
చిన్నబాబు వచ్చారు.. బహుపరాక్!
అన్నవరం: కలెక్ట్‌రేట్‌లో జరిగే అధికారిక సమావేశాల్లో కలెక్టర్‌తో కలిసి ఆయన పుత్రరత్నం పాల్గొంటే ఎలా ఉంటుంది? ఓ ఎస్పీ కుమారుడు పోలీస్ స్టేషన్లు తనిఖీ చేస్తానంటే..! మరోచోటైతే ఇవి సాధ్యం కాకపోవచ్చునేమో! కానీ అన్నవరం దేవస్థానంలో మాత్రం ఈ తంతు 4 నెలలుగా యథేచ్ఛగా సాగిపోతోంది. సత్యదేవుని సన్నిధిలో ఓ అధికారి పుత్రరత్నం తమపై ఎక్కడా లేని పెత్తనం చేస్తున్నారంటూ సిబ్బంది, ఇతర అధికారులు వాపోతున్నారు. ప్రతి రోజూ ఆ అధికారి విధులకు వచ్చారా అని కాకుండా.. ఆయన గారి కొడుకు.. చినబాబు వచ్చాడా.. వస్తే ఎక్కడున్నాడంటూ సిబ్బంది ఆరా తీస్తున్నారు. తమ సెక్షన్‌కు వస్తే ఏమంటాడో.. అసలు వచ్చేలా ఉన్నాడా అంటూ ఆ పుత్రరత్నానికి సహాయకుడిగా ఉండే అటెండర్‌ను అడిగి మరీ తెలుసుకుంటున్నారు. ఎదురుపడితే ఏమంటాడో అని హడలెత్తుతున్నారు.
అధికారిక సమావేశంలో..
దేవస్థానం భద్రతకు ఉపయోగించే డ్రోన్ కెమెరాల కొనుగోలుపై ఆ కంపెనీ ప్రతినిధులతో రత్నగిరిపై ఆ అధికారి కార్యాలయంలో సోమవారం ఒక సమావేశం జరిగింది. ఇందులో ఆ అధికారితో పాటు ఈఈ లు, డీఈలు ఏఈఓలు, సూపరింటెండెంట్లు, సెక్యూరిటీ అధికారితో పాటు ఆ అధికారి పుత్రరత్నం చినబాబు కూడా పాల్గొన్నారు. డ్రోన్ కెమెరాల గురించి ఆ అధికారికి బదులు చినబాబే ప్రశ్నించడం మరో విడ్డూరం. ఇటువంటి సమావేశాల్లో చినబాబు పాల్గొన్నప్పుడు ఎవ్వరినీ ఫొటోలు, వీడియోలు తీయనివ్వరు. ఆ అధికారి సీసీ మాత్రమే ఫొటోలు, వీడియోలు తీస్తారు. ఫొటోల్లో ఆ చినబాబోరిని కట్ చేసి, మిగిలిన ఫొటోలను దేవస్థానం సెక్షన్ హెడ్స్ గ్రూపులో పెడుతున్నారు.
చినబాబుగారి పెత్తనం ఇలా..
ఫ దేవస్థానంలో సీసీ టీవీలు పరిశీలించే అధికారం, సంబంధిత లింక్ దేవస్థానంలో కీలకమైన నలుగురికి మాత్రమే ఉంటుంది. కానీ, ఆ అధికారి పుత్రరత్నానికి కూడా ఆ లింక్ ఇచ్చారు. దీంతో ఆయన వాటిని చూసి, సిబ్బందికి డైరెక్షన్లు ఇస్తున్నాడు. ఆ నోటా ఈ నోటా ఈ విషయం అందరికీ తెలియడంతో ఆ అధికారికి, మరో కీలక వ్యక్తికి తప్ప అందరికీ ఆ లింక్ తొలగించారు. పాస్‌వర్డ్ కూడా మార్చేశారు.
ఫ దేవస్థానానికి వచ్చిన ప్రతిసారీ చినబాబు సీసీ టీవీలుండే కమాండ్ కంట్రోల్ రూముకు వెళ్లి కొంతసేపు ఆ టీవీలు పరిశీలిస్తారు. ఆ సమయంలో ఎవ్వరూ లోపలకు రాకుండా బయట ఒకరు కాపలాగా ఉంటారు. ఆయన ఇచ్చే సలహాలు, సూచనలను అక్కడి సిబ్బంది పాటించాలి.
ఫ పీఆర్‌ఓ కార్యాలయాన్ని చినబాబు సందర్శించినప్పుడు అక్కడ సిబ్బంది ఎవ్వరూ లేకపోవడంతో అవమానంగా భావించారు. దీంతో, ఆయన ఆదేశాల మేరకు ఆ మర్నాడే అక్కడ సీసీ కెమెరా ఏర్పాటు చేశారు.
ఫ ఒక రోజు స్వామివారి నిత్యకల్యాణం, ఆన్‌లైన్ వ్రతం జరిగే కార్యాలయాన్ని సందర్శించి, సిబ్బంది పనితీరును పరిశీలించి సూచనలు ఇచ్చారు.
ఫ ఆ అధికారి గత నెలలో రెండు రోజుల సమావేశానికి విజయవాడ వెళ్లినపుడు ఆయన అధికారిక వాహనంలోనే చినబాబు నేరుగా దేవస్థానానికి వచ్చారు. దర్జాగా ఆ అధికారి కూర్చునే ముందు సీటులో కూర్చుని పెత్తనం చేశారు. వాస్తవానికి అధికారి లేనపుడూ ఆ కారును వేరొకరు ఉపయోగించకూడదు. కుటుంబ సభ్యులైనా సరే ఆ అధికారితో పాటు ప్రయాణించినప్పుడే ఆ వాహనం ఎక్కాలి.
ఫ దేవస్థానానికి మరో వాహనం కూడా ఉంది. చిన్నబాబు కొన్నిసార్లు ఆ వాహనంలో కొండ పైకి వచ్చి, అనధికారిక పర్యవేక్షణ అనంతరం తిరిగి కొండ దిగువకు అదే వాహనంలో వెళ్తున్నారు.
ఫ దేవస్థానానికి వచ్చినపుడు పర్యవేక్షణ అనంతరం ఆ అధికారి కార్యాలయానికి ఎదురుగా ఉన్న వీఐపీ గదిలో చినబాబు సేద తీరుతారు. అప్పుడు ఆ అధికారి మాదిరిగానే ఆ పుత్రరత్నానికి కూడా మర్యాదలు చేయాల్సిందే.
ఫ గతంలో ఎంతో మంది అధికారులు వచ్చినా వారి పిల్లలు ఎలా ఉంటారో కూడా సిబ్బందికి తెలియదు. ఎప్పుడూ ఇలాంటి వ్యవహారం చూడలేదని సిబ్బంది చెబుతున్నారు.
ఫ ఆ పుత్రరత్నం ఓవర్ యాక్షన్ దేవదాయ శాఖ ఉన్నతాధికారులకు తెలిసినా ఎందుకనో కానీ మౌనం వహిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, సరైన ఆధారాల కోసం ఎదురు చూస్తున్నారనే చర్చ కూడా నడుస్తోంది. దేవస్థానంలో సీసీ టీవీలు పరిశీలిస్తే చినబాబు కదలికలు తెలిసిపోతాయని పలువురు అంటున్నారు. ఉన్నతాధికారులు చినబాబు అజమాయిషీకే కత్తెర వేస్తారో లేక ఆ అధికారికే ఉద్వాసన పలుకుతారో వేచి చూడాల్సిందే.
·˘ A¯]l²Ð]lÆý‡… §ólÐ]lÝ릯]l…ÌZ
ఓ అధికారి పుత్రరత్నం నిర్వాకం
·˘ BĶæ$¯]l Úëyø Ķæ*MýSÛ¯ŒS™ø
హడలెత్తుతున్న సిబ్బంది
·˘ A°²…sê BĶæ$¯]l ò³™èl¢¯]lÐól$..