక్స్పియర్, సూపర్ స్పిల్బర్గ్, రాకింగ్ రామానుజన్, పద్యయోధ టైటిల్స్ అందజేశారు. -
విద్యుదాఘాతానికి విద్యార్థి మృతి
యానాం: ఇంటర్మీడియెట్ పరీక్షా ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించి తదుపరి ఉన్నతవిద్యను అభ్యసించడానికి సిద్ధపడుతున్న తరుణంలో విధి వక్రించింది. విద్యుత్ ప్రమాదంతో ఆ విద్యార్థిని కానరానిలోకాలకు తీసుకువెళ్లిపోయి ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే యానాం పట్టణ పరిధిలో బెజవాడ గార్డెన్స్‌కు చెందిన లంక సిద్దార్ధమౌర్య (18) సోమవారం ఇంట్లో ట్యూబ్‌లైట్ బిగిస్తుండగా విద్యుదాఘాతానికి గురై కిందపడిపోయాడు. ఈ నేపథ్యంలో అపస్మారక స్థితిలోఉన్న అతనిని స్థానిక జీజీహెచ్‌కు తరలించారు. అయితే చికిత్స అందించినప్పటికీ సిద్దార్ధ మృతి చెందడం విషాదాన్ని నింపింది. మృతుని తండ్రి లంక చినలోవరాజు ఇటీవలి సీనియర్ అకౌంట్ ఆఫీసర్‌గా చేసి రిటైర్డ్ కాగా, తల్లి లక్ష్మీ యానాం జీజీహెచ్‌లో ఏఎన్ఎంగా విధులు నిర్వహిస్తున్నారు. మృతుడు సిద్దార్ధమౌర్య కాకినాడ ఆదిత్య కాలేజీలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పూర్తిచేసుకుని కళాశాలలో ద్వితీయ స్థానాన్ని సాధించాడని తెలిపారు. చదువులో ఎంతో చురుకుగా ఉండే సిద్ధార్ధ మౌర్య అకాల మృతి అందరినీ కలచి వేసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేశారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి)గండేరా (వెయ్యి) 20,000 గటగట (వెయ్యి) 18,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 19,000 గటగట (వెయ్యి) 17,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలంటూ ధర్నా
కాకినాడ సిటీ: కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. 2024లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు 59 విభాగాలుగా 176 హామీలు ఇచ్చిందన్నారు. వాటిలో పెన్షన్, అరకొర గ్యాస్ పథకం తప్ప మరేమీ అమలు చేయలేదని విమర్శించారు. విద్యార్థులకు, యువజనులకు, నిరుద్యోగులకు, మహిళలకు, కార్మికులకు, వివిధ వృత్తులు, కులాల వారీగా అమలు చేస్తామన్న పథకాలు ఏవీ అమలు చేయలేదని ఆరోపించారు. ముందు దగా, వెనుక దగా, కుడిఎడమల దగాదగా అన్న చందంగా చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఉందని ఆందోళనకారులు విమర్శించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతు, మైనారిటీ, రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు చంద్రబాబు ప్రభుత్వం తల ఊపుతూ ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తోందన్నారు. రెండున్నర లక్షల పెన్షన్ల కోత విధించి, పెన్షన్ పెంచి అమలు చేస్తున్నట్టు ఈ ప్రభుత్వం పోజు కొడుతోంది తప్ప ఆచరణలో పెన్షన్లు పెరిగింది లేదని విమర్శించారు. మొదటి దఫా గ్యాస్ పథకం అరకొర అమలు చేశారు తప్ప పూర్తిగా అమలు చేయలేదని, ఉచిత బస్సు ఊసేలేదన్నారు. నిరుద్యోగ భృతి మాటేలేదని, అమ్మకు వందనం, మహిళా శక్తి రైతు భరోసా, వలంటీర్లకు రూ.10 వేలు జీతం ఇవి కూడా అమలు చేయలేదన్నారు. ఇల్లులేనివారికి గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్ల భూమి ఇస్తానన్న పథకానికి నేటికీ శ్రీకారం చుట్టలేదని విమర్శించారు. ఉపాధి హామీ కూలీలకు నిధులు విడుదల కావడంలేదన్నారు. సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ నాయకులు జె.వెంకటేశ్వర్లు, ఆదినారాయణ, ఎం ఏసు, రాగుల రాఘవులు, జి బాలరాజు, జి రాజ్‌కుమార్, బొడ్డు సత్యనారాయణమూర్తి, జి దుర్గారావు, చిన్న, శ్రీను, కెవిరమణ, సతీష్ పాల్గొన్నారు. -
మోటారు సైకిళ్లు ఢీకొని ఒకరి మృతి
మరో ఇద్దరికి గాయాలు తాళ్లరేవు: జాతీయ రహదారి 216పై పటవల పైడా కళాశాల సమీపంలో రెండు మోటారు సైకిళ్లు ఢీకొన్న ఘటనలో మహమ్మద్ అలీషా(44) మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ తెలిపిన వివరాల మేరకు కాకినాడకు చెందిన మొహమ్మద్ అలీషా, మహమ్మద్ జహంగీర్ కలిసి ద్విచక్రవాహనంపై ముమ్మిడివరంలోని ఒక ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలకు వెళ్లారు. అక్కడ పని ముగించుకుని తిరిగి వస్తుండగా, పైడా కళాశాల సమీపంలో ఎదురుగా వెళుతున్న మరొక బైక్‌ను ఢీకొనడంతో రెండు వాహనాలపై ప్రయాణిస్తున్నవారు కింద పడిపోయారు. ఈ ఘటనలో మహమ్మద్ అలీషా తలకు తీవ్రగాయం కావడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందారు. కాగా జహంగీర్‌తోపాటు మరొక బైక్‌పై వెళుతూ వెనుక కుర్చున్న మహిళకు కూడా గాయాలైనట్లు ఎస్సై తెలిపారు. వీరిని 108లో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు. ఖండవల్లి రోడ్డు ప్రమాదంలో ఒకరు..ఇద్దరికి తీవ్ర గాయాలు పెరవలి: జాతీయ రహదారిపై పెరవలి మండలం ఖండవల్లి సెంటర్లో ఆదివారం రాత్రి కారు మోటార్ సైకిల్‌ను ఢీకొట్టిన ఘటనలో ఒక యువకుడు మృతి చెందగా ఇద్దరు యువకులు తీవ్ర గాయాలు పాలయ్యారు. పెరవలి ఎస్ఐ ఎం.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ గ్రామానికి చెందిన నేకూరి రాజ్ కిరణ్, ఈతకోట శ్రీనివాస్, కొనుకు సతీష్ కుమార్ (23) మోటార్ సైకిల్‌పై ఖండవల్లి వస్తుండగా సెంటర్లో రోడ్డు దాటే క్రమంలో రావులపాలెం నుంచి తణుకు వైపు వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో వెనుక కూర్చున్న సతీష్‌కుమార్ మోటార్ సైకిల్ పైనుంచి ఎగిరి 10మీటర్ల దూరంలో పడడంతో తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. మిగిలిన ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా ఒక యువకుడికి చేయి జారిపోవడంతో అతనిని మైరుగైన వైద్యం కోసం మంగళగిరి పంపించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యుదాఘాతంతో...తాళ్లరేవు: మండల పరిధిలోని జి.వేమవరం పంచాయతీలో పెంకే దుర్గా శ్యాంప్రసాద్(35) విద్యుదాఘాతంతో సోమవారం మృతి చెందాడు. కోరంగి ఎస్సై పి.సత్యన్నారాయణ తెలిపిన వివరాల మేరకు జి.వేమవరంలోని సానబోయిన ఆదినారాయణకి చెందిన మల్లితోటలో శ్యాంప్రసాద్ కొంతకాలంగా పనిచేస్తున్నాడు. రోజూ మాదిరిగానే మల్లితోటకు నీరు పెట్టేందుకు విద్యుత్ మోటారు వేసే క్రమంలో విద్యుత్ వైరు స్విచ్‌బోర్డులో పెడుతుండగా షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్యాంప్రసాద్ మృతదేహం వద్ద భార్య నందిని కుటుంబ సభ్యులు బోరున విలపించడం అక్కడివారిని కలిచివేసింది. నందిని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సత్యన్నారాయణ తెలిపారు. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
సుమారు నెలరోజులకు బయటపడిన వైనం కొవ్వూరు: మద్దూరులంక గ్రామంలో పల్లెపాలెంలో ఆకుల కృష్ణారావు అనే రైతుకి చెందిన మకాం సమీపంలో చిత్రాపు వెంకట్రావు మృతదేహాన్ని గుర్తించారు. సుమారు నెల రోజుల క్రితం మృతి చెంది ఉండవచ్చునని రూరల్ పోలీసులు భావిస్తున్నారు. మృతదేహం పూర్తిగా ఎండిపోయి ఎముకలు మాత్రమే మిగిలాయి. రూరల్ ఎస్సై కె.శ్రీహరిరావు ఘటనా స్ధలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ఆరునెలలు క్రితమే మృతుడు వెంకట్రావు భార్య రామజ్యోతి తొమ్మిది నెలలు గర్భవతిగా ఉన్న సమయంలో గుండె పోటుతో మృతి చెందారు. అప్పటి నుంచి వెంకట్రావు ఒంటరిగా ఉంటున్నారు. గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్టు ఎస్సై చెప్పారు. ఆమె ఇటీవల హైదరాబాద్ వెళ్లిపోయింది. వెంకట్రావు తల్లిదండ్రులు పదిహేహేనేళ్ల కిత్రమే మృతి చెందారు. దీంతో తన సోదరుడు ఒక ఫోర్షన్లోను వెంకట్రావు మరో పోర్షన్‌లోను నివాసం ఉంటున్నారు. అన్నదమ్ములిద్దరూ మాట్లాడుకోవడం లేదని స్ధానికులు చెబుతున్నారు. ఘటనా స్ధలంలో లభ్యమైన మొబైల్ ఫోన్ ఆధారంగా శవం వెంకట్రావుది అని నిర్ధారించారు. మార్చి 20వ తేదీన చివరి కాల్ చేసి ఉన్నట్లు ఎస్సై తెలిపారు. ఘటనా స్థలంలో లభ్యమైన సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. మృతదేహానికి సమీపంలోనే గుళికలు డబ్బా ఉండడాన్ని బట్టి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. వెంకట్రావు ఆత్మహత్యకు పాల్పడ్డారా? ఎవరైనా హత్య చేశారా? అన్న అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. దీంతో అనుమానాస్పద స్థితిలో మృతిగా కేసు నమోదు చేశామని ఎస్సై శ్రీహరిరావు తెలిపారు. -
తల్లి ఒడికి చేరిన తనయ
ఫ పరంధామానికి చేరిన శ్రీరాముడు ఫ ముగిసిన ఉత్తరకాండ ప్రవచన సప్తాహం ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): చతుర్విధ పురుషార్థ సాధనకు రామాయణాన్ని మించిన కావ్యం లేదని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. ఎన్ని కావ్యాలున్నా, వాటిలో అత్యుత్తమమైనది రామాయణమేనన్నది బ్రహ్మవాక్కు అని చెప్పారు. స్థానిక టి.నగర్‌లోని హిందూ సమాజంలో ఉత్తరకాండపై వారం రోజులుగా ఆయన నిర్వహిస్తున్న ప్రవచనాలు సోమవారం ముగిశాయి. ముగింపు ప్రవచనంలో రామావతార పరిసమాప్తిని వివరించారు. శ్ఙ్రీగోమతీ నదీ తీరాన రాముడు అశ్వమేధ యాగం చేస్తున్న సమయంలో వాల్మీకి మహర్షి ఆనతి మేరకు లవకుశులు రామకథను గానం చేశారు. వారు తన కుమారులేనని రాముడు గుర్తించాడు. సీతపై లోకాపవాదు తొలగించడానికి అశ్వమేధ యాగం జరుగుతున్న తరుణం సరైన సమయమని గుర్తించాడు. ఎందరో రాజులు, మహర్షులు, రాక్షస, వానర వీరులు తరలి వచ్చారు. వారందరి సమక్షాన సీతమ్మ శపథ పూర్వకంగా తన పాతివ్రత్యం నిరూపించాలని ఆయన వాల్మీకి మహర్షిని కోరాడు. మరుసటి రోజు ఉదయం బ్రహ్మదేవుని అనుసరించి వస్తున్న వేదమాతలా, వాల్మీకి మహర్షిని సీతాదేవి అనుసరించి అక్కడికి చేరుకుంది. శ్రీరామా! నా వేలాది సంవత్సరాల తపస్సు మీద ఆన పెట్టి చెబుతున్నాను. సీతాదేవి శుద్ధచరిత, నిష్కళంకశ్రీ అని ఆయన ప్రజల సమక్షంలో రామునితో చెప్పాడు. శ్రీమహర్షీ! సీతాదేవి పాతివ్రత్యం నాకు తెలుసు. లోకాపవాదు తొలగించడానికి నేను ఇటువంటి కోరిక కోరుతున్నానుశ్రీ అని రాముడు బదులిచ్చాడు. శ్రీత్రికరణశుద్ధిగా నేను రాముని తప్ప అన్యుని గురించి తలచకపోయి ఉంటే, భూదేవి నన్ను తనలోకి తీసుకుంటుందిశ్రీ అని సీతమ్మ శపథం చేస్తుంది. సీత మాట పూర్తయిన వెంటనే దివ్య సింహాసనం మీద భూదేవి వచ్చి సీతాదేవిని రసాతలంలోకి తీసుకు వెళ్లింది. శ్రీసాగరం ఆవల ఉన్న సీతాదేవిని తీసుకు వచ్చిన నాకు సీతను వెంటనే అప్పగించకపోతే, ధరాతలాన్ని నాశనం చేస్తానుశ్రీ అని రాముడు ప్రకటించాడు. బ్రహ్మాది దేవతలు రామునితో సాంత్వన వచనాలు పలికి ఆయన నిగ్రహించారుశ్రీశ్రీ అని సామవేదం వివరించారు. శ్ఙ్రీప్రజారంజకంగా 11 వేల సంవత్సరాలు పరిపాలించిన రాముని వద్దకు కాలపురుషుడు వచ్చాడు. ‘నీతో ఒక రహస్యం మాట్లాడాలి. ఈ సమయంలో ఎవరూ మన వద్దకు రారాదు’ అని ఆయన చెబుతాడు. రాముడు లక్ష్మణుడిని పిలిచి, ‘మా సమావేశం అయ్యేంత వరకూ ఎవ్వరినీ పంపవద్దు. నా ఆజ్ఞను ఉల్లంఘించిన వాడు నా చేతిలో వధ్యుడు’ అని చెబుతాడు. అయితే, దుర్వాస మహర్షిని ఆపలేకపోవడంతో మహర్షుల సూచనపై లక్ష్మణునికి మరణంతో సమానమైన బహిష్కరణను రాముడు విధించాడు. సీత లేని రాముని ఊహించవచ్చును. ‘లక్ష్మణుడు లేని రాముని ఊహించలేము’ అని సామవేదం అన్నారు. ‘కాలపురుషుని ద్వారా బ్రహ్మ సందేశాన్ని తెలుసుకున్న రాముడు సరయూ నది ద్వారా పరంధామానికి చేరుకున్నాడు. అంతకు ముందే ఆయన బహిష్కరించిన లక్ష్మణుడు పరంధామానికి చేరుకున్నాడు’ అని షణ్ముఖ శర్మ చెప్పారు. ఈ ప్రవచనాలకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. -
నన్నయ.. మిన్నయ్యేనా!
ఫ 2006 ఏప్రిల్ 22న వర్సిటీ ఏర్పాటు ఫ నేడు 20వ వసంతంలోకి.. ఫ పెద్ద వర్సిటీగా గుర్తింపు ఫ ప్రగతికి కలసికట్టుగా పని చేయాలంటున్న వీసీ ఫ నేడు నన్నయ వర్సిటీ ఆవిర్భావ దినోత్సవం రాజానగరం: తెలుగు రాష్ట్రాలలో అతిపెద్ద యూనివర్సిటీగా విరాజిల్లుతున్న ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఏర్పడి నేటికి 19 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ప్రజల చిరకాల కోరిక మేరకు అప్పటి మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు కృషితో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సహకారంతో సాంస్కృతిక, సాహిత్య రాజధానిగా పేరొందిన రాజమహేంద్రవరంలో ఆదికవి నన్నయ పేరిట 2006 ఏప్రిల్ 22న ఈ విశ్వవిద్యాలయం ఏర్పడింది. దీని ఆవిర్భావం కోసం గోదావరి జిల్లాల వాసులు, రాజకీయ నాయకులు ఎన్నో పోరాటాలు చేయాల్సి వచ్చింది. నాక్ గుర్తింపు పొందినా.. రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కళాశాలలో ఆవిర్భవించిన ఈ యూనివర్సిటీ కొద్ది కాలంలోనే అక్కడి నుంచి వెలుగుబందలో జాతీయ రహదారిని ఆనుకుని సేకరించిన 98 ఎకరాల సువిశాల ప్రాంగణంలోకి అడుగు పెట్టింది. సొంత భవనాలు నిర్మించుకోగలిగింది. 12బితో పాటు నాక్ గుర్తింపును కూడా అందుకుంది. కానీ ప్రభుత్వపరంగా సరైన సహకారం లేక విద్యార్థులకు అవసరమైన పూర్తి స్థాయి బోధన సదుపాయాలు పొందలేకపోతోంది. 2018లో చేపట్టిన కొన్ని భవనాల నిర్మాణాలు నిధుల లేమితో నిలిచిపోగా ఇటీవల వీసీగా బాధ్యతలు స్వీకరించిన ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ చొరవతో ఆ పనులు పునఃప్రారంభమయ్యాయి. శాశ్వత అధ్యాపకులేరీ! యూనివర్సిటీ క్యాంపస్‌లో కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజినీరింగ్, బీఈడీ కళాశాలలు ఉన్నాయి. వీటితో పాటు కాకినాడ, తాడేపల్లిగూడెంలో రెండు క్యాంపస్‌లు, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో 390 అనుబంధ కళాశాలలు ఉన్నాయి. తద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద యూనివర్సిటీగా పేరు పొందింది. వర్సిటీ పరిధిలో సుమారు 1.85 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే వర్సిటీ క్యాంపస్‌లో మాత్రం విద్యార్థులకు పాఠాలు బోధించే అధ్యాపకులు పూర్తి స్థాయిలో లేకపోవడం పెద్ద లోటుగా ఉంది. చాలావరకూ అడ్హాక్, కాంట్రాక్టు అధ్యాపకులతోనే తరగతులు నిర్వహించాల్సి వస్తోంది. ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామంటూనే 19 సంవత్సరాలు పూర్తి చేశారు. ఫలితంగా విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో వివాదాలుయూనివర్సిటీలో విద్యార్థినులకు సరైన రక్షణ ఉండటం లేదు. నిరంతరం అభద్రతా భావంతోనే కాలం గడుపుతున్నారనే ఆరోపణలున్నాయి. ఐదేళ్ల క్రితం ఆంగ్ల విభాగంలో విద్యార్థినుల పట్ల ఒక ఆంగ్లోపాధ్యాయుడి అసభ్య ప్రవర్త వర్సిటీ ప్రతిష్టకు మాయని మచ్చగా మిగిలిపోయింది. ఆ కేసు ఏమైందో తెలియకుండానే మరో హాస్టళ్లలో మత్తు పదార్థాల వివాదం. దీనికి తోడు నాణ్యత లేని, పురుగులు పట్టిన ఆహారం పెడుతున్నారంటూ విద్యార్థులు రోడ్లెక్కిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆది నుంచీ ఆటుపోట్లే.. ఆది నుంచీ నన్నయ వర్సిటీ అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటూనే ఉంది. సిబ్బందిలో నెలకొన్న వర్గవైషమ్యాలతో నిత్యం ప్రచార మాధ్యమాలకెక్కుతోంది. సిబ్బందిలో ఏర్పడిన వర్గాలు విద్యార్థులను పావులుగా ఉపయోగించుకుంటున్నాయనే విమర్శలు కూడా ఉన్నాయి. పని చేసే వారికంటే విధులు ఎగ్గొట్టేవారే ఇక్కడ ఎక్కువగా ఉన్నారనే ఆరోపణలు కూడా లేకపోలేదు. రాజకీయ అండదండలతోనే వారు ఇలా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. -
పర్మినెంట్ ఫ్యాకల్టీని నియమించాలి
పెద్ద యూనివర్సిటీ అనే పేరే గానీ పర్మినెంట్ ఫాక్యల్టీ లేరు. అడ్హాక్, కాంట్రాక్టు ఫ్యాకల్టీ ఎక్కువగా ఉన్నారు. అధ్యాపక ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలి. కారణాలేవైనా ఇక్కడ అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇంటర్నల్ ఎగ్జామ్స్ సమయంలో ల్యాబ్స్ సమస్య ఎక్కువగా వస్తోంది. దీనికోసం బయటకు వెళ్లాల్సిన దుస్థితి. పూర్తి స్థాయి ల్యాబ్ సదుపాయం ఉండాలి. విద్యార్థినుల విషయమై తరచూ ఏదో ఒక సమస్య వస్తోంది. వారికి అభద్రతా భావం ఏర్పడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. పాలన, పర్యవేక్షణ సవ్యంగా ఉంటేనే అన్ని సమస్యలూ నియంత్రణలోకి వస్తాయి. – అశోక్‌కుమార్, ఎస్ఎఫ్ఐ ప్రతినిధి, రాజమహేంద్రవరం వర్సిటీ ప్రగతికి అందరూ పని చేయాలి యూనివర్సిటీ ప్రగతి కోసం అందరూ పని చేయాలి. అలాగైతేనే ఇక్కడ ఉంటారు. పని చేయకుండా ఆడుకుంటే ఉపేక్షించేది లేదు. పరిపాలన నాకు కొత్త కాదు. చిందరవందరగా ఉన్న వలకు మాట్లు వేసి, సరిచేసే ప్రయత్నంలో ఉన్నాను. వర్గాలు, వైషమ్యాలు విడనాడి వర్సిటీ అభివృద్ధికి అంతా ఒక కుటుంబంగా పని చేయాలనేదే నా సంకల్పం. అందుకనే ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరంచుకుని సిబ్బందికి ఆటల పోటీలు నిర్వహించి, బహుమతులు అందజేయదలిచాం. ఇప్పటి వరకూ ఎలా ఉన్నా, ఇకపై అంతా ఒక్కటిగా ఉండాలని కోరుతున్నా. – ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ, వైస్ ఛాన్సలర్, ఆదికవి నన్నయ యూనివర్సిటీ -
వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలి
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో వైద్యులు, సిబ్బంది సమయ పాలన కచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ సమగ్ర వైద్యశాలను సోమవారం ఆమె అకస్మికంగా తనిఖీ చేశారు. ఐసోలేషన్ వార్డును పరిశీలించిన అనంతరం మాతా శిశు సంరక్షణ వార్డు, క్రిటికల్ కేర్ బ్లాక్ పనుల పురోగతిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎం.లక్ష్మీ సూర్యప్రభను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఐసోలేషన్ వార్డును పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకు రావాలని ఆదేశించారు. మాతా శిశు ఆరోగ్య సంరక్షణ వార్డును తగిన వైద్య సేవలు అందించేందుకు సిద్ధం చేసుకోవాలని సూచించారు. మాతా శిశు ఆరోగ్య బ్లాక్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని గత సమావేశంలోనే స్పష్టం చేశామని గుర్తు చేశారు. 15 రోజుల్లో ఈ బ్లాక్ ద్వారా సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రభుత్వ బోధన ఆసుపత్రికి అనుసంధానంగా క్రిటికల్ కేర్ బ్లాక్ ద్వారా ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందించే విధంగా పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రశాంతి ఆదేశించారు. ఈ సందర్భంగా రోగులకు అందిస్తున్న వివిధ వైద్య సేవలు, మానవ వనరుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అర్జీల పరిష్కారం అసంబద్ధంగా ఉంటే చర్యలు సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ప్రజల అర్జీల పరిష్కారంలో అసంబద్ధంగా ఎండార్స్మెంట్ ఇవ్వడం సరికాదని, అలా చేసినట్లు గమనిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి హెచ్చరించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో ప్రజల నుంచి పలువురు జిల్లా అధికారులతో కలిసి ఆమె అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా క్షేత్ర స్థాయి అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి, అర్జీల పరిష్కారంపై ఆదేశాలు జారీ చేశారు. పీజీఆర్ఎస్, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా వస్తున్న అర్జీలు స్వీకరించి, తగిన పరిష్కారం చూపాలని అన్నారు. ఏదో ఒక సమాధానం ఇస్తే పరిష్కరించినట్లు కాదని స్పష్టం చేశారు. ఇదే తీరు పునరావృతమైతే ఉపేక్షించే ప్రసక్తే లేదని కలెక్టర్ హెచ్చరించారు. కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో విభిన్న ప్రతిభావంతురాలు మల్లిం వెంకటేశ్వరికి ఉమా ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యాన జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రం ద్వారా మంజూరైన రూ.8,500 విలువ చేసే వీల్ చైర్‌ను జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు అందజేశారు. పోలీస్ పీజీఆర్ఎస్కు 30 అర్జీలు రాజమహేంద్రవరం రూరల్: తన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ఎస్పీ డి.నరసింహ కిషోర్ ప్రజల నుంచి 30 అర్జీలు స్వీకరించారు. సివిల్, చీటింగ్, కొట్లాట, దొంగతనం, కుటుంబ సమస్యలు తదితర కేసులకు సంబంధించి ప్రజలు ఫిర్యాదులు చేశారు. వారి సమస్యలను ఎస్పీ స్వయంగా అడిగి తెలుసుకుని, సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. బాధితులకు చట్ట పరిధిలో, నిర్దేశిత సమయంలో సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు ఎన్‌బీఎం మురళీకృష్ణ (అడ్మిన్), ఏవీ సుబ్బరాజు (శాంతిభద్రతలు) తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు భూసంతర్పణ పేరిట అక్రమాలు
రాజమహేంద్రవరం రూరల్: చంద్రబాబు అధికారంలోకి వచ్చారంటేనే భూసంతర్పణ పేరిట అక్రమాలు జరుగుతాయని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ విమర్శించారు. పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. విశాఖలో టీసీఎస్‌కు ఎకరా 99 పైసలకు కేటాయించడాన్ని అడ్డం పెట్టుకుని ఉర్సా కంపెనీకి భూమిని ధారాదత్తం చేస్తూ, కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను పైసలకు అప్పగించే అధికారాన్ని ప్రజలు చంద్రబాబుకు ఇవ్వలేదన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరగాలని అన్నారు. ప్రజలకిచ్చిన హామీలను ఇప్పటి వరకూ నిలబెట్టుకోలేని చంద్రబాబు భూ అక్రమాలకు పాల్పడటం దారుణమని వేణు విమర్శించారు. నేర నియంత్రణకు డ్రోన్లతో నిఘా రాజమహేంద్రవరం రూరల్: జిల్లాలో అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, నేరాలు నియంత్రణకు డ్రోన్ కెమెరాలతో నిఘా పెంచనున్నామని జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా నేరాల నియంత్రణకు ఉపయోగిస్తున్న డ్రోన్ కెమెరాల వినియోగంపై జిల్లా పోలీస్ కార్యాలయంలో సిబ్బందికి సోమవారం నిర్వహించిన ప్రత్యేక శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. నేరాలు జరిగేందుకు ఆస్కారమున్న పాడుబడిన ఇళ్లు, తోటలు, బహిరంగ ప్రదేశాలు, పార్కులు, గోదావరి నదీ తీరం వెంబడి డ్రోన్ కెమెరాలతో నిరంతర నిఘా పెడతామని చెప్పారు. బహిరంగంగా మద్యం తాగడం, గంజాయి వినియోగం, పేకాట నిర్వహణ, ఈవ్ టీజింగ్, చైన్‌స్నాచింగ్, దొంగతనాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలు, నేరాలు జరగకుండా తగిన చర్యలు చేపట్టామని వివరించారు. -
అనపర్తిలో దౌర్జన్యకాండపై సమగ్ర విచారణ
ఫ వైఎస్సార్ సీపీ నేతల డిమాండ్ ఫ ఎస్పీని కలసిన మాజీ మంత్రి వేణు, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, సూర్యనారాయణరెడ్డి రాజమహేంద్రవరం రూరల్: అనపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఆయన అనుయాయులు దౌర్జన్యకాండ, దుశ్చర్యలకు పాల్పడుతున్నారని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్‌కు వైఎస్సార్ సీపీ నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి, మాజీ ఏఎంసీ చైర్మన్ సబ్బెళ్ల కృష్ణారెడ్డిలు ఎస్పీని సోమవారం ఆయన కార్యాలయంలో కలిశారు. అనపర్తి నియోజకవర్గంలో కూటమి నేతల దౌర్జన్యకాండపై పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించి, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరగకుండా, పౌర జీవనానికి ఇబ్బంది కలగకుండా చూడాలని కోరారు. అనంతరం మాజీ మంత్రి వేణు విలేకర్లతో మాట్లాడుతూ, అనపర్తి నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యే, ఆయన అనుయాయులు దౌర్జన్య కాండలు, దుశ్చర్యలకు పాల్పడుతూ, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో ఇటీవల వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై జరిగిన దాడులను ఎస్పీకి వివరించామని చెప్పారు. దాడి జరిగినా పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడానికి భయపడే పరిస్థితి నెలకొందని అన్నారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి మృదుస్వభావి, హింసకు తావు లేకుండా పరిపాలించిన నేత అని, ప్రభుత్వానికి, శాంతిభద్రతలకు సహకరించే వ్యక్తి అని అన్నారు. దీనిని ఎమ్మెల్యే, ఆయన అనుయాయులు చేతకానితనంగా తీసుకోరాదని హితవు పలికారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమని, వాటి నిరూపణ కోసం రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితి సృష్టించడం దారుణమని అన్నారు. దౌర్జన్యాలు మితిమీరుతున్నాయి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ, అనపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఆయన అనుయాయుల దుశ్చర్యలు, కక్షసాధింపు చర్యలు, దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయని అన్నారు. ఎన్నికల ముందు, తరువాత చిన్నచిన్న వివాదాలుంటాయని సర్దుకుపోతూంటే వారి ఆగడాలు శృతి మించుతున్నాయని చెప్పారు. ఏఎంసీ మాజీ చైర్మన్ సబ్బెళ్ల కృష్ణారెడ్డికి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఫోన్ చేసి, శ్రీచేసిన ఆరోపణలు నిరూపించడానికి నువ్వు మా ఇంటికి వస్తావా.. లేక నేను మీ ఇంటికి రానా?శ్రీ అంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీని అణగదొక్కాలని ప్రయత్నిస్తున్నారన్నారు. తాత్కాలికంగా కొంత మందికి పార్టీ కండువాలు వేసినప్పటికీ, నియోజకవర్గంలోను, రాష్ట్రంలోను వైఎస్సార్ సీపీ అభిమానులకు కొదవ లేదని చెప్పారు. మీ హనీమూన్ పిరియడ్ అయిపోయిందని, కార్యకర్తలు, నాయకులపై దౌర్జన్యాలకు పాల్పడితే సహించేది లేదని, ప్రజల నుంచి తిరుగుబాటు ఏవిధంగా తీసుకొస్తామో చూడటానికి సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని హెచ్చరించారు. సబ్బెళ్ల కృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు మనోజ్‌రెడ్డి, వారి అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఎస్పీకి ఫిర్యాదు చేశామని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాల్సిందిగా కోరామని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్ టీయూసీ నాయకులు అడపా వెంకట రమణ, అడపా అనిల్, తోట రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
దుర్గమ్మ ఆలయంలో చోరీ
● రూ.2.5 లక్షల విలువైన ఆభరణాలు చోరీ ● సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసుల విచారణ తొండంగి: మండలంలోని పి.అగ్రహారంలో ఇటీవల పునర్నిర్మించిన దుర్గామాత ఆలయంలో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగినట్టు ఆలయకమిటీ సభ్యులు ఆదివారం తెలిపారు. పోలీసులు, ఆలయకమిటీ తెలిపిన వివరాల ప్రకారం పి.అగ్రహారంలో దుర్గామాత ఆలయాన్ని దాతల సహకారంతో పునర్నిర్మించారు. మార్చి 16న అమ్మవారి విగ్రహప్రతిష్ట జరిగింది. ఈ నేపథ్యంలో దాతల సహకారంతో అమ్మవారికి వెండి కిరీటం, మూడు జతల శతమానాలు, వెండి కాసులపేరు అలంకరించారు. శనివారం అర్ధరాత్రి ఇద్దరు వ్యక్తులు నగల చోరీకి పాల్పడ్డారు. ఈ దృశ్యాలు ఆలయ ప్రాంగణంలో సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. అయితే రెండు రోజుల ముందు పగలు అమ్మవారిని దర్శించుకుని రెక్కీ నిర్వహించినట్టు కూడా ఫుటేజీలో రికార్డు అయ్యింది. దీంతో ఆదివారం ఉదయం అమ్మవారికి పూజ చేసేందుకు వెళ్లిన పూజారికి ఆలయ తాళాలు పగలుగొట్టి కనపడ్డాయి. తరువాత అమ్మవారి నగలు చోరీకి గురయ్యాయని గుర్తించారు. నగల విలువ రూ.రెండున్నర లక్షలు ఉంటాయని ఆలయకమిటీ సభ్యులు తెలిపారు. దీంతో ఆలయకమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు కలిసి తొండంగి పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేసారు. ఈ మేరకు ఎస్సై జగన్మోహన్రావు ఘటనా స్ధలాన్ని పరిశీలించి సీసీ ఫుటేజీని సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి తొండంగి: గ్రామానికి చెందిన పల్లా శ్రీరాములు (59) ఈ నెల 14న ఽపొలం నుంచి ఎడ్ల బండిపై ధాన్యం బస్తాలు తీసుకువచ్చి ఇంట్లో వేస్తుండగా అదుపుతప్పి పడిపోయాడు. దీంతో మెడపై బస్తా పడి తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు స్థానికంగా ప్రధమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. అతడు చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. శ్రీరాములు కటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై జగన్మోహన్రావు తెలిపారు. శ్రీరాములుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
ముందున్నది బంగరు భవిత
● ఒక్క ఫలితం జీవితాన్ని నిర్దేశించదు ● ఆత్మహత్యకు పాల్పడితే ఎందరికో క్షోభ ● ఒత్తిడిని, నిరాశను దరిచేరనీయొద్దు ● చదువులో వెనకబాటు అత్యంత సహజం ● ప్రతికూల ఫలితం వస్తే తల్లిదండ్రులు అండగా నిలచి భరోసా ఇవ్వాలి ● పిల్లల్లో మానసిక స్థైర్యాన్ని నింపాలి ● 23న పదో తరగతి పరీక్షా ఫలితాలు రాయవరం: చదువులో ఒత్తిడి.. ర్యాంకులు.. మార్కులు.. ఆత్మన్యూనత.. ఇలా కారణం ఏదైనా కావచ్చు.. నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధంతరంగా ముగించేస్తున్నారు. తాజాగా అంబాజీపేటలో ఒక బాలిక పదో తరగతి ఫలితాల్లో ఫెయిలవుతానన్న భయంతో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ నెల 23న పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. ఒత్తిడితో ప్రాణాలను బలి తీసుకోవద్దని, ఒత్తిడిని చంపేసి ఉజ్వల భవితకు బాటలు వేసుకోండని, ఆత్మ స్థైర్యాన్ని పెంచుకోవాలని మానసిక నిపుణులు, విద్యావేత్తలు సూచిస్తున్నారు. జీవితంలో పాసైన వారెందరో మనిషి జీవితంలో ఒడుదొడుకులు సహజం. కష్టం వచ్చిందని కుంగిపోతే రేపటి పనిని పూర్తి చేయలేం. ఈ విషయాన్ని పిల్లలు గుర్తించాలి. ● గోదావరి జిల్లాలకే చెందిన ఎల్లాప్రగడ సుబ్బారావు ఇంటర్ మూడుసార్లు తప్పినా ప్రపంచంలో అత్యంత గొప్ప శాస్త్రవేత్తగా ఎదిగారు. ఎన్నో యాంటీ బయాటిక్స్‌ను కనుగొన్నారు. రక్తహీనత ఎందుకు వస్తుందో కనిపెట్టి దానికి చికిత్సా విధానాలను కనిపెట్టారు. ● చిన్నతనంలో మొద్దబ్బాయ్గా పిలవబడిన ఐన్‌స్టీన్ ప్రపంచ విఖ్యాత శాస్త్రవేత్త అయ్యారు. ● ప్రపంచాన్ని శాసిస్తున్న మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ విద్యార్థిగా వెనుకబడిన వారే. ● సచిన్ టెండూల్కర్ చదువులో రాణించలేక పోయినా తాను ఎంపిక చేసుకున్న క్రికెట్ రంగంలో ప్రపంచ కీర్తిని పొందాడు. ● స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు విద్యాభ్యాసంలో వెనుకబడినా, తనకిష్టమైన నటనా రంగంలో పేరు ప్రతిష్ఠలు సంపాదించారు. ● పదిలో ఫెయిలై డాక్టర్లు అయిన వారు, ఐఏఎస్‌లు అయిన వారు ఎందరో ఉన్నారు. ● చదువుపై ఇష్టం లేకుంటే తమకు ఆసక్తి ఉన్న క్రీడలు, సంగీతం, వ్యాపారం ఇలా వారికి నచ్చిన రంగాన్ని ఎన్నుకోవాలి. ఫలితాలు విడుదలయ్యే సమయం ఏప్రిల్, మే నెలలు పరీక్షా ఫలితాలు విడుదలయ్యే సమయం. ఇప్పటికే ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. మరో మూడు రోజుల్లో పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. అలాగే డిగ్రీ, పీజీ వంటి పలు ఉన్నత కోర్సుల ఫలితాలు విడుదలవుతాయి. ఈ ఫలితాలు కొందరికి మధురానుభూతిని..మరికొందరికి చేదు జ్ఞాపకాలను మిగల్చడం సహజం. ఇంటర్ ఫలితాల్లో కొందరు అత్యుత్తమ మార్కులు సాధిస్తే, మరికొందరు ఫలితాలు నిరాశాజనకంగా ఉన్నాయని, ఇంకొందరు పరీక్ష తప్పామని క్షణికావేశానికి లోనై కాని పనులు చేస్తున్నారు. పదితో ప్రారంభం పదో తరగతి నుంచే విద్యార్థులకు ఒత్తిడి ప్రారంభమవుతోంది. పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవాలని కొందరు తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత అసలు సిసలైన పరీక్ష మొదలవుతుంది. జీవితంలో స్థిరపడడానికి అవసరమైన ఇంటర్మీడియేట్‌లో చేరతారు. ఇక్కడా అదే ఒత్తిడి. బాగా చదవాలని తల్లిదండ్రులు రూ.లక్షలు వెచ్చించి కార్పొరేట్ విద్యా సంస్థల్లో చేర్పించి ఆనక ఉత్తమ ఫలితాల కోసం పిల్లలపై ఒత్తిడి పెంచుతారు. ప్రశాంతంగా ఆలోచించాలి ఫలితాలు ఎలా ఉన్నా.. కాసేపు ప్రశాంతంగా ఆలోచించుకుని ఆత్మ విమర్శ చేసుకుంటే చాలని, అనవసర మైన ఆందోళనలకు ఒత్తిడికి గురై తప్పుడు దారులు వెతకరాదని విద్యావేత్తలు సూచిస్తున్నారు. ఓటమి విజయానికి తొలి మెట్టని, నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నది వీరి సూచన. ఎందుకు ఓడిపోయాం? కారణమేమై ఉంటుంది? మరోసారి అలాంటి తప్పు జరగకుండా సరిదిద్దుకుని మళ్లీ ప్రయత్నిస్తే విజయం తప్పక వరిస్తుందని మానసిక నిపుణులు అభిప్రాయం. విద్యార్థులకు సూచనలు ● పాస్, ఫెయిల్ అన్నవి సాధారణ విషయాలు. ● జీవితం ఎంతో విలువైనది. భవిష్యత్‌లో ఎన్నో విజయాలు సాధిస్తామన్న సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి. ● ఏ ఫలితమూ జీవితాన్ని నిర్దేశించదు. ● వ్యతిరేక ఫలితం ఎదురైతే కాసేపు ప్రశాంతంగా ఆలోచించి జరిగిన పొరపాటును గుర్తించాలి. ● ఒత్తిడి నుంచి వేగంగా బయటపడే ప్రయత్నం చేయాలి. ● జరిగిన తప్పును వీలైనంత వరకు తల్లిదండ్రులకు చెబితే 90 శాతం భారం దిగి పోయినట్లేనని గ్రహించాలి. ● వెనుకబడిన సబ్జెక్టులు లేదా పాఠ్యాంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి అవసరమైతే అధ్యాపకులు, సీనియర్ల సూచనలు, సలహాలను తీసుకోవాలి. ● తొందరపాటు నిర్ణయాల వల్ల తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఎంత క్షోభకు గురవుతారోనని ఒక్క క్షణం ఆలోచించాలి. ఒత్తిడిలో ఉన్న పిల్లలను గుర్తించాలి పరీక్షల్లో తప్పినంత మాత్రాన జీవితం ముగిసినట్లు కాదు. పరీక్ష తప్పిన విద్యార్థులు ఆత్మన్యూనతను వీడాలి. జరిగిన తప్పు పునరావృతం కాకుండా చూసుకోవాలి. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనను గమనిస్తూ ఉండాలి. డిప్రెషన్లో ఉన్న పిల్లలు నిద్రాహారాలకు దూరంగా ఉంటారు. ఒంటరితనాన్ని కోరుకుంటారు. అటువంటి వారి పట్ల స్నేహపూర్వకంగా మెలగుతూ వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపాలి. – డాక్టర్ సౌమ్య పసుపులేటి, మానసిక వైద్యురాలు, ఏరియా ఆస్పత్రి, అమలాపురం తల్లిదండ్రులు ఇవి గుర్తుంచుకోవాలి తమ పిల్లలు అనుకున్న మార్కులు సాధించలేదనో, పరీక్ష తప్పారనో వారిని మందలించొద్దు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులతో పోల్చి అవహేళన చేయవద్దు. ఫలితాల సమయంలో పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. ఫలితాలు ప్రతికూలంగా వస్తే వారు తీవ్ర నిరాశకు గురవుతారు. ఆ సమయంలో వారిని అక్కున చేర్చుకోవాలి. శ్రీజరిగిన పొరపాటు గురించి పిల్లలతో సున్నితంగా చర్చించి, మీకు మేమున్నామన్న భరోసాను ఇవ్వగలిగితే వారికి తిరుగేలేదు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
సఖినేటిపల్లి: అంతర్వేది దేవస్థానం గ్రామ పరిధిలోని రాంబాగ్ సమీపంలో ప్రధాన రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పాశర్లపూడికి చెందిన నిమ్మకాయల వ్యాపారి బోణం బాపిరాజు (35) అక్కడికక్కడే మృతి చెందాడు. దేవస్థానంలో వ్యాపారం ముగించుకుని బైక్‌పై గ్రామ సరిహద్దుకు వచ్చేసరికి ఎదురుగా రావులపాలెం నుంచి అంతర్వేది ఆలయానికి వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి బంధువు బి.వెంకటరత్నం ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై కె.దుర్గా శ్రీనివాసరావు తెలిపారు.ప్రేమించి మోసగించినందుకు కేసుఐ.పోలవరం: ప్రేమించి పెళ్లి చేసుకొంటానని నమ్మించి ఒక యువతిని మోసం చేయడంపై పోలీసు కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం మండలంలోని కేశనకుర్రు గ్రామానికి చెందిన ఒక యువతి, కొమరగిరి గ్రామానికి చెందిన చెయ్యేటి బాల సురేంద్ర కొంత కాలంగా ప్రేమించుకొంటున్నారు. అయితే ఆమె పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో సురేంద్ర అంగీకరించకపోవడంతో నమ్మి మోసపోయానని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై ఎస్సై శ్రీనివాసరెడ్డి ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.6 కాసుల బంగారు గొలుసు చోరీఉండ్రాజవరం: మండలంలో మోర్త గ్రామంలో పోతాప్రగడ సూర్యకుమారి ఇంట్లో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆరు కాసుల బంగారు గొలుసును చోరీ చేశారు. సూర్యకుమారి తెలిపిన వివరాల మేరకు శనివారం రాత్రి బెడ్రూమ్లో తలుపులు దగ్గరగా వేసుకుని పడుకున్నామని తెలిపారు. రాత్రి 2 గంటల సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించడంతో అలజడికి మెలకువ వచ్చి దొంగదొంగ అని అరవగా ఆ వ్యక్తి వెనుక గుమ్మం నుంచి పారిపోయినట్లు ఆమె తెలిపారు. తమకు అనుమానం వచ్చి తలదిండు తీసి చూడగా అక్కడ పెట్టుకున్న సుమారు ఆరు కాసుల బంగారం గొలుసు కనిపించకుండా పోయిందన్నారు. సూర్యకుమారి ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జి.శ్రీనివాసరావు తెలిపారు. -
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆదిత్య ప్రతిభ
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జేఈఈ మెయిన్స్–2025 ఫలితాల్లో రెగ్యులర్ ఇంటర్మీడియేట్ విద్యార్థులు అత్యున్నత ర్యాంకులు సాధించి ప్రతిభ చూపారని ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి ఆదివారం తెలిపారు. ఆలిండియా స్థాయిలో కె.రుత్విక్ 23వ ర్యాంక్, పి.ఆదిత్య అభిషేక్ 46వ ర్యాంక్ సాఽధించి ప్రతిభ చాటారన్నారు. వీటితో పాటు 109, 112, 118, 135, 144, 155, 206, 212, 280, 300, 309, 342, 359, 395, 524 ర్యాంకులు వరుసగా సాధించారన్నారు. అలాగే 2 వేల లోపు 44 మంది, 5 వేల లోపు 102 మంది అత్యున్నత ర్యాంకులు సాధించి పటిష్టమైన అకడమిక్ పోగ్రాంకు నిలువుదట్టంగా నిలిచాయన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఆదిత్య విద్యాసంస్థల కార్యదర్శి దీపక్‌రెడ్డి, హాస్టల్ డైరెక్టర్ లక్ష్మీరాజ్యం, డైరెక్టర్లు శృతి, సుగుణ, ప్రిన్సిపాల్ మెయినా, కో–ఆర్డినేటర్ కె.లక్ష్మీకుమార్, అకడమిక్ డైరక్టర్ రాఘవరెడ్డి, పి.గంగిరెడ్డి, సత్యనారాయణరెడ్డి, ఐఐటీ క్యాంపస్ వైస్ ప్రిన్సిపాల్ ఫణీంద్ర అభినందించారు. -
గోదావరిలో మృతదేహం లభ్యం
మృతుడు రాజమహేంద్రవరం వాసిగా గుర్తింపు కొవ్వూరు: రాజమహేంద్రవరం ఆర్టీసీ కాలనీకి చెందిన సుంకర మదన్ కిశోర్ (45) అనే వ్యక్తి మృతదేహం ఆదివారం ఏరినమ్మ ఘాట్‌లో లభ్యమైనట్లు సీఐ పి.విశ్వం తెలిపారు. మృత దేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. శనివారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదని రాజమహేంద్రవరం ప్రకాష్‌నగర్ పోలీసు స్టేషన్లో మృతుడి సోదరుడు పవన్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వ్యక్తి అదృశ్యం కేసు నమోదు చేశామని ఎస్సై జి.సతీష్ తెలిపారు. మృతుడు ఓఎన్జీసీలో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. శనివారం సాయంత్రం 5.30 గంటల సమయంలో సోదరుడు పవన్‌కుమార్‌కి ఫోన్ చేసి తన కుమార్తె, తల్లితో మాట్లాడాలి ఇవ్వమని చెప్పి కొద్దిసేపు మాట్లాడాడని, అనంతరం నది ఒడ్డున తాళాలు పెట్టి స్నానానికి వెళ్తున్నట్టు చెప్పాడని ఫిర్యాదుల పేర్కొన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్నానానికి వెళ్లి నదిలో మునిగిపోయినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారని ఎస్సై సతీష్ తెలిపారు. -
తిరుమల విద్యార్థుల ప్రభంజనం
రాజమహేంద్రవరం రూరల్: ప్రతిష్టాత్మిక జేఈఈ మెయిన్స్ పరీక్షలో రాజమహేంద్రవరంలోని తమ తిరుమల ఐఐటీ అండ్ మెడికల్ అకాడమీ విద్యార్థులు అత్యద్భుత ఫలితాలు సాధించినట్లు తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు తెలిపారు. వివిధ కేటగిరీలలో జాతీయ స్థాయిలో కె.ప్రణీత్ 2వర్యాంకు, కె.యశ్వంత్ సాత్విక్ 3, పి.శరత్ సంతోష్ 9, వి.తేజశ్రీ 18, టి.జశ్వంత్ దొర 30, కె.అభినవ్ 45, కె.యశ్వంత్ రాజా 46, జి.సుజోష్ రాజా 66, ఇ.వర్షిత్ 75, ఎం.కారుణ్య రాజ్ 86వ ర్యాంకు సాధించారన్నారు. కె.వెంకటరామ వినీష్ 100, జి.కార్తీక్ 120, వి.రామసాయి వరుణ్ 153, జి.చేతన్ నాగఅనిరుథ్ 154, కె.శంకర్ మాణిక్ 191, ఎం.సిరి సంజన 204, పి.జశ్వంత్ సాయిచరణ్ 219, ఎం.విశ్వనాథ నాగసాయిరామ్ 224, డి.అశిష్ సాయిశ్రీకర్ 235, కె.సాయి సృజన 236, సీహెచ్ శ్రీచరణ్ 242, వై.దేవేష్ రుత్విక్ 246, పి.ప్రణవ్ రుద్రీష్ 247 ర్యాంకులు కై వసం చేసుకున్నారన్నారు. వీటితో పాటు 292, 310, 313, 319, 326, 331, 338, 349, 366, 391, 395, 403, 429, 444, 465, 473 ర్యాంకులను తమ విద్యార్థులు సాధించారన్నారు. 1000 లోపు 58 మంది, 5000 లోపు 254 మంది, 10,000 లోపు 417 మంది, 20,000లోపు 654 మంది ర్యాంకులు సాధించారని, కోచింగ్ తీసుకున్న విద్యార్థుల్లో 1,620 మంది అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత పొంది 93 శాతం సక్సెస్ రేటు సాధించారని ఆయన తెలిపారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఆయనతో పాటు అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్ బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరి అభినందించారు. -
పేరుపాలెం బీచ్‌లో యువకుడి మృతి
నల్లజర్ల: స్నేహితులతో కలసి సముద్ర స్నానానికి వెళ్లిన యువకుడు అలల ఉధృతికి కొట్టుకుపోయి మృతి చెందాడు. పేరుపాలెం బీచ్‌లో శనివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే.. నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలేనికి చెందిన సుమారు పది మంది యువకులు శుక్రవారం రాత్రి పేరుపాలెం బీచ్‌కు వెళ్లారు. వారిలో సంకెళ్ల ఉదయ కుమార్ (20) శనివారం ఉదయం సముద్రంలో స్నానం చేస్తూ కొట్టుకుపోయాడు. వెంటనే స్థానికులు అతడిని రక్షించి ఒడ్డుకు చేర్చారు. తొలుత స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం నర్సాపురం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. ఈ ఘటన చూసి మరో యువకుడు దేవరపల్లి సికిందర్ సొమ్మపిల్లి పడిపోయాడు. అతడిని నర్సాపురం ఆసుపత్రికి తరలించారు. కాగా.. ఆవపాడుకు చెందిన మరో యువకుల బృందం కూడా పేరుపాలెం బీచ్‌కు వెళ్లింది. వారిలో కోడే పవన్ కుమార్ అలల ఉధృతికి కొట్టుకుపోయాడు. స్ధానికులు అతనిని బయటకు తీసుకువచ్చారు. అస్వస్థతకు గురైన పవన్ కుమార్ తొలుత నర్సాపురం అనంతరం భీమవరం ఆసుపత్రికి తరలించారు. కోడిగుడ్డుపై ఏసుక్రీస్తు చిత్రం రాయవరం: ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని రాయవరం గ్రామానికి చెందిన పెయింటర్ ఇండుగమిల్లి సౌదాగర్ కోడిగుడ్డుపై ఏసుక్రీస్తు చిత్రాన్ని చిత్రీకరించాడు. కేవలం రెండు గంటల సమయంలో వాటర్ కలర్స్‌లో దీన్ని రూపొందించాడు. ఈ సందర్భంగా సౌదాగర్ మాట్లాడుతూ గుడ్‌ఫ్రైడే రోజున జీసస్ మృతి చెంది మూడో రోజు పునరుత్థానం చెందిన సందర్భాన్ని పురస్కరించుకుని దీన్ని చిత్రీకరించినట్టు తెలిపాడు. ఇండుగమిల్లి సౌదాగర్ -
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడాలి
ప్రత్తిపాడు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందని సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి బుగత బంగార్రాజు అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ మోసపూరిత విధానాలపై, ప్రధాని మోదీ ఫాసిస్టు పాలనపై బలమైన ప్రజా పోరాటాలు చేపట్టాలని పిలుపు నిచ్చారు. ప్రత్తిపాడు లిబరేషన్ కార్యాలయంలో శనివారం నియోజకవర్గ స్థాయి కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బంగార్రాజు మాట్లాడుతూ సూపర్ సిక్స్‌తో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. దళిత, ఆదివాసీలపై, మహిళలపై హత్యలు, అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాలన్నారు. పేదలు సాగుచేస్తున్న భూములకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఆదివాసీ భూములు కబ్జా చేసేలా మైనింగ్ మాఫియాకు అండగా ఉంటూ రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుందని దుయ్యబట్టారు. సనాతన ధర్మం పేరుతో పవన్‌కళ్యాణ్ ప్రజలను మరింత మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఈ నెల 22న నిర్వహించే లిబరేషన్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం, మే 20న నిర్వహించే అఖిల భారత సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. లిబరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు రేచుకట్ల సింహాచలం, కె.జనార్ధన్, మానుకొండ లచ్చబాబు ప్రసంగించారు. కార్యక్రమంలో లిబరేషన్ అనుబంధ సంస్థల నాయకులు తాడి నాగేశ్వరరావు, రాజాల రత్నం, చిన్నం అర్జునుడు, అనుసూరి లక్ష్మి, మాసా రాజామణి, దుమ్ముల సింహాచలం, డక్కమళ్ల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
శ్రీషిర్డీసాయి విద్యార్థుల విజయభేరి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జేఈఈ మెయిన్స్ రెండో సెషన్ ఫలితాలలో శ్రీ షిర్డీసాయి జూనియర్ కళాశాల విద్యార్థులు వివిధ కేటగిరిలలో అత్యుత్తమ ఫలితాలు సాధించారు. ఈ విషయాన్ని ఆ విద్యాసంస్థల డైరెక్టర్ టి.శ్రీవిద్య శనివారం విలేకరులకు తెలిపారు. తమ లక్ష్య ఐఐటీ అకాడమీలో శిక్షణ పొందుతున్న శ్రీసాయి హిమ్నీష్ జాతీయ స్థాయిలో 15వ ర్యాంకు సాధించాడన్నారు. సీహెచ్ మోక్షిత్ 35, ఎం.మధులిక రెడ్డి 169, మోహన్ శ్రీరామ్ జీ 287 ర్యాంకులు కై వసం చేసుకుని అత్యుత్తమ ప్రతిభ కనపరచారన్నారు. మొత్తం 10 మంది విద్యార్థులు 1000 లోపు ర్యాంకులు సాధించగా, 23 మంది 2000 లోపు, 45 మంది 5000 లోపు, 64 మంది 10000 లోపు, 88 మంది 20000 లోపు ర్యాంకులు సాధించినట్లు శ్రీవిద్య వివరించారు. మొత్తం 245 మంది విద్యార్థులు హాజరుకాగా 186 మంది విద్యార్థులు అడ్వాన్స్‌కు అర్హత సాధించవచ్చునన్నారు. విద్యాసంస్థల చైర్మన్ తంబాబత్తుల శ్రీధర్ మాట్లాడుతూ ప్రతి ఏటా తమ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించటంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు విజేతలైన విద్యార్థులను, అందుకు కృషి చేసిన అధ్యాపక బృందాన్ని చైర్మన్ శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, లక్ష్య అకాడమీ డీన్ చంద్రశేఖర్ అభినందించారు. -
టెన్షన్.. టెన్షన్..
19ఆర్జేసి09:19ఆర్జేసి208: 19ఆర్జేసి14:ఫాస్టర్ ప్రవీణ్ మృతిచెందిన స్థలం వద్ద నివాళులర్పిస్తున్నక్రైస్తవులు,వివిధసంఘాలు నేతలుఇంటి వద్ద మాజీ ఎంపీ హర్షకుమార్ నక్కా వెంకటరత్నాన్ని అరెస్టు చేస్తున్న దృశ్యం ● పాస్టర్ ప్రవీణ్ మృతి చెందిన స్థలంలో ఉద్రిక్తత ● నివాళులర్పించేందుకు వచ్చిన మాజీ ఎంపీ హర్హకుమార్ ● ఆయనను జీపులో తరలించిన పోలీసులు ● భారీగా తరలివచ్చిన క్రైస్తవ సంఘాలు రాజమహేంద్రవరం రూరల్: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి చెందిన స్థలంలో కొవ్వొత్తులతో నివాళులర్పించాలని మాజీ ఎంపీ హర్షకుమార్ పిలుపున్విడంతో శనివారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రవీణ్ మృతి చెందిన స్థలానికి హర్షకుమార్ శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు ఆయనను వెంటనే జీపులో ఎక్కించుకుని పలు స్టేషన్లకు తరలించారు. ఈ లోగా భారీ సంఖ్యలో వివిధ సంఘాల నేతలు, క్రైస్తవులు అధిక సంఖ్యలో ప్రవీణ్ మృతి చెందిన స్థలం దగ్గరకు చేరుకున్నారు. వారికి అక్కడకు వెళ్లకుండా పోలీసులు బారీకేడ్లు ఏర్పాటు చేశారు. కానీ క్రైస్తవ సంఘాల నాయకులు వాటిని తోసుకుని వెళ్లి ప్రవీణ్ మృతి చెందిన స్థలంలో కొవ్వొత్తులతో నివాళులర్పించి, సుమారు గంట పాటు ప్రార్థనలు చేశారు. పాస్టర్ ప్రవీణ్‌ది ముమ్మాటికే హత్యేనని, ప్రస్తుత పాలకులు, పోలీసులు రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈలోపు బీఎస్పీ నాయకుడు ఇసుకపట్ల రాంబాబు, మాలమహానాడు నాయకుడు నక్కా వెంకటరత్నం, ఆర్పీఐ నాయకుడు జంగం సుబ్బారావు, నిడదవోలుకు చెందిన రమేష్‌ను పోలీసులు జీపుల్లోకి ఎక్కించుకుని రాజానగరం పోలీసుస్టేషన్‌కు తరలించారు. దీంతో రాత్రి 7.30 గంటల వరకూ ఉద్రిక్తత చోటు చేసుకుంది. హర్షకుమార్‌ను సుమారు ఐదు గంటల పాటు విఽవిధ స్టేషన్లకు తిప్పి రాత్రి 7.30 గంటలకు ఇంటి వద్ద వదిలిపెట్టి, భారీ ఎత్తున పోలీసు పహారా ఏర్పాటు చేశారు. జగన్ ప్రభుత్వం ఎంతో బెటర్: హర్హకుమార్ ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం కన్నా జగన్ పాలన ఎంతో బాగుండేదని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ అన్నారు. శనివారం రాత్రి ఆయన ఇంటి వద్ద విలేకరులతో మాట్లాడారు. పోలీసులు తనను అదుపులోకి తీసుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలో ఐదు గంటల పాటు తనను పోలీస్ జీపులో తిప్పుతూ ఇబ్బంది పెట్టారన్నారు. పోలీసులు తనను తీసుకువెళ్లినా కార్యక్రమం విజయవంతమైందన్నారు. -
వాడపల్లి వెంకన్న క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లిలోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామివారి క్షేత్రం శనివారం గోవింద నామస్మరణతో మార్మోగింది. ఆలయ ప్రాంగణంతో పాటు వాడపల్లి గ్రామం కూడా భక్తులతో కిక్కిరిసిపోయింది. దేవదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్, అర్చకులు, వేదపండితులు సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, హోమాలు నిర్వహించారు. స్వామివారిని వివిధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఏడు వారాలు – ఏడు ప్రదక్షిణల నోము చేపట్టిన భక్తులు వేంకటేశ్వరస్వామిని వివిధ నామాలతో కొలుస్తూ మాడ వీధుల్లో ప్రదక్షిణలు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ఏడువారాలు పూర్తయిన భక్తులు స్వామివారికి అష్టోత్తర పూజలు జరిపించారు. అనంతరం ఆలయ ఆవరణలోని క్షేత్ర పాలకుడు అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామిని దర్శించుకుని, అన్నప్రసాదం స్వీకరించారు. డీసీ అండ్ ఈఓ చక్రధరరావు ఆధ్వర్యంలో దేవస్థానం సిబ్బంది భక్తుల సౌకర్యార్థం వివిధ ఏర్పాట్లను పర్యవేక్షించారు. సాయంత్రం 5 గంటల వరకూ స్వామివారికి ప్రత్యేక దర్శనం, అన్నప్రసాద విరాళాలు, వివిధ సేవలు, లడ్డూ విక్రయం, ఆన్లైన్ ద్వారా దేవస్థానానికి రూ.42,03,230 ఆదాయం సమకూరిందని డీసీ అండ్ ఈఓ చక్రధరరావు తెలిపారు. -
విజయం విద్యార్థులది.. ప్రచారం నాయకులది..!
వివాదాస్పదంగా మాధ్యమాల పోస్టింగులు కొత్తపల్లి: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థినులు కష్టపడి చదివి ఇటీవలి ఇంటర్మీడియెట్ ఫలితాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో ఉత్తీర్ణత సాధించారు. వారి విజయాన్ని కొందరు కూటమి నాయకులు అదంతా తమ ప్రతిభేనని సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేసుకుంటున్నారు. ఇది కాస్తా వివాదాస్పదంగా మారి దూషణల వరకు వెళ్లింది. మండలంలోని మూలపేట జెడ్పీ బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ ప్రధమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు నియోజకవర్గంలోని ప్రైవేటు కళాశాలల కంటే అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. దీంతో గ్రామంలో ఉన్న కూటమి నాయకుడు విద్యార్థులను అభినందిస్తూ పాఠశాల వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేసి సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేసుకున్నాడు. దీంతో మరో కూటమి నాయకుడు ఆ వ్యక్తి పేరును తొలగించి తన పేరుతో తయారు చేసుకున్న ఫ్లెక్సీని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నాడు. దీంతో వారి ఇద్దరి మధ్య సామాజిక మాధ్యమాల వేదికగా వ్యక్తిగతంగా దూషణలు చోటుచేసుకున్నాయి. ఈ మేరకు కూటమి నాయకుల మధ్య కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో పంచాయితీ నిర్వహించారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి)గండేరా (వెయ్యి) 20,000 గటగట (వెయ్యి) 18,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 19,000 గటగట (వెయ్యి) 17,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు అభినందనలు
గండేపల్లి: 2025లో బీటెక్ పూర్తిచేసి ఉద్యోగాలు సాధించిన 1507 మంది విద్యార్థులు, వారిని పోత్సహించిన తల్లిదండ్రులకు ప్రగతి ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ పరుచూరి కృష్ణారావు అభినందనలు తెలిపారు. సూరంపాలెం ప్రగతి ఇంజినీరింగ్ కళాశాలలో ప్లేస్మెంట్ డే–2025 వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ కళాశాల ప్రాంగణ ఎంపికల ద్వారా ఉద్యోగ కల్పనలో పురోగతిని సాధిస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్ టీసీఎస్‌కు చెందిన చల్లా నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు ఉద్యోగాలు సాధించినప్పటికీ నూతన ఆవిష్కరణలు పెంపొందించుకోవాలన్నారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు, ముఖ్య అతిథిని సత్కరించారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ ఎంవీ హరనాథబాబు, కె.సత్యనారాయణ, ప్లేస్మెంట్ ఆఫీసర్ ఎం.రాధికామణి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. విధులకు ఆటంకం కలిగించిన వారిపై కేసు సీతానగరం: మండలంలోని రఘుదేవపురం పంచాయతీ కార్యదర్శి గేదెల జయ భార్గవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భార్యాభర్తలైన తన్నీరు జయమ్మ, నూకరాజుపై కేసు నమోదు చేశామని ఎస్సై డి.రామ్ కుమార్ శనివారం తెలిపారు. వివరాల్లోకి వెళితే.. రఘుదేవపురం చెరువు గట్టును ఆక్రమించి ఇల్లు కడుతున్న జయమ్మ, నూకరాజులపై హైకోర్టు ఉత్తర్వుల మేరకు నిర్మాణ నిలిపివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పంచాయతీ కార్యదర్శి జయ భార్గవి తన సిబ్బందితో కలిసి ఈనెల ఒకటిన నోటీసులు అందించడానికి వెళ్లారు. అయితే వారి విధులకు జయమ్మ, నూకరాజు ఆటంకం కలిగించి, దుర్భాషలాడుతూ, భయభ్రాంతులకు గురి చేశారు. పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
రేపు కాకినాడ బార్ అసోసియేషన్ ఎన్నికలు
కాకినాడ లీగల్: కాకినాడ బార్ అసోసియేషన్ ఎన్నిక సోమవారం జరగనున్నది. 2025–26 సంవత్సరానికి జరుగుతున్న ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి ఏలూరి సుబ్రహ్మణ్యం, పి.ప్రసన్నకుమార్, ఉపాధ్యక్ష పదవికి పి.రామచంద్రరాజు, ముత్తా వెంకన్న, జనరల్ సెక్రటరీగా సీహెచ్ వీరభద్రరావు (చంటి), రెడ్డి అన్నవరం, కేవీవీఎస్‌ఎన్ మూర్తి, బబిలిశెట్టి సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ పదవికి బండి నరేంద్ర, వెలిగొట్ల శ్రీనివాస్, కోశాధికారి పదవికి కోకా వెంకట కృష్ణారావు, జి.వెంకట దుర్గాప్రసాద్, లైబ్రరీ సెక్రటరీకి మేడపాటి రామారెడ్డి, షేక్ అమీర్ జానీ, గండికోట కళ్యాణి, స్టోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా మంగా వెంకట శివరామకృష్ణ, గింజాల చక్రవర్తి, జోకా వీఎస్ విజయకుమార్, మహిళ ప్రతినిధి పదవికి జి.దివ్య శ్రీవిద్య, ఎస్.స్వర్ణలత, సీనియర్ కమిటీ మెంబర్‌కి ఎర్మల్ వసంతకుమారి, నక్కా సంజీవ్, కమిటీ సభ్యులుగా దుళ్ల నాగబాబు, గుత్తుల మంగరాజు, ఎం.ప్రసాదరావు, మర్ల ప్రవల్లిక, షేక్ ప్రేమ్‌నజీర్ పోటీ చేస్తున్నారు. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న సీనియర్ న్యాయవాది ఏలూరి సుబ్రహ్మణ్యం 43 సంవత్సరాలుగా న్యాయవాద వృత్తిలో ఉన్నారు. కాకినాడలో క్రిమినల్ న్యాయవాదిగా గుర్తింపు పొందారు. గతంలో ఆయన 2021–2022 సంవత్సరానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2022–23లో కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2023–24 ఎన్నికల్లో విజయం సాధించలేదు. తిరిగి ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మరో అభ్యర్థి, సీనియర్ న్యాయవాది పి.ప్రసన్నకుమార్ 39 సంవత్సరాలుగా క్రిమినల్ న్యాయవాద వృత్తిలో ఉన్నారు. రెండు పదవులు ఏకగ్రీవం సూపర్ సీనియర్ కమిటీ మెంబర్‌గా వేగుళ్ల వెంకట రమణమూర్తి, మహిళా కమిటీ మెంబర్‌గా కె.శ్రీవాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
కొండపై కోటరీల కుమ్ములాట
ఇక్కడ పని చేయలేమంటూ.. ● అన్నవరం దేవస్థానంలో పని చేయలేమంటూ పలువురు వెళ్లిపోతున్నారు. ● అసిస్టెంట్ కమిషనర్ సీహెచ్ రామ్మోహనరావుకు గత ఈఓ, ప్రస్తుత కమిషనర్ రామచంద్ర మోహన్‌కు సన్నిహితుడనే ముద్ర ఉంది. రామ్మోహనరావు అన్నవరం నుంచి రాజమహేంద్రవరం, పెద్దాపురం మరిడమ్మ ఆలయంలో పని చేసి, అన్నవరం తిరిగి వచ్చారు. నాలుగు నెలల్లో రిటైర్ కానున్న తరుణంలో ఆయన వీఆర్ఎస్కు దరఖాస్తు చేశారు. ● అన్నదానం ఏఈఓ భ్రమరాంబ సిక్ లీవ్‌పై కొండ దిగిపోయారు. ● విజయవాడ నుంచి డెప్యూటేషన్‌పై వచ్చి, అన్నవరంలో పని చేస్తున్న శానిటరీ ఇన్స్పెక్టర్ వీఆర్ఎస్కు అర్జీ పెట్టుకున్నారు. ● సీనియర్ అసిస్టెంట్ ఓలేటి జగన్నాథం, ఇద్దరు ఏఈఓలు జగ్గారావు, శ్రీనివాస్ సెలవు పై వెళ్లిపోయేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ● ఎన్నో ఏళ్లుగా ఆలయంలో సెక్యురిటీ గార్డులుగా పని చేస్తున్న 10 మందిని అకస్మాత్తుగా తొలగించేశారు. ఆలయానికి వస్తున్న చినబాబును సరైన రీతిలో స్వాగతించడం లేదనే కారణంతో తమను తొలగించేశారని వారంతా ఎమ్మెల్యేల వద్ద మొర పెట్టుకున్నారు. ● సత్యదేవుని సన్నిధిలో ఇదేం నిర్వాకం! ● అవమానంతో కొండ దిగుతున్న సేవకులు ● వీఆర్ఎస్, సెలవులకు క్యూ ● రత్నగిరిపై గాడి తప్పిన పాలన సాక్షి ప్రతినిధి, కాకినాడ: సత్యదేవుని సన్నిధి కోటరీలకు కేంద్ర బిందువుగా మారింది. అగ్రరాజ్యం అమెరికాలో సైతం వ్రతాలు నిర్వహించిన ఖండాంతర ఖ్యాతి వీర వేంకట సత్యనారాయణస్వామి వారి సొంతం. కార్తిక మాసంతో పాటు పండుగలు, వివాహాది శుభకార్యాలప్పుడు రాష్ట్రం నలుమూలల నుంచీ వేలాదిగా తరలివచ్చే భక్తులతో అన్నవరం రత్నగిరి కళకళాడుతూంటుంది. భక్తవరదుడైన సత్యదేవుడు స్వయంభువుగా వెలసిన ఈ కొండపై స్వామివారికి, భక్తులకు సేవలందించాల్సిన అధికారులు.. కుమ్ములాటలతో ఈ క్షేత్రం ప్రాశస్త్యాన్ని దెబ్బ తీస్తున్నారు. ఇక్కడ వివిధ క్యాడర్లలో పని చేస్తున్న 250 మంది రెగ్యులర్, వెయ్యి మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు.. రెండు కోటరీల మధ్య నలిగిపోతున్నారు. దేవస్థానంలో గాడి తప్పిన పాలనపై జిల్లా కలెక్టరే స్వయంగా జోక్యం చేసుకునే పరిస్థితులు ఉత్పన్నం కావడం ఆలయ చరిత్రలోనే తొలిసారి కావడం గమనార్హం. మునుపెన్నడూ లేని రీతిలో కొండపై రెండు కోటరీల మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. ఆలయ కార్యనిర్వహణాధికారులు(ఈఓ)గా దేవదాయ శాఖ నుంచే కాకుండా రెవెన్యూ శాఖ నుంచి కూడా ఎంతో మంది తమ సేవల ద్వారా ప్రశంసలు పొందారు. కారణాలేవైనప్పటికీ దీనికి పూర్తి భిన్నమైన వాతావరణం ఇటీవల ఆలయ పాలనా వ్యవహారాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. వివిధ విభాగాల ఉద్యోగుల మధ్య సమన్వయం కొరవడుతోంది. పరస్పర ఫిర్యాదులతో అన్నవరం సత్యదేవుని ఆలయం రాష్ట్ర స్థాయిలోనే తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. రెవెన్యూ శాఖకు చెందిన వీర్ల సుబ్బారావు గత డిసెంబర్ 14న ఈఓగా బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు ముందు ఇక్కడ ఈఓగా పని చేసిన కె.రామచంద్ర మోహన్ ప్రస్తుతం దేవదాయ శాఖ కమిషనర్‌గా ఉన్నారు. అన్నవరం ఈఓగా పని చేసిన కాలంలో కొన్ని విభాగాల అధిపతులు, ఉద్యోగులు ఆయనకు నమ్మిన బంట్లుగా ఉండేవారు. వారందరినీ రామచంద్ర మోహన్ కోటరీగా చెప్పుకునేవారు. ఆ కోటరీలో ఉన్న వివిధ విభాగాల ఏఈఓలు, ఇతర విభాగాల ఉద్యోగులు ప్రస్తుతం అవమానాలు ఎదుర్కొంటున్నారనే చర్చ ప్రస్తుతం కొండపై నడుస్తోంది. నాడు రామచంద్ర మోహన్‌కు నమ్మకస్తులమనే ముద్ర వలన ఇప్పుడు తమ పని తాము చేసుకునే పరిస్థితులు లేకుండా పోయాయని వారు అంటున్నారు. వివాదాస్పద నిర్ణయాలతో.. దీనికి తోడు తాజాగా కొండపై సీతారామ సత్రం శంకుస్థాపన వ్యవహారం కమిషనర్ రామచంద్ర మోహన్‌కు, ఈఓ సుబ్బారావుకు మధ్య అగాధాన్ని మరింత పెంచిందంటున్నారు. సత్రం శంకుస్థాపన సమాచారం తనకు చెప్పకుండా నేరుగా దేవదాయ శాఖ మంత్రికి ఈఓ తెలియజేయడం కమిషనర్ ఆగ్రహానికి కారణమైందని అంటున్నారు. ప్రిన్సిపాల్ పోస్టింగ్‌పై.. సత్యదేవుని విద్యా సంస్థలో ఎఫ్ఏసీగా పని చేస్తున్న రామ్మోహనరావుకు రెగ్యులర్ ప్రిన్సిపాల్ పోస్ట్ ఇవ్వడం పెద్ద దుమారం రేపుతోంది. రెగ్యులర్ ప్రిన్సిపాల్‌గా ఇవ్వాలంటే పీహెచ్డీ తప్పనిసరి అని తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ నిర్దేశించిన మార్గదర్శకాల్లో స్పష్టంగా ఉందని చెబుతున్నారు. నిబంధనలు అనుమతించనందువల్లనే రామ్మోహనరావుకు గతంలో రామచంద్ర మోహన్ రెగ్యులర్ పోస్టింగ్ తిరస్కరించారు. ఈ పోస్టుకు ప్రధాన అర్హత లేకున్నా, నేషనల్ ఎలిజిబిలిటీ, స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ ఉందంటూ ప్రస్తుత ఈఓ పోస్టింగ్ ఎలా ఇచ్చారని పలువురు ప్రశ్నిస్తున్నారు. సన్నిహితుడు కావడమే అర్హతగా ఈ పోస్టు ఇచ్చారనే విమర్శలు వస్తున్నాయి. సత్యదేవుని ఆలయంలో గతంలో జరిగిన నియామకాల్లో లోపాలున్నాయంటూ పాత ఫైల్స్ తిరగేస్తున్న ఈఓ.. ఎఫ్ఏసీలో ఉన్న వారికి రెగ్యులర్ ప్రిన్సిపాల్ పోస్టు ఇవ్వడంలో ఔచిత్యమేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ పోస్టింగ్ విషయంలో ఈఓ సన్నిహితుడికి వ్యతిరేకంగా పని చేసినందుకు అవమానిస్తున్నారనే మనస్తాపంతో ఈఓ పేషీ, వ్రతాలు పర్యవేక్షించే సూపరింటెండెంట్ కంచి మూర్తి అనారోగ్య కారణాలతో సింహాచలం దేవస్థానానికి బదిలీపై వెళ్లిపోయారని చెబుతున్నారు. గాడి తప్పిన పాలనపై ఫిర్యాదులు ఉద్యోగులు సెలవులు, వీఆర్ఎస్లు పెడుతున్న క్రమంలో అన్నవరం దేవస్థానంలో పాలన గాడి తప్పిందంటూ కమిషనర్‌కు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు వెళ్తున్నాయి. ఇటీవల కొండపై అన్నింటా తానే అన్నట్టు ఓ అధికారి పుత్రరత్నం ‘చినబాబు’ వ్యవహరిస్తున్న తీరును జిల్లా కలెక్టర్ సైతం తీవ్రంగా పరిగణించారని తెలియవచ్చింది. రెవెన్యూలో పని చేస్తున్న ఈఓ సుబ్బారావు అక్కడి నుంచి అన్నవరం దేవస్థానానికి రావడానికి సిఫారసు లేఖలిచ్చిన ప్రజాప్రతినిధులే.. పాలన గాడి తప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని సమాచారం.అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయం -
అన్నవరప్పాడుకు పోటెత్తిన భక్తులు
పెరవలి: అన్నవరప్పాడులోని వేంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున 4 గంటలకే మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి, ఆలయంలోని తులసి కోట వద్ద దీపాలు వెలింగిచారు. స్వామి వారికి అభిషేకం నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. స్వామి, అమ్మవార్లను అర్చకులు వివిధ రకాల పూలతో విశేషంగా అలంకరించారు. భక్తులకు ఉదయం ఉచితంగా ప్రసాదాల పంపిణీతో పాటు 10 గంటల నుంచి అన్న సమారాధాన నిర్వహించారు. సుమారు 6 వేల మంది భక్తులు స్వామి వారి తీర్థప్రసాదాలు స్వీకరించారని ఆలయ ఈఓ మీసాల రాధాకృష్ణ తెలిపారు. ఆలయంలో ఇటీవల ప్రవేశపెట్టిన నిత్య గోత్ర నామార్చన, శుక్రవారం అభిషేకం, గోత్ర నామార్చనకు, స్వామి వారికి పుష్పాలంకరణ, ప్రసాదం, అన్నదాన విరాళాలకు భక్తుల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోందని చెప్పారు. ప్రైవేటు స్కూళ్లలో పేదలకు 25 శాతం సీట్లు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రైవేటు, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్ల కేటాయింపు ప్రక్రియ ప్రారంభమైందని జిల్లా పాఠశాల విద్యా శాఖాధికారి కె.వాసుదేవరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యా హక్కు చట్టం ప్రకారం వెనుకబడిన, అనాథ, హెచ్ఐవీ బాధిత, దివ్యాంగ, బలహీన, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన పిల్లలు ప్రైవేటు, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటో తరగతిలో 25 శాతం ఉచిత సీట్లు పొందేందుకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని వివరించారు. అనాథ, హెచ్ఐవీ బాధితులు, దివ్యాంగులకు 5 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, బీసీ మైనారిటీలు, ఓసీ పల్లె ప్రాంతాల్లో నివసిస్తూ, వార్షిక ఆదాయం రూ.1.20 లక్షలు మించనివారు, పట్టణ ప్రాంతంలో రూ.1.44 లక్షలు మించని వారికి 6 శాతం చొప్పున సీట్లు కేటాయిస్తారని తెలిపారు. తల్లిదండ్రులు, సంరక్షకులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూసీఎస్ఈ.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో సమాచార బులెటిన్ ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 15వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని వాసుదేవరావు సూచించారు. ఆర్ఓబీ పనులు వేగవంతం చేయాలి సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): నిడదవోలు రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ) నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. సాంకేతిక నిపుణుల ఆధ్వర్యాన అధికారులతో కూడిన ఎక్స్పర్ట్ కమిటీ క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించి, పనులు త్వరితగతిన జరిగేందుకు పరిష్కారం చూపాలని అన్నారు. ఇరిగేషన్, రెవెన్యూ, వ్యవసాయ అధికారులతో తన చాంబర్లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రూ.10 వేల కోట్లతో నిర్మించనున్న ఈ బ్రిడ్జితో ఎంతో ప్రయోజనం ఉంటుందని అన్నారు. సమన్వయ శాఖలు, సాంకేతిక నిపుణులతో కూడిన అధికారుల బృందం వాస్తవ పరిస్థితిని అంచనా వేసి నివేదిక అందజేయాలని ఆదేశించారు. ఎర్ర కాలువ వరద ముంపు పరిష్కారంపై అధికారులు ఇచ్చే సూచనలను అనుసరించి జిల్లా మంత్రులతో చర్చించి, ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు, కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత, ఇరిగేషన్ ఎస్ఈ కె.గోపీనాథ్, ఈఈ ఎం.సుబ్రహ్మణ్యం, ఎర్రకాలువ డీఈ కె.రమేష్, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.మాధవరావు పాల్గొన్నారు. కిటకిటలాడిన తొలి తిరుపతి పెద్దాపురం: తొలి తిరుపతి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభ స్వామి ఆలయం వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో శనివారం కిటకిటలాడింది. సుమారు 15 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్ తెలిపారు. వివిధ సేవలు, కేశఖండన టికెట్లు, అన్నదాన విరాళాలుగా రూ.2,91,596 ఆదాయం సమకూరిందని ఈఓ తెలిపారు. -
మ్యారేజ్.. హైరేంజ్..
ఆదివారం శ్రీ 20 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జరుగుతున్న పెళ్లిళ్లలో అడుగడుగునా ఆధునికత కనిపిస్తోంది. సామాన్య, మధ్యతరగతి వారు కూడా అప్పోసొప్పో చేసి చాలా ఆడంబరంగా వివాహాలు చేయడం పరిపాటిగా మారింది. పెళ్లిళ్లలో అనేక కొత్త తరహా పద్ధతులు వచ్చి చేరుతున్నాయి. వాటిని అందరూ ఆమోదించడం గమనార్హం. ఈవెంట్ ఆర్గనైజర్లు కూడా అందుకు తగినట్టుగా పెళ్లి సందడిలో కొత్త కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. పెళ్లి మంటపం, రిసెప్షన్, పెళ్లి కుమార్తె, పెళ్లి కుమారుడిని తయారు చేయడం, సంప్రదాయంగా పంపే సారె.. తదితర వాటిలో ఆధునికతను తీసుకువస్తున్నారు. ప్రస్తుతం జరిగే పెళ్లిళ్లలో ఉత్తరాది, విదేశీ భామలు సైతం సందడి చేస్తున్నారు. సాక్షి, అమలాపురం: ఆధునిక కాలంలో జరుగుతున్న పెళ్లిళ్లలో అనేక కొత్త పోకడలు వచ్చాయి. పెళ్లి పందిరి నుంచి విందు భోజనాల వరకూ అన్నింటిలో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. గతంలో గోదావరి జిల్లాల్లో జరిగే పెళ్లిళ్లలో తాటాకు పందిళ్లు, కొబ్బరి, మొగలి ఆకులతో తయారు చేసిన రకరకాల పువ్వులు, ఆవుపేడతో అలికిన పెళ్లి అరుగు, చుట్టూ ముత్యాల ముగ్గులు, బాజా భజంత్రీలు, సన్నాయి మేళాలు, సంప్రదాయ భోజనాలు, అతిథులకు పసుపు, కుంకుమలు పెట్టి రవికెలు అందించడం కనిపించేంది. కొత్తదనం 1980 నుంచి గోదావరి పెళ్లిళ్లలో కొత్తదనం చోటు చేసుకుంది. టెంట్లు, షామియానాలు, పట్టు పరికిణీలు కట్టుకుని గులాబీలు ఇచ్చే పడుచు పిల్లలు, పన్నీరు జల్లే యంత్రాలు, మ్యూజికల్ నైట్లు, బ్యాండు మేళాలు, పచ్చి పువ్వుల మంటపాలు, పలు రకాల వంటలు, అతిథులకు వడ్డించే కేటరింగ్ కుర్రాళ్లు సందడి చేసేవారు. ఆధునిక బాటలో.. గోదారోళ్ల పెళ్లిళ్లు 2020 నుంచి ఆధునిక బాట పట్టా యి. బాహుబలి సెట్టింగ్‌లు, డీజే సౌండ్లు, సినీ నేప థ్య గాయకులతో సంగీత విభావరి, పెళ్లికి ముందు ఉత్తరాది బారాత్, సంగీత్, హల్దీలు, అనేక రకాల వంటకాలు, ఉత్తరాది భామలతో బుల్లెట్ బండ్ల మీద ఊరేగింపులు, విదేశీ భామలతో వినూత్న స్వాగత సత్కా రాలు.. ఇలా ఆధునిక పుంతలు తొక్కుతున్నాయి. బుల్లెట్ బండ్లపై సందడి పెళ్లిళ్ల ఊరేగింపులో కూడా కొత్త ట్రెండ్ సాగుతోంది. మహారాష్ట్ర, రాజస్థాన్ యువతులు బుల్లెట్ బండ్ల మీద పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె వెంట ఊరేగింపుగా వస్తున్నారు. తలపాగాలు ధరించి, సంప్రదాయ వస్త్రధారణతో బుల్లెట్లు నడుపుతూ దారి పొడవునా సందడి చేస్తున్నారు. అలాగే రష్యా, బ్రెజిల్ భామలు పెళ్లి, రిసెప్షన్ వేదికల వద్ద స్వాగత సత్కారా లు చేస్తున్నారు. విచిత్ర వస్త్రధారణతో ఆహూతుల ను అలరిస్తున్నా రు. వెస్ట్రన్ మ్యూజిక్కు లయబద్ధంగా డ్యాన్సులు చేస్తూ మంత్రముగ్ధులను చేస్తున్నారు. పీకాక్, స్వాన్ వేషధారణలతో స్వాగతం పలుకుతున్నారు. వీరితో పాటు అతిథులకు ముంత లస్సీలు అందజేసే మరాఠీ మహిళలు, కేటరింగ్ చేసే ఒడిశా యువతులు, ప్రత్యేకంగా బాదంపాలు అందించే పశ్చిమ బెంగాల్ మహిళలు, రకరకాల స్వీట్ పాన్లు అందించే నవాబులు ఇలా ప్రతి చోటా పెళ్లికి వచ్చేవారికి మర్యాదలు చేస్తున్నారు. ఇలా ఒక్కొక్క ఈవెంట్‌కు సుమారు రూ.5 లక్షల నుంచి రూ.కోటి వరకూ ఖర్చవుతుందని అంచనా. ఖర్చు అధికమే.. రష్యన్ కళాకారులు వివిధ రకాల ప్రదర్శనల కోసం ముంబై, ఢిల్లీలో ఎక్కువగా ఉంటారు. వీరిని పెళ్లి ఈవెంట్‌కు తీసుకురావాలంటే పారితోషికంతో పాటు విమానం టికెట్లు కూడా ఇవ్వాలి. దీంతో ఒకేసారి విశా ఖ, రాజమహేంద్రవరం, కాకినాడ, కోనసీమ ప్రాంతాల్లో ఈవెంట్లు ఏర్పాటు చేసి, వీరిని రప్పిస్తున్నారు. మహారాష్ట్ర, రాజస్థాన్, బెంగాల్ నుంచి వచ్చేవారు పెళ్లిళ్ల సీజన్లో వచ్చి స్థానికంగా ఉంటారు. వీరితో ఆయా రాష్ట్రాల సంప్రదాయ బ్యాండ్ కళాకారులను కూడా ఇక్కడి పెళ్లిళ్లకు తీసుకు వస్తున్నారు.గోదావరి జిల్లాల్లోని ఓ పెళ్లిలో రష్యా అమ్మాయిల సందడి గోదారోళ్ల పెళ్లిళ్లలో ఆధునిక పోకడలు విదేశీ భామల సందడి ఉత్తరాది మహిళలతో అతిథులకు స్వాగతాలు విందు భోజనాల వడ్డన నుంచి పాన్ అందించే వరకూ మర్యాదలు ఖర్చుకు వెనుకాడని ఉమ్మడి జిల్లా వాసులు ఆత్మీయంగా ఉంటారు కోనసీమ జిల్లా ప్రజలు చాలా ఆత్మీయంగా ఉంటారు. మా ప్రదర్శనలను ఉత్సాహంగా తిలకిస్తారు. మాతో సెల్ఫీలు తీయించుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇక్కడ పెళ్లిళ్లు చాలా వైభవంగా జరుగుతాయి. – అలీనా, రష్యా ప్రత్యేక గుర్తింపు వివాహాల సందర్భంగా నిర్వహించే ఊరేగింపుల్లో మాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. మా వేషాలను, ఊరేగింపులో బుల్లెట్ నడిపే తీరును చూసి ప్రజలు ఎంతో ముచ్చట పడతారు. ఈవెంట్ల కోసం చాలా ప్రాంతాలకు వెళతాం. అయితే రాజమహేంద్రవరం, కాకినాడ, కోనసీమ వచ్చినప్పుడు మాకు వచ్చే ఆనందం వేరు. – దామినీ ఈషా, మహారాష్ట్ర అభిరుచి మేరకు ఏర్పాట్లు పెళ్లి చేసే తల్లిదండ్రుల అభిరుచులకు అనుగుణంగా మేము అన్ని ఏర్పాట్లూ చేస్తాం. వేదిక అలంకరణ, ఆహారం, స్వాగత మర్యాదల విషయంలో ఎవరూ రాజీ పడడం లేదు. పెళ్లి, పెళ్లికీ కొత్తదనం ఉండేలా కోరుకుంటున్నారు. అందుకు అనుగుణంగా రష్యాతో పాటు ఉత్తరాది నుంచి కళాకారులను తీసుకువస్తున్నాం. – కొవ్వూరి ధర్మారెడ్డి, ఈవెంట్ నిర్వాహకుడు, రావులపాలెం -
రత్నగిరిపై భక్తుల రద్దీ
● సత్యదేవుని దర్శించిన 40 వేల మంది ● 2,100 వ్రతాల నిర్వహణ ● రూ.40 లక్షల ఆదాయం అన్నవరం: వేలాదిగా వచ్చిన భక్తులతో రత్నగిరి శనివారం రద్దీగా మారింది. శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజామున రత్నగిరిపై, ఇతర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవ దంపతులు, వారి బంధుమిత్రులకు ఇతర భక్తులు కూడా తోడవడంతో ఆలయం కిక్కిరిసిపోయింది. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనా నికి అరగంట సమయం పట్టింది. సత్యదేవుని దర్శించిన అనంతరం భక్తులు సప్త గోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి, రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. స్వామివారిని మొత్తం 40 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. వ్రతాలు 2,100 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదా యం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమా రు 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. సెలవు దినం కావడంతో రత్నగిరిపై ఆదివారం కూడా భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంది. ఉదయం 10 గంటలకు సత్యదేవుడు, అమ్మవారిని టేకు రథంపై ఊరేగించనున్నారు. ఘనంగా ప్రాకార సేవ సత్యదేవుని ప్రాకార సేవ ఘనంగా నిర్వహించారు. ఉదయం 10 గంటలకు సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకువచ్చి, తిరుచ్చి వాహనంపై వేంచేయించారు. పూజల అనంతరం అర్చకులు ప్రాకార సేవ ప్రారంభించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల ఘోష నడుమ ఆలయ ప్రాకారంలో మూడు సార్లు సేవ నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు పండితులు నీరాజనం ఇచ్చి, భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. వేద పండితులు, పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
సీతమ్మ ధర్మనిష్ఠ అపూర్వం
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): ‘రాముడు మూర్తీభవించిన ధర్మస్వరూపుడు. ధర్మనిష్ఠలో ఆయనకు సరితూగేది సీతమ్మ. రాముడిపై లోకాపవాదు తొలగించడంలో నాకూ బాధ్యత ఉంది’ అని సీతమ్మ లక్ష్మణునితో చెబుతుందని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. ఉత్తరకాండపై ఋషిపీఠం సత్సంగం ఆధ్వర్యాన స్థానిక టి.నగర్‌లోని హిందూ సమాజంలో ఆయన ఐదో రోజు ప్రవచనాన్ని శనివారం కొనసాగించారు. రాముని ఆదేశంపై తమసా నదీ తీరాన వాల్మీకి మహర్షి ఆశ్రమ ప్రాంతంలో తనను విడిచి వెళ్తున్న లక్ష్మణుని ద్వారా రామునికి సీత సందేశం పంపుతుందని, తనపై అపవాదు వేసిన ప్రజల పట్ల సోదరభావంతో మెలగవలసిందిగా కోరుతుందని చెప్పారు. ‘రావణ వధానంతరం సీతాదేవితో హనుమ.. నిన్ను హింసించిన రాక్షస సీ్త్రలను తుదముట్టిస్తానని పలికినప్పుడు సీతమ్మ వారిస్తుంది. వారు రాజశాసనాన్ని అమలు చేశారని, వారిని హింసించరాదని హనుమతో చెబుతుంది’ అని అన్నారు. సీతమ్మ ధర్మజ్ఞురాలని, ఆమె ధర్మనిష్ఠ అపూర్వమని చెప్పారు. గర్భవతి అయిన సీ్త్రని పుట్టింటికి పంపించినట్లు, రాముడు సీతాదేవిని అత్యంత సురక్షితమైన వాల్మీకి మహర్షి ఆశ్రమానికి పంపాడని, భర్తృ, రాజధర్మాల మధ్య అద్భుతమైన సమన్వయం చూపాడని వివరించారు. ‘సుమంత్రునితో తిరిగి వస్తూ లక్ష్మణుడు శోకవివశుడవుతాడు. 14 సంవత్సరాల వనవాసం, తరువాత సీతావియోగం తలుచుకుని విధి అనుల్లంఘ్యనీయమని బాధ పడతాడు. సీతాదేవిని మాత్రమే కాదు, భవిష్యత్తులో నిన్ను సైతం రాముడు పరిత్యజిస్తాడని నేను విన్నాను అని సుమంత్రుడు చెబుతాడు’ అని చెప్పారు. దేవాసురుల సంగ్రామం జరిగినప్పుడు భృగు మహర్షి పత్ని అసురులకు ఆశ్రయమిస్తుందని, మహావిష్ణువు సుదర్శన చక్రంతో ఆమె శిరస్సు ఖండించగా.. భృగు మహర్షి క్రోధంతో ‘నీవు నరునిగా జన్మించి భార్యావియోగాన్ని అనుభవిస్తావ’ంటూ విష్ణువును శపిస్తాడని చెప్పారు. దశరథునికి దుర్వాస మహర్షి ఈ వృత్తాంతం చెబుతూంటే తాను విన్నానని, ఇది రహస్యమని లక్ష్మణునికి సుమంత్రుడు చెబుతాడని సామవేదం అన్నారు. సీతాభట్టారికా స్తోత్రంతో భాగవత విరించి డాక్టర్ టీవీ నారాయణరావు సభకు శుభారంభం పలికారు. -
మెయిన్స్‌లో మెరిశారు
రాజమహేంద్రవరం రూరల్: ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశానికి ఉమ్మడిగా నిర్వహించిన జేఈఈ మెయిన్స్ పరీక్షలో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటారు. ప్రతిభ చూపి, ఉత్తమ ర్యాంకులు సాధించారు. జేఈఈ అడ్వాన్స్‌లో సైతం సత్తా చాటి ప్రముఖ ఐఐటీల్లో సీట్లు సాధిస్తామని ధీమగా చెబుతున్నారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్లు కావడమే తమ లక్ష్యమని వారు స్పష్టం చేస్తున్నారు. పేరు: కంచుమర్తి ప్రణీత్ ఊరు: రాజమహేంద్రవరం ర్యాంకు: 56 (ఓపెన్), 2 (ఎస్సీ) తండ్రి: కంచుమర్తి ప్రతాప్ జీవన్, అగ్రికల్చర్ ఆఫీసర్ తల్లి: బూది మీనా, అగ్రికల్చర్ ఆఫీసర్ లక్ష్యం: ఐఐటీలో సీఎస్ఈ చదవడం. పేరు: వనపర్తి తేజశ్రీ ఊరు: లాలాచెరువు, రాజమహేంద్రవరం ర్యాంకు: 124 (ఓపెన్), 18 (ఓబీసీ) తండ్రి: వనపర్తి మల్లేశ్వరరావు, ఫైనాన్షియల్ అడ్వైజర్ తల్లి: వనపర్తి లక్ష్మి, గృహిణి లక్ష్యం: ముంబయి ఐఐటీలో సీఎస్ఈ సీటు పేరు: పాబోలు శరత్ సంతోష్ ఊరు: దివాన్ చెరువు ర్యాంకు: 209 (ఓపెన్), 9 (ఈడబ్ల్యూఎస్) తండ్రి: పాబోలు సురేష్, బిజినెస్ తల్లి: పాబోలు సంధ్య, గృహిణి లక్ష్యం: ప్రముఖ ఐఐటీలో సీఎస్ఈ చదవడం. పేరు: దువ్వి ఆశిష్ సాయి శ్రీకర్ ఊరు: రాజమహేంద్రవరం ర్యాంకు: 235 (ఓపెన్) తండ్రి: దువ్వి శ్యామ్‌కిరణ్, ఈఎన్టీ వైద్యుడు తల్లి: నీళ్లపాళ్ళ పద్మజ, గైనకాలజిస్టు లక్ష్యం: ప్రముఖ ఐఐటీలో సీఎస్ఈ అభ్యసించడం. పేరు: యార్లగడ్డ దేవిష్ రుత్విక్ ఊరు: రాజమహేంద్రవరం ర్యాంకు: 246 (ఓపెన్) తండ్రి: యార్లగడ్డ సురేష్, వైద్యుడు తల్లి: తనూజ, వైద్యురాలు లక్ష్యం: ప్రముఖ ఐఐటీలో సీఎస్ఈ సీటు సాధించడం. పేరు: దోమాడ హర్షవర్ధన్ ఊరు: రాజమహేంద్రవరం ర్యాంకు: 570 (ఓపెన్) తండ్రి: డీవీవీ సత్యనారాయణ, ఏజీఎం, జీఎంఆర్, వేమగిరి తల్లి: రత్నకుమారి, గృహిణి లక్ష్యం: ప్రముఖ ఐఐటీలో సీఎస్ఈ చదవడం. పేరు: లావు దర్శన్ ఊరు: రాజమహేంద్రవరం ర్యాంకు: 634 (ఓపెన్)) తండ్రి: లావు సదాశివరావు, మెకానికల్ ఇంజినీర్, ఓఎన్జీసీ తల్లి: రాజ్యలక్ష్మి, గృహిణి లక్ష్యం: ఐఐటీలో సీఎస్ఈ అభ్యసించడం. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి)గండేరా (వెయ్యి) 19,000 గటగట (వెయ్యి) 17,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 18,000 గటగట (వెయ్యి) 16,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
ధాన్యపురాశిని ఢీకొని యువకుడి మృతి
దేవరపల్లి: రోడ్డుపై ఆరబెట్టిన ధాన్యం రాసులను ఢీకొని యువకుడు దుర్మరణం చెందిన సంఘటన దేవరపల్లి మండలం కృష్ణంపాలెం వద్ద జరిగింది. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి స్థానికుల కధనం ప్రకారం మండలంలోని కొత్తగూడేనికి చెందిన పుట్టా వీరవెంకటరమణ(30) గురువారం సాయంత్రం యర్నగూడెంలోని తన తండ్రి వద్దకు వెళ్లాడు. తండ్రితో మాట్లాడి అర్ధరాత్రి సమయంలో తిరిగి గుండుగొలను–కొవ్వూరు 16వ జాతీయ రహదారి సర్వీస్ రోడ్డులో బైక్‌పై వస్తుండగా, రోడ్డుపై ఆరబెట్టి ఉన్న ధాన్యం రాశులను ఢీ కొన్నారు. ఈ ప్రమాదంలో వీర వెంకటరమణ రోడ్డుపై పడడంతో తలకు బలమైన గాయం తగిలింది. అయితే అర్ధరాత్రి సమయం కావడం, ఆ సమయంలో అటు వైపు ఎవరూ వెళ్లకపోవడంతో రోడ్డుపై రక్తపు మడుగులో పడి ఉన్న వీరవెంకటరమణను ఎవరూ చూడలేదు. తెల్లవారు జామున 3 గంటల సమయంలో హైవే పెట్రోలింగ్ సిబ్బంది గమనించి స్థానిక పోలీసుల సహకారంతో గ్రామస్తులకు సమాచారం అందించారు. అపస్మారక స్థితిలో ఉన్న వీరవెంకటరమణను గోపాలపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడిని పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. సత్యనారాయణ తల్లి ఏడాది క్రితం మృతి చెందగా, తండ్రి ఉన్నారు. తండ్రి యర్నగూడెంలో ఉంటుండగా, వెంకటరమణ కొత్తగూడెంలో ఉంటున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వి. సుబ్రహ్మణ్యం తెలిపారు. రాత్రి వేళ రాకపోకలు లేక ఎవరూ గుర్తించని పరిస్థితి తెల్లవారు జామున 3 గంటల వరకు రోడ్డుపైనే పడిఉన్న వైనం హైవే పెట్రోలింగ్ సిబ్బంది గుర్తించి పోలీసుల సాయంతో ఆస్పత్రికి తరలింపు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారణ -
రీ స్ట్రక్చర్ లెక్క తేలేనా?
రాయవరం: ఎంకి పెళ్లి సుబ్బిచావుకు వచ్చిందన్నట్లుగా ఉంది విద్యాశాఖ పరిస్థితి. గత ప్రభుత్వం తీసుకు వచ్చిన 117 జీవో ప్రకారం 3, 4, 5 తరగతులను అవకాశం ఉన్న ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లను ఇవ్వాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం ఆ జీఓ తీసుకు వచ్చింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ జీవోకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఆయా తరగతులను తిరిగి పూర్వపు పాఠశాలలకు పంపించేందుకు రీ స్ట్రక్చర్ పేరుతో కసరత్తు చేస్తోంది. ఈ ప్రక్రియ ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నట్టు తయారైంది. ఇందులో భాగంగా పాఠశాలలను మోడల్ ప్రైమరీ, బేసిక్ ప్రైమరీ, ఫౌండేషన్ పాఠశాలలుగా విభజించారు. పంచాయతీకి ఒక మోడల్ స్కూల్ ఉండేలా చర్యలు తీసుకున్నారు. దీనికి విద్యార్థులు కనీసం 60 మంది ఉండాలని నిర్ధారించారు. ఏదైనా గ్రామంలో మోడల్ స్కూల్ లేకుంటే కనీస రోల్ 45గా పరిగణించాలని సూచించారు. దీనికి ఎస్‌ఎంసీల తీర్మానాలు ఉండాలని ముడిపెట్టడంతో ప్రతి గ్రామంలో ఫౌండేషన్ స్కూల్స్‌గా మార్చిన పాఠశాలల ఎస్‌ఎంసీల నుంచి వ్యతిరేకత వచ్చింది. అలాగే రీ స్ట్రక్చర్ ప్రాతిపదికన 1, 2 తరగతులున్న ఫౌండేషన్ స్కూళ్లలో 1:30 నిష్పత్తి, బేసిక్ ప్రైమరీలో 1:20, మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో కనీసం ఐదుగురు ఉపాధ్యాయులు ఉంటారు. ఉన్నత పాఠశాలల్లో సెక్షన్లను పరిగణలోనికి తీసుకుని, ఉపాధ్యాయుల సంఖ్యను నిర్దారించారు. ఈ నిష్పత్తి ప్రకారం ఎంఈఓలు క్యాడర్ స్ట్రెంగ్త్‌ను, అదే సమయంలో వేకెన్సీ పొజిషన్‌ను లెక్క తేల్చే పనిలో పడ్డారు. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన జిల్లాల పునర్విభజన జరిగినప్పటికీ ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు, రేషనలైజేషన్ తదితర అంశాలను ఉమ్మడి జిల్లా ప్రాతిపదికగానే చేపడుతున్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న క్యాడర్స్ట్రెంగ్త్, క్యాడర్ వారీగా ఖాళీల సంఖ్యను ఉమ్మడి జిల్లా ప్రాతిపదికగా కాకినాడ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో మండల విద్యాశాఖ అధికారులు కుస్తీ పడుతున్నారు. శుక్రవారం గుడ్ ఫ్రైడే సెలవు అయినప్పటికీ లెక్క తేల్చాలని అధికారులు ఆదేశించడంతో శనివారం నాటికి వాటిని సిద్ధం చేసేలా ఎంఈవోలు, సాంకేతిక సిబ్బంది కుస్తీ పడుతున్నారు. ● అధికారుల ఆదేశాలతో ఎంఈఓలు బిజీ ● వేకెన్సీ పొజిషన్, క్యాడర్ స్ట్రెంగ్త్‌పై కసరత్తు -
వాహనం ఢీకొని వ్యక్తి మృతి
మామిడికుదురు: స్థానిక 216వ నంబర్ జాతీయ రహదారిపై గో ఫ్రెష్ ఎదురుగా వాహనం ఢీ కొని పెదపట్నంలంక గెడ్డంవారిపేటకు చెందిన బూల వెంకటరత్నం (34) శుక్రవారం మృతి చెందాడు. విద్యుత్ సామాన్ల కోసం హోండా యాక్టివ్‌పై మామిడికుదురు వచ్చి ప్రమాదానికి గురయ్యాడని కుటుంబ సభ్యులు తెలిపారు. హైదారాబాదులోని సీఎంఆర్‌లో పని చేస్తున్న వెంకటరత్నం మూడు రోజులు సెలవులు రావడంతో శుక్రవారం ఉదయం స్వగ్రామం వచ్చి మృత్యువుపాలయ్యాడని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఏడేళ్ల క్రితం లక్ష్మీదుర్గతో అతడికి వివాహమైంది. అతనికి ఆరేళ్ల భరత్ శ్రీసాయి, రెండేళ్ల మాధురి లక్ష్మి సంతానం. వెంకటరత్నం మృతితో తాము జీవనాధారం కోల్పోయామని, ఇక తమకు దిక్కెవరంటూ అతని కుటుంబ సభ్యులు తీవ్రంగా రోదించారు. ఎస్సై చైతన్యకుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కొండేపూడి మృతి
కాకినాడ సిటీ: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు కొండేపూడి శ్యాంబాబు మాదిగ శుక్రవారం మరణించారు. 1994లో సమితి ఏర్పడిన తర్వాత 1995లో మందకృష్ణమాదిగ తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో కొండేపూడిని జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. అప్పటి నుంచి 30 ఏళ్ల పాటు ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని అనేకసార్లు జైలు జీవితాన్ని గడిపారు. కలెక్టరేట్ దగ్గర జరిగిన విధ్వంసం కేసులో 40 రోజులపా టు జైల్లో ఉన్నారు. తాళ్లరేవు తాహసీల్దార్ కార్యా లయం దహనం, రైల్‌రోకో సందర్భంగా గొల్లప్రోలులో రైళ్ల రాకపోకలను అడ్డగించిన కేసుల్లో నెలలు తరబడి జైల్లో ఉన్నారు. జిల్లాలోని మాదిగ సంఘాల నాయకులు శ్యాంబాబుకు నివాళులర్పించారు. -
వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలి
ప్రకాశం నగర్ (రాజమహేంద్రవరం): పార్లమెంటు ఉభయ సభల్లోనూ వక్ఫ్ చట్టానికి అనుకూలంగా ఓటు వేసి ముస్లింలను కోలుకోలేని విధంగా కూటమి ప్రజాప్రతినిధులు దెబ్బ కొట్టారని వైఎస్సార్ సీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి, జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ మహ్మద్ ఆరిఫ్ అన్నారు. తన కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యను ముస్లింలు, లౌకికవాదులు తీవ్రంగా వ్యతిరేస్తున్నారన్నారు. ఈ పరిస్థితుల్లో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళ్లే ధైర్యం కూటమి ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంటు ఉభయ సభల్లో ఓటు వేయడం ద్వారా ముస్లింలకు ఎటువంటి కష్టం వచ్చినా అండగా ఉంటానన్న మాటను వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి నిలబెట్టుకున్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా 200 మందికి పైగా ఎంపీలు వ్యతిరేకంగా ఓటు వేసినప్పటికీ, ఈ బిల్లుకు టీడీపీ నాయకులు అనుకూలంగా ఓటు వేశారని, పైగా వైఎస్సార్ సీపీపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వక్ఫ్ బోర్డు సవరణ చట్టంపై ఆందోళనలు చేస్తున్న ముస్లింలకు అండగా నిలబడిన వారిపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. ముస్లింల మనోభీష్టాన్ని గౌరవించి వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపాలని ఆరిఫ్ డిమాండ్ చేశారు. డీఈడీ ఫీజు చెల్లింపునకు 23 వరకూ గడువు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఈడీ)కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష ఫీజు చెల్లింపు గడువు ఈ నెల 23తో ముగుస్తుందన్నారు. రూ.50 ఆలస్య రుసుముతో 28వ తేదీలోగా చెల్లించవచ్చన్నారు. రెగ్యులర్ విద్యార్థులు రూ.250, ప్రైవేటు విద్యార్థులు ఒక సబ్జెక్టుకు రూ.125, రెండు సబ్జెక్టులకు రూ.150, మూడు సబ్జెక్టులకు రూ.175, నాలుగు సబ్జెక్టులకు రూ.250 చొప్పున చెల్లించాలని వివరించారు. -
‘సీతమ్మను రాముడు ఎన్నడూ శంకించలేదు’
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): ‘రామాయణాన్ని చదవని వారు, రామతత్త్వాన్ని అర్థం చేసుకోని వారు సీతమ్మను రాముడు పరిత్యజించడాన్ని విమర్శిస్తారు. రాముడు ఎన్నడూ సీతమ్మను శంకించలేదు’ అని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. ఋషిపీఠం సత్సంగం ఆధ్వర్యాన ఉత్తరకాండపై నాలుగో రోజు ప్రవచనాన్ని స్థానిక టి.నగర్ హిందూ సమాజంలో శుక్రవారం ఆయన కొనసాగించారు. ‘భర్తృ ధర్మం వేరు, రాజధర్మం వేరు. రాముడు రాజధర్మానికి కట్టుబడిన పాలకుడు. భద్రునితో తనను గురించి ప్రజలు మాట్లాడుకుంటున్న శుభాశుభాలు రెండూ తెలుసుకోవాలని రాముడు స్పష్టం చేశాడు. మన రాముడు సాగరంపై సేతువు నిర్మించి, రావణుని వధించి, దుష్కరమైన పని చేశాడు. కానీ, రావణుని స్పర్శ తగిలిన సీతమ్మను రాముడు ఎలా ఏలుకుంటున్నాడని ప్రజలు అనుకుంటున్నారని భద్రుడు చెబుతాడు. ఆదర్శవంతమైన పాలకుడు వ్యక్తిగత జీవితంలో కూడా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి’ అని సామవేదం వివరించారు. ‘ఒక వ్యక్తి కీర్తి ఎంత కాలం ఈ లోకంలో ఉంటుందో, అంత కాలం ఆ వ్యక్తి ఉన్నత లోకాల్లో ఉంటాడు. ప్రతి ఒక్కరూ అపకీర్తి సోకకుండా తమను తాము రక్షించుకోవాలి. లోకాపవాదు అత్యంత బాధాకరమైనది. కానీ లోకాపవాదాన్ని తొలగించుకోవాలి. రాముడు 11 వేల సంవత్సరాలు పరిపాలిస్తే, అప్పటికే 9 వేల సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పటి వారు సీతమ్మ అగ్నిప్రవేశాన్ని నమ్మకపోయి ఉండవచ్చు. అపవాదు పట్ల రాముడు ఎంతగానో దుఃఖించాడు. సీతాపరిత్యాగమే తన కర్తవ్యమన్న నిర్ణయానికి వచ్చాడు. ఎవరో ఒక అనామకుడు చెబితే సీతమ్మను ఆయన పరిత్యజించలేదు. ఈ సందర్భంగా మనకు లవకుశ సినిమా గుర్తు రావచ్చు. ఆ సినిమా ప్రారంభంలోనే పద్మ పురాణాంతర్గతమైన కథను అనుసరించి సినిమాను రూపొందించినట్టు పేర్కొన్నారు. వివిధ కల్పాల్లో రామాయణ గాథ జరిగింది. వైవస్వత మన్వంతరంలోని కథను వాల్మీకి మహర్షి మనకు ప్రసాదించారు. స్థూల ధర్మం వేరు, సూక్ష్మ ధర్మం వేరు’ అని సామవేదం వివరించారు. రాముడు ఎన్నడూ ధర్మమార్గాన్ని వీడలేదని, ఆయన మూర్తీభవించిన ధర్మస్వరూపుడని చెప్పారు. -
క్రీస్తు త్యాగం.. సమస్త మానవాళికీ స్ఫూర్తిదాయకం
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ప్రేమ, కరుణ, క్షమ, సహనం, త్యాగం వంటి సద్గుణాలను ప్రబోధించిన దైవ కుమారుడైన ఏసు క్రీస్తు సిలువ మరణం పొందిన రోజును పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో గుడ్‌ఫ్రైడే నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు నుంచి నగరంలోని గోదావరి రైల్వే స్టేషన్ వద్ద ఉన్న ఆశయం దేవాలయం వరకూ కాలి నడకన భారీ సిలువ యాత్ర నిర్వహించారు. పాపాల నుంచి భక్తులను విముక్తుల్ని చేయడానికి, వారి కష్టాలు తొలగించడానికి జీసస్ ఎదుర్కొన్న కష్టాలు, అవమానాలు, శిలువ మరణం, ఆయన పట్ల నాటి రాజుల క్రూరత్వాన్ని కళ్లకు కట్టేలా ఈ యాత్ర సాగింది. సిలువ మోస్తున్న క్రీస్తు వేషధారణ, రాజభటులు ముళ్ల కొరడాలతో ఆయనను హింసించడం వంటి సన్నివేశాలను ప్రదర్శించారు. క్రీస్తు ప్రభువు స్ఫూర్తితో త్యాగం, సహనం, ప్రేమ, కరుణ, క్షమ వంటి సద్గుణాలను ప్రతి ఒక్కరూ పెంపొందించుకోవాలని ఈ సందర్భంగా సందేశం ఇప్పించారు. తోటివారిని ఆదుకోవడంలో ఎంతో తృప్తి ఉంటుందని, సమస్త మానవాళిలో ఈర్ష్య, అసూయ, ద్వేషం తదితర అవగుణాలను రూపుమాపి, ప్రతి ఒక్కరినీ సన్మార్గంలో నడిపించేందుకే క్రీస్తు ఈ భూమి మీదకు వచ్చారని చెప్పారు. ఈ కార్యక్రమంలో గోదావరి విచారణ, దివ్యదర్శిని దేవాలయం, ఆశయ సంఘ సభ్యులు పాల్గొన్నారు. సిలువ మోస్తున్న ఏసుక్రీస్తు వేషధారి -
12 లక్షల టన్నుల ఇసుక సిద్ధంగా ఉంచాలి
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని డీసిల్టేషన్, ఓపెన్ రీచ్‌లు, సెమీ మెకనైజ్డ్ పాయింట్ల ద్వారా 12 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను 45 రోజుల్లోగా గుర్తించిన స్టాక్ యార్డుల్లో అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. ఇసుక సరఫరా విధానంపై సంబంధిత ఏజెన్సీల ప్రతినిధులతో తన క్యాంపు కార్యాలయంలో ఆమె శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, స్టాక్ యార్డుల నిర్వహణకు ఎవరైనా ముందుకు వస్తే అనుమతి ఇస్తామని చెప్పారు. ఇసుక సరఫరా విధానంపై ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతోందని, ఏదైనా ఏజెన్సీపై ఫిర్యాదులు వస్తే వారే జవాబుదారీగా ఉండాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. స్టాక్ పాయింట్ నిర్వహణ, అమ్మకాల విషయంలో నిబంధనలు కచ్చితంగా పాటించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు, ఆర్డీఓలు ఆర్.కృష్ణనాయక్, రాణి సుస్మిత, జిల్లా మైన్స్ అధికారి డి.ఫణిభూషణ్‌రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ బీవీ గిరి తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల రేషియోలో వివక్ష ఎందుకు? రాజానగరం: ప్రభుత్వ ఏలుబడిలోని పాఠశాలలన్నింటిలో విద్యార్థులు, ఉపాధ్యాయుల రేషియో ఒకేవిధంగా ఉండాలని, కానీ ఉన్నత పాఠశాలకు ఒకలా, ప్రాథమిక పాఠశాలకు మరోలా అమలు చేస్తూ ఎందుకు వివక్ష చూపుతున్నారని ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి త్రినాథ్‌బాబు అన్నారు. శుక్రవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. ఉన్నత పాఠశాలల్లోని ప్రాథమిక తరగతుల్లో 10 మంది విద్యార్థులుంటే 2, 11 మంది ఉంటే 3, 31 మంది ఉంటే 4 చొప్పున ఉపాధ్యాయ పోస్టులు మంజూరు చేస్తున్నారని అన్నారు. అదే ప్రాథమిక పాఠశాలలో 20 మంది విద్యార్థులుంటే ఒక్క ఉపాధ్యాయుడినే కేటాయిస్తున్నారన్నారు. ఫౌండేషన్ స్కూల్స్‌లో 30 మంది విద్యార్థులకు ఒక్క ఉపాధ్యాయుడినే నియమిస్తున్నారని తెలిపారు. మోడల్ ప్రైమరీ స్కూల్లో 59 మందిలోపు విద్యార్థులున్నా నలుగురు ఉపాధ్యాయులుంటున్నారన్నారు. అన్నీ ప్రభుత్వ పాఠశాలలే అయినప్పటికీ ఫౌండేషన్ స్కూల్స్, మోడల్ ప్రైమరీ స్కూల్స్ విషయంలో ఎందుకు వివక్ష చూపుతున్నారో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. దీనివలన విద్యా ప్రమాణాల్లో కూడా వ్యత్యాసం వస్తుందనే విషయాన్ని అధికారులు గ్రహించాలని త్రినాథ్‌బాబు విజ్ఞప్తి చేశారు. రత్నగిరిపై భక్తుల సందడి అన్నవరం: వేలాదిగా తరలివచ్చిన భక్తులతో రత్నగిరి శుక్రవారం కిక్కిరిసిపోయింది, సెలవు రోజు కావడంతో సత్యదేవుని దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీనికితోడు గురువారం రాత్రి, శుక్రవారం తెల్లవారుజామున రత్నగిరిపై, ఇతర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవదంపతులు, వారి బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో సత్యదేవుని ఆలయానికి తరలి వచ్చారు. ఆలయంలో ఎక్కడ చూసినా నవదంపతులే దర్శనమిచ్చారు. వీరందరూ సత్యదేవుని వ్రతాలాచరించి, స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి ఆలయ ప్రాంగణం, క్యూలైన్లు, వ్రత, విశ్రాంత మండపాలన్నీ నవదంపతులు, వారి బంధుమిత్రులతో కిక్కిరిసిపోయాయి. సాయంత్రం వరకు భక్తుల రద్దీ కొనసాగింది. సుమారు 40 వేల మంది స్వామివారిని దర్శించి, పూజలు చేశారని అధికారులు తెలిపారు. వ్రతాలు 2 వేలు జరిగాయి. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, ప్రదక్షిణ దర్శనానికి అరగంట సమయం పట్టింది.అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం వచ్చింది. నిత్యాన్నదాన పథకంలో సత్యదేవుని అన్నప్రసాదాన్ని 5 వేల మంది భక్తులు స్వీకరించారు. రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ‘వివేకానంద’ విద్యార్థులు అమలాపురం టౌన్: స్థానిక శ్రీస్వామి వివేకానంద యోగాశ్రమంలో శిక్షణ పొందుతున్న ఏడుగురు విద్యార్థులు రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు ఎంపికై నట్లు ఆశ్రమ యోగా గురువు డాక్టర్ ఆకుల శ్రీనివాస్ తెలిపారు. గత మార్చి 23న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన యోగా పోటీల్లో తమ విద్యార్థులు టి.పూజిత, బి.సహస్రి, ఆర్.సువర్ణకుమారి, జి.లక్ష్మీ ప్రసన్న, జి.మణికంఠ, ఎన్.రాహుల్, పి.సత్య రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు శ్రీనివాస్ వివరించారు. వీరు ఈ నెల 22న శ్రీకాకుళంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నారని చెప్పారు. -
ప్రైవేటుకే ఫిట్నెస్
జిల్లావ్యాప్తంగా వాహనాల వివరాలు జిల్లావ్యాప్తంగా వివిధ రకాల వాహనాలు 4,57,200 ఉన్నాయి. అత్యధికంగా ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. తరువాలి స్థానం కార్లది. వాహనం సంఖ్య ద్విచక్ర వాహనాలు 3,41,117 కార్లు 45,404 ఆటోలు 21,726 గూడ్స్ క్యారియర్లు 20,465 ట్రాక్టర్లు 7,807 ట్రాలీలు 4,896 త్రీ వీలర్ గూడ్స్ వాహనాలు 3,599 ట్రైలర్ (అగ్రికల్చర్) 2,306 స్కూల్, కాలేజీ బస్సులు 1,827 లగ్జరీ టూరిస్ట్ క్యాబ్‌లు 342 అంబులెన్సులు 230 జీపులు 150 రోడ్డు రోలర్లు 67 సాక్షి, రాజమహేంద్రవరం: ప్రభుత్వ సేవల ప్రైవేటీకరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాంది పలికిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అత్యంత ప్రధానమైన, ప్రజలకు ఉపయోగకరమైన సేవలను ప్రైవేటుకు కట్టబెట్టే ప్రక్రియ జరుగుతోంది. రైల్వే శాఖలో పలు సేవలను ఇప్పటికే ప్రైవేటుకు అప్పగించారు. తాజాగా ఆ జాబితాలోకి రాష్ట్ర రవాణా శాఖ కూడా చేరింది. ఇందులో అత్యంత కీలకమైన వాహనాల ఫిట్నెస్ (సామర్థ్య) సర్టిఫికెట్ల జారీ సేవలను ప్రైవేటు సంస్థకు అప్పగించారు. ఈ మేరకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బదిలీ విధానం వేగంగా సాగిపోయింది. ప్రతి జిల్లాకు ఒక ఆటోమేటెడ్ వెహికల్ ఫిట్నెస్ టెస్టింగ్ స్టేషన్ మంజూరైంది. ఇప్పటి వరకూ రవాణా శాఖ ద్వారా ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుంటే ఆయా వాహనాలకు ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం చలానా కట్టించుకుని ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చేవారు. ఇకపై లైట్, హెవీ మోటార్ వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్లను ప్రభుత్వం నిర్ణయించిన ప్రైవేటు సంస్థ మాత్రమే జారీ చేస్తుంది. ఈ సంస్థపై స్థానికంగా ఎవ్వరి అజమాయిషీ ఉండదు. కేంద్ర ప్రభుత్వమే నేరుగా పర్యవేక్షిస్తుంది. ప్రభుత్వ ఆదాయానికి గండి జిల్లా వ్యాప్తంగా వివిధ రకాల వాహనాలు 4,57,200 ఉన్నాయి. వీటికి ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా ఒక్కో జిల్లా నుంచి రూ.కోట్లలో ఆదాయం సమకూరేది. దీనిని ప్రైవేటు సంస్థకు అప్పగించడంతో ఆ మేరకు ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. కేంద్ర ట్రాన్స్పోర్ట్ ఇండియా సలహా మేరకు వాహనాల ఫిట్నెస్ టెస్ట్ కోసం వసూలు చేసిన సొమ్మును ఫిట్నెస్ స్టేషన్లు రెండేళ్ల పాటు తమ సొంతానికి వినియోగించుకోవచ్చు. ప్రభుత్వానికి ఒక్క పైసా కూడా చెల్లించనక్కరలేదు. ఈ మేరకు టెండర్లో నిబంధన పెట్టారని చెబుతున్నారు. రాజానగరం వద్ద టెస్టింగ్ స్టేషన్ జిల్లాకు సంబంధించి రాజానగరం మండలం కలవచర్ల సమీపాన సుమారు రూ.4.5 కోట్లతో వెహికల్ ఫిట్నెస్ టెస్టింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ఈ స్టేషన్లో మెషీనరీతో పాటు 21 మంది సిబ్బంది ఉంటారు. వాహనాల ఫిట్నెస్ పరీక్షలు, సర్టిఫికెట్ల జారీ ఇక్కడే జరుగుతాయి. సిబ్బందిని సైతం సంబంధిత ప్రైవేటు ఏజెన్సీయే నియమించుకుంటుంది. ఇందులో రాష్ట్ర రవాణా శాఖ అధికారుల ప్రమేయం కానీ, అజమాయిషీ కానీ ఏమాత్రం ఉండదు. అదనంగా వసూళ్లు ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందేందుకు తొలుత ఆన్లైన్లో సంస్థ నిర్దేశించిన మొత్తం చెల్లించి, స్లాట్ బుక్ చేసుకోవాలి. అనంతరం నిర్దేశించిన సమయంలోపు పరీక్ష చేయించుకోవాలి. లేదంటే చలానా సమయం ముగుస్తుంది. దీంతో, మళ్లీ చలానా తీయాల్సి వస్తోందని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. గతంలో చలానా గడువు వారం నుంచి 15 రోజుల వరకూ ఉండేది. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవని వాపోతున్నారు. ప్రభుత్వం గతంలో వసూలు చేసిన చలానాకు అదనంగా రూ.200 పైగా వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం వెహికల్ ఫిట్నెస్ టెస్టింగ్ స్టేషన్ చలానా ధరల ప్రకారం లైట్ మోటారు వెహికల్ కేటగిరీకి అంటే ఆటో నుంచి మిగతా అన్నింటి ఫిట్నెస్ పరీక్షకు రూ.860 వసూలు చేయాలి. కానీ రూ.1,250 వసూలు చేస్తున్నట్లు సమాచారం. అలాగే, హెవీ మోటార్ వెహికల్స్‌కు రూ.1,320 వసూలు చేయాల్సి ఉంది. ప్రతి రోజూ ఈ స్టేషన్లో 50 నుంచి 60 వాహనాలకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. పారదర్శకత ప్రశ్నార్థకం వాహనాల ఫిట్నెస్ ప్రక్రియ పారదర్శకంగా జరగాలి. అప్పుడే ప్రమాదాల నుంచి గట్టెక్కే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించడం, అన్నీ ప్రైవేటు వ్యక్తులే చేస్తూండటంతో పారదర్శకతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఎటువంటి లోటుపాట్లు లేకుండా టెస్ట్‌లు నిర్వహిస్తే మంచిదేనని, తమకు ఎవరూ నియంత్రించలేరంటూ ఎలా పడితే అలా చేస్తే ప్రమాదాలు తప్పవని పలువురు ఆందోళన చెందుతున్నారు. ఫిట్నెస్ టెస్ట్ ఇలా.. రోడ్లపై తిరిగే ప్రైవేటు బస్సులు, కార్లు, క్యాబ్, ట్రాక్టర్లు, లారీలు, గూడ్స్ వాహనాలు, ట్యాంకర్లు, స్కూల్ బస్సుల వంటి ప్రతి వాహనానికీ ఫిట్నెస్ టెస్ట్‌లు తప్పనిసరి. పసుపు రంగు నంబర్ ప్లేట్ ఉంటే ట్రాన్స్‌పోర్టు, తెలుపు రంగు నంబర్ ప్లేట్ ఉంటే నాన్–ట్రాన్స్‌పోర్టు వాహనాలుగా పరిగణిస్తారు. కొత్త వాహనానికి లైఫ్టైంలో మొదటి ఎనిమిదేళ్లలో ప్రతి రెండేళ్లకోసారి ఫిట్నెస్ టెస్ట్ చేయించాలి. ఎనిమిదేళ్ల తర్వాత ఏడాదికోసారి ఈ పరీక్ష తప్పనిసరి. 15 ఏళ్లకు కండిషన్ చూసి, ఆపేయాలి. స్కూల్ బస్సులకు 15 ఏళ్ల వరకే ఫిట్నెస్ చూస్తారు. తర్వాత వాటిని స్కూల్ బస్సుల కింద వాడకూడదు. ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీని ప్రైవేటు సంస్థలకు అప్పగించడం వలన వాహనాల తనిఖీలు ఎంత వరకూ సక్రమంగా జరుగుతాయనే ప్రశ్న తలెత్తుతోంది. గతంలో రవాణా శాఖ కార్యాలయాల్లో ఫిట్నెస్ పరీక్షలు ప్రహసనంగా జరిగేవి. కొందరు అధికారులు మామూళ్లు దండుకుని చూసీచూడనట్లు వ్యవహరించేవారు. దీంతో, ప్రమాదాలు చోటు చేసుకునేవి. ప్రధానంగా స్కూల్ బస్సుల ఫిట్‌నెస్‌లో ఇలాంటి ఘటనలు తరచుగా జరిగేవి. ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితులే ఎదురైతే ఎలాగనే ప్రశ్న వాహనదారులు, ప్రజల్లో ఉత్పన్నమవుతోంది. ప్రైవేటు ఏజెన్సీపై పర్యవేక్షణకు జిల్లాలో ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ·˘ Ðéçßæ¯éÌS íœsŒæ¯ðl‹Ü çÜÇtíœMðSrÏ జారీ బయటి సంస్థలకు అప్పగింత ·˘ hÌêÏÌZ {ç³™ólÅMýS…V> ÐðlíßæMýSÌŒæ ఫిట్నెస్ టెస్టింగ్ స్టేషన్ ఏర్పాటు ·˘ {糿¶æ$™èlÓ B§éĶæ*°MìS VýS…yìl ·˘ Ðéçßæ¯éÌS ç³È„ýSOò³ A¯]l$Ð]l*¯éË$ -
పేదలకు ఇళ్ల స్థలాలివ్వాలి
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): నగరంలోని ఆవ పరిసర ప్రాంతాల్లో ఉన్న 28 ఎకరాల ప్రభుత్వ భూమిని పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ భూమిని లీజు పేరుతో కబ్జా చేయడానికి కబ్జాదారులు ప్రయత్నాలు మొదలు పెట్టారని ఆరోపించారు. ‘ఇంటి స్థలం కోసం పేదల గోడు’ పేరిట సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యాన స్థానిక 16వ డివిజన్ ఆవ ప్రాంతం నుంచి సుమారు 4 వేల మందితో ప్రదర్శన గురువారం నిర్వహించారు. ఎస్టీపీ వద్ద మేకల కబేళాను ఆనుకుని ఉన్న 16 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పేదలకు పంచాలని భూ పరిరక్షణ పోరాటం నిర్వహించారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు గ్రామీణ ప్రజలకు 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల ప్రజలకు 2 సెంట్ల చొప్పున స్థలాలు ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చేయాలని, ప్రభుత్వ స్థలాలను కాపాడాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అనంతరం 16 ఎకరాల స్థలంలో ఎరజ్రెండా పాతి, కొబ్బరికాయ కొట్టి, దీనిని పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అధ్యక్షతన జరిగిన సభలో రామకృష్ణ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఇంటి స్థలాల హామీని మంగళగిరి మినహా ఇప్పటి వరకూ ఎక్కడా నెరవేర్చలేదని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల స్థలాల కోసం 8 నెలలుగా ఆందోళనలు చేస్తున్నామన్నారు. రాజమహేంద్రవరం నడిబొడ్డున ఉన్న 28 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, పేదల ఇళ్ల స్థలాలుగా పంచాలని డిమాండ్ చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకూ తమ పోరాటం ఆగదని రామకృష్ణ అన్నారు. ఇళ్ల స్థలాల సమస్యను రెవెన్యూ మంత్రి దృష్టికి తీసుకుని వెళ్తామని చెప్పారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ మాట్లాడుతూ, ఆవకు ఆనుకుని ఉన్న 16 ఎకరాల భూమిలో పేదలకు ఇళ్లు ఇవ్వాలని, సుదూర ప్రాంతాల్లో స్థలాలు ఇస్తే వారు ఇబ్బందులు పడతారని అన్నారు. ఇళ్ల స్థలాలపై తక్షణమే కార్యాచరణ ప్రకటించాలని రాజమహేంద్రవరం సిటీ, రూరల్ ప్రజాప్రతినిధులను డిమాండ్ చేశారు. తాము రాస్తున్న ప్రతి దరఖాస్తుదారుకు ఇక్కడే ఇంటి స్థలం మంజూరు చేయాలని, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేసి త్వరలో ఇక్కడ పాకలు వేస్తామని అన్నారు. కార్యక్రమంలో సీపీఐ కోనసీమ జిల్లా కార్యదర్శి కె.సత్తిబాబు, జిల్లా సహాయ కార్యదర్శి, జట్ల సంఘం అధ్యక్షుడు కుండ్రపు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఫ ప్రభుత్వ భూమి కబ్జాలను నిరోధించాలి ఫ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ ఫ నగరంలో భూ పరిరక్షణ పోరాటం -
కుంటుబడ్డ ఇంటి ప్రణాళికలు
ఒక్క ప్లాన్ కూడా అమలు కాలేదు జీవో నంబర్ 20 వచ్చినప్పటి నుంచి అమలాపురం మున్పిపాలిటీలో 300 మీటర్ల లోపు ఇంటి స్థలాల్లో ప్లాన్ అప్రూవల్ అవ్వలేదు. 300 మీటర్లు దాటిన స్థలాల్లో పెద్ద భవనాలు, కమర్షియల్ భవనాలకు అనుమతులు ఇచ్చాం. – రాణి సంయుక్త, టౌన్ ప్లానింగ్ అధికారి, అమలాపురం జీవో నంబర్ 20ని సవరించాలి మా ఎల్టీపీల ఉనికిని ఇబ్బంది పెట్టేలా ఉన్న జీవో నంబర్ 20ని ప్రభుత్వం సవరించాలి. జీవోలో ఆంక్షలు విధిండం మేం వ్యతిరేకిస్తున్నాం. జీవోను సవరించే వరకూ బిల్డింగ్‌లకు ప్లాన్ అప్రూవల్స్ ఇచ్చేది లేదు. – యేడిద దొరబాబు, అధ్యక్షుడు, ఎల్టీపీల అసోసియేషన్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాఅమలాపురం టౌన్: రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల్లో బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్‌పై తాజాగా జారీ చేసిన జీవో నంబర్ 20ని ఆయా పట్టణాల్లోని లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్లు (ఎల్టీపీ) తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ జీవో ద్వారా బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్ స్వీయ సర్టిఫికేషన్ స్కీమ్ (ఎస్సీఎస్) విధానంతో ఆ బాధ్యతలను ఎల్టీపీలకు అప్పగించింది. అయితే ప్లాన్ ఇచ్చిన తర్వాత ఆ భవన యాజమాని ప్లాన్ అతిక్రమిస్తే ఎల్‌టీపీలను బాధ్యులను చేసి వారిపై చర్యలు తీసుకోవాలన్న నిబంధనను వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఎల్టీపీలు జీవో వచ్చిన గత రెండు నెలల నుంచి 300 చదరపు మీటర్ల స్థలంలోపులో ఒక్క ప్లాన్ కూడా ఇవ్వకుండా నిరసన తెలుపుతున్నారు. ఫలితంగా జిల్లాలోని అమలాపురం, రామచంద్రపురం, మండపేట మున్సిపాలిటీలు, ముమ్మిడివరం నగర పంచాయతీల్లో ఏడున్నర సెంట్ల లోపు ముఖ్యంగా రెసిడెన్షియల్ బిల్డింగ్‌లకు ప్లాన్ల అప్రూవల్‌లు చేయకపోవడంతో ప్లానులన్నీ నిలిచిపోయాయి. మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారులు ప్లాన్ ఇచ్చే విధానంలో లోపాలు జరుగుతున్నాయని ప్రభుత్వం ఆ బాధ్యతను ఎల్టీపీలకు అప్పగిస్తూ జీవో జారీ చేసింది. ఏదైనా బిల్డింగ్ ప్లాన్‌కు అనుమతి ఇస్తే 10 శాతం వరకూ అతిక్రమణ (డీవియేషన్)కు మినహాయింపు ఉంటుంది. అంతకుమించి అతిక్రమణ జరిగితే భవన నిర్మాణాన్ని నిలిపివేస్తారు. అయితే ప్లాన్ ఇచ్చిన ఎల్‌టీపీని బాధ్యుణ్ణి చేయడం, సంబంధిత ఎల్టీపీ లైసెన్స్‌ను అయిదేళ్ల పాటు రద్దు చేయడమే కాకుండా వారిపై క్రిమినల్ కేసులు కూడా ఉంటాయన్న జీవో నిబంధననే వారు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. మున్సిపాల్టీల ఆదాయాలకు గండి ఎల్టీపీలు బిల్డింగ్ ప్లానులు ఇవ్వకపోవడంతో నిలిచిన భవన నిర్మాణాలతో ఆయా మున్సిపాలిటీలకు ఆదాయం గణనీయంగా పడిపోయింది. ఉదాహరణకు అమలాపురం మున్సిపాలిటీలో గత ఏడాది 300 చదరపు మీటర్ల లోపు భవనాలకు 170 వరకూ ప్లాన్లు ఇస్తే జీవో వచ్చిన నాటి నుంచి ఒక్క ప్లాన్ కూడా ఇవ్వలేదంటే పరిస్థితి ఎంత జటిలంగా ఉందో అంచనా వేయవచ్చు, రామచంద్రపురం, మండపేట మున్సిపాలిటీలు, ముమ్మిడివరం నగర పంచాయతీల్లో కూడా ఇదే పరిస్థితి. జిల్లా మొత్తం మీద మూడు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీలో ఈ జీవో అభ్యంతరాలు లేకపోతే ఈ రెండు నెలల్లో 100కి పైగా ప్లాన్లు మంజూరు చేసే అవకాశం ఉండేది. ప్లాన్లు ఇవ్వకపోవడంతో దాదాపు రూ.1.20 కోట్ల వరకూ ఆదాయానికి గండి పడింది. ప్లాన్లను ఎల్టీపీలు అనుమతించని పరిస్థితుల్లో కొత్తగా 300 చదరపు మీటర్ల లోపు స్థలంలో ఇళ్లు నిర్మించుకునే వారు సైతం ఈ కొత్త జీవో, నిబంధనలపై పెదవి విరిస్తున్నారు. జీవోను వ్యతిరేకిస్తూ ప్లాన్లు ఇవ్వని ఎల్టీపీల నిరసన ఓ పక్క సాగుతుంటే కొందరైతే ప్లాన్ అప్రూవల్ లేకుండానే సొంత ప్లాన్లతో ఇళ్లు నిర్మాణం చేపడుతున్నారు. మున్సిపాలిటీ పరంగా ఏదైనా అభ్యంతరం ఎదురైతే అప్పుడే చూద్దామన్న ధోరణిలో ముందుకు సాగుతున్నారు. మాపై చర్యలను మినహాయిస్తే జీవోను స్వాగతిస్తాం భవన యాజమానులు ప్లాన్‌ను అతిక్రమిస్తే తమను బాధ్యులను చేయని పక్షంలో జీవోను స్వాగతిస్తామని ఎల్టీపీలు అంటున్నారు. లేదా 300 చదరపు మీటర్లు దాటిన స్థలాలకు ప్లాన్‌ను అనుమతి ఇచ్చే బాధ్యతలు తమకు అప్పగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో జీవో నంబర్20ని సవరించి ప్లాన్ అతిక్రమణ అయితే తమ లైసెన్ప్ రద్దు చేయడం, క్రిమినల్ కేసు వంటి ఆంక్షలు తొలగించాలని సూచిస్తున్నారు. ఇళ్ల నిర్మాణాల్లో అతిక్రమణ జరిగితే భవన యాజమానిని బాధ్యులను చేయాలే తప్ప తమను బాధ్యులను చేయడమేమిటని ఎల్టీపీలు ప్రశ్నిస్తున్నారు. పట్టణాల్లో పట్టించుకోని ఎల్టీపీలు జీవో నంబర్ 20ని వ్యతిరేకిస్తూ నిరసన ఎల్‌టీపీలను బాధ్యులను చేస్తున్న ఎస్సీఎస్ విధానం నిలిచిన ప్లాన్ అప్రూవల్స్... తగ్గిన ఆదాయం -
పాపాలు చేస్తే శాపాలు తప్పవు
● రావణ వృత్తాంతం చెప్పేదిదే.. ● ప్రవచన విరించి సామవేదం షణ్ముఖశర్మ ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవ రం రూరల్): ‘ఇతరులను హేళన చేస్తే పరాభవం తప్పదు. అధర్మవర్తనంతో తపోబలం క్షీణిస్తుంది. పాపాలు చేస్తే శాపాలు తప్పవు’ అని ప్రవచన విరించి సామవేదం షణ్ముఖశర్మ అన్నా రు. ఋషిపీఠం సత్సంగం ఆధ్వర్యాన స్థానిక టి.నగర్‌లోని హిందూ సమాజంలో ఉత్తరకాండపై మూడో రోజు ప్రవచనాన్ని ఆయన కొనసాగించారు. ‘నీది వానరముఖం అని నందీశ్వరుడిని హేళన చేసిన రావణునికి వానరుల చేతిలో పరాభవం తప్పదన్న శాపం ఎదురైంది. వేదవతిని పరాభవించినప్పుడు ఆమె మరుసటి జన్మలో అయోనిజగా జన్మించి, సపరివారంగా రావణుడు నశించడానికి కారకురాలినవుతానని శపించింది. ఇక్ష్వాకువంశానికి చెందిన రాజు అనరణ్యుడు.. రావణుని చేతిలో పరాజితుడై, మా వంశంలో జన్మించే శ్రీరాముని చేతిలో నీవు మరణిస్తావని శపించాడు. రావణుని చేతిలో బందీలుగా చిక్కిన ఎందరో దేవకాంతలు, ఋషి కన్యలు, మానవకాంతల కన్నీరే రావణుని పాలిట పెనుశాపంగా మారింది’ అని సామ వేదం అన్నారు. ధర్మాచరణతో అల్పాయుష్కుడు కూడా దీర్ఘాయువు పొందగలడని, దీనికి విలోమంగా దీర్ఘాయువు వరంగా గలవాడు కూడా పాపకృత్యాలతో అల్పాయుష్కుడు కాగలడని చెప్పారు. ‘కై లాసగిరిని పెకలించబోయి భంగపాటుకు గురైన రావణుడు పెద్దగా రోదించినప్పుడు, దయాళువు అయిన పరమ శివుడు అతనికి విడుదల ప్రసాదించి, ఇక నుంచి నీవు రావణుడిగా పేరు పొందుతావని అన్నాడు. అప్పటి నుంచీ రావణ శబ్దం వ్యాప్తిలోకి వచ్చింది. రామ అనే శబ్దానికి అందరికీ ఆనందాన్ని కలిగించేదని అర్థమైతే, రావణ శబ్దానికి అందరినీ ఏడిపించడం అనే అర్థం ఉంది’ అని వివరించారు. వేదవతి తామర పూవులో శిశువుగా ఉద్భవించడం, రావణుడు ఆ శిశువును సముద్రంలో పడవేయడం ప్రాచీన రామాయణ ప్రతుల్లో లేదని, ఇది ప్రక్షిప్తమని చెప్పారు. కృతయుగాంతంలో వేదవతిని పరాభవించిన రావణుడు త్రేతాయుగంలో శ్రీరాముని చేతిలో మరణించాడంటే.. ఆయన ఎప్పటివాడో మనం ఊహించుకోవచ్చునని సామవేదం అన్నారు. తొలుత భాగవత విరించి డాక్టర్ టీవీ నారాయణరావు స్వాగత వచనాలు పలికారు. ఔట్సోర్సింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): ఔట్సోర్సింగ్ విధానంలో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ అధి కారి బీవీ గిరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి నెలా సుమారు రూ.20 వేల పారితోషికంతో, ప్రారంభంలో 11 నెలలకు, తరువాత పొడిగించే పద్ధతిన పని చేయాలన్నారు. నిర్వహణ సమాచార వ్యవస్థ (ఎంఐఎస్), ఘన వ్యర్థాల నిర్వహణ (ఎస్డబ్ల్యూఎం), ద్రవ వ్యర్థాల నిర్వహణ (ఎల్‌డబ్ల్యూఎం) కన్సల్టెంట్ పోస్టులు ఒకొక్కటి, అకౌంటెంట్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒక పోస్ట్ ఉన్నాయని వివరించారు. డిగ్రీ చదివి, 2 నుంచి ఐదేళ్ల అనుభవం కలిగిన జిల్లాలోని అభ్యర్థులు ఈ నెల 25లోగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. వివరాలకు లాలాచెరువులోని తమ కార్యాలయంలో నేరుగా లేదా 94921 22355 నంబర్లో సంప్రదించాలని కోరారు. -
నాన్ స్టాప్ కీబోర్డు ప్లేయర్‌గా విద్యశ్రీ గిన్నిస్ రికార్డు
రాయవరం: మండలంలోని మాచవరం గ్రామానికి చెందిన విద్యశ్రీ కీబోర్డు ప్లే చేయడంలో గిన్నిస్ రికార్డు సాధించింది. ఈ విషయాన్ని విద్యశ్రీ తల్లిదండ్రులు సురేష్, సుధారాణి గురువారం స్థానిక విలేకరులకు తెలిపారు. ప్రస్తుతం విద్యశ్రీ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. కీబోర్డుపై ఉన్న ఆసక్తితో విజయవాడకు చెందిన హల్లెలూయ మ్యూజిక్ స్కూల్లో ఆన్లైన్ తరగతులకు హాజరై కీబోర్డు ప్లే చేయడంతో పాటు, మెళకువలను నేర్చుకుంది. ఈ నెల 14న హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో గిన్సిస్ రికార్డు ప్రతినిధుల చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నట్లు వారు తెలిపారు. గతేడాది డిసెంబరు 1న ఇన్‌స్ర్ట్రాగామ్ వేదికగా ఆన్లైన్లో గంట పాటు నిర్వహించిన పోటీలో విద్యశ్రీ పాల్గొంది. ఇదే పోటీలో 1,046 మంది ఒకే సమయంలో పాల్గొని గంట పాటు నిర్విరామంగా కీబోర్డు ప్లే చేశారు. గిన్నిస్ రికార్డులో భాగస్వామిగా ఉన్న విద్యశ్రీని గిన్సిస్ రికార్డు ఆఫ్ ఇండియా సంస్థ సర్టిఫికేట్, మెడల్‌ను ప్రదానం చేసింది. ఇంతకుముందు విద్యశ్రీ కీబోర్డు ప్లేయర్‌గా ఆసియా బుక్ ఆఫ్ రికార్డు, ఇన్జనియస్ వరల్డ్ రికార్డును సాధించిందన్నారు. కీబోర్డు ప్లేయర్‌తో పాటుగా, చిత్రలేఖనంలో విద్యశ్రీ రాణిస్తున్నట్లు తెలిపారు. -
47 వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం
నల్లజర్ల: జిల్లావ్యాప్తంగా వచ్చే ఖరీఫ్‌లో 47 వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేయించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆ విభాగం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ (డీపీఎం) తాతారావు వెల్లడించారు. ప్రకృతి సాగుపై నల్లజర్లలో గురువారం నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆయన, రాష్ట్ర రైతు సాధికార సంస్థ ప్రత్యేకాధికారి ముస్తఫా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాతారావు మాట్లాడుతూ, సీజన్‌కు 45 రోజుల ముందు ఈ 47 వేల ఎకరాల్లో నవధాన్యాల సాగు చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మరో 8 వేల ఎకరాల్లో ఎరువులు, పురుగు మందులు వినియోగించకుండా, సహజ పద్ధతుల్లో వరి సాగు చేపట్టనున్నామని చెప్పారు. మూడు నాలుగు సెంట్ల విస్తీర్ణం చొప్పున 20 వేల యూనిట్లలో కిచెన్ గార్డెన్లు వేయిస్తున్నామన్నారు. పంటపై డ్రోన్ల ద్వారా కషాయాలు, జీవామృతం పిచికారీ చేయనున్నామన్నారు. వంద గ్రామాల్లో వెయ్యి మంది రైతులతో దేశవాళీ వరి సాగు చేపట్టనున్నామని తెలిపారు. ప్రస్తుతం కొన్ని గ్రామాలకే పరిమితమైన ప్రకృతి సాగును అన్ని రైతు సేవా కేంద్రాలకూ విస్తరింపజేయాలన్నదే లక్ష్యమని తాతారావు చెప్పారు. సేంద్రియ కర్బనం, సహజమైన సూక్ష్మక్రిములు చనిపోకుండా మొక్కల ఎదుగుదలకు తోడ్పడేందుకు 32 రకాల విత్తనాలు (నవధాన్యాలు) రైతు సేవా కేంద్రాల్లో విక్రయిస్తున్నామని తెలిపారు. వీటిలో ఆకుకూరలు, కూరగాయలు, పశువుల మేత ఉంటాయని, వీటిని తొలకరికి ముందే దమ్ములో కలియదున్నడం వలన భూసారం పెరగడంతో పాటు అదనపు ఆదాయం కూడా వస్తుందని వివరించారు. భూమిని 365 రోజులూ పచ్చగా ఉంచడం ద్వారా గాలిలోని కార్బన్‌డయాకై ్సడ్ భూమిలో సేంద్రియ కర్బనంగా స్థిరీకరణ అవుతుందని తాతారావు చెప్పారు. కార్యక్రమంలో అదనపు డీపీఎం మహబూబ్ వలీ, యూనిట్ ఇన్చార్జి కోటేశ్వరి తదితరులు పాల్గొన్నారు. రేపు స్వర్ణాంధ్ర.. స్వచ్ఛాంధ్ర రాజమహేంద్రవరం సిటీ: నాలుగో విడత స్వర్ణాంధ్ర.. స్వచ్ఛాంధ్ర కార్యక్రమం శనివారం నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి పేర్కొన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణపై తన క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో జిల్లా అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో నిరుపయోగంగా ఉన్న ఎలక్ట్రానిక్ వ్యర్థాలు సేకరించి, ఉపయోగంలోనికి తీసుకుని రావడంపై దృష్టి సారించాలని అన్నారు. ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు. గ్రామ పంచాయతీలు, మునిసిపల్ వార్డుల్లో ఈ అంశంపై గ్రామసభ నిర్వహించాలని సూచించారు. కార్యాలయాలను పూర్తి స్థాయిలో శుభ్రపరచాలన్నారు. కార్యకమ్రంలో నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ కూడా పాల్గొన్నారు. -
బాణసంచా తయారీలో భద్రతా ప్రమాణాలు ముఖ్యం
కొవ్వూరు: జిల్లావ్యాప్తంగా ఫైర్ క్రాకర్స్ తయారు చేసే యూనిట్స్‌ను పరిశీలించి అక్కడ తగిన భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటించే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. గురువారం సాయంత్రం ఐ.పంగిడి గ్రామ శివారున ఫైర్ క్రాకర్స్ గోడౌన్ దగ్ధమైన ప్రదేశాన్ని కలెక్టర్ పరిశీలించారు. ప్రమాద ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి హానీ జరగలేదన్నారు. జిల్లా వ్యాప్తంగా లైసెన్స్‌ల కాల పరిమితి ముగిసిన ఫైర్ క్రాకర్స్ విక్రయ, తయారీదారులను గుర్తించి తక్షణం అనుమతులు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాణసంచా భద్రపరుస్తున్న గోదాముల్లో భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటిస్తున్నారో లేదో క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని ఆదేశించారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.3లక్షల మేరకు ఆస్తి నష్టం సంభవించినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఐ.పంగిడిలో ఫైర్ క్రాకర్స్‌కు ఇచ్చిన అనుమతి మార్చి నెలాఖరు నాటికి ముగిసిందన్నారు. ఆర్డీవో రాణి సుస్మిత, తహశిల్ధార్ ఎం.దుర్గాప్రసాద్, పోలీసు, అగ్నిమాపక శాఖ అధికారులు పాల్గొన్నారు. రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి తుని: అన్నవరం–హంసవరం మధ్యలో రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి చెందాడని తుని జీఆర్పీ ఎస్సై జి.శ్రీనివాసరావు గురువారం తెలిపారు. విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం వీరభద్రపేట గ్రామానికి చెందిన నారపురెడ్డి చిన అప్పారావు (55) కటక్ వైపు వెళుతున్న రైలు నుంచి జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు చిన అప్పారావు ఈ నెల 2న గ్రామస్తులతో కలిసి గుంటూరు జిల్లా కారంపూడికి వ్యవసాయ పనుల కోసం వెళ్లాడు. పనులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు రైలులో ప్రయాణిస్తూ హంసవరం సమీపంలో జారిపడి మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారని, కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. ● కలెక్టర్ ప్రశాంతి ● ఐ.పంగిడిలో బాణసంచా గోదాము దగ్ధం ● రూ.3లక్షల మేర ఆస్తి నష్టం -
వారం వారం చంద్రబాబు అప్పులు
●● వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై చేసిన దుష్ప్రచారానికి సమాధానం చెప్పాలి ● టీటీడీ గోశాలలో గోవుల మృతిపై విజిలెన్స్ విచారణ జరపాలి ● మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ డిమాండ్రాజమహేంద్రవరం సిటీ: సంపద సృష్టించి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానన్న సీఎం చంద్రబాబు పది నెలల కాలంలో రూ.90 వేల కోట్లు అప్పులు చేశారని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్‌రామ్ విమర్శించారు. రాష్ట్రం మరో శ్రీలంక అయిపోతుందంటూ అనేక రకాలుగా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేసిన చంద్రబాబు.. ఇప్పుడు చేస్తున్న అప్పులపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరంలోని పార్టీ నగర కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సంపద సృష్టిస్తాం, పథకాలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వారం వారం అప్పులు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబును నమ్మడమంటే పులి నోట్లో తలపెట్టినట్లేనంటూ వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆనాడే చెప్పారని, ఇప్పుడు అదే జరుగుతోందని అన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ అవాస్తవాలు ప్రచారం చేసి, రుజువు చేయలేకపోయారన్నారు. ఇప్పుడు టీటీడీ గోశాలలో పెద్ద సంఖ్యలో గోవులు చనిపోయాయని, దీనికి ఏం జవాబు చెబుతారని ప్రశ్నించారు. ఇంత ఘోరం జరిగితే సనాతన పవన్ కల్యాణ్ ఎక్కడున్నారని నిలదీశారు. టీటీడీ ఈఓ గతంలో 170 గోవులు చనిపోయాయంటున్నారని, మూడు నెలల్లో 40 మాత్రమే చనిపోయాయని చెప్పడం దారుణమని అన్నారు. గోవుల మృతిపై విజిలెన్స్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. గోవుల మృతికి టీటీడీ చైర్మన్, పాలక మండలి సభ్యులు, ఈఓ బాధ్యత వహించాలని అన్నారు. కందుకూరికి అగౌరవం గతంలో కోటిపల్లి బస్టాండ్ సెంటర్లో ఉన్న కందుకూరి వీరేశలింగం విగ్రహం తొలగించి, ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం కందుకూరిని అగౌరవపరచడమేనని అన్నారు. అలాగే, జేఎన్ రోడ్డులో ఏకేసీ కళాశాలకు ఆనుకుని ఉన్న హ్యాపీ స్ట్రీట్‌లో టంగుటూరి ప్రకాశం పంతులు పేరిట ఉన్న పార్కులో ఎన్టీఆర్ విగ్రహం పెట్టారని, ఇది దారుణమని అన్నారు. కావాలనుకుంటే కొత్తగా మరో పార్కు నిర్మించి, ఎన్టీఆర్ పేరు పెట్టుకోవాలని హితవు పలికారు. సూపర్ బజార్ ముడుపుల ఆరోపణల నిగ్గు తేల్చాలి గౌతమి సూపర్ బజార్ వ్యవహారంలో తనకు రూ.5 కోట్లు ఇచ్చారంటూ ఈవీఎం ఎమ్మెల్యే ఆరోపించారని, వీటిని నిరూపించాలని సవాల్ చేశారు. ఇప్పుడు అక్కడ భవన నిర్మాణం జరుగుతోందని, పనులు తక్షణం ఆపకపోతే ధర్నా చేస్తామని హెచ్చరించారు. కాంట్రాక్టర్ల నుంచి ఎమ్మెల్యే ముడుపులు తీసుకుంటున్నారని ఆరోపించారు. లాలాచెరువు వద్ద జాతీయ రహదారి సమీపాన హోండా షో రూం ఎదురుగా ఉన్న 1,300 గజాల భూమి మిగులు అని, పా ర్క్ స్థలమని పేర్కొంటూ కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పందిరి మహాదేవుడు సత్రం భూముల మాదిరిగానే లాలాచెరువు భూమిని కూడా కాపాడేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. ప్రభుత్వాసుపత్రుల పరిశీలనకు ఒక కమిటీ వేయాలని భరత్‌రామ్ డిమాండ్ చేశారు. -
లారీ డ్రైవర్‌కు ఆరు నెలల జైలు
సామర్లకోట: ఇద్దరు మహిళల మృతికి కారణమైన లారీ డ్రైవర్‌కు ఆరు నెలల జైలు, రూ.5,500 జరిమానా విధిస్తూ కాకినాడ ఐదవ కోర్టు మెజిస్ట్రేట్ షేక్ షరీన్ గురువారం తీర్పు ఇచ్చారని సీఐ ఎ.కృష్ణభగవాన్ తెలిపారు. 2022, నవంబర్ 10వ తేదీన పీబీ దేవం రైల్వే గేటు ఎదురుగా ఇద్దరు మహిళలను లారీ ఢీ కొంది. వేట్లపాలెం నుంచి ద్వారపూడి అయ్యప్పస్వామి గుడికి నడిచి వెళుతున్న సమయంలో వెనుక నుంచి వస్తున్న లారీ మహిళలను ఢీ కొనడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. అనకాపల్లి జిల్లా గుట్టివాడకు చెందిన అద్దం భాస్కరం లారీని నిర్లక్ష్యంగా నడపడం వలన ఈ ప్రమాదం జరిగిందని అప్పటి ఎస్సై టి.సునీత కేసు నమోదు చేశారు. ప్యాసిక్యూషన్ తరఫున పీపీ రఘువీర్ వాదించారు. అక్రమంగా తరలిస్తున్న 85 గోవుల పట్టివేత నల్లజర్ల: ఒడిశా రాష్ట్రం నవరంగ్‌పూర్ నుంచి ప్రత్యేక కంటైనర్‌లో హనుమాన్ జంక్షన్‌కు అక్రమంగా తరలిస్తున్న 85 గోవులను నల్లజర్ల శివార్లలో ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆ కంటైనర్‌లో బంధించిన 85 గోవులను నల్లజర్ల పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. దీనిపై ఎస్సై రమేష్ కేసు నమోదు చేశారు. వీటన్నింటినీ తూర్పు గోదావరి జిల్లా గోకవరంలోని గోశాలకు అప్పగించనున్నట్టు ఎస్సై తెలిపారు. ఈ దాడిలో హిందూ ధర్మరక్షణ ప్రచారక్ ఉప్పలపాటి మాధవరావు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు గుంటముక్కల రామకృష్ణ, సవలం రామకృష్ణ, మద్దూరి విష్ణుమూర్తి, తాడేపల్లిగూడెం గో సంరక్షణ సమితి సభ్యులు పాల్గొన్నారు. -
శిశిరంలో వసంతంలా..
● మోడువారిన భారీ వృక్షాలకు పునరుజ్జీవం ● కడియం నర్సరీ రైతుల ఘనత కడియం: శిశిర రుతువులో ఆకులన్నీ రాలిపోయి చెట్లు మోడుల్లా మారుతూంటాయి. అలా మోడువారిన చెట్లన్నీ.. తిరిగి వసంత రుతువు ఆగమనాన్ని సూచిస్తూ లేచివుళ్లు వేసి.. చూస్తూండగానే తిరిగి ఆకుపచ్చని శోభను సంతరించుకుంటాయి. ఇదంతా సహజంగా జరిగే ప్రక్రియ. కానీ, అభివృద్ధి పనులు, రోడ్ల నిర్మాణం, ఇతర కారణాలతో నరికివేసే భారీ వృక్షాలు మాత్రం మోడుల్లానే మిగిలిపోతూ.. చివరకు జీవాన్ని కోల్పోతున్నాయి. దీనిపై ఇలా చెట్ల నరికివేతపై పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇటువంటి వృక్షాలకు మళ్లీ జీవం పోస్తూ.. వాటికి వసంత శోభను తీసుకుని వస్తున్నారు కడియం ప్రాంత నర్సరీ రైతులు. వినూత్న రకాల మొక్కలను వేలాదిగా ఇక్కడి నర్సరీల్లో అందుబాటులో ఉంచుతూ, దేశవిదేశాల్లో కడియం ప్రాంతానికి ఎంతో గుర్తింపును తీసుకుని వచ్చిన ఈ ప్రాంత రైతులు.. భారీ వృక్షాలకు పునరుజ్జీవం పోస్తూ, కొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో మోళ్లుగా మిగిలిన రావి, మర్రి, జమ్మి, జువ్వి, బాదం, ఉసిరి, గానుగ, కదంబం, కొబ్బరి, తాటి వంటి భారీ వృక్షాలను వేర్లతో సహా పెకలించి, ఇక్కడకు తీసుకుని వస్తున్నారు. వాటిని బతికించేందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నారు. దీనికోసం లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్నారు. ఒకవేళ తీసుకువచ్చిన వృక్షం చనిపోతే, ఆ మేరకు నష్టాన్ని కూడా వీరు భరించాల్సి ఉంటుంది. అయినప్పటికీ వారు ఏమాత్రం వెనుకాడటం లేదు. చెట్టు ఎంత భారీ సైజులో ఉన్నప్పటికీ, నిపుణుల పర్యవేక్షణలో తొలగించి, వేర్లకు ప్రత్యేక పోషణ చేపడుతున్నారు. వేర్లు దెబ్బ తినకుండా తగు జాగ్రత్తలు తీసుకుని, ట్రాలీలపై తీసుకుని వస్తున్నారు. అలా తెచ్చిన చెట్లకు మినరల్స్, సూక్ష్మ పోషకాలు (మైక్రో న్యూట్రియెంట్స్) అందించి, మాను నుంచి చిగుళ్లు వచ్చే వరకూ పోషిస్తారు. చిగుళ్లు వచ్చి, చెట్లు మళ్లీ బతికిందని నిర్ధారించుకున్న తరువాత రవాణాకు అనుగుణంగా సిద్ధం చేస్తారు. ఈ ప్రక్రియకు ఏడాది నుంచి నాలుగైదేళ్ల వరకూ పడుతుంది. అప్పటి వరకూ దీనిపై పెట్టుబడి పెడుతూనే ఉండాలి. చెట్టు సైజు, వయస్సును బట్టి రూ.లక్ష నుంచి రూ.15 లక్షల వరకూ వీటిని విక్రయిస్తున్నారు.ట్రాలీపై రవాణా చేస్తున్న భారీ వృక్షం -
ప్రభుత్వాసుపత్రిలో దుర్భర పరిస్థితులు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక ప్రభుత్వాసుపత్రిలో మౌలిక సదుపాయాలు, సిబ్బంది నియామకం, పరిశుభ్రత వంటి అంశాలపై దృష్టి పెట్టాలని మాజీ ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్‌రామ్ డిమాండ్ చేశారు. నిత్యం ఎన్నో కేసులు వచ్చే ఈ ఆసుపత్రిలో కనీస సదుపాయాలు లేకుంటే ఎలాగని ప్రశ్నించారు. బుధవారం స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వార్డుల్లో పరిస్థితులను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇక్కడకు వచ్చిన కేసులలో 60 శాతం విఫలమవుతున్నాయని ఆరోపించారు. ఎవరినైనా ఇక్కడ చేరిస్తే, సీరియస్‌గా ఉందని, కాకినాడ తరలిస్తున్నారని, అలాంటప్పుడు మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పుతున్న సందర్భాలున్నాయని చెప్పారు. గర్భవతులు చేరితే లేబర్ రూమ్‌కి కూడా తీసుకెళ్లడం లేదని, ఫలితంగా బెడ్ మీదే ప్రసవాలు అయిపోతున్నాయని, మంగళవారం రాత్రి కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుందని చెప్పారు. మార్చురీలో దాతలు ఇచ్చిన వెంటిలేటర్లు, ఐస్ కేసులున్నా వాడడం లేదన్నారు. తాను వస్తున్నానని తెల్సి వార్డుల్లో శుభ్రం చేయడం, కరెంట్ పునరుద్ధరించడం చేశారని చెప్పారు. ఇక్కడ ఉన్న సౌకర్యాలు ఏమిటి, డాక్టర్లు, సిబ్బంది ఉన్నారా లేదా అనే విషయాలు కూడా రివ్యూ చేయకుండా నిర్లక్ష్యంగా ఉండడం దారుణమని అన్నారు. ఆసుపత్రిలో ఉన్న ఇబ్బందులపై, సమస్యలపై వీడియోలు చేసేది రాజకీయ ప్రయోజనాల కోసం కాదని, పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికేనని ఆయన స్పష్టం చేశారు. జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్నపుడు కరోనా సమయంలో పడిన ఇబ్బందులు గమనించి ఆసుపత్రిలో పరిస్థితులు మెరుగు పరచడం కోసం చర్యల్లో భాగంగా మెడికల్ కాలేజీ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారని భరత్ పేర్కొన్నారు. దాన్ని కొనసాగించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా ? అని ప్రశ్నించారు. వీడియో తీసిన వీరా అనే యువకుడు మాట్లాడుతూ ఒక ముసలాయన రోడ్డుపై పడివుంటే, ఆటోలో తీసుకొచ్చి చేర్చామని, స్ట్రెచర్ మీద పడుకోబెట్టి కుట్లు వేసే రూమ్‌కి తీసుకెళ్లారని, అయితే అక్కడ కూడా విద్యుత్ లేదని చెప్పాడు. 500 పడకల ఆసుపత్రి అయినందున ఇక్కడ 24గంటలూ కరెంట్ ఉండాలని, కనీసం జనరేటర్ కూడా లేకపోవడం విచారకరమని పేర్కొన్నారు. కనీస సౌకర్యాలు లేవు, తగిన సిబ్బంది లేరు మాజీ ఎంపీ భరత్‌రామ్ -
మాటతీరు తెలిసిన మర్యాదాపురుషోత్తముడు
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): ‘‘ పెద్దలతో ఎలా మాట్లాడాలో మనం రాముని మాటతీరును పట్టి తెలుసుకోవాలి, ఆయన మర్యాదాపురుషోత్తముడు, వినయాది సద్గుణశోభితుడు’’ అని వాగ్దేవీవరపుత్ర సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. బుధవారం టీనగర్‌లోని హిందు సమాజంలో ఆయన ఉత్తరకాండపై రెండవ రోజు ప్రవచనాన్ని కొనసాగించారు. సీతాసమేతుడయి కొలువుతీరిన రామచంద్రుని దర్శనార్థం మహర్షులు తరలి వచ్చా రు. రాక్షస పీడను తొలగించినందుకు శ్రీరాముని కొనియాడుతూ, వారు ఇంద్రజిత్తు గురించి పదేపదే ప్రస్తావించడంతో రామునిలో కుతూ హలం పెరిగింది. ‘మహాత్ములారా! మీరు ప్రత్యేకించి ఇంద్రజిత్తు గురించి ప్రస్తావించడానికి కారణం తెలుసుకోగోరతాను. అది రహస్యం కాకపోతే, తెలుసుకునే యోగ్యత నాకు ఉన్నదని మీరు భావిస్తే, నాకు తెలియచెప్పమని శ్రీరాముడు అడిగాడు, మునులు ఇంద్రజిత్తు తపస్సు, వాడు పొందిన వరాల గురించి చెబుతూ, వాడిని వధించడం విశేష మన్నారు. ఇక్కడ మనకు ఒక సందేహం రావచ్చు. ఇంద్రజిత్తును వధించినది లక్ష్మణుడు అయితే, రాముని ప్రశంసించడంలో ఔచిత్యమేమిటని. ‘శ్రీరాముడు సత్యసంధుడు, ధర్మాత్ముడు అయితే, ఈ అస్త్రం ఇంద్రజిత్తుని వధించుగాక’ అని లక్ష్మణుడు స్తోత్రం చేస్తూ ఉయోగించిన అస్త్రమే ఇంద్రజిత్తు ప్రాణాలను తీసిందని మనం విస్మరించరాదని సామవేదం అన్నారు. రామాయణంలో జ్యోతిషశాస్త్ర ప్రాశస్త్యం పలు సన్నివేశాలలో కనపడుతుంది, జ్యోతిషం వేదాంగం, ఒక ప్రామాణికమైన శాస్త్రమని సామవేదం అన్నారు. రావణుడు సీతను విందముహూర్తంలో అపహరించాడని, ఆ ముహూర్తంలో అపహరించినవాడికి ప్రాణాంతకం. అలాగే, రావణుని తల్లి కై కసి విశ్రవసుబ్రహ్మను ‘దారుణ’ముహూర్తంలో సమీపించి సంతానం కోరడం వల్ల ఆమెకు లోకకంటకుడయిన రావణుడు జన్మించాడని, ఆ తరువాత పుట్టిన విభీషణుడు ధర్మాత్ముడవుతాడని ఆయన కై కసిని ఓదార్చాడని సామవేదం అన్నారు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయినప్పుడు, ‘మానవులు నాకు తృణప్రాయులు, మానవులను తప్పించి ఇత రుల చేతిలో నాకు మరణం కలగకూడదని రావణుడు కోరుకున్నాడు, ఎట్టి ఆపదలలోను నా బుద్ధి ధర్మతప్పకూడదని విభీషణుడు బ్రహ్మను కోరుకు న్నాడు. బ్రహ్మదేవుడు విభీషణునికి అమరత్వాన్ని ప్రసాదించాడు, రావణుడు అదే అమరత్వాన్ని ముందు కోరితే, ఆయన ఆ వరాన్ని ప్రసాదించలేదని సామవేదం అన్నారు. భాగవత విరించి డాక్టర్ టీవీ నారాయణరావు స్వాగత వచనాలు పలికారు. వాగ్దేవీ వరపుత్ర సామవేదం షణ్ముఖశర్మ -
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై దృష్టి సారించి, నివారణ దిశగా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులు ఎస్పీ డి.నరసింహాకిశోర్ అదేశించారు. సీసీటీఎన్ఎస్ సమాచారం ద్వారా నెలవారీ నేర సమీక్షా సమావేశం జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం జరిగింది. ఎస్పీ మాట్లాడుతూ అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. గ్రేవ్ ఎక్విటల్ కేసులు, మిస్సింగ్ కేసులు, పొక్సో, ఎస్సీ ఎస్టీ కేసుల పై ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నారు. పాత నేరస్తులు, రౌడీ షీట్ హోల్డర్స్పై ప్రత్యేకంగా నిఘా ఉంచి వారి కదలికలు పసిగడుతూ ఉండాలన్నారు. లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించదగ్గ కేసులు ఉంటే ఆ దిశగా పనిచేయాలన్నారు. జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు డ్రోన్ల ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమీక్షలో అడిషనల్ ఎస్పీలు ఎన్‌బీఎం మురళీకృష్ణ, ఏవీ సుబ్బరాజు, ఎల్.అర్జున్, ఎస్బీ డీఎస్పీ బి.రామకృష్ణ, ఇన్స్పెక్టర్ ఏ.శ్రీనివాసరావు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ పవన్‌కుమార్ రెడ్డి, జోనల్ డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. పాలిసెట్‌కు నేడు తుది గడువు రాయవరం: పదో తరగతి విద్యార్హతతో సాంకేతిక విద్యకు పునాది వేసే ‘పాలిసెట్’ దరఖాస్తుకు గురువారం సాయంత్రంతో గడువు ముగియనుంది. ఫిబ్రవరి 27న నోటిఫికేషన్ విడుదలైన విషయం పాఠకులకు విదితమే. ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలు లభిస్తాయి. ఆన్లైన్లో దరఖాస్తుకు తుది గడువు గురువారంతో ముగుస్తున్న నేపథ్యంలో దరఖాస్తు చేసుకోలేని విద్యార్థులు త్వరపడాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 4,236 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. -
వివిధ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం ˘
రాజమహేంద్రవరం రూరల్: జిల్లా పిల్లల రక్షణ విభాగం, ప్రత్యేక దత్తత ఏజెన్సీ, చిల్డ్రన్ హోమ్ 2, వన్ స్టాప్ సెంటర్లలో పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఈ నెల 19వతేదీ లోపు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కె.విజయకుమారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోస్టుల భర్తీకి ఈ నెల 7వ తేదీన నోటిఫికేషన్ ను జారీచే శామన్నారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 19వ తేదీలోపు అందజేయాలని పేర్కొన్నారు. అన్నదానం భక్తుల నుంచి అభిప్రాయ సేకరణ అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన అన్నవరంలోని శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం భక్తులకు అందిస్తున్న సేవలపై ఎందుకు భక్తుల్లో అసంతృప్తి నెలకొని ఉందనే దానిపై ఇద్దరు ప్రయివేట్ వ్యక్తులతో కూడిన ఐవీఆర్ఎస్ బృందం రెండో రోజు బుధవారం కూడా అభిప్రాయ సేకరణ నిర్వహించింది. ప్రధానంగా అన్నదానం పథకంలో ఆహార పదార్థాలు రుచిగా ఉన్నాయా అని భక్తులను ఆ బృందం ప్రశ్నించింది. బాగున్నాయని చాలామంది భక్తులు చెప్పినట్టు సమాచారం. అయితే ఒకరిద్దరు మంచినీరు ఆలస్యమవుతోందని తెలిపారు. సత్యదేవుని నిత్యాన్నదానం హాలు ఫ్లోరింగ్ శుభ్రతపై ఆ బృందం అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ఫ్లోరింగ్ శుభ్రత ఇంకా బాగుండాలని, చెప్పినట్టు తెలిసింది. దేవస్థానం టాయిలెట్స్‌లో పరిశుభ్రత పై కూడా ఆ కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసిందని సమాచారం. వక్ఫ్ సవరణలపై నిరసన కాకినాడ సిటీ: ముస్లిం మైనారిటీల హక్కులను హరిస్తున్న వక్ఫ్ సవరణలకు వ్యతిరేకంగా కాకినాడలో బుధవారం ముస్లింలు కదం తొక్కారు. వక్ఫ్ సవరణ చట్టంను రద్దు చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామని వక్ఫ్ జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్లు–2025ను వ్యతిరేకిస్తూ ముస్లిం వక్ఫ్ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు నగరంలో పెద్ద ఎత్తున ముస్లింలు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. మొయిన్‌రోడ్డులోని జమియా మసీద్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. వక్ఫ్‌ను కాపాడండి, రాజ్యాంగాన్ని రక్షించండి అంటూ నినాదాలు చేశారు. కలెక్టరేట్లో కలెక్టర్ షణ్మోహన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ముస్లిం నాయకులు జవహర్ అలీ, తాజువుద్దీన్, అబ్దుల్ బషీరుద్దీన్, రెహమాన్, రహీం, కుతుబుద్దీన్, జిలాని దురాని, అబ్దుల్ రజాక్ రిజ్వీ, గౌస్ మొహిద్దీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టం–2025ను వ్యతిరేకిస్తున్నామన్నారు. వక్ఫ్ ఆస్తులన్నీ కూడా ఎవరో ముస్లిం దాతలు ఎప్పుడో తమ అభిష్టం ప్రకారం ముస్లిం సమాజం కోసం త్యాగం చేసి దానం చేసిన ఆస్తులే కానీ ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు కావన్నారు. -
వర్గపోరులో ఢీసీసీబీ
● చైర్మన్ పీఠం కోసం నేనంటే నేను ● బీసీలకే అంటున్న టీడీపీ అధిష్టానం ● రేసులో పిల్లి సత్తిబాబు... ● మెట్ల వర్గంలో ఉలికిపాటు ● చివరి యత్నంగా చినబాబు దగ్గరకు ● జిల్లాలో పదవుల కోసం ఎదురుచూపులు సాక్షి, అమలాపురం: కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవులు పందేరం పుణ్యమా అని సామాజికవర్గాలు, పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు పొడచూపుతోంది. తొలుత ఒక పేరు ప్రచారంలో ఉంచడం, చివరకు మరొకరికి పదవి కేటాయించడం టీడీపీలో కొత్త వ్యూహంగా మారింది. ప్రాథమిక సహకార సంఘాలు (పీఏసీఎస్)లకు త్రీమెన్ కమిటీ పదవుల నుంచి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ పదవి వరకు ఇదే పంథా అవలంబిస్తోంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఉన్న డీసీసీబీ, డీసీఎంఎస్ పదవులకు పేర్లను ఖరారు చేసే పనిలో టీడీపీ అధిష్టానం సిద్ధమైంది. దీనిలో డీసీసీబీ చైర్మన్ పదవి కీలకమైంది. తొలి నుంచి ఈ పదవికి అమలాపురానికి చెందిన పార్టీ నాయకుడు మెట్ల రమణబాబు పేరు ప్రముఖంగా వినిపించింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో డీసీసీబీకి నిర్వహించిన ఎన్నికల్లో రమణబాబు టీడీపీ తరఫున పోటీ చేసి అప్పటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దివంగత వరుపుల జోగిరాజు (రాజా)పై పోటీ చేసి ఓటమి చెందారు. అప్పటి నుంచి రమణబాబు ఈ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. 2014–19 మధ్య కాలంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ రమణబాబుకు ఈ పదవి కేటాయించలేదు. కేవలం గిడ్డంగుల సంస్థ డైరెక్టర్ పదవితో సరిపెట్టారు. ఈసారి తనకు ఈ పదవి వస్తుందని రమణబాబు బలంగా నమ్మకం పెట్టుకున్నారు. పార్టీలో సైతం అతని పేరు ప్రముఖంగా వినిపించింది. కాని వారం రోజులుగా పరిస్థితి తల్లకిందులైంది. డీసీసీబీ చైర్మన్ పదవి బీసీలకు కేటాయించాలని, అందునా శెట్టిబలిజ సామాజికవర్గానికి ఇవ్వాలనే ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. దీనిలో భాగంగా కొత్తపేటకు చెందిన శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం (ఆర్ఎస్) పేరు ప్రముఖంగా వినిపించింది. దీనిపై ఆర్ఎస్ను పార్టీ అధిష్టానం సంప్రదించిన విషయం తెలిసిందే. క్యాబినెట్ ర్యాంకు పదవి చేసిన తాను డీసీసీబీ చైర్మన్ పదవి చేయలేనని ఆయన సున్నితంగా తిరస్కరించారు. తెరపైకి పిల్లి సత్తిబాబు డీసీసీబీ చైర్మన్ పదవిని ఆర్ఎస్ తిరస్కరించడంతో కాకినాడ రూరల్‌కు చెందిన పిల్లి సత్తిబాబు పేరు తెరపైకి తీసుకువచ్చారు. సత్తిబాబు సతీమణి పిల్లి అనంతలక్ష్మి ఎమ్మెల్యేగా పనిచేసిన విషయం తెలిసిందే. కూటమి పార్టీల మధ్య కుదిరిన పొత్తులలో భాగంగా కాకినాడ రూరల్ స్థానాన్ని జనసేనకు కేటాయించగా, ఆ పార్టీ తరఫున పోటీ చేసిన పంతం నానాజీ విజయం సాధించారు. జనసేనకు ఆ సీట్టు ఇవ్వడంతో అవకాశం కోల్పోయిన సత్తిబాబుకు సముచిత స్థానం కల్పిస్తానని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. దీనితో సత్తిబాబు ఎమ్మెల్సీ పదవిపై ఆశ పెట్టుకున్నారు. పిఠాపురం నుంచి ఈ పదవి ఆశిస్తున్న ఎస్.వి.ఎస్.ఎన్.వర్మకు ఎమ్మెల్సీ హామీ ఇచ్చి ఎన్నికల పూర్తయిన తరువాత పక్కన బెట్టడం చూసిన సత్తిబాబు డీసీసీబీ చైర్మన్ పదవి ఇచ్చినా చాలన్నట్టుగా చూస్తున్నారు. పార్టీ అధిష్టానం ఇందుకు సముఖంగా ఉన్నట్టు తెలిసిందే. రమణబాబు చివరి యత్నాలు డీసీసీబీ చైర్మన్ పదవి చేజారిపోతోందని తెలియడంతో రమణబాబు చివరి యత్నాలు ప్రారంభించారు. పార్టీ అధిష్టానం వద్ద తేల్చుకునేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. దీనిలో భాగంగా ఆయన అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుతో కలిసి పార్టీ ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను కలవనున్నారు. డీసీసీబీ చైర్మన్ పదవి తనకు కేటాయించాలని ఆయన పట్టుబట్టనున్నారు. అయితే రమణబాబుకు నామినేటెడ్ పదవి ఇచ్చే ఉద్దేశం టీడీపీ అధిష్టానానికి లేదని పార్టీలో కొంతమంది ప్రముఖులు చెబుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికలలో రమణబాబు పట్టుబట్టడంతోనే అమలాపురం అసెంబ్లీ స్థానం ఆనందరావుకు కేటాయించారు. గతంలో ఒకసారి రమణబాబుకు నామినేటెడ్ పదవి ఇవ్వాలని పార్టీ పెద్దలు కలిశారు. ‘రమణబాబు కోటాలోనే ఆనందరావుకు సీటు ఇచ్చామని, ఇద్దరు కలిసి పనిచేసుకోవాలి’ అని అప్పుడు లోకేష్ అన్న మాటలను పార్టీ క్యాడర్ గుర్తు చేసుకుంటోంది. పదవిపై హామీ ఇవ్వకుండా పరోక్షంగా రమణబాబుకు నామినేటెడ్ పదవి ఇచ్చేది లేదని తేల్చినట్టుగా క్యాడర్ భావిస్తోంది. దీనికితోడు గత ప్రభుత్వంలో మున్సిపల్ ఎన్నికలు జరిగిన సమయంలో అమలాపురం మున్సిపాలిటీ ఓసీ మహిళ రిజర్వ్ అయ్యింది. ఆ సమయంలో రమణబాబు సతీమణిని పోటీలో పెట్టాల్సిందిగా లోకేష్ సూచించారని, ఇందుకు రమణబాబు అంగీకరించలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ ఎన్నికల్లో పట్టణంలో పార్టీ మూడవ స్థానంలో నిలిచింది. దీనిపై లోకేష్ అసంతృప్తితో ఉన్నారని సమాచారం. అయితే తూర్పు డీసీసీబీ చైర్మన్ పదవి తొలి నుంచి కాపు సామాజికవర్గానికి కేటాయించడం ఆనవాయితీగా వస్తోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సైతం అనంత ఉదయ భాస్కర్ (అనంతబాబు), ఆకుల వీర్రాజుకు ఇచ్చిన విషయాన్ని రమణబాబు వర్గీయులు గుర్తు చేస్తున్నారు. ఈ ఆనవాయితీని కాదని బీసీలకు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్న వారు.. ఇదే విషయాన్ని లోకేష్ వద్ద తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఏపీసీఎస్ చైర్మన్ పదవుల కోసం తూర్పు డీసీసీబీ పరిధిలో 198 సహకార సంఘాలున్నాయి. వీటికి సంబంధించి త్రీమెన్ కమిటీల నియామకం పూర్తయ్యింది. ఇందుకు సంబంధించిన జాబితాను ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి పంపించారు. ఒకటి, రెండు చోట్ల తప్ప పెద్దగా మార్పులు ఉండే అవకాశం లేదు. గత ఫిబ్రవరిలోనే ఈ ప్రక్రియ పూర్తయ్యింది. ప్రభుత్వం నుంచి జీవో విడుదల అవుతుందనుకున్న సమయంలోనే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడంతో ఏఏసీఎస్ పదవుల పందేరానికి అవాంతరాలు ఏర్పడ్డాయి. ఎన్నికల ప్రక్రియ ముగిసినా పదవులకు సంబంధించిన ప్రకటన మాత్రం విడుదల కాకపోవడంతో పదవులు దక్కినవారు ఆశగా ఎదురుతెన్నులు చూస్తున్నారు. -
క్రిస్టియన్ బృంద సంగీతంలో భవాని గిన్నిస్ రికార్డ్
కరప: మండలం వేళంగి గ్రామానికి చెందిన టెక్కలి వీరకన్య భవాని (పల్లవి) క్రిస్టియన్ బృంద సంగీతంలో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. సంగీతాభ్యాసంలో పాస్టర్ అగస్టిన్ ఇచ్చిన ఉచిత శిక్షణలో అగ్రగామిగా ఉన్న భవాని విజయవాడలోని హల్లెల్ మ్యూజిక్ స్కూల్ ఆధ్వర్యంలో గతేడాది డిసెంబర్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొంది. అగస్టిన్ దండంగి వేణుగోపాల్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఒక గంట వ్యవధిలో అత్యధికంగా 1046 పియానో వాయిద్య ప్రదర్శన వీడియోలను ఆన్లైన్లో అప్లోడ్ చేయడం ద్వారా ఆమె ప్రపంచ రికార్డ్ నెలకొల్పింది. ఈ మేరకు హైదరాబాద్‌లో ఈనెల 14వ తేదీన నిర్వహించిన కార్యక్రమంలో బ్రదర్ అనిల్‌కుమార్, అగస్టిన్ వేణుగోపాల్ తనకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ పార్టిస్పేషన్ సర్టిఫికెట్ అందజేసినట్టు భవాని బుధవారం స్థానిక విలేకరులకు తెలిపారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి)గండేరా (వెయ్యి) 19,000 గటగట (వెయ్యి) 17,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 18,000 గటగట (వెయ్యి) 16,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
క్షేత్రస్థాయి నివేదిక మేరకు నిర్ణయం
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం భూములకు సంబంధించి క్షేత్రస్థాయి నివేదిక ఆధారంగా వచ్చే డేటాతో తదుపరి సమావేశం నిర్వహిస్తామని అమలాపురం ఆర్డీఓ కె.మాధవి అన్నారు. బుధవారం అంతర్వేది ఆలయ ప్రాంగణంలో మండలంలోని వివిధ గ్రామాల్లో స్వామివారి దేవస్థానం భూముల శిస్తుల పెంపుదల నిమిత్తం ఏర్పాటు చేసిన అధికార సమావేశం రైతుల హాజరు శాతం తక్కువగా ఉండడం వల్ల వాయిదా వేశారు. దీంతో గ్రౌండ్ లెవెల్లో రెవెన్యూ, అగ్రికల్చర్, ఫిషరీస్ సిబ్బంది దేవస్థానం భూములపై ఇచ్చే వాస్తవ పరిస్థిల డేటాపై తదుపరి సమావేశం నిర్వహణకు ఆర్డీఓ పై విధంగా తెలిపారు. సదరు సమావేశానికి రైతులు శాతం సంతృప్తికరంగా ఉండాలని కూడా ఆర్డీఓ ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా దేవస్థానం కౌలు రైతులు ఒక వినతి పత్రాన్ని ఆర్డీఓకు అందజేశారు. డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా ధ్వంసం కావడం వల్ల, మరో పక్క చెరువుల వల్ల వచ్చే వ్యర్థమైన నీటి వల్ల దేవస్థానం భూముల్లో వ్యవసాయం దెబ్బతిందని, గత 12 సంవత్సరాలుగా కనీసం పంట ఊడ్చలేని పరిస్థితులు ఏర్పడ్డాయని, వ్యవసాయ భూములు తరుచూ ముంపులోనే మునిగి ఉంటున్నాయని ఆ పత్రంలో వారు వివరించారు. గ్రౌండ్ లెవెల్లో వాస్తవ పరిస్థితులు అంచనా వేసి, తమకు న్యాయం చేయాలని వారు కోరారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ, తహసీల్దార్ ఎం.వెంకటేశ్వరరావు, వైస్ ఎంపీపీ–1 కొల్లాబత్తుల శుభాకర్, ఎంపీటీసీ బైరా నాగరాజు, సర్పంచ్ కొండా జాన్‌బాబు, మాలే శ్రీనివాస నగేష్, దేవ రాజేంద్రప్రసాద్, ఉండపల్లి అంజిబాబు, పలువురు వీఆర్వోలు, వివిధ గ్రామాలకు చెందిన కౌలు రైతులు పాల్గొన్నారు. అంబేడ్కర్‌ను అవమానించిన యువకుడి అరెస్టు శంఖవరం: గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహానికి చెప్పులు దండ వేసిన యువకుడిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. డీఎస్పీ శ్రీహరిరాజు అందించిన వివరాల మేరకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసిన యువకుడు శంఖవరం గ్రామానికి చెందిన పడాల వాసుగా పోలీసులు గుర్తించారు. ఈ నెల 14 అర్ధరాత్రి దాటిన తరువాత వాసు అంబేడ్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసి అవమానం కలిగించినట్లుగా పోలీసులు గుర్తించారు. దళితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదే రోజున అన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాల మేరకు పోలీసులు కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఛేదించారు. అదనపు ఎస్పీ ఎంజేవీ భాస్కరరావు, డిఎస్పీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలు, 40 మంది పోలీసులు ప్రత్యేక బృందాలుగా విచారణ చేపట్టారు. ఈ కేసులో సాంకేతిక, సీసీ ఫుటేజీల ఆధారంగా అనేక మంది అనుమానితులను విచారించి నిందితుడిని గుర్తించారు. నిందితుడు ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. అతడు దుందుడుకు స్వభావంతో ఈ దారుణానికి ఒడిగటినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితునికి కఠిన శిక్ష పడేందుకు మరిన్ని సాంకేతిక ఆధారాలతో లోతైన దర్యాప్తు చేస్తున్నామన్నారు. అన్నవరం డ్రైవర్‌పై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు అన్నవరం: అన్నవరం దేవస్థానం ట్రాన్స్‌పోర్టు విభాగంలో డ్రైవర్‌గా పనిచేస్తున్న కొల్లు పైడిబాబు (పెద్ద శ్రీను)ను ‘బ్రీత్ అనలైజర్’ పరీక్షలో మద్యం తాగినట్టు గుర్తించి తాత్కాలికంగా విధుల నుంచి తొలగించారు. తదుపరి చర్యల కోసం ఈఓకు నివేదిక సమర్పించినట్టు అధికారులు తెలిపారు. బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు రాయవరం: స్థానికంగా 11 ఏళ్ల బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన తేతల వెంకట శ్రీనివాస్‌రెడ్డి అలియాస్ కేబుల్ శ్రీనుపై ఎస్సై డి.సురేష్‌బాబు కేసు నమోదు చేశారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని రాయవరం మెయిన్‌రోడ్డులో అరెస్టు చేశామన్నారు. అనంతరం జేఎఫ్‌సీఎం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్టు తెలిపారు. -
నేటి ప్రయోజనం!
నాటి ప్రణాళిక.. చేసేది ఏమిటో చేసేయి సూటిగా వేసేయి పాగా ఈ కోటలో.. ఎన్ని కష్టాలు రానీ.. నష్టాలు రానీ నీ మాట దక్కించుకో బాబయా.. అంటూ సాగే ఈ గీతంలోని ప్రతి పదం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి నూటికి నూరు పాళ్లు అతికినట్టు సరిపోతుంది. పేదరికం కారణంతో ఏ పిల్లవాడూ చదువుకు దూరం కాకూడదు. కేజీ నుంచి పీజీ వరకు ఏ స్థాయిలోనూ ఏ విధమైన ఆటంకం రాకూడదు. అందుకు చేయాల్సింది ఏదైనా వెనకాడకూడదు. ఈ లక్ష్యంతో నాడు–నేడు పేరున బృహత్తర పథకాన్ని అమలు చేసిన దార్శనికుడు జగన్మోహన్రెడ్డి. ఏటేటా ఫీజు రీయింబర్స్మెంట్. పిల్లలు పాఠశాలకు, కళాశాలకు వస్తున్నారా లేదా అని ఉపాధ్యాయుల ద్వారా పటిష్టమైన నిఘా. పిల్లల ఇళ్లకే వెళ్లి వాళ్ల విద్యా ప్రగతిని తల్లిదండ్రులకు వివరించడం. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో రాజీ లేని ప్రణాళికా రచన.. మానసిక ఉల్లాసానికి ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడలకు ప్రోత్సాహం. ఇలా ఎన్నో చర్యలు చేపట్టి విద్యార్థుల మనసులో కోట కట్టుకుని సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. అందుకోసం ఎన్ని కష్టాలు, నిధుల లేమి ఎదురైనా ఎలాగోలా సమకూర్చి అవసరాలన్నీ తీర్చి నిజంగానే జగన్ మామ అనిపించుకున్నారు. ఆయన నాటిన విత్తనాలు నేడు చక్కని ఫలితాలను ఇస్తుంటే విద్యార్థుల తల్లిదండ్రులు, అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురం: పరీక్షా ఫలితాలు వెలువడ్డాయంటే చాలు 1, 2, 3, 4, 5... అసాధారణ ఫలితాలు అద్భుత విజయాలు మా సొంతం అంటూ ప్రసార మాద్యమాల్లో ప్రైవేటు విద్యా సంస్థలు ప్రచారంతో ఊదరగొడుతుంటాయి. గత కొన్నేళ్లుగా విద్యా వ్యవస్థలో ఈ పరిస్థితి నాటుకుపోయింది. ర్యాంకు రావాలంటే ప్రైవేటు విద్యా సంస్థలో తప్ప మరెక్కడా రాదని ప్రజల్లో నాటుకు పోయేలా చేశాయి ప్రైయివేటు విద్యా సంస్థలు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యకు ప్రాధాన్యత ఇస్తూ ప్రవేశ పెట్టి అమలు చేసిన పథకాలు, విద్యా వ్యవస్థలో తీసుకువచ్చిన సంస్కరణలతో ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలను మార్చివేయడంతో అలాంటి పరిస్థితిని మార్చి చూపించారు ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు. ప్రభుత్వ కళాశాలల్లో చదివి అత్యుత్తమ ఫలితాలను సొంతం చేసుకుని సత్తా చాటి ప్రైవేటు పాఠశాలలకు సవాల్ విసురుతున్నారు ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు. ఈ ఏడాది ఇంటర్మీడియెట్ పరీక్షా ఫలితాల్లో రాష్ట్రంలో ప్రభుత్వ కళాశాల విద్యార్థులు 54 మంది అత్యుత్తమ ఫలితాలు సాధించగా వారిలో 99 శాతం మంది ప్రభుత్వ కళాశాలల విద్యార్థులే కావడం విశేషం. మట్టిలో మాణిక్యాలు అరుదుగా బయటపడుతుంటాయి, అలాంటి మాణిక్యాలకు సాన పెడితే వాటి విలువ ఏంటో ప్రపంచానికి తెలుస్తుంది. సరైన మౌలిక వసతులు, వృత్తికి అనుకూల వాతావరణం కల్పిస్తే అద్భుత ఫలితాలు సాధ్యమవుతాయి. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది వైఎస్సార్ సీపీ ప్రభుత్వం. గడచిన ఐదేళ్లలో నాడు–నేడు పేరుతో ప్రభుత్వ పాఠశాలల తీరుతెన్నులు మారి పోవడంతో పాటు ఉపాధ్యాయులు తమ శక్తి వంచన లేకుండా తర్ఫీదు ఇస్తుండడంతో ఎన్నడూ లేని విధంగా అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు విద్యార్థులు. ఒక్క పైసా కూడా ఖర్చు లేదు. మీకు చదవాలనే ఆసక్తి ఉంటే చాలు అన్ని వసతులు కల్పిస్తాం రండి.. చదువుకోండి.. మంచి ఉన్నత స్థానాలకు చేరుకోండి.. అంటు ప్రభుత్వ విద్యా సంస్థలు విద్యార్థులకు ఆహ్వానం పలుకుతుంటే విద్యార్థులు క్యూకడుతున్నారు. రూ.లక్షల ఫీజులు చెల్లించి చదువుకునే ప్రైవేటు కళాశాలలను తలదన్నే విధంగా ప్రభుత్వ కళాశాల విద్యార్థినులు తమ సత్తా చాటారు. ప్రభుత్వ కళాశాల్లో మెరుగుపడిన సౌకర్యాలతో పైసా ఫీజు లేకుండా చదువుకుని టాపర్లుగా నిలిచి ప్రభుత్వ కళాశాలలకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెస్తున్నారు ప్రభుత్వ కళాశాలల విద్యార్థినులు.మనో నేత్రమే ఆమె బలం తుని మండలం టి.వెంకటాపురం గ్రామానికి చెందిన గింజాల హేమజ్యోతి పుట్టుకతో ఒక కన్ను పూర్తిగా కనిపించకపోయినా మసకబారినట్టు కనిపించే రెండో కన్నుతో విద్యను అభ్యసించింది. ఆమె ఇంటర్మీడియట్ ఎంఈసీలో అత్యుత్తమంగా 660 మార్కులతో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన షైనింగ్ స్టార్స్ జాబితాలో స్థానం దక్కించుకుంది. తల్లిదండ్రులు శ్రీనివాసరావు, నాగ సత్యవతి వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత బీఈడీ చదివి ఉపాధ్యాయురాలు కావాలన్నదే తన కుమార్తె ఆశయమని తెలిపారు. మరింత మందికి స్ఫూర్తి బిక్కవోలు మండలంలోని పందలపాకకు చెందిన రుత్తల లీలా శ్రావణి. విజయవాడ చెందిన ఈమె కళాశాల ఫస్ట్ రావడంతో పాటు రాష్ట్రంలో సీఈసీలో 943 మార్కులతో హైస్కూల్ ప్లస్ స్టేట్ ఫస్ట్ వచ్చింది. ఆమె చదువు మరింతమంది మహిళలకు బాట వేసింది. రూపాయి ఖర్చు లేకుండా అన్ని వసతులతో ప్రభుత్వ కళాశాలలను తీర్చి దిద్దడం వల్లే విద్యా ప్రమాణాలు పెరిగి తమలాంటి వాళ్లు అత్యుత్తమ ఫలితాలు సాధించగలుగుతున్నామని ఆమె పేర్కొంది. ఆటో డ్రైవర్ కుమార్తె అయినా.. కాకినాడ పీఆర్ ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలకు చెందిన దుంపా సాయిలక్ష్మి ఎలక్ట్రానిక్స్ గ్రూపులో 1000కి 982 మార్కులు సాధించి ప్రధమ స్థానంలో నిలిచింది. పేద కుటుంబానికి చెందిన ఆమె తండ్రి దుంపా ప్రసాద్ ఆటో డ్రైవరుగా పని చేస్తున్నాడు. తల్లి శేషారత్నం గృహిణి. డిగ్రీ పూర్తి చేసి గ్రూప్స్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతానని ఆమె తెలిపారు. విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పుల వల్ల, ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన విద్యా భోదన వల్ల తాను మంచి మార్కులు సాధించగలిగాలని ఆమె తెలిపారు. ఇవిగో సంస్కరణ ఫలితాలు.. గత వైఎస్సార్ సీపీ సర్కారు చర్యలతో నేటి విద్యార్థుల విజయ సోపానాలు సరికొత్త రికార్డులు సాధిస్తున్న వైనం ఇంటర్మీడియెట్ ఫలితాలే నిదర్శనం -
ఏపీఎస్పీలో ఉత్సాహంగా క్రీడలు
● రెండో రోజు హోరాహోరీగా పోటీ ● నేటి సాయంత్రం ముగింపోత్సవం కాకినాడ రూరల్: కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్‌లో రేంజ్ – 1 పరిధిలోని నాలుగు బెటాలియన్లకు చెందిన క్రీడాకారులు ఉత్సాహంగా ఆటల్లో పాల్గొంటున్నారు. బుధవారం పరుగు పందెం పోటీలు, హై జంప్, కబడ్డీ, క్రికెట్, టగ్ ఆఫ్ వార్, తదితర పోటీలను నిర్వహించారు. మూడు రోజులు పాటు జరగనున్న పోటీలు గురువారం సాయంత్రంతో ముగియనున్నాయి. పోటీలలో ఏపీఎస్పీ కాకినాడ 3వ బెటాలియన్‌తో పాటు విజయనగరం, విశాఖపట్నం, మంగళగిరి బెటాలియన్ల క్రీడాకారులు పాల్గొంటున్నారు. ముగింపు కార్యక్రమంలో బెటాలియన్ల ఐజీ రాజకుమారి, డీఐజీ ఫక్కీరప్ప తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. రెండో రోజు విజేతలు వీరే హైజంప్ విభాగంలో 5వ బెటాలియన్‌కు చెందిన పి.ప్రసాదరావు, 16వ బెటాలియన్‌కు చెందిన వి.సుధాకర్, వి.శ్రీను ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో నిలిచారు. 1500 మీటర్ల పరుగు పోటీలో తొలి మూడు స్థానాలలో 5వ బెటాలియన్‌కు చెందిన సురేష్‌కుమార్, 16వ బెటాలియన్‌కు చెందిన కె.రాజానాయుడు, 5వ బెటాలియన్‌కు చెందిన పి.సత్యారావు, చెస్ విభాగంలో 16వ బెటాలియన్‌కు చెందిన శివకుమార్ విన్నర్‌గాను, 6వ బెటాలియన్‌కు చెందిన శ్రీను రన్నర్‌గా నిలిచారు. కబడ్డీ విభాగంలో 16వ బెటాలియన్ విన్నర్‌గాను, 5వ బెటాలియన్ రన్నర్‌గా నిలిచారు. క్రికెట్ విభాగంలో 3వ బెటాలియన్ విన్నర్‌గాను, 5వ బెటాలియన్ రన్నర్‌గా నిలిచారు, 200 మీటర్ల విభాగంలో 5వ బెటాలియన్‌కు చెందిన ఎస్.శివకుమార్, 16వ బెటాలియన్‌కు చెందిన జి.శ్రీను, జి.మురళీ విజేతలుగా నిలిచారు. 5వేల మీటర్ల పరుగు విభాగంలో 5వ బెటాలియన్‌కు చెందిన ఎస్.శివకుమార్, వై.సత్యారావు, 16వ బెటాలియన్‌కు చెందిన రాజినాయుడు విజేతలుగా నిలిచారు. మారథాన్‌లో 5వ బెటాలియన్‌కు చెందిన ఎం.లక్ష్మణ్, టి.శ్రీనివాసరావు విజేతలుగా నిలిచారు. -
వసతులు, సౌకర్యాలతో లక్ష్య సాధన
రాజమహేంద్రవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన నక్కా శ్రావణి సత్య హెచ్‌వో (హోటల్ మేనేజ్మెంట్) గ్రూప్‌లో 1000/982 మార్కులు సాధించి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. కొండగుంటూరు ప్రాంతానికి చెందిన శ్రావణి తండ్రి నక్కా చిన్న అప్పారావు రోజువారీ కూలీ. తల్లి ఆదిలక్ష్మి నర్సరీలో రోజువారీ కూలీగా పనిచేస్తున్నారు. చిన్నప్పటి నుంచి కష్టపడే మనస్తత్వం ఉన్న శ్రావణి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందజేసిన విద్యా వసతులు, సౌకర్యాలు, స్కాలర్‌షిప్‌లతో తన లక్ష్యాన్ని అలవోకగా సాధించింది. -
రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానం
తిరుగుడుమెట్ట గ్రామానికి చెందిన రాపాక సహ దేవుడు, వెంకటలక్ష్మి దంపతుల కుమార్తె రాపాక భావన. నిడదవోలు ప్రభుత్వ మహిళా కళాశాలలో 2024–25 విద్యా సంవత్సరంలో ఇంటర్ పరీక్షలు రాసి, 974 మార్కులతో సీఈసీలో రాష్ట్ర స్థాయిలో ప్రధమ స్థానంలో నిలిచింది. నిరుపేద కుటుంబమైనా.. పిఠాపురానికి చెందిన కాపుగంటి సత్య రాజ్యలక్ష్మి సుధశ్రీ ఓకేషనల్ కోర్సులు సెరికల్చర్ విభాగంలో 977 మార్కులు సాధించి రాష్ట్రంలో ప్రధమస్థానం సాధించింది. తల్లిదండ్రులు సర్వారాయుడు, సునీత నిరుపేద కుటుంబం నుంచి వచ్చినా ఆమె పట్టుదలతో చదవి అత్యుత్తమ ఫలితం సాధించింది. ప్రైవేటు కళాశాలల్లో చదువుకునే స్థోమత లేని తన లాంటి వారికి గతంలో ఎన్నడు లేని విధంగా గత ఐదేళ్లలో ప్రభుత్వ కళాశాలల రూపు రేఖలు మారి అన్ని వసతులు రావడంతో చదువులో రాణించగలిగాలని ఆమె ఆనందం వ్యక్తం చేసింది. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
● మరొకరికి తీవ్ర గాయాలు ప్రత్తిపాడు రూరల్: మండలంలోని వెంకటనగరంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. సంఘటనా స్థలంలో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేయడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రత్తిపాడు పోలీసులు అందించిన సమాచారం మేరకు మండలంలోని చింతలూరు గ్రామానికి చెందిన అన్నదమ్ములు నందవరపు వీరబాబు (20), నందవరపు కృష్ణ బైక్‌పై కొత్తూరు (యూజే పురం) వెళ్లి వివాహ వేడుకలో పాల్గొని తిరిగి ఇంటికి వెళ్తున్నారు. మార్గం మధ్యలో వెంకటనగరం చెరువు సమీపంలోని కోళ్ల ఫారం వద్ద యూజే పురం వైపు వెళ్తున్న బోర్ వెల్ వాహనం భైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో నందవరపు వీరబాబు (20) తలకి తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కుర్చున్న నందవరపు కృష్ణ తీవ్రంగా గాయపడ్డాడు. కృష్ణను 108 వాహనంలో ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించి ప్రథమ చికిత్స అందించి అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ప్రమాదానికి గురైన అన్నదమ్ములు నందవరపు రాము, బైరాగి కుమారులు. బాధిత కుటుంబ సభ్యులు సంఘటనా స్థలంలో రోడ్డు బైఠాయించి ఆందోళన చేయడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. నందవరపు రాము దంపతుల కుమారుడు వీరబాబు వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబానికి అండగా ఉండేవాడు. చేతికి అందివచ్చిన కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. గ్రామంలో నిత్యం చలాకీగా తిరిగే విరబాబు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో చింతలూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రత్తిపాడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి, కేసు నమోదు చేసి దర్యప్తు చేపట్టారు. -
ఏపీఎస్పీలో క్రీడా సంబరాలు
కాకినాడ రూరల్: విధులతో నిత్యం టెన్షన్‌గా గడిపే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పోలీసులు(ఏపీఎస్పీ) ఉపశమనం పొందేలా, వారిలోని క్రీడాస్ఫూర్తిని తేటతెల్లం చేసేలా స్పోర్ట్స్ మీట్ – 2025 కాకినాడలో ఘనంగా ప్రారంభమైంది. మూడురోజుల పాటు రేంజ్ – 1 పరిధిలో జరగనున్న క్రీడా పోటీలకు 3వ బెటాలియన్ ఆతిథ్యం ఇచ్చింది. రమణయ్యపేటలో ఏపీఎస్పీ 3వ బెటాలియన్ పరేడ్‌లో క్రీడా పోటీలను కమాండెంట్ ముద్రగడ నాగేంద్రరావు మంగళవారం ఉదయం శాంతి కపోతాలు, బెలూన్లు గాలిలో ఎగురవేసి లాంఛనంగా ప్రారంభించారు. విజయనగరం నుంచి 5వ, విశాఖపట్నం నుంచి 16వ, కాకినాడ నుంచి 3వ, మంగళగిరి నుంచి 6వ బెటాలియన్లకు చెందిన పోలీసు సిబ్బంది క్రీడా సంబరాలకు ఉత్సాహంగా హాజరయ్యారు. తమలోని ప్రతిభను చాటేందుకు ఆహ్లాదకరమైన వాతావరణంలో పోటీ పడ్డారు. తొలుత క్రీడాకారులు కవాతు, బ్యాండ్‌తో ఆకట్టుకున్నారు. కవాతు ద్వారా క్రీడాకారుల గౌరవ వందనాన్ని కమాండెంట్ నాగేంద్రరావు స్వీకరించారు. బెటాలియన్ నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎందరో ఎదిగారని, ముఖ్యంగా బాస్కెట్‌బాల్, వాలీబాల్ క్రీడల్లో ప్రతిభ కనబరిచారన్నారు. స్టోర్ట్స్ మీట్లో భాగంగా బాస్కెట్‌బాల్, వాలీబాల్, అథ్లెటిక్, షాట్‌ఫుట్, క్రికెట్, హై జంప్ వంటి పోటీలను తొలి రోజు నిర్వహించారు. అడిషనల్ కమాండెంట్ దేవానందరావు, అసిస్టెంట్ కమాండెంట్లు చంద్రశేఖర్, మన్మఽథరావు, ఆర్ఐలు అజయ్‌కుమార్, రవిశంకరరావు, విఠలేశ్వరరావు, ప్రసాద్, బెటాలియన్ ఇంగ్లిషు మీడియం స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. రేంజ్ – 1 పరిధిలోని నాలుగు బెటాలియన్ల క్రీడాకారుల హాజరు మూడు రోజుల పాటు సందడి స్పోర్ట్స్‌మీట్‌ను లాంఛనంగా ప్రారంభించిన కమాండెంట్ నాగేంద్రరావు -
పోషక విలువల లక్ష్మణ ఫలం
పిఠాపురం: మన పురాణ పురుషులు అయిన రాముడు, సీత, లక్ష్మణుల పేర్లతో సీతాఫలం, రామఫలంతో పాటు ఇప్పుడు లక్ష్మణ ఫలం స్థానికంగా పండుతున్నాయి. పలువురు రైతులు తమ ఇళ్ల వద్ద, పొలాల్లోను వీటిని పండిస్తున్నారు. దీనిని తింటే క్యాన్సర్ తగ్గుతుందని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్న తరుణంలో వీటి పెంపకం చాలాచోట్ల పెరిగింది. దీనిని ఆంగ్లంలో సోర్సో గ్రావియోలా అని పిలుస్తారు. దీనిలో ప్రొటీన్, కాల్షియం, ఐరన్, పొటాషియం, ఫాస్పరస్, తయామిన్, రెబోఫ్లోవిన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్సు వంటి ఎన్నో పోషక విలువలు ఉంటాయి. దీని జ్యూస్ తాగితే దానిలోని పోషక విలువలు ఇన్ఫెక్షన్లను నివారిస్తాయి. 12 రకాల క్యాన్సర్ కణాలను నాశనం చేసే సామర్థ్యం ఈ లక్ష్మణ ఫలానికి ఉందని ఆయుర్వేదం చెబుతోంది. అందుకే లక్ష్మణ ఫలాన్ని తింటే మంచినిద్ర పట్టడంతో పాటు డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు దూరమవుతాయి. రక్తహీనతను తగ్గించే గుణం దీనిలో ఉంది. ఎముకలను ధృడంగా మార్చి కీళ్ల నొప్పులను నివారిస్తుంది. చెడు కొలస్ట్రాల్ కరిగి మంచి కొలస్ట్రాల్ పెరుగుతుంది. రక్తపోటు స్థాయిలు అదుపులో ఉంటాయి. నీరసం, అలసట దూరమై శరీరానికి మంచి శక్తి లభిస్తుంది. మూత్రాశయ ఇన్ఫెక్షన్లతో బాధ పడే వారికి ఇది ఒక మెడిసిన్‌లా పని చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. మార్చి, ఏప్రిల్ మాసాలలో ఈ పండ్లు అందుబాటులోకి వస్తాయి. పోర్చుగీసు నుంచి ఈ పండ్లు దిగుమతి అయినట్లు చెబుతుంటారు. వీటిని పండుగా తినడంతో పాటు స్వీట్లు, జ్యూస్‌లు, ఐస్‌క్రీంలు, జామ్‌ల తయారీలో వినియోగిస్తారు. ధర కిలో రూ.1,400 వరకు పలుకుతోందంటే దీని విలువ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి)గండేరా (వెయ్యి) 19,000 గటగట (వెయ్యి) 17,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 18,000 గటగట (వెయ్యి) 16,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
అంబేడ్కర్ విగ్రహానికి అవమానం
శంఖవరం: మండల కేంద్రమైన శంఖవరంలో మంగళవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి అవమానం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు అంబేడ్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేయడంతో దళిత సంఘాలు అగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అంబేడ్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఉదయం దళితవాడలో అంబేడ్కర్ విగ్రహం మెడలో చెప్పుల దండ చూసి స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. సమాచారం అందుకున్న దళిత సంఘాల నేతలు శంఖవరం చేరుకుని నిరసన ప్రదర్శన చేపట్టారు. స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ఎత్తున నిరసన ప్రదర్శనతో ర్యాలీ చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద కత్తిపూడి – శంఖవరం ప్రధాన రహదారిని దిగ్బంధించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ అంబేడ్కర్ విగ్రహానికి అవమానం జరగడం అంటే యావత్తు భారతజాతికి అవమానం జరిగినట్లు అని తెలిపారు. ఈ ఘటనకు కారకులైనవారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్పీ బిందు మాధవ్ ఘటనా స్థలానికి చేరుకుని 24 గంటల్లో నిందితులను అరెస్ట్ చేస్తామన్నారు. దళిత సంఘాల నాయకులు సంయమనం పాటించాలని సూచించారు. ఎస్పీ హామీ మేరకు దళిత సంఘాలు నిరసన కార్యక్రమాన్ని విరమించుకున్నాయి. అడిషినల్ ఎస్పీ ఎంజేవీ భాస్కరరావు, పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు, తుని సీఐ చెన్నకేశవరావు ఎస్పీ వెంట ఉన్నారు. దళిత సంఘాల నాయకులు శెట్టిబత్తుల కుమార్‌రాజా, టి.కిరణ్‌కుమార్, సోనిహుడ్, వెంకటరత్నం, చరమర్ల మదు, గోళ్ల శేఖర్, పులి సుధాకర్, పి.భరత్ పాల్గొన్నారు. నిందితులను శిక్షించాలి : ముద్రగడ గిరిబాబు భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి ముద్రగడ గిరిబాబు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. కులమతాలకు అతీతంగా సమసమాజ స్థాపన కోసం చిరస్మరణీయ కృషిచేసిన అంబేడ్కర్‌ను అవమానించడం దారుణమన్నారు. చెప్పుల దండ వేసిన దుండగులు ఆగ్రహించిన దళిత సంఘాల నేతలు శంఖవరంలో రహదారి దిగ్బంధం నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ ఎస్పీ హామీతో ఆందోళన విరమణ -
లోక్ అదాలత్‌లో అత్యధిక కేసులు పరిష్కరించాలి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): వచ్చే నెల 10వ తేదీన నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లో వీలైనన్ని ఎక్కువ కేసుల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ గంధం సునీత సూచించారు. అండర్ ట్రయిల్ రివ్యూ కమిటీ, ఎగ్జిక్యూటివ్ బాడీ సమావేశాలను జిల్లా కోర్టు ఆవరణలో మంగళవారం ఆమె నిర్వహించారు. ఈ సందర్భంగా విచారణలో ఉన్న ఖైదీల కేసుల దర్యాప్తు, చార్జిషీట్ ఫైలింగ్ విషయంలో పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. బెయిలు, జామీనుల విషయంలో ఖైదీలు ఎదుర్కొంటున్న సమస్యలపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సంబంధిత అధికారులకు తగిన సిఫారసులు చేశారు. ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్‌లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాచరణ, బాధితుల కేసులపై చర్చించారు. సమావేశంలో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎస్కే జానీ బాషా, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎన్.శ్రీలక్ష్మి, జిల్లా అడిషనల్ ఎస్పీ ఏవీ సుబ్బరాజు, కాకినాడ ఏఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్, ప్రభుత్వ న్యాయవాది సీహెచ్‌వీ ప్రసాద్, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.రాధాకృష్ణంరాజు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రెవెన్యూ, పోలీసు అధికారులు, రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు, ప్రత్యేక మహిళా జైలు అధికారులు, జిల్లా సబ్ జైలు అధికారి, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. -
ఈదుకుంటూ మృత్యుఒడికి..
ప్రమాదాల వివరాలు.. సంవత్సరం కేసులు మృతులు 2021 54 59 2022 63 67 2023 71 78 2024 78 80 2025 (ఇప్పటి వరకూ) 23 24 291 308 ● ఈ నెలలోనే ఆరు ప్రమాదాలు– తొమ్మిది మంది మృతి ● ఐదేళ్లలో 291 ప్రమాదాలు, 308 మంది మృత్యువాత ● స్వీయరక్షణ, భద్రత చర్యలు తీసుకోవాలంటున్న నిపుణులు ఆలమూరు: వేసవికాలం వచ్చేసింది..విద్యార్థులకు పరీక్షలు ముగిసాయి.. యువకులు, పర్యాటకులు సముద్ర, నదీ పరివాహక ప్రాంతాల్లోని అనువుగా ఉండే ప్రదేశాల్లో స్నానాలు చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అయితే గోదావరిలో స్నానం చేసే సమయంలో కాని ఈత కొట్టే సమయంలో కాని ఏమాత్రం ఏమరపాటు ప్రదర్శించినా మృత్యువాత పడతామని, తల్లిదండ్రులను ఒంటరివాళ్లను చేస్తామని మాత్రం ఊహించడం లేదు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కొత్తపేట, పి.గన్నవరం, రాజోలు, అమలాపురం, రామచంద్రపురం, మండపేట, ముమ్మిడివరం, రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం, కొవ్వూరు నియోజకవర్గాల వెంబడి గౌతమీ, వశిష్ట, వైనతేయ గోదావరి నదులు 289 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంటాయి. స్థానికులతో పాటు వారి బంధువులు, స్నేహితులు, పర్యాటకులు నదీ తీరానికి వచ్చి ఆహ్లాదకర వాతావరణంలో గడిపేందుకు ఇష్టపడతారు. ఇదే క్రమంలో గోదావరిలోను, పంట కాలువల్లోను స్నానాలు చేస్తూ ఈత సరదాను తీర్చుకునే క్రమంలో అనేకమంది ప్రమాదవశాత్తూ మునిగి ప్రాణాలు కోల్పోతున్నారు. నదీ పరివాహక ప్రాంతంలో అనేక చోట్ల లోతులు, ఊబిలు ఉన్న సంగతి తెలియని పర్యాటకులు స్నానాలకు దిగి మృత్యువాత పడుతున్నారు. చర్యలు చేపడుతున్నా... ఆలమూరు, ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట, పి.గన్నవరం, కపిలేశ్వరపురం, కె.గంగవరం, అయినవిల్లి, సఖినేటిపల్లి, రాజోలు మండలాల్లోని నివారణకు చర్యలు ● ప్రమాదాల నివారణకు పంచాయతీరాజ్, హెడ్వర్క్స్శాఖ పోలీసుశాఖ ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలి. ● గోదావరి పరీవాహక ప్రాంతంలో పోలీసు గస్తీ ముమ్మరం చేయాలి. అవగాహన సదస్సులు నిర్వహించాలి. ● వేసవిలో గోదావరి తీరంలోకి ఇతర ప్రాంతాల వారు వస్తే ఆయా గ్రామాల పంచాయతీ సిబ్బంది కౌన్సెలింగ్‌ను అందించాలి. ● ప్రమాదకరమైన అన్ని రేవుల వద్ద లోతు వివరాలు తెలియజేసే హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలి. ● స్నానానికి అనుమతి లేని ప్రదేశాల వివరాలను తెలియజేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలి. ● స్నానాలు చేసేటప్పుడు, ఈత కొడుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ స్వీయరక్షణ చర్యలు పాటించి సేఫ్టీ డ్రస్‌ను ధరించాలి. అనుమతి లేని ప్రదేశాల్లో స్నానాలు వద్దు గోదావరి తీరం వెంబడి అనుమతి లేని ప్రదేశాల్లో ఎవరూ స్నానాలకు దిగవద్దు. ఇప్పటికే తీరం వెంబడి గుర్తించిన ప్రమాదకరమైన ప్రాంతాల్లో హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు స్థానికుల సహకారంతో ప్రమాదాల తీవ్రతను తెలియజేస్తున్నాం. రద్దీ ప్రదేశాల్లో పోలీసుల గస్తీని ముమ్మరం చేశాం. పర్యాటక ప్రాంతాల్లో నిరంతరం పోలీసులను పహరాగా ఉంచుతున్నాం. –సుంకర మురళీమోహన్, డీఎస్పీ, కొత్తపేట ప్రజలను చైతన్యవంతం చేస్తున్నాం నదీ తీర ప్రాంతాల్లో ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాం. ధవళేశ్వరం దిగువ ప్రాంతాల్లో ఊబులు ఎక్కువగా ఉన్నందున తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించి ఆ మేరకు ప్రజలను చైతన్యవంతం చేస్తున్నాం. ఇటీవల వాడపల్లి తీర్థానికి వెళ్లే భక్తులను గోదావరి మీద నుంచి వెళ్లకుండా పోలీసుల సాయంతో కట్టడి చేసి ప్రమాదాలను ఆపగలిగాం. – ఆర్.విశ్వనాథరాజు, హెడ్‌వర్క్స్ జేఈ, ధవళేశ్వరం తూర్పుగోదావరిజిల్లా పలు గ్రామాలతో పాటు కొవ్వూరు మండలంలోని మద్దూరులంక. సీతంపేట, విజ్జేశ్వరం లాకుల సమీపంలోని నదీ తీరాలు అత్యంత ప్రమాదకరంగా పేరుగాంచాయి. దీంతో పాటు అంతర్వేది, ఓడలరేవు, కాకినాడ, ఉప్పాడ సముద్ర తీరంలో తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో ఎక్కువగా ప్రాణనష్టం సంభవిస్తోంది. గోదావరి తీర ప్రాంతాల్లో స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు నష్ట నివారణ చర్యలు చేపడుతున్నా ప్రయోజనం కన్పించడం లేదు. గత ఐదేళ్లలో ప్రభుత్వ గణాంకాల ప్రకారం 291 ప్రమాదాలు జరగ్గా 302 మంది మృత్యువాత పడ్డారు. ఈ నెలలోనే ఇప్పటి వరకూ ఆరు ప్రమాదాలు జరగ్గా తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. -
చిన్నబాబు వచ్చారు.. బహుపరాక్!
అన్నవరం: కలెక్ట్రేట్లో జరిగే అధికారిక సమావేశాల్లో కలెక్టర్‌తో కలిసి ఆయన పుత్రరత్నం పాల్గొంటే ఎలా ఉంటుంది? ఓ ఎస్పీ కుమారుడు పోలీస్ స్టేషన్లు తనిఖీ చేస్తానంటే..! మరోచోటైతే ఇవి సాధ్యం కాకపోవచ్చునేమో! కానీ అన్నవరం దేవస్థానంలో మాత్రం ఈ తంతు 4 నెలలుగా యథేచ్ఛగా సాగిపోతోంది. సత్యదేవుని సన్నిధిలో ఓ అధికారి పుత్రరత్నం తమపై ఎక్కడా లేని పెత్తనం చేస్తున్నారంటూ సిబ్బంది, ఇతర అధికారులు వాపోతున్నారు. ప్రతి రోజూ ఆ అధికారి విధులకు వచ్చారా అని కాకుండా.. ఆయన గారి కొడుకు.. చినబాబు వచ్చాడా.. వస్తే ఎక్కడున్నాడంటూ సిబ్బంది ఆరా తీస్తున్నారు. తమ సెక్షన్‌కు వస్తే ఏమంటాడో.. అసలు వచ్చేలా ఉన్నాడా అంటూ ఆ పుత్రరత్నానికి సహాయకుడిగా ఉండే అటెండర్‌ను అడిగి మరీ తెలుసుకుంటున్నారు. ఎదురుపడితే ఏమంటాడో అని హడలెత్తుతున్నారు. అధికారిక సమావేశంలో.. దేవస్థానం భద్రతకు ఉపయోగించే డ్రోన్ కెమెరాల కొనుగోలుపై ఆ కంపెనీ ప్రతినిధులతో రత్నగిరిపై ఆ అధికారి కార్యాలయంలో సోమవారం ఒక సమావేశం జరిగింది. ఇందులో ఆ అధికారితో పాటు ఈఈ లు, డీఈలు ఏఈఓలు, సూపరింటెండెంట్లు, సెక్యూరిటీ అధికారితో పాటు ఆ అధికారి పుత్రరత్నం చినబాబు కూడా పాల్గొన్నారు. డ్రోన్ కెమెరాల గురించి ఆ అధికారికి బదులు చినబాబే ప్రశ్నించడం మరో విడ్డూరం. ఇటువంటి సమావేశాల్లో చినబాబు పాల్గొన్నప్పుడు ఎవ్వరినీ ఫొటోలు, వీడియోలు తీయనివ్వరు. ఆ అధికారి సీసీ మాత్రమే ఫొటోలు, వీడియోలు తీస్తారు. ఫొటోల్లో ఆ చినబాబోరిని కట్ చేసి, మిగిలిన ఫొటోలను దేవస్థానం సెక్షన్ హెడ్స్ గ్రూపులో పెడుతున్నారు. చినబాబుగారి పెత్తనం ఇలా.. ఫ దేవస్థానంలో సీసీ టీవీలు పరిశీలించే అధికారం, సంబంధిత లింక్ దేవస్థానంలో కీలకమైన నలుగురికి మాత్రమే ఉంటుంది. కానీ, ఆ అధికారి పుత్రరత్నానికి కూడా ఆ లింక్ ఇచ్చారు. దీంతో ఆయన వాటిని చూసి, సిబ్బందికి డైరెక్షన్లు ఇస్తున్నాడు. ఆ నోటా ఈ నోటా ఈ విషయం అందరికీ తెలియడంతో ఆ అధికారికి, మరో కీలక వ్యక్తికి తప్ప అందరికీ ఆ లింక్ తొలగించారు. పాస్వర్డ్ కూడా మార్చేశారు. ఫ దేవస్థానానికి వచ్చిన ప్రతిసారీ చినబాబు సీసీ టీవీలుండే కమాండ్ కంట్రోల్ రూముకు వెళ్లి కొంతసేపు ఆ టీవీలు పరిశీలిస్తారు. ఆ సమయంలో ఎవ్వరూ లోపలకు రాకుండా బయట ఒకరు కాపలాగా ఉంటారు. ఆయన ఇచ్చే సలహాలు, సూచనలను అక్కడి సిబ్బంది పాటించాలి. ఫ పీఆర్ఓ కార్యాలయాన్ని చినబాబు సందర్శించినప్పుడు అక్కడ సిబ్బంది ఎవ్వరూ లేకపోవడంతో అవమానంగా భావించారు. దీంతో, ఆయన ఆదేశాల మేరకు ఆ మర్నాడే అక్కడ సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. ఫ ఒక రోజు స్వామివారి నిత్యకల్యాణం, ఆన్లైన్ వ్రతం జరిగే కార్యాలయాన్ని సందర్శించి, సిబ్బంది పనితీరును పరిశీలించి సూచనలు ఇచ్చారు. ఫ ఆ అధికారి గత నెలలో రెండు రోజుల సమావేశానికి విజయవాడ వెళ్లినపుడు ఆయన అధికారిక వాహనంలోనే చినబాబు నేరుగా దేవస్థానానికి వచ్చారు. దర్జాగా ఆ అధికారి కూర్చునే ముందు సీటులో కూర్చుని పెత్తనం చేశారు. వాస్తవానికి అధికారి లేనపుడూ ఆ కారును వేరొకరు ఉపయోగించకూడదు. కుటుంబ సభ్యులైనా సరే ఆ అధికారితో పాటు ప్రయాణించినప్పుడే ఆ వాహనం ఎక్కాలి. ఫ దేవస్థానానికి మరో వాహనం కూడా ఉంది. చిన్నబాబు కొన్నిసార్లు ఆ వాహనంలో కొండ పైకి వచ్చి, అనధికారిక పర్యవేక్షణ అనంతరం తిరిగి కొండ దిగువకు అదే వాహనంలో వెళ్తున్నారు. ఫ దేవస్థానానికి వచ్చినపుడు పర్యవేక్షణ అనంతరం ఆ అధికారి కార్యాలయానికి ఎదురుగా ఉన్న వీఐపీ గదిలో చినబాబు సేద తీరుతారు. అప్పుడు ఆ అధికారి మాదిరిగానే ఆ పుత్రరత్నానికి కూడా మర్యాదలు చేయాల్సిందే. ఫ గతంలో ఎంతో మంది అధికారులు వచ్చినా వారి పిల్లలు ఎలా ఉంటారో కూడా సిబ్బందికి తెలియదు. ఎప్పుడూ ఇలాంటి వ్యవహారం చూడలేదని సిబ్బంది చెబుతున్నారు. ఫ ఆ పుత్రరత్నం ఓవర్ యాక్షన్ దేవదాయ శాఖ ఉన్నతాధికారులకు తెలిసినా ఎందుకనో కానీ మౌనం వహిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, సరైన ఆధారాల కోసం ఎదురు చూస్తున్నారనే చర్చ కూడా నడుస్తోంది. దేవస్థానంలో సీసీ టీవీలు పరిశీలిస్తే చినబాబు కదలికలు తెలిసిపోతాయని పలువురు అంటున్నారు. ఉన్నతాధికారులు చినబాబు అజమాయిషీకే కత్తెర వేస్తారో లేక ఆ అధికారికే ఉద్వాసన పలుకుతారో వేచి చూడాల్సిందే. ·˘ A¯]l²Ð]lÆý‡… §ólÐ]lÝ릯]l…ÌZ ఓ అధికారి పుత్రరత్నం నిర్వాకం ·˘ BĶæ$¯]l Úëyø Ķæ*MýSÛ¯ŒS™ø హడలెత్తుతున్న సిబ్బంది ·˘ A°²…sê BĶæ$¯]l ò³™èl¢¯]lÐól$.. -
ఉత్తరకాండ వాల్మీకి రామాయణాంతర్గతమే..
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): ‘ఉత్తరకాండ నిస్సందేహంగా వాల్మీకి మహర్షి రామాయణాంతర్గతమే. ఈ వివాదం ప్రాచీన కాలంలో లేదు’ అని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. ఋషిపీఠం సత్సంగం ఆధ్వర్యాన ఉత్తరకాండపై నగరంలోని హిందూ సమాజంలో మంగళవారం జరిగిన తొలి రోజు ప్రవచనంలో ఆయన మాట్లాడుతూ, ఉత్తర కాండపై వివాదం ఇటీవల తలెత్తిందని అన్నారు. ఉత్తర భారతంలో ఈ వివాదం లేదని, రామాయణంపై వెలువడిన అన్ని భాష్యాల్లోనూ ఉత్తరకాండలోని అంశాలను పేర్కొన్నారని చెప్పారు. గాయత్రీ మంత్రంలోని 24 అక్షరాలకు ప్రతీకగా మహర్షి వాల్మీకి 24 వేల శ్లోకాలతో రామాయణం రచించారని, ఉత్తరకాండ లేదనుకుంటే, గాయత్రీ మంత్రంలో మూడక్షరాలు లేవనుకోవాలని అన్నారు. షట్కాండలు రచించిన అనంతరం ఉత్తరకాండ రచించినట్టు బాలకాండలోనే వాల్మీకి మహర్షి పేర్కొన్నారని, అప్పటి వరకూ జరిగిన కథను షట్కాండలలో, జరగబోయే కథను ఉత్తరకాండలో రచించారని వివరించారు. తపో మార్గంలో, యోగదృష్టితో మహర్షి రచించిన రామాయణంలో ఎటువంటి తప్పులూ ఉండవన్నది బ్రహ్మవాక్కు అని చెప్పారు. బాలకాండ 3వ సర్గలో సీతాపరిత్యాగాన్ని ఉత్తరకాండలో రచించినట్టు వాల్మీకి మహర్షి పేర్కొన్నారని తెలిపారు. ‘యుద్ధకాండ వరకూ పారాయణ చేస్తే, సంపూర్ణ రామాయణ ఫలితం లభిస్తుందని అంటే, ఉత్తరకాండ లేదని అర్థం కాదు. సుందరకాండ పారాయణ చేస్తే పూర్తి రామాయణ పారాయణ ఫలితం లభిస్తుందని అంటే మిగతా కాండలు, కథ లేవని అర్థం కాదు’ అని ఆయనన్నారు. ఆద్యంతం ఛలోక్తులతో సామవేదం ప్రవచనం కొనసాగింది. ‘రచన ఎంత అసంప్రదాయమైనది, సంప్రదాయానికి విరుద్ధంగా ఉన్నదీ అయితే అంత గొప్ప పురస్కారం లభించవచ్చు. ఇటువంటి పురస్కారం భగవంతుని తిరస్కారానికి గురి కాక తప్పదు’ అని అన్నారు. ‘నాకు ఇష్టమైనవి, నేను నమ్మినవి ప్రమాణాలు, నేను నమ్మనివి ప్రక్షిప్తాలు అనుకునే మూర్ఖాగ్రేసరులు కొందరున్నారు’ అంటూ ఛలోక్తులు విసిరారు. ముందుగా భాగవత విరించి డాక్టర్ టీవీ నారాయణరావు స్వాగత వచనాలు పలుకుతూ, పూర్వ రామాయణమైనా, ఉత్తర రామాయణమైనా రాముని చరిత్రేనని అన్నారు. ఈ ప్రవచనాలు వినడం నగరవాసులు చేసుకున్న సుకృతమని అన్నారు. -
13,549 హెక్టార్లలో వరి కోతలు పూర్తి
రాజమహేంద్రవరం రూరల్: జిల్లావ్యాప్తంగా 58,586 హెక్టార్లలో రబీ వరి సాగు జరిగిందని, ఇప్పటి వరకూ 13,549 హెక్టార్లలో కోతలు పూర్తయ్యాయని జిల్లా వ్యవసాయాధికారి ఎస్.మాధవరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వారం రోజులుగా వాతావరణంలో వచ్చిన అనూహ్య మార్పులతో అకాల వర్షాలు కురుస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించి, భద్రపరచుకోవాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో అధికారులు రైతులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని, సలహాలు, సూచనలు ఇచ్చి, పంటలు దెబ్బ తినకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించామని తెలిపారు. ఈ సందర్భంగా రైతులకు ఆయన పలు సూచనలు చేశారు. పంట దెబ్బ తింటే.. ఫ కోతకు 10–15 రోజులున్న దశలో చేను పడిపోయి నీట మునిగితే, బూజు తెగులు వల్ల గింజ రంగు మారే అవకాశం ఉంటుంది. కాబట్టి వర్షాలు తగ్గిన వెంటనే లీటరు నీటికి ఒక మిల్లీలీటర్ ప్రొపికోనజోన్ (టిల్ట్/బంపర్/ప్రోపిగార్డ్) లేక ఒక గ్రాము కార్బండిజం (బావిస్టన్/ధనుస్టిన్/బెన్ఫిల్/బెన్గార్డ్) లేదా 2 గ్రాముల కార్బండిజం+మాంకోజెట్ (సాఫ్/సిక్సర్/కంపానియన్) చొప్పున కలిపి పిచికారీ చేయాలి. ఫ కోత కోసిన పనలు వర్షానికి తడిసినట్లయితే గింజ మొలకెత్తకుండా ఉండటానికి 5 శాతం ఉప్పు ద్రావణాన్ని (లీటరు నీటికి 50 గ్రాముల ఉప్పు) పనలపై పడేలా పిచికారీ చేయాలి. వర్షాలు తగ్గి, ఎండ రాగానే పనలను తిరగేసి ఎండబెట్టి నూర్చుకోవాలి. పొలంలో నీరు లేకపోతే మడిలోనే ఉన్న పనలపై ఉప్పు నీరు జల్లుకోవచ్చు. ఒక వేళ పొలంలో నీరు నిలిచిపోతే పనలను గట్ల పైకి తెచ్చుకొని విడగొట్టి ఉప్పు ద్రావణం జల్లుకోవడం ద్వారా గింజ మొలకెత్తకుండా రంగు మారకుండా నివారించవచ్చు. ఫ పనలు కుప్ప వేసే దశలో వర్షాల వల్ల పనలు తడిస్తే కుప్పలు వేసేటప్పుడు ఎకరాకు 25 కిలోల ఉప్పును పనలపై జల్లుకుంటూ కుప్ప వేయాలి. ఫ నూర్చిన ధాన్యం రెండు మూడు రోజుల పాటు ఎండబెట్టడానికి వీలు కాకపోతే కుప్పల్లోని గింజ మొలకెత్తడమే కాక రంగు మారి చెడువాసన వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో నష్టాన్ని నివారించడానికి క్వింటాల్ ధాన్యానికి కిలో ఉప్పును 20 కిలోల పొడి ఊక లేక 4 కిలోల వరిగడ్డితో కానీ కలిపి పోగు పెట్టాలి. దీనివల్ల గింజ మొలకెత్తి చెడిపోకుండా నివారించవచ్చు. ఎండ కాసిన తరువాత ధాన్యాన్ని ఎండబోసి, తూర్పారబట్టి నిలువ చేసుకోవాలి. ఫ పూర్తిగా తడిసి, రంగు మారిన ధాన్యానికి మార్కెట్ విలువ పూర్తిగా తగ్గిపోతుంది. అటువంటి ధాన్యం పచ్చిబియ్యం కంటే ఉప్పుడు బియ్యంగా అమ్ముకోవడం వల్ల నష్టాన్ని కొంతవరకూ తగ్గించుకోవచ్చు. ఫ అకాల వర్షాలతో రైతులు అప్రమత్తంగా ఉండాలి ఫ జిల్లా వ్యవసాయాధికారి మాధవరావు -
మొక్కజొన్న తోటలో.. ముసిరిన చీకట్లు
జిల్లాలో మొక్కజొన్న సాగు వివరాలుపెరవలి: మొక్కజొన్న తోటల్లో చీకట్లు ముసురుకుంటున్నాయి. ఓవైపు దండిగా దిగుబడులు వస్తున్నా.. మద్దతు ధర పెంచాల్సిన కూటమి సర్కార్.. దానిని గణనీయంగా తగ్గించేసింది. ఫలితంగా గత ఏడాది కంటే ఎక్కువ ధర లభిస్తుందని ఆశించిన రైతులు దిగులు చెందుతున్నారు. జిల్లాలో ఏటేటా మొక్కజొన్న సాగు పెరుగుతోంది. ఐదేళ్ల కిందట జిల్లాలో 6 వేల ఎకరాల్లో మాత్రమే.. అది కూడా లంక భూముల్లోనే ఈ పంట సాగు చేసేవారు. అయితే, మంచి లాభాలు వస్తూండటంతో ఎక్కువ మంది రైతులు మొక్కజొన్న సాగుపై మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా ఈ పంట సాగు విస్తీర్ణం 16,713 ఎకరాలకు పెరిగింది. సుమారు 10,400 మంది రైతులు లంక భూములతో పాటు బయటి పొలాల్లో కూడా ఈ పంట సాగు చేస్తున్నారు. రాజమహేంద్రవరం అర్బన్ మినహా జిల్లాలోని దాదాపు ప్రతి మండలంలోనూ ఈ పంట సాగు జరుగుతోంది. ఒక్క పెరవలి మండలంలోనే సుమారు 400 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేస్తున్నారు. ముఖ్యంగా కానూరు, కానూరు అగ్రహారం, తీపర్రు, కాకరపర్రు, ముక్కామల, ఖండవల్లి గ్రామాల్లో ఈ పంట అధిక విస్తీర్ణంలో సాగవుతోంది. ఆశలు ఆవిరి పంటపై తెగుళ్లు పెద్దగా ఆశించకపోవడం, వాతావరణం కూడా అనుకూలించడంతో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మొక్కజొన్న దిగుబడులు దండిగా వస్తున్నాయి. ఎకరానికి 35 నుంచి 40 క్వింటాళ్ల వరకూ దిగుబడి వస్తోంది. దీంతో, కాస్త లాభాలు కళ్ల చూడవచ్చని రైతులు ఆశించారు. కానీ, వారి ఆశలపై కూటమి ప్రభుత్వం నీళ్లు జల్లింది. గత ఏడాది క్వింటాల్ మొక్కజొన్నకు ప్రభుత్వం రూ.2,600 కనీస మద్దతు ధర ప్రకటించింది. ఇది ఈ ఏడాది అంతకంటే పెరుగుతుందని రైతులు ఆశ పడ్డారు. కానీ, రకరకాల సాకులతో ప్రభుత్వం ఈ ధరను రూ.2,200కు కుదించేసింది. ఫలితంగా లాభం మాట అలా ఉంచితే గత ఏడాది కంటే రైతులు క్వింటాల్‌కు రూ.400 మేర నష్టపోతున్న పరిస్థితి ఏర్పడింది. సాగు ఆరంభంలో ధర బాగుందని, ఈ ఏడాది క్వింటాల్ ధర రూ.2,800 వరకూ పలుకుతుందనుకున్నామని, కానీ దీనికి భిన్నంగా ధర పడిపోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. దీంతో, లాభాలు సగానికి సగం తగ్గిపోయాయని గగ్గోలు పెడుతున్నారు. పెట్టుబడి ఎక్కువ.. రాబడి తక్కువ ఎకరం విస్తీర్ణంలో మొక్కజొన్న పంట సాగుకు రూ.45 వేలు ఖర్చవుతోంది. ప్రభుత్వం ప్రకటించిన ధర ప్రకారం ఖర్చులు, పెట్టుబడి పోను ఎకరానికి రూ.25 వేలు మాత్రమే మిగులుతోందని, ధర పెంచి ఉంటే మరింతగా లాభాలు వచ్చి ఉండేవని రైతులు అంటున్నారు. పెంచకపోయినా, కనీసం గత ఏడాది ధర చెల్లించినా తాము గట్టెక్కేవారమని చెబుతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఓవైపు రైతుభరోసా కింద పెట్టుబడి సాయం అందిస్తూనే, రైతులకు కనీస మద్దతు ధరలు కూడా పెంచేదని వారు గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇవ్వకపోగా మద్దతు ధరలో కూడా కోత పెట్టిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దిగుబడి వస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం ఈపాటికే మార్క్‌ఫెడ్ ఆధ్వర్యాన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. సాగు విస్తీర్ణాన్ని బట్టి వీటిని రెండు మూడు మండలాలకు కలిపి ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తారు. కానీ, ఇప్పటి వరకూ ప్రభుత్వం ఎక్కడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో, గత్యంతరం లేక రైతులు దక్కిన ధరకే పంటను బయటి వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. గతంలో వ్యాపారులు చేల వద్దకే వచ్చి, కొనుగోలు చేసేవారు. ఇప్పుడు దిగుబడి ఎక్కువగా ఉండటంతో వారి వద్దకే తీసుకు వెళ్లాల్సి (చేర) వస్తోందని, దీని వలన అదనంగా ఖర్చవుతోందని రైతులు వాపోతున్నారు. పైగా, సరకు నెమ్ముగా ఉందంటూ ధరలో కోత పెడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్ మొక్కజొన్న దిగుబడిలో 80 శాతం మేర కోళ్ల ఫారాలకు మేతగా వినియోగమవుతుంది. ఈ పంట చేతికి రావడానికి రెండు నెలల ముందు బర్డ్‌ఫ్లూ వ్యాధితో లక్షలాదిగా కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో కోళ్ల పరిశ్రమ కుదేలై, వేలాదిగా పౌల్ట్రీలు మూత పడ్డాయి. ఫలితంగా మొక్కజొన్నకు డిమాండ్ గణనీయంగా తగ్గిపోయింది. మరోవైపు గత ఏడాది మొక్కజొన్న నిల్వలు కూడా ఇంకా మిగిలిపోయాయని చెబుతున్నారు. ఈ పరిణామాల ప్రభావం మొక్కజొన్న ధరలపై పడిందని చెబుతున్నారు. 2018 నుంచి మొక్కజొన్నకు ప్రభుత్వ మద్దతు ధర (క్వింటాల్‌కు రూ.) ÝëVýS$ ÑïÜ¢Æý‡~…-˘ 16,713 GMýSÆ>Ë$ సాగు చేస్తున్న రైతులు 10,400 ఎకరాకు దిగుబడి 35 – 40 క్వింటాళ్లు గత ఏడాది క్వింటాల్ మద్దతు ధర రూ.2,600 ఈ ఏడాది రూ.2,200కోళ్ల పరిశ్రమ దెబ్బ తినడంతో.. ప్రస్తుతం వస్తున్న దిగుబడి వలన రైతులకు లాభాలు వస్తున్నాయి. కోళ్ల పరిశ్రమ దెబ్బ తినడంతో మొక్కజొన్న గింజల వినియోగం కొంత తగ్గింది. – పి.చంద్రశేఖర్, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుడు, కొవ్వూరుదిగుబడి బాగుంది వాతావరణం అనుకూలించడంతో ఈ ఏడాది దిగుబడి బాగుంది. ఎకరానికి 35 నుంచి 40 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. అయితే, ధర తగ్గించేయడంతో ఖర్చులు పోను రూ.25 వేలు మాత్రమే మిగులుతోంది. – మిద్దే వీరాంజనేయులు, రైతు, కానూరు అగ్రహారం, పెరవలి మండలం లాభం తగ్గుతోంది పంట బాగానే పండింది. కానీ, గిట్టుబాటు ధర గత ఏడాది కంటే రూ.400 తగ్గింది. అయినప్పటికీ సరకు కొనుగోలు చేయడానికి ఎవ్వరూ రావడం లేదు. చేర ఇస్తున్నాం. దీని వలన అదనపు ఖర్చు అవుతోంది. ఫలితంగా లాభం తగ్గుతోంది. – జన్ని వెంకటేశ్వర్లు రైతు, కానూరుఽసంవత్సరం ధర 2018 1,400 2019 1,500 2020 1,800 2021 1900 ఽసంవత్సరం ధర 2022 2,100 2023 2,400 2024 2,600 2025 2,200 ఫ దిగుబడి ఫుల్.. గిట్టుబాటు నిల్ ఫ మద్దతు ధర తగ్గించిన సర్కారు ఫ క్వింటాల్‌కు ఏకంగా రూ.400 కోత ఫ రైతన్నల ఆవేదన