కార్మిక వర్గానికి అండగా ఉంటాం | - | Sakshi
Sakshi News home page

కార్మిక వర్గానికి అండగా ఉంటాం

Published Fri, May 2 2025 12:18 AM | Last Updated on Fri, May 2 2025 12:18 AM

కార్మ

కార్మిక వర్గానికి అండగా ఉంటాం

రాజమహేంద్రవరం సిటీ: కార్మికుల అండదండలతోనే తన తండ్రి జక్కంపూడి రామ్మోహనరావు మంత్రి స్థాయికి ఎదిగారని, అందువల్లనే కార్మిక వర్గానికి తమ కుటుంబం ఎల్లవేళలా కృతజ్ఞతగా, అండగా ఉంటుందని వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. తాడిటోటలోని సంహిత కన్వెన్షన్‌లో గురువారం మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విభిన్న రంగాలకు చెందిన కార్మికులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా కార్మికులెవరికి కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా తప్పకుండ అండగా నిలిచి, పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. కార్మిక సంఘాలను కూడా బలోపేతం చేసుకోవాల్సి ఉందని, దానిపై దృష్టి పెడతామని అన్నారు.

గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ, కార్మికుడు అంటేనే జక్కంపూడి, జక్కంపూడి అంటేనే కార్మికుడు అనేంతగా కార్మిక వర్గంతో జక్కంపూడి కుటుంబానికి అనుబంధం పెనవేసుకుందన్నారు. జక్కంపూడి రామ్మోహనరావు మాదిరిగానే జక్కంపూడి రాజాను కూడా ఆదరించాలని కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేశారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కార్మిక పక్షపాతి అని చెప్పారు. ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న కార్మికుల హక్కులను కాలరాస్తూ, రాష్ట్రంలో చంద్రబాబు, కేంద్రంలో మోదీ ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకు వస్తోందని, దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కోట్లాదిగా ప్రజానీకం రోడ్ల పైకి వస్తుందని, కులమత వర్గాలకు అతీతంగా మే 20న జరిగే నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్మికులకు ఏ సమస్య వచ్చినా ఐక్యంగా పోరాడాలని అన్నారు. దేవుడి పేరుతో నాటకాలాడితే మట్టి కొట్టుకుపోవడం ఖాయమని హెచ్చరించారు. సింహాచలంలో కూలిపోయే గోడ కట్టి ఏడుగురిని బలి తీసుకున్నారని, తిరుపతిలో తొక్కిసలాటలో పలువురు ప్రాణాలు కోల్పోయారని, గోదావరి పుష్కరాల్లో 29 మంది ప్రాణాలు కోల్పోయారని, వీటన్నింటికీ మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు.

వైఎస్సార్‌ సీపీ అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శత్రువు, మిత్రుడు అనే తేడా లేకుండా తన భర్త జక్కంపూడి రామ్మోహనరావు పని చేశారన్నారు. ఓడిపోయి మనం ఏమీ కోల్పోలేదని, నెగ్గిన వాళ్లు ఏమీ చేయలేకపోతున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వ నేతలు సంపద సృష్టించకుండా, కొల్లగొడుతున్నారని ధ్వజమెత్తారు. రాబోయే ప్రభుత్వం మనదేనని, మళ్లీ స్వర్ణయుగం చూస్తామని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, నాయకులు గెడ్డం రమణ, నందెపు శ్రీను, కేఎల్‌ఎన్‌ రెడ్డి, భవన నిర్మాణ, ఆటో, హోటల్‌ యూనియన్ల కార్మికులు పాల్గొన్నారు.

ఫ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా

ఫ ఘనంగా మేడే వేడుకలు

కార్మిక వర్గానికి అండగా ఉంటాం1
1/1

కార్మిక వర్గానికి అండగా ఉంటాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement