నేటి ప్రయోజనం! | - | Sakshi
Sakshi News home page

నేటి ప్రయోజనం!

Apr 17 2025 12:15 AM | Updated on Apr 17 2025 12:15 AM

నేటి

నేటి ప్రయోజనం!

నాటి ప్రణాళిక..

చేసేది ఏమిటో చేసేయి సూటిగా వేసేయి పాగా ఈ కోటలో.. ఎన్ని కష్టాలు రానీ.. నష్టాలు రానీ నీ మాట దక్కించుకో బాబయా.. అంటూ సాగే ఈ గీతంలోని ప్రతి పదం మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి నూటికి నూరు పాళ్లు అతికినట్టు సరిపోతుంది. పేదరికం కారణంతో ఏ పిల్లవాడూ చదువుకు దూరం కాకూడదు. కేజీ నుంచి పీజీ వరకు ఏ స్థాయిలోనూ ఏ విధమైన ఆటంకం రాకూడదు. అందుకు చేయాల్సింది ఏదైనా వెనకాడకూడదు. ఈ లక్ష్యంతో నాడు–నేడు పేరున బృహత్తర పథకాన్ని అమలు చేసిన దార్శనికుడు జగన్‌మోహన్‌రెడ్డి. ఏటేటా ఫీజు రీయింబర్స్‌మెంట్‌. పిల్లలు పాఠశాలకు, కళాశాలకు వస్తున్నారా లేదా అని ఉపాధ్యాయుల ద్వారా పటిష్టమైన నిఘా. పిల్లల ఇళ్లకే వెళ్లి వాళ్ల విద్యా ప్రగతిని తల్లిదండ్రులకు వివరించడం. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో రాజీ లేని ప్రణాళికా రచన.. మానసిక ఉల్లాసానికి ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడలకు ప్రోత్సాహం. ఇలా ఎన్నో చర్యలు చేపట్టి విద్యార్థుల మనసులో కోట కట్టుకుని సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. అందుకోసం ఎన్ని కష్టాలు, నిధుల లేమి ఎదురైనా ఎలాగోలా సమకూర్చి అవసరాలన్నీ తీర్చి నిజంగానే జగన్‌ మామ అనిపించుకున్నారు. ఆయన నాటిన విత్తనాలు నేడు చక్కని ఫలితాలను ఇస్తుంటే విద్యార్థుల తల్లిదండ్రులు, అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పిఠాపురం: పరీక్షా ఫలితాలు వెలువడ్డాయంటే చాలు 1, 2, 3, 4, 5... అసాధారణ ఫలితాలు అద్భుత విజయాలు మా సొంతం అంటూ ప్రసార మాద్యమాల్లో ప్రైవేటు విద్యా సంస్థలు ప్రచారంతో ఊదరగొడుతుంటాయి. గత కొన్నేళ్లుగా విద్యా వ్యవస్థలో ఈ పరిస్థితి నాటుకుపోయింది. ర్యాంకు రావాలంటే ప్రైవేటు విద్యా సంస్థలో తప్ప మరెక్కడా రాదని ప్రజల్లో నాటుకు పోయేలా చేశాయి ప్రైయివేటు విద్యా సంస్థలు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యకు ప్రాధాన్యత ఇస్తూ ప్రవేశ పెట్టి అమలు చేసిన పథకాలు, విద్యా వ్యవస్థలో తీసుకువచ్చిన సంస్కరణలతో ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలను మార్చివేయడంతో అలాంటి పరిస్థితిని మార్చి చూపించారు ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు. ప్రభుత్వ కళాశాలల్లో చదివి అత్యుత్తమ ఫలితాలను సొంతం చేసుకుని సత్తా చాటి ప్రైవేటు పాఠశాలలకు సవాల్‌ విసురుతున్నారు ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు. ఈ ఏడాది ఇంటర్మీడియెట్‌ పరీక్షా ఫలితాల్లో రాష్ట్రంలో ప్రభుత్వ కళాశాల విద్యార్థులు 54 మంది అత్యుత్తమ ఫలితాలు సాధించగా వారిలో 99 శాతం మంది ప్రభుత్వ కళాశాలల విద్యార్థులే కావడం విశేషం.

మట్టిలో మాణిక్యాలు అరుదుగా బయటపడుతుంటాయి, అలాంటి మాణిక్యాలకు సాన పెడితే వాటి విలువ ఏంటో ప్రపంచానికి తెలుస్తుంది. సరైన మౌలిక వసతులు, వృత్తికి అనుకూల వాతావరణం కల్పిస్తే అద్భుత ఫలితాలు సాధ్యమవుతాయి. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం. గడచిన ఐదేళ్లలో నాడు–నేడు పేరుతో ప్రభుత్వ పాఠశాలల తీరుతెన్నులు మారి పోవడంతో పాటు ఉపాధ్యాయులు తమ శక్తి వంచన లేకుండా తర్ఫీదు ఇస్తుండడంతో ఎన్నడూ లేని విధంగా అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు విద్యార్థులు.

ఒక్క పైసా కూడా ఖర్చు లేదు. మీకు చదవాలనే ఆసక్తి ఉంటే చాలు అన్ని వసతులు కల్పిస్తాం రండి.. చదువుకోండి.. మంచి ఉన్నత స్థానాలకు చేరుకోండి.. అంటు ప్రభుత్వ విద్యా సంస్థలు విద్యార్థులకు ఆహ్వానం పలుకుతుంటే విద్యార్థులు క్యూకడుతున్నారు. రూ.లక్షల ఫీజులు చెల్లించి చదువుకునే ప్రైవేటు కళాశాలలను తలదన్నే విధంగా ప్రభుత్వ కళాశాల విద్యార్థినులు తమ సత్తా చాటారు. ప్రభుత్వ కళాశాల్లో మెరుగుపడిన సౌకర్యాలతో పైసా ఫీజు లేకుండా చదువుకుని టాపర్లుగా నిలిచి ప్రభుత్వ కళాశాలలకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెస్తున్నారు ప్రభుత్వ కళాశాలల విద్యార్థినులు.

మనో నేత్రమే ఆమె బలం

తుని మండలం టి.వెంకటాపురం గ్రామానికి చెందిన గింజాల హేమజ్యోతి పుట్టుకతో ఒక కన్ను పూర్తిగా కనిపించకపోయినా మసకబారినట్టు కనిపించే రెండో కన్నుతో విద్యను అభ్యసించింది. ఆమె ఇంటర్మీడియట్‌ ఎంఈసీలో అత్యుత్తమంగా 660 మార్కులతో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన షైనింగ్‌ స్టార్స్‌ జాబితాలో స్థానం దక్కించుకుంది. తల్లిదండ్రులు శ్రీనివాసరావు, నాగ సత్యవతి వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత బీఈడీ చదివి ఉపాధ్యాయురాలు కావాలన్నదే తన కుమార్తె ఆశయమని తెలిపారు.

మరింత మందికి స్ఫూర్తి

బిక్కవోలు మండలంలోని పందలపాకకు చెందిన రుత్తల లీలా శ్రావణి. విజయవాడ చెందిన ఈమె కళాశాల ఫస్ట్‌ రావడంతో పాటు రాష్ట్రంలో సీఈసీలో 943 మార్కులతో హైస్కూల్‌ ప్లస్‌ స్టేట్‌ ఫస్ట్‌ వచ్చింది. ఆమె చదువు మరింతమంది మహిళలకు బాట వేసింది. రూపాయి ఖర్చు లేకుండా అన్ని వసతులతో ప్రభుత్వ కళాశాలలను తీర్చి దిద్దడం వల్లే విద్యా ప్రమాణాలు పెరిగి తమలాంటి వాళ్లు అత్యుత్తమ ఫలితాలు సాధించగలుగుతున్నామని ఆమె పేర్కొంది.

ఆటో డ్రైవర్‌ కుమార్తె అయినా..

కాకినాడ పీఆర్‌ ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్‌ కళాశాలకు చెందిన దుంపా సాయిలక్ష్మి ఎలక్ట్రానిక్స్‌ గ్రూపులో 1000కి 982 మార్కులు సాధించి ప్రధమ స్థానంలో నిలిచింది. పేద కుటుంబానికి చెందిన ఆమె తండ్రి దుంపా ప్రసాద్‌ ఆటో డ్రైవరుగా పని చేస్తున్నాడు. తల్లి శేషారత్నం గృహిణి. డిగ్రీ పూర్తి చేసి గ్రూప్స్‌ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్‌ అవుతానని ఆమె తెలిపారు. విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పుల వల్ల, ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన విద్యా భోదన వల్ల తాను మంచి మార్కులు సాధించగలిగాలని ఆమె తెలిపారు.

ఇవిగో సంస్కరణ ఫలితాలు..

గత వైఎస్సార్‌ సీపీ సర్కారు చర్యలతో

నేటి విద్యార్థుల విజయ సోపానాలు

సరికొత్త రికార్డులు సాధిస్తున్న వైనం

ఇంటర్మీడియెట్‌ ఫలితాలే నిదర్శనం

నేటి ప్రయోజనం!1
1/2

నేటి ప్రయోజనం!

నేటి ప్రయోజనం!2
2/2

నేటి ప్రయోజనం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement