
మొక్కజొన్న తోటలో.. ముసిరిన చీకట్లు
జిల్లాలో మొక్కజొన్న సాగు వివరాలు
పెరవలి: మొక్కజొన్న తోటల్లో చీకట్లు ముసురుకుంటున్నాయి. ఓవైపు దండిగా దిగుబడులు వస్తున్నా.. మద్దతు ధర పెంచాల్సిన కూటమి సర్కార్.. దానిని గణనీయంగా తగ్గించేసింది. ఫలితంగా గత ఏడాది కంటే ఎక్కువ ధర లభిస్తుందని ఆశించిన రైతులు దిగులు చెందుతున్నారు. జిల్లాలో ఏటేటా మొక్కజొన్న సాగు పెరుగుతోంది. ఐదేళ్ల కిందట జిల్లాలో 6 వేల ఎకరాల్లో మాత్రమే.. అది కూడా లంక భూముల్లోనే ఈ పంట సాగు చేసేవారు. అయితే, మంచి లాభాలు వస్తూండటంతో ఎక్కువ మంది రైతులు మొక్కజొన్న సాగుపై మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా ఈ పంట సాగు విస్తీర్ణం 16,713 ఎకరాలకు పెరిగింది. సుమారు 10,400 మంది రైతులు లంక భూములతో పాటు బయటి పొలాల్లో కూడా ఈ పంట సాగు చేస్తున్నారు. రాజమహేంద్రవరం అర్బన్ మినహా జిల్లాలోని దాదాపు ప్రతి మండలంలోనూ ఈ పంట సాగు జరుగుతోంది. ఒక్క పెరవలి మండలంలోనే సుమారు 400 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేస్తున్నారు. ముఖ్యంగా కానూరు, కానూరు అగ్రహారం, తీపర్రు, కాకరపర్రు, ముక్కామల, ఖండవల్లి గ్రామాల్లో ఈ పంట అధిక విస్తీర్ణంలో సాగవుతోంది.
ఆశలు ఆవిరి
పంటపై తెగుళ్లు పెద్దగా ఆశించకపోవడం, వాతావరణం కూడా అనుకూలించడంతో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మొక్కజొన్న దిగుబడులు దండిగా వస్తున్నాయి. ఎకరానికి 35 నుంచి 40 క్వింటాళ్ల వరకూ దిగుబడి వస్తోంది. దీంతో, కాస్త లాభాలు కళ్ల చూడవచ్చని రైతులు ఆశించారు. కానీ, వారి ఆశలపై కూటమి ప్రభుత్వం నీళ్లు జల్లింది. గత ఏడాది క్వింటాల్ మొక్కజొన్నకు ప్రభుత్వం రూ.2,600 కనీస మద్దతు ధర ప్రకటించింది. ఇది ఈ ఏడాది అంతకంటే పెరుగుతుందని రైతులు ఆశ పడ్డారు. కానీ, రకరకాల సాకులతో ప్రభుత్వం ఈ ధరను రూ.2,200కు కుదించేసింది. ఫలితంగా లాభం మాట అలా ఉంచితే గత ఏడాది కంటే రైతులు క్వింటాల్‌కు రూ.400 మేర నష్టపోతున్న పరిస్థితి ఏర్పడింది. సాగు ఆరంభంలో ధర బాగుందని, ఈ ఏడాది క్వింటాల్ ధర రూ.2,800 వరకూ పలుకుతుందనుకున్నామని, కానీ దీనికి భిన్నంగా ధర పడిపోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. దీంతో, లాభాలు సగానికి సగం తగ్గిపోయాయని గగ్గోలు పెడుతున్నారు.
పెట్టుబడి ఎక్కువ.. రాబడి తక్కువ
ఎకరం విస్తీర్ణంలో మొక్కజొన్న పంట సాగుకు రూ.45 వేలు ఖర్చవుతోంది. ప్రభుత్వం ప్రకటించిన ధర ప్రకారం ఖర్చులు, పెట్టుబడి పోను ఎకరానికి రూ.25 వేలు మాత్రమే మిగులుతోందని, ధర పెంచి ఉంటే మరింతగా లాభాలు వచ్చి ఉండేవని రైతులు అంటున్నారు. పెంచకపోయినా, కనీసం గత ఏడాది ధర చెల్లించినా తాము గట్టెక్కేవారమని చెబుతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఓవైపు రైతుభరోసా కింద పెట్టుబడి సాయం అందిస్తూనే, రైతులకు కనీస మద్దతు ధరలు కూడా పెంచేదని వారు గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇవ్వకపోగా మద్దతు ధరలో కూడా కోత పెట్టిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దిగుబడి వస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం ఈపాటికే మార్క్‌ఫెడ్ ఆధ్వర్యాన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. సాగు విస్తీర్ణాన్ని బట్టి వీటిని రెండు మూడు మండలాలకు కలిపి ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తారు. కానీ, ఇప్పటి వరకూ ప్రభుత్వం ఎక్కడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో, గత్యంతరం లేక రైతులు దక్కిన ధరకే పంటను బయటి వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. గతంలో వ్యాపారులు చేల వద్దకే వచ్చి, కొనుగోలు చేసేవారు. ఇప్పుడు దిగుబడి ఎక్కువగా ఉండటంతో వారి వద్దకే తీసుకు వెళ్లాల్సి (చేర) వస్తోందని, దీని వలన అదనంగా ఖర్చవుతోందని రైతులు వాపోతున్నారు. పైగా, సరకు నెమ్ముగా ఉందంటూ ధరలో కోత పెడుతున్నారని ఆవేదన చెందుతున్నారు.
బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్
మొక్కజొన్న దిగుబడిలో 80 శాతం మేర కోళ్ల ఫారాలకు మేతగా వినియోగమవుతుంది. ఈ పంట చేతికి రావడానికి రెండు నెలల ముందు బర్డ్‌ఫ్లూ వ్యాధితో లక్షలాదిగా కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో కోళ్ల పరిశ్రమ కుదేలై, వేలాదిగా పౌల్ట్రీలు మూత పడ్డాయి. ఫలితంగా మొక్కజొన్నకు డిమాండ్ గణనీయంగా తగ్గిపోయింది. మరోవైపు గత ఏడాది మొక్కజొన్న నిల్వలు కూడా ఇంకా మిగిలిపోయాయని చెబుతున్నారు. ఈ పరిణామాల ప్రభావం మొక్కజొన్న ధరలపై పడిందని చెబుతున్నారు.
2018 నుంచి మొక్కజొన్నకు
ప్రభుత్వ మద్దతు ధర (క్వింటాల్‌కు రూ.)
ÝëVýS$ ÑïÜ¢Æý‡~…-˘ 16,713 GMýSÆ>Ë$
సాగు చేస్తున్న రైతులు 10,400
ఎకరాకు దిగుబడి 35 – 40 క్వింటాళ్లు
గత ఏడాది క్వింటాల్
మద్దతు ధర రూ.2,600
ఈ ఏడాది రూ.2,200
కోళ్ల పరిశ్రమ దెబ్బ తినడంతో..
ప్రస్తుతం వస్తున్న దిగుబడి వలన రైతులకు లాభాలు వస్తున్నాయి. కోళ్ల పరిశ్రమ దెబ్బ తినడంతో మొక్కజొన్న గింజల వినియోగం కొంత తగ్గింది.
– పి.చంద్రశేఖర్, వ్యవసాయ శాఖ
సహాయ సంచాలకుడు, కొవ్వూరు
దిగుబడి బాగుంది
వాతావరణం అనుకూలించడంతో ఈ ఏడాది దిగుబడి బాగుంది. ఎకరానికి 35 నుంచి 40 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. అయితే, ధర తగ్గించేయడంతో ఖర్చులు పోను రూ.25 వేలు మాత్రమే మిగులుతోంది.
– మిద్దే వీరాంజనేయులు, రైతు,
కానూరు అగ్రహారం, పెరవలి మండలం
లాభం తగ్గుతోంది
పంట బాగానే పండింది. కానీ, గిట్టుబాటు ధర గత ఏడాది కంటే రూ.400 తగ్గింది. అయినప్పటికీ సరకు కొనుగోలు చేయడానికి ఎవ్వరూ రావడం లేదు. చేర ఇస్తున్నాం. దీని వలన అదనపు ఖర్చు అవుతోంది. ఫలితంగా లాభం తగ్గుతోంది.
– జన్ని వెంకటేశ్వర్లు రైతు, కానూరు
ఽసంవత్సరం ధర
2018 1,400
2019 1,500
2020 1,800
2021 1900
ఽసంవత్సరం ధర
2022 2,100
2023 2,400
2024 2,600
2025 2,200
ఫ దిగుబడి ఫుల్.. గిట్టుబాటు నిల్
ఫ మద్దతు ధర తగ్గించిన సర్కారు
ఫ క్వింటాల్‌కు ఏకంగా రూ.400 కోత
ఫ రైతన్నల ఆవేదన

మొక్కజొన్న తోటలో.. ముసిరిన చీకట్లు

మొక్కజొన్న తోటలో.. ముసిరిన చీకట్లు

మొక్కజొన్న తోటలో.. ముసిరిన చీకట్లు

మొక్కజొన్న తోటలో.. ముసిరిన చీకట్లు

మొక్కజొన్న తోటలో.. ముసిరిన చీకట్లు

మొక్కజొన్న తోటలో.. ముసిరిన చీకట్లు