వేలివెన్ను శశి.. ఫలితాలలో మేటి..
ఉండ్రాజవరం: శశి వేలివెన్నుకు చెందిన విద్యార్థులు పదో తరగతిలో అత్యుత్తమ ఫలితాలు, మార్కులు సాధించారని శశి విద్యాసంస్థల చైర్మన్ బూరుగుపల్లి రవికుమార్ బుధవారం తెలిపారు. జయవరపు ఉజ్వల్ కృష్ణసాయి, పడాల పడాల సహస్ర అక్షయ రెడ్డి 595 మార్కులు, తోట హేమాంజలి, మేడిద వర్షిత 594 మార్కులు, షేక్ చాందిని, బవిరిశెట్టి సాయి అక్షయ్, రాగోలు రామ్ కిరణ్ 592 మార్కులు, ఆలపాటి నిషిత 591 మార్కులు, కోడి వైష్ణవి దుర్గ, జెంగం రోహిత్, సుంకవల్లి శ్రీకర్, చిర్ల దేవిశ్రీప్రియ, పెంకే చేతన్ సాయి ఆశ్వర్, గుణ్ణం సింధు ప్రియ 590 మార్కులు సాధించారన్నారు. 580కి పైగా 84 మంది, 550కి పైగా 342 మంది, 500కి పైగా 636 మంది విద్యార్థులు మార్కులు సాధించారని తెలిపారు. ఆ విద్యార్థులను, అధ్యాపక బృందాన్ని రవికుమార్ తో పాటు వైస్ చైర్మన్ బూరుగుపల్లి లక్ష్మీసుప్రియ, ప్రిన్సిపాల్ షేక్ షానూర్ అభినందించారు.


