
ఏపీఎస్పీలో క్రీడా సంబరాలు
కాకినాడ రూరల్: విధులతో నిత్యం టెన్షన్‌గా గడిపే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పోలీసులు(ఏపీఎస్పీ) ఉపశమనం పొందేలా, వారిలోని క్రీడాస్ఫూర్తిని తేటతెల్లం చేసేలా స్పోర్ట్స్ మీట్ – 2025 కాకినాడలో ఘనంగా ప్రారంభమైంది. మూడురోజుల పాటు రేంజ్ – 1 పరిధిలో జరగనున్న క్రీడా పోటీలకు 3వ బెటాలియన్ ఆతిథ్యం ఇచ్చింది. రమణయ్యపేటలో ఏపీఎస్పీ 3వ బెటాలియన్ పరేడ్‌లో క్రీడా పోటీలను కమాండెంట్ ముద్రగడ నాగేంద్రరావు మంగళవారం ఉదయం శాంతి కపోతాలు, బెలూన్లు గాలిలో ఎగురవేసి లాంఛనంగా ప్రారంభించారు. విజయనగరం నుంచి 5వ, విశాఖపట్నం నుంచి 16వ, కాకినాడ నుంచి 3వ, మంగళగిరి నుంచి 6వ బెటాలియన్లకు చెందిన పోలీసు సిబ్బంది క్రీడా సంబరాలకు ఉత్సాహంగా హాజరయ్యారు. తమలోని ప్రతిభను చాటేందుకు ఆహ్లాదకరమైన వాతావరణంలో పోటీ పడ్డారు. తొలుత క్రీడాకారులు కవాతు, బ్యాండ్‌తో ఆకట్టుకున్నారు. కవాతు ద్వారా క్రీడాకారుల గౌరవ వందనాన్ని కమాండెంట్ నాగేంద్రరావు స్వీకరించారు. బెటాలియన్ నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎందరో ఎదిగారని, ముఖ్యంగా బాస్కెట్‌బాల్, వాలీబాల్ క్రీడల్లో ప్రతిభ కనబరిచారన్నారు. స్టోర్ట్స్ మీట్‌లో భాగంగా బాస్కెట్‌బాల్, వాలీబాల్, అథ్లెటిక్, షాట్‌ఫుట్, క్రికెట్, హై జంప్ వంటి పోటీలను తొలి రోజు నిర్వహించారు. అడిషనల్ కమాండెంట్ దేవానందరావు, అసిస్టెంట్ కమాండెంట్లు చంద్రశేఖర్, మన్మఽథరావు, ఆర్‌ఐలు అజయ్‌కుమార్, రవిశంకరరావు, విఠలేశ్వరరావు, ప్రసాద్, బెటాలియన్ ఇంగ్లిషు మీడియం స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
రేంజ్ – 1 పరిధిలోని
నాలుగు బెటాలియన్ల క్రీడాకారుల హాజరు
మూడు రోజుల పాటు సందడి
స్పోర్ట్స్‌మీట్‌ను లాంఛనంగా
ప్రారంభించిన కమాండెంట్ నాగేంద్రరావు

ఏపీఎస్పీలో క్రీడా సంబరాలు

ఏపీఎస్పీలో క్రీడా సంబరాలు

ఏపీఎస్పీలో క్రీడా సంబరాలు