
విద్యుత్ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి
● ఏపీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు
● ఘనంగా యూనియన్ నూతన జెండా ఆవిష్కరణ, చిహ్నం టవర్ ప్రారంభం
రాజమహేంద్రవరం రూరల్: విద్యుత్‌శాఖలో పెండింగ్‌లో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలతో కూడిన న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సానా కృష్ణయ్య, ఎంవీ గోపాలరావు డిమాండ్ చేశారు. శుక్రవారం బొమ్మూరులోని 220 కేవీ సబ్‌స్టేషన్ వద్ద ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (రి.నెం.1104) 75 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్లాటినం జూబ్లీ వేడుకలు ఓఅండ్ ఎం ఏపీ ట్రాన్స్‌కో రాజమహేంద్రవరం ప్రాంతీయశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు సానా కృష్ణయ్య నూతనజెండాను ఆవిష్కరించగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవి.గోపాలరావు యూనియన్ చిహ్నం టవర్‌ను ప్రారంభించారు. కృష్ణయ్య, గోపాలరావు మాట్లాడుతూ పార్టీలు, కులాలకు అతీతంగా కార్మికులతో నడుస్తున్న ఏకై క యూనియన్ ఏపిఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ 1104 మాత్రమేనన్నారు. 75 సంవత్సరాలుగా కార్మికుల హక్కుల కోసం యూనియన్ చేసిన పోరాటాలను వారు గుర్తు చేసుకున్నారు. ఉద్యోగులు దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న మూడు డీఏలను వెంటనే చెల్లించాలని, 24గంటలపాటు విధినిర్వహణలో ఉండే ఉద్యోగులకు నగదు రహిత మెడికల్ పాలసీ అమలుచేయాలని, కాంట్రాక్టు కార్మికులకు సమానపనికి సమానవేతనం ఇవ్వాలని, కాంట్రాక్టు వ్యవస్థను రద్దుచేసి, డైరెక్టుగా జీతాలు ఇవ్వాలన్నారు. గత ప్రభుత్వంలో నియమితులైన 7,200 మంది ఎనర్జీ అసిస్టెంట్స్‌ను ఎలక్ట్రిసిటీ బోర్డు జేఎల్‌ఎంలుగా విలీనం చేయాలన్నారు. తమ డిమాండ్లను యాజమాన్యం, ప్రభుత్వం అమలు చేయకపోతే నిరసన కార్యక్రమాలు చేపడతామని కృష్ణయ్య,గోపాలరావు అన్నారు. రాష్ట్ర కార్యనిర్మాహక అధ్యక్షుడు ఎం.జగదీశ్వర్, ప్రాంతీయ మాజీ అధ్యక్షుడు కె. శ్రీనివాసులు, యం.డి. అబ్దుల్ గఫూర్, ప్రాంతీయ మాజీ కార్యదర్శి యం. శ్రీనివాసరావు , ఏసిఇపిడిసిఎల్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి యం. శ్రీనివాసులు మాట్లాడుతూ యూనియన్ సాధించిన విజయాలను కొనియాడారు. ఏపీ ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఏ.గురుబాబు విద్యుత్ ఉద్యోగులు ఐక్యంగా ఉంటే డిమాండ్లును సాధించుకోవచ్చన్నారు.
ప్రాంతీయ అధ్యక్ష,కార్యదర్శులు పినిపే సురేష్ బాబు,జగతా అచ్యుతరామయ్యలు మాట్లాడుతూ, ఈ ప్లాటినం జూబ్లీ వేడుకలను విజయవంతం చేసిన ఉద్యోగులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.