
వసతులు, సౌకర్యాలతో లక్ష్య సాధన
రాజమహేంద్రవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన నక్కా శ్రావణి సత్య హెచ్‌వో (హోటల్ మేనేజ్‌మెంట్) గ్రూప్‌లో 1000/982 మార్కులు సాధించి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. కొండగుంటూరు ప్రాంతానికి చెందిన శ్రావణి తండ్రి నక్కా చిన్న అప్పారావు రోజువారీ కూలీ. తల్లి ఆదిలక్ష్మి నర్సరీలో రోజువారీ కూలీగా పనిచేస్తున్నారు. చిన్నప్పటి నుంచి కష్టపడే మనస్తత్వం ఉన్న శ్రావణి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందజేసిన విద్యా వసతులు, సౌకర్యాలు, స్కాలర్‌షిప్‌లతో తన లక్ష్యాన్ని అలవోకగా సాధించింది.