
ప్రైవేటుకే ఫిట్‌నెస్
జిల్లావ్యాప్తంగా
వాహనాల వివరాలు
జిల్లావ్యాప్తంగా వివిధ రకాల వాహనాలు 4,57,200 ఉన్నాయి. అత్యధికంగా ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. తరువాలి స్థానం కార్లది.
వాహనం సంఖ్య
ద్విచక్ర వాహనాలు 3,41,117
కార్లు 45,404
ఆటోలు 21,726
గూడ్స్ క్యారియర్లు 20,465
ట్రాక్టర్లు 7,807
ట్రాలీలు 4,896
త్రీ వీలర్ గూడ్స్ వాహనాలు 3,599
ట్రైలర్ (అగ్రికల్చర్) 2,306
స్కూల్, కాలేజీ బస్సులు 1,827
లగ్జరీ టూరిస్ట్ క్యాబ్‌లు 342
అంబులెన్సులు 230
జీపులు 150
రోడ్డు రోలర్లు 67
సాక్షి, రాజమహేంద్రవరం: ప్రభుత్వ సేవల ప్రైవేటీకరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాంది పలికిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అత్యంత ప్రధానమైన, ప్రజలకు ఉపయోగకరమైన సేవలను ప్రైవేటుకు కట్టబెట్టే ప్రక్రియ జరుగుతోంది. రైల్వే శాఖలో పలు సేవలను ఇప్పటికే ప్రైవేటుకు అప్పగించారు. తాజాగా ఆ జాబితాలోకి రాష్ట్ర రవాణా శాఖ కూడా చేరింది. ఇందులో అత్యంత కీలకమైన వాహనాల ఫిట్‌నెస్ (సామర్థ్య) సర్టిఫికెట్ల జారీ సేవలను ప్రైవేటు సంస్థకు అప్పగించారు. ఈ మేరకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బదిలీ విధానం వేగంగా సాగిపోయింది. ప్రతి జిల్లాకు ఒక ఆటోమేటెడ్ వెహికల్ ఫిట్‌నెస్ టెస్టింగ్ స్టేషన్ మంజూరైంది. ఇప్పటి వరకూ రవాణా శాఖ ద్వారా ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకుంటే ఆయా వాహనాలకు ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం చలానా కట్టించుకుని ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇచ్చేవారు. ఇకపై లైట్, హెవీ మోటార్ వాహనాలకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్లను ప్రభుత్వం నిర్ణయించిన ప్రైవేటు సంస్థ మాత్రమే జారీ చేస్తుంది. ఈ సంస్థపై స్థానికంగా ఎవ్వరి అజమాయిషీ ఉండదు. కేంద్ర ప్రభుత్వమే నేరుగా పర్యవేక్షిస్తుంది.
ప్రభుత్వ ఆదాయానికి గండి
జిల్లా వ్యాప్తంగా వివిధ రకాల వాహనాలు 4,57,200 ఉన్నాయి. వీటికి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల జారీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా ఒక్కో జిల్లా నుంచి రూ.కోట్లలో ఆదాయం సమకూరేది. దీనిని ప్రైవేటు సంస్థకు అప్పగించడంతో ఆ మేరకు ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. కేంద్ర ట్రాన్స్‌పోర్ట్ ఇండియా సలహా మేరకు వాహనాల ఫిట్‌నెస్ టెస్ట్ కోసం వసూలు చేసిన సొమ్మును ఫిట్‌నెస్ స్టేషన్లు రెండేళ్ల పాటు తమ సొంతానికి వినియోగించుకోవచ్చు. ప్రభుత్వానికి ఒక్క పైసా కూడా చెల్లించనక్కరలేదు. ఈ మేరకు టెండర్‌లో నిబంధన పెట్టారని చెబుతున్నారు.
రాజానగరం వద్ద టెస్టింగ్ స్టేషన్
జిల్లాకు సంబంధించి రాజానగరం మండలం కలవచర్ల సమీపాన సుమారు రూ.4.5 కోట్లతో వెహికల్ ఫిట్‌నెస్ టెస్టింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ఈ స్టేషన్‌లో మెషీనరీతో పాటు 21 మంది సిబ్బంది ఉంటారు. వాహనాల ఫిట్‌నెస్ పరీక్షలు, సర్టిఫికెట్ల జారీ ఇక్కడే జరుగుతాయి. సిబ్బందిని సైతం సంబంధిత ప్రైవేటు ఏజెన్సీయే నియమించుకుంటుంది. ఇందులో రాష్ట్ర రవాణా శాఖ అధికారుల ప్రమేయం కానీ, అజమాయిషీ కానీ ఏమాత్రం ఉండదు.
అదనంగా వసూళ్లు
ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందేందుకు తొలుత ఆన్‌లైన్‌లో సంస్థ నిర్దేశించిన మొత్తం చెల్లించి, స్లాట్ బుక్ చేసుకోవాలి. అనంతరం నిర్దేశించిన సమయంలోపు పరీక్ష చేయించుకోవాలి. లేదంటే చలానా సమయం ముగుస్తుంది. దీంతో, మళ్లీ చలానా తీయాల్సి వస్తోందని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. గతంలో చలానా గడువు వారం నుంచి 15 రోజుల వరకూ ఉండేది. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవని వాపోతున్నారు. ప్రభుత్వం గతంలో వసూలు చేసిన చలానాకు అదనంగా రూ.200 పైగా వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం వెహికల్ ఫిట్‌నెస్ టెస్టింగ్ స్టేషన్ చలానా ధరల ప్రకారం లైట్ మోటారు వెహికల్ కేటగిరీకి అంటే ఆటో నుంచి మిగతా అన్నింటి ఫిట్‌నెస్ పరీక్షకు రూ.860 వసూలు చేయాలి. కానీ రూ.1,250 వసూలు చేస్తున్నట్లు సమాచారం. అలాగే, హెవీ మోటార్ వెహికల్స్‌కు రూ.1,320 వసూలు చేయాల్సి ఉంది. ప్రతి రోజూ ఈ స్టేషన్‌లో 50 నుంచి 60 వాహనాలకు ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు.
పారదర్శకత ప్రశ్నార్థకం
వాహనాల ఫిట్‌నెస్ ప్రక్రియ పారదర్శకంగా జరగాలి. అప్పుడే ప్రమాదాల నుంచి గట్టెక్కే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించడం, అన్నీ ప్రైవేటు వ్యక్తులే చేస్తూండటంతో పారదర్శకతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఎటువంటి లోటుపాట్లు లేకుండా టెస్ట్‌లు నిర్వహిస్తే మంచిదేనని, తమకు ఎవరూ నియంత్రించలేరంటూ ఎలా పడితే అలా చేస్తే ప్రమాదాలు తప్పవని పలువురు ఆందోళన చెందుతున్నారు.
ఫిట్‌నెస్ టెస్ట్ ఇలా..
రోడ్లపై తిరిగే ప్రైవేటు బస్సులు, కార్లు, క్యాబ్, ట్రాక్టర్లు, లారీలు, గూడ్స్ వాహనాలు, ట్యాంకర్లు, స్కూల్ బస్సుల వంటి ప్రతి వాహనానికీ ఫిట్‌నెస్ టెస్ట్‌లు తప్పనిసరి. పసుపు రంగు నంబర్ ప్లేట్ ఉంటే ట్రాన్స్‌పోర్టు, తెలుపు రంగు నంబర్ ప్లేట్ ఉంటే నాన్–ట్రాన్స్‌పోర్టు వాహనాలుగా పరిగణిస్తారు. కొత్త వాహనానికి లైఫ్‌టైంలో మొదటి ఎనిమిదేళ్లలో ప్రతి రెండేళ్లకోసారి ఫిట్‌నెస్ టెస్ట్ చేయించాలి. ఎనిమిదేళ్ల తర్వాత ఏడాదికోసారి ఈ పరీక్ష తప్పనిసరి. 15 ఏళ్లకు కండిషన్ చూసి, ఆపేయాలి. స్కూల్ బస్సులకు 15 ఏళ్ల వరకే ఫిట్‌నెస్ చూస్తారు. తర్వాత వాటిని స్కూల్ బస్సుల కింద వాడకూడదు. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ జారీని ప్రైవేటు సంస్థలకు అప్పగించడం వలన వాహనాల తనిఖీలు ఎంత వరకూ సక్రమంగా జరుగుతాయనే ప్రశ్న తలెత్తుతోంది. గతంలో రవాణా శాఖ కార్యాలయాల్లో ఫిట్‌నెస్ పరీక్షలు ప్రహసనంగా జరిగేవి. కొందరు అధికారులు మామూళ్లు దండుకుని చూసీచూడనట్లు వ్యవహరించేవారు. దీంతో, ప్రమాదాలు చోటు చేసుకునేవి. ప్రధానంగా స్కూల్ బస్సుల ఫిట్‌నెస్‌లో ఇలాంటి ఘటనలు తరచుగా జరిగేవి. ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితులే ఎదురైతే ఎలాగనే ప్రశ్న వాహనదారులు, ప్రజల్లో ఉత్పన్నమవుతోంది. ప్రైవేటు ఏజెన్సీపై పర్యవేక్షణకు జిల్లాలో ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
·˘ Ðéçßæ¯éÌS íœsŒæ¯ðl‹Ü çÜÇtíœMðSrÏ
జారీ బయటి సంస్థలకు అప్పగింత
·˘ hÌêÏÌZ {ç³™ólÅMýS…V> ÐðlíßæMýSÌŒæ
ఫిట్‌నెస్ టెస్టింగ్ స్టేషన్ ఏర్పాటు
·˘ {糿¶æ$™èlÓ B§éĶæ*°MìS VýS…yìl
·˘ Ðéçßæ¯éÌS ç³È„ýSOò³ A¯]l$Ð]l*¯éË$

ప్రైవేటుకే ఫిట్‌నెస్