
ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి
దేవరపల్లి: ఉపాధి పనులు చేస్తున్న కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. దేవరపల్లి మండలం బందపురంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన 45 మంది కూలీలు బందపురం–గొల్లగూడెం రోడ్డులో నీటి బోదెలు తవ్వుతున్నారు. ఆ సమీపంలోని చెట్టుపై ఉన్న తేనెటీగలు మూకుమ్మడిగా వారిపై దాడి చేశారు. దీంతో కూలీలు భయంతో పరుగులు తీశారు. తేనెటీగల దాడిలో సుంకర గంగరాజు తీవ్రంగా గాయపడ్డాడు. అతడికి దేవరపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు చికిత్స చేశారు. గంగరాజు కోలుకున్నాడని, ఎటువంటి ప్రమాదం లేదని ఏపీఏ ఆర్‌వీ శ్రీనివాసరావు తెలిపారు.
కాకినాడ బార్ అధ్యక్షుడిగా సుబ్రహ్మణ్యం
కాకినాడ లీగల్: కాకినాడ బార్ అసోసియేషన్ 2025–26 సంవత్సరం ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా జరిగాయి. అనంతరం అర్ధరాత్రి వరకూ కౌంటింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఏలూరి సుబ్రహ్మణం విజయం సాధించారు. జనరల్ సెక్రటరీగా చెక్కపల్లి వీరభద్రరావు (చంటి), ఉపాధ్యక్షుడిగా పెన్మెత్స రామచంద్రరాజు, జాయింట్ సెక్రటరీగా బండి నరేంద్ర, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా జోకా వీఎస్ విజయకుమార్, లైబ్రరీ సెక్రటరీగా మేడపాటి రామారెడ్డి, కోశాధికారిగా కోకా వెంకట కృష్ణారావు, లేడీస్ రిప్రజెంటీవ్‌గా జి.దివ్య శ్రీవిద్య, సీనియర్ కమిటీ మెంబర్‌గా నక్కా సంజీవ్ కుమార్, జూనియర్ కమిటీ సభ్యులుగా మర్ల ప్రవల్లిక, గుత్తుల మంగరాజు, షేక్ ప్రేమ్ నజీర్, దుళ్ల నాగబాబు విజయం సాధించారు. మొత్తం 1,160 ఓట్లకు గాను 1,013 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. సూపర్ సీనియర్ కమిటీ మెంబర్‌గా వేగుళ్ల వెంకట రమణమూర్తి, మహిళా కమిటీ మెంబర్‌గా కె.శ్రీవాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
పామాయిల్ తోట దగ్ధం
గోపాలపురం: విద్యుత్ హైటెన్షన్ తీగలు తగిలి సుమారు మూడెకరాల పామాయిల్ తోట దగ్ధమైన సంఘటన మంగళవారం గోపాలపురం గ్రామ శివార్లలో జరిగింది. గ్రామానికి చెందిన రైతు పోతుల రాజేష్ రెడ్డికి చెందిన పామాయిల్ తోటలో అంతర పంటగా అరటితోటను వేశారు. సాయంత్రం వీచిన ఈదురు గాలులకు పామాయిల్ తోట ఆకులు హైటెన్షన్ తీగలకు తగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సుమారు మూడు ఎకరాల తోట పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనలో సుమారు రూ.3 లక్షల ఆస్తినష్టం సంభవించింది.

ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి

ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి

ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి

ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి