
పేరుపాలెం బీచ్‌లో యువకుడి మృతి
నల్లజర్ల: స్నేహితులతో కలసి సముద్ర స్నానానికి వెళ్లిన యువకుడు అలల ఉధృతికి కొట్టుకుపోయి మృతి చెందాడు. పేరుపాలెం బీచ్‌లో శనివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే.. నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలేనికి చెందిన సుమారు పది మంది యువకులు శుక్రవారం రాత్రి పేరుపాలెం బీచ్‌కు వెళ్లారు. వారిలో సంకెళ్ల ఉదయ కుమార్ (20) శనివారం ఉదయం సముద్రంలో స్నానం చేస్తూ కొట్టుకుపోయాడు. వెంటనే స్థానికులు అతడిని రక్షించి ఒడ్డుకు చేర్చారు. తొలుత స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం నర్సాపురం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. ఈ ఘటన చూసి మరో యువకుడు దేవరపల్లి సికిందర్ సొమ్మపిల్లి పడిపోయాడు. అతడిని నర్సాపురం ఆసుపత్రికి తరలించారు. కాగా.. ఆవపాడుకు చెందిన మరో యువకుల బృందం కూడా పేరుపాలెం బీచ్‌కు వెళ్లింది. వారిలో కోడే పవన్ కుమార్ అలల ఉధృతికి కొట్టుకుపోయాడు. స్ధానికులు అతనిని బయటకు తీసుకువచ్చారు. అస్వస్థతకు గురైన పవన్ కుమార్ తొలుత నర్సాపురం అనంతరం భీమవరం ఆసుపత్రికి తరలించారు.
కోడిగుడ్డుపై ఏసుక్రీస్తు చిత్రం
రాయవరం: ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని రాయవరం గ్రామానికి చెందిన పెయింటర్ ఇండుగమిల్లి సౌదాగర్ కోడిగుడ్డుపై ఏసుక్రీస్తు చిత్రాన్ని చిత్రీకరించాడు. కేవలం రెండు గంటల సమయంలో వాటర్ కలర్స్‌లో దీన్ని రూపొందించాడు. ఈ సందర్భంగా సౌదాగర్ మాట్లాడుతూ గుడ్‌ఫ్రైడే రోజున జీసస్ మృతి చెంది మూడో రోజు పునరుత్థానం చెందిన సందర్భాన్ని పురస్కరించుకుని దీన్ని చిత్రీకరించినట్టు తెలిపాడు.
ఇండుగమిల్లి సౌదాగర్

పేరుపాలెం బీచ్‌లో యువకుడి మృతి

పేరుపాలెం బీచ్‌లో యువకుడి మృతి