
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆదిత్య ప్రతిభ
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జేఈఈ మెయిన్స్–2025 ఫలితాల్లో రెగ్యులర్ ఇంటర్మీడియేట్ విద్యార్థులు అత్యున్నత ర్యాంకులు సాధించి ప్రతిభ చూపారని ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి ఆదివారం తెలిపారు. ఆలిండియా స్థాయిలో కె.రుత్విక్ 23వ ర్యాంక్, పి.ఆదిత్య అభిషేక్ 46వ ర్యాంక్ సాఽధించి ప్రతిభ చాటారన్నారు. వీటితో పాటు 109, 112, 118, 135, 144, 155, 206, 212, 280, 300, 309, 342, 359, 395, 524 ర్యాంకులు వరుసగా సాధించారన్నారు. అలాగే 2 వేల లోపు 44 మంది, 5 వేల లోపు 102 మంది అత్యున్నత ర్యాంకులు సాధించి పటిష్టమైన అకడమిక్ పోగ్రాంకు నిలువుదట్టంగా నిలిచాయన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఆదిత్య విద్యాసంస్థల కార్యదర్శి దీపక్‌రెడ్డి, హాస్టల్ డైరెక్టర్ లక్ష్మీరాజ్యం, డైరెక్టర్లు శృతి, సుగుణ, ప్రిన్సిపాల్ మెయినా, కో–ఆర్డినేటర్ కె.లక్ష్మీకుమార్, అకడమిక్ డైరక్టర్ రాఘవరెడ్డి, పి.గంగిరెడ్డి, సత్యనారాయణరెడ్డి, ఐఐటీ క్యాంపస్ వైస్ ప్రిన్సిపాల్ ఫణీంద్ర అభినందించారు.