
వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షుల నియామకం
సాక్షి, రాజమహేంద్రవరం: వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాలకు జిల్లా అధ్యక్షులను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామక ప్రక్రియ జరిగింది. రైతు విభాగం జిల్లా అధ్యక్షుడిగా వల్లభనేని సత్యనారాయణ (గోపాలపురం), క్రిస్టియన్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడిగా ఎంఎస్‌ఎస్‌ఎన్ విజయ సారథి (రాజమహేంద్రవరం రూరల్), గ్రీవెన్స్ సెల్ జిల్లా అధ్యక్షుడిగా నాగళ్లపాటి శ్రీను (కొవ్వూరు), అంగనవాడీ వింగ్ అధ్యక్షురాలిగా కురుకూరి ధనలక్ష్మి (గోపాలపురం) నియమితులయ్యారు. తమ నియామకానికి సహకరించిన ఆయా నియోజకవర్గాల కో ఆర్డినేటర్లకు, జిల్లా అధ్యక్షులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. తమపై నమ్మకం ఉంచి, బాధ్యతలు అప్పగించిన అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పారు.
వైఎస్సార్ సీపీ జిల్లా కమిటీ నియామకం
రాజమహేంద్రవరం సిటీ: అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ సీపీ జిల్లా కమిటీలో పలువురిని వివిధ హోదాల్లో నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ జిల్లా కమిటీ ఉపాధ్యక్షులుగా బొప్పన సుబ్బారావు, అడబాల వెంకటేశ్వరరావు, బొండాల వెంకన్నబాబు, కాకర్ల వెంకటేశ్వరరావు, అడబాల సీతారామకృష్ణ, వీరమళ్ళ సత్యనారాయణ; ప్రధాన కార్యదర్శులుగా పతాన్ అన్సర్ బాషా, తడాల విష్ణు చక్రవర్తి, జుట్టా కొండలరావు (ఏడుకొండలు), కోర్ల ఉదయ భాస్కర్, కందుల శ్రీనాథ్; ట్రెజరర్‌గా యెజ్జు శ్రీనివాస్ కిరణ్ నియమితులయ్యారు. సెక్రటరీ ఆర్గనైజర్‌గా పెండ్ర పోశేశ్వరరావు, చాంద్ బాషా షేక్, పితాని హరికృష్ణ, ఎనుముల త్యాగరాజు, వాసంశెట్టి మాధవ, పడాల వీర వెంకట సత్యనారాయణరెడ్డి (పీవీ), జాలెం వెంకటేశ్వరరావు, గెడ్డం సూర్యప్రసాద్, పోతిరెడ్డి నాగరాజు, కసులూరి సతీష్, నీలపాల శివరామకృష్ణ, గిరజాల రామ, సూరిశెట్టి కుటుంబరావు, కేతినీడి అశోక్ కుమార్, జ్యోతుల లక్ష్మీనారాయణలను నియమించారు. సెక్రటరీ యాక్టివిటీగా కొల్లాటి ఇజ్రాయిల్, తాడి సూరారెడ్డి, ఎల్లా రామారావు, చోళ్ల శ్రీనివాస్, దుగ్గిరాల రమేష్‌బాబు, ముప్పిడి వెంకటరత్నం, కొప్పినీడి ప్రసాద్‌బాబు, తాడికొండ విష్ణుమూర్తి, ముద్దాల తిరుపతిరావు (అను), వంబోలు పోసిబాబు, మట్టా శ్రీనివాసరావు, కొల్లి రాజా రమాదేవి, టేకుమూడి త్రిమూర్తులు నియమితులయ్యారు. అధికార ప్రతినిధులుగా గనిశెట్టి సోమేశ్వరరావు, పెయ్యల రాజేష్, గాడా జగదీష్, సబ్బెళ్ల కృష్ణారెడ్డి, కుచ్చులపాటి కుమార్, గంధం సీహెచ్‌ఆర్ శేషసాయి నియమితులయ్యారు.

వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షుల నియామకం

వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షుల నియామకం

వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షుల నియామకం