
పర్మినెంట్ ఫ్యాకల్టీని నియమించాలి
పెద్ద యూనివర్సిటీ అనే పేరే గానీ పర్మినెంట్ ఫాక్యల్టీ లేరు. అడ్‌హాక్, కాంట్రాక్టు ఫ్యాకల్టీ ఎక్కువగా ఉన్నారు. అధ్యాపక ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలి. కారణాలేవైనా ఇక్కడ అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇంటర్నల్ ఎగ్జామ్స్ సమయంలో ల్యాబ్స్ సమస్య ఎక్కువగా వస్తోంది. దీనికోసం బయటకు వెళ్లాల్సిన దుస్థితి. పూర్తి స్థాయి ల్యాబ్ సదుపాయం ఉండాలి. విద్యార్థినుల విషయమై తరచూ ఏదో ఒక సమస్య వస్తోంది. వారికి అభద్రతా భావం ఏర్పడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. పాలన, పర్యవేక్షణ సవ్యంగా ఉంటేనే అన్ని సమస్యలూ నియంత్రణలోకి వస్తాయి.
– అశోక్‌కుమార్, ఎస్‌ఎఫ్‌ఐ ప్రతినిధి, రాజమహేంద్రవరం
వర్సిటీ ప్రగతికి అందరూ పని చేయాలి
యూనివర్సిటీ ప్రగతి కోసం అందరూ పని చేయాలి. అలాగైతేనే ఇక్కడ ఉంటారు. పని చేయకుండా ఆడుకుంటే ఉపేక్షించేది లేదు. పరిపాలన నాకు కొత్త కాదు. చిందరవందరగా ఉన్న వలకు మాట్లు వేసి, సరిచేసే ప్రయత్నంలో ఉన్నాను. వర్గాలు, వైషమ్యాలు విడనాడి వర్సిటీ అభివృద్ధికి అంతా ఒక కుటుంబంగా పని చేయాలనేదే నా సంకల్పం. అందుకనే ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరంచుకుని సిబ్బందికి ఆటల పోటీలు నిర్వహించి, బహుమతులు అందజేయదలిచాం. ఇప్పటి వరకూ ఎలా ఉన్నా, ఇకపై అంతా ఒక్కటిగా ఉండాలని కోరుతున్నా.
– ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ, వైస్ ఛాన్సలర్,
ఆదికవి నన్నయ యూనివర్సిటీ

పర్మినెంట్ ఫ్యాకల్టీని నియమించాలి