
మా అందరి పూర్వ జన్మ సుకృతం
మేము తొమ్మిది మంది అన్నదమ్ములం. ఆరుగురు చెల్లెళ్లు. గణేష్ శర్మ మా రెండో సోదరి భళ్లమూడి భాస్కరం, సూర్యనారాయణ దంపతుల కుమార్తె కొడుకు. అతడి తండ్రి ధన్వంతరి, తల్లి మంగాదేవి. గణేష్‌ను నా చేతుల మీద పెంచాను. ద్వారకా తిరుమలలో ఆగమ శాస్త్రాలు అభ్యసించి, పరీక్షలో గోల్డ్ మెడల్ పొందాడు. అప్పుడే శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ అతడి విద్వత్తు చూసి కంచి పీఠానికి తీసుకుని వెళ్లి, చతుర్వేదాలు, ఉపనిషత్తులు నేర్పించారు. గణేష్ శర్మకు ఈ గౌరవం దక్కడం మా పూర్వజన్మ సుకృతం.
– నాగాభట్ల కామేశ్వరశర్మ,
వైదిక కార్యక్రమాల పర్యవేక్షకుడు, అన్నవరం దేవస్థానం