
మనం భారతీయులం.. మనది అఖండ భారతం
జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల దురాగతానికి బలైపోయిన పర్యాటకులకు జీఎస్‌ఎల్ వైద్య కళాశాల ప్రాంగణంలో వైద్య విద్యార్థులు గురువారం రాత్రి శ్రద్ధాంజలి ఘటించారు. కొవ్వొత్తులతో మౌన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం మైదానంలో భారతదేశం ఆకృతిలో మానవహారంగా ఏర్పడి ‘మనం భారతీయులం – మనది అఖండ భారతం’ అంటూ ఆంగ్ల, తెలుగు, తమిళ, మలయాళ, ఒడియా, కన్నడ, బెంగాలీ భాషల్లో ఉద్వేగభరితంగా నినదించారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ వి.గురునాథ్, డాక్టర్ జి.సునీల్, డాక్టర్ అప్పారావు, సూపరింటెండెంట్ డాక్టర్ టీవీఎస్‌పీ మూర్తి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. – రాజానగరం

మనం భారతీయులం.. మనది అఖండ భారతం