సాక్షి, అనంతపురం: సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం వద్ద హల్‌చల్ చేశారు. ఇప్పటికే పలు వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన బాలయ్య శుక్రవారం హిందూపురంలో ఎన్నికల నియామవళి ఉల్లంఘనకు పాల్పడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం వద్ద బాలకృష్ణ ప్రచారం నిర్వహించారు. అంతేకాకుండా ఉద్యోగులతో ఫొటోలు దిగారు. బాలయ్యతో పాటు పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు పోలింగ్ కేంద్రంలోకి చొచ్చుకుని వచ్చారు. అయితే పోలీసులు మాత్రం టీడీపీ నేతలను అడ్డుకోవడానికి ప్రయత్నించలేదు. దీనిపై స్పందించిన హిందూపురం రిటర్నింగ్ అధికారి గుణభూషణ్‌రెడ్డి బాలకృష్ణకు నోటీసులు జారీ చేస్తామని పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం వద్ద బాలకృష్ణ ప్రచారం చేయడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభ్యంతరం తెలిపారు. ఇందుకు నిరసనగా నేతలు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు.
మరోవైపు పోస్టల్ బ్యాలెట్స్ పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లపైన ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాప్తాడులో ఒకే పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడంపై ఉద్యోగులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. అనంతరపురం అర్బన్ పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద ఉద్యోగులు బారులు తీరారు. అరకొర ఏర్పాట్లు చేయడంపై ఉద్యోగులు ఆందోళన చేపట్టారు.
చదవండి: బాలకృష్ణకు చేదు అనుభవం
Comments
Please login to add a commentAdd a comment