hindupur
-
చింత.. నిశ్చింత..
సాక్షి, పుట్టపర్తి: అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో అనేక గ్రామాల ప్రజలు చింత చెట్టును నమ్ముకుని నిశ్చింతగా జీవనం సాగిస్తున్నారు. మడకశిర నియోజకవర్గంలో దశాబ్దాల తరబడి దాదాపు 20 వేల కుటుంబాలు చింతచెట్లనే నమ్ముకుని జీవనం సాగిస్తున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా 334 గ్రామాలు ఉండగా.. సుమారు 2 లక్షల చింతచెట్లు (Tamarind Trees) ఉన్నాయి. ప్రధాన మార్కెట్ అయిన హిందూపురం (Hindupur) మార్కెట్‌కు వచ్చే సరుకులో అత్యధికంగా మడకశిర నుంచే వస్తుంది. గత మూడేళ్ల నుంచి చింత రైతులకు కూలీ వ్యయం బాగా పెరిగింది. చింతపండు ధర మాత్రం యథావిధిగా ఉండటంతో ఆశించిన స్థాయిలో లాభాలు రావడం లేదని రైతులు చెబుతున్నారు. చింతకాయలు కోసేందుకు కూలీలకు రోజుకు రూ.800 చొప్పున ఇవ్వాలి. మిగతా నూర్పిడి పనులకు అయితే రోజుకు రూ.300 ఇస్తారు.చింతపండును శుద్ధి చేసి మార్కెట్‌కు తరలించేందుకు క్వింటాల్‌కు రూ.2 వేల చొప్పున అదనంగా భరించాల్సి ఉంటుంది. పండు బాగా ఉంటే నాణ్యత ఆధారంగా క్వింటాల్ రూ.30 వేల వరకు ధర పలుకుతుంది. సరుకు బాగా లేకపోతే ధరలో వ్యత్యాసం ఉంటుంది. కొందరు సరిగా శుద్ధిచేయలేక తక్కువ ధరకు విక్రయిస్తుంటారు. హిందూపురం యార్డ్‌లో విక్రయాలు.. ఏటా ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు వారానికి రెండు రోజులు (సోమ, గురు) చొప్పున హిందూపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో చింతపండు విక్రయాలు జరుగుతాయి. సీజన్లో గరిష్టంగా 28 సార్లు అమ్మకాలు ఉంటాయి. మార్కెట్ యార్డులో సుమారు 70 ట్రేడ్ ఏజెన్సీలు ఉన్నాయి. ఒక్కో ఏజెన్సీ నుంచి సగటున 100 టన్నుల చింతపండు ఎగుమతి అవుతుంది. అందులో సగంపైగా మడకశిర నియోజకవర్గం నుంచి వస్తుండటం విశేషం. మిగతా సరుకు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి చేరుతుంది. సీజన్ ముగిశాక శీతల గిడ్డంగుల్లోకి.. రైతుల నుంచి సేకరించిన సరుకును హిందూపురం మార్కెట్లో బాక్సుల్లో నింపి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. సీజన్ పూర్తయ్యే లోగా మిగిలిన సరుకును స్థానికంగా ఉన్న శీతల గిడ్డంగుల్లో నిల్వ ఉంచుతారు. లారీ చింతపండుకు ఏడాదికి రూ.25 వేలు చొప్పున అద్దె చెల్లించి శీతల గిడ్డంగుల్లో నిల్వ ఉంచుతారు. మడకశిరకు సమీపంలోనే హిందూపురం ఉండటంతో రైతులకు రవాణా ఖర్చులు కూడా కలిసివస్తాయి. ఈ సారి ఖర్చు పెరిగింది గతంతో పోలిస్తే ఈసారి ధరలు స్థిరంగా ఉన్నాయి. నేను 16 ఏళ్ల నుంచి చింత చెట్ల నుంచి ఫలసాయం పొందుతున్నా. ప్రతి ఏటా లాభాలు వచ్చేవి. అయితే ఈసారి మాత్రం ఖర్చు పెరిగింది. ఆశించిన స్థాయిలో ఆదాయం రాలేదు. స్థానికంగా మార్కెట్ సౌకర్యం కల్పిస్తే రవాణా ఖర్చులు మిగులుతాయి. – రైతు జయరామప్ప, మెట్టబండపాళ్యం, మడకశిర మండలం దిగుబడి తగ్గింది మా తోట చుట్టూ 25 చింత చెట్లు ఉన్నాయి. ఈ ఏడాది వింత రోగం వచ్చి దిగుబడి తగ్గింది. అందుకే ఒక్కో చెట్టును రూ.2 వేల చొప్పున వ్యాపారికి అమ్మేశాను. దిగుబడి బాగా ఉండి ఉంటే చెట్టు రూ.3 వేలు పైగా ధర పలికేది. – వీరాముద్దప్ప, మద్దనకుంట, అమరాపురం మండలం చింతపండు మార్కెట్ – హిందూపురం లావాదేవీలు – ప్రతి సోమ, గురువారం సీజన్ – ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ యార్డ్‌లో ట్రేడ్ ఏజెన్సీలు – 70 ఒక్కో ఏజెన్సీ నుంచి – 100 టన్నులవరకు ఎగుమతి -
అక్రమంగా హిందూపురం ఛైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకున్న టీడీపీ
-
ఏంది బాలయ్య.. ఇదీ ఓ గెలుపేనా?
సత్యసాయి జిల్లా, సాక్షి: ఏపీలో పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సభ్యులపై ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. మాట వినని వాళ్లను బెదిరించడమే కాదు.. ఎత్తుకెళ్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అన్యాయంగా పదవులు లాక్కుని.. తమదే గెలుపంటూ కూటమి ప్రభుత్వం ప్రకటించుకుంటోంది. ఈ క్రమంలో..హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సమక్షంలోనే బరితెగింపు వ్యవహారం నడిచింది. 23 మంది సభ్యుల మద్దతుతో హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ పదవి సొంతం చేసుకుంది టీడీపీ. అయితే.. బలం లేకున్నా అన్యాయంగా చైర్మన్ పదవి లాక్కోవడం ఇక్కడ దారుణం.ఇక్కడ మొత్తం 38 వార్డులు ఉన్నాయి. అయితే గత ఎన్నికల్లో 30 వార్డులను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. ఈసారి ఎన్నికల కోసం వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను ప్రలోభ పెట్టాలని టీడీపీ నేతలను ఎమ్మెల్యే బాలయ్య దగ్గురుండి ప్రోత్సహించారు. మాట వినని కౌన్సిలర్లను బెదిరించారు కూడా. అలా.. 16 మందిని తనవైపునకు తిప్పుకుంది. ఈ అరాచకాలను చూసి ‘‘ఏంది బాలయ్య ఇది?’’ అంటూ హిందూపురం వాసులు విస్తుపోతున్నారు. డాకు బాలయ్యా.. ఇదీ ఓ గెలుపేనా?హిందూపురంలో టీడీపీ విజయం అనైతికమని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి అంటున్నారు. ‘‘హిందూపురంలో 38 వార్డులకు గాను 30 వార్డుల్లో వైఎస్సార్ సీపీ కి బలం ఉంది. ఎమ్మెల్యే బాలకృష్ణ బెదిరించి.. ప్రలోభాలకు గురి చూసి వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను లాక్కున్నారు. ఓ డాకూలా ఎమ్మెల్యే బాలకృష్ణ దోపిడీ చేశాడు. నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చారు. ఈ గెలుపు.. అసలు గెలుపే కాదు. సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇలాగే మోసాలతో గెలిచారు. చంద్రబాబు, బాలకృష్ణలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు’’ అని అన్నారాయన. -
నీచ రాజకీయాలకు తెరతీసిన ఎమ్మెల్యే బాలకృష్ణ
శ్రీ సత్యసాయి జిల్లా: మున్సిపల్ ఛైర్మన్ పదవి కోసం హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అడ్డదార్లు తొక్కుతున్నారు. నోరు తెరిస్తే బ్లడ్డు...బ్రీడు అంటూ తన గురించి తాను గొప్పగా చెప్పుకునే బాలకృష్ణ నీచ రాజకీయానికి తెరతీశారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను కొనుగోలు చేసి బెంగళూరులో క్యాంపు రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం బాలకృష్ణ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెండున్నర నెలలుగా ఖాళీగా ఉన్న హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ స్థానానికి ఎన్నిక నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పదవిని దక్కించుకునేందుకు టీడీపీ ఎప్పటిలా తన కుటిల రాజకీయాలకు తెరతీసింది. ఇందుకోసం ఎమ్మెల్యే బాలకష్ణనే రంగంలో దిగారు. తనకు అనుకూలమైన వారిని చైర్మన్ పీఠంపై కూర్చోబెట్టేందుకు నానా తంటాలు పడుతున్నారు.ఇందులో భాగంగా ఖర్చుకు ఏమాత్రం వెనుకాడని ఎమ్మెల్యే బాలకృష్ణ వైఎస్సార్సీపీ ఒక్కో కౌన్సిలర్‌కు రూ.10 లక్షలు చొప్పున కొనుగోలు చేశారు. అలా మొత్తంగా 12మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్‌ను కొనుగోలు చేసింది. అనంతరం వారిని బస్సుల్లో బెంగళూరులో టీడీపీ ఏర్పాటు చేసిన క్యాంప్‌కు తరలించింది. మరింత మందిని ప్రలోభాలకు గురి చేసేందుకు ఎమ్మెల్యే బాలకృష్ణ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.ఇప్పటికే బెదిరింపులతో టీడీపీలో చేరిన వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు.. తిరిగి సొంతగూటికి చేరారు. అయితే ఎమ్మెల్యే బాలకృష్ణ చేస్తున్న పెడుతున్న ప్రలోభాలు, బెదిరింపులకు భయపడి టీడీపీలో చేరితో భవిష్యత్తు నాశనం అవుతుందని భావిస్తున్న కౌన్సిలర్లు వైఎస్సార్సీపీలోనే కొనసాగేలా తీర్మానించారు. కాగా, హిందూపురం మున్సిపాలిటీలో 38 మంది కౌన్సిలర్లు ఉండగా.. గత ఎన్నికల్లో 30 వార్డుల్లో వైఎస్సార్సీపీ జయకేతనం ఎగురవేసింది. టీడీపీ కేవలం ఆరు వార్డులకే పరిమితమైంది. కానీ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురి చేయడం గమనార్హం. -
బాలకృష్ణ ఇలాకాలో మద్యం షాపు దక్కించుకున్న వ్యక్తి కిడ్నాప్
-
బాలకృష్ణ నిద్ర పోతున్నావా... దసరా రోజున ఇలాంటి ఘటన దారుణం
-
బాలయ్య ఇలాకాలో అత్తాకోడలిపై అత్యాచారం
-
టీడీపీకి దండం.. జగనన్నతోనే ఉంటాం
-
Hindupur: ఆ నలుగురు కౌన్సిలర్లు.. తిరిగి వైఎస్సార్సీపీ గూటికి
సాక్షి, తాడేపల్లి: అనంతపురం జిల్లా హిందూపురం కౌన్సిలర్లు బుధవారం వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌హన్‌రెడ్డిని కలిశారు. శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్, హిందూపురం వైఎస్సార్సీపీ సమన్వయకర్త దీపికతో కలిసి వీరంతా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైయస్ జగన్‌ను కలిశారు. ఇటీవల టీడీపీలో చేరిన నలుగురు కౌన్సిలర్లు తిరిగి వైఎస్సార్సీపీ గూటికి చేరారు. వైఎస్ జగన్‌ను కలిసి పార్టీ కోసం పనిచేస్తామని హామీ ఇచ్చారు. అధికార పార్టీ నేతల ప్రలోభాలు, బెదిరింపులకు తామిక తలొగ్గేదిలేదని ఏది ఏమైనా ప్రజల పక్షాన నిలబడి వైఎస్సార్సీపీ వెంటే నడుస్తామన్నారు. వైఎస్ జగన్‌ను కలిసిన వారిలో సత్యసాయి జిల్లా పార్టీ అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్, హిందూపురం ఇన్ఛార్జీ దీపిక, ఇతర వైఎస్సార్సీపీ నేతలు ఉన్నారు.కాగా టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే హిందూపురం మునిసిపాలిటీలో కౌన్సిలర్లను భయపెట్టి, మభ్యపెట్టి తమ పార్టీలో చేర్చుకుని మునిసిపల్ ఛైర్మన్ స్ధానం దక్కించుకునేందుకు కుట్ర పన్నారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను భయపెట్టి టీడీపీలో చేర్చుకున్నారు. వీరిలో మల్లిఖార్జున, పరుశురాముడు, రహమత్బీ, మణిలు తమ తప్పు తెలుసుకుని తిరిగి వైఎస్సార్సీపీలో చేరారు. -
రైతుల భవనాన్ని కూల్చేసిన టీడీపీ భూకబ్జాదారులు
హిందూపురం: సినీ హీరో, సీఎం చంద్రబాబు బావమరిది ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో టీడీపీ కబ్జాదారులు పేట్రేగిపోయారు. 30 ఏళ్ల క్రితం రైతులు హిందూపురం కోఆపరేటివ్ మిల్క్ డెయిరీ సొసైటీ ఏర్పాటు చేసుకొని, పట్టణం నడిబొడ్డున మెయిన్ బజారులో ఓ స్థలాన్ని కొనుక్కొని అందులో భవనాన్ని నిర్మించుకొన్నారు. కోట్ల రూపాయలు విలువ చేసే ఆ స్థలంపై టీడీపీ కబ్జాదారుల కన్ను పడింది. వారు మూడురోజుల క్రితం రాత్రి వేళ ఆ భవనాన్ని కూల్చేశారు. స్థలాన్ని చదును చేసి, వారి చేతుల్లోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకొన్న రైతులు సోమవారం పెద్ద సంఖ్యలో పట్టణం నడిబొడ్డున ఉన్న ఆ స్థలం వద్దకు చేరుకొన్నారు. టీడీపీకి చెందిన భూ కబ్జాదారుల నుంచి రైతుల ఆస్తులను కాపాడాలంటూ ఆందోళనకు దిగారు. వారికి రైతు సంఘం, ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. అనంతరం ర్యాలీగా టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, అక్కడ ధర్నా చేసి, ఫిర్యాదు చేశారు. సొసైటీ భవనాన్ని దౌర్జన్యంగా కూల్చివేసి, అందులోని సామగ్రి, విలువైన డాక్యుమెంట్లు ఎత్తుకెళ్లిన వారిని అరెస్టు చేయాలని సీఐ కరీంకు ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందించారు. అనంతరం ఎమ్మెల్యే బాలకృష్ణ నివాసానికి కూడా వెళ్లారు. ఆయన లేకపోవడంతో పీఏలకు వినతి పత్రాలు అందజేశారు. 177 మంది రైతులు కలిసి నిరి్మంచుకున్న సొసైటీ భవనాన్ని కూల్చివేసి.. ఆ స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయతి్నంచిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. సీఎం బావమరిది బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్న హిందూపురంలోనే టీడీపీ నాయకులు ఇలా కబ్జాలకు పాల్పడుతున్నారంటే.. రాష్ట్రంలో ఇంకెన్ని కబ్జాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చునన్నారు. ‘సినిమాల్లో రైతుల కోసం పోరాడే బాలయ్యా.. నీ నియోజకవర్గంలోని రైతులను కాపాడు’ అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే బాలకృష్ణ చొరవ తీసుకొని కూల్చివేసిన భవనం స్థానంలో కొత్తది నిరి్మంచి, సదుపాయాలు కలి్పంచాలని డిమాండ్ చేశారు.పచ్చ నాయకులే కబ్జాలకు పాల్పడుతున్నారు పాడి రైతులందరం సొసైటీగా ఏర్పడి 30 ఏళ్ల క్రితం స్థలాన్ని కొని భవనం నిరి్మంచుకున్నాం. ఈ భవనం కేంద్రంగా చాలాకాలం పాల వ్యాపారం చేసుకొన్నాం. తర్వాత వ్యాపారం దెబ్బతినడంతో సొసైటీని మూసేశాం. అయినా అందులో సామగ్రి, డాక్యుమెంట్లు ఉన్నాయి. ఇప్పుడా స్థలం విలువ రూ.కోట్లలో ఉండడంతో టీడీపీ నాయకులు కబ్జా చేయాలని చూస్తున్నారు. ఇటీవల నంజుడేశ్వర బిల్డింగ్లోనూ ఓ షాపును దౌర్జన్యంగా ఖాళీ చేయించారు. ఇలాంటివి బాలకృష్ణ నియోజకవర్గంలోనే జరగడం శోచనీయం. – చంద్రశేఖర్‌రెడ్డి, సొసైటీ సభ్యుడు, హిందూపురం -
ఎమ్మెల్యే బాలకృష్ణ ఇలాకాలో టీడీపీ నేతల బరితెగింపు
-
నూటికి తొంభై మార్కులు
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా నమస్కారం! నా పేరు డాక్టర్ ఇస్మాయిల్ పెనుకొండ. నేను పుట్టి పెరిగింది హిందూపురంలో. గత ఇరవై ఏళ్ళుగా అమెరికాలో, గత పదేళ్ళుగా టెక్సాస్‌లోని డాలస్ నగరంలో ఉంటున్నాం. వృత్తి రీత్యా అమెరికా ప్రభుత్వ వైద్యునిగా పని చేస్తున్నాను. నేను పుట్టి బుద్ధెరిగాక పట్టుకున్న మొదటి జెండా అన్నగారి ‘తెలుగుదేశం’ జెండానే! మా నాన్న హిందూపురంలో తెలుగుదేశం పార్టీ కోసం షామియానా వేసి, మైకుసెట్టు పెట్టి చేసిన ప్రచారం ఇంకా గుర్తుంది. అలాగే నేటికీ నలభై ఏళ్ళుగా గుండెల నిండా నింపుకున్న అభిమానంతో మెగాస్టార్ చిరంజీవి వీరాభిమానిని కూడా! గత జనవరిలో నేను అనంతపురం వచ్చాను. అంతకు ముందు నేను పనిచేసిన పాతూరు ప్రభుత్వాసుపత్రిని సి.డి. ఆసుపత్రి అనేవారు. నేను పనిచేసినప్పుడు కానీ,గత రెండేళ్ళ వరకూ కానీ అది ఒక పాడుపడిన వందేళ్ళ నాటి పెంకుటిల్లులాంటి భవనంలో ఉండేది. రెండేళ్ళ క్రితం కొన్ని కోట్ల రూపాయల ఖర్చుతో రూపొందించిన ఒక నూతన భవనంలో నడుస్తోంది. ఐదారు మంది డాక్టర్లు, పాతికమంది వరకూ ఇతర ఉద్యోగులతో మంచి వైద్యకేంద్రంగా రూపొందింది. ఆ ఆసుపత్రిని ఇలా చూడడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. మరో ముఖ్యమైన అంశం ప్రభుత్వ విద్య. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని వచ్చినవాళ్ళం... ఏదో కొంత మంది మాత్రమే ఉన్న కొద్ది వనరులను ఉపయోగించుకొని జీవితంలో ఓ స్థాయికి చేరాము. అలా సార్వజనీనమైన అవకాశాలను అందిపుచ్చుకొని అందరూ అదే రకమైన విజయాన్ని అందుకోలేక పోయారు. అలాంటిది, ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు జరుగుతున్న విద్యాబోధన, తెలుగుతో పాటు ఆంగ్లమాధ్యమంలో చదివించడం, చిన్న తనం నుంచే డిజిటల్ మీడియాతో వాళ్ళకు విద్యను బోధించడం చాలాచోట్ల చూసి ఆశ్చర్యపోయాను. అలాగే నీటైన యూనిఫాం, బ్యాగులు, పుస్తకాలు, కాళ్లకు షూస్‌తో సహా వాళ్లకు అందించి పిల్లలలో ఆ వయస్సు నుంచే ఒక ఆత్మ విశ్వాసాన్ని, స్థైర్యాన్ని పెంచి వారి వ్యక్తిత్వానికి మంచి పునాదులు పడేలా చేసింది. అభివృద్ధి అనేదానికి – పెద్ద నగరాల్లో ఓ పెద్ద ఐకియా స్టోర్, ఎంజాయ్ చేయడానికి పబ్బులు, పెద్ద పెద్ద బిల్డింగులు, విశాలమైన రోడ్లు – ఇవి మాత్రమే సూచికలు కాకూడదు. అభివృద్ధికి ఒక సూచిక ఏమిటంటే దారిద్య్ర రేఖ దిగువన ఉన్న ప్రజలు ఎంతవరకూ బాగుపడ్డారు? అది గత ఐదేళ్ళలో చూసుకుంటే సగటు ఆటోరిక్షా నడిపే కార్మికుడు, అరటికాయలు అమ్మి పొట్టపోసుకునే కార్మికురాలు, రోడ్డుసైడు మెకానిక్కు, ఒక సన్నకారు రైతు – వీళ్ళకు కనీస భరోసా లభిస్తోంది. ‘మా పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోంది, మాకు రోగమొస్తే ప్రభుత్వ ప్రాథమిక వైద్యకేంద్రాల్లో కనీస వైద్యం అందుతుంది, నాకు క్యాన్సర్ వచ్చినా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్యం దొరుకుతుంది’ అన్న భరోసా గత ఐదేళ్ళలో దొరికింది. మొన్ననే ధర్మవరంలో జిలేబీలు అమ్ముకునే కార్మికురాలి కూతురుకి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ అవసరం పడింది. దీనిపై నేనొక చిన్న ట్వీట్ పెడితే, సీఎంవోలో డా.హరికృష్ణారెడ్డి గారు స్పందించి రూ.20 లక్షల విలువైన వైద్యాన్ని ఉచితంగా అందించే ఏర్పాటు చేశారు. ఇలాంటి ఎన్నో ఉదాహరణలు నాకు తెలిసే ఉన్నాయి.2019 మేలో జగన్మోహన్రెడ్డి ఎన్నికలలో ఘన విజయం సాధించినప్పుడు నేను సామాజిక మాధ్యమాల్లో ‘మీ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యాలుగా ‘‘విద్య’ – ‘వైద్యా’లను ఎన్నుకొని, వాటి రూపురేఖల్ని సమూలంగా మారుస్తూ ప్రజలకు అందుబాటులోనికి తేవాలని’ కోరాను. ఈనాడు ప్రభుత్వం ఆ ముఖ్యమైన రెండు విషయాల్లోనూ చాలా సమర్థంగా పనిచేసిందని ప్రత్యక్షంగా గమనించాను. ‘పల్లెటూళ్ళే పట్టుగొమ్మలని’ మహాత్మాగాంధీ గారన్నారు. పల్లెల్లో అత్యంత దారుణమైన స్థితిలో ఉన్న దరిద్రనారాయణుడికి చేసే సేవే నిజమైన సేవ అని ఆయన భావించారు. అలా ప్రస్తుత ప్రభుత్వంలో సామాన్యుడికి కనీస అవసరాలైనా తీరుతున్నాయని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పేదేమిటంటే – నేనేదైతే ప్రభుత్వ ప్రాధమ్యాలుగా ఉండాలని, ప్రజలకు మెరుగ్గా సేవ చేయాలని భావించానో అవి నెరవేరాయి. నాకు తెలిసిన కొద్దిమందికి కూడా ఎంతో కొంత మేలు జరిగింది కాబట్టే ఇలా ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఏతావతా, చెప్పొచ్చేదేమిటంటే – అటూ ఇటూ జరిగిన కొన్ని సంఘటనలు ఉన్నా, విద్య–వైద్య పరంగా స్థూలంగా నేను ఈ ప్రభుత్వానికి వందకు 80–90 మార్కులు వేయ గలుగుతాను.ధన్యవాదాలు, జైహింద్.డా‘‘ ఇస్మాయిల్ పెనుకొండ వ్యాసకర్త అమెరికాలో వైద్యుడు -
హిందూపూర్ లో నా మెజారిటీ ఎంతంటే..?
-
హిందూపురానికి బాలకృష్ణ చేసిందేమీ లేదు.. అందుకే ప్రజలు నాకు బ్రహ్మరథం పడుతున్నారు
-
సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..
-
హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ
-
ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటో చెప్పి చంద్రబాబు కళ్ళు తెరిపించిన జగన్
-
జగన్ ను కదలనివ్వని జనాభిమానం @హిందుపూర్
-
చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
-
వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి
-
ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్
-
కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం
-
హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు
-
కాసేపట్లో హిందుపూర్ కి సీఎం జగన్ ఇప్పటికే అశేష జన ప్రవాహం
-
హిందూపురం అభివృద్ధిపై ప్రజలు ఏమంటున్నారు ?
-
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై.. టీడీపీ నేతల దాడి
-
మహిళల శక్తి.. ఈ ముగ్గురికి మూడినట్టే
-
సీఎం జగన్ కు జీవితాంతం రుణపడి ఉంటాం
-
నేను లోకల్.. సీఎం జగన్ పేదల పక్షపాతి
-
హిందూపురంలో బాలకృష్ణను ఓడిస్తాం: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: హిందూపురంలో బాలకృష్ణ రెండుసార్లు గెలిచినా అభివృద్ధి చేయలేకపోయారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. హిందూపురం నియోజకవర్గం మానెంపల్లి గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం జగన్ పాలనలో జనం సంతోషంగా ఉన్నారని, చంద్రబాబు ఎన్నికల హామీలు నెరవేర్చలేదన్నారు. ‘‘99 శాతం లబ్ధిదారులకు పథకాలు అందజేశాం. సీఎం జగన్ వెనుకబడిన వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. కురుబ సామాజిక వర్గానికి చెందిన దీపిక హిందూపురం అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారు. హిందూపురం పార్లమెంటు నుంచి బోయ-వాల్మికి సామాజిక వర్గానికి చెందిన శాంత బరిలో ఉంటారు. వెనుకబడిన వర్గాలకు చెందిన ఇద్దరు మహిళలకు ఒకే చోట గతంలో ఏ పార్టీ అవకాశం ఇవ్వలేదు. కుప్పంలో చంద్రబాబు, హిందూపురంలో బాలకృష్ణను కచ్చితంగా ఓడిస్తామని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. ‘‘టిక్కెట్ల కేటాయింపులో ఉన్న కొంత అసంతృప్తి ని త్వరలోనే అధిగమిస్తాం. టీడీపీ- జనసేన తరపున ఎవరు పోటీ చేస్తారో ఇప్పటిదాకా స్పష్టత లేదు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయింది. ఓట్లు చీల్చేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. ఈ కుట్రలు అధిగమిస్తాం. ఎన్నికల్లో సచివాలయ సిబ్బంది ని ఉపయోగించటం లేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు అవగాహన లేక ఈసీకి ఫిర్యాదు చేశారు. నిజమైన రాయలసీమ ద్రోహి చంద్రబాబే’’ అని మంత్రి పెద్దిరెడ్డి దుయ్యబట్టారు. ఇదీ చదవండి: బ్రో.. ఇది దొంగ ఓటు! -
ప్రజల ఉత్సాహం చూస్తుంటే ఖచ్చితంగా వైఎస్ జగన్ మళ్ళీ సీఎం అవుతారు: పెద్దిరెడ్డి
-
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కు చేదు అనుభవం
-
బాలయ్యా.. పిచ్చివేషాలు మానుకో..
హిందూపురం టౌన్: ‘బాలయ్యా.. పిచ్చి వేషాలు మానుకో... మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించడం, నీచంగా మాట్లాడడం వంటి పిచ్చివేషాలు వేస్తే మహిళలే నిన్ను తరిమికొట్టడం ఖాయం..’అని హిందూపురం ఎమ్మెల్యే, సినీహీరో నందమూరి బాలకృష్ణను వైఎస్సార్సీపీ హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక హెచ్చరించారు. మహిళలు, తోటి నటీమణుల పట్ల బాలకృష్ణ అసభ్యకరంగా వ్యవహరించడం, అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం హిందూపురంలో మహిళలు ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహం నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు సాగిన ర్యాలీలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని బాలకృష్ణ డౌన్ డౌన్.. బాలకృష్ణ గో బ్యాక్.. సైకో బాలకృష్ణ... అని నినాదాలు చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాలకృష్ణ పోస్టరును చెప్పులతో కొడుతూ దహనం చేశారు. ఈ సందర్భంగా దీపిక మాట్లాడుతూ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అని చెప్పుకోవడానికి కూడా ఇక్కడి మహిళలు సిగ్గుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బాలకృష్ణ సంస్కారం లేకుండా తోటి సినీనటి విచిత్రతో ఎలా అసభ్యంగా ప్రవర్తించారో ఆమె నోటితోనే విన్నామని చెప్పారు. ఓ సినీ ఫంక్షన్లోనూ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు. ఇలాంటి సైకో ఆలోచనలు ఉన్న వ్యక్తి ఎమ్మెల్యేగా అనర్హుడన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ మాట్లాడుతూ హిందూపురం సమస్యలపై ఏ రోజూ అసెంబ్లీలో మాట్లాడని బాలకృష్ణ.. మహిళలపై మాత్రం నీచంగా మాట్లాడడం, అసభ్యంగా ప్రవర్తించడం రివాజుగా మార్చుకున్నాడని విమర్శించారు. మహిళలకు బాలకృష్ణ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చదవండి: ఇదేమి పని ‘నారాయణా’ -
గుండు కొట్టించుకుంటే రూ.1000 ఇచ్చారు !..అడ్డంగా దొరికిన టీడీపీ నేతలు
-
ఫ్యాన్ ప్రభంజనం.. హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణకు ఎదురుదెబ్బ
సాక్షి, అనంతపురం జిల్లా: ఎన్నిక ఏదైనా, ఎప్పుడొచ్చినా వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టిస్తోంది. ఫ్యాన్ స్పీడ్‌కు ప్రత్యర్థులు నలవలేకపోతున్నారు. తాజాగా, పలు పంచాయితీలు, వార్డులకు జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులు విజయం సాధించారు. దీంతో వైఎస్సార్సీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణకు ఎదురుదెబ్బ తగిలింది. చలివెందుల పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారు విజయం సాధించారు. 337 ఓట్లతో సర్పంచ్‌గా ఉపేంద్రరెడ్డి గెలుపొందారు. తాడిపత్రిలో.. తాడిపత్రిలో జేసీ బ్రదర్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. జేసీ సొంత మండలం పెద్దపప్పూరులో టీడీపీ ఓటమి చెందింది. దేవునుప్పలపాడు పంచాయతీలో వైఎస్సార్ సీపీ మద్దతుదారు కాటమయ్య గెలుపొందారు.తాడిపత్రి నియోజకవర్గంలో ఐదు వార్డుల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారుల ఘన విజయం సాధించారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో జరిగిన పంచాయితీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఒక్కొక్కటిగా ఫలితాలు వెలువడుతున్నాయి. మెజార్టీ స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు.. బలపర్చిన అభ్యర్థులే జయకేతనం ఎగరేస్తున్నారు. మొత్తం 35 సర్పంచ్, 245 వార్డు మెంబర్ల స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. -
హిందూపూర్‌లో 350 ఎకరాల్లో టెక్స్టైల్ మరియు ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ కోసం పారిశ్రామికపార్క్ ఏర్పాటు
-
హిందూపురంలో వైఎస్సార్సీపీ జెండా ఎగరేద్దాం: దీపిక
హిందూపురం: వచ్చే ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీని అఖండ మెజార్టీతో గెలిపించి పార్టీ జెండా ఎగరేద్దామని నియోజకవర్గ సమన్వయకర్త దీపిక పిలుపునిచ్చారు. సమన్వయకర్తగా నియమితులయ్యాక తొలిసారిగా ఆదివారం హిందూపురం వచ్చిన ఆమెకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. తూమకుంట చెక్‌పోస్టు నుంచి హిందూపురం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక మెయిన్ బజారు గాంధీ సర్కిల్ వద్ద గజమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులనుద్దేశించి దీపిక మాట్లాడారు. ఎమ్మెల్యేగా గెలిచిన బాలకృష్ణ నియోజకవర్గ ప్రజల సమస్యలను గాలికొదిలేశారని విమర్శించారు. చుట్టపు చూపుగా వస్తూ వెళ్తూ ఓటరు తీర్పును అపహాస్యం చేస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. పార్టీ నాయకులు, ప్రజలకు రుణపడి ఉంటానని, హిందూపురం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. హిందూపురం సమన్వయకర్తగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ నాయకులందర్ని కలుపుకుని ముందుకు సాగుతానన్నారు. 2024 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపే ధ్యేయంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. వై నాట్ 175 అన్న జగనన్న నినాదాన్ని నిజం చేద్దామన్నారు. నాయకుల ఆప్యాయత, ఆశీర్వాదాలు ఎల్లవేళలా తనపై ఉండాలని కోరారు. త్వరలోనే పార్టీ నాయకులతో కలిసి ప్రజలతో మమేకమవుతానని తెలిపారు. సంక్షేమ పథకాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిద్దామన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా జగనన్న చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. అందరికీ సమన్యాయం చేయడం ఆయనతోనే సాధ్యమైందన్నారు. జగనన్న ఆశయాలకు అనుగుణంగా నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీ మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పక్షపాతి అన్నారు. మైనార్టీల సంక్షేమానికి 4 శాతం రిజర్వేషన్ కల్పించి వైఎస్సార్ ఎంతో మేలు చేశారని తెలిపారు. తండ్రిని మించి సీఎం వైఎస్ జగన్ పాలన సాగిస్తున్నారన్నారు. చంద్రబాబు మళ్లీ కళ్లబొల్లి మాటలు చెబుతూ ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆయన్ను నమ్మరాదని సూచించారు. రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాల్లో పవన్ కల్యాణ్‌కు ఒక్కటి కూడా లేవని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే బాలకృష్ణకు హిందూపురం ప్రజల గురించి ఆలోచించే టైం లేదని ఎద్దేవా చేశారు. దీపికకు మనందరి మద్దతు అందిద్దామని పిలుపునిచ్చారు. మున్సిపల్ వైస్ చైర్మన్ బలరామిరెడ్డి, కౌన్సిలర్లు శివ, షాజియాలు మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలు కలసికట్టుగా ముందుకుపోదామన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి కొటిపి హనుమంతరెడ్డి, పెనుకొండ మాజీ సమన్వయకర్త నాగలూరు బాబురెడ్డి, కౌన్సిలర్లు మారుతిరెడ్డి, ఆసీఫ్, రామచంద్ర, గిరి, జయప్ప, పురశురాం, నాగేంద్రబాబు, రోషన్, పార్వతీ, నాగేంద్రమ్మ, రహమత్బీ, ఎంపీపీ పురుషోత్తంరెడ్డి, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు ఉపేంద్రరెడ్డి, నాగమణి, జనార్దన్‌రెడ్డి, లక్ష్మినారాయణ, మండల కన్వీనర్ నారాయణస్వామి, వైస్ ఎంపీపీ అంజన్‌రెడ్డి, జెడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి, నక్కలపల్లి శ్రీరామిరెడ్డి, సర్పంచ్‌లు శంకర్‌రెడ్డి, నాగరత్నమ్మ, నాయకులు డిష్ నాగరాజు, మహేష్, చంద్రశేఖర్, అబీబ్, ఆనంద్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, తిమ్మిరెడ్డి, పెద్ద ఎత్తున కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
ప్రేమిస్తున్నానంటూ వెంటపడి..పెళ్లి మాట ఎత్తగానే...
సాక్షి, హిందూపురం: ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి సర్వమూ దోచేసిన యువకుడు.. పెళ్లి మాట ఎత్తగానే ముఖం చాటేశాడంటూ ఓ యువతి నడిరోడ్డుపై ధర్నాకు దిగింది. బాధితురాలు తెలిపిన మేరకు.. హిందూపురం మండలానికి చెందిన ఓ యువతి అనంతపురం జిల్లా గుత్తిలోని ఓ కళాశాలలో ఎంబీఏ పూర్తి చేసింది. కళాశాలలో చదువుకుంటున్న సమయంలోనే కర్నూలు జిల్లా పెద్దకడుబూరు ప్రాంతానికి చెందిన గణేష్ పరిచయమయ్యాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. మూడేళ్ల పాటు తనతో పాటు తిప్పుకున్నాడు. ప్రస్తుతం దళితురాలిననే కారణం చూపి పెళ్లికి అంగీకరించడం లేదు. గణేష్ చేసిన మోసంపై ఇప్పటికే పోలీసు స్పందన కార్యక్రమంలో ఎస్పీని కలసి ఫిర్యాదు చేసింది. దీనిపై 20 రోజుల క్రితం హిందూపురం రూరల్ పోలీసులు పిలిపించుకుని విచారణ చేశారు. అయినా తనకు న్యాయం చేకూరలేదంటూ శనివారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద కేవీపీఎస్ నాయకులతో కలసి భైఠాయించి నిరసన వ్యక్తంచేసింది. తనకు న్యాయం జరిగే వరకూ పోరాడుతానని పేర్కొంది. కార్యక్రమంలో బాధితురాలితో పాటు తల్లి, కేవీపీఎస్ నాయకులు అన్నమయ్య, రమణ, రాము, జ్యోతమ్మ, మధు తదితరులు పాల్గొన్నారు. హిందూపురం రూరల్ సీఐ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. అబ్బాయిని పిలిపించి విచారిస్తే అతను ఒప్పుకోవడం లేదన్నారు. బాధితురాలు రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు. (చదవండి: అప్పు కట్టకుంటే.. జైలుశిక్ష ) -
పురం’పై వైఎస్సార్ సీపీ జెండా ఎగరాలి
హిందూపురం: ‘చౌళూరు రామకృష్ణారెడ్డికి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అంటే ఎనలేని గౌరవం. జగనన్న అంటే అపార అభిమానం. అందుకే కెనడాలో చదువుకున్న ఆయన, మంచి ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చారు. హిందూపురంలో వైఎస్సార్ సీపీ జెండా కట్టి పార్టీకి పునాదులు వేశారు. పురంలో వైఎస్సార్ సీపీ జెండా ఎగురవేయాలన్నదే ఆయన ఆశయం. అందువల్ల కార్యకర్తలంతా కలిసి 2024లో హిందూపురంలో వైఎస్సార్ సీపీ జెండా ఎగురవేసి ఆయనకు ఆత్మకుశాంతి కలిగించాలి’ అని చౌళూరు సతీమణి జ్యోత్స్న, సోదరి మధుమతి, బావ నాగభూషణంరెడ్డి, ఇతర కుటుంబసభ్యులు పిలుపునిచ్చారు. శుక్రవారం హిందూపురంలోని ఈడిగ ఫంక్షన్‌హాలులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రామకృష్ణారెడ్డి సంతాపసభ జరిగింది. ముందుగా రామకృష్ణారెడ్డి చిత్రపటానికి కుటుంబీకులతో పాటు ఏపీ ఆగ్రోస్ చైర్మన్ నవీన్ నిశ్చల్, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘని, మాజీ సమన్వయకర్త కొండూరు వేణుగోపాల్‌రెడ్డి పార్టీ ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులరి్పంచి, రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం రామకృష్ణారెడ్డి సతీమణి, సోదరి, ఇతర కుటుంబీకులు మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై తమకు పూర్తిగా నమ్మకం ఉందని, తప్పకుండా న్యాయం జరుగుతుందన్న దృఢ విశ్వాసం ఉందన్నారు. దోషులు ఎంతటివారైనా వారికి శిక్షపడాలన్నారు. ఐక్యంగా పోరాడదాం.. చౌళూరు హత్య కేసులో అనుమానాలు ఉన్నాయని ఏపీ అగ్రోస్ చైర్మన్ నవీన్ నిశ్చల్ అన్నారు. ఆయన ఇంటి ముందే చౌళూరును దారుణంగా హత్య చేశారంటే, హంతకుల వెనుక ఎవరో పెద్దలున్నారనిపిస్తోందన్నారు. హత్య కేసులోని అనుమానితుల్లో కొందరిని ఎందుకు అరెస్టు చేయడం లేదన్నారు. రామకృష్ణారెడ్డి ఏ ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చారో, ఎందుకోసం కష్టపడ్డారో దాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఇకపై పిడికిలి బిగించి అందరం ఒక్కటై రానున్న ఎన్నికల్లో పార్టీని గెలిపించినప్పుడే రామకృష్ణారెడ్డి ఆత్మకుశాంతి, నిజమైన నివాళి అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బలరామిరెడ్డి, ఎంపీపీ పురుషోత్తంరెడ్డి, రత్నమ్మ, మార్కెట్ యార్డు చైర్మన్ కొండూరు మల్లికార్జున, కౌన్సిలర్లు ఆసీఫ్‌వుల్లా, రామచంద్రా, షాజియా, డైరెక్టర్లు లక్ష్మీనారాయణ, జనార్దన్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు కొటిపి హనుమంతరెడ్డి, నాగరాజు, హబీబ్, చంద్ర, మహేశ్, దాదు, నక్కలపల్లి శ్రీరాములు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. (చదవండి: చౌళూరు కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది ) -
చౌళూరు హత్యకేసు దర్యాప్తు ముమ్మరం
హిందూపురం: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ మాజీ సమన్వయకర్త చౌళూరు రామకృష్ణారెడ్డి హత్యకేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఇప్పటికే నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలు హంతకుల కోసం వేట సాగిస్తున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు కర్ణాటకలోను గాలిస్తున్నాయి. హత్య జరిగిన ప్రదేశంలో అనుమానమున్న వస్తువులు, వేలిముద్రలను క్లూస్ టీం సేకరించింది. తనిఖీల్లో వేటకొడవలి పిడి కూడా దొరికింది. సంఘటన జరిగిన వెంటనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తాజాగా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. చౌళూరు గ్రామానికే చెందిన నేరచరిత్ర కలిగిన వరుణ్ అలియాస్ మంజు పాత్ర ఉందేమోనన్న కోణంలోను దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రామకృష్ణారెడ్డి హత్య జరిగినప్పటి నుంచి వరుణ్ అజ్ఞ్తాంలోకి వెళ్లిపోయాడు. రామకృష్ణారెడ్డి వ్యాపార, ఆర్థిక లావాదేవీలు, రాజకీయ విభేదాలు, ధాబా పునరుద్ధరణ విషయంలో తలెత్తిన సమస్యలు తదితర అంశాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇది సుపారీ హత్యనా అనే కోణంలోను దర్యాప్తు సాగిస్తున్నారు. ఇటీవల రామకృష్ణారెడ్డి రాజకీయంగానే కాకుండా బెంగళూరులో వ్యాపారపరంగాను కొంత బిజీగా ఉంటూ వచ్చారు. తన ధాబా వద్ద బార్ ఏర్పాటు చేసేందుకు పనులు చేపడుతున్నారు. ఈ విషయంలో ఆయనకు వరుణ్‌తో గొడవ జరిగిందని స్థానికులు చెబుతున్నారు. బార్ కూడా ప్రారంభిస్తే రామకృష్ణారెడ్డి ఆర్థికంగా మరింత బలంగా తయారవుతారన్న కక్షతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారా అనే విషయంపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. రామకృష్ణారెడ్డి కుటుంబసభ్యులు మాత్రం రాజకీయంగా వ్యతిరేకులే హత్యకు కారణమని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైతే స్పష్టమైన కారణాలేవీ తెలియడంలేదు. సమగ్ర దర్యాప్తు కొనసాగించి నిజాలు తేలుస్తామని పోలీసులు చెబుతున్నారు. రూరల్ సీఐ, ఎస్ఐలపై శాఖాపరమైన చర్యలు హిందూపురం అప్‌గ్రేడ్ రూరల్ పోలీసుస్టేషన్ సీఐ జి.టి.నాయుడు, ఎస్ఐ కరీంలను వీఆర్‌కు పంపుతూ ఎస్పీ రాహుల్‌దేవ్ సింగ్ ఉత్తర్వులిచ్చారు. చౌళూరు రామకృష్ణారెడ్డి తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు తెలిపినా రక్షణ కల్పించలేదన్న కారణంతో వీరిపై చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. విచారణాధికారిగా టూటౌన్ సీఐ వెంకటేశ్వర్లును నియమించారు. ఆయన రూరల్ స్టేషన్ ఇన్‌చార్జ్‌గాను వ్యవహరిస్తారు. -
సత్యసాయి జిల్లా : హిందూపురంలో వైఎస్ఆర్ సీపీ నేత హత్య
-
Sri Sathya Sai District: వైఎస్సార్సీపీ నేత దారుణ హత్య
హిందూపురం: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ మాజీ సమన్వయకర్త చౌళూరు రామకృష్ణారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు శనివారం రాత్రి చౌళూరు గ్రామంలోని ఆయన ఇంటి వద్ద వేట కొడవళ్లతో నరికి చంపారు. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. రామకృష్ణారెడ్డి ఏపీ సరిహద్దుల్లో కర్ణాటకలోని తన దాబా వద్ద శనివారం రాత్రి పని ముగించుకుని రాత్రి 9 గంటల సమయంలో కారులో ఇంటికి వచ్చారు. ఇంటి వద్ద కారు దిగుతున్న సమయంలో అప్పటికే మొఖానికి మాస్క్‌లు ధరించి కాపు కాచి ఉన్న ముగ్గురు నలుగురు ఒక్కసారిగా వేట కొడవళ్లతో దాడి చేశారు. తల, గొంతు, చేతులు, కాళ్లపై దారుణంగా నరికి పారిపోయారు. రామకృష్ణారెడ్డి అరుపులు విన్న స్థానికులు పరుగు పరుగున అక్కడికి వచ్చారు. ఇంటి ముందు పడి ఉన్న రామకృష్ణారెడ్డిని ఆయన కారులోనే హిందూపురం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారిం చారు. విషయం తెలుసుకున్న వన్‌టౌన్ సీఐ ఇస్మాయిల్, రూరల్ సీఐ జీటీ నాయుడు ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. రామకృష్ణారెడ్డి హత్య వార్త తెలుసుకున్న వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, చౌళూరు గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. చౌళూరు రామకృష్ణారెడ్డి వైఎస్సార్సీపీ పార్టీ ఆవిర్భావం నుంచి నియోజకవర్గంలో పార్టీ కోసం కృషి చేశారు. హిందూపురం మండలంలో మంచి పట్టు ఉన్న నాయకుడు. ఆయన భార్య, కుమారుడు ప్రస్తుతం బెంగళూరులో ఉన్నట్లు బంధువులు తెలిపారు. ఆయన మృతి సమాచారాన్ని వారికి అందించారు. ఆయన తల్లి, బంధువులు, గ్రామస్తుల నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. రామకృష్ణారెడ్డి హత్యను వైఎస్సార్సీపీ నేతలు, శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. హత్య విషయం తెలిసిన వెంటనే పార్టీ నేతలు, కార్యకర్తలు ఆస్పత్రికి చేరుకొన్నారు. దుండగులను వెంటనే పట్టుకోవాలి: ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ చౌళూరు రామకృష్ణారెడ్డి దారుణ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ చెప్పారు. వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు దారుణ హత్యకు గురికావడం తీవ్ర దిగ్బ్రాంతి కలిగించిందన్నారు. ఆయన పార్టీ కోసం చేసిన సేవలు మరవలేనివని, ఆయన లేని లోటు పూడ్చలేనిదని అన్నారు. హత్య విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్సీ రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ సింగ్‌తో ఫోన్లో మాట్లాడి ఈ హత్యకు పాల్పడిన దుండగులను వెంటనే పట్టుకోవాలని కోరారు. హత్యకు కారణాలపై సమగ్ర దర్యాప్తు జరిపి, దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హిందూపురం నియోజకవర్గంలో కక్ష సాధింపు హత్యల సంస్కృతి లేదని, ఈ ఘటనకు కారణమైన వారిని ఎంతటి వారైనా చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. -
లక్షల రూపాయలున్న బ్యాగు రైల్వే స్టేషన్లో మర్చిపోయాడు.. తిరిగి వచ్చేసరికి
హిందూపురం (సత్యసాయి జిల్లా): రూ. లక్షల డబ్బున్న బ్యాగును ఓ వ్యక్తి మరిచి వెళ్లిపోయాడు. కొంతసేపటి తర్వాత తేరుకుని మళ్లీ అక్కడకు చేరుకున్నాడు. బ్యాగు కనిపించకపోవడంతో లబోదిబోమంటూ రైల్వే పోలీసులను ఆశ్రయించగా, బ్యాగును తిరిగి ఆయనకు అప్పగించారు. ఆర్పీఎఫ్ ఎస్ఐ కెంపరాజు తెలిపిన మేరకు.. గుజరాత్ రాష్ట్రం సూరత్ పట్టణానికి చెందిన బిపిన్ చంద్ర చంపక్ లాల్ జరీవాలా హిందూపురం పట్టణంలోని పట్టుచీరల వ్యాపారులతో జరీ వ్యాపారం చేసేవాడు. వ్యాపార లావాదేవీల నిమిత్తం రెండు రోజుల క్రితం హిందూపురం వచ్చాడు. (చదవండి: హనీ ట్రాప్.. యువకులకు యువతి వల.. వీడియో కాల్స్ రికార్డ్ చేసి..) స్థానిక వ్యాపారుల ద్వారా రూ.6,15,900 సేకరించాడు. తిరిగి వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకున్న బిపిన్ చంద్ర.. ఇంకా పని పూర్తి కాకపోవడంతో దాన్ని రద్దు చేసుకునేందుకు శనివారం స్థానిక రైల్వేస్టేషన్‌కు వచ్చాడు. వెంట తెచ్చుకున్న బ్యాగును అక్కడే మర్చిపోయి హడావుడిగా వెళ్లిపోయాడు. బ్యాగును గుర్తించిన స్టేషన్ సిబ్బంది శ్రీకాంత్‌దాస్, రామచంద్ర ఆర్పీఎఫ్ పోలీసుస్టేషన్లో అప్పగించారు. ఈ క్రమంలోనే అక్కడికి చేరుకున్న బిపిన్ చంద్ర రైల్వే పోలీసులతో గోడు వెళ్లబోసు కున్నాడు. అతడి వద్ద వివరాలు, బిల్లులను పరిశీలించిన పోలీసులు డబ్బున్న బ్యాగును తిరిగి అప్పగించేశారు. (చదవండి: విషాదం.. డ్రైనేజీ శుభ్రం చేసేందుకు దిగి ముగ్గురు మృతి) -
బాలయ్యా... గుర్తున్నామా!
సాక్షి, పుట్టపర్తి: హిందూపురం నియోజకవర్గం...టీడీపీకి అండగా ఉన్న ప్రాంతం. నందమూరి తారక రామారావుతో పాటు ఆయన తనయులు హరికృష్ణ, బాలకృష్ణ హిందూపురం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. నందమూరి బాలకృష్ణ హిందూపురంలో రెండోసారి విజయం సాధించి ప్రస్తుత అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే తమను ఇంతలా ఆదరిస్తున్న హిందూపురం వాసుల గురించి మాత్రం బాలయ్య పట్టించుకోవడం లేదు. సినిమా షూటింగుల్లో బిజీగా ఉంటూ నియోజకవర్గానికి చుట్టపుచూపుగా వచ్చి వెళ్తున్నారు. గత 8 నెలల కాలంలో బాలకృష్ణ ఒకట్రెండు సార్లు మాత్రమే హిందూపురంలో కనిపించారు. అది కూడా గృహ ప్రవేశాలు, వివాహాల్లో హాజరయ్యేందుకు వచ్చారు. అంతేకానీ ప్రజలు ఎలా ఉన్నారు.. నమ్మి ఓట్లేసిన ప్రజల యోగ క్షేమాల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ నేపథ్యంలో రెండు రోజుల పర్యటన కోసం బాలకృష్ణ బుధవారం హిందూపురం వస్తుండగా...జనం ఇన్నాళ్లకు గుర్తొచ్చామా? అని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ హయాంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలపై అప్పటి సీఎం చంద్రబాబు వివక్ష చూపించారు. నిధులు విడుదల చేయకుండా ఇబ్బందులు పెట్టారు. అయితే ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం ప్రాంతాలు, కులాలు, మతాలు, పారీ్టలు చూడకుండా అందరికీ సంక్షేమ ఫలాలు అందేలా జనరంజక పాలన సాగిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతాల అభివృద్ధికీ నిధులు కేటాయిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఈ క్రమంలో హిందూపురం నుంచి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్నా.. ప్రభుత్వం ఈ ప్రాంతంపై ఎలాంటి వివక్ష చూపలేదు. అన్ని రకాల సంక్షేమ పథకాలు, అన్ని వర్గాల వారికి అందజేస్తున్నారు. దీనికి తోడు ప్రజలకు ఎలాంటి కష్టమొచ్చినా.. పార్టీ చూడకుండా.. ఎమ్మెల్సీ ఇక్బాల్ సాయం చేస్తున్నారు. దీంతో బాలకృష్ణతో జనానికి పనిలేకుండా పోయింది. గత ఆరు నెలల్లో బాలకృష్ణ ఇలా.... జనవరిలో ఓసారి కూడా హిందూపురం రాలేదు. ఫిబ్రవరి 3,4 తేదీల్లో హిందూపురం జిల్లా సాధన పేరుతో ధర్నా చేసేందుకు వచ్చారు. మార్చి 27వ తేదీన హిందూపురంలో ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏప్రిల్‌లో ఒక్కసారి కూడా హిందూపురం సందర్శించలేదు. మే 27వ తేదీన హిందూపురం విచ్చేసి ఓ వివాహానికి హాజరయ్యారు. జూన్ 2వ తేదీన హిందూపురంలో ఓ గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. జూలైలో హిందూపురంలో పర్యటించలేదు. తాజాగా 17, 18 తేదీల్లో పర్యటించేందుకు షెడ్యూల్ ఖరారు చేశారు. బాలకృష్ణ స్థానిక వ్యవహారాలన్నీ పీఏ (వ్యక్తిగత కార్యదర్శి)కి అప్పగించారు. వారు ఎలా చెబితే అలా డైలాగులు చెప్పేసి వెళ్లిపోతారు. కనీసం పార్టీ కార్యకర్తలెవరో కూడా తెలియని పరిస్థితి. ఎవరైనా అభిమానంతో దగ్గరకు పోయినా లాగి లెంపకాయ కొట్టడం అలవాటు చేసుకున్నారు. దీంతో ఆయన దగ్గరకు వెళ్లే సాహసం ఎవరూ చేయడం లేదు. పోనీ ఆయన పీఏలనైనా నమ్ముకుందామంటే... గత టీడీపీ హయాంలో అప్పటి పీఏ శేఖర్ పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం పీఏగా వ్యవహరిస్తున్న బాలాజీ హైటెక్ పద్ధతిలో జూదం ఆడుతూ పోలీసులకు గత మార్చి 21వ తేదీన పట్టుబడ్డాడు. ఇలా బాలకృష్ణ అందుబాటులో లేక, ఆయన పీఏలు పట్టించుకోకపోవడంతో జనం ఎమ్మెల్యే గురించే మరచిపోయారు. ఈ చిత్రంలో ఎమ్మెల్సీ ఇక్బాల్ పరామర్శిస్తున్న వ్యక్తి పేరు తిమ్మారెడ్డి. ఎన్టీఆర్ వీరాభిమాని. మొదటి నుంచీ టీడీపీలో క్రియాశీలక కార్యకర్త. గత ఏడాది తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారు. ఏళ్లుగా పారీ్టకి సేవ చేసినా టీడీపీ నేతలు గానీ, స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణగానీ తిమ్మారెడ్డి గురించి పట్టించుకోలేదు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఇక్బాల్ 2021 మే 5వ తేదీన తిమ్మారెడ్డి ఇంటికే వెళ్లి పరామర్శించారు. వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం చేశారు. అంతేకాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.2,70,000 మంజూరు చేయించారు. ప్రస్తుతం తిమ్మారెడ్డి ఆరోగ్యంగా ఉన్నారు. లేపాక్షికి చెందిన ఓ టీడీపీ కార్యకర్తకు ఇటీవల ఓ పెద్ద కష్టం వచ్చింది. సాయం కోసం బాలకృష్ణను సంప్రదించాలని చూడగా ఆయన అందుబాటులో లేరు. ఎమ్మెల్యే పీఏను కలిస్తే చీదరించుకున్నారు. ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తే తన పరిస్థితి ఇలా అయ్యిందని సదరు కార్యకర్త మనస్తాపం చెందారు. చివరకు విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ ఇక్బాల్ అతన్ని పిలిపించుకుని విషయం ఆరా తీశారు. అధికారులతో మాట్లాడి సదరు కార్యకర్తకు అండగా నిలిచారు. ...ఇలా టీడీపీ నాయకులు, కార్యకర్తలే కాదు. హిందూపురం వాసులంతా బాలయ్య అందుబాటులో లేక ఇబ్బంది పడ్డారు. అయితే అధికార వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పారీ్టలకు అతీతంగా పథకాలు అమలు చేయడంతో పాటు ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల అభివృద్ధికీ పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తుండటంతో జనంతో పాటు టీడీపీ నేతలూ ఇప్పుడు ఆ పార్టీ వెంట నడుస్తున్నారు. అందువల్లే హిందూపురం వాసులు కూడా బాలయ్యతో తమకేం పెద్దగా పనిలేదంటున్నారు. (చదవండి: వారంతా చంద్రబాబుతో చేతులు కలిపారు: ఎంపీ గోరంట్ల మాధవ్) -
అసైన్డ్ భూమిపై ‘పచ్చ’ గద్దలు.. కోట్లు దండుకున్న ‘తమ్ముళ్లు’
ఇది హిందూపురం 14వ వార్డు పరిధిలోని సడ్లపల్లి పొలం సర్వేనంబర్ 433/11లోని 2.17 ఎకరాల స్థలం. దీనికి 1957 ప్రాంతంలో నల్లోడు అనే వ్యక్తి పేరిట డీ పట్టా మంజూరైంది. ఇది ప్రస్తుతం పట్టణంలో కలిసిపోయింది. ప్రస్తుతం అక్కడ సెంటు రూ.10 లక్షలకు పైగా పలుకుతోంది. 2012లో ఈ భూమిపై కన్నేసిన టీడీపీ నేతలు... పత్రాలు పుట్టించారు. ప్లాట్లుగా వేసి సెంటు రూ.6 లక్షల చొప్పున 58 మందికి విక్రయించారు. కానీ నల్లోడు వంశీయులు తాతల కాలం నాటి తమ భూమికి అక్రమ పట్టా పుట్టించి అమ్ముకుని తమకు అన్యాయం చేశారని న్యాయపోరాటం చేస్తున్నారు. చదవండి: ఆ విషయంలో టీడీపీ ఎందుకు మౌనం దాల్చింది? హిందూపురం(శ్రీసత్యసాయి జిల్లా): భూమిలేని నిరుపేదలకు ప్రభుత్వం డీ–ఫారం పట్టా మంజూరు చేస్తుంది. పట్టా పొందిన వ్యక్తి, ఆ తర్వాత వారి వంశీయులు సదరు భూమిని సాగు చేసుకుని జీవనం సాగించవచ్చు. అంతేకానీ ఇతరులకు విక్రయించే వీలు లేదు. ఈ విషయాన్ని 1977 పీఓటీ యాక్ట్ స్పష్టంగా చెబుతోంది. కానీ హిందూపురంలో డీ–ఫారం పట్టా ఉన్న 2.17 ఎకరాల భూమి తెలుగు తమ్ముళ్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. కనీసం డీ–ఫారం పట్టా పొందిన వ్యక్తి వంశీయులకు కూడా తెలియకుండానే ఆ స్థలం ప్లాట్లుగా మారి ‘తమ్ముళ్ల’కు రూ. కోట్లు కురిపించింది. కొనుగోలు చేసినట్లు పత్రాలు సృష్టించి.. సడ్లపల్లి పొలం సర్వేనంబర్ 433/1లోని 26.84 ఎకరాలను 1957లో ప్రభుత్వం లేబర్ యూనియన్ అధ్యక్షుడు కదిరప్ప పేరిట డీ–ఫారం పట్టా ఇచ్చింది. అతను సంఘంలోని సభ్యులకు ఎకరా, రెండెకరాల చొప్పున కేటాయించి పట్టాలిప్పించాడు. ఈ క్రమంలో 433/11లో 2.17 ఎకరాల భూమిని దళితుడైన నల్లోడు పేరిట ప్రభుత్వం డీ–ఫారం పట్టా మంజూరు చేసింది. ఈ భూమిని 2012లో నల్లోడు వంశీయులైన కొల్లప్ప, పెద్దసింహప్ప, చిన్న నరసింహప్ప నుంచి తాము కొనుగోలు చేసినట్లు కృష్ణయ్య, కాంతమ్మ మరికొందరు పత్రాలు సృష్టించుకున్నారు. ఆ తర్వాత కృష్ణయ్య 2012లో టీడీపీ నాయకులు మంగేష్, పురుషోత్తంరెడ్డికి విక్రయించారు. రూ.కోట్లు పలికే భూమిని కన్వర్షన్ చేయకుండానే టీడీపీ నాయకుడు మంగేష్ ప్లాట్లు వేసి విక్రయాలు సాగించేశారు. సెంటు రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల చొప్పున 58 ప్లాట్లు విక్రయించారు. అసైన్డ్ ల్యాండ్ స్వాధీన ప్రక్రియలో భాగంగా బోర్డు పాతుతున్న రెవెన్యూ సిబ్బంది న్యాయం కోసం పోరాటం.. వాస్తవానికి ఆ భూమి పొందిన నల్లోడు అవివాహితుడు. అతను తన అన్న న్యాతప్పతో కలిసి ఉండేవాడు. అతని తదనంతరం ఈ భూమి వారసత్వంగా న్యాతప్ప కుమారులైన కొల్లప్ప తదితరులకు చెందాల్సి ఉంది. కానీ కొల్లప్పతో పాటు అతని అన్నదమ్ములు మృతి చెందిన తర్వాత వారి నుంచి ఆ భూమిని కొనుగోలు చేసినట్లు టీడీపీ నాయకులు పత్రాలు సృష్టించారు. దీనిపై కొల్లప్ప కుమారుడు సూరి అ«ధికారులకు ఫిర్యాదు చేశారు. తమ భూమికి కృష్ణయ్య, కాంతమ్మ, రమేష్ మరికొందరు పేరుతో పత్రాలు సృష్టించి టీడీపీ నాయకులు మంగేష్, పురుషోత్తంరెడ్డి పేరిట రిజిస్టర్ చేసుకున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని న్యాయ పోరాటం చేస్తున్నారు. మా భూమిని లాక్కున్నారు మా ముత్తాత కాలం నుంచి హక్కుగా వస్తున్న 2.17 ఎకరాల భూమిని టీడీపీ నేతలు కబ్జా చేశారు. తప్పుడు పత్రాలు సృష్టించుకుని ప్లాట్లుగా మార్చి విక్రయించారు. న్యాయం చేయాలని 2013 సంవత్సరం నుంచీ అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. కానీ అప్పటి అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో కబ్జా దారులు దర్జాగా లేఅవుట్‌వేసి స్థలాలు అమ్ముకుంటున్నారు. ఇప్పటికైనా మాకు న్యాయంచేసి ఆ భూమిని మా కుటుంబసభ్యులకు అప్పగించాలి. – సూరి, కొల్లప్ప కుమారుడు, హిందూపురం స్థలాన్ని స్వాధీనం చేసుకుంటున్నాం సర్వేనంబర్ 433/11లోని 2.17 ఎకరాలను అసైన్డ్ల్యాండ్గా గుర్తించాం. సాగుచేసుకుని జీవనం సాగించేందుకు గతంలో నల్లోడు అనే వ్యక్తికి డీపట్టా మంజూరైంది. ఆ తర్వాత వారి వంశీయులు ఎవరూ భూమిని సాగు చేయలేదు. ప్రస్తుతం పట్టణ నడిబొడ్డున ఉన్న ఆ స్థలానికి విలువ పెరిగింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం సంబంధిత వారికి రీజెండర్ నోటీసులు జారీ చేసి స్థలాన్ని స్వాదీనం చేసుకునే ప్రక్రియ ప్రారంభించాం. ఆ స్థలంలో ఎవరూ ప్రవేశించడానికి వీలులేదని బోర్డు నాటించాం. – శ్రీనివాసులు, తహసీల్దార్, హిందూపురం -
భార్య, అత్తపై కత్తితో దాడి
హిందూపురం: కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య, అత్తపై కత్తితో దాడి చేసిన ఘటన ఆదివారం హిందూపురంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. స్థానిక మోడల్ కాలనీకి చెందిన శ్రావణ్, గౌతమి దంపతులు. ఆరేళ్ల క్రితం వివాహమైన వీరికి నాలుగేళ్ల బాబు ఉన్నాడు. కొంత కాలంగా భార్య ప్రవర్తనపై అనుమానాలు పెంచుకున్న శ్రావణ్ తరచూ ఆమెతో గొడవపడేవాడు. ఈ విషయంగా పలుమార్లు పోలీసు స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నారు. కౌన్సెలింగ్‌తో దంపతుల మధ్య విభేదాలను పోలీసులు దూరం చేస్తూ వచ్చారు. అయినా భర్త ప్రవర్తనలో మార్పు రాలేదు. చివరకు దంపతులిద్దరూ విడాకుల కోసం న్యాయస్థానం మెట్టు ఎక్కారు. ఈ క్రమంలోనే తల్లి సుశీలమ్మ వద్దకు గౌతమి చేరుకుంది. ఆదివారం తన కొడుకును తనకిచ్చేయాలంటూ అత్తారింటికి వెళ్లి శ్రావణ్ గొడవపడ్డాడు. వాదన శ్రుతి మించడంతో తమ్ముడు నవీన్‌తో కలిసి కత్తితో శ్రావణ్ దాడి చేసి, పారిపోయాడు. ఘటనలో గౌతమి, ఆమె తల్లి సుశీలమ్మ గాయపడ్డారు. గాయపడ్డ ఇద్దరినీ బంధువులు ఆస్పత్రికి తరలించారు. ఘటనపై రెండో పట్టణ సీఐ సూర్యనారాయణ కేసు నమోదు చేశారు. (చదవండి: ఆడియో వైరల్: బండ బూతులు తిట్టుకున్న టీడీపీ నాయకులు ) -
ఇదేం సినిమా అనుకున్నావా? బాలకృష్ణ రాజీనామా ఇంకెప్పుడు?
హిందూపురం టౌన్(అనంతపురం జిల్లా): హిందూపురం జిల్లా కేంద్రం అంశాన్ని మూడు గంటల సినిమా అనుకున్నావా అంటూ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై రాజకీయ పార్టీల ఐక్యవేదిక నాయకులు మండిపడ్డారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో సోమవారం రాజకీయ పార్టీల ఐక్యవేదిక ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు శ్యామ్, శ్రీరాములు, శ్రీనివాసులు, మున్నా, రవి మాట్లాడుతూ 1983 నుంచి ఏకధాటిగా హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థులే ఎమ్మెల్యేగా గెలుస్తున్నారని తెలిపారు. ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ ఇలా నందమూరి వంశాన్నే హిందూపురం ప్రజలు గెలుపిస్తున్నా హిందూపురం ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. చదవండి: ఏబీ వెంకటేశ్వరరావుకు మెమో జారీ చేసిన ఏపీ ప్రభుత్వం హిందూపురం జిల్లా కోసం అవసరమైతే రాజీనామా చేస్తానన్న బాలకృష్ణ ఇంకెప్పుడు చేస్తారని, ఇంకెప్పుడు పోరాడతారని విమర్శించారు. బాలకృష్ణకు సినిమా షూటింగులు తప్ప ఏ మాత్రం హిందూపురం అభివృద్ధి పట్టలేదన్నారు. చుట్టపు చూపుగా తెలంగాణ నుంచి వచ్చి పోయే బాలకృష్ణకు హిందూపురం ప్రజల సమస్యలు ఏం తెలుస్తాయని ప్రశ్నించారు. ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఎన్టీఆర్, చంద్రబాబులు ఎందుకు హిందూపురాన్ని జిల్లా చేయలేకపోయారో చెప్పాలన్నారు. టీడీపీ పార్టీతో పాటు ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురానికి ద్రోహం చేసి ప్రజలను మోసగించారని విమర్శించారు. హిందూపురంలోని ప్రభుత్వ జిల్లా కార్యాలయాలను పుట్టపర్తికి తరలిస్తున్నారని, ఈ చర్యలను మానుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు నాగార్జున, మల్లికార్జున, నారాయణ, నాజీమ్ బాషా, హరికుమార్, కలీం, నూర్ మహమ్మద్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. -
అలా వచ్చారు.. ఇలా వెళ్లారు
హిందూపురం: ఎమ్మెల్యే బాలకృష్ణ ఆదివారం హైదరాబాద్ నుంచి హిందూపురం వచ్చారు. పట్టణంలోని ఓ ఫంక్షన్లో నిర్వహించిన టీడీపీ నాయకుడి కుమార్తె పెళ్లికి హాజరయ్యారు. భోజనం చేసిన తర్వాత సరాసరి హైదరాబాద్‌కు బయలు దేరి వెళ్లిపోయారు. ఏదైనా మాట్లాడతారేమోనని మీడియా సభ్యులంతా ఎదురు చూసినా ఎమ్మెల్యే బాలకృష్ణ మాత్రం ముఖం చాటేశారు. బయటపడ్డ విబేధాలు పెళ్లి కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటనలో టీడీపీలో ఉన్న వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఫంక్షన్ హాల్లోని ఓ గదిలో బాలయ్య భోజనం చేస్తున్నారు. ఇదే సమయంలో అక్కడున్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొర్లకుంట అంజినప్పతో పాటు పట్టణ అధ్యక్షుడు డీఈ రమేష్‌లను బయటకు వెళ్లిపోవాలని బాలకృష్ణ పర్సన్ పీఏ, కోఆర్డినేటర్ శ్రీనివాసరావు ఆదేశించారు. దీంతో వారు ఆయనపై రుసరుసలాడుతూ బయటకు వచ్చేశారు. అయితే ఫంక్షన్ హాల్ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యే బాలకృష్ణ బయటకు వచ్చి కారు ఎక్కారు. అదే సయమంలో శ్రీనివాసరావుపై టీడీపీ నాయకుడు కొల్లకుంట అంజి çనిప్పులు చెరిగారు. ‘నీవు వచ్చినప్పుటి నుంచే పార్టీ నాశనం అవుతోంది... బయట వారి పెత్తనం ఇక్కడేంటి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో శ్రీనివాసరావు, అంజిల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అక్కడ ఉన్న నాయకులు నాగరాజు, మరికొందరు శ్రీనివాసరావుకు సర్దిచెప్పి పక్కకు తీసుకెళ్లిపోయారు. తేదీ ఖరారు చేయండి.. రాజీమానా చేస్తా హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాలంటూ హైకోర్టులో వాజ్యం వేసినట్లు అఖిలపక్ష కన్వీనర్ బాలాజీ మనోహార్ ఎమ్మెల్యే బాలకృష్ణకు తెలిపారు. జిల్లా కేంద్రం కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు కదా ఆ విషయంపై స్పందించాలని కోరారు. అఖిలపక్షం నేతలు తేదీ ఖరారు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే బాలకృష్ణ చెప్పినట్లు బాలాజీ మనోహర్ తెలిపారు. -
రాజకీయ ఉనికి కోసమే బాలకృష్ణ మౌనదీక్ష: మంత్రి శంకర్‌నారాయణ
సాక్షి, అనంతపురం: రాజకీయ ఉనికి కోసమే బాలకృష్ణ మౌనదీక్ష చేస్తున్నారని మంత్రి శంకర్‌నారాయణ దుయ్యబట్టారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడానికే దీక్ష అంటూ మంత్రి నిప్పులు చెరిగారు. హిందూపురం అభివృద్ధికి బాలకృష్ణ ఏనాడు కృషి చేయలేదన్నారు. చదవండి: సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన ముద్రగడ హిందూపురానికి బాలకృష్ణ చుట్టపు చూపుగా వస్తారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు హిందూపురం అభివృద్ధి గుర్తులేదా? అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ విశిష్టతను గుర్తించిన ఘనత సీఎం వైఎస్ జగన్‌దేనని.. విజయవాడకు ఎన్టీఆర్ పేరు పెట్టి గౌరవించారని మంత్రి శంకర్‌నారాయణ అన్నారు. -
ఎక్కడయ్యా.... బుల్ బుల్ బాలయ్యా ?
-
కొడిగట్టిన నవ‘దీపం’
అనంతపూర్: ప్రమాదవశాత్తు నీటిలో పడిన బాలుడిని కాపాడబోయి ఓ పండుటాకు రాలిపోయింది. ఉజ్వల భవిష్యత్తు ఉన్న ‘నవదీపం’ కొడిగట్టకుండా ప్రాణాలకు తెగింన వృద్ధుడి సాహసమూ గంగ పాలైంది. పెన్నమ్మ ఒడిలో రెండు నిండు ప్రాణాలు శాశ్వతంగా నిద్రపోయాయి. చౌళరు శోకసంద్రమైంది. వివరాలు.. హిందూపురం మండలం చౌళరుకు చెందిన తలారి నరసింహప్ప కువరుడు నవదీప్ (10) స్థానిక ప్రాథమిక పాఠశాలలో నాల్గో తరగతి చదువుతున్నాడు. మంగళవారం సాయంత్రం పాఠశాల నుం ఇంటికి చేరుకున్న బాలుడు.. తోటి స్నేహితులతో కలిసి గ్రామ శివారులోని పెన్నానదిలో ఆడుకునేందుకు వెళ్లి ప్రమాదవశాత్తూ నీటి గుంతలో పడి పోయాడు. ఆ సమయంలో చిన్నారులు గట్టిగా కేకలు వేయడంతో అక్కడికి దగ్గరలోనే ఉన్న వృద్ధుడు నరసింహమూర్తి (65) అప్రమత్తమై వెంటనే నీటిలో దిగాడు. నీటిలోపల బాలుడి కోసం గాలిస్త ఊపిరి ఆడక అతను విగతజీవిగా మారాడు. అప్పటికే చిన్నారుల నుంచి సమాచారం అందుకున్న గ్రామస్తులు పెద్ద ఎత్తున పెన్నానదికి చేరుకుని నీటిలో గాలింపు చేపట్టారు. కాసేపటికి వృద్ధుడి మృతదేహం లభ్యమైంది. విషయం తెలుసుకున్న హిందూపురం రరల్ పోలీసులు, అగ్నివపక సిబ్బంది, గజ ఈతగాళ్లు అక్కడికి చేరుకుని నీటి గుంతలో గాలింపు చేపట్టారు. రాత్రి 7.30 గంటలకు బాలుడి మృతదేహాన్ని వెలికి తీశారు. ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు నెలకొన్నాయి. వృద్ధుడి సాహసం వృథా కావడంపై పలువురు కన్నీటి పర్యంతమయ్యారు. బాలుడి మృతదేహం కనిపించగానే కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. -
పెళ్లయిన నెలరోజులకే.. నవవధువు ఆత్మహత్య
సాక్షి, హిందూపురం: నవవధువు ఆత్మహత్య కలకలం రేపింది. అదనపు కట్నం కోసం మెట్టినింటి వారి నుంచి వేధింపులు పెరిగిపోవడంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడిందని పుట్టింటి వారు ఆరోపిస్తున్నారు. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు... హిందూపురం రైల్వే రోడ్డు ప్రాంతంలో నివాసముంటున్న వెంకటేష్, లక్ష్మిదేవి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు హిందూపురంలోనే వివాహం చేశారు. రెండో కుమార్తె పల్లవి(28)ని పామిడిలో ప్రైవేట్ టీచర్‌గా పనిచేస్తున్న మల్లికార్జునకు ఇచ్చి ఆగస్ట్ 27న పెళ్లి చేశారు. పెళ్లి సమయంలో కట్నం కింద రూ.లక్ష నగదు, మరో రూ.లక్ష విలువ చేసే బంగారు నగలు అందజేశారు. కోటి ఆశలతో మెట్టినింటికి వెళ్లిన పల్లవిని కొద్దిరోజులకే అదనపు కట్నం కోసం భర్త, అత్త వేధించడం మొదలు పెట్టారు. రోజురోజుకూ వేధింపులు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితం పల్లవిని భర్త హిందూపురం తీసుకొచ్చి వదిలి వెళ్లాడు. అదనపు కట్నం ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో మానసికంగా కుంగిపోయిన పల్లవి శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులు ఆస్పత్రికి వెళ్లాక ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. చదవండి: (మానసిక వికలాంగుడిపై లైంగిక దాడి) కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులకు పల్లవి విగతజీవిగా కనిపించింది. భర్త, అత్త వేధింపులు భరించలేకే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లిదండ్రులు లక్ష్మిదేవి, వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ శ్రీనివాసులు, డీఎస్పీ రమ్య, వన్‌టౌన్ సీఐ బాలమద్దిలేటి ఆస్పత్రికి వెళ్లి నవ వధువు మృతదేహాన్ని పరిశీలించారు. -
భారత క్రికెట్ జట్టు (దివ్యాంగుల) కెప్టెన్‌గా వసంతకుమార్
హిందూపురం టౌన్: టీమిండియా దివ్యాంగుల క్రికెట్ టీ-20 జట్టు కెప్టెన్‌గా హిందూపురానికి చెందిన వై.వసంతకుమార్ ఎంపికయ్యాడు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన బోర్డ్ ఆఫ్ డిజేబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ (బీడీసీఏ) సమావేశంలో సెప్టెంబర్‌లో దేశంలోని వివిధ స్టేడియాల్లో జరగనున్న ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ టెస్ట్, వన్డే, టీ-20 క్రికెట్ టోరీ్నలకు సంబంధించి జట్లను ప్రకటించారు. మూడు ఫార్మెట్లలోనూ వసంత కుమార్‌కు ప్రాతిని«ధ్యం దక్కింది. అలాగే టీ-20 జట్టు కెపె్టన్‌గా ఎంపికయ్యాడు. -
నాకు అప్పగించిన పదవికి వన్నెతెచ్చేలా పనిచేస్తా : మహాలక్ష్మి శ్రీనివాస్
-
విషాదం: రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య
సాక్షి, అనంతపురం: హిందూపురంలో విషాదం చోటుచేసుకుంది. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను లేపాక్షి మండలం కోడిపల్లికి చెందిన దంపతులు గిరిష్, స్వాతిగా గుర్తించారు. పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
చంద్రబాబు ఆదేశాలను ధిక్కరించిన టీడీపీ నేతలు
-
హిజ్రాతో దోస్తీ, రూ.3 లక్షలు తీసుకుని దారుణం
హిందూపురం(అనంతపురం): పట్టణ సమీపంలోని కొట్నూరు జాతీయ రహదారిపై ట్రాన్స్‌జెండర్ నిహారిక (35) శుక్రవారం రాత్రి దారుణ హత్యకు గురైంది. హిందూపురం ఒకటో పట్టణ సీఐ బాలమద్దిలేటి సమాచారం మేరకు.. పరిగి మండలం యర్రగుంటపల్లి చెందిన ట్రాన్స్‌జెండర్ నిహారిక.. హిందూపురంలోని ఇందిరమ్మ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుని భిక్షాటనతో జీవనం సాగిస్తోంది. కొంత కాలంగా అదే గ్రామానికి చెందిన రాజశేఖర్ ఆమెతో చనువుగా ఉంటూ వచ్చాడు. ఈ క్రమంలోనే నిహారిక తాను దాచుకున్న రూ. 3లక్షలను రాజశేఖర్‌కు అందజేసింది. శుక్రవారం రాత్రి కొట్నూరు జాతీయ రహదారిపై రాజశేఖర్, నిహారిక కలిసి మద్యం సేవించి, ఘర్షణ పడ్డారు. ఆ సమయంలో కత్తితో నిహారిక గొంతును రాజశేఖర్ కోసేశాడు. అనంతరం మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు శనివారం ఉదయం ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు సీఐ బాలమద్దిలేటి తెలిపారు. చదవండి: ఘోరం: అందరూ చూస్తుండగానే... యువకుడి నగ్న వీడియోలు రికార్డు చేసి.. -
పోలింగ్ కేంద్రంలో బాలయ్య హంగామా
సాక్షి, హిందూపురం: ఓటేసేందుకు అనంతపురం జిల్లా హిందూపురం రెండో వార్డు చౌడేశ్వరీకాలనీలోని పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చిన బాలయ్య, ఆయన సతీమణి వసుంధరలు హంగామా చేశారు. క్యూలో నుంచుని ఓటర్లకు నమస్కారాలు చేస్తూ, నవ్వుతూ పలకరిస్తూ ఓటర్లను ప్రభావితం చేసేందుకు యత్నించారు. మీడియాకు ఫోజులిస్తూ అక్కడి ఓటర్లు, పోలీస్, పోలింగ్ సిబ్బందితో మాట్లాడటం గమనార్హం. ఓటు వేసి అక్కడి పోలింగ్ సిబ్బందిని పలకరించి వారితో ఫొటోలు దిగారు. చదవండి: (కార్యకర్త చెంప చెళ్లుమనిపించిన జేసీ) -
రాత్రి మందు తాగి.. పగలు ప్రజల్ని కొట్టడం
సాక్షి, అనంతపురం: టీడీపీ అభిమానిపై ఎమ్మెల్యే బాలకృష్ణ చేయి చేసుకోవడాన్ని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఖండించారు. శనివారం అనంతపురంలోని 25వ డివిజన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహాలక్ష్మి శ్రీనివాస్‌కు మద్దతుగా గోరంట్ల మాధవ్, అనంతపురం ఎంపీ తలారి రంగయ్య ప్రచారం నిర్వహించారు. ఎంపీ మాధవ్ మాట్లాడుతూ.. రాత్రి మందు తాగడం.. పగలు ప్రజలను కొట్టడం ఎమ్మెల్యే బాలకృష్ణకు మామూలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీకి ఓటేసిన పాపానికి అభిమానులు శిక్ష అనుభవించాలా అని ప్రశ్నించారు. చదవండి: (మరోసారి అభిమాని చెంప ఛెళ్లుమనిపించిన బాలయ్య) -
మరోసారి అభిమాని చెంప ఛెళ్లుమనిపించిన బాలయ్య
సాక్షి, హిందూపురం: అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ ఎప్పుడు ఎలా ఉంటాడోనని అభిమానులు, నాయకులు బెంబేలెత్తుతున్నారు. ఆయన పక్కన నిల్చోవాలన్నా వణికిపోతున్నారు. ఇప్పటికే ఆయన చేతిదెబ్బ రుచి చూసిన, బూతులు తిట్టించుకున్న వాళ్లు కోకొల్లలు. తాజాగా ఓ అభిమాన ఫొటోగ్రాఫర్ ఉత్సాహంతో ఫొటో తీయడంతో బాలయ్య అతని చెంప ఛెళ్లుమనిపించాడు. ఈ ఘటన శనివారం హిందూపురంలోని 9వ వార్డు లక్ష్మీపురంలో చోటు చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ప్రచారం నిర్వహిస్తున్న బాలకృష్ణ అభ్యర్థి ఇంట్లోకి వెళ్లగా.. స్థానికులు ఫొటోలు తీసుకుంటున్నారు. ఎండ వేడిమికి తోడు, ప్రచారంలో జనం కూడా పెద్దగా లేకపోవడంతో చిర్రెత్తిన బాలయ్య.. ఓ అభిమాని ఫొటో క్లిక్‌మనిపించడంతో సహనం కోల్పోయాడు. ఫొటోలు తీయవద్దు అన్నానా.. అంటూ చెంప మీద కొట్టారు. అభ్యర్థి కుటుంబసభ్యులు అందరినీ బయటకు పంపుతుండగా.. ‘ఏయ్ ఫొటో ఎరేజ్ చెయ్..’అంటూ మరోసారి అతనిపై చేయి చేసుకున్నాడు. ఎన్నికల సమయంలో వ్యతిరేకత వస్తుందని గ్రహించిన టీడీపీ నేతలు అతడిని సముదాయించి తిరిగి బాలకృష్ణతో ఫొటో తీయించి పంపడం కొసమెరుపు. చదవండి: కన్నెత్తి చూడని జనం.. బాలయ్య చిర్రుబుర్రు ఏయ్.. నవ్వకండి.. చిర్రెత్తిన బాలయ్య -
మరోసారి చెంప చెళ్లుమనిపించిన బాలయ్య
-
కన్నెత్తి చూడని జనం.. బాలయ్య చిర్రుబుర్రు
హిందూపురం(అనంతపురం జిల్లా): ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రచారానికి స్పందన కరువైంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రెండు రోజులుగా ఆయన హిందూపురంలోనే మకాం వేసి వీధుల వెంట తిరిగి ప్రచారం చేస్తున్నా జనం కన్నెత్తి చూడటం లేదు. శుక్రవారం బాలకృష్ణ పలు వీధుల్లో ప్రచార రథం ఎక్కి కలియతిరిగినా జనం లేకపోవడంతో రూట్‌మ్యాప్ సరిగా లేదని స్థానిక నేతలపై చిర్రుబుర్రులాడారు. బాలయ్య మానసిక స్థితి తెలిసిన సీనియర్ నాయకులు మనకెందుకులే అన్నట్లు దగ్గరకు వెళ్లకుండా జాగ్రత్తపడ్డారు. చదవండి: ఏయ్.. నవ్వకండి.. చిర్రెత్తిన బాలయ్య చంద్రబాబుకు భారీ షాక్.. గో బ్యాక్ అంటూ నిరసన -
ఏయ్.. నవ్వకండి.. చిర్రెత్తిన బాలయ్య
-
ఏయ్.. నవ్వకండి.. చిర్రెత్తిన బాలయ్య
హిందూపురం: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హిందూపురం వచ్చిన ఎమ్మెల్యే బాలకృష్ణ ఈ సారి టీడీపీ నాయకులపైనే తన దుడుకుతనాన్ని ప్రదర్శించారు. గురువారం సుగూరు ఆలయం వద్ద మీడియాతో మాట్లాడుతుండగా... ఆయన హావభావాలు చూసిన టీడీపీ నేతలతో పాటు ప్రజలు ఫక్కున నవ్వారు. దీనిపై బాలయ్య సీరియస్ అయ్యారు. బాలయ్య ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ‘యువత చెడిపోతున్నారు. చాలా పొద్దెక్కే వరకు పడుకోవడం.. రాత్రయితే బండ్లేసుకుని అదో రకంగా రోడ్లలో స్ట్రీట్ లైట్లు చూసుకుంటూ.. ఆ.. చుక్కలు లెక్కెడుతూ.. వీళ్లలా పోవడం ఏదో ఢీ కొట్టడం.. (ఈ సమయంలో ఆకాశంలో చూస్తూ చేతులు గాలిలో ఊపుతూ ఊగుతూ మాట్లాడడం చూసిన హిందూపురం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు బీకే పార్థసారథి, స్థానిక నేతలు, ప్రజలు ఫక్కున నవ్వారు). ఏయ్.. నవ్వకండి.. (బీకే పార్థసారథి వైపు వేలు చూపిస్తూ) ఇట్స్ ఏ సీరియస్ మ్యాటర్(సీరియస్ అంటూ టీడీసీ నేతలు కోరస్ పలికారు). నాకు తెలుసు.. చాలా మంది అలా తయారవుతున్నారు. సో.. జాగ్రత్తగా ఉండు(వేలు చూపిస్తూ) మనుషులు... మనుషులుగా చూస్తే.. లేదా విప్లవమే. నేనూ చాలా చదివాను. రిమ్యాగ్జన్స్, ఫ్రెంచ్ రెవల్యూషన్స్.. ఆ... ఇవన్నీ కూడా. అలాంటి పరిస్థితి తీసుకురావద్దు. ఏం జరిగిందో అప్పుడు రొట్టె చేతిలో పట్టుకుని వెళ్లి.. ప్యాలెస్.. హూ ఇజ్ ద సిక్సిటిన్త్.. ఆ... మహరాజునే బయటకు లాక్కొచ్చి.. తీసుకొచ్చి.. (తల నిలువుగా ఆడిస్తూ.. ) జాగ్రత్తగా ఉండండి. ఆ పరిస్థితి తీసుకురావద్దు. హెచ్చరిస్తున్నా.’’ చదవండి: ఎమ్మెల్యే బాలకృష్ణకు చేదు అనుభవం మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్‌కు బిగుస్తోన్న ఉచ్చు -
ఎమ్మెల్యే బాలకృష్ణకు చేదు అనుభవం
సాక్షి, అనంతపురం: హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణకు చేదు అనుభవం ఎదురైంది. బాలకృష్ణ చేపట్టిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో జనం లేక రోడ్ షో వెలవెలబోయింది. రోడ్ షోలకు ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో బాలయ్య అసహనానికి గురయ్యారు. పంచాయతీ ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే బాలకృష్ణకు ఘోర పరాభవం ఎదురైంది. హిందూపురం నియోజకవర్గంలో ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. హిందూపురంలోని 38 స్థానాల్లో 30 చోట్ల వైఎస్సార్ సీపీ మద్దతుదారుల విజయం సాధించిన సంగతి తెలిసిందే. చదవండి: మున్సిపాలిటీల్లోనూ పంచాయతీ ఫలితాలే.. టీడీపీ మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్‌కు ఎదురుదెబ్బ -
గంజాయి స్మగ్లింగ్ కేసులో హిందూపురం సీఐ!
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్ గంజాయి స్మగ్లింగ్ కేసులో హిందూపురం టూటౌన్ లా అండ్ ఆర్డర్ సీఐ శ్రీరామ్ పేరు బయటపడింది. అనంతపురం జిల్లా ఏఆర్ కానిస్టేబుల్ మోహన్ కృష్ణ ఉప్పల్ నల్ల చెరువు ప్రాంతంలో ఇటీవల రెండు కిలోల గంజాయితో పట్టుబడ్డాడు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ స్టిక్కర్ ఉన్న కారుతో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న మోహన్ కృష్ణతో పాటు మరో ఇద్దరిని ఉప్పల్ ఆబ్కారీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐ శ్రీరామ్ పాత్రపై విచారణ జరుపుతున్నామని ఆబ్కారీ పోలీసులు తెలిపారు. కానిస్టేబుల్ మోహన్ కృష్ణతో సీఐకి ఉన్న సంబంధాలపై ఆబ్కారీ ఆరా పోలీసులు ఆరా తీస్తున్నారు. కానిస్టేబుల్ మోహన్ కృష్ణని వారం రోజుల కస్టడీకి కోర్టు అనుమతి కోరారు. గతంలో సీఐ, కానిస్టేబుల్ కలిసి గంజాయి స్మగ్లింగ్ చేసినట్టు ఆరోపణలు రావడంతో.. సీఐ శ్రీరాంపై అనంతపురం రేంజ్ డీజీఐ బదిలీ వేటు వేశారు. -
అపరిమిత డేటా… 30 రోజులు ఉచితం
విజయవాడ : జియో ఫైబర్ తన హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలను ఆంధ్రప్రదేశ్ లో మరో మూడు పట్టణాలకు విస్తరించింది. తెనాలి, హిందూపూర్, బొబ్బిలి లలో ఈ సేవలను లాంఛనంగా ప్రారంభించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 26 పట్టణాల్లో జియో ఫైబర్ హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు అయ్యింది. ఇప్పటికే విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి, నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ, అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, ఏలూరు, ఒంగోలు, విజయనగరం, శ్రీకాకుళం తదితర పట్టణాల్లో వినియోగదారులు జియో ఫైబర్ సేవలను ఆస్వాదిస్తున్నారు. ఈ సందర్భంగా జియో ఆంధ్రప్రదేశ్ సీఈఓ మండపల్లి మహేష్ కుమార్ మాట్లాడుతూ, ‘మొబైల్ కనెక్టివిటీ పరంగా ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే జియో వేగంగా , విస్తృతంగా దూసుకువెళ్లి నెంబర్ వన్ ఆపరేటర్ గా నిలిచింది. ఇదే పరుగును బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ రంగంలో కూడా కొనసాగించి జియో ఫైబర్‌ను ఈ పట్టణాల్లో ప్రతీ ఇంటికి తీసుకెళ్లి, ఆ ఇంట్లో ప్రతీ ఒక్కరికీ డిజిటల్ ప్రపంచాన్ని పరిచయం చేయాలనుకుంటున్నాం’ అని అన్నారు. 'నయే ఇండియా కా నయా జోష్' పేరుతో జియో సరికొత్త ప్లాన్స్ ప్రకటించింది. ఈ ప్లాన్స్ రూ.399 నుంచి ప్రారంభమౌతాయి. అపరిమిత డేటా వాడుకోవచ్చు. అంతేకాదు... 150 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 30 రోజుల ఉచిత ట్రయల్ కూడా ఆఫర్ చేస్తోంది. 4కే సెట్ టాప్ బాక్స్ ఉచితం. కొత్త యూజర్లకు 10 ఓటీటీ యాప్స్ సబ్స్క్రిప్షన్ ఉచితం. 30 రోజుల ఫ్రీ ట్రయల్‌లో భాగంగా 10 ఓటీటీ యాప్స్ యాక్సెస్ చేయొచ్చు. వాయిస్ కాలింగ్ ఉచితం. ఒకవేళ 30 రోజుల్లో సర్వీస్ నచ్చకపోతే కనెక్షన్ వద్దని చెప్పొచ్చు. ఎలాంటి కండీషన్స్ ఉండవు. ఈ 30 రోజుల ఫ్రీ ట్రయల్ కొత్త కస్టమర్లకు మాత్రమే. ఇప్పటికే జియోఫైబర్ కస్టమర్లుగా ఉన్నవారికి కూడా లాయల్టీ బెనిఫిట్స్ లభిస్తాయి. కొత్త టారిఫ్ ప్లాన్స్ ప్రకారం ప్రస్తుత కస్టమర్లను అప్‌గ్రేడ్ చేసి ఆయా ప్రయోజనాలను అందిస్తారు. ఆసక్తిగల కస్టమర్లు ఇక్కడ తమను తాము నమోదు చేసుకోవచ్చు. https://www.jio.com/registration కొత్తగా ప్రకటించిన జియో ఫైబర్ 4 ప్లాన్ల వివరాలు ఇవిగో... Rs 399 Plan: జియోఫైబర్ రూ.399 ప్లాన్ తీసుకుంటే 30 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ ఉపయోగించొచ్చు. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. Rs 699 Plan: జియోఫైబర్ రూ.699 ప్లాన్ తీసుకుంటే 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ ఉపయోగించొచ్చు. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. Rs 999 Plan: జియోఫైబర్ రూ.999 ప్లాన్ తీసుకుంటే 150 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ ఉపయోగించొచ్చు. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రూ.1000 విలువైన 11 ఓటీటీ యాప్స్ సబ్స్క్రిప్షన్స్ ఉచితం. Rs 1499 Plan: జియోఫైబర్ రూ.1499 ప్లాన్ తీసుకుంటే 300 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ ఉపయోగించొచ్చు. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రూ.1500 విలువైన 12 ఓటీటీ యాప్స్ సబ్స్క్రిప్షన్స్ ఉచితం. -
ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య
కాళ్ల పారాణి ఆరకముందే అత్తింటి ఆరళ్లను మౌనంగా భరించాల్సి వచ్చింది. రోజులు గడుస్తున్నా మార్పు రాలేదు. చివరకు బిడ్డ పుట్టినా కఠిన హృదయాల్లో కనికరం లేకుండా పోయింది. దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఓ వివాహిత బుధవారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అత్తింటి వారే హత్య చేశారంటూ బాధిత కుటుంబసభ్యులు ఆరోపించడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హిందూపురం : మడకశిరకు చెందిన అర్షియా (26) కోటి ఆశలతో వైద్య విద్య కళాశాలలో విద్యార్థిగా చేరింది. మరో రెండేళ్లలో కోర్సుపూర్తి అవుతుందనుకుంటున్న తరుణంలో హిందూపురం ఆర్టీసీ కాలనీకి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి నూరుల్లా పెళ్లి సంబంధం వచ్చింది. మంచి సంబంధమని నమ్మిన అర్షియా తల్లిదండ్రులు 2019 నవంబర్‌లో నూరుల్లాకు అర్షియానిచ్చి పెళ్లి చేశారు. ఆ సమయంలో కట్నకానుకల కింద రూ.5 లక్షలు, అర కిలో బంగారు నగలు అందజేశారు. 30 రోజులు గడవకుండానే... వివాహనంతరం భవిష్యత్తును అందంగా ఊహించుకుంటూ అత్తారింటిలో అడుగుపెట్టిన అర్షియా అంచనాలు తలకిందులయ్యాయి. ప్రతి విషయంలోనూ భర్తతో పాటు అత్తింటి వారు ఆమెను అనుమానిస్తూ వచ్చారు. నెలదాటకుండానే ఆమె గర్భం దాల్చింది. దీంతో నూరుల్లాలో అనుమానాలు బలపడుతూ వచ్చాయి. ఆమెపై వేధింపులు తారస్థాయికి చేరుకున్నాయి. అదనపు కట్నం కావాలని, కారు, స్థిరాస్తులు రాయించుకురమ్మంటూ భార్యతో గొడవపడుతూ వచ్చేవాడు. పుట్టినరోజే... మంగళవారం అర్షియాకు తల్లిదండ్రులు ఫోన్ చేసి, ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే అప్పటికే ఏం జరిగిందో ఏమో.. ఆమె ఫోన్లో సక్రమంగా మాట్లాడలేదు. తర్వాత ఫోన్ చేస్తానంటూ పెట్టేసింది. బుధవారం ఉదయాన్ని హిందూపురంలోని నింకంపల్లిలో ఉండే బంధువులు ఫోన్ చేసి అర్షియా లేవడం లేదంటూ ఫోన్ చేయడంతో ఆమె తల్లిదండ్రులు, సోదరులు హుటాహుటిన హిందూపురానికి చేరుకున్నారు. మంచంపై నిర్జీవంగా పడిఉన్న అర్షియాను చూసి చలించిపోయారు. ఏం జరిగిందని నూరుల్లాను నిలదీశారు. ఇంటి పైకప్పుకు ఆమె ఉరి వేసుకుందని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇరు కుటుంబసభ్యుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వన్‌టౌన్ పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి, ఇంటికి తాళాలు వేశారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ వంశీధర్‌గౌడ్, తహసీల్దార్ శ్రీనివాసులు, సీఐ బాలమద్దిలేటి.. ఇంటిని పరిశీలించి, విచారణ చేశారు. మాకు న్యాయం చేయండి ‘మా కుమార్తెను అనుమానంతో వేధించారు. అదనపు కట్నం కోసమే చంపేశారు.. మాకు న్యాయం చేయండి.. మరో ఆడకూతురు బలి కాకుండా కాపాడండి’ అంటూ డీఎస్పీ, తహసీల్దార్ ఎదుట అర్షియా తల్లి అక్తర్‌జాన్, అన్న ఇమ్రాన్ కన్నీంటి పర్యంతమయ్యారు. పెళ్లియిన నెలకే అతను అసలు రూపం చూపించాడని ఆరోపించారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, న్యాయం చేకూరుస్తామంటూ బాధితులకు పోలీసులు భరోసానిచ్చారు. -
తండ్రిపై దాడి
-
ప్రేమికుడు మిస్, అతని తండ్రిపై దాడి
సాక్షి, అనంతపురం: హిందూపురంలోని మోడల్ కాలనీలో మంగళవారం ఉదయం దారుణం జరిగింది. చెల్లిని ప్రేమిస్తున్నాడన్న అక్కసుతో అమ్మాయి అన్న కిరాతకంగా ప్రవర్తించాడు. అబ్బాయి తండ్రిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. వివరాలు.. కుటుంబంతో కలిసి చాంద్ బాషా మోడల్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. మంగళవారం ఉదయం అజకర్, అతని స్నేహితుడితో కలిసి చాంద్ బాషా ఇంటిపైకొచ్చి ఘర్షణకు దిగాడు. తన చెల్లితో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్న నీ కొడుకు సైపుల్లాను అంతం చేస్తానని కత్తి చేతబట్టి బెదిరింపులకు దిగాడు. అయితే, ఒకరికొకరు ఇష్టపడుతున్నన్న యువతీయువకులకు పెళ్లి చేద్దామని చాంద్ బాషా నచ్చజెప్నే యత్నం చేయడంతో అజకర్ కోపంతో రగలిపోయాడు. అదే సమయంలో ఇంట్లో సైపుల్లా కూడా లేకపోవడంతో చాంద్ బాషాపై, తన స్నేహితుడితో కలిసి అజకర్ కత్తితో దాడికి దిగాడు. చాంద్ బాషా చేతులు, కాళ్లపై తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. (చదవండి: విషాదం: ప్రేమ జంట ఆత్మహత్య) -
రెచ్చిపోయిన మద్యం మాఫియా: ఎస్ఐపై దాడి
సాక్షి, అనంతపురం : హిందూపురంలో మద్యం మాఫియా రెచ్చిపోయింది. మద్యం అక్రమ విక్రయాలను అడ్డుకున్న ఎక్సైజ్ ఎస్సై సరోజతో సహా ముగ్గురు కానిస్టేబుళ్లపై మద్యం వ్యాపారులు దాడి చేశారు. కర్నాటక మద్యాన్ని అక్రమంగా విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఎస్సై సరోజ ముగ్గురు కానిస్టేబుళ్లతో బోయపేటకు వెళ్లారు. పోలీసులను చూసిన మద్యం మాఫియా వారిపై ఒక్కసారిగా దాడికి దిగారు. ఎస్సై సరోజ ఫోన్‌ను లాక్కుని దాడికి దిగారు. ఈ దాడిలో ఎస్సైతో సహా ముగ్గురు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ కేసులో బోయపేటకు చెందిన రామాంజి, లక్ష్మినారాయణలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
చేతులేత్తి మొక్కుతా.. వదిలేయండి: ఎంపీ మాధవ్
సాక్షి, హిందూపురం: ‘మీకు చేతులేత్తి మొక్కుతా.. ద్విచక్రవాహనాలను స్టేషన్లో ఎండ పెట్టకుండా వదిలేయండి’ అంటూ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ సీఐలు బాలమదిలేటి, మన్సూరుద్దీన్‌లతో అన్నారు. లాక్డౌన్ నిబంధనలు అతిక్రమించారంటూ పోలీసులు భారీ ఎత్తున వాహనాలను సీజ్ చేసి పోలీసుస్టేషన్లలో ఉంచారు. అవి ఎండకు ఎండి వానకు తడిసి చెడిపోయే స్థితికి చేరుకున్నాయి. దీనిపై సాక్షిలో కథనం కూడా ప్రచురితమైంది. చదవండి: దశలవారీ మద్యనిషేధంపై కసరత్తు షురూ.. ఈ క్రమంలో గురువారం స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో జరిగిన బియ్యం పంపిణీ కార్యక్రమానికి హాజరైన పోలీసు అధికారులతో ఎంపీ మాట్లాడారు. ఆయా వాహనదారులకు కోర్టు ద్వారా స్టేషన్ జరిమానాలు విధించి వదిలేయాలని కోరారు. ఎక్కువ రోజులు ఎండ పడితే పెట్రోల్ ఉన్న వాహనాల నుంచి మంటలు ఎగిసి.. బెంగళూరు నగరంలో జరిగినట్లుగా ప్రమాదం చోటుచేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. వాహనాదారులకు ఇబ్బంది కలగకుండా ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరించాలని ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ కూడా పోలీసులకు సూచించారు. చదవండి: 'ఆయన హయాంలో తట్ట మట్టి కూడా తీయలేదు' -
బాలయ్యా.. ఇదేందయ్యా!
సాక్షి, అమరావతి: విపత్కర పరిస్థితుల్లోనూ ‘పచ్చ’ నాయకులు తమ బుద్ధి చూపించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నాయకులు లాక్డౌన్ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ మాస్కులు, కూరగాయలు పంపిణీ పేరుతో యథేచ్ఛగా అందరి మధ్య తిరుగుతూ స్థానిక ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న సమయంలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. విజయవాడ టీడీపీ మేయర్ అభ్యర్థి, ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత లాక్డౌన్ అమల్లో ఉన్నా నిత్యం రైతుబజార్లు, మార్కెట్లు, ఇతర ప్రాంతాల్లో సంచరిస్తూ మాస్కుల పేరుతో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అనంతపురం జిల్లా హిందూపురంలో నిత్యావసర వస్తువుల బ్యాగులపై ఎమ్మెల్యే బాలకృష్ణ బొమ్మలు ముద్రించి పంచుతున్నారు. మచ్చుకు కొన్ని... విశాఖ టీడీపీ మేయర్ అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటున్న పీలా శ్రీనివాసరావు సరుకులు ఇస్తూ ఫొటోతో పాటు పాంప్లేట్ ఇస్తున్నారిలా.. చిత్తూరు జిల్లాలోని సత్యవేడు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి రాజశేఖర్ ఏకంగా చంద్రన్న కానుక సంచులు పంచుతున్నారిలా.. గుంటూరు జిల్లా గుజ్జనగండ్ల ప్రాంతంలో టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర పార్టీ కండువాలు, జెండాలతో ప్రచారం చేస్తున్నారిలా.. -
కరోనాతో హిందూపూర్ వాసి మృతి
సాక్షి, అనంతపురం : కరోనా మహమ్మారికి ఆంధ్రప్రదేశ్‌లో మరొకరు మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య రెండుకు చేరింది. అనంతపురం జిల్లా హిందుపురానికి చెందిన ముస్తాక్ ఖాన్ (56) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందారు. ఈ మేరకు వైద్యులు అతని మరణాన్ని ధృవీకరించారు. కాగా ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 164కి చేరింది. అలాగే పాజిటివ్ కేసులుగా నమోదైన వారిలో ఇప్పటి వరకు నలుగురు డిశ్చార్జ్ అయ్యారు. (ఏపీలో తొలి కరోనా మరణం) ఆ 16మందికి కరోనా లేదు కాగా ఢిల్లీలోని జమాత్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన 16మంది హిందూపూర్ వాసులకు కరోనా వైద్య పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ అని వచ్చినట్లు వైద్య అధికారులు తెలిపారు. వారందర్నీ ఇదివరకే క్వారంటైన్‌కు తరలించిన విషయం తెలిసిందే. వీరందరికి నెగిటివ్ రావడంతో పట్టణ ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా హిందూపురంలో ఓ మహిళకు పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ఆమె బంధువులు, ఆమెను కలిసిన 19మందికి కూడా వైద్య పరీక్షల కోసం నమూనాలను సేకరించి అనంతపురం పంపారు. వీరి ఫలితాలు తెలియాల్సి ఉంది. కాగా కృష్ణా జిల్లా విజయవాడలో తొలి కరోనా మరణం చోటు చేసుకుంది. ఢిల్లీ మత ప్రార్థనకు వెళ్లొచ్చిన యువకుడి నుంచి అతడి తండ్రికి కరోనా సోకడంతో ఆయన మృతి చెందిన విషయం తెలిసిందే. (ఏపీలో 164కు చేరిన కరోనా కేసులు) ఆ ఏడుగురికి కరోనా వైరస్ లేదు బత్తలపల్లి మండల కేంద్రం బత్తలపల్లికి చెందిన ఏడుగురు ముస్లిం మైనార్టీలు ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి రావడంతో కరోనా అనుమానిత లక్షణాలు ఉండచవ్చని క్వారంటైన్‌కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే వీరికి కోరనా వైరస్ సోకలేదని వైద్య పరీక్షల్లో తేలిందని తహసీల్దార్ ఖతిజిన్‌కుఫ్రా తెలిపారు. అయితే వీరు 15 రోజుల పాటు ఇంటిలోనే ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ బయట తిరగరాదని సూచించారు. -
హిందూపురంలో విచ్చలవిడి నిర్మాణాలు
హిందూపురం: ‘మా వార్డులో రోడ్లు వేయండి.. డ్రెయినేజీ మరమ్మతులు చేపట్టండి. తాగునీటి పైపులు వేయించండి’ అంటూ వేడుకుంటున్న ప్రజలకు హిందూపురం మున్సిపాలిటీ అధికారులు నుంచి ఒకేఒక్క సమాధానం ఎదురవుతోంది. అదే మున్సిపాలిటీలో నిధులు లేవు! జిల్లా కేంద్రం తర్వాత అదేస్థాయిలో గుర్తింపు పొందిన హిందూపురం మున్సిపాలిటీకి స్థానిక ఆదాయ వనరులు భారీగా ఉన్నా.. వాటి పరిరక్షణలో అధికారుల్లో చిత్తశుద్ధి లోపించింది. ఫలితంగా ప్రభుత్వం అందించే నిధులపైనే ఆధారపడి మున్సిపాలిటీ అభివృద్ధిని తిరోగమన దిశలో నడిపిస్తూ వచ్చారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి కొందరు.. మాముళ్ల మత్తులో మరికొందరు అధికారులు హిందూపురం మున్సిపాలిటీ అభివృద్ధిని తుంగలో తొక్కారు. మున్సిపాలిటీకి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న టౌన్ ప్లానింగ్ విభాగం ఈ విషయంలో అగ్రస్థానంలో నిలిచింది. కంటి ముందే అడ్డగోలు నిర్మాణాలు పట్టణ పురపాలక కార్యాలయం పక్కనే రోడ్డుకు ఇరువైపులా వరుసగా ప్రైవేట్ వ్యక్తులు అక్రమంగా వేసిన షెడ్లు మున్సిపల్ అధికారుల వైఫల్యాలను ఎత్తి చూపుతున్నాయి. ఈ షెడ్లులో ఒక్కొక్కటి రూ. 6 వేలు చొప్పున అద్దెకు ఇచ్చారు. పట్టణ నడిబొడ్డున రద్దీ ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి. రైల్వే రోడ్డు లోని పల్లా రెసిడెన్షీ ప్రాంతం, వీడీ రోడ్డులోనూ వరుసగా పూర్తిగా వాణిజ్య సముదాయాల షెడ్లు వెలిశాయి. ఈ ప్రాంతాల్లో రోజూ రూ. లక్షల్లో వ్యాపారాలు సాగుతుంటాయి. లక్ష్మీ థియేటర్, ఆర్టీసీ బస్టాండ్, పట్టుగూళ్ల మార్కెట్ రోడ్డు, రహమత్‌పురం రోడ్డు, బెంగళూరు రోడ్డు, ఆర్పీజీటీ రోడ్డు ఇలా చెప్పుకుంటూ పోతే పట్టణం మొత్తం ఎలాంటి అనుమతులు లేకుండా వేసిన షెడ్లు దర్శనమిస్తున్నాయి. రోడ్డు పోరంబోకు స్థలాలను ఆక్రమించుకుని షెడ్లు వేసిన ప్రైవేట్ వ్యక్తులు మున్సిపాలిటీకి ఎలాంటి పన్నులు చెల్లించడం లేదు. ఈ అక్రమాలపై మున్సిపల్ అధికారులు దృష్టిసారించలేకపోతున్నారు. వాణిజ్య సముదాయాల నిర్మాణాలతో ఆదాయానికి గండి గత ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వ హయాంలో పురం పరిస్థితులు పూర్తిగా క్షీణించిపోయాయి. పట్టణ టౌన్ ప్లానింగ్ విభాగంపై రాజకీయ నాయకులు పెత్తనం సాగిస్తూ వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు పోరంబోకు స్థలాలను సైతం ఆక్రమించుకుని విచ్ఛలవిడిగా వాణిజ్య సముదాయాల షెడ్లు వేసేశారు. నాలుగు వైపులా ఇనుప పట్టీలు ఏర్పాటు చేసి చుట్టూ రేకులు కప్పేసి గదులు గదులుగా దుకాణాలు సిద్ధం చేశారు. ఒక్కొదానికి నెలకు రూ. 5వేల నుంచి రూ. 15 వేల వరకూ అద్దెతో పాటు అడ్వాన్స్ కింద రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకూ వసూలు చేశారు. పట్టణం మొత్తం ఇలాంటి షెడ్లు కోకొల్లలుగా వెలిసాయి. వీటిలో ఏ ఒక్కదానికి టౌన్ ప్లానింగ్ అనుమతులు లేకపోవడం గమనార్హం. విచారణ అనంతరం చర్యలు చేపడతాం పట్టణంలో నిర్మించిన షెడ్లకు సంబంధించి కొన్నింటిపై పన్నులు వసూలు చేస్తున్నాం. మా దృష్టికి రాకుండా నిర్మాణమైన వాటిపై విచారణ చేపట్టి మున్సిపాల్టీకి చెల్లించాల్సిన అన్ని రకాల పన్నులను వారి నుంచి వసూలు చేస్తాం. పన్నులు చెల్లించని వాటిని తొలగింజేందుకు చర్యలు తీసుకుంటాం.– భవానీ ప్రసాద్,మున్సిపల్ కమిషనర్, హిందూపురం -
మనసున్న నేత ఇక్బాల్..
సాక్షి, హిందూపురం: వైఎస్సార్సీపీ నేత, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ మరోసారి తన మానవత్వం చాటుకున్నారు. పక్షవాతంతో బాధపడుతున్న టీడీపీ నాయకుడికి ఆపన్నహస్తం అందించారు. అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన టీడీపీ కార్యకర్త తిమ్మారెడ్డి. ఆయనకు పక్షవాతం రావడంతో 4 నెలలుగా మంచానికే పరిమితమయ్యాడు. విషయం తెలుసుకున్న ఇక్బాల్ ఆదివారం తిమ్మారెడ్డి ఇంటికెళ్లి ఆయన్ను పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. చికిత్సల కోసం ప్రభుత్వ పరంగా సాయం అందించేందుకు కృషి చేస్తానన్నారు. ఇక్బాల్ చొరవ చూసి టీడీపీ నేతలు ఆశ్చర్యపోయారు. రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే బాలకృష్ణ తిమ్మారెడ్డిని పరామర్శించి ఎలాంటి సాయం అందించకుండా వెళ్లారని పెదవి విరుస్తున్నారు. (చదవండి: ఎమ్మెల్యే బాలకృష్ణకు నిరసన సెగ) -
బాలకృష్ణ గోబ్యాక్ అంటూ నినాదాలు
-
బాలకృష్ణకు సెగ.. ‘గోబ్యాక్’ నినాదాలు
సాక్షి, హిందూపురం: సొంత నియోజకవర్గంలో సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు చేదు అనుభవం ఎదురైంది. అనంతపురం జిల్లా హిందూపురంలో బాలకృష్ణ కాన్వాయ్‌ను ప్రజాసంఘాల నేతలు గురువారం అడ్డుకున్నారు. అధికార వికేంద్రీకరణకు ఎందుకు అడ్డుపడుతున్నారంటూ వారు బాలకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమలో హైకోర్టును అడ్డుకుంటున్న బాలయ్య.. రాయలసీమ ద్రోహి అంటూ నినాదాలు చేశారు. బాలకృష్ణ గోబ్యాక్ అంటూ నినదించారు. -
సీఎం జగన్ కటౌట్‌పై పూలవర్షం
సాక్షి, అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను శనివారం రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు, వైఎస్సార్సీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. అన్ని చోట్ల కేక్‌లు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. జిల్లాలోని హిందూపురంలో వైఎస్సార్సీపీ శ్రేణులు జననేత సీఎం జగన్‌పై తమకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. నగరంలో ఏర్పాటు చేసిన 60 అడుగుల సీఎం వైఎస్ జగన్ కటౌట్‌పై హెలికాప్టర్ ద్వారా పులవర్షం కరిపించారు. అనంతరం భారీ కేకును కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అలాగే పేద విద్యార్థినీ, విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు. ఇదిలా ఉండగా బహుజన గాయకుడు ఏపూరి సోమన్న బృందంచే నిర్వహించిన హుషారు పాటల నృత్యలు ప్రజలను ఉత్తేజ పరిచాయి. హిందూపురం పార్లమెంట్ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు నవీన్ నిశ్చల్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
సీఎం జగన్ కటౌట్‌పై పూలవర్షం
-
పోలీసు బూట్లను ముద్దాడిన మాధవ్
-
జేసీకి కౌంటర్; మాధవ్ అనూహ్య చర్య
సాక్షి, అనంతపురం: పోలీసులపై టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీ వ్యాఖ్యలకు నిరసనగా పోలీసు బూట్లను స్వయంగా రుమాలుతో శుభ్రం చేసి మీడియా ముఖంగా పోలీసు బూట్లను ముద్దాడారు. పోలీసు అమరవీరుల త్యాగాలను గుర్తించుకోవాలని జేసీ దివాకర్‌రెడ్డికి హితవు పలికారు. ప్రజల ధన మాన ప్రాణాలను.. దేశ సమగ్రతను, సారభౌమాధికారాన్ని కాపాడే క్రమంలో అమరవీరులైన పోలీసు వీరుల బూట్లను ముద్దాడుతున్నానని ఎంపీ మాధవ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ట్రయిల్ వేస్తేనే ఎంపీ అయ్యా రాత్రనక, పగలనక ప్రజలకు, దేశానికి రక్షణ కల్పించే పోలీసులపై జేసీ దివాకర్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు చేయడం శోచనీయమని ధ్వజమెత్తారు. తాను పోలీసు అధికారిగా ఉండగా పోలీసులపై దివాకర్‌రెడ్డి చేసిన జుగుప్సాకరమైన వ్యాఖ్యలకు స్పందించి తాను మీసం తిప్పితే... ప్రజలు తనను పార్లమెంట్‌కు, జేసీని బజారు పంపించారని చురకలంటించారు. ‘నేను జస్ట్ ట్రయిల్ వేస్తేనే ఎంపీ అయ్యాను. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అయ్యే సత్తా ఉన్నప్పటికీ ఎంతో మంది పోలీసు వ్యవస్థలో పనిచేయాలన్న నిబద్ధతతో అక్కడ కొనసాగుతున్నారు. నేను జస్ట్ ట్రయిల్ చూపించాను. ట్రయిల్ చూపిస్తేనే నేను ఎంపీ అయ్యాను. ఈ విషయాన్ని జేసీ గుర్తించుకోవాల’ని మాధవ్ అన్నారు. జగన్ నన్ను మందలించారు పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జేసీ దివాకర్‌రెడ్డిని ఆయన పక్కనే ఉన్న చంద్రబాబు మందలించకపోడాన్ని ఎంపీ మాధవ్ తప్పుబట్టారు. పోలీసు వ్యవస్థను కించేపరిచేలా మాట్లాడిన జేసీని ఎందుకు వారించలేదని ప్రశ్నించారు. జేసీ మాటలు విని చంద్రబాబు నవ్వడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. కర్ణకఠోమైన వ్యాఖ్యలు విని ఎలా నవ్వగలిగారని నిలదీశారు. ఇటీవల కియో కంపెనీకి వెళ్లినప్పడు తనతో పాటు వచ్చిన అతిథిని కారులో కూర్చోబెట్టుకోవడం మరిచిపోవడంతో తనను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మందలించారని వెల్లడించారు. కాగా, జేసీ వ్యాఖ్యలను రాష్ట్ర, జిల్లాల పోలీసులు సంఘాలు తప్పుబట్టాయి. జేసీ దివాకర్‌రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని అనంతపురం జిల్లా పోలీస్ సంఘం (అడ్‌హక్ కమిటీ) డిమాండ్ చేసింది. (బూట్లు నాకే పోలీసులను పెట్టుకుంటా: జేసీ) -
రైల్వే ట్రాకుపై నాలుగు మృతదేహాలు
-
హిందూపురం రైలు పట్టాలపై మృతదేహాలు..
సాక్షి, అనంతపురం : అనంతపురం జిల్లా హిందూపురంలో తీవ్ర కలకలం చోటుచేసుకుంది. హిందూపురం-బెంగుళూరు వెళ్లే రైలు మార్గంలో పట్టాలపై మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. సమాచారాన్ని అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, మృతి చెందిన వారిలో ఒకరు గోళాపురంకు చెందిన ఆదినారాయణగా గుర్తించినట్లు తెలిపారు. ఈ ఘటన వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరు ముకుమ్మడిగా ఆత్మహత్య చేసుకున్నారా ? లేక ఎవరైనా చంపి రైలు పట్టాలపై పడేసి వెళ్లిపోయారా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా, ఈ ముగ్గురి మృతదేహాలు రైల్వేస్టేషన్‌కు కిలోమీటర్ దూరంలో పడి ఉన్నాయి. ఇదే రైలు మార్గంలో హిందూపురం పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో మరో వ్యక్తి మృతదేహం లభ్యమయినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
భర్తకు తెలియకుండా గర్భం.. దీంతో భయపడి..
సాక్షి, హిందూపురం: ప్రభుత్వాసుపత్రి బాత్రూంలో మృత శిశువు లభ్యం కావడం కలకలం రేపింది. కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన మహిళ చుట్టూ అల్లుకున్న ఈ కథ రోజంతా గందరగోళానికి తావిచ్చింది. ఒక్కసారిగా ఏం జరిగిందో తెలియని పరిస్థితి. పోలీసుల రాకతో చిక్కుముడి వీడింది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న మహిళ.. తీరా గర్భం దాల్చే సరికి భర్తకు భయపడి ఇలా వదిలించుకున్న తీరు చర్చనీయాంశంగా మారింది. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కేశవులు, సీఐ సుబ్రమణ్యం తెలిపిన వివరాలివీ.. పట్టణానికి సమీపంలోని సేవా మందిరానికి చెందిన ఆటో చంద్ర భార్య కమలమ్మ(32) శనివారం తెల్లవారుజామున కడుపునొప్పితో స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేరింది. డాక్టర్ రాక మునుపే బత్‌రూంకు వెళ్లిన ఆమె.. అరగంట తర్వాత రక్తపు మరకలున్న దుస్తులతో బయటకు వచ్చింది. అక్కడున్న సిబ్బంది ప్రశ్నిస్తే.. సమాధానం దాటవేసి అక్కడి నుంచి జారుకుంది. ఆ తర్వాత బాత్రూంలోకి వెళ్లిన సిబ్బంది ఓ కవర్లో చుట్టిపెట్టిన మృత శిశువును చూసి ఆందోళనకు లోనయ్యారు. వెంటనే విషయాన్ని సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కమలమ్మ ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. మొదట బుకాయించినా.. ఆ తర్వాత అసలు విషయాన్ని వివరించింది. భర్తకు భయపడి.. చంద్ర, కమలమ్మ దంపతులకు ఐదేళ్ల కుమారుడు సంతానం. అయితే ఏడాది క్రితం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నట్లు భర్తకు చెప్పింది. ఆ తర్వాత గర్భం దాల్చడంతో ఎక్కడ భర్త కోప్పడతాడోనని దాచిపెట్టింది. ఎట్టకేలకు విషయం తెలియడంతో తొలగించుకోవాలని భర్త తేల్చిచెప్పాడు. ఆ మేరకు పలు ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. నాటు వైద్యం కూడా తీసుకుంది. ఈ కోవలోనే స్కానింగ్ చేయించుకోగా బిడ్డకు అంగవైకల్యం ఉన్నట్లు వెల్లడైంది. ఇదే సమయంలో నెలలు నిండి కడుపునొప్పి రావడంతో శనివారం తెల్లవారుజామున ఆసుపత్రిలో చేరింది. అప్పటికే అబార్షన్‌కు ఇష్టారీతిన మందులు తీసుకోవడంతో బాత్రూంకు వెళ్లిన సమయంలో మృత శిశువుకు జన్మనిచ్చింది. జరిగిన పరిణామానికి భయపడిపోయిన కమలమ్మ బిడ్డను అక్కడే వదిలించుకుని వెళ్లిపోయింది. విచారణ అనంతరం పోలీసులు మృత శిశువును కమలమ్మ దంపతులకు అప్పగించారు. -
అహుడాలో ఆ ‘ఇద్దరు’
నగరంలోని బళ్లారి బైపాస్ సమీపంలో ఓ వ్యక్తి 16 సెంట్ల స్థలంలో భవన నిర్మాణం చేపట్టాలనుకున్నాడు. ఇందుకోసం అన్ని ధ్రువీకరణ పత్రాలు సమర్పించి అహుడా అనుమతులకు దరఖాస్తు చేసుకున్నాడు. ఐదు నెలలు గడుస్తున్నా... ఆ ఫైల్ ముందుకుసాగలేదు. అహుడాలోని ఇద్దరు అధికారులు ఉద్దేశ పూర్వకంగా ఏదో ఒక కొర్రీ వేస్తూ అనుమతులు ఇవ్వకుండా నాన్చుతున్నారు. ఇలా అహుడా పరిధిలోని వందల మంది నిర్మాణ అనుమతుల కోసం ఇబ్బందులు పడుతున్నారు. సాక్షి, అనంతపురం: అనంతపురం, హిందూపురం డెవలప్మెంట్ అథారిటీ (అహుడా)లో ఇద్దరు అధికారులు చక్రం తిప్పుతున్నారు. అనుమతుల కోసం కార్యాలయానికి వచ్చే నిర్మాణదారులను వేధిస్తున్నారు. నిర్మాణ అనుమతుల్లో కీలకంగా వ్యవహరించి ఓ అధికారి, మరో ఉద్యోగికి చేయితడపంతే ఫైల్ ముందుకుసాగని పరిస్థితి నెలకొంది. దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లో అనుమతులిస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నా..అది మాటలకే పరిమితమవుతోంది. అహుడా అనుమతులకు సంబంధించిన ఫైల్‌ను క్షణాల్లో షార్ట్‌ఫాల్ కింద రిటర్న్ చేస్తున్నారు. ఇదేమిటని నిర్మాణాదారులు ఆరా తీస్తే లైసెన్స్ ఇంజినీర్ సరిగా చేయలేని తమ ఆధ్వర్యంలో దరఖాస్తు చేసుకోండంటూ ‘ఆ ఇద్దరు’ నిర్మాణదారులను మభ్యపెడుతున్నారు. ఆ ఇద్దరు ఉద్యోగుల ద్వారా అనుమతులకు దరఖాస్తు చేసుకున్న ఫైళ్లు చకచకా పరుగులు పెడుతున్నాయి. కాసులిస్తేనే పని అహుడాలోని ఆ ఇద్దరు ఉద్యోగులకు చేయితడపంతే ఫైల్ ముందుకుసాగదని కొందరు నిర్మాణదారులు, లైసెన్స్ ఇంజినీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అహుడా అనుమతుల కోసం వెళ్తే లైసెన్స్ ఇంజినీర్ సరైన సమాచారాన్ని పొందుపర్చలేదని ఓ అధికారి చెబుతారు. అంతలోనే మరో ఉద్యోగి కల్పించుకుని తమకు చెందిన ఓ లైసెన్స్ ఇంజినీర్(హిందూపురం) ఉన్నారని... ఆయనే అన్నీ చూసుకుంటారని నిర్మాణదారులకు చెబుతారు. దీంతో నిర్మాణదారులు గత్యంతరం లేక వారి చెప్పినట్లు నడుచుకుంటున్నారు. లేఅవుట్లు అనుమతులకు దరఖాస్తు చేసుకున్న వారి నుంచి రూ.లక్షల్లో ముడుపులు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అహుడా విస్తీర్ణమిలా... అనంతపురం, హిందూపురం డెవలప్మెంట్ అథారిటీ (అహుడా) 2017 మార్చిలో ఏర్పాటైంది. మొదట్లో అనంతపురం నగరపాలక సంస్థ, ధర్మవరం, హిందూపురం మునిసిపాలిటీల్లోని 18 మండలాల్లోని 180 గ్రామ పంచాయతీలను అహుడా పరధిలోకి తెచ్చారు. అప్పట్లో అహుడా విస్తీర్ణం 3120.05 చదరపు కిలోమీటర్లుగా నిర్ణయిస్తూ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. 2018లో పెరిగిన విస్తీర్ణం 2018 మే 22న ఉరవకొండ నియోజకవర్గంలోని మరో 5 మండలాల్లోని 84 గ్రామ పంచాయతీలను కలుపుకుని 1900.44 చదరపు కిలోమీటర్లను అదనంగా చేర్చారు. ఇలా మొత్తంగా అహుడా 5120.49 చదరపు కిలోమీటర్లలో విస్తరించింది. అహుడా పరిధిలో నిర్మాణాలు చేపట్టే వారు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి. నగరపాలక సంస్థ పరిధిలో వెయ్యి చదరపు మీటర్లు, మునిసిపాలిటీ, పంచాయతీ పరిధిలో 300 చదరపు కిలోమీటర్లు పైబడి నిర్మాణాలు చేపడితే అహుడా అనుమతులు తప్పనిసరి. హడావుడిగా నోటీసులు అహుడా అధికారులు హడావుడిగా 57 అక్రమ లేఅవుట్లను గుర్తించి, ఆ లేఅవుట్ల రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారికి రిజిస్ట్రేషన్లను చేయవద్దని జిల్లా రిజిస్ట్రార్లతో పాటు సబ్ రిజిస్ట్రార్లకు ఫిర్యాదు చేశారు. అహుడా అనుమతులకు ఇద్దరు ఉద్యోగులకు చేయితడిపితేనే లేఅవుట్లు, భవన నిర్మాణాలకు అనుతులిస్తున్నారని..దీనిపై వివరణ ఇవ్వాలని అహుడా వైస్ చైర్మన్ మురళీకృష్ణగౌడ్‌ను ‘సాక్షి’ వివరణ కోరిన నేపథ్యంలో ఆయన జిల్లాలోని అక్రమ లేఅవుట్ల జాబితాను సిద్ధం చేసి చర్యలకు ఉపక్రమించారు. 57 అక్రమ లేఅవుట్లు అహుడా పరిధిలో 57 అక్రమ లేఅవుట్లను అధికారులు గుర్తించారు. అనంతపురంలోని కక్కలపల్లి, కురుకుంట, రాచానపల్లి, కొడిమి, ఉప్పరపల్లి, ఇటుకలపల్లి, జంగాలపల్లి, అనంతపురం రూరల్, హిందూపురంలోని శ్రీకంఠాపురం, హిందూపురం, బుక్కరాయసముద్రం తదితర చోట్ల అక్రమ లేఅవుట్లు వెలిశాయి. విచారణ చేపడతాం కొందరు ఉద్యోగుల కారణంగా అహుడా అనుమతుల జాప్యమవుతున్న విషయం నాకు తెలియదు. నేను ఇటీవలే బాధ్యతలు తీసుకున్నా. అటువంటి ఫిర్యాదులందితే వెంటనే విచారణ చేస్తాం. ఆరోపణలు నిజమని తేలితే చర్యలు తీసుకుంటా. – అహుడా వీసీ మురళీకృష్ణ గౌడ్ -
నేను సదా మీ సేవకుడినే - ఎమ్మెల్సీ
సాక్షి, హిందూపురం : ‘‘నేను ఎప్పుడూ హిందూపురం సేవకుడినే...అందరికీ అందు బాటులో ఉంటా. ప్రజా సమస్యల పరిష్కారం...పురం అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తా’’ అని ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ అన్నారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత తొలిసారి బుధవారం హిందూపురం వచ్చిన ఆయనకు స్థానిక పార్టీ కార్యకర్తలు, వైఎస్సార్ సీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా తరలివచ్చి స్థానిక వైఎస్సార్ పరిగి బస్టాండులోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి గజమాలను వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సాధారణ కార్యకర్తగా ఉన్న తనను ఎమ్మెల్సీని చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిదన్నారు. వైఎస్సార్ సీపీతోనే బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి సాధ్యమన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి ప్రతిపనిలోనూ ఉద్యోగ, రాజకీయాల్లో 50 శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే సిద్దాంతాన్ని ఆచరణలో పెడుతున్న నాయకుడన్నారు. ఆయనకు, హిందూపురం వాసులకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. అవినీతీ రహిత జవాబు దారీ పాలన అందించడమే తమ నాయకుడి లక్ష్యమన్నారు. ఏదైనా సమస్య వస్తే అర్ధరాత్రి అయినా సరే తన ఇంటి తలుపు తట్టవచ్చన్నారు. అభివృద్ధికి సహకరిస్తాం హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అభివృద్ధికి చర్యలు తీసుకుంటే తప్పకుండా తమ సహకారం అందిస్తామని ఎమ్మెల్సీ ఇక్బాల్ తెలిపారు. అలాకాకుండా నియోజకవర్గాన్ని వదిలి సినిమాలకే పరిమితమైతే ఏం చేయాలో ప్రజలే చేస్తారన్నారు. ఎమ్మెల్సీగా హిందూపురం వాసులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి కొటిపి హనుమంతరెడ్డి, మాజీ సమన్వయకర్త చౌళూరు రామకృష్ణారెడ్డి, మారుతిరెడ్డి, జనార్దనరెడ్డి, ఏ బ్లాక్ కన్వీనర్ ఈర్షద్ అహ్మద్, మండల కన్వీనర్లు శ్రీరామిరెడ్డి, నారాయణస్వామి, ఫైరోజ్, యువజన విభాగం పార్లమెంట్ అధ్యక్షుడు ఉపేంద్రరెడ్డి పాల్గొన్నారు. -
కస్తూర్బా పాఠశాలను సందర్శించిన మహ్మద్ ఇక్బాల్
సాక్షి, అనంతపురం : డంపింగ్ యార్డ్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్కూల్ పిల్లల సమస్యపై వైఎస్సార్ కాంగ్రెస్ నేత మహ్మద్ ఇక్బాల్ స్పందించారు. జిల్లాలోని హిందూపురం మున్సిపల్ పరిధిలోని 32వ వార్డు అహ్మద్ నగర్లో స్కూల్ పక్కనే డంపింగ్ యార్డు ఉంది. గురువారం డంపింగ్ యార్డుకు నిప్పు పెట్టడంతో స్కూల్ పరిసరాలు పొగతో నిండిపోయాయి. ఈ సమస్య కాస్త మహ్మద్ ఇక్బాల్ దృష్టికి వెళ్లింది. దాంతో ఆయన వెంటనే స్పందించారు. తక్షణమే డంపింగ్ యార్డును ప్రజావాసాలకు దూరంగా మార్చాలని మున్సిపల్ కమిషనర్, కలెక్టర్‌ని ఫోన్లో కోరారు. సమస్య తీరేవరకూ పాఠశాలకు సెలవు ఇవ్వాల్సిందిగా కోరారు. అలానే హిందూపురం మున్సిపల్ పరిధిలోని కస్తూర్బా పాఠశాలను సందర్శించి కంపూట్యర్లు, మైకులు అందజేశారు. అక్కడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. -
బాలయ్య అడ్డాలో అవినీతి మరక
ఆడపడచులను.. అక్కచెళ్లెమ్మలను తెలుగు తమ్ముళ్లు దగా చేశారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అన్నీ తామై నడిపిస్తూ.. తాము చెప్పిందే చట్టం అన్నట్లుగా చెలామణి అవడమే కాక.. ఏకంగా అంగన్వాడీ పోస్టులు ఇప్పిస్తామంటూ రూ. మూడు లక్షల వరకూ అక్రమంగా వసూలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించి నియామక పత్రాలు నేటికీ అందకపోవడంతో టీడీపీ నేతలను నమ్మి డబ్బు ముట్టజెప్పిన మహిళలు లబోదిబో మంటున్నారు. ఈ పరిస్థితి మరెక్కడో కాదు.. టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రెండో సారి ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలోనిదే. వివరాల్లోకి వెళితే.. సాక్షి, హిందూపురం సెంట్రల్: సార్వత్రిక ఎన్నికలకు ముందు అంగన్వాడీ పోస్టుల భర్తీకి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. హిందూపురం డివిజన్లో 49 అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు, 15 సహాయక పోస్టులు ఖాళీగా ఉండడంతో ఆశావహులు భారీగా దరఖాస్తు చేసుకున్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో అంగన్వాడీ పోస్టుల భర్తీ స్థానిక టీడీపీ నేతలకు కాసుల వర్షమే కురిపించింది. ఎమ్మెల్యే పేరు చెప్పుకుని స్థానికేతరులకు కూడా పోస్టు కచ్చితంగా వస్తుందని నమ్మబలికి ఒక్కొక్కరి నుంచి రూ. 2 లక్షల మొదలు రూ. 3 లక్షల వరకూ తెలుగు తమ్ముళ్లు వసూలు చేసుకున్నారు. బాధితుల్లో ఆందోళన నియోజకవర్గంలోని హిందూపురం, చిలమత్తూరు, లేపాక్షి మండలాల్లో అంగన్వాడీ పోస్టుల భర్తీపై చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. నియామకాలు పారదర్శకంగా జరిపితే తమకు ఉపాధి దొరుకుతుందని భావించిన వారి ఆశలపై అప్పట్లో టీడీపీ నేతలు నీళ్లు చల్లారు. రూ. లక్షల్లో డబ్బు వసూలు చేసుకుని పోస్టింగ్ ఆర్డర్లు ఇప్పించకపోవడంతో బాధితుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం పోస్టుల భర్తీని వైఎస్ జగన్ ప్రభుత్వం పారదర్శకంగా చేపట్టనుండడంతో తమకు పోస్టులు వస్తాయో రావో అనే ఆందోళన అందరిలోనూ వ్యక్తమవుతోంది. పోస్టులు రాకపోతే తాము ఇచ్చిన డబ్బును టీడీపీ నేతలు వెనక్కు ఇస్తారో ఇవ్వరోననే భయం కూడా వారిని వెన్నాడుతోంది. స్వీయ రక్షణలో టీడీపీ నేతలు అంగన్వాడీ పోస్టులు ఇప్పిస్తామంటూ పలువురు నుంచి రూ. లక్షల్లో దండుకున్న టీడీపీ నేతల్లో వణుకు మొదలైంది. విషయాన్ని కాస్త ఎమ్మెల్యే బాలయ్య దృష్టికెళితే... తమకు ఇబ్బందులు తప్పవని భావించి స్వీయరక్షణలో పడ్డారు. ఇందులో తమ అక్రమ వసూళ్లను కప్పిపుచ్చుతూ టీడీపీని నమ్ముకున్నవారికి పోస్టులు ఎలాగైనా ఇప్పించాలంటూ బాలయ్యను వారు ప్రాధేయపడినట్లు సమాచారం. కాగా, అంగన్వాడీ పోస్టుల భర్తీ విషయంగా చోటు చేసుకున్న అక్రమాలపై వైఎస్సార్సీపీ నాయకులు భగ్గుమంటున్నారు. అప్పటి నోటిఫికేషన్ రద్దు చేయడంతో పాటు కొత్త నోటిఫికేషన్ జారీ చేసి, నియామకాలను పారదర్శకంగా చేపట్టాలనే డిమాండ్‌ను తెరపైకి తెస్తున్నారు. డబ్బు వసూళ్ల అంశం మా పరిధిలోది కాదు హిందూపురం డివిజన్లో 49 అంగన్వాడీ టీచర్లు , 15 సహాయకులు ఖాళీలు ఉండేవి. ఈ పోస్టుల భర్తీకి గత టీడీపీ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. వెంటనే అభ్యర్థుల నుంచి నిర్ణీత తేదీ లోపు దరఖాస్తులు స్వీకరించాం. అభ్యర్థుల వివరాలతో కూడిన జాబితాను కలెక్టర్ కార్యాలయానికి పంపించాం. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో నియామక ప్రక్రియ ఆగిపోయింది. స్థానికేతరులు దరఖాస్తు చేసుకున్నారన్నది అవాస్తవం. ఇక పోస్టు కోసం నాయకులకు డబ్బు చెల్లించారనేది మా పరిధిలో లేని అంశం. నిబంధనల మేరకే పోస్టుల భర్తీ ఉంటుంది. – నాగమల్లీశ్వరి, సీడీపీఓ, హిందూపురం -
అల్లుడిలా బాలయ్య కూడా వర్థంతి చేశాడుగా !
సాక్షి, హిందూపురం : సోదరుడు మరణిస్తే సంభ్రమాశ్చర్యానికి గురైన హిందూపురం ఎమ్మెల్యే, నందమూరి బాలకృష్ణ.. తాజాగా తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతిని వర్ధంతిని చేశారు. తత్తరపాటుకు లోనవ్వడంలో అల్లుడు నారాలోకేశ్‌ను మించిపోతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ప్రభంజనానికి రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కొట్టుకుపోయినా బాలయ్య మాత్రం హిందూపురం నుంచి రెండోసారి విజయం సాధించారు. మంగళవారం తన తండ్రి జయంతి వేడుకులను నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి సతీమణి వసుంధరతో కలిసి పాలభిషేకం చేశారు. అనంతరం హిందూపురంలో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ 96వ జయంతిని కాస్త వర్థంతిగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. నెటిజన్లు బాలయ్యను ఓ ఆట ఆడుకుంటున్నారు. జనాలను నవ్వించడంలో మామ అల్లుళ్లు ఏమాత్రం తగ్గడం లేదు కదా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : ఎన్టీఆర్ జయంతిని వర్ధంతి చేసిన బాలయ్య గతంలో సోదరుడు నందమూరి హరికృష్ణ మరణం సందర్భంగా మాట్లాడుతూ ఆయన మరణంతో సంభ్రమాశ్చర్యానికి గురైనట్లు తెలిపి నవ్వులపాలైన బాలయ్య.. సినీ దర్శకుడు కోడి రామకృష్ణ మరణించినప్పుడు కూడా ఇలానే మాట్లాడారు. ఇక తెలంగాణ ఎన్నికల ప్రచారంలో సారే జహాసె అచ్చా పాడబోయిన బాలయ్య.. అది పాడలేక బుల్బుల్ బాలయ్యగా బిరుదు పొందిన విషయం తెలిసిందే. ఆయన అల్లుడు నారా లోకేశ్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని వర్థంతిగా సంభోదించి విమర్శలపాలయ్యారు. -
ఎన్టీఆర్ జయంతిని వర్ధంతి చేసిన బాలయ్య
-
ఈసారి కష్టమే
-
దైవ దర్శనానికి వెళ్తూ...
హిందూపురం, యశ్వంతపుర: ఆమావాస్య రోజున దైవదర్శనానికి వెళ్తుండగా కర్ణాటకలోని దావణగేరి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హిందూపురానికి చెందిన దంపతులు జెమిని శివప్రకాష్, ఉమాదేవిలు మృతి చెందారు. బెంగళూరులో ఆడిటర్‌గా పనిచేస్తున్న శివప్రకాష్ అక్కడి రాజాజీనగర్ 6వ క్రాస్ కాలనీలో నివాసం ఉంటున్నారు. దంపతులు శనివారం తెల్లవారుజామున ఉక్కడగాత్రీలోని హరిహర ఆలయానికి వెళ్లడానికి కారులో వెళ్తూ జాతీయ రహదారిలోని హోసకుండవాడ వద్ద కారు డివైడర్‌కు ఢీ కొనడంతో దంపతులు అక్కడిక్కడే మృతి చెందారు. హిందూపురంలోని ధనలక్ష్మిరోడ్డులో నివాసముంటున్న సత్యనారాయణకు ముగ్గురు సంతానం ఒక కొడుకు, ఇద్దరు కుమారైలు కొడుకు శివప్రకాష్ ఆడిటర్‌గా 15 సంవత్సరాల క్రితం వృత్తిరీత్యా బెంగళూరులో స్థిరపడ్డారు. శివప్రకాష్, ఉమాదేవి దంపతులకు ఇరువురు సంతానం. బిటెక్ చదువుతున్న పెద్దకొడుకు మోదేష్, పదో తరగతి చదివే ప్రణ్‌వ్‌లున్నారు. పిల్లలను ఇంటివద్దను ఉంచి వీరు ఆలయ దర్శనానికి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. దంపతుల భౌతికకాయాలను స్వగ్రామమైన హిందూపురం రాత్రికి తీసుకువస్తున్నారు. ఉమాదేవి స్వగ్రామం సోమిందపల్లి దీంతో రెండుప్రాంతాల్లో బంధువులు సన్నిహితులు హిందూపురం చేరుకుని కన్నీరు మున్నీరౌతున్నారు. -
పోలింగ్ సెంటర్ వద్ద బాలయ్య హల్చల్
సాక్షి, అనంతపురం: సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం వద్ద హల్చల్ చేశారు. ఇప్పటికే పలు వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన బాలయ్య శుక్రవారం హిందూపురంలో ఎన్నికల నియామవళి ఉల్లంఘనకు పాల్పడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం వద్ద బాలకృష్ణ ప్రచారం నిర్వహించారు. అంతేకాకుండా ఉద్యోగులతో ఫొటోలు దిగారు. బాలయ్యతో పాటు పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు పోలింగ్ కేంద్రంలోకి చొచ్చుకుని వచ్చారు. అయితే పోలీసులు మాత్రం టీడీపీ నేతలను అడ్డుకోవడానికి ప్రయత్నించలేదు. దీనిపై స్పందించిన హిందూపురం రిటర్నింగ్ అధికారి గుణభూషణ్‌రెడ్డి బాలకృష్ణకు నోటీసులు జారీ చేస్తామని పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం వద్ద బాలకృష్ణ ప్రచారం చేయడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభ్యంతరం తెలిపారు. ఇందుకు నిరసనగా నేతలు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు. మరోవైపు పోస్టల్ బ్యాలెట్స్ పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లపైన ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాప్తాడులో ఒకే పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడంపై ఉద్యోగులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. అనంతరపురం అర్బన్ పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద ఉద్యోగులు బారులు తీరారు. అరకొర ఏర్పాట్లు చేయడంపై ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. చదవండి: బాలకృష్ణకు చేదు అనుభవం -
వైఎస్ జగన్ రాకతో హిందూపురం జనసంద్రం
-
బాలయ్యకు ఝలక్
సాక్షి, హిందూపురం: ఎన్నికల ప్రచారంలో అధికార టీడీపీ అభ్యర్థులను ప్రజలు అడగడుగునా నిలదీస్తున్నారు. ఐదేళ్లు సమస్యలు ఎందుకు పరిష్కరించలేదని సూటిగా ప్రశ్నిస్తున్నారు. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణకు గురువారం చేదు అనుభవం ఎదురైంది. చిలమత్తూరు మండలం దేమకేతేపల్లి ఎస్సీ కాలనీలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన బాలయ్యకు స్థానిక మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. తాగునీటి సమస్య పరిష్కరించకుండా ఓట్లు అడగడానికి ఎందుకొచ్చారని నిలదీశారు. దీంతో కంగుతిన్న బాలకృష్ణ స్థానిక టీడీపీ నాయకులపై చిందులు తొక్కారు. ఇన్ని రోజులుగా సమస్య ఎందుకు పరిష్కరించలేదని మండిపడ్డారు. నియోజకవర్గానికి అతిథిలా వచ్చిపోయే బాలయ్య తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించకుండా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని వాపోతున్నారు. కాగా, జర్నలిస్టులు, కార్యకర్తలపై దౌర్జన్యం చేసి బాలకృష్ణ ఇప్పటికే వివాదాల్లో చిక్కుకున్నారు. నిత్యం వివాదాలతో సావాసం చేసే బాలకృష్ణకు ఓటుతో గుణపాఠం చెప్పాలని ప్రజలకు వైఎస్సార్సీపీ నాయకులు విజ్ఞప్తి చేశారు. -
‘రెండు స్థానాలను బీసీలకే ఇవ్వడం జరిగింది’
-
అలా జరిగితే టీడీపీకి డిపాజిట్లు రావు: వైఎస్ జగన్
సాక్షి, హిందూపురం: అనంతపురం జిల్లాలో ఎప్పుడు జరగని విధంగా రెండు పార్లమెంట్ స్థానాలు బీసీలకే ఇవ్వడం జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. చంద్రబాబు వైఫల్యాలపై చర్చజరగకుండా ఎల్లో మీడియా పక్కదారి పట్టిస్తోందని అన్నారు. చంద్రబాబు వైఫల్యాలపై చర్చ జరిగితే కనీసం డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. గురువారం అనంతపురం జిల్లా హిందూపురంలో జరిగిన బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగించారు. వైఎస్ జగన్ రాకతో హిందూపురం జనసంద్రంగా మారింది. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘35 ఏళ్ల పాటు హిందూపురంలో టీడీపీకి ఓట్లు పడిన కూడా ఇక్కడి సమస్యలు తీర్చింది మాత్రం దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమే. హిందూపురం ప్రజలకు తాగునీరు అందించడం కోసం నాన్న గారి హయంలో 650 కోట్లు ఖర్చు చేశారు. నేడు హిందూపురం ప్రజలకు తాగునీరు అందుతుంది అంటే అది వైఎస్సార్ కృషి వల్లనే. గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి తాగునీరు అందించడానికి వేసిన పైపులైన్ల పనులను పూర్తి చేయలేని అసమర్ధ పాలన టీడీపీది. హంద్రినీవా జలాల నుంచి 99 చెరువులకు నీళ్లు ఇవ్వడానికి పనులు చేపట్టిన వైఎస్సార్ అప్పట్లోనే 90 శాతం పనులు పూర్తిచేశారు. మిగిలిన 10 శాతం పనులు కూడా పూర్తి చేయలేని పాలన నేడు మనం చూస్తున్నాం. హిందూపురంకు చేసిందేమీ లేదు.. కొడికొండ చెక్‌పోస్ట్ వద్ద ఇండస్ట్రీయల్ హబ్ పేరిట బావ బామ్మర్దులు ఇద్దరు కలిసి ఒక షో చేశారు. వేల ఉద్యోగాలు వస్తాయంటూ శంకుస్థాపనలు చేశారు. కానీ ఒక్క పరిశ్రమైనా వచ్చిందా?. చివరకు ఆ భూముల్లో లే అవుట్ వేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. గతంలో ఇదే నియోజవకవర్గంలో ఉన్న నిజాం షుగర ప్యాక్టరీ అమ్మేసిన ఘనత చంద్రబాబు నాయుడుది కాదా?. 32 మంది డాక్టర్లు పనిచేయాల్సిన 200 పడకల ప్రభుత్వ ఆస్పత్రిలో కనీసం పదిమంది కూడా పనిచేయడం లేదు. ఇదే ఆస్పత్రిలో నలుగురు గైనకాలజిస్టులు ఉండాల్సింది కేవలం ఒక్కరే ఉన్నారు. హిందూపురానికి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ వచ్చినట్టు బోర్డులు వేశారు, పూజలు చేశారు. ఆ తర్వాత కాలేజ్ రాలేదు.. దాన్ని పట్టించుకున్నవారే లేకుండా పోయారు. చంద్రబాబు హామీ ఇచ్చిన ఉర్దు కళాశాల మీకేమైనా కనబడిందా?. రైతన్నలకు కనీసం గిట్టుబాటు ధర కూడా కల్పించడం లేదు. మొదటి రకం చింతపండును 10వేల రూపాయలకు కూడా అమ్ముకోలేని స్థితిలో రైతన్న ఉన్నాడు. హిందూపురంను టీడీపీ నాయకులు అవసరానికి ఏవిధంగా వాడుకుని వదిలివేస్తున్నారో ఆలోచన చేయండి. చంద్రబాబు పాలన ఎంత దారుణంగా ఉందంటే.. చంద్రబాబు పాలనలో రైతన్నలను మోసం చేశారు. డ్వాక్రా సంఘాల అక్కాచెల్లమ్మలను మోసం చేశారు. చదువుకున్న పిల్లలను మోసం చేశారు. 60 నెలల పాలించమని ఓటేస్తే.. 57 నెలల పాటు ప్రజలను మోసం చేసిన చంద్రబాబు, ఎన్నికలకు మూడు నెలల ముందు కొత్త సినిమా చూపిస్తూ డ్రామాలు ఆడుతున్నారు. ఎన్నికల వారం రోజులు ముందు మీకు చెక్కులు వేస్తామని అంటున్న టీడీపీ నాయకులు.. ఈ ఐదేళ్లపాటు గాడిదల కాశారా?. 2014 ఎన్నికల్లో 650 పేజీల మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీ.. ప్రతి కులానికి ఒక్కో పేజీ కేటాయించింది. అందులో ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రతి కులాన్ని మోసం చేయడంలో పీహెచ్డీ చేసింది. ఇప్పడు ఆ మేనిఫెస్టో ఎక్కడ ఉందోనని వెతికితే.. కనీసం టీడీపీ వెబ్సైట్లో కూడా కనిపించడం లేదంటే వీళ్లు ప్రజలను ఎంత దారుణంగా మోసం చేశారో మీరు ఆలోచన చేయండి. ఎల్లో మీడియా పుకార్లు సృష్టిస్తోంది.. ఈ ఎన్నికలు ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్నాయి. మనం యుధ్దం చేస్తుంది చంద్రబాబు నాయుడు ఒక్కడితోనే కాదు.. ఎల్లో మీడియాతో కూడా. గత ఇరవై రోజులుగా చంద్రబాబు నాయుడు ఎన్నో కుట్రలు చేస్తున్నారు. ఎల్లో మీడియా ఒక్క అబద్దం చెప్పి అది నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తుంది. చంద్రబాబు పాలనపై చర్చ జరగకుండా చూస్తున్నారు. ప్రతి రోజు పుకారు సృష్టిస్తారు.. కట్టుకథలు అల్లుతారు. చంద్రబాబు వైఫల్యాలపై చర్చ జరగకుండా పక్కదారి పట్టిస్తారు. చంద్రబాబు పాలనపై చర్చ జరిగితే కనీసం డిపాజిట్లు కూడా రావు. చివరి కుట్రగా డబ్బుల మూటలు పంపుతారు.. పోలింగ్‌కు ఇంకో వారం రోజులు మాత్రమే ఉన్నందున చివరి కుట్రగా చంద్రబాబు చేయని మోసం, చెప్పని అబద్దం ఉండదు. రానున్న రోజుల్లో ఈ కుట్రలు ఇంకా పెరుగుతాయి. ప్రతి ఊరికి మూటలు, మూటలు డబ్బులు తీసుకోస్తారు. ప్రతి ఒక్కరి చేతిలో మూడు వేల రూపాయల నగదును పెడతారు. మీరందరు గ్రామాలకు వెళ్లి ప్రతి ఒక్కరికి చంద్రబాబు మోసాల గురించి చెప్పాలి. చంద్రబాబు ఇచ్చే మూడు వేల రూపాయలకు మోసపోకండని గ్రామాల్లోని అక్కాచెల్లమ్మలకు, అవ్వ తాతలకు చెప్పండి. వారం రోజులు ఓపిక పట్టమని చెప్పండి. జగనన్న చెప్పకపోయి ఉంటే పించన్ రెండు వేలకు పెరిగేదా అని గుర్తుచేయండి. మన పిల్లలను బడికి పంపిస్తే చాలు అన్న ఏటా రూ. 15 వేల రూపాయలు ఇస్తాడని ప్రతి అక్కాచెల్లమ్మకు చెప్పండి. ఎంత పెద్ద చదువైనా అన్న చదివిస్తాడని.. ఎన్ని లక్షలైనా కూడా భరిస్తాడని ప్రతి ఇంట్లో చెప్పండి. గతంలో డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు వచ్చేవి. ఇప్పుడు అది కనిపించని పరిస్థితి. అన్న ముఖ్యమంత్రి అయ్యాక పొదుపు సంఘాల మహిళలకు ఎన్నికల తేదీ వరకు ఎంతైతే అప్పు ఉంటుందో ఆ మొత్తాన్ని నాలుగు దఫాలుగా మీ చేతికే అందిస్తాం. రాజన్న పాలనలో మాదిరి మళ్లీ బ్యాంకుల వద్ద నుంచి సున్నా వడ్డీకే రుణాలు రావాలంటే అది జగనన్నతోనే సాధ్యం అని చెప్పండి. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకు వైఎస్సార్ చేయూత కింద 75 వేల రూపాయలు నాలుగు దఫాలుగా చెల్లిస్తాం. పసుపు కంకుమ డ్రామాకు మోసపోవద్దని ప్రతి అక్కకు చెప్పండి. చంద్రబాబు చేసిన రుణమాఫీ వడ్డీలకు కూడా సరిపోని పరిస్థితి. ఈ ఐదేళ్లలో ఏ పంటకైనా గిట్టుబాటు ధర వచ్చిందా అని రైతన్నను అడగండి. రుణమాఫీ కనీసం వడ్డీలకైనా వచ్చిందా అని రైతన్నను అడగండి. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడమే కాకుండా.. గిట్టుబాటు ధరలకు గ్యారెంటీ కూడా ఇస్తాం. ప్రతి రైతన్నకు మే నెలలోనే 12,500 రూపాయలు ఇస్తాం. పింఛన్ మూడు వేలకు పెంచుకుంటూ పొతారని ప్రతి అవ్వకు, తాతకు చెప్పండి. నవరత్నాల గురించి ప్రతి ఒక్కరికి చెప్పిండి. నవరత్నాలను ప్రతి ఇంటి వద్దకు తీసుకువస్తామని హామీ ఇస్తున్నా. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇక్బాల్‌ను, ఎంపీ అభ్యర్థి మాధవ్‌ను ఆశీర్వదించండి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని దీవించమ’ని కోరారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
బాలకృష్ణ మానసిక పరిస్థితి బాగాలేదు
-
బాలకృష్ణ మరో నిర్వాకం.!
సాక్షి, అనంతరంపురం : సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి తన ఆగ్రహాన్ని ప్రదర్శించారు. ఇటీవల ఓ మీడియా జర్నలిస్టును అసభ్య పదజాలంతో దూషించి అబాసులపాలైన బాలయ్య.. తాజాగా సొంత పార్టీ కార్యకర్తపైనే చిందులు తొక్కారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం హిందూపురం సమీపంలోని సిరివరం గ్రామానికి వెళ్లిన బాలయ్యను.. అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త రవికుమార్ తమ గ్రామ చెరువుకు నీరు విడుదల చేయాలని కోరారు. దీంతో ఆగ్రహానికి గురైన బాలయ్య.. రవికుమార్‌ను తోసేశారు. బయటకు పంపాలని పోలీసులను ఆదేశించగా..వారు అతన్ని అక్కడి నుంచి పంపేశారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన రవికుమార్ వెంటనే టీడీపీ పార్టీకి రాజీనామా చేసి.. సమీప గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇక్బాల్ సమక్షంలో పార్టీలో చేరారు. బాలకృష్ణ వైఖరిపై సొంతపార్టీ కార్యకర్తలే విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఒక మీడియా ప్రతినిధిపై రౌడీయిజం ప్రదర్శించిన బాలయ్య.. ‘ప్రాణాలు తీస్తా’ అంటూ ఒంటికాలిపై లేచారు. బాలకృష్ణ వస్తున్నప్పుడు చిన్నపిల్లలను ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది పక్కకు లాగిపడేశారు. దీన్ని షూట్ చేసిన మీడియా ప్రతినిధిపై దౌర్జన్యం చేసి, రాయకూడని భాషలో బూతులు తిట్టారు. కెమెరాతో చిత్రీకరించిన దృశ్యాలను తొలగించాలని చేయి చేసుకున్నారు. ఈ దృష్యాలన్నీ సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. గతంలో బాలయ్య సొంత పార్టీ కార్యక్తలపైనే చేయి చేసుకున్న సంగతి కూడా తెలిసిందే. చదవండి : బాలకృష్ణ బూతు పురాణం వైరల్: బుల్బుల్ బాలయ్య..! బాలయ్య.. మళ్లీ సంభ్రమాశ్చర్యమా! -
‘వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి150 సీట్లు’
హిందూపురం: వచ్చే శాసన సభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 150 సీట్లు ఖాయమని, టీడీపీ 20 సీట్లకే పరిమితం కాబోతుందని హిందూపురం వైఎస్సార్సీపీ అభ్యర్థి మహ్మద్ ఇక్బాల్ జోస్యం చెప్పారు. హిందూపురంలో ఇక్బాల్ విలేకరులతో మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఇచ్చిన రుణమాఫీ ఎందుకు నిలబెట్టుకోలేదో చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసును విచారిస్తోన్న ఎన్ఐఏను చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. డబ్బుతో టీడీపీ నేతలు గెలవాలని అనుకుంటున్నారని చెప్పారు. ఏపీలో వైఎస్ జగన్ ప్రభంజనం ఉందని జాతీయ సర్వేలు చాటి చెబుతున్న విషయాన్ని గుర్తు చేశారు. హిందూపురం సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణ మానసిక పరిస్థితి బాగాలేదని తెలిపారు. చంపుతానంటూ భయపెడుతున్న బాలకృష్ణపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందూపురం ప్రజల దాహార్తి తీర్చలేని అసమర్థుడు బాలకృష్ణ అని విమర్శించారు. బాలకృష్ణ పీఏల పెత్తనంతో హిందూపురం ప్రజలు విసిగిపోయారని అన్నారు. హిందూపురంలో వైఎస్సార్సీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరని ధీమావ్యక్తం చేశారు. -
హిందూపురంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్ధి ఇక్బాల్ ప్రచారం
-
బాలకృష్ణ బూతు పురాణం
సాక్షి, హిందూపురం: సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి చిందులు తొక్కారు. అనంతపురం జిల్లా హిందూపురంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా బాలయ్య తన స్వరూపాన్ని బయటపెట్టారు. ఒక మీడియా ప్రతినిధిపై రౌడీయిజం ప్రదర్శించారు. ‘ప్రాణాలు తీస్తా’ అంటూ ఒంటికాలిపై లేచారు. బాలకృష్ణ వస్తున్నప్పుడు చిన్నపిల్లలను ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది పక్కకు లాగిపడేశారు. దీన్ని షూట్ చేసిన మీడియా ప్రతినిధిపై దౌర్జన్యం చేసి, రాయకూడని భాషలో బూతులు తిట్టారు. కెమెరాతో చిత్రీకరించిన దృశ్యాలను తొలగించాలని చేయి చేసుకున్నారు. ‘రాస్కెల్ మా బతుకు మీ చేతుల్లో ఉన్నాయిరా. నరికి పోగుపెడతాను, ప్రాణాలు తీస్తాను. బాంబులు వేయడం కూడా తెల్సు నాకు. కత్తి తిప్పడం కూడా తెల్సు’ అంటూ బాలయ్య బెదిరిస్తున్న దృశ్యాలు వీడియోలో రికార్డైయ్యాయి. చుట్టూ ఉన్నవారు కూడా ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. మీడియా ప్రతినిధిపై బాలకృష్ణ దౌర్జన్యాన్ని జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. సభ్య సమాజం తలదించుకొనేలా ప్రవర్తించిన తీరును ప్రతిపక్ష పార్టీలు గర్హించాయి. ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని, పోలీసులు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశాయి. బాలయ్యను చూసి భయపడుతున్నారు ఎన్నికల సంఘం బాలకృష్ణ మానసిక పరిస్థితి పరిగణనలోకి తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇక్బాల్ అహ్మద్‌ఖాన్ కోరారు. హిందూపురానికి చుట్టపు చూపుగా వచ్చిపోయే బాలకృష్ణను చూసి ఇక్కడి ప్రజలు వణికిపోతున్నారని చెప్పారు. ఆయన ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలియక స్థానికులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలన్నారు. ఎన్నికల్లో ఓడిపోతామనే నిరాశ, నిస్పృహతో ఆయన ఇలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. -
‘2019 తర్వాత ఆ 3 పార్టీలు కనపడవ్’
అనంతపురం జిల్లా: జనసేన, టీడీపీ, కాంగ్రెస్ పార్టీల రహస్య పొత్తులు, బంధాలు ప్రజలు గమనిస్తున్నారని వైఎస్సార్సీపీ హిందూపురం అసెంబ్లీ అభ్యర్థి మహమ్మద్ ఇక్బాల్ అన్నారు. మంగళవారం హిందూపురం వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఇక్బాల్ మాట్లాడుతూ.. ప్రజాసంకల్పయాత్రలో ఉప్పెనలా వచ్చిన ప్రజాబలానికి భయపడి ఇలాంటి చీకటి ఒప్పందాలు చేసుకుని ఓట్లను చీల్చాలని చూస్తున్నారని ఆరోపించారు. చీకటి ఒప్పందాలు పెట్టుకున్న టీడీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలు 2019 తర్వాత ఫ్యాన్ గాలిలో కనపడకుండా పోతాయని జోస్యం చెప్పారు. టీడీపీ ప్రభుత్వం నరకాసుర ప్రభుత్వమని, కంటక ప్రభుత్వమని విమర్శించారు. అంకెల గారడీ తప్ప అభివృద్ధి చేసే ప్రభుత్వం ఇది కాదన్నారు. ఏపీకి 2019 ఎన్నికల తర్వాత దీపావళి త్వరగా రాబోతుందన్నారు. ఇసుక, మట్టి ఇలా ప్రతి దానిలో కూడా అవినీతి చేస్తోన్న ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వమని, ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్‌ని దుర్భిక్షాంధ్రప్రదేశ్‌గా మార్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనన్నారు. మళ్లీ అన్నపూర్ణగా మార్చబోయేది వైఎస్ జగనేనని చెప్పారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, భగత్ సింగ్ లాంటి దేశభక్తుల గురించి తెలుసుకోవాలని సూచించారు. అలా కాకుండా భగత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు అనడం అతని తెలివికి నిదర్శనమని విమర్శించారు. పవన్ కల్యాణ్ భారత జాతికి క్షమాపణ చెప్పి తీరాలని డిమాండ్ చేశారు. -
‘చంద్రబాబు మోసాలపై బీసీలు అప్రమత్తంగా ఉండాలి’
సాక్షి, అనంతపురం: మంత్రి పరిటాల సునీత, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తన నామినేషన్ అడ్డుకోవాలని కుట్ర పన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం ఎంపీ అభ్యర్థి, మాజీ పోలీసు అధికారి గోరంట్ల మాధవ్ ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పు టీడీపీ ప్రభుత్వానికి చెంపపెట్టు అని అన్నారు. టీడీపీ నేతలు తన వీఆర్ఎస్ ఆమోదానికి అడ్డంకులు సృష్టించారని తెలిపారు. వెనుకబడిన వర్గాల రాజకీయ ఎదుగుదలను సీఎం చంద్రబాబు నాయుడు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. సామాన్యుడైన తనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంపీ టికెట్ ఇచ్చారని పేర్కొన్నారు. వైఎస్ జగన్ వల్లే బీసీల అభ్యున్నతి సాధ్యమని అన్నారు. చంద్రబాబు మోసాలపై బీసీలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. కాగా, రాజకీయాల్లోకి చేరే ఉద్దేశంతో మాధవ్ వీఆర్ఎస్ దరఖాస్తు చేసుకున్నారు. మాధవ్ వైఎస్సార్సీపీలో చేరడంతో ఆయన వీఆర్ఎస్ ఆమోదం పొందకుండా ఏపీ ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే మాధవ్ వీఆర్ఎస్ను ఆమోదించాలని ట్రిబ్యునల్ కూడా పేర్కొంది. కానీ ఏపీ ప్రభుత్వం దీనిపై హైకోర్టులో స్టే పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ట్రిబ్యునల్ తీర్పును సమర్థించింది. హిందూపురం వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థులుగా గోరంట్ల మాధవ్, ఆయన భార్య సవిత సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. -
హిందూపురం వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్ధిగా గోరంట్ల నామినేషన్
-
చంద్రబాబు తాచుపాముకంటే ప్రమాదకరం: గోరంట్ల
-
అందుకే నా భార్యతో నామినేషన్ వేయిస్తా : గోరంట్ల
సాక్షి, అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని హిందూపురం లోక్‌సభ వైఎస్సార్సీపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ ఆరోపించారు. మూడు నెలల కిందట పోలీసు ఉద్యోగానికి వీఆర్ఎస్ ఇచ్చినా ఆమోదించడంలేదని మండిపడ్డారు. ఇంటిలిజెన్స్ డీజీ వెంకటేశ్వర్ రావు, కర్నూలు డీఐజీ చంద్రబాబు ఆదేశాలతో పనిచేస్తున్నారన్నారు. హిందూపురంలో గెలుస్తానని భావించే తనపై చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రేపు(సోమవారం) హిందూపురం లోక్‌సభ స్థానానికి తాను, తన భార్య ఇద్దరం కలిసి నామినేషన్ వేస్తామని చెప్పారు. తన నామినేషన్ ఆమోందిచకపోతే తన భార్య పోటీ చేస్తుందని పేర్కొన్నారు. సంబంధిత కథనాలు పోలీస్ అధికారుల తీరు సిగ్గుచేటు మా నాన్న అప్పుడే హెచ్చరించారు : గోరంట్ల మాధవ్ రిలీవ్‌పై డీజీపీకి ఈసీ లేఖ -
బాలకృష్ణ నామినేషన్‌కు వస్తే రూ.400 ఇస్తాం..!
సాక్షి, చిలమత్తూరు: టీడీపీ ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ నేడు(శుక్రవారం) నామినేషన్ వేయనున్నారు. నామినేషన్‌కు అవసరమైన జనసమీకరణ కోసం మండలంలోని నాయకులు తలమునకలవుతూ నానా తంటాలు పడుతున్నట్లు స్థానికులు చర్చించుకోవడం విశేషం. నామినేషన్‌కు ప్రజలను తరలించడం కోసం ఒక్కొక్కరికి రూ.400 వరకు ఇస్తున్నట్లు సమాచారం. టీడీపీ నాయకులు ప్రజలను తరలించేందుకు పలు గ్రామాల్లో తిరగినట్లు ప్రజలు చెబుతున్నారు. జనం వచ్చేలా చూడాలని నియోజకవర్గపు నాయకులు స్థానిక మండల నాయకులకు పనులు అప్పగించిన్నట్లు మండలంలో హాట్ టాపిక్‌గా మారింది. గురువారం చిలమత్తూరులో నరసింహ స్వామి రథోత్సవంలో కూడా బాలయ్యను ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. జనసమీకరణపై పూర్తి స్థాయిలో దృష్టి సారించమని ఎమ్మెల్యే... నాయకులకు హుకుం జారీ చేసిన్నట్లు సొంత పార్టీ నాయకులే చర్చించుకోవడం గమనార్హం. -
దిమాక్ థోడా.. చాలా తేడా!
రాష్ట్రంలోని ఎమ్మెల్యేలలో 174 మంది ఒక ఎత్తు.. నందమూరి బాలకృష్ణ ఒక ఎత్తు! అన్ని నియోజక వర్గాలది ఒక తీరు... హిందూపురం మరో తీరు! హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ‘పైసా వసూల్’ సినిమాలో చెప్పినట్లుగానే ‘దిమాక్ థోడా.. చాలా తేడా!’ తరహాలో వ్యవహరిస్తారనే విమర్శలున్నాయి. ఆయనకు నియోజకవర్గంతో పనిలేదు. ప్రజల బాగోగుల సంగతి సరేసరి. సినిమాలో ‘గెస్ట్ ఆర్టిస్ట్’లా కేవలం మూడు నిమిషాలు వచ్చి పోయినట్లుగా ఎమ్మెల్యేగా ఐదేళ్లలో ఏటా రెండు మూడుసార్లు మాత్రమే ఆయన హిందూపురానికి వచ్చారు. అదికూడా మూడు రోజులకు మించి ఉండరు. అత్యంత ముఖ్యమైన నేతలు, సన్నిహితులు మినహా టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలకు కనీసం దర్శనం కూడా ఉండదు. పార్టీకి సంబంధించిన ఇబ్బందులైనా, ప్రజా సమస్యలైనా బాలయ్య పీఏలను సంప్రదించాల్సిందే. ఇప్పటికే నామినేషన్ల ఘట్టం మొదలైంది. పోలింగ్‌కు కొద్ది రోజులు మాత్రమే గడువు ఉంది. కానీ ఇప్పటివరకు బాలయ్య హిందూపురంలో అడుగుపెట్టకపోవడం గమనార్హం. హిందూపురంలో పీఏల సామ్రాజ్యం.. బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ ప్రాతినిథ్యం వహించిన హిందూపురం నుంచి 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎన్టీఆర్ కుమారుడు కావడం, తొలిసారి ఎన్నికల బరిలో ఉండటంతో నియోజకవర్గ ఓటర్లు ఆయన్ను ఆదరించి గెలిపించారు. బాలయ్య కుటుంబ సమేతంగా ప్రచారం చేస్తే 16,196 ఓట్లతో విజయం సాధించారు. ఎన్నికల సమయంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని కుటుంబ సమేతంగా వచ్చి పాలు పొంగించి గృహ ప్రవేశం చేశారు. ఫలితాలు వెలువడ్డాక ఇంటిల్లిపాది హైదరాబాద్‌కు తిరిగి వెళ్లిపోయారు. ఆ ఇంటిని పీఏలకు అప్పగించి నియోజకవర్గాన్ని మరిచిపోయారు. చిత్తూరు జిల్లాకు చెందిన బాలయ్య పీఏ శేఖర్ ‘షాడో ఎమ్మెల్యే’ మాదిరిగా వ్యవహరించారనే విమర్శలున్నాయి. ప్రభుత్వానికి సంబంధించిన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, చివరకు జన్మభూమి సభలు కూడా అతని ఆధ్వర్యంలోనే నడిచాయి. అధికారులు కూడా శేఖర్‌నే ఎమ్మెల్యేగా భావించి ఆయన ఆదేశాలను పాటించారు. అతను హెచ్చరిస్తే జంకారు. పొగిడితే సంబరపడిపోయారు. ఇలా మూడేళ్ల పాటు శేఖర్ హల్చల్ చేశాడు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని తారాస్థాయిలో అవినీతికి పాల్పడ్డాడు. నియోజకవర్గ నేతలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించడంతో చివరకు అతడిని తప్పించి గుంటూరు జిల్లా యడ్లపాడుకు చెందిన వీరయ్యను పీఏగా నియమించారు. ఇదే నియోజక వర్గానికి చెందిన తిమ్మాపురం మాజీ సర్పంచ్ శ్రీనివాసరావును మరో పీఏగా నియమించారు. చివరి రెండేళ్లు వీరే ఎమ్మెల్యే మాదిరిగా వ్యవహరించారు. బాలకృష్ణ ఈ ఐదేళ్లలో జన్మభూమి కార్యక్రమానికి ఒక్కరోజు కూడా హాజరు కాలేదు. పనితీరు ఆధారంగా టిక్కెట్లు కేటాయించామని చెబుతున్న సీఎం చంద్రబాబు.. మరి ఏ సూత్రాన్ని పాటించి బాలయ్యకు టిక్కెట్ కేటాయించారు? అని ఆ పార్టీ నేతలు గుసగుసలాడుతున్నారు. మహిళలపై అసభ్య వ్యాఖ్యలు... 2016 మార్చిలో ‘సావిత్రి’ ఆడియో ఫంక్షన్ సందర్భంగా ఎమ్మెల్యే అనే సంగతి కూడా మరచి మహిళలపై బాలకృష్ణ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల పట్ల సర్వత్రా నిరసనలు వ్యక్తం కావడం తెలిసిందే. ‘‘అమ్మాయిల వెంటపడే పాత్రలు నేను చేస్తే ఒప్పు కోరు కదా..! ముద్దయినా పెట్టాలి... లేదా కడుపైనా చేయాలి. అంతే కమిట్ అయిపోవాలి... హీరో రోహిత్‌కు మా పోలికలు కొద్దిగా అయినా రావాలి... గిల్లడాలు... పొడవడాలు.. నేను ఎక్కని ఎత్తుల్లేవు... చూడనిలోతుల్లేవు..’’ అంటూ బాలయ్య అసభ్యంగా మాట్లాడటంపై అంతటా విస్మయం వ్యక్తమైంది. బాలయ్య ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని, ఆయన ఒక్కక్షణం కూడా ఎమ్మెల్యేగా కొనసాగేందుకు అర్హుడు కాదని, వెంటనే పదవికి రాజీనామా చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ వ్యవహారాన్ని స్పీకర్ కోడెల దృష్టికి తెచ్చినా ఆయన స్పందించలేదు. ఈసారి బాలయ్యకు రిటర్న్‌గిఫ్ట్ తప్పదు తమను ఏమాత్రం పట్టించుకోని బాలకృష్ణకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి ఇంటికి పంపుతామని నియోజకవర్గ ప్రజలు బాహాటంగా చెబుతున్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఇక్బాల్‌కు పట్టం కడతామంటున్నారు. – మొగిలి రవివర్మ సాక్షి ప్రతినిధి, అనంతపురం -
టీడీపీ చేసిన అవినీతి ప్రజల్లోకి తీసుకెళ్లండి
-
‘హిందూపురం’లో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేద్దాం
హిందూపురం: వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలందరూ సైనికులుగా పని చేసి హిందూపురంలో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేద్దామని వైఎస్సార్సీపీ నాయకులు కొండూరు వేణుగోపాల్‌రెడ్డి, చౌళూరు రామకృష్ణారెడ్డిలు పిలుపునిచ్చారు. స్థానిక ఐఎంఏ హాల్లో బుధవారం వైఎస్సార్సీపీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయం తక్కువగా ఉంది.. ప్రతి ఒక్కరూ పార్టీ కోసం కష్టపడి పని చేయాలన్నారు. రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యమని నాయకులు అన్నారు. టీడీపీ నాయకులకు ఓటమి భయం పట్టుకుందని వారు పేర్కొన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఎలాగైన గెలుపొందాలనే ఉద్దేశంతో వైఎస్సార్సీపీ ఓట్ల తొలగింపునకు పాల్పడుతున్నారు. బూత్ కన్వీనర్లు ఓటరు జాబితాలను క్షుణంగా పరిశీలించి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. నవరత్నాల గురించి ఇంటింటికి ప్రచారం చేయాలి ప్రజాసంక్షేమమే ధ్యేయంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాల గురించి ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలన్నారు. నవరత్నాలతోనే పేదల భవిష్యత్తు మారుతుందని, ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతుందన్నారు. మహమ్మద్ ఇక్బాల్‌కు స్వాగత ఏర్పాట్లు నేడు వైఎస్సార్సీపీ నేత, రిటైర్డు ఐజీ మహమ్మద్ ఇక్బాల్ హిందుపూరానికి రానున్నారు. ఇందులో భాగంగా వైఎస్సార్సీపీ నాయకులు కొడికొండ చెక్‌పోస్టు వద్ద మహమ్మద్ ఇక్బాల్‌కు ఘనంగా స్వాగతం పలకనున్నారు. పెద్దఎత్తున నాయకులు, అభిమానులు, కార్యకర్తలు తరలిరావాలన్నారు. చెక్‌పోస్టు నుంచి ప్రత్యేక వాహనంలో ర్యాలీగా చిలమత్తూరు, లేపాక్షి మండలాల మీదుగా హిందూపురం చేరుకుంటారు. సమావేశంలో మండల కన్వీనర్లు నారాయణస్వామి, శ్రీరాంరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి, హిందూపురం పార్లమెంట్ యువజన విభాగ అధ్యక్షుడు ఉపేంద్రరెడ్డి, కౌన్సిలర్లు నాగభూషణరెడ్డి, రెహెమాన్ నాయకులు జగన్మోహన్రెడ్డి, రాజారెడ్డి, బసిరెడ్డి, బలరామిరెడ్డి, గోపికృష్ణ,అంజన్‌రెడ్డి, నరిసింహరెడ్డి, పురుషోత్తంరెడ్డి, జనార్థన్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, వెంకటేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బాలయ్యకు చుక్కెదురు
-
బాలయ్యకు చుక్కెదురు
హిందూపురం అర్బన్: చుట్టుపు చూపుగా రావడం...శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో హడావుడి చేసే బాలయ్యకు ఈ సారి తీవ్ర పరాభవం జరిగింది. రెండు రోజుల నియోజకవర్గ పర్యటనకు బుధవారం హిందూపురం వచ్చిన ఎమ్మెల్యే బాలకృష్ణకు తొలిరోజే చుక్కెదురైంది. చిలమత్తూరులో వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు..శంకుస్థాపనలు చేసిన ఆయన లేపాక్షి నంది సర్కిల్ వద్దకు రాగానే..జనం ఆయన కారును అడ్డుకున్నారు. బాలకృష్ణ కారు దిగగానే చుట్టుముట్టారు. హంద్రీనీవా ద్వారా లేపాక్షి మండలంలోని అన్ని చెరువులకు నీళ్లిస్తామని చెప్పి...చిన్న చెరువులను విస్మరించారని మండిడ్డారు. మహిళలైతే తాగేందుకు నీళ్లులేక అల్లాడిపోతున్నామని, పశువులకు నీళ్లు కూడా లేవని మండిపడ్డారు. మీకు చెప్పుకుందామంటే మీరెక్కడుంటారో తెలియకుండా పోయిందన్నారు. పరిస్థితి చేజారుతోందని గ్రహించిన టీడీపీ నాయకులు మల్లికార్జున, ఎంపీటీసీ సభ్యుడు చలపతి, మాజీ ఎంపీపీ ఆనంద్ మరికొందరు ‘జై బాలయ్య’ అంటూ నినాదాలు చేస్తూ గందరగోళం సృష్టించారు. అయినప్పటికీ మహిళలు నీటికోసం గట్టిగా నిలదీశారు. వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని వినతి పత్రం సమర్పించారు. -
అనంత వేదన.. దిక్కులేని పురం!
టీడీపీకి ఎదురుగాలి వీస్తోందని అధికార పార్టీ నేతలు గ్రహించారా? సొంత సర్వేల్లో ఓడిపోతామని తేలడంతో పోటీకి వెనుకడుగు వేస్తున్నారా? గత ఎన్నికలతో పోలిస్తే జిల్లాలో ఫలితాలు పూర్తి భిన్నంగా ఉండబోతున్నాయనే అధిష్టానం సర్వేతో నేతలు పునరాలోచనలో పడ్డారా? అనంతపురం, హిందూపురం ఎంపీ స్థానాల్లో పోటీకి అభ్యర్థులే కరువయ్యారా? తాజా పరిణామాలను బేరీజు వేస్తే అవుననే సమాధానమే వస్తోంది. మరో పది రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనుండగా టీడీపీ సిట్టింగ్‌లు ఇద్దరూ పోటీకి విముఖత చూపుతుండటం పార్టీ శ్రేణులను గందరగోళంలో పడేస్తోంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: జిల్లాలోని ప్రతీ నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య అసమ్మతి జ్వాల రగులుతోంది. అభ్యర్థుల ప్రకటన సమయంలో ఎవరికి టిక్కెట్టు వస్తుందో? ఎవరికి రాదో? కోరుకున్న స్థానాలు దక్కకపోతే ఎంతమంది పోటీ నుంచి తప్పుకుంటారో? అనే గుబులు పార్టీ అధిష్టానాన్ని తికమక పెడుతోంది. ఇదే సమయంలో పార్లమెంట్ బరిలో నిలిచేందుకు అభ్యర్థులు ముందుకు రాకపోవడం చూస్తే దిగజారిన పార్టీ పరిస్థితి ఇట్టే అర్థమవుతోంది. అనంతపురం ఎంపీగా జేసీ దివాకర్‌రెడ్డి కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను రాజకీయాల నుంచి తప్పుకుని వారసుడిగా తన కుమారుడు పవన్‌ను బరిలోకి దింపాలని భావించారు. ఆ మేరకు ఆయన కూడా తొలుత పోటీకి ఉత్సాహం కనబర్చారు. అయితే పవన్ సొంతంగా రెండు జాతీయ ఏజెన్సీలతో పాటు ఒక లోకల్ ఏజెన్సీతో సర్వే చేయించుకోగా మూడింటిలోనూ ఓటమి స్పష్టమైంది. ఇదే సమయంలో ఎమ్మెల్యే అభ్యర్థులు బలహీనంగా ఉన్నారని, మార్చాలని చంద్రబాబు వద్దే జేసీ పదేపదే తన వాణి వినిపించారు. అయినప్పటికీ ఆయన పెడచెవిన పెట్టడంతో మార్పు తనవల్ల కాదనే వాస్తవం జేసీకి బోధపడింది. ఈ నేపథ్యంలో అనంతపురంలో రైల్వే బ్రిడ్జి, పాతూరు రోడ్ల విస్తరణ అంశాలపై ఈనెల 15న హడావుడిగా అమరావతికి వెళ్లి సీఎంను కలిశారు. ఈ విషయంపై పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని బెదిరించినప్పటికీ చంద్రబాబు తేలిగ్గా తీసుకున్నట్లు తెలిసింది. ఈ పరిణామంతోటీడీపీలో ఆయన స్థానం, తన మాటకున్న విలువ స్పష్టమైంది. గతంలో గుంతకల్లు, అనంతపురం విషయంలో ఇద్దరు నేతలకు ఇచ్చిన హామీలు కూడా నెరవేరకపోవడంతో ఎంపీగా తాము పోటీ చేయలేమని, తాడిపత్రితో పాటు గుంతకల్లు అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని విన్నవించారు. గుంతకల్లు వీలుకాని పక్షంలో అనంతపురం ఇవ్వాలని అభ్యర్థించినా రెండింటికీ బాబు ససేమిరా అన్నట్లు చర్చ జరుగుతోంది. కుమారుడిని రాజకీయ ఆరంగేట్రం చేయించి ఎంపీగా బరిలో నిలిపినా.. ఓడిపోతే ఐదేళ్లు జిల్లా రాజకీయాలను వదిలి సొంత వ్యవహారాలు చూసుకోవాల్సి వస్తుంది. దీంతో తాడిపత్రి నుంచి బరిలోకి దించాలని భావించారు. అయితే తాడిపత్రిలో కచ్చితంగా తన కుమారుడు అస్మిత్‌ను పోటీలో నిలుపుతానని, ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని ప్రభాకర్‌రెడ్డి తేల్చి చెప్పినట్లు సమాచారం. దీంతో దివాకర్‌రెడ్డి దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ‘పురం’ పార్లమెంట్‌కు అభ్యర్థి కరువేనా? రెండు పార్లమెంట్ల పరిధిలో బీసీ ఓటర్లు ఎక్కువగా ఉండాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయా స్థానాల్లో బోయ, కురుబ అభ్యర్థులను బరిలో నిలిపేందుకు వైఎస్సార్సీపీ సిద్ధమైంది. హిందూపురం పార్లమెంట్ పరిధిలో కురుబలు అధిక సంఖ్యలో ఉన్నారు. దీంతో ఓటమి తప్పదని భావించిన ఎంపీ నిమ్మల కిష్టప్ప, పెనుకొండ సీటు ఆశించారు. పార్థసారథి కురుబ కావడంతో ఎంపీగా బరిలోకి దించి అసెంబ్లీ తనకు ఇవ్వాలని కిష్టప్ప టీడీపీ అధిష్టానంతో విన్నవించారు. ఎంపీగా ఓటమి తప్పదని సర్వేల్లో వచ్చిందని, తాను వెళ్లనని బీకే తేల్చిచెప్పి, పెనుకొండే కావాలని పట్టుబట్టారు. దీంతో కిష్టప్ప పుట్టపర్తి టిక్కెట్ ఇవ్వాలని, తన కుమారున్ని బరిలోకి దించుతానని చెప్పుకొచ్చారు. దీనిపై ఇంకా టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకోలేదు. పుట్టపర్తిలో తనను మారుస్తారని సమాచారం ఉండటంతో పల్లె రఘునాథరెడ్డి టిక్కెట్ దక్కించుకోవడం కోసం తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. దీంతో మైనార్టీ తరఫున అత్తార్చాంద్ బాషాను దించితే బాగుంటుందని నిమ్మల అధిష్టానానికి ఉచిత సలహా ఇచ్చారు. అత్తార్ కూడా ఎంపీగా ఓడిపోతానని, కదిరి సీటే కావాలని లోకేశ్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అటు అనంతపురం, ఇటు హిందూపురం ఎంపీగా ఓటమి తప్పదని సిట్టింగ్‌లు తప్పించుకుంటున్న తీరుతో పార్టీ అధిష్టానం జిల్లాలో రాజకీయ పరిస్థితులపై పూర్తిగా ఆత్మరక్షణలో పడింది. అసెంబ్లీ సీట్ల పరిస్థితీ అంతే.. పల్లె రఘునాథరెడ్డి కూడా తన సర్వేలో ఓడిపోతారని తేలింది. టిక్కెట్టు మార్చాలనే నిర్ణయానికి పార్టీ వచ్చింది. దీంతో రఘునాథరెడ్డి కొత్త పల్లవి అందుకున్నారు. అధిష్టానం నిర్ణయమే తనకు శిరోధార్యమని, అసెంబ్లీ టిక్కెట్టు ఇవ్వకపోతే, ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ ఇవ్వండని అధిష్టానం ముందు మరో ఆప్షన్ పెట్టినట్లు తెలిసింది. కదిరి టిక్కెట్ తనకు కావల్సిందేనని మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ పట్టుబడుతున్నారు. వైఎస్సార్సీపీలో గెలిచి చాంద్‌బాషా టీడీపీలోకి వచ్చారని, రేపు వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే తిరిగి వెళ్లడని గ్యారెంటీ ఏంటని లోకేశ్‌తో తన వాణి విన్పించారు. ఇదిలా ఉంటే రాయదుర్గంలో కూడా ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీ తనకు సహకరించరని, ఓటమి తప్పదని భావించిన మంత్రి కాలవ కూడా గుంతకల్లు సీటు ఆశిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. అయితే ఎంపీగా పోటీ చేస్తావా? అని అధిష్టానం అడగడంతో ఓడిపోయే సీటు తనకెందుకని తిరస్కరించినట్లు తెలిసింది. ‘దుర్గం’ నుంచి ఓటమి తప్పదు, ఎంపీగా అదే పరిస్థితి, ఏం చేయాలో దిక్కుతెలియక ఆయన డైలమాలో ఉన్నారు. దీంతో పాటు శింగనమల నుంచి యామినీ, శమంతకమణికి కాకుండా బండారు శ్రీవాణికి టిక్కెట్ ఇవ్వాలనే యోచనలో టీడీపీ ఉంది. ఇదే జరిగితే టీడీపీలో ఉండాల్సిన అవసరం లేదని శమంతకమణి గట్టిగానే తన వాదన వినిపించినట్లు సమాచారం. కళ్యాణదుర్గంలో చౌదరికి అసమ్మతి సెగ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి అభ్యర్థులను ప్రకటించకముందే ఆదివారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. దీనిపై జెడ్పీటీసీ రామ్మోహన్చౌదరితో పాటు నారాయణ, మల్లికార్జున, వైటీ రమేశ్, లక్ష్మీనారాయణ, రమేశ్‌తో పాటు టిక్కెట్ ఆశిస్తున్న ఉమామహేశ్వరనాయుడు జిల్లా అధ్యక్షుడికి ఫిర్యాదు చేశారు. ఆయన జోక్యం చేసుకొని ప్రచారానికి బ్రేక్ వేశారు. దీన్నిబట్టి చూస్తే తనకు టిక్కెట్టు ఇవ్వనట్లే కదా? అలాంటప్పుడు పార్టీలో ఎందుకుండాలని చౌదరి కూడా గట్టిగానే ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దీంతో ‘దుర్గం’లో వర్గపోరు ఒక్కసారిగా భగ్గుమంది. -
అనంతపురం జిల్లాలో టీడీపీకి భారీ షాక్
-
వైఎస్సార్సీపీలోకి ‘పురం’ మాజీ ఎమ్మెల్యే ఘని
సాక్షి ప్రతినిధి, అనంతపురం: హిందూపురం తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘని ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. శనివారం ఉదయం ఆయన టీడీపీకి రాజీనామా చేసి, ఆ ప్రతిని చంద్రబాబునాయుడుకు ఫ్యాక్స్ ద్వారా పంపించారు. ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఘనీకి జగన్ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఇన్చార్జి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పాల్గొన్నారు. ఇదిలాఉంటే ‘అనంత’ తెలుగుదేశం పార్టీ మైనార్టీ వర్గంలో ఘని కీలక నేత. 2009లో హిందూపురం ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో నందమూరి బాలకృష్ణ ‘పురం’ నుంచి పోటీ చేయడంతో టీడీపీ అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యే అయినప్పటికీ టిక్కెట్ నిరాకరించింది. మైనార్టీలకు టీడీపీలో సరైన గుర్తింపు దక్కకపోవడం, తెలుగుదేశం పార్టీ విధానాలు నచ్చకపోవడంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వం పట్ల ఆకర్షితులై పార్టీలో చేరారు. ఈయన రాజీనామాతో హిందూపురం లో టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. గత ఎన్నికల్లో బాలకృష్ణ విజయం కోసం ఘని తీవ్రంగా శ్రమించారు. ప్రస్తుతం ఆయన వైఎస్సార్సీపీలో చేరడంతోమైనార్టీ నేతలంతా దాదాపు టీడీపీకి దూరమైనట్లే. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీదే విజయం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వాన్ని ఇష్టపడి సామాన్య కార్యకర్తలా వైఎస్సార్సీపీలో చేరాను. పార్టీ అధినేత ఏ బాధ్యతలు అప్పగించినా శక్తివంచన లేకుండా పార్టీ అభ్యున్నతికి పాటుపడతా. మైనార్టీలకు టీడీపీలో ఏ మాత్రం గౌరవం లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా నన్ను పక్కనపెట్టారు. గత ఎన్నికల్లో జిల్లాలో ఎక్కడా మైనార్టీలకు స్థానం కల్పించలేదు. మైనార్టీలకు గతంలో న్యాయం చేసింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమే. భవిష్యత్తులో కూడా జగన్మోహన్రెడ్డితోనే మైనార్టీలకు న్యాయం జరుగుతుంది. రిజర్వేషన్లకు ఆయన కట్టుబడి ఉన్నారు. హిందూపురం పార్లమెంట్లో ప్రస్తుతం టీడీపీ పరిస్థితి, నియోజకవర్గంపై ఎమ్మెల్యే బాలకృష్ణ బాధ్యతారాహిత్యం అందరికీ తెలుసు. వచ్చే ఎన్నికల్లో ‘పురం’లో వైఎస్సార్సీపీ జెండా ఎగరడం ఖాయం. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా పనిచేస్తాం. ఇన్నాళ్లూ నన్ను ఆదరించిన మైనార్టీ సోదరులు, పురం నియోజకవర్గ ప్రజలు ఇక మీదట కూడా అండగా ఉండాలని కోరుకుంటున్నా. -
వైఎస్సార్సీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే
సాక్షి, శ్రీకాకుళం: అనంతపురం జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. హిందూపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకుడు అబ్దుల్ గని శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో అబ్దుల్ గని పార్టీలో చేరారు. గత నాలుగున్నరేళ్ల పాలనలో మైనారిటీలకు చంద్రబాబునాయుడు చేసేందేమీ లేదని ఈసందర్భంగా అబ్దుల్ గని పేర్కొన్నారు. టీడీపీలో 30 ఏళ్లుగా తాను సేవలు అందించినా.. ప్రాధాన్యత కల్పించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిదేనని గుర్తు చేశారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా ఎంతోమంది విద్యార్థులు లబ్ధిపొందారని పేర్కొన్నారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు బావమరిది, ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిధ్యం హిందుపురం నియోజకవర్గం నుంచి టీడీపీ సీనియర్ నేత వైఎస్సార్సీపీలో చేరడం.. ఆ పార్టీ శ్రేణులకు గట్టి షాక్ ఇచ్చింది. టీడీపీ సీనియర్ నేత అయిన అబ్దుల్ గని 2009 నుంచి 2014 వరకు హిందూపురం ఎమ్మెల్యేగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో సినీ నటుడు బాలకృష్ణ కోసం ఆయన హిందూపురం సీటును వదులుకున్నారు. అబ్దుల్ గని చేసిన ఈ త్యాగానికి ప్రతిఫలంగా ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ, నాలుగున్నరేళ్లు అవుతున్నా ఆ హామీని నెరవేర్చలేదు. మరోవైపు ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా ఆయనను పట్టించుకోకుండా అవమానాలకు గురిచేశారు. ఈ నేపథ్యంలో ప్రజానేత వైఎస్ జగన్‌కు పెరుగుతున్న ప్రజాభిమానానికి తాను సైతం మద్దతు పలుకుతూ.. అబ్దుల్ గని తాజాగా వైఎస్సార్సీపీలో చేరారు. -
బాలయ్య ఇంటి వద్ద దబిడి.. దిబిడి
హిందూపురం అర్బన్: మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు బుధవారం తెల్లవారుజామున పట్టణంలోని ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటిని ముట్టడించారు. ప్రభుత్వం కార్మికులు పొట్ట కొడుతున్నా ఆయన ఎందుకు స్పందించడం లేదంటూ ఇంట్లోకి దూసుకెళ్లి చెత్తాచెదారాన్ని, మురుగును అక్కడ పడేసి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఓ 279 తమ భవిష్యత్తును కాలరాస్తోందని, పాలకులు తమ నోటికాడ కూడు లాగేసి కాంట్రాక్టర్లకు వడ్డించాలని చూస్తున్నారని నాలుగు రోజులుగా వారు మున్సిపల్ ఆఫీసు ఎదుట నిరసన దీక్షలు చేస్తున్నా ఎమ్మెల్యే బాలకృష్ణతోపాటు పాలకులు ఎవరూ పట్టించుకోలేదు. పైగా మున్సిపల్ అధికారులు దీక్షలు చేస్తున్న 220 మందిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు చెప్పడంతో పారిశుద్ధ్య కార్మికుల కడుపు రగిలిపోయింది. ఈ నేపథ్యంలో వారు సీఐటీయూ నాయకుల ఆధ్వర్యంలో బుధవారం తెల్లవారుజామునే తరలివెళ్లి బాలకృష్ణ ఇంటిని ముట్టడించారు. గేటు ముందు నిల్చుని నినాదాలు చేసినా ఎమ్మెల్యే పీఏ వీరయ్య, కో–ఆర్డినేటర్ శ్రీనివాసరావు బయటకు రాలేదు. దీంతో వెంట తీసుకొచ్చిన చెత్తసంచులను ఇంట్లో పారబోశారు. ఇంతలో విషయం తెలుసుకున్న సీఐలు చిన్నగోవిందు, తమీంఅహ్మద్ సిబ్బందితో తరలివచ్చి వారిని లోనికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తోపులాటలతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసులు కార్మికులను ఈడ్చి పడేశారు. ఈ ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న జిల్లా నాయకులు వెంకటేష్, రాజప్ప, రాములను పోలీసులు అదుపులోకి తీసుకుని జీపులో స్టేషన్‌కు తరలించడానికి ప్రయత్నించారు. అయితే కార్మికులు తమపై నుంచి తీసుకెళ్లండి అంటూ జీపులను అడ్డంగా పడుకున్నారు. పోలీసులు వారిని లాగేసి నాయకులను వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వాగ్వాదాలు, తోపులాటలతో అక్కడి వాతావరణం రణరంగంగా మారింది. ఈ తోపులాటలో కార్మికురాలు నాగమ్మ ఛాతీకి బలమైన దెబ్బ తగలడంతో ఆమె అక్కడే కుప్పకూలిపోయింది. ఆమెను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో బెంగళూరుకు తీసుకెళ్లారు. ఏళ్ల తరబడి పనిచేస్తుంటే అన్యాయంగా తొలగిస్తారా..? ఈ సందర్భంగా కార్మికులు, నాయకులు మాట్లాడుతూ ఏళ్ల తరబడి రాత్రింబవళ్లూ పారిశుద్ధ్య పనులు చేస్తుంటే రెగ్యులర్ చేయలేదన్నారు. 279జీఓ తెచ్చి తమ కుటుంబాలను రోడ్డుపాలు చేయడానికి సిద్ధమైందంటూ టీడీపీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఆ జీఓను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత నెలలో సుమారు 15రోజులు రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేస్తే దిగి వచ్చిన ప్రభుత్వం పాత పద్ధతినే కొనసాగిస్తామని చెప్పినప్పటికీ ఎక్కడా లేని విధంగా హిందూపురం మున్సిపాల్టీలో మాత్రం ఆ జీఓను అమలు చేస్తున్నారని, జియో ట్యాగింగ్, ఇతర నిబంధనలు ప్రవేశపెడుతూ వేదనలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఇది అన్యాయమని నాలుగు రోజులుగా సమ్మె చేస్తుంటే 220 మంది కార్మికులను తొలగిస్తున్నామని చెప్పడం దుర్మార్గమన్నారు. వెంటనే జీఓ 279ను రద్దు చేసి, తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి బావమరిది బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో ఇంత దౌర్భగ్య పరిస్థితులు ఉన్నప్పటికీ ఆయన ఇటువైపు కన్నెత్తి చూడటం లేదన్నారు. ఆయన హిందూపురం వస్తున్నాడంటే తాము రాత్రింబవళ్లూ పట్టణాన్ని శుభ్రం చేస్తున్నామని, కానీ ఆయన తమ గురించి పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు. ప్రభుత్వం తమపై కక్షగట్టి వ్యవహరిస్తోందని, పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని విచారం వెలిబుచ్చారు. రెండు నెలల నుంచి ఈ ప్రాంతంలో వినూత్నరీతిలో నిరసనలు తెలియజేస్తున్నా ఎమ్మెల్యే బాలకృష్ణ కనీసం మాటమాత్రానికైనా ఈ విషయం గురించి మాట్లాడకపోవడం తమ దౌర్భగ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. 165 మంది కార్మికులు అరెస్టు ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటిని ముట్టడించడంతో వన్‌టౌన్ పోలీçసులు 166 మంది కార్మికులను అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. వారిపై 151 సీఆర్పీసీ ప్రకారం కేసులు నమోదు చేశారు. తర్వాత వ్యక్తిగత పూచీకత్తుపై వదలివేశారు. -
రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం చెందారు. ద్విచక్రవాహనాల్లో వెళుతున్న వారిని లారీ, టిప్పర్ రూపంలో మృత్యువు కబళించింది. రెండు కుటుంబాల్లోనూ తీరని విషాదం మిగిల్చింది. కుటుంబ సభ్యుల రోదనలు చూపరులను కలచివేశాయి. హిందూపురం అర్బన్: రోడ్డు ప్రమాదంలో చేనేత కార్మికుడు దుర్మరణం చెందాడు. వివరాల్లోకెళ్తే.. హిందూపురం పట్టణంలోని వీవర్స్ కాలనీలో నివాసముంటున్న చేనేత కార్మికుడు రాము (30), శాంత దంపతులు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. నేతపనికి అవసరమైన ముడి సరుకు కోసం బుధవారం రాము ద్విచక్రవాహనంలో ముద్దిరెడ్డిపల్లికి వెళ్లాడు. అక్కడ పని ముగించుకుని బైపాస్ మీదుగా ఇంటికి బయల్దేరాడు. ఆటో నగర్ సమీపంలో తన ముందు వెళ్తున్న టిప్పర్ డ్రైవర్ ఉన్నపళంగా బ్రేక్ వేశాడు. ఆ వెనకే వస్తున్న రాము వేగం అదుపుకాకపోవడంతో టిప్పర్ కిందకు దూసుకుపోయాడు. తల పగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పొట్టకూటి కోసం వెళ్లి తిరిగిరాని లోకాలకు.. రొళ్ల: పొట్టకూటి కోసం వలస వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. రొళ్ల మండలం హెచ్.టి.వడ్రహట్టికి చెందిన అనితమ్మ, వెంకటేష్ దంపతులకు ఒక కుమారుడు, ఒకుమార్తె ఉన్నారు. కుమారుడు గిరిష్ (19) బెంగళూరులోని మల్లేశ్వరంలో మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్నాడు. అక్కడే బలగలగుంటలో గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. మంగళవారం రాత్రి విధులు ముగించుకుని ద్విచక్రవాహనంలో ఇంటికి బయల్దేరాడు. మార్గం మధ్యలో రోడ్డు దాటుతుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో గిరిష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మల్లేశ్వరం పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం మధ్యాహ్నం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఒక్కగానొక్క కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
హత్య చేసి.. దహనం
హిందూపురం అర్బన్: కర్టాటకలోని పోలేపల్లి సమీపంలో గుర్తు తెలియని 22 ఏళ్ల యువతి శవం లభ్యమైంది. ఈమెను హత్య చేసి గోనె సంచిలో ఇక్కడి తీసుకువచ్చి పెట్రోల్ పోసి కాల్చిచంపినట్లు కొడిగెనహళ్లి పోలీసులు కేసునమోదు చేశారు. కాగా బుధవారం మృతురాలి తల్లి అపర్ణ తన కుమారై 23వతేది నుంచి కనపించడం లేదని వన్ టౌన్‌పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టన సీఐ చిన్న గోవిందు పోలేపల్లి వద్ద లభ్యమైన శవం దీపికగా గుర్తించారు. అపర్ణ తన కుమారైను అన్న కొడుకు పాండు వినయ్‌తో ఎనిమిది సంవత్సరాల క్రితం వివాహం చేసింది. వీరికి ఒక కొడుకు ఉన్నాడు. పెళ్లెనా ఏడాదికే కుటుంబ కలహాలు ఆస్తి తగాదాలతో విడిపోయారు. ఈ నేపథ్యంలో దీపిక మృతి చెందటంతో హత్య కేసుగా కర్ణాటక పోలీసులు నమోదు చేశారు. ఈ మేరకు కర్టాటక పోలీసులు హిందూపురానికి వచ్చి విచారణ చేశారు. -
బాలకృష్ణ ఇంటి ముందు మహిళల నిరసన
-
వచ్చే ఎన్నికల్లో బాలకృష్ణ ఓటమి ఖాయం
హిందూపురం: అనంతపురం జిల్లా హిందూపురంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సర్వే పేరుతో వైఎస్సార్సీపీ నేతలకు టీడీపీ నాయకులు ప్రలోభాలకు గురిచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి మద్ధతు ఇస్తే భారీ ప్యాకేజీ ఇస్తామంటూ ఎర వేస్తున్నారు. టీడీపీకి మద్ధతుగా సర్వే చేస్తోన్న 15 మందిని పట్టుకుని వైఎస్సార్సీపీ నేతలు పోలీసులకు అప్పగించారు. హిందూపురంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, వైఎస్సార్సీపీ నేతలను ప్రలోభపెడుతున్న వారిపై చర్యలు తీసుకోవడం లేదని వైఎస్సార్సీపీ నేత నవీన్ నిశ్చల్ ఆరోపించారు. సర్వే పేరుతో వైఎస్సార్సీపీ నేతల కీలక సమాచారాన్ని సేకరించడం దుర్మార్గమన్నారు. వచ్చే ఎన్నికల్లో బాలకృష్ణ ఓడిపోవడం ఖాయమన్నారు. అందుకే టీడీపీ నేతలు భయపడి కుట్ర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. -
హిందూపూర్‌లో వైఎస్సార్సీపీ నేతలు ఆందోళన
-
అనంతపురం, హిందూపురం..రంగయ్య, నదీమ్
సాక్షి ప్రతినిధి, అనంతపురం : అనంతపురం, హిందూపురం పార్లమెంట్లకు వేర్వేరుగా సమన్వయకర్తలను నియమిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన పేరుతో పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన జారీ చేసింది. అనంతపురం, హిందూపురం పార్లమెంట్ల సమన్వయకర్తగా ఇప్పటి వరకూ కొనసాగిన తలారి పీడీ రంగయ్యను అనంతపురం పార్లమెంట్మన్వయకర్తగా నియమించారు. అలాగే అనంతపురం అర్బన్ సమన్వయకర్తగా ఉన్న నదీమ్ అహ్మద్‌ను హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్తగా నియమించారు. అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడు అనంత వెంకట్రా మిరెడ్డిని అనంతపురం అర్బన్ నియోజకవర్గ సమన్వయకర్తగా కూడా నియమించారు. సముచిత నిర్ణయమే హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్తగా నదీమ్ అహ్మద్‌ను ఎంపిక చేయడం మంచి నిర్ణయమే. వైఎస్సార్ కుటుంబానికి ముందు నుంచి మైనార్టీలు అంటే చాలా ప్రేమ. 2004 ఎన్నికల్లో సైతం హిందూపురం పార్లమెంట్ స్థానానికి కదిరికి చెందిన కర్నల్ నిజాముద్దీన్‌కి టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. అలాగే 2009 ఎన్నికల్లో సైతం మళ్లీ మైనార్టీ అభ్యర్థి అయిన ఖాసీమ్ఖాన్కు టికెట్ ఇచ్చారు. అయితే ప్రజారాజ్యం పార్టీ తరపున కడపల శ్రీకాంత్‌రెడ్డి బరిలో ఉండడం వల్ల ఖాసీం ఖాన్ ఓటమి పాలయ్యేవాడు. లేకపోతే అప్పుడు కూడా మైనార్టీ అభ్యర్థే గెలుపొందేవారు. ఇప్పుడు మా అధినేత జగన్మోహన్రెడ్డి హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్తగా నదీమ్‌ను ఎంపిక చేయడం మంచి నిర్ణయం. మైనార్టీలకు సముచిత స్థానం కల్పించారు. నదీమ్ నియామకం మైనార్టీలకు ఇచ్చిన గౌరవం జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు ఉంటే గత ఎన్నికల్లో ఒక్క అసెంబ్లీ స్థానంలో కూడా టీడీపీ మైనార్టీ అభ్యర్థిని నిలపలేదు. ఏపీ కేబినెట్లో కూడా మైనార్టీకి అవకాశం లేదు. మేము కదిరి అసెంబ్లీకు మైనార్టీ అభ్యర్థిగా చాంద్‌బాషాకు అవకాశం ఇచ్చాం. అతను పార్టీని మోసం చేసి వెళ్లిపోయాడు. ఇప్పుడు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్తగా నదీమ్‌ను నియమించింది. ఈ నియామకం మైనార్టీలకు ఇచ్చిన గౌరవం. నదీమ్ మంచి వ్యక్తి, సౌమ్యుడు ఖచ్చితంగా అతనికి తామంతా సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నాం. అతని నియామకాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. నదీమ్‌కు పూర్తిస్థాయిలో సహకరిస్తాం. వైఎస్.జగన్మోహన్రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. -
కూల్ డ్రింక్ తాగి ముగ్గురు యువకుల అస్వస్థత
-
హిందూపురం వ్యవసాయ మార్కెట్‌యార్డ్‌లో రైతు మృతి
-
బ్యాట్‌తో బాలయ్య హల్చల్
సాక్షి, హిందూపురం : టాలీవుడ్ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురంలో సందడి చేశారు. బ్యాట్ పట్టి కాసేపు మైమరిపించారు. శనివారం స్థానిక ఎంజీఎం గ్రౌండ్లో బసవతారకం మెమోరియల్ క్రికెట్ టోర్నీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆటగాళ్లను పరిచయం చేసుకున్న బాలయ్య.. అనంతరం బ్యాట్‌తో ఢిఫెన్స్ షాట్స్ ఆడుతూ అభిమానులను అలరించారు. ఎప్పుడూ సినిమాల్లో డైలాగ్‌లతో మెప్పించే బాలకృష్ణ తమ వద్ద బ్యాట్ పట్టుకునే సరికి అభిమానులు ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఆ ప్రాంగణమంతా ఆహ్లాదకరమైన దావాతావరణం నెలకొంది. -
అనంతలో తెలుగు తమ్ముళ్ల దౌర్జన్యం..
-
బాలకృష్ణ ఇలాకాలో రెచ్చిపోయిన తమ్ముళ్లు
-
బాలకృష్ణ ఇలాకాలో రెచ్చిపోయిన తమ్ముళ్లు
సాక్షి, హిందూపురం: సినీ నటుడు బాలకృష్ణ ప్రాతినధ్యం వహిస్తున్న హిందూపురం నియోజక వర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికారం అండతో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయి ప్రతిపక్ష కార్యకర్తలపై దాడికి దిగారు. స్థానిక ప్రజా సమస్యలను తీర్చాలని డిమాండ్ చేస్తూ.. సోమవారం రాస్తోరోకో నిర్వహిస్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడి చేశారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
లోకేశ్ కోసం సీటు కావాలి !
-
అభిమానిపై మళ్లీ చేయిచేసుకున్న బాలకృష్ణ
సాక్షి, హిందూపురం: నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి తన ఆగ్రహాన్ని చూపించారు. అభిమానిపై మళ్లీ చేయి చేసుకున్నారు. అనంతపురం జిల్లా హిందూపురం బోయపేటలో మంగళవారం ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజక వర్గ సమస్యలపై బాలకృష్ణను అడుగడుగునా జనం నిలదీశారు. అప్పటికే తీవ్ర అసహనంతో ఉన్న ఆయన తనను దాటుకుని ముందుకెళ్తున్న ఓ అభిమానిపై ఆగ్రహంతో ఊగిపోయి అతని చెంప చెళ్లుమనిపించారు. గతంలో కూడా పలుమార్లు బాలకృష్ఱ అభిమానులపై చేయిచేసుకున్న విషయం విదితమే. చెంప చెళ్లుమనిపించిన బాలకృష్ణ అసిస్టెంట్ ను కొట్టిన బాలయ్య -
బాలకృష్ణ హామీలన్నీ మునిగె..
హిందూపురం: సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తోన్న హిందూపురం నియోజకవర్గ కేంద్రంలోని పలు ప్రాంతాలు చిన్నపాటి వర్షానికే జలమయం అవుతున్నాయి. దీంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం వస్తే ఆ రోజు రాత్రంతా జాగరణ ఉండాల్సిన దుస్థితి నెలకొందని వాపోతున్నారు. హిందూపురంలోనే ఉండి సమస్యలను పరిష్కరిస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన బాలకృష్ణ.. గెలిచాక నియోజకవర్గానికి రావడం కూడా మానేశారని ప్రజలు విమర్శిస్తున్నారు. పట్టణం నడిబొడ్డున ఉన్న హస్నాబాద్ వర్షం వస్తే చెరువును తలపిస్తుంది. అదేవిధంగా గాంధీనగర్, ఆజాద్‌నగర్ ప్రాంతాలు కూడా వర్షం వచ్చిన ప్రతిసారీ నిండిపోతున్నాయి. ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రూ.10 లక్షలు మంజూరైనా పనుల్లేవ్ న్యూ హస్నాబాద్ నుంచి అహ్మద్ నగర్ వరకు ప్రత్యేక డ్రైన్ నిర్మించడానికి ప్రభుత్వం రూ.10 లక్షలు నిధులు మంజూరు చేసింది. ఈ పనులకు ఎనిమిది నెలల క్రితం ఎమ్మెల్యే బాలకృష్ణ భూమిపూజ చేశారు. అయినా ఈ పనులను ఇంతవరకు మొదలు పెట్టలేదు. మాగోడు పట్టించుకునే వారు లేరు వర్షం వస్తే భయమేస్తుంది. డ్రైన్ల మురికి వర్షపునీరంతా ఇళ్లలోకి వచ్చేస్తుంది. పిల్లలు, పెద్దలు రాత్రంతా ఇంట్లో చేరిన నీటిని ఎత్తివేయడం సరిపోతుంది. ఎన్నికల సమయంలో సమస్య పరిష్కరిస్తామని హామీలు ఇచ్చినా ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. –రజీయా, హస్నాబాద్ ఇబ్బందులు తప్పడం లేదు వర్షపునీరు ఇళ్లలోకి రాకుండా అండర్ డ్రైన్ ద్వారా బయటకు వెళ్లడానికి కొత్త డ్రైన్ వేస్తామని చెప్పారు. ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా వచ్చి మూడునెలల్లో పూర్తి చేసి సమస్య లేకుండా చేస్తామన్నారు. కానీ ఇంతవరకు ఏమిచేయలేదు. మాకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. - వాజిద్, హస్నాబాద్ కౌన్సిల్లో చాలాసార్లు ప్రస్తావించా హస్నాబాద్, అహ్మద్‌నగర్, గాంధీనగర్ ప్రాంతాల ఇబ్బందుల గురించి చాలాసార్లు కౌన్సిల్లో ప్రస్తావించాను. అధికారులు ఇదిగో.. అదిగో.. అంటున్నారే గానీ ప్రజల ఇబ్బందులు పట్టించుకోవడం లేదు. కనీసం కాల్వలు కూడా శుభ్రం చేయించడం లేదు. - ఆసీఫ్‌వుల్లా, వైఎస్సార్సీపీ కౌన్సిలర్ -
యాజమాన్య పద్ధతులతో ‘పట్టు’
- ఫామ్ బిజినెస్ మేనేజ్మెంట్పై శిక్షణ - రాష్ట్రంలోని 13 జిల్లాల పట్టు పరిశ్రమ అధికారుల హాజరు హిందూపురం: పట్టు పరిశ్రమలో ఆధునిక యాజమాన్య పద్ధతులు ఆచరించి, అధిక ఆదాయం పొందేవిధంగా రైతులను క్షేత్ర స్థాయిలో ప్రోత్సహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పట్టుపరిశోధన అభివృద్ధి సంస్థ సంచాలకులు డా. పి.జె రాజు పేర్కొన్నారు. శనివారం కిరికెరలోని పట్టుపరిశోధన కేంద్రంలో ఏపీఎస్ఎస్ఆర్డీఐ, మేనేజ్మెంట్ హైదారాబాద్ వారు సంయుక్తంగా ఫామ్ బిజినేస్ మేనేజ్మేంట్ ఫర్ సిరికల్చర్ సెక్టార్‌పై మూడు రోజుల శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టుపరిశ్రమలో మార్కెట్ ధరలను అవగాహన చేసుకొని రైతులకు మంచి యాజమాన్య పద్ధతులను అవలంభించే విధంగా తర్ఫీదు ఇచ్చి పట్టుపరిశ్రమ లాభదాయకంగా చేయాలన్నారు. కర్ణాటక హైదరాబాదు నుంచి వచ్చిన శాస్త్రవేత్తలతో అధికోత్పత్తికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సలహాలు, సూచనలు అందించారు. పంట సాగులో ఖర్చులు తగ్గించుకొని, అదిక దిగుబడుల కోసం ఆధునిక పద్ధతులు అవలంభించే విధంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో సెంట్రల్ సెరికల్చర్ బోర్డు బెంగళూరుకి చెందిన డా.కుమారసేన, మైసూరు యూనివర్శిటీ ప్రొఫెసర్ వెంకటేశ్వరకుమార్, చింతామణి అగ్రికల్చర్ యూనివర్శిటీ ప్రొఫెసర్ విజయేంద్ర, ఫామ్మేనేజ్ డీడీ కరీం, డా. సీతారాములు, డా.గోయల్, డా.సతీష్, 13 జిల్లాల పట్టుశాఖ అధికారులు పాల్గొన్నారు. -
వైద్యుల నిర్లక్ష్యంపై ఆగ్రహం
హిందూపురం: హిందూపురం ప్రభుత్వాస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంగాపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజీవరాయునిపల్లికి చెందిన గర్భిణి నాగరత్న ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరితే వైద్యులు నాలుగు రోజులు చికిత్స చేసి.. బుధవారం రాత్రి పరిస్థితి విషమంగా ఉందని అనంతపురానికి రెఫర్ చేశారు. హుటాహుటిన అనంతపురం సర్వజనాస్పత్రికి తీసుకెళ్లగా అదేరోజు అర్ధరాత్రి వైద్యులు సిజేరియన్ చేయగా మగబిడ్డ పుట్టాడు. ఫిట్స్ రావడంతో నాగరత్న గురువారం ఉదయం మృతి చెందింది. శుక్రవారం ఉదయం మృతురాలి తల్లి సిద్దమ్మ, గ్రామస్తులు పురిటిబిడ్డతో వచ్చి హిందూపురం ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి తన బిడ్డను పొట్టన పెట్టుకున్నారని, పురిటిబిడ్డకు తల్లిని లేకుండా చేశారని శాపనార్థాలు పెట్టారు. బాధ్యులైన వైద్యులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారిని సర్ది చెప్పడానికి ప్రయత్నించినా వినలేదు. చివరకు ఆస్పత్రి ఆర్ఎంఓ రుక్మిణమ్మ వచ్చి పూర్తివివరాలు తెలుసుకుని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పోలీసులు కూడా ఫిర్యాదు ఇస్తే కేసు నమోదు చేస్తామని చెప్పడంతో ఆందోళనకారులు శాంతించారు. -
‘ఓపి’కుంటేనే వైద్యం!
ఇది హిందూపురం ప్రభుత్వాసుపత్రి. వైరల్ ఫీవర్‌తో పాటు డెంగీ లక్షణాలతో వందలాది రోగులు తరలిరావడంతో కిక్కిరిసింది. చిన్న పిల్లల వార్డులు మంచం దొరకడం గగనమైంది. ఒకే మంచంపై ఇద్దరు ముగ్గురికి వైద్యం అందించాల్సి వచ్చింది. అదనంగా వచ్చే రోగులకు నేలపైనే చికిత్స చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిరీక్షిస్తే తప్ప వైద్యులను చేరుకునే పరిస్థితి లేకపోవడంతో రోగులతో పాటు సహాయకులకు చుక్కలు కనిపించాయి. కూలైన్లో తోపులాట.. వాగ్వాదాలతో పాటు చిన్నారుల రోదన.. రోగుల అవస్థలతో ఆసుపత్రి ఆవరణ యుద్ధ వాతావరణాన్ని తలపించింది. ఇక్కడ మొత్తం 19 మంది వైద్యులు అవసరం కాగా.. 13 మంది మాత్రమే ఉండటంతో రోగులకు వైద్యం అందని ద్రాక్షగా మారుతోంది. ఇకపోతే ఓపీ సమయం మధ్యాహ్నం 12 గంటలు కాగా.. వైద్యులు 2 గంటల వరకు పని చేస్తూ అందరికీ వైద్యం అందించారు. నియోజకవర్గ కేంద్రంలోని ఆసుపత్రిలో నెలకొన్న ఈ సమస్యను ఎమ్మెల్యే బాలకృష్ణ దృష్టికి తీసుకెళ్దామని భావించే ప్రజలకు ఆయన ఎప్పుడు అందుబాటులో ఉంటారో తెలియక తమలో తామే కుమిలిపోతున్నారు. - హిందూపురం అర్బన్ ప్రతి రోజు ఓపీ – 2వేల మంది వైరల్ ఫీవర్స్ – 1,200 మంది డెంగీ లక్షణాలు – 150 కేసులు జ్వరాలు – 250 మంది గైనిక్ పరీక్షలు – 200 మంది గాయాలు – 100 కంటి, ఇతర పరీక్షలు–200 మంచాలు : 100 చేరికలు : 300 -
హాస్టల్లో ఉండలేం
హిందూపురం అర్బన్: హిందూపురం ప్రభుత్వ పాలిటెక్నికల్ కాలేజీ హాస్టల్లో ఎలాంటి వసతులు లేవని, పలు సమస్యలతో సతమౌతున్నా ప్రిన్సిపాల్, అధికారులు ఏమాత్రం స్పందించడం లేదని కళాశాల విద్యార్థినులు ఏకరువు పెట్టారు. బుధవారం తరగతులను బహిష్కరించి కాలేజీ బయట బైఠాయించి ధర్నా చేపట్టారు. వీరి ఆందోళనకు విద్యార్థిసంఘాల నాయకులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ కాలేజీ అడ్మిషన్ సమయంలో అన్ని వసతులతో నాణ్యమైన విద్యను అందిస్తామని రూ.వేలు తీసుకోవడమే కాకుండా ప్రతినెల మెస్ బిల్లు రూ.1400 వసూలు చేస్తూ ముద్దఅన్నం, నీళ్లచారు అందిస్తున్నారని వాపోయారు. అంతేగాక గదులు బూత్బంగ్లాలా ఉన్నాయని, కనీస విద్యుత్ సదుపాయం కూడా లేదని, బాత్రూంలో దుర్వాసన వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగురోజుల క్రితం చెట్టు కింద చదువుకుంటున్న బాలికను గుర్తు తెలియని వ్యక్తి బలవంతంగా లాక్కెళ్లేందుకు యత్నించి తీవ్రంగా గాయపర్చాడన్నారు. హాస్టల్లో సెక్యూరిటీ లేదని, మ్యాట్రిన్ అసభ్యకరంగా మాట్లాడుతోందని వాపోయారు. వసతులపై ఫిర్యాదు చేస్తే టీసీ ఇచ్చి పంపించేస్తామని ప్రిన్సిపాల్ బెదిరిస్తున్నారని బాధ వ్యక్తం చేశారు. అనంతరం ప్రిన్సిపాల్‌కు వినతిపత్రాన్ని అందించారు. కార్యక్రమంలో విద్యార్థి ఐక్యవేదిక నాయకులు బాబావలి, కదీరిష్, జయచంద్ర, నాగభూషçణం, లోకేష్, వెంకటేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గజిబిజి
- పురంలో భారీగా ట్రాఫిక్ బెడద - బారులు తీరుతున్న వాహనాలు హిందూపురం అర్బన్: పెరుగుతున్న జనాభా.. వెడల్పు లేని రహదారులు.. కిక్కిరిసిన వాహనాల మధ్యనే ప్రజల రాకపోకలు.. రోడ్లపైనే వ్యాపారాలు.. ఇరువైపులా తోపుడుబండ్లు.. ఇలా తరచూ హిందూపురంలో ట్రాఫిక్ బెడద ప్రజలను వేధిస్తోంది. వాహనాల రద్దీతో ప్రజలు అడుగడుగునా ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలో 1.60 లక్షల జనాభా ఉండగా సుమారు 40 లక్షల పైగా ప్రైవేట్ వాహనాలు ఉన్నాయి. దీనికి తోడు ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు, ఇతర భారీ వాహనాల రాకపోకల కారణంగా రహదారులన్నీ గంగరగోళంగా మారుతున్నాయి. ఉదయం కార్యాలయాలు, స్కూల్ వేళల్లో, మ«ధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ప్రధాన రహదారులన్నీ వాహనాలతో నిండిపోతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు ప్రణాళికబద్ధంగా వ్యవహరించినా సమస్య తీరడం లేదు. ఈ ప్రదేశాల్లోనే ట్రాఫిక్ అంబేడ్కర్సర్కిల్, మూడురోడ్ల కూడలి, పరిగి రోడ్డు, సద్భావన సర్కిల్, ఆర్పీజీటీ రోడ్డు, ఆర్టీసీ బస్టాండు, చర్చి రోడ్డు, పాతమార్కెట్ రోడ్డు, ఎన్టీఆర్ సర్కిల్, గాంధీసర్కిల్, ఎంఎఫ్ రోడ్డు, బెంగళూరు రోడ్డు, గురునాథ్ సర్కిల్, ఎస్బీఐ సర్కిల్, డీఎల్ రోడ్డు, మెయిన్‌బజారు, రహమత్‌పురం సర్కిల్ ఏరియాల్లో తరచూ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయి. కారణాలు ఇవే.. - వెడల్పు లేని రహదారులు. పెరిగిన జనాభా. వాహనాల రాకపోకలకు అనుగుణంగా మున్సిపల్ అధికారులు, పాలకులు రోడ్ల విస్తరణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. - రోడ్ల విస్తరణ పేరిట మెయిన్‌బజారు, ఎంఎఫ్ రోడ్డు, సద్భావన సర్కిల్ వద్ద ఇరువైపులా కొంత సిమెంట్ ప్లాట్‌ఫారాలు నిర్మించారు. అయితే వ్యాపారులు, బండ్ల వ్యాపారులకు సౌకర్యంగా మారింది. - రైల్వే రోడ్డు విస్తరణ ప్రతిపాదనలు దశాబ్దాల కాలం నుంచి ప్రణాళికలు వేస్తున్నారు తప్ప ఎలాంటి కార్యచరణకు నోచుకోలేదు. ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం రహదారులకు మహర్దశ పడుతుందని ప్రజలు భావించినా నిరాశే మిగిలింది. సిగ్నల్స్ ఏర్పాటు చేయాలి : శ్రీరాములు, న్యాయవాది పట్టణంలో జనాభాతో పాటు ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. తరచూ ట్రాïఫిక్‌తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్‌తో పాటు ట్రాఫిక్ పోలీసు సిబ్బందిని కూడా పెంచాలి. అదేవిధంగా రహదారులు వెడల్పు చేయాలి. ప్రతిపాదనలు పంపించాం : ఈదూర్‌బాషా, సీఐ, హిందూపురం ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌కు అవసరమైన సిబ్బంది పెంచాలని, సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం. ఉన్న సిబ్బందితో ప్రతిరోజు రహదారుల్లో ట్రాఫిక్ నియంత్రణ చేస్తున్నాం. -
ఒట్టి ఫోజులేనా?
- మూడేళ్ల తర్వాత నేడు మార్కెట్‌కు భూమిపూజ - హాజరు కానున్న ఎమ్మెల్యే బాలకృష్ణ - టెండర్ కాలేదు.. నిధులు రాలేదు హిందూపురం అర్బన్: హిందూపురం పట్టణంలోని కూరగాయల మార్కెట్ కూల్చివేసిన మూడేళ్ల తర్వాత పాలకులు భూమిపూజకు సిద్ధమయ్యారు. ఈమేరకు ఎమ్మెల్యే బాలకృష్ణ సోమవారం హిందూపురం రానున్నారు. వాస్తవ పద్ధతిలో ఏదైనా నిర్మాణ ప్రాజెక్టుకు ప్రతిపాదనలు మంజూరైన తర్వాత ప్రభుత్వం నిధులు విడుదల చేయాలి. అనంతరం నిధులు సమకూర్చుకుని, టెండర్ల ప్రక్రియ పూర్తి చేసుకుని కాంట్రాక్టు ఖరారైన తర్వాత నిర్మాణానికి భూమి పూజలు చేస్తారు. అయితే బాలకృష్ణకు ఇవేవీ సంబంధం లేదు. దినం బాగుంటే చాలు సినిమాల్లో కెమెరా ముందు యాక్షన్‌కు దిగే బాలయ్య భూమిపూజ అనగానే ఫొటోలకు ఫోజులిచ్చేందుకు సిద్ధమయ్యారు. ప్రకటనలన్నీ గాలికే? పట్టణంలోని పాత మార్కెట్ స్థలమైన 2.24 ఎకరాల్లో రూ.100 కోట్లతో హైటెక్ రీతిలో త్రీఫ్లోర్ కాంòప్టెక్ నిర్మించి రెండు సెల్లార్స్ హోల్‌సేల్ వ్యాపారాలు, గ్రౌండ్‌ఫ్లోర్ కూరగాయల విక్రయాలు, రిటైల్స్ వ్యాపారాలు, కోల్డ్ స్టోరేజ్‌తో పాటు కమర్షియల్ కాంప్లెక్స్, ఆడిటోరియం, ఏసీ గోదాములు, మూడోఫ్లోర్‌లో మల్టీఫ్లెక్స్ థియేటర్లు రెండు నిర్మించి జిల్లాలోనే ఎక్కడ లేని విధంగా అదరహో.. అనే రీతిలో నిర్మిస్తామని గొప్పలు చెప్పారు. అయితే ఆ ప్రకటనలన్నీ గాలికి ఎగిరిపోయాయి. విశాలమైన రోడ్లు లేవని రాష్ట్ర టౌన్ ప్లానింగ్, డీఎంఏ అధికారులు అనుమతులు నిరాకరించారు. తర్వాత రూ.55 కోట్లతో రెండస్తుల భవన సదుపాయం నిర్మించాలని చేసిన ప్రతిపాదనలు కూడా కార్యరూపం దాల్చలేదు. చివరకు రూ.33 కోట్లతో అది కూడా గుడ్‌విల్ రూపంలో వ్యాపారులు నిధులు సమకూర్చుకుని, మున్సిపాల్టీ భాగస్వామ్యంతో రెండంతస్తుల భవనంలో 225 గదులతో మార్కెట్ నిర్మాణం ఖరారైంది. నిర్మాణం చేయాలి ఇలా.. మార్కెట్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం ప్రకారం రూ.10 కోట్లు ప్రభుత్వం గ్రాంటు రూపంలో ఇవ్వగా రూ.10 కోట్లు వ్యాపారుల నుంచి గుడ్‌విల్ రూపంలో సమకూర్చుకోవాల్సి ఉంటుంది. దీనికి తోడు మున్సిపాల్టీ రూ.3 కోట్లు తనవంతు భాగం కలిపి మొత్తం రూ.33 కోట్లతో మార్కెట్గదుల నిర్మాణం చేయాల్సి చేపట్టాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇవ్వగానే మార్కెట్ కట్టేస్తున్నామనే రీతిలో పాలకులు భూమిపూజకు సిద్ధమైపోయారు. అయితే ఈç నిర్మాణానికి ఇంకా టెండరు ఖరారు కాలేదు. గుడ్‌విల్ ఎంత మొత్తంలో వసూలు చేస్తారు. ఎన్నేళ్లు లీజుకు ఇస్తారు అనేది తేల్చలేదు. మున్సిపాల్టీ తన ఖజానా నుంచి రూ.3 కోట్లు కేటాయించాలి. ఇవన్నీ పూర్తయిన తర్వాత ఏ నిర్మాణమైనా ప్రారంభానికి పూజలు చేయడం పరిపాటి. కానీ అధికార పార్టీ నాయకులు మసిపూసి మారేడుకాయ చూపినట్లు చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. రోడ్ల్లపై పడేశారు : షానవాజ్, మార్కెట్ అధ్యక్షుడు వ్యాపారాలు బాగా జరుగుతున్న సమయంలో ఉన్నట్టుండి మార్కెట్ కూల్చి రోడ్లపై పడేశారు. రైతుబజారు ప్రాంతంలో ఉండాలని చెప్పారు. అక్కడ కనీస సదుపాయాలు కూడా లేవు. రైతులు తీసుకువచ్చిన సరుకులకు భద్రతలేదు. ఎండ వానకు ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం మార్కెట్ కట్టించి ప్రస్తుతం ఉన్న రేట్లతో బాడుగలు కేటాయిస్తే చెల్లించగలం. మాకు న్యాయం చేయాలని ఇప్పటికే కోర్టును కూడా ఆశ్రయించాం. ఆరు నెలల అడ్వాన్సు మున్సిపాల్టీలో ఉంది : శ్రీనివాసులు, మార్కెట్ ఉపాధ్యక్షుడు. పాతమార్కెట్లో ఉన్నప్పుడు ఆరునెలల అడ్వాన్సులు ఇచ్చి ఉన్నాం. వాటిని జమ వేసుకుని ఇప్పుడున్న రేట్లకు అనుగుణంగా గదుల బాడుగలు నిర్ణయించాలి. మార్కెట్ వ్యాపారుల పరిస్థితులను అడిగిన నాయకులు లేరు. ఎమ్మెల్యేను కలిసి మా బాధలు చెప్పడానికి అవకాశం ఇవ్వలేదు. అప్పుల్లో కూరుకుపోయి చాలామంది వ్యాపారులు వలసలు వెళ్లారు. గుడ్‌విల్ లేకుండా ప్రభుత్వమే గదులు నిర్మించి వ్యాపారులకు జీవనం కల్పించాలని కోరుతున్నాం. -
వెళ్లిరావయ్యా.. గణపయ్యా..
- కనులపండువగా వినాయక నిమజ్జనం - అర్ధరాత్రి 2 వరకు వరకు సాగిన కార్యక్రమం హిందూపురం అర్బన్: వినాయక చవితి సందర్భంగా హిందూపురం పట్టణంలో కొలువుదీర్చిన వినాయకుల విగ్రహాల నిమజ్జనోత్సవం గురువారం కనులపండువగా సాగింది. మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన విగ్రహాల ఊరేగింపు అర్ధరాత్రి వరకు కొనసాగింది. స్థానిక ఐదులాంతర్ గాంధీసర్కిల్ నుంచి చిన్నమార్కెట్, అంబేడ్కర్ సర్కిల్, గురునాథ్ సర్కిల్ అనంతరం సద్భావన సర్కిల్, వీడీరోడ్డు మీదుగా శ్రీనివాసనగర్, మున్సిపల్ ఆఫీసు పక్క నుంచి గుడ్డం కోనేరు వరకు సాగింది. విగ్రహాలను ట్రాక్టర్లపై రంగురంగుల తోరణాలు, విద్యుత్ దీపాలంకరణ చేసి మేళాతాళాలతో సాగనంపారు. అంబేడ్కర్ సర్కిల్ వద్ద ప్రముఖులు తరలివచ్చి ఊరేగింపులో పాల్గొన్నారు. అలాగే వివిధ రకాల వేషధారణతో యువకులు ఆకట్టుకున్నారు. గుడ్డం వద్ద భారీ బందోబస్తు గుడ్డం రంగనాథస్వామి ఆలయం కోనేరు వద్ద భారీ బందోబస్తుతో వినాయకుల నిమజ్జనోత్సవం జరిగింది. డీఎస్పీ కరీముల్లా షరీఫ్, ఆర్డీఓ రామ్మూర్తి ఇతర శాఖాధికారులు నిమజ్జన కార్యక్రమం పర్యవేక్షించారు. ప్రత్యేక క్రేన్ ఏర్పాటు చేసి విగ్రహాలను అందులో ఉంచి నేరుగా కోనేరు మధ్యలో తీసుకెళ్లి నిమజ్జనం చేయించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టిచర్యలు తీసుకున్నారు. కాగా నిమజ్జనోత్సవం అర్ధరాత్రి 2 గంటల వరకు సాగింది. కోనేరు వద్ద భారీగా జనం తరలివచ్చి నిమజ్జన ఉత్సవాన్ని తిలకించారు. -
హిందూపురంలో నేడు వినాయక నిమజ్జనం
అనంతపురం సెంట్రల్: హిందూపురంలో గురువారం నిర్వహిస్తున్న వినాయక నిమజ్జన వేడుకలకు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ తెలిపారు. బుధవారం బందోబస్తు ఏర్పాట్లకు సంబందించిన వివరాలను ‘సాక్షి’కి వెల్లడించారు. జిల్లాలో హిందూపురంలో ఏడు రోజులకు నిమజ్జన వేడుకలు నిర్వహిస్తారన్నారు. ఈ వేడుకల్లో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించారు. అడిషనల్ ఎస్పీ పర్యవేక్షణలో ఐదుగురు డీఎస్పీలు, 19 మంది సీఐలు, 75 మంది ఎస్ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు, స్పెషల్ పార్టీ బలగాలు మొత్తం 700 మందిని తరలిస్తున్నట్లు వివరించారు. నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా ముగిసేందుకు ఉత్సవ నిర్వాహకులు, ప్రజలు సహకరించాలని కోరారు. ఎక్కడైనా ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా డయల్–100, 9989819191 సెల్ నెంబర్‌కు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
ఇంటింటికీ ‘నవరత్నాలు’
హిందూపురం అర్బన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రకటించిన ‘నవరత్నాలు’ పథకాలతో ప్రతి కుటుంబానికి లబ్ధి చేరుతుందని.. ప్రతి గడపకూ వెళ్లి వివరించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని హిందూపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ అన్నారు. ‘వైఎస్సార్ గుర్తుగా.. జగనన్నకు తోడుగా.. నవరత్నాలు’ సభ బుధవారం మండల కన్వీనర్ బసిరెడ్డి అధ్యక్షతన సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ ఆధ్వర్యంలో పట్టణంలోని పాత టీవీఎస్ షోరూం ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశంలో జరిగింది. ఈసందర్భంగా నవీన్‌నిశ్చల్ మాట్లాడుతూ నవ్యాంధ్రకు నవరత్నాల పథకాలు నిజమైన రత్నాలే.. ఈ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి బూత్ కమిటీలు పటిష్టంగా పనిచేయాలన్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి కుటుంబసభ్యులకు పథకాల గురించి క్షుణ్ణంగా వివరించి వారిని వైఎస్ జగన్మోహన్రెడ్డిని బలపర్చే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త, బూత్ కమిటీ నాయకుడి వెంట వస్తానన్నారు. బూత్‌కమిటీ సభ్యులు పథకాలను వివరించడంతో పాటు ప్రధాన సమస్యలు కూడా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. మోసానికి మారుపేరు టీడీపీ మోసానికి మారుపేరు టీడీపీ అని మండిపడ్డారు. ఓట్లు వేయించుకోవడానికి కుదరకపోతే ఆ ఓట్లను గల్లంతు చేసి కుటిల బుద్ధి ఉంటుందని జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. సీఎం చంద్రబాబు పక్కా మోసకారి. కూతురును ఇచ్చిన మామ (ఎన్టీ రామారావు)నే వెన్నుపోటు పొడిన ఘనుడని విమర్శించారు. ఓట్ల కోసం ఆల్ ఫ్రీ అంటాడు. ఎన్నికల్లో ఇచ్చిన వంద హామీలు నేటికి నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. ప్రజా సంక్షేమానికి నాంది - ప్రశాంత్‌గౌడ్, రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి నవరత్నాల పథకాలతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంక్షేమానికి నాంది పలికారు. బూత్ కమిటీలు ప్రజలకు చేరువ కావాలి. ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలి. ఇంటింటికీ పథకాలతో జరిగే లాభాలు వివరించాలి. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయబావుటా ఎగుర వేసేవిధంగా కష్టపడాలి. మంచి రోజులు వస్తున్నాయి - శివ, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ అన్న వస్తున్నాడు.. మంచిరోజులు వస్తున్నాయి. టీడీపీ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు. ప్రజలకు మంచి పాలనతో పాటు సంతోషంగా చూడాలనే తలంపుతో నవరత్నాల పథకాలకు శ్రీకారం చుట్టారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తుంది. కార్యక్రమంలో బీ బ్లాక్ కన్వీనర్ మల్లికార్జున, పార్టీ జిల్లా కార్యదర్శి ఫజులూ రెహమన్, స్టీరింగ్ కమిటీ నాయకులు జగన్మోహన్రెడ్డి, మండల కన్వీనర్లు నారాయణస్వామి, సదాశివరెడ్డి, మహిళ కన్వీనర్లు నాగమణి, షామింతాజ్, బీసీ సెల్ రాము, మైనార్టీ నాయకులు షానూర్‌బాషా, సమ్మద్, అన్నాసుందర్రాజ్, ఆజాం, కౌన్సిలర్లు నాగభూషణరెడ్డి, షాజియా, జబీవుల్లా, అసిఫ్వుల్లా, రజనీ, జరీనా, మానస, నాయకులు నక్కలపల్లి శ్రీరాంరెడ్డి, నరసింహారెడ్డి, కొల్లకుంట శివశంకర్‌రెడ్డి, రమేష్, రియాజ్, శ్రీన, నారాయణస్వామి, గోపి, హనుమంతప్ప, మధు, నాగిరెడ్డి, రంగనారెడ్డి, సు«రేంద్రరెడ్డి, గిరి, రవి, కొల్లప్ప, బైలాంజినేయులు, లక్ష్మణ్, గోవిందప్ప, కుమార్, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
బాలల సంరక్షణ కేంద్రాలకు రిజిస్ట్రేషన్ తప్పని సరి
హిందూపురం అర్బన్: బాలల సంరక్షణ కేంద్రాల ఏర్పాటుకు సెక్షన్ 41 ప్రకారం తప్పనిసరిగా ఈ నెల 26వతేది లోపు రిజిస్రే్టషన్ చేయించాలని నిర్వాహకులకు జువెనైల్ జిల్లా ప్రాజెక్టు అధికారి రామసుబ్బారెడ్డి సూచించారు. హిందూపురంలోని సత్యసాయిబాల సదన్, ఐసీడీఎస్ బాలసదన్ కేంద్రాలను బుధవారం ఆయన తనిఖీ చేశారు. పలు రికార్డులు పరిశీలించారు. పిల్లలకు కల్పిస్తున్న సదుపాయాలు, భోజనాలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బాలల సంరక్షణ కేంద్రాలను రిజిస్రే్టషన్ చేయించకపోతే సెక్షన్ 42 ప్రకారం శిక్షార్హులవుతారని హెచ్చరించారు. -
వాసవీమాత విగ్రహం ధ్వంసం
– అర్ధరాత్రి జేసీబీతో భజనమందిరం కూల్చివేత – ఆర్యవైశ్య, హిందూవులు నిరసన – పోలీసుస్టేషన్‌ను ముట్టడి హిందూపురం అర్బన్: పట్టణంలోని బాలాజీనగర్ కాల్వగడ్డ పక్కనే ఉన్న వాసవీభజన మందిరాన్ని శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు జేసీబీతో కూల్చివేశారు. ఆలయంలో ధ్వంసం చేసిన అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్లారు. శనివారం ఉదయాన్నే విషయం పట్టణంలో దావానంలా వ్యాపించింది. పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్యులు, హిందూ సంఘాల నాయకులు అక్కడికి చేరుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులో కేసున్నా కూల్చేశారు.. : కాల్వపోరంబోకు స్థలంలో నిర్మించిన భజన మందిరం కొద్దిగా పక్కనే ఉన్న స్థలం వరకు నిర్మితమైంది. పక్కస్థల యాజమాని చంద్రశేఖర్ స్థలాన్ని దానంగా ఇవ్వడంతో ఆలయం నిర్మించినట్లు మందిరం నిర్వాహకులు చెబుతున్నారు. అయితే పక్క స్థల యాజమాని చంద్రశేఖర్, మరోవ్యక్తి వెల్డింగ్బాషా మధ్య స్థల వివాదం ఏర్పడింది. దీనిపై కోర్టులో దావా నడుస్తోంది. ఇదిలా ఉండగా శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆలయాన్ని కూల్చివేశారు. వాసవీమాత విగ్రహ కూల్చివేతను నిరసిస్తూ ఆర్యవైశ్యసంఘం అధ్యక్షులు జేపీకేరాము,బీజేపీ నాయకులు ఆదర్ష్కుమార్, వరప్రసాద్, రమేష్‌రెడ్డి, యువనాయకులు ప్రకాష్, రఘు, హిందూసురక్షాసమితి సభ్యులు రవి, చారుకీర్తి, బాబుతో ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ చేపట్టారు. అనంతరం అంబేద్కర్సర్కిల్కు చేరుకుని మానవహారం ఏర్పడి రాస్తారోకో చేశారు. స్థలవివాదముంటే కోర్టు ద్వారా తేల్చుకోవాలే తప్ప ఇలా అర్ధరాత్రి దొంగల్లా కూల్చడం ఏంటని మండిపడ్డారు. విగ్రహాన్ని ధ్వంసంచేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ట్రాఫిక్ స్తంభించడంతో సీఐ మధుభూషణ్, ట్రాఫిక్ పోలీసులు వారికి సర్ధిచెప్పడంతో వారు అక్కడి నుంచి నేరుగా వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌ను తరలివచ్చి ముట్టడించారు. డీఎస్పీ కరీముల్లా షరీఫ్‌తో మాట్లాడి నిందితులపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ఇచ్చారు. అనంతరం భజనమందిరాన్ని శుభ్రం చేసి కూల్చిన చోట వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టింపజేసి పూజలు చేశారు. -
విషాదాంతం
పెళ్లికి ముందురోజు అదృశ్యమైన యువకుడు మూడు రోజుల తర్వాత అనుమానాస్పదస్థితిలో మృతి రైలుకిందపడి ముక్కలు ముక్కలైన శరీరం పెళ్లికి ముందే ఆ యువకుడి జీవితం ముక్కలైంది. తాళి కట్టడానికి ఒక రోజు ముందు అదృశ్యమైన యువకుడు మూడు రోజుల తర్వాత విగతజీవిగా కనిపించాడు. పెళ్లి సందడి కనిపించాల్సిన ఇల్లు శోకసంద్రంగా మారింది. హిందూపురం అర్బన్: మేనకోడలి మెడలో తాళి కట్టాల్సిన యువకుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. హిందూపురం పట్టణ శివారులోని కొటిపి రైల్వేగేటు సమీపాన శరీరం ముక్కలుముక్కలై కనిపించింది. వివరాలిలా ఉన్నాయి. మునిసిపాలిటీ పరిధిలోని పోచనపల్లికి చెందిన పవన్‌కుమార్ (28) చేనేత కార్మికుడు. ఈ నెల 16న మేనకోడలితో వివాహం కావాల్సి ఉంది. 15వ తేదీ పసుపు పూసే కార్యక్రమం జరగాల్సిఉం ది. అయితే ఆరోజు మధ్యాహ్నం చెప్పులు కొనుక్కోవడానికి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఆరా తీయగా.. అంబేడ్కర్ సర్కిల్లోని ఓ చెప్పుల దుకాణం వద్ద ద్విచక్రవాహనాన్ని వదిలి ఎక్కడికో వెళ్లిపోయినట్లు తెలిసింది. అనంతరం బంధువులు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం సాయంత్రం కొటిపి రైల్వేగేటు సమీపాన రైలుకిందపడి ముక్కలైన మృతదేహం గురించి సమాచారం అందింది. రైల్వే పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహం వద్ద ఏటీఎం కార్డు, తిరుపతి నుంచి వచ్చినట్లు రైలు టికెట్ లభ్యమయ్యాయి. ఏటీఎం కార్డు చిరునామా ఆధారంగా.. మృతదేహం పవన్‌కుమార్‌ది అని నిర్ధారించి బంధువులకు సమాచారం అందించారు. పసుపు బట్టల్లో చూడాల్సిన యువకుడిని మాంసపు ముద్దగా చూడాల్సి వచ్చిందంటూ బంధువులు రోదించారు. పెళ్లి ఇష్టం లేక ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఎవరైనా ఇతన్ని హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పవన్‌కుమార్ ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడు కాదని బంధువులు వాపోతున్నారు. -
కనులపండువగా వేణుగోపాలస్వామి రథోత్సవం
హిందూపురం అర్బన్: హిందూపురంలో వేణుగోపాలస్వామి రథోత్సవం గురువారం కనులపండువగా సాగింది. మూలవిరాట్ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామికి ఉదయం సుప్రభాతసేవ అనంతరం పంచామృతాభిషేకం చేసి విశేషంగా ఆభరణాలు, పుష్పాలతో అలంకరించారు. ఉత్సవమూర్తులను పల్లకీలో కొలువుదీర్చి మేళాతాళాలతో ప్రాకారోత్సవం చేశారు. అనంతరం ర«థసంప్రోక్షణ, రథాంగహోమం, హోమపూర్ణాహుతి గావించారు. తర్వాత యాదవ సంఘం సభ్యులు డప్పు వాయిద్యాలతో రథ చక్ర కర్రదండలతో ఊరేగింపుగా వచ్చి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని పల్లకీలో కొలువుదీర్చి పురవీధుల గుండా తీసుకువచ్చి పూజలు చేశారు. భక్తుల గోవిందనామస్మరణతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. పూజల అనంతరం రథాన్ని లాగారు. బెంగళూరు రోడ్డు గుండా వక్కల బజార్ వరకు, అక్కడి నుంచి తిరిగి ఆలయానికి రథం చేరుకుంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా ర«థోత్సవానికి ముందే యువకులు ఉత్సాహంగా ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో మునిసిపల్ వైస్ చైర్మన్ జేపీకే రాము, ఆలయ ఈఓ శ్రీనివాసులు, మునిసిపల్ మాజీ చైర్మన్ విద్యాసాగర్, ఆలయ కమిటీ సభ్యులు సుబ్రమణ్యం, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. -
‘ఏకో’దంతుడికి జై
విగ్రహాల తయారీలో విషపూరిత రసాయనాలు పర్యావరణానికి నష్టమంటున్న పర్యావరణ వేత్తలు బంకమట్టితో విగ్రహాల తయారీలో నిమగ్నమైన కోల్కత్త వాసులు భక్తుల చేత పూజలు అందుకునేందుకు పార్వతీనందుడు రానున్నాడు. వినాయక చవితిని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా వాడవాడలా కొలువుదీరేందుకు బొజ్జగణపయ్య సిద్ధమవుతున్నాడు. వివిధ రూపాలలో దర్శనమిచేందుకు ఏకదంతుడు సర్వాంగ సుందరంగా ముస్తాబు అవుతున్నాడు. ఇందులో భాగంగానే జిల్లా వ్యాప్తంగా వినాయకుడి విగ్రహాల తయారీ ముమ్మరంగా సాగుతోంది. జిల్లా వాసులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి బతుకు తెరువు కోసం వలస వచ్చిన పలువురు కళాకారులు ఈ పనిలో తలమునకలుగా ఉన్నారు. అయితే విగ్రహాల తయారీలో ప్రమాదకర విషపూరిత రసాయనిక రంగులు వాడడం వల్ల పర్యావరణానికి హాని జరుగుతుందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. వినాయక ప్రతిమల తయారీలో సహజసిద్ధమైన రంగులతో పాటు నీటిలో సులువుగా కరిగిపోయే బంకమట్టి తదితర పదార్థాలను వినియోగించాలని సూచిస్తున్నారు. - హిందూపురం అర్బన్: ప్రతి ఏటా వినాయక చవితి పండుగ అనంతరం నీటిలో కరగని వ్యర్థాలతో చెరువులు, కాలువలు నిండిపోతున్నాయి. అంతేకాక ఆ విగ్రహాల తయారీకి వినియోగిస్తున్న రసాయనిక రంగుల ప్రభావం వల్ల నీటి కాలుష్యం పెరిగిపోతోంది. ఆ నీటిని వినియోగిస్తే చర్మవ్యాధులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విగ్రహాల తయారీలో ప్లాస్టర్‌ఆఫ్ ప్యారీస్ను ఎక్కువగా వాడుతున్నారు. ఈ రసాయనిక పదార్థం నీటిలో కరగకుండా అలాగే ఉండిపోతుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ కాకుండా మట్టితో తయారు చేసిన విగ్రహాలను వాడడం వల్ల పర్యావరణానికి ఎలాంటి ముప్పు ఉండదు. పూజా, అలంకరణ సామగ్రిలోనూ ప్లాస్టిక్ పూలు, ఇతర పదార్థాలు కాకుండా సహజసిద్ధంగా లభ్యమయ్యే వాటినే వినియోగించాలని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు. బంకమట్టి, వరిగడ్డి, కర్రల వస్తువులు వినాయక చవితిని పురస్కరించుకుని హిందూపురంలో పర్యావరణ హితకారి వినాయక ప్రతిమల తయారీ ముమ్మరంగా సాగుతోంది. కోల్‌కత్తాకు చెందిన పలువురు కుటుంబసభ్యులతో సహా ఇక్కడకు వలసవచ్చి వినాయక ప్రతిమల తయారీలో నిమగ్నమయ్యారు. నాలుగు నుంచి 14 అడుగుల ఎత్తుతో చూడముచ్చటగా ఉన్న వినాయకుడి ప్రతిమల తయారీకి వీరు వరిగడ్డి, బంకమన్నుతో పాటు నీటిలో సులువుగా కరిగిపోయే సహజసిద్ధమైన రంగులనే వాడుతున్నారు. వీరి ఉత్పత్తులకు రూ. 25 వేల నుంచి రూ. 40 వేల వరకూ కొనుగోలుదారులు చెల్లిస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన వారే కాకుండా పొరుగున ఉన్న కర్ణాటక నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి విగ్రహాలను కొనుగోలు చేస్తున్నారు. నీటిలో కరిగి పదార్థాలే వాడుతున్నాం పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని విగ్రహాల తయారీ చేపట్టాం. ప్రత్యేక మట్టి, రంగులు, అచ్చులు కోల్కత్తా నుంచి తీసుకువస్తున్నాం. వరిగడ్డి, వెదురు బొంగులు స్థానికంగా సమకూర్చుకుంటున్నాం. నాలుగు నెలలుగా ఇక్కడే ఉంటూ విగ్రహాలు తయారు చేస్తున్నాం. - బి.ఎం.పాల్ నదియా, కోల్కత్తా -
ముంచెత్తిన వర్షం
జిల్లాలో పలు చోట్ల గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు వర్షం కురిసింది. హిందూపురంలో 52.4 మి.మీ, లేపాక్షిలో 53, చిలమత్తూరులో 7.04, రొళ్లలో 40.2 మడకశిరలో 35.2, అగళిలో 30.4, గుడిబండలో 15, అమరాపురంలో 11 మి.మీ. వర్షపాతం నమోదైంది. హిందూపురంలోని హస్నాబాద్, సీపీఐ హమాలీ కాలనీ, సిల్క్ కాలనీలతోపాటు లేపాక్షిలోని లోతట్లు ఇళ్లు జలమయమయ్యాయి. మడకశిర మండలం కల్లుమర్రి, మణూరు, బుళ్లసముద్రం తదితర ప్రాంతాల్లో చెరువులు, చెక్డ్యాముల్లో నీరు చేరింది. లేపాక్షి మండలం కల్లూరు పశువైద్యశాలలోకి వర్షం నీరు చేరడంతో 15 సంచుల జొన్నలు తడిసిపోయాయి. ఎండుముఖం పట్టిన వేరుశనగ ఈ వర్షంతో కాస్త కోలుకున్నట్టయ్యింది. - సాక్షి నెట్వర్క్, అనంతపురం -
హిందూపురానికి బ్రాండ్ ఇమేజ్ను పెంచాలి
హిందూపురం అర్బన్: హిందూపురం అంటే పారిశ్రామికాభివృద్ధికి పెట్టిందిపేరుగా బ్రాండ్ ఇమేజ్ను పెంచాల్సిన బాధ్యత ఇక్కడి ప్రజలపై ఉందని జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. వన్‌టౌన్ పోలీçసుస్టేషన్‌లో శనివారం డీఎస్పీ కరీముల్లాషరీఫ్ అధ్యక్షతన శాంతికమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ హిందూపురంలో అన్ని మతాల వారు కలిసిమెలిసి ఉన్నప్పుడే పట్టణాభివృద్ధి చెందుతుందన్నారు. హిందూముస్లింలు సోదరభావంతో ఐక్యతగా వినాయకచవితి, బక్రీద్‌లను శాంతియుత వాతావరణంలో సంతోషంగా జరుపుకుందామన్నారు. ఇందుకోసం శాంతికమిటీలను ఏర్పాటు చేశాం వాట్సాప్ గ్రూపులు కూడా కల్పించామన్నారు. డీఎస్పీ కరీముల్లా షరీఫ్, సీఐ ఇదురుబాషా మాట్లాడుతూ వినాయక విగ్రహాల ఏర్పాటు నిర్వాహకులు పోలీసుల సూచనల మేరకు ఏర్పాటు చేసుకోవాలన్నారు. మైకు గట్టిగా పెట్టడం, ఊరేగింపులకు ఇబ్బందికరమైన ఎతైన విగ్రహాలు ఏర్పాటు చేయడం వంటివి వద్దన్నారు. కార్యక్రమంలో ముత్తవల్లి తల్హాఖాన్, కౌన్సిలర్ రోషన్‌వలి, నాయకులు భాస్కర్, రాయల్‌గోపాల్, కమిటీసభ్యులు కౌన్సిలర్ జబివుల్లా, రైల్వే శేఖర్ తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం : రోడ్డుప్రమాదాలను పూర్తిగా నియంత్రించడానికి తీవ్రంగా కృషిచేస్తున్నామని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. శనివారం హిందూపురం విచ్చేసిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రోడ్డుప్రమాదాల నియంత్రణకు అవగాహన కార్యక్రమాలు పెంచుతున్నామని చెప్పారు. ఇందులో భాగంగా అనంతపురం, హిందూపురం కేంద్రాల్లో అవగాహన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తర్వాత అన్ని ప్రధాన పట్టణాల్లో ప్రారంభిస్తామన్నారు. కొడికొండ, తూమకుంట సరిహద్దు ప్రాంతాల్లో అక్రమరవాణా అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా నివారణకు చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో రాజకీయహత్యలు పెరిగాయని చెప్పగా జరిగిన హత్యల్లో రాజకీయ కోణాలు లేవని మాదన్న హత్యపై పూర్తిస్థాయిలో విచారణ జరుగుతోందన్నారు.