
తిరుమల విద్యార్థుల ప్రభంజనం
రాజమహేంద్రవరం రూరల్: ప్రతిష్టాత్మిక జేఈఈ మెయిన్స్ పరీక్షలో రాజమహేంద్రవరంలోని తమ తిరుమల ఐఐటీ అండ్ మెడికల్ అకాడమీ విద్యార్థులు అత్యద్భుత ఫలితాలు సాధించినట్లు తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు తెలిపారు. వివిధ కేటగిరీలలో జాతీయ స్థాయిలో కె.ప్రణీత్ 2వర్యాంకు, కె.యశ్వంత్ సాత్విక్ 3, పి.శరత్ సంతోష్ 9, వి.తేజశ్రీ 18, టి.జశ్వంత్ దొర 30, కె.అభినవ్ 45, కె.యశ్వంత్ రాజా 46, జి.సుజోష్ రాజా 66, ఇ.వర్షిత్ 75, ఎం.కారుణ్య రాజ్ 86వ ర్యాంకు సాధించారన్నారు. కె.వెంకటరామ వినీష్ 100, జి.కార్తీక్ 120, వి.రామసాయి వరుణ్ 153, జి.చేతన్ నాగఅనిరుథ్ 154, కె.శంకర్ మాణిక్ 191, ఎం.సిరి సంజన 204, పి.జశ్వంత్ సాయిచరణ్ 219, ఎం.విశ్వనాథ నాగసాయిరామ్ 224, డి.అశిష్ సాయిశ్రీకర్ 235, కె.సాయి సృజన 236, సీహెచ్ శ్రీచరణ్ 242, వై.దేవేష్ రుత్విక్ 246, పి.ప్రణవ్ రుద్రీష్ 247 ర్యాంకులు కై వసం చేసుకున్నారన్నారు. వీటితో పాటు 292, 310, 313, 319, 326, 331, 338, 349, 366, 391, 395, 403, 429, 444, 465, 473 ర్యాంకులను తమ విద్యార్థులు సాధించారన్నారు. 1000 లోపు 58 మంది, 5000 లోపు 254 మంది, 10,000 లోపు 417 మంది, 20,000లోపు 654 మంది ర్యాంకులు సాధించారని, కోచింగ్ తీసుకున్న విద్యార్థుల్లో 1,620 మంది అడ్వాన్స్‌డ్ పరీక్షకు అర్హత పొంది 93 శాతం సక్సెస్ రేటు సాధించారని ఆయన తెలిపారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఆయనతో పాటు అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్ బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరి అభినందించారు.