అనంతపురం జిల్లాలో ఎప్పుడూ జరగని విధంగా రెండు పార్లమెంట్ స్థానాలు బీసీలకే ఇవ్వడం జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. చంద్రబాబు వైఫల్యాలపై చర్చజరగకుండా ఎల్లో మీడియా పక్కదారి పట్టిసోందని అన్నారు. చంద్రబాబు వైఫల్యాలపై చర్చ జరిగితే కనీసం డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. గురువారం అనంతపురం జిల్లా హిందూపురంలో జరిగిన బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగించారు. వైఎస్ జగన్ రాకతో హిందూపురం జనసంద్రంగా మారింది.