
పది ఫలితాల్లో విద్యార్థుల ప్రతిభ
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): పదవ తరగతి ఫలితాల్లో తమ పాఠశాల విద్యార్థులు కె.లాస్య, ఎంఎల్‌పీ సమన్విత 595 మార్కులు సాధించి ప్రతిభ చూపారని ప్రగతి విద్యాసంస్థల చైర్మన్ నూతలపాటి పూర్ణచంద్రరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీహెచ్.మధుమిత, జి.భువన 592 మార్కులు, జి.హిమబిందుసాయి, జీటీఎస్ హృతిక. కేవీ రాఘవ 591 మార్కులు సాఽధించారన్నారు. గణితం, సైన్స్‌లో వందకు వంద మార్కులు వచ్చాయని తెలిపారు. 591 మార్కులకు పైగా 7గురు, 580కు పైగా 21మంది, 570కు పైగా 41మంది, 560కు పైగా 62 మంది, 550కి పైగా 89 మంది, 540కు పైగా 114 మంది మార్కులు సాధించారన్నారు.