Paneer Selvam
-
మాజీ సీఎం పన్నీరుసెల్వంకు షాక్
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే పూర్తిగా పళణిస్వామి గుప్పెట్లోకి చేరింది. ఆయన నేతృత్వంలో జరిగిన సర్వసభ్య సమావేశ తీర్మానాలన్నీ చెల్లుతాయని శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో మాజీ సీఎం పన్నీరుసెల్వంకు షాక్ తప్పలేదు. పళణిస్వామి మద్దతు నేత డాక్టర్ సునీల్ నేతృత్వంలో పార్టీ ప్రధాన కార్యాలయం ఆవరణలో భారీ విజయోత్సవ సందడి నెలకొంది. కోర్టు తీర్పులు, ఎన్నికల కమిషన్ ఉత్తర్వులతో అన్నాడీఎంకేను పళణిస్వామి తన గుప్పెట్లోకి తెచ్చుకున్న విషయం తెలిసిందే. పార్టీ ప్రధాన కార్యదర్శిగా మదురై వేదికగా బ్రహ్మాండ మహానాడును పళణిస్వామి విజయవంతం చేశారు. అదేసమయంలో అన్నాడీఎంకేను కై వసం చేసుకుంటాననే ధీమాను మాజీ సీఎం పన్నీరుసెల్వం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇప్పటివరకు వచ్చిన తీర్పులు ఓ ఎత్తు అయితే, అన్నాడీఎంకే తీర్మానాలకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ తనకు అనుకూలంగానే ఉంటుందని పన్నీరు ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు. తీర్మానంలోని అంశం ఇదే.. గత ఏడాది వానగరంలో పళణిస్వామి నేతృత్వంలో జూలై 11న సర్వసభ్య సమావేశం జరిగింది. ఇందులో పన్నీరుసెల్వంతో పాటు ఆయన మద్దతుదారులను తొలగిస్తూ తీర్మానం చేశారు. పళణిస్వామిని తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తమను తొలగించారని సర్వసభ్య సమావేశానికి, తీర్మానాలకు వ్యతిరేకంగా పన్నీరుసెల్వం, ఆయన మద్దతుదారులు వైద్యలింగం, మనోజ్ పాండియన్, జేసీటీ ప్రభాకర్‌లు కోర్టు తలుపుతట్టారు. సర్వసభ్య సమావేశానికి అనుకూలంగా ఇప్పటికే హైకోర్టు, ఆతర్వాత సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. దీంతో పళణిస్వామి పార్టీని తన గుప్పెట్లోకి తెచ్చుకుని ఎన్నికల ప్రక్రియ ద్వారా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పగ్గాలు ఏకగ్రీవంగా చేపట్టారు. అయితే, తీర్మానాల వ్యవహారం సుప్రీంకోర్టు నుంచి హైకోర్టుకు చేరడంతో ఈ విచారణలో తీర్పు ఉత్కంఠ తప్పలేదు. తమకు అనుకూలంగానే ఈ తీర్పు ఉంటుందని భావించిన పన్నీరుసెల్వంకు పెద్ద షాక్ తగిలింది. పళణికి అనుకూలంగా తీర్పు.. పన్నీరు అండ్ బృందం దాఖలు చేసిన ఈ పిటిషన్ పై కొన్ని నెలలుగా విచారణ జరిగింది. వాదనలు ముగిశాయి. ఇటీవల లిఖిత పూర్వక వాదనలు సైతం పళణి, పన్నీరులు వేర్వేరుగా కోర్టు ముందు ఉంచారు. శుక్రవారం న్యాయమూర్తులు ఆర్ మహదేవన్, మహ్మద్ షఫిక్ బెంచ్ తీర్పు వెలువరించింది. సర్వసభ్య సమావేశంలో చేసిన తీర్మానాలు చెల్లుతాయని ప్రకటించింది. పన్నీరుసెల్వం పిటిషన్‌ను తోసిపుచ్చారు. అలాగే, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా పళణి ఎంపికను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించారు. దీంతో పళణిస్వామి గుప్పెట్లోకి పూర్తిగా అన్నాడీఎంకే చేరినట్లైంది. అనంతరం మీడియాతో పళణిస్వామి మాట్లాడుతూ న్యాయానికి, ధర్మానికి, నిజాయితీకి దక్కిన గెలుపుగా అభివర్ణించారు. లోక్‌సభ ఎన్నికలలో మరింత ఉత్సాహంతో పనిచేస్తామని, పుదుచ్చేరితో పాటు రాష్ట్రంలోని 40 స్థానాలను కై వసంచేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. సంబరాలు... పళణిస్వామికి అనుకూలంగా కోర్టు తీర్పు రావడంతో అన్నాడీఎంకే వర్గాలు సంబరాలు చేసుకున్నాయి. బాణసంచాలు పేల్చాయి. స్వీట్లు పంచి పెట్టి ఆనందాన్ని పంచుకున్నాయి. చైన్నె రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయం ఆవరణలో ఎంజీఆర్ యువజన విభాగం సంయుక్త కార్యదర్శి డాక్టర్ సునీల్ నేతృత్వంలో మద్దతుదారుల విజయోత్సవాలు జరిగాయి. దివంగత నేతలు ఎంజీఆర్, జయలలిత ఫ్లెక్సీలు, ప్రధాన కార్యదర్శి పళణిస్వామి ఫ్లెక్సీలను ఊరేగించారు. బాణసంచాలు పేల్చుతూ ఆనంద తాండవం చేశారు. ఈసందర్భంగా అందరికీ కొబ్బరి బొండాల పంపిణీ జరిగింది. మాజీమంత్రి జయకుమార్ కొబ్బరి బొండాలను అందజేశారు. పార్టీ నేతలు తమిళ్ మగన్ హుస్సేన్, ఇలంగోవన్ పాల్గొని ఆనందాన్ని పంచుకున్నారు. -
పన్నీర్ సెల్వంకు భారీ షాక్
తమిళనాడు రాజకీయాల్లో ఇవాళ ఆసక్తికర పరిణామం ఒకటి చోటుచేసుకుంది. ప్రతిపక్ష అన్నాడీఎంకేలో వర్గ పోరులో.. కోర్టు తీర్పు ద్వారా పళనిస్వామి మళ్లీ పైచేయి సాధించారు. పార్టీ నుంచి తనను బహిష్కరించడంతో పాటు ఏఐఏడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి పళనిస్వామి చేపట్టడాన్ని సవాల్ చేస్తూ పన్నీర్‌సెల్వం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు ఇవాళ(మంగళవారం) ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. మద్రాస్ హైకోర్టు తీర్పు వెలువడినవెంటనే.. అన్నాడీఎంకే పార్టీ అధికారికంగా ఈపీఎస్(ఎడపాడి కే పళనిస్వామి)ని పార్టీ ప్రదాన కార్యదర్శిగా ప్రకటించింది పార్టీ సీఈసీ. ఈ మేరకు చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద సంబురాలు జరుగుతున్నాయి. ఇక తాజా తీర్పుతో ఓపీఎస్(ఓ పన్నీర్ సెల్వం).. ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్‌ను ఆశ్రయించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక.. అన్నాడీఎంకే పార్టీ కార్యదర్శి (తాత్కాలిక) పదవికి పళనిస్వామి నియామకాన్ని వ్యతిరేకిస్తూ మద్రాస్ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. కిందటి ఏడాది జులైలో పార్టీ జనరల్ కౌన్సిల్ ద్వారా ఈ నియామకం జరగ్గా.. దానిని వ్యతిరేకిస్తూ పన్నీర్ సెల్వం వర్గం న్యాయస్థానాలను ఆశ్రయించింది. ఈ క్రమంలో సుప్రీం కోర్టు అన్నాడీఎంకే సాధారణ కౌన్సిల్‌ను చట్టబద్ధమైనదిగానే సమర్థించింది. అయితే తీర్మానాల చట్టబద్ధతపై నిర్ణయం మాత్రం మద్రాసు హైకోర్టుకు వదిలివేసింది. ఇదిలా ఉంటే.. గత శనివారం పార్టీ జనరల్ సెక్రటరీ పదవి ఎన్నికకు ఈపీఎస్ నామినేషన్ దాఖలు చేయగా.. ఇదంతా దొంగచాటు వ్యవహారమంటూ పన్నీర్‌సెల్వం మండిపడ్డారు. అంతలోనే మద్రాస్ హైకోర్టు ఈపీఎస్‌కు అనుకూలంగా తీర్పు ఇవ్వడం గమనార్హం. -
అన్నాడీఎంకేలో తారాస్థాయికి ముసలం.. జయ సమాధి వద్ద ఉద్రిక్తత
చెన్నై: అన్నాడీఎంకేలో ఆధిపత్య ముసలం ఆగలేదు.. మళ్లీ తారాస్థాయిలో రాజుకుంది. పళనిస్వామి, పన్నీరు సెల్వంలో ఎవరో ఒకరు పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టాలంటూ ఇరు వర్గాల మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. జూన్ 14వ తేదీన జరిగిన జిల్లా కార్యదర్శుల సమావేశం నుంచి ఈ ముసలం మరింతగా ముదిరింది. ఈ తరుణంలో.. జయలలిత సమాధి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. జయలలిత సమాధి వద్ద కిరోసిన్ పోసుకుని ఓ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పళనిస్వామి అన్నాడీఎంకే అధ్యక్షుడిగా ఉండడానికి వీల్లేదంటూ వీరంగం సృష్టించాడు. అన్నాడీఎంకే అధినేతగా జయలలిత పేరే ఉండాలంటూ డిమాండ్ చేశాడు. కార్యకర్తను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ భేటీకి ముందు పార్టీలో వర్గపోరు మరోసారి బయటపడింది. మాజీ ముఖ్యమంత్రి, పార్టీ కో-కోఆర్డినేటర్ పళనిస్వామి(EPS), మాజీ డిప్యూటీ సీఎం.. పార్టీ కోఆర్డినేటర్ పన్నీరుసెల్వం వర్గీయులు వాళ్ల వాళ్ల డిమాండ్లతో రచ్చకెక్కుతున్నారు. జూన్ 23న(గురువారం) జరగబోయే మీటింగ్‌లో పార్టీ అంతా ఒక్కరి నాయకత్వంలోనే నడవాలని పళనిస్వామి తీర్మానం చేయనున్నాడు. అదే సమయంలో.. తన సంతకం లేకుండా జనరల్ బాడీ ఆ తీర్మానం ఆమోదించడానికి వీల్లేదంటూ పన్నీర్ సెల్వం వాదిస్తున్నాడు. ఈ మేరకు బుధవారం ఎన్నికల కమిషన్‌ను కలిసి తన పాయింట్‌ను వినిపించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు జనరల్ కౌన్సిల్ భేటీ జరగకుండా అడ్డుకునేందుకు పోలీసులను ఆశ్రయించాడు ఆయన. అయితే.. ఈ భేటీ జరగకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ మద్రాస్ హైకోర్టులో మాజీ మంత్రి బెంజిమన్ ఓ పిటిషన్ దాఖలు చేయగా.. మంగళవారం ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది హైకోర్టు. నిర్వహణ ఉండాలా? వద్దా? అనేది పార్టీ జనరల్ కౌన్సిల్‌కు సంబంధించిన నిర్ణయమని, దానిని ఆపాలని ఆదేశించలేమని బెంచ్ స్పష్టం చేసింది. అంతేకాదు.. భేటీకి హాజరయ్యే సభ్యులను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని పోలీసులను ఆదేశించింది మద్రాస్ హైకోర్టు. ఈ తరుణంలో అన్నాడీఎంకే వర్గపోరు వేడి.. అక్కడి రాజకీయాలను హీటెక్కిస్తోంది. -
శశి‘కలకలం’.. రీఎంట్రీ కోసం చిన్నమ్మ చిచ్చు?
సాక్షి, చెన్నై: అమ్మ జయలలిత మరణానంతరం తమిళనాడు రాజకీయాల్లో అన్నాడీఎంకే పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. ఈ నేపథ్యంలో పార్టీని తిరిగి గాడిలో పెట్టాలన్నా.. బలోపేతం చేయాలన్నా చిన్నమ్మ శశికళకు పార్టీ బాధ్యతలు అప్పగించడం మేలన్న అభిప్రాయాన్ని పన్నీర్ సెల్వం వర్గం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో వర్గ పోరు చిచ్చు రాజుకుంది. అన్నాడీఎంకే బలోపేతానికి శశి‘కళ’ అనివార్యమనే గళం గట్టిగా వినిపిస్తోంది. వరుస పరాజయాల నుంచి గట్టెక్కాలంటే శశికళను పార్టీలో చేర్చుకోవడం మినహా గత్యంతరం లేదని తన అనుచరులద్వారా పన్నీర్‌సెల్వం సంకేతాలు పంపిస్తున్నారు. ఈ క్రమంలోనే తేని జిల్లా పెరియకుళం కైలాసపట్లిలో పలువురు నేతలు సమావేశమై శశికళ రీ-ఎంట్రీ తీర్మానం చేశారు. అయితే వాళ్లు పాల్గొన్న వేదిక.. అన్నాడీఎంకే సమన్వయకర్త పన్నీర్ సెల్వానికి చెందిన ఫామ్‌హౌస్ కావడం విశేషం. ఎడపాడి అలక? బుధవారం శశికళ, ఆమె మేనల్లుడు దినకరన్ రీఎంట్రీకి తీర్మానం చేయడం, ఇందుకు ఎడపాడి పళనిస్వామి విముఖత ప్రదర్శించడం తీవ్రస్థాయిలో చర్చనీయాంశమైంది. అన్నాడీంకేను అన్నీతానై నడిపించిన జయలలిత 2016 డిసెంబర్లో కన్నుమూసిన తరువాత పన్నీర్‌సెల్వం సీఎం బాధ్యతలు చేపట్టారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళను ఎన్నుకున్నారు. అయితే సీఎం పదవిపై కన్నేసిన శశికళ ఆ కుర్చీ నుంచి పన్నీర్‌సెల్వంను బలవంతంగా తప్పించి శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ పిలువకపోవడం, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష పడడంతో శశికళ ఆశలు అడియాశలయ్యాయి. జైలు కెళ్లేముందు ఎడపాడి పళనిస్వామిని ఆమె సీఎం కుర్చీలో కూర్చోబెట్టి పార్టీ బాధ్యతలను మేనల్లుడు టీటీవీ దినకరన్‌కు అప్పగించింది. శశికళపై తిరుగు బాటు చేసి సొంతపార్టీ పెట్టుకున్న పన్నీర్‌సెల్వం.. మరలా ఎడపాడితో జట్టుకట్టి(సొంత పార్టీని విలీనం చేసి) ఉప ముఖ్యమంత్రిగా మారారు. పార్టీ కన్వీనర్, కో– కన్వీనర్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈపీఎస్, ఓపీఎస్ ఇద్దరూ కలిసి శశికళ, టీటీవీ దినకరన్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. ఓటమి తరువాత ఎడముఖం.. పెడముఖం గడిచిన అసెంబ్లీ ఎన్నికల వరకు ఒకరికొకరుగా సాగిన ఎడపాడి, పళనిస్వామి, పార్టీ పరాజయం తరువాత ఎడముఖం, పెడముఖంగా మారిపోయారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, డీఎండీకే, పీఎంలను కూటమిలో కలుపుకుని పోటీకి దిగినా అన్నాడీఎంకేకు కేవలం ఒక్కస్థానమే దక్కింది. ఇక గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం చేజారిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం పరాజయం వెంటాడింది. జనాకర్షణ లేకనే పార్టీ వరుస పరాజయాల ఎదుర్కొంటోందని కొందరు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో పన్నీర్‌సెల్వం అధ్యక్షతన బుధవారం తేనీలో జరిగిన పార్టీ సమావేశంలో శశికళను మళ్లీ పార్టీలో చేర్చుకోవాలని తీర్మానం చేయడం కలకలం రేపింది. ఈ నిర్ణయంపై ఎడపాడి వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. గత రెండేళ్లుగా పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే సమావేశాల్లో ‘శశికళ వర్గంతో సంబంధం పెట్టుకుంటే వేటు తప్పదు’ అని ఎడపాడి, పన్నీర్ హెచ్చరికలు జారీచేశారు. మరిప్పుడు సాక్షాత్తూ పార్టీ కన్వీనర్ పన్నీర్‌సెల్వమే చినమ్మ, దినకరన్‌కు స్వాగతం పలకడాన్ని కొందరు జీర్ణించుకోలేకున్నారు. మరి కొందరు సమర్ధిస్తున్నారు. పార్టీ అధిష్టానం తీసుకు నే నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని మాజీ మంత్రి కడంబూరు రాజా, శశికళ ప్రవేశం వల్ల పార్టీలో మ రింత గందరగోళ పరిస్థితులు ఏర్పడుతాయని అ న్నాడీఎంకే ఎమ్మెల్యే అరుణ్మొళి దేవన్ వ్యాఖ్యానించారు. అన్నాడీఎంకే సారథ్యం సరిగా లేదు, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంతో విలీనమై పార్టీని దినకరన్ నడిపించాలని మాజీ ఎమ్మెల్యే ఆరుకుట్టి సూచించారు. పళనివర్గం అత్యవసర సమావేశం పార్టీలో చకచకా మారుతున్న పరిణామాలను గమ నిస్తున్న ఎడపాడి పళనిస్వామి మాజీ మంత్రులు, సీనియర్ నేతలతో సేలంలో గురువారం అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ సమాచారం అందుకున్న మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకోగా బందోబస్తులో ఉన్న పోలీసు సిబ్బంది వారిని అడ్డుకుని పంపివేశారు. పార్టీలో సమ ఉజ్జీలుగా సాగుతున్న ఎడపాడి, పళనిస్వామి మధ్య గత కొంతకాలంగా సాగుతున్న విభేదాలు తాజా పరిణామాలతో మరింత రాజుకునే అవకాశం ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ దారుణ ఓటమి చెందింది. ఈ నేపథ్యంలో పార్టీని తిరిగి గాడిలో పెట్టాలంటే శశికళకు పార్టీ బాధ్యతలు అప్పగించడం మేలన్న అభిప్రాయాన్ని అటు నేతలు, ఇటు కార్యకర్తలు వెల్లడిస్తున్నారు. పన్నీర్ సెల్వం సమక్షంలో ఆమోదించిన ఈ తీర్మానంపై ఎడప్పాడి వర్గం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. శుక్రవారం జిల్లా కార్యనిర్వాహక మండలి సమావేశం జరుగుతుండగా.. పళని వర్గం ప్రత్యేకంగా సమావేశమై చర్చించనుంది. ఈ విషయంలో ఎడప్పాడి వర్గం సానుకూలంగా స్పందించి శశికళను తిరిగిపార్టీలోకి తీసుకుంటే తమిళ రాజకీయాలు మళ్లీ వేడెక్కడం ఖాయం. -
చిన్నమ్మకు చెక్ పెట్టినట్టేనా..
అన్నాడీఎంకే కుర్చీ వివాదానికి తెర పడింది. సామరస్య పూర్వకంగా నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు. సీఎం పళనిస్వామికి పట్టం కట్టారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే సీఎం అభ్యర్థి పళనిస్వామి అని బుధవారం ఆ పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరుసెల్వం స్వయంగా ప్రకటించారు. అలాగే, పార్టీకి 11 మందితో కూడిన మార్గదర్శక కమిటీ ఏర్పాటు చేశారు. ఇందు లో చిన్నమ్మ శశికళకు వ్యతిరేకంగా మొదటి నుంచి గళం విప్పుతున్న వాళ్లే ఉండడం గమనార్హం. సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో సాగుతున్న రాజకీయ వివాదం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సీఎం ఎవరో, మార్గదర్శక కమిటీలో ఎవరెవరు ఉండాలో అన్న అంశాలపై అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరుసెల్వం, కో కన్వీనర్ పళనిస్వామి నివాసాల్లో బుధవారం వేకువజామున మూడు గంటల వరకు సీనియర్ మంత్రుల మంతనాలు వేర్వేరుగా సాగడంతో ఉత్కంఠ తప్పలేదు. ఎట్టకేలకు ఉత్కంఠకు తెరదించే రీతిలో రాయపేటలోని అన్నాడీఎంకే కార్యాలయంలో ఉదయం 10 గంటలకు సమావేశం సాగింది. ఈ సమావేశం నిమిత్తం ముందుగా పన్నీరు సెల్వం అక్కడికి వచ్చారు. ఎంజీఆర్, జయలలిత విగ్రహాల వద్దకు చేరుకుని అంజలి ఘటించి లోనికి వెళ్లారు. ఆ తర్వాత పళనిస్వామి రావడంతో ఆయన మద్దతుదారుల హంగామా అంతా ఇంతా కాదు. పూల వర్షంలో ఆయన కాన్వాయ్ తడిసి ముద్దయింది. ముందుగా మార్గదర్శక కమిటీ.. పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదన్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి పన్నీరు, పళని హాజరు కాగా, సంయుక్త కన్వీనర్లు, ఎంపీలు వైద్యలింగం, కేపీ మునుస్వామి నేతృత్వం వహించారు. ముందుగా పళనిస్వామి అన్నాడీఎంకే మార్గదర్శక కమిటీని ప్రకటించారు. ఇందులో మంత్రులు దిండుగల్ శ్రీనివాసన్, తంగమణి, ఎస్పీ వేలుమణి, జయకుమార్, సీవీ షణ్ముగం, ఆర్ కామరాజ్‌లకు చోటు కల్పించారు. పార్టీ నిర్వాహక కార్యదర్శులు జేసీడీ ప్రభాకర్, మాజీ ఎంపీ పీహెచ్ మనోజ్‌పాండియన్, మాజీ మంత్రి మోహన్, మాజీ ఎంపీ గోపాలకృష్ణన్, చోళవందాన్ ఎమ్మెల్యే మాణిక్యంలకు అవకాశం కల్పించారు. సీఎం అభ్యర్థి పళని.. పన్నీరుసెల్వం ప్రసంగిస్తూ అన్నాడీఎంకే 2021 ఎన్నికలకు సిద్ధమైందని, పార్టీ నేతృత్వంలో కూట మి ఏర్పాటు అంటూ, సీఎం అభ్యర్థిగా పళనిస్వామి ని ఏకగ్రీవంగా ఎంపిక చేశామని ప్రకటించారు. సంబరాల్లో సేన.. పళనిస్వామి సీఎం అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ, ఏకగ్రీవ ఎంపిక ప్రకటనను పన్నీరు చేశారో లేదో, రాష్ట్రవ్యాప్తంగా అన్నాడీఎంకే వర్గాలు సంబరాల్లో మునిగాయి. అన్నాడీఎంకే కార్యాలయం పరిసరాల్లో బాణసంచా పేల్చుతూ, స్వీట్లు పంచారు. పళనిస్వామిని ప్రసన్నం చేసుకునేందుకు పార్టీ నేతలు పుష్పగుచ్ఛాలతో బారులు తీరారు. సమావేశాన్ని ముగించుకున్న నేతలందరూ మెరీనా తీరం వైపుగా కదిలారు. అక్కడి ఎంజీఆర్, జయలలిత సమాధుల వద్ద పుష్పాంజలి ఘటించారు. సీఎం ఎడపాడి పళనిస్వామి బుధవారం సాయంత్రం పన్నీరు సెల్వం ఇంటికెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. చిన్నమ్మకు చెక్ పెట్టినట్టేనా.. జైలు నుంచి బయటకు వచ్చే శశికళ అన్నాడీఎంకేను కైవసం చేసుకోవడం ఖాయం అన్న ప్రచారానికి మార్గదర్శక కమిటీతో చెక్ పెట్టినట్టున్నారు. శశికళ వ్యతిరేకులకు ఈ కమిటీలో చోటు దక్కడం గమనార్హం. పార్టీలో, ప్రభుత్వంలో తటస్థంగా వ్యవహరించే మంత్రులు జయకుమార్, కామరాజ్ కమిటీలో ఉన్నారు. వీరూ చిన్నమ్మ వ్యతిరేకులే. మిగిలిన నలుగురు మంత్రులు సీఎం మద్దతుదారులు. పన్నీరు మద్దతుదారులుగా ఓ ఎమ్మెల్యే, నలుగురు మాజీలు ఈ కమిటీలో ఉన్నారు. వీరంతా మొదటి నుంచి చిన్నమ్మకు వ్యతిరేకంగా అన్నాడీఎంకేలో గళాన్ని స్వరాన్ని వినిపిస్తున్న వాళ్లే. ఇక, ఈ కమిటీలో పదవి కోసం మహిళా నేతలు ప్రయత్నించినా ఫలితం శూన్యం. అలాగే, మంత్రి ఓఎస్.మణియన్, సెల్లూరు రాజుతో పాటు మరో ఇద్దరు, అన్వర్‌రాజా వంటి సీనియర్ల ప్రయత్నాలు చేసినా, వీరు అప్పుడప్పుడు పరోక్షంగా చిన్నమ్మకు అనుకూలంగా నోరు జారిన వాళ్లే కావడం గమనార్హం. -
మళ్లీ కోర్టుకు రెండాకులు
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే రెండాకుల చిహ్నం వ్యవహారం మళ్లీ కోర్టుకు చేరింది. ఢిల్లీ హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ అప్పీలుకు వెళ్లారు. మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అన్నాడీఎంకే విజయ చిహ్నం రెండాకులు. డీఎంకే నుంచి బయటకు వచ్చినానంతరం ఎంజీఆర్ అన్నాడీఎంకే ఆవిర్భావం, విజయచిహ్నంగా రెండాకులను పరిచయం చేశారు. నాటి నుంచి రెండాకులు ప్రజల హృదయాల్లో పదిలమైంది. ఎంజీఆర్ మరణం తదుపరి పరిణామాలతో ఈ చిహ్నంకు సమస్య తప్పలేదు. తాజాగా అమ్మ జయలలిత మరణం తదుపరి పరిణామాలతో చిహ్నం కష్టాలు ఎక్కువే. ఈ చిహ్నం కోసం పెద్ద సమరమే సాగుతూ వస్తున్నది. తొలుత ఈ చిహ్నం కోసం పన్నీరుసెల్వం, పళనిస్వామిల మధ్య సమరం సాగింది. ఈ ఇద్దరు ఏకం కావడంతో దినకరన్ రూపంలో చిహ్నం కష్టాలు తప్పడం లేదు. ఈ చిహ్నాన్ని కైవసం చేసుకునేందుకు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం దినకరన్ తీవ్రంగానే కుస్తీలు పడుతున్నారు. ఏడాదిన్నర కాలంగా న్యాయపోరాటం చేస్తూ వస్తున్నారు. చివరకు ఈ చిహ్నం వ్యవహారంలో ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. గత నెల వెలువడ్డ తీర్పులో రెండాకుల చిహ్నం పళని, పన్నీరుల నేతృత్వంలోని అన్నాడీఎంకే సమన్వయ కమిటీకే చెందుతుందని ప్రకటించారు. దీంతో అన్నాడీఎంకే వర్గాలు సంబరాలు చేసుకున్నాయి. ఇక, చిహ్నం కష్టాలు, సమస్య తీరినట్టేనన్న ఆనందంలో మునిగారు. అయితే, దినకరన్ మాత్రం పట్టువదలడం లేదు. ఆ చిహ్నం కైవసం చేసుకునేందుకు మళ్లీ న్యాయ పోరాటం బాటపట్టారు. పిటిషన్: రెండాకుల చిహ్నాన్ని అన్నాడీఎంకేకు కేటాయిస్తూ ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా దినకరన్ అప్పీలుకు రెడీ అయ్యారు. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు స్టే విధించి, రెండాకుల చిహ్నం విషయంగా విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతూ దినకరన్ తరఫున మంగళవారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో మళ్లీ చిహ్నం టెన్షన్ మొదలైంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో చిహ్నం వ్యవహారంలో కోర్టు ఏదేని ఉత్తర్వులు ఇచ్చిన పక్షంలో సంక్లిష్ట పరిస్థితులు తప్పదన్న ఆందోళన అన్నాడీఎంకేలో బయలు దేరింది. గత నెల తీర్పు వెలువరించే సమయంలో అన్నాడీఎంకే వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ బయలు దేరిన విషయం తెలిసిందే. తాజాగా దినకరన్ అప్పీలు రూపంలో ఏదేని కొత్త చిక్కులు వచ్చేనా అన్న ఆందోళన తప్పడం లేదు. -
విలీన చర్చలు విఫలం
-
విలీన చర్చలు విఫలం
కీలక అంశాలపై పళని, పన్నీర్ వర్గాల మధ్య విభేదాలు సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకేలో పళని, పన్నీర్ వర్గాల విలీనం మరోసారి వాయిదాపడింది. ప్రతిష్టంభనకు ముగింపు పలికేందుకు ఇరు వర్గాలు శుక్రవారం వేర్వేరుగా జరిపిన సుదీర్ఘ చర్చలు విఫలమయ్యాయి. కీలక అంశాలపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇరు వర్గాల నేతలు మీడియాతో మాట్లాడకుండానే వెనుదిరిగారు. అంతకముందు అమ్మ సమాధి సాక్షిగా విలీనమంటూ ఉదయం నుంచి ప్రచారం సాగింది. రెండు వర్గాల విలీనానికి మెరీనా బీచ్‌లోని జయలలిత సమాధి వద్ద ఏర్పాట్లు చేయడంతో ఏ క్షణం ఎలాంటి ప్రకటన వెలువడుతుందోనని ఉత్కంఠ కొనసాగింది. ఉదయం నుంచి చెన్నైలో వాతావరణం వేడెక్కింది. ఉదయం సీనియర్ నేతలు, మంత్రులు, తమ వర్గం నేతలు, ఎమ్మెల్యేలతో సీఎం పళని స్వామి భేటీ అయ్యారు. జయలలిత మరణంపై విచారణకు ఆదేశించడం, వేద నిలయాన్ని స్మారక మందిరంగా మార్చడం వంటి పన్నీర్ వర్గ డిమాండ్లను నేరవేర్చిన నేపథ్యంలో విలీనంపై ఈ భేటీలో చర్చించారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళ, ఆమె మేనల్లుడు దినకరన్‌ను పార్టీ నుంచి బహిష్కరించాలన్న డిమాండ్‌పై కూడా సానుకూలంగానే ఉన్నట్లు పళని వర్గం సంకేతాలిచ్చింది. కాగా శుక్రవారం సాయంత్రం పన్నీర్ సెల్వం కూడా తన వర్గ నేతలతో సమావేశమయ్యారు. ప్రభుత్వ తాజా నిర్ణయాలపై వారు సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. పన్నీర్‌సెల్వం ఎలాంటి ప్రకటన చేసినా వెంటనే స్పందించేందుకు వీలుగా పళని స్వామి సైతం పార్టీ ప్రధాన కార్యాలయంలో మంత్రివర్గం, సీనియర్ నేతలతో భేటీ అయ్యారు. మెరీనాబీచ్‌లోని అమ్మ సమాధి సాక్షిగా విలీనంపై ప్రకటన చేస్తారని ప్రచారం జరిగింది. దీంతో రాత్రి 7 గంటల సమయంలో జయ సమాధిని హడావుడిగా అలంకరించారు. పళని, పన్నీర్ కోసం రెండు పుష్పగుచ్ఛాల్ని సిద్ధం చేశారు. భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నేతలు, కార్యకర్తలు సమాధివద్దకు చేరుకున్నారు. ఇరు వర్గాల నేతలు సాయంత్రం 5 గంటలకు ప్రారంభించిన చర్చలు రాత్రి 10 గంటలు దాటినా కొలిక్కిరాకపోవడంతో ప్రతిష్టంభన కొనసాగింది. మా నాయకుడు అన్ని వివరాలు చెబుతారంటూ పన్నీర్ సెల్వం వర్గం నేతలు మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. ప్రభుత్వం, పార్టీలో పరిణామాల్ని శశికళకు వివరించేందుకు దినకరన్ శుక్రవారం బెంగళూరు బయల్దేరి వెళ్లారు. వేదనిలయంపై తమకే హక్కు ఉందని, ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేస్తామని జయలలిత మేనకోడలు దీప ప్రకటించారు. వేద నిలయం తనకు, దీపకు చెందుతుందని, కావాలంటే చట్టపరంగా స్వాధీనం చేసుకోవాలని సీఎంకి దీపక్ లేఖ రాశారు. జయ తల్లి సంధ్య రాసిన వీలునామా దీపక్ వద్ద ఉన్నట్లు సమాచారం. -
విలీనంపై కాసేపట్లో ప్రకటన
చెన్నైః ఏఐడీఎంకేలో సీఎం పళనిస్వామి మాజీ సీఎం పన్నీర్‌సెల్వం గ్రూపుల విలీనంపై మరికాసేపట్లో ప్రకటన వెలువడుతుందని భావిస్తున్నారు. పన్నీర్‌సెల్వం గ్రూపు ప్రతిపాదించిన డిమాండ్లకు సీఎం పళనిస్వామి అంగీకరిచడంతో విలీనం లాంఛనం కానుంది. ఇరువురు నేతలు జయలలిత మెమోరియల్‌ను సందర్శించి అనంతరం పార్టీ కార్యాలయానికి చేరుకుంటారని సమాచారం. జయలలిత మరణంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిన నేపథ్యంలో శుక్రవారం ఉదయం నుంచి రెండు గ్రూపుల మధ్య, వేర్వేరుగా సుదీర్ఘ మంతనాలు సాగాయి. పళనిస్వామి తన మంత్రివర్గ సభ్యులతో విలీనంపై చర్చించగా, పన్నీర్‌సెల్వం తన నివాసంలో సన్నిహిత నేతలతో సంప్రదింపులు జరిపారు. జయలలిత మరణంపై విచారణ జరిపించడంతో పాటు పోయెస్ గార్డెన్స్ నివాసాన్ని జయ మెమోరియల్‌గా మార్చాలనే పన్నీర్ డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించడంతో ఇరు గ్రూపుల విలీనానికి మార్గం సుగమమైంది. -
‘రజనీ పొలిటికల్ ఎంట్రీ గురించి నాకు తెలియదు’
న్యూఢిల్లీ : దక్షిణాది సూపర్ట్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం స్పందించారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ గురించి తనకు తెలియదని, అయితే ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయాల్లోకి రావొచ్చని అన్నారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడాన్ని స్వాగతిస్తామని, ఆయన మంచి వ్యక్తి అని పన్నీర్ సెల్వం అన్నారు. బీజేపీ ఆహ్వానిస్తేనే ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యానని ఆయన తెలిపారు. మరోవైపు రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని, కొత్త పార్టీ పెడతారంటూ ఆయన సన్నిహితులు, బంధువులు ఫీలర్లు వదులుతున్నారు. రజనీ జన్మదినమైన డిసెంబర్ 12వ తేదీన రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేస్తారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. -
దక్కని అనుగ్రహం
► కమలం పెద్దల అనుమతి నిరాకరణ ► చెన్నైకు దినకరన్ ► మద్దతు దారులతో భేటీ ► 33కు చేరిన ఎమ్మెల్యేల సంఖ్య ► పన్నీరుపై పళని వ్యంగ్యాస్త్రం ► నేడు మద్దతుదారులతో పన్నీరు భేటీ ► పది మంది ఎమ్మెల్యేల కొత్త నినాదం ► ఎయిమ్స్ మంజూరు చేయకుంటే రాజీనామా ► కేంద్రానికి మదురైలో హెచ్చరికలు సాక్షి, చెన్నై: బీజేపీ పెద్దల అనుగ్రహం టీటీవీ దినకరన్‌కు దక్కలేదు. నిరుత్సాహంతో శనివారం చెన్నైకు చేరుకున్న ఆయన మద్దతు ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. నిన్నటి వరకు 32గా ఉన్న దినకరన్ మద్దతు ఎమ్మెల్యేలు సంఖ్య తాజాగా 33కు చేరింది. ఇక, విలీనం విషయంలో నాన్చుడు ధోరణి అనుసరిస్తున్న మాజీ సీఎం పన్నీరు సెల్వంపై సీఎం పళనిస్వామి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విలీనంపై నిర్ణయం తీసుకునేందుకు పన్నీరు సెల్వం ఆదివారం మద్దతుదారుల భేటీకి పిలుపునివ్వడం గమనార్హం. కాగా మదురైకు చెందిన పది మంది ఎమ్మెల్యేలు కొత్త నినాదం అందుకున్నారు. మదురైకు ఏయిమ్స్ మంజూరు చేయని పక్షంలో రాజీనామా చేస్తామని కేంద్రానికి హెచ్చరికలు పంపించారు. అన్నాడీఎంకే ఎపిసోడ్లో సాగుతున్న పరిణామాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన కంటూ ఓ గ్రూపు సిద్ధం చేసుకున్న ఆ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ ఢిల్లీ పెద్దల అనుగ్రహం కోసం ప్రయత్నించి ఢీలా పడ్డారు. రెండు రోజులు ఢిల్లీలో తిష్ట వేసినా కమలం పెద్ద అనుమతి దక్కని దృష్ట్యా, నిరుత్సాహంతో శనివారం చెన్నైకు చేరుకున్నారు. వచ్చి రాగానే, తన మద్దతు ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. మాజీ మం త్రులు, ఎమ్మెల్యేలు సెంథిల్ బాలా జి, పళనియప్పన్ ఈ భేటీకి హాజరయ్యారు. నిన్నటి వరకు 32గా ఉన్న మద్దతు ఎమ్మెల్యేల సంఖ్య తాజాగా 33కు చేరింది. ఒట్ట పిడారం ఎమ్మెల్యే సుందరరాజన్ దినకరన్‌కు జై కొట్టారు. ఇక, ఎమ్మెల్యేలను తన వైపునకు తిప్పుకుని అమ్మ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ దినకరన్‌ను ఉద్దేశించి జయలలిత మేన కోడలు, ఎంజీఆర్, అమ్మ, దీప పేరవై నేత దీప ఆరోపించారు. దినకరన్‌కు మున్ముందు సంకట పరిస్థితులు తప్పవని హెచ్చరించారు. శశికళ కుటుంబానికి చరమ గీతం పాడే సమయం ఆసన్నమైందన్నారు. విలీనంలో నాన్చుడు : విలీనం విషయంలో నాన్చుడు ధోరణి అనుసరిస్తున్న మాజీ సీఎం పన్నీరు సెల్వంను ఉద్దేశించి సీఎం పళనిస్వామి పెదవి విప్పారు. సింహం, పులి, నక్క, తోడేలు అంటూ...మాతృగూటికి రావడానికి ఎందుకింత నాన్చుడు అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక, సీఎంపై ఎదురు దాడి చేస్తూ పన్నీరు శిబిరం నేత మధుసూదనన్ స్పందించారు. ఎమ్మెల్యేలు టీటీవీ దినకరన్ ఇంటి మెట్లు ఎక్కుతుంటే, వారించకుండా మౌనం వహించడం ఎందుకో అని ప్రశ్నించారు. నిజంగా దినకరన్‌ను బహిష్కరించి ఉంటే, ఆయన్ను కలిసిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమా అని సవాల్ చేశారు. అలాగే, మంత్రి జయకుమార్ నోటికి కల్లెం వేస్తే శ్రేయస్కరం అని హితవు పలికారు. ఇదిలా ఉండగా, విలీనం విషయంగా నిర్ణయాన్ని తీసుకునేందుకు పన్నీరు సిద్ధమైనట్టున్నారు. ఇందు కోసం ఆదివారం వేలప్పన్ చావడిలోని ఓ హాల్ వేదికగా మద్దతు నేతల సమావేశానికి పిలుపు నివ్వడం గమనార్హం. సాయంత్రం నాలుగు గంటలకు ఈ సమావేశం జరగనుండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. రాజీనామా నినాదం : బలం పెంపునకు దినకరన్, ప్రభుత్వాన్ని రక్షించుకునేందుకు పళని, కుర్చీ కైవసానికి పన్నీరు ప్రయత్నాలు సాగిస్తున్న తరుణంలో మదురై జిల్లాలకు చెందిన పది మంది ఎమ్మెల్యేలు కొత్త నినాదం అందుకున్నారు. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో అటు కేంద్రానికి, ఇటు తమ పార్టీని ఇరకాటంలో పెట్టే విధంగా కొత్త నినాదంతో రాజీనామా హెచ్చరికలు చేయడం గమనార్హం. తంజావూరు చెంగి పట్టిలో ఎయిమ్స్ ఏర్పాటుకు కసరత్తులు జరుగుతున్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. అయితే, మదురైలో ఏర్పాటుకు తొలుత నిర్ణయించిన ఎయిమ్స్ ఆసుపత్రి తంజావూరుకు తరలుతున్నట్టుగా వచ్చిన సమాచారంతో ఎయిమ్స్ సాధన లక్ష్యంగా రాజీనామా నినాదాన్ని పది మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అందుకోవడం, ఈ ప్రకటనను స్వయంగా రెవెన్యూ మంత్రి ఆర్బీ ఉదయకుమార్ చేయడం గమనించాల్సిన విషయం. -
రుణాలు రద్దు చేయండి
► నీట్ పరీక్ష నుంచి మినహాయించాలి ► ప్రధాని మోదీకి పన్నీర్ వినతి ► కేంద్రంతో సాన్నిహిత్యానికి పన్నీర్ ప్రయత్నాలు అతివృష్టి,అనావృష్టిలతో అల్లాడుతున్న అన్నదాతలను ఆదుకోవాలని, వ్యవసాయ రుణాలను రద్దు చేయాలని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. అలాగే నీట్ ప్రవేశపరీక్ష నుంచి తమిళనాడును మినహాయించాలని ఆయన కోరారు. పనిలో పనిగా రాష్ట్ర రాజకీయాలను సైతం ప్రధానికి వివరించినట్లు సమాచారం. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ప్రధాని దృష్టికి తీసుకెళ్లేందుకు పన్నీర్‌సెల్వం తన వర్గం ఎంపీలతో కలిసి గురువారం రాత్రి ఢిల్లీకి చేరుకుని శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకేలోని ఇరువర్గాల విలీన ప్రయత్నాలు విఫలం కావడంతో అన్నాడీఎంకే, రెండాకుల చిహ్నం పొందడంపై నేతలు దృష్టిపెట్టారు. పన్నీర్‌వర్గం వైపు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎంపీలు వస్తారని ఆశించారు. అయితే కేవలం 12 మంది ఎమ్మెల్యేలు, 12 మంది ఎంపీలు మాత్రమే పన్నీర్‌వైపు ఉన్నారు. అలాగే సీఎం ఎడపాడి పళనిస్వామి వర్గంలో 123 మంది ఎమ్మెల్యేలు, 35 మంది ఎంపీలు ఉన్నా రు. అయితే టీటీవీ దినకరన్‌ను పార్టీకి దూరం పెట్టడంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న కొందరు ఎమ్మెల్యేలు ఎడపాడి పట్ల విముఖతతో తిరుగుబాటు ధోరణిని ప్రదర్శిస్తున్నారు. ఎడపాడి ప్రభుత్వానికి ఏక్షణమైనా ప్రమాదం ఏర్పడవచ్చని కొందరు అంచనావేస్తున్నారు. అన్నాడీఎంకేలో విబేధాలు పొడచూపిన నాటి నుంచి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పన్నీర్‌సెల్వం వైపు నిలిచింది. శశికళపై పలురకాల ఒత్తిడి తెచ్చింది. రాష్ట్ర రాజకీయాల్లో కేంద్రం తలదూర్చలేదని బీజేపీ రాష్ట్ర నేతలు ఖండించారు. అయినా, ఆర్కేనగర్ ఉప ఎన్నికలు రద్దు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్ ఆస్తులపై ఐటీ దాడులు తదితర పరిణామాలు శశికళ వర్గానికి కేంద్రం వ్యతిరేకమని భావించేలా చేశారు. ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా సీఎం ఎడపాడి, మంత్రులు ఢిల్లీ బాటపట్టి ప్రధాని, కేంద్ర మంత్రులను కలుసుకున్నారు. రాష్ట్రపతి ఎన్నికలకు పూర్తి మద్దతిస్తామని సీఎం ఎడపాడి ఢిల్లీ పెద్దలకు హామీ ఇచ్చారని తెలుస్తోంది. దీంతో కేంద్రం సైతం ఎడపాడి ప్రభుత్వానికి అండగా నిలవడం ప్రారంభించింది. ఈ విషయాన్ని నిర్ధారిస్తున్నట్లుగా సీఎం ఎడపాడి సైతం రాష్ట్రంలో జరిగే సభల్లో కేంద్రాన్ని పొగడడం ప్రారంభించారు. మెట్రోరైలు ప్రారంభోత్సవానికి హాజరైన కేంద్రం మంత్రి వెంకయ్యనాయుడు ఏకంగా సచివాలయానికి వెళ్లి సమీక్ష నిర్వహించారు. పన్నీర్ వర్గం భీతి: ఎమ్మెల్యేలు, ఎంపీల సంఖ్యాపరంగా ఇప్పటికే బలహీనంగా ఉన్న పన్నీర్‌సెల్వం వర్గం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సఖ్యత వల్ల భీతి నెలకొంది. తమవైపు ఉన్న ఆ కొద్ది మంది కూడా ఎడపాడి వైపు వెళ్లిపోతారనే అనుమానాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో పన్నీర్ వర్గానికి చెందిన ఎంపీ మైత్రేయన్ బీజేపీ నేతలతో మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం. అలాగే మోదీతో సాన్నిహిత్యం చేజారిపోకుండా పన్నీర్‌సెల్వం సైతం జాగ్రత్తపడుతున్నారు. ఇందులో భాగంగా గురువారం రాత్రి 11.40 గంటలకు విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. పన్నీర్‌సెల్వం ఢిల్లీ పయనాన్ని గోప్యంగా ఉంచారు. పన్నీర్‌తోపాటు మాజీ మంత్రి కేపీ మునుస్వామి, ఎంపీ మైత్రేయన్ వెళ్లారు. శుక్రవారం ఢిల్లీలో ప్రధాని మోదీని కలుసుకుని వినతి పత్రం సమర్పించారు. రైతుల వ్యవసాయ రుణాలను రద్దు చేయాలని, తమిళనాడు ప్రజల అభీష్టాన్ని మన్నించి నీట్ ప్రవేశపరీక్షను మినహాయించాలని కోరారు. రాష్ట్ర రాజకీయాలపై కూడా ప్రధానితో సంభాషించినట్లు సమాచారం. అలాగే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికలు నిర్వహించాలని, రెండాకుల చిహ్నాన్ని తమకు కేటాయించాలని ఈసీని కోరినట్లు తెలిసింది. శశికళ, ఆమె కుటుంబ సభ్యులను పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తేనే విలీనంపై ఆలోచిస్తామని ఢిల్లీ మీడియాతో పన్నీర్‌సెల్వం వ్యాఖ్యానించారు. -
విలీనం ఎండమావే!
► కత్తులు దూసుకుంటున్న వైరివర్గాలు ► పన్నీర్ అవినీతి చిట్టాకు సీఎం ఆదేశం ► మంత్రుల తిట్ల దండకాలు అన్నాడీఎంకే వైరివర్గాల విలీనం ఎండమావేనని మరోసారి తేలిపోయింది. ‘కలిసిపోదాం..రా’ అంటూ కడుపులో కత్తులు పెట్టుకుని ఎడపాడి, పన్నీర్ వర్గాలు కౌగిలించుకునే ప్రయత్నాలు బహిర్గతమయ్యాయి. పన్నీర్ అవినీతి చిట్టా తయారీకి సీఎం సిద్ధం అవుతుండగా, ఎడపాడిని ఎండగట్టేందుకు రాష్ట్ర వ్యాప్త పర్యటనకు పన్నీర్ సమాయత్తం అవుతున్నారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: ఎంజీఆర్ మరణం తరువాత అన్నాడీఎంకే కోడిపుంజు, రెండాకులుగా విడిపోగా, జయ మరణం తరువాత టోపీ, రెండు దీపాల విద్యుత్ స్తంభాలుగా చీలిపోయింది. ఎన్నికల కమిషన్ చేతిలో చిక్కుకున్న పార్టీ, రెండాకుల చిహ్నం దక్కించుకునేందుకు గత్యంతరం లేక ఇరువర్గాలు ఇటీవల ఐక్యతారాగం ఆలపించడం ప్రారంభించాయి. అయితే ప్రధాన కార్యదర్శి, ఉప ప్రధాన కార్యదర్శి పదవుల నుంచి శశికళ, దినకరన్‌లను శాశ్వతంగా తప్పించాలన్న పన్నీర్‌సెల్వం డిమాండ్‌తో విలీనానికి విఘాతం ఏర్పడింది. అయినా, వైరి వర్గాలు ఏకం కావడంపై ఇంకా ఆశలు రేకెత్తిస్తూ శశికళ, దినకరన్‌ల బహిష్కరణకు మార్గాలను సూచించాల్సిందిగా లోక్‌సభ ఉప సభాపతి తంబిదురై మంగళవారం పన్నీర్వర్గాలను కోరడం విచిత్రం. అలాగే ఎడపాడి అసంతృప్త ఎమ్మెల్యేలు కరూరులో ఈనెల 5వ తేదీన నిరాహారదీక్షకు సిద్ధం కావడం, విలీన ప్రయత్నాలు విఫలం కావడంతో పన్నీర్ వర్గానికి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు ఎడపాడి వైపు చూడడం అన్నాడీఎంకే చోటుచేసుకుంటున్న విచిత్రపరిణామాలు. ఆనాడు ఇరువర్గాలు అనతికాలంలోనే ఏకమైపోగా ఈసారి మాత్రం ఎడపాడి, పన్నీర్ సెల్వం వర్గాల ఏకం ఎండమావిని తలపిస్తోంది. నిబంధనలను లేని చర్చలకు సిద్ధమని సీఎం ఎడపాడి పునరుద్ఘాటించగా, ఏకం కావడంపై ఎడపాడి కపటనాటకం ఆడుతున్నారని పన్నీర్ సెల్వం మేడే నాటి సభల్లో దుయ్యబట్టారు. సీఎం కోవలోనే మంత్రులు సెంగొట్టయ్యన్, దిండుగల్లు శ్రీనివాసన్, ఆర్ వైద్యలింగం, పార్టీ అధికార ప్రతినిధి నాంజిల్ సంపత్, మాజీ మంత్రి వలర్మతి మంగళవారం వేర్వేరు ప్రకటనల ద్వారా పన్నీర్‌సెల్వంపై తిట్టదండకం అందుకుని ఇరువర్గాలు ఏకం కావడం ఇక ఎండమావేననే సంకేతాలు ఇచ్చారు. పన్నీర్ అవినీతి చిట్టాకు సీఎం ఆదేశం: ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి హోదాల్లో ఆరేళ్ల కాలంలో పన్నీర్‌సెల్వం అవకతవకలపై శాఖలవారీగా జాబితాను సిద్ధం చేయాల్సిందిగా సీఎం ఎడపాడి మంగళవారం ఆదేశించారు. 122 మంది ఎమ్మెల్యేలు, 29 మంది ఎంపీలు, 9 మంది రాజ్యసభ సభ్యులు 50 మంది పార్టీ జిల్లా కార్యదర్శులు లెక్కన 90 శాతం పార్టీ తమ పక్షాన ఉందని కొన్ని రోజుల క్రితం సేలంలో మీడియాతో సీఎం వ్యాఖ్యానించారు. సీఎం చేసిన ఈ వ్యాఖ్యలు ఇరువర్గాల ఏకమయ్యే ప్రశ్నేలేదని తేటతెల్లం చేశాయి. ఇదిలా ఉండగా ఆర్కేనగర్లో మేడే నాడు పన్నీర్‌సెల్వం సైతం...చర్చల పేరుతో ఎడపాడి వర్గం కపట నాటకం ఆడుతోందని విమర్శించారు. ఒక కుటుంబ కబంధ హస్తం నుంచి పార్టీకి విముక్తి కల్పిస్తానని కూడా ప్రజలకు హామీ ఇచ్చారు. దినకరన్ ముఠాకు చెందిన వ్యక్తి ఎడపాడి అంటూ ఆరోపించారు. ఎన్నికల కమిషన్ కేసులో అరెస్టయిన దినకరన్‌తో ముడిపెట్టడం ద్వారా ఎడపాడిని సైతం అరెస్ట్ చేయించాలని పన్నీర్‌సెల్వం పన్నాగంగా అనుమానించారు. పన్నీర్‌సెల్వం ఈనెల 5వ తేదీ నుంచి నిర్వహించే రాష్ట్ర పర్యటనలో తనపై ఆరోపణలు చేయడం ఖాయమని విశ్వసించిన సీఎం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. మాజీ ముఖ్యమంత్రి, ఆర్థికమంత్రిగా ఆరేళ్ల కాలంలో పన్నీర్‌సెల్వం అవినీతి చిట్టాను సిద్ధం చేయాల్సిందిగా సీఎం ఆదేశించారు. అంతేగాక క్వారీల కాంట్రాక్టర్ శేఖర్‌రెడ్డితో కుమ్మక్కు తదితర అంశాలను తోడుతున్నారు. అంటే సీఎం ఎడపాడి, మాజీ సీఎం ఎడపాడి నేరుగా ఢీకొనేందుకు సిద్ధంద్దం అవుతున్నట్లు భావించవచ్చు. -
సీఎంగా పళనిస్వామి.. అధ్యక్షుడిగా పన్నీర్!
-
సీఎంగా పళనిస్వామి..మార్గదర్శక కమిటీ అధ్యక్షుడిగా పన్నీర్!
తెరపైకి కొత్త ప్రతిపాదన సాక్షి, చెన్నై: ప్రభుత్వంతో పాటు అన్నాడీఎంకేను నడిపిం చేందుకు గానూ ఓ మార్గదర్శక కమిటీని నియమించాలనే ప్రతిపాదనను తమిళనాడు సీఎం పళనిస్వామి వర్గం తెర మీదకు తెచ్చినట్టు ఆ పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. ఈ కమిటీకి అధ్యక్షుడిగా పన్నీర్ సెల్వాన్ని నియమించాలని, పళనిస్వామినే సీఎంగా కొనసాగించాలని రహస్య మంత నాల్లో ఓ నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. బుధవారం బాగా పొద్దుపోయాక పన్నీర్ వర్గానికి చెందిన మాజీ మంత్రులు కేపీ మునుస్వామి, నత్తం విశ్వనాథన్, పళని వర్గానికి చెందిన ఎంపీ వైద్యలింగం, మంత్రి సెంగోట్ట యన్ మధ్య మంతనాలు జరిగాయి. ఈ సందర్భంగా పళని వర్గం మార్గదర్శక కమిటీ నియామక ప్రతిపాదనను తెర మీదకు తెచ్చినట్టు తెలిసింది. పళనిస్వామిని సీఎంగా కొన సాగించాలని.. అలాగే ప్రభుత్వాన్ని, పార్టీని నడిపించేందుకు ఓ కమిటీని రంగంలోకి దించాలన్న సూచన చేసినట్లు సమాచారం. పన్నీరు అధ్యక్షుడిగా, రెండు వర్గాలకు చెందిన ఐదు గురు లేదా ఏడుగురిని సభ్యులుగా ఎంపిక చేయాలని నిర్ణ యించినట్టు తెలిసింది. సమస్యలన్నీ ఓ కొలిక్కి వచ్చాక, పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించి.. మెజారిటీ శాతం అభి ప్రాయం మేరకు తదుపరి అడుగులు వేద్దామన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కాగా, గురువారం మంత్రి సెంగో ట్టయన్ మీడియాతో మాట్లాడుతూ.. విలీన చర్చల విషయం లో పార్టీ వర్గాలెవ్వరూ నోరు మెదిపేందుకు వీల్లేదని, అన వసర గందరగోళం సృష్టించవద్దని హెచ్చరించడం గమ నార్హం. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మూడో రోజు 17 జిల్లాల కార్యదర్శులతో సీఎం భేటీ అయ్యారు. ఈ భేటీలో పలువురు శశికళ, దినకరన్‌లకు మద్దతుగా స్పందించడంతో ఆయన షాక్‌కు గురైనట్లు తెలిసింది. ఓవైపు రహస్య మంతనాలు, అభిప్రాయ సేకరణలు జరుగుతుంటే.. మరోవైపు అన్నాడీ ఎంకేలోని 28 మంది ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు నగరంలోని ఓ హోటల్లో రహస్యంగా సమావేశమయ్యారు. మంత్రి పదవు లపై వీరు ప్రధానంగా చర్చించుకున్నట్లు తెలిసింది. -
రహస్యంగా..
► రాత్రంతా విలీన మంతనాలు ► ఉదయాన్నే బ్యానర్ల తొలగింపు ► కార్యదర్శులతో పళనిస్వామి సంతకాలు ► నిర్ణయాధికారం ఆయన చేతికే ► సమయం కోసం పన్నీరు శిబిరం ఎదురుచూపు ► చర్చలు సాగుతాయని మునుస్వామి స్పష్టీకరణ సాక్షి, చెన్నై: ఆగిందనుకున్న చర్చలకు మళ్లీ జీవం పోసే పనిలో రెండు శిబిరాల నేతలు నిమగ్నమైనట్టున్నారు. మంగళవారం అర్ధరాత్రి పరిణామాలతో బుధవారం ఉదయాన్నే సీఎం పళనిస్వామి శిబిరం దూకుడు పెంచింది. చిన్నమ్మ బ్యానర్ల తొలగింపు, జిల్లాల కార్యదర్శులతో సంతకాల సేకరణ వెరసి విలీన చర్చ మళ్లీ తెర మీదకు వచ్చింది. అన్ని కలిసి వస్తున్నాయని, సమయానుకూలంగా చర్చలకు వెళ్తామని పన్నీరు శిబిరం ప్రకటించడంతో ఎదురుచూపులు పెరిగాయి. అన్నాడీఎంకేలో పన్నీరు, పళని శిబిరాలు ఏకమయ్యే విధంగా వారం పది రోజులుగా రాష్ట్రంలో చర్చ సాగుతూ వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఇరు శిబిరాల మధ్య పేలుతూ వచ్చిన మాటల తూటాలు, తెర మీదకు వచ్చిన కీలక డిమాండ్ల పర్వాలు వెరసి ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా విలీన వ్యవహారం మారింది. చర్చలకు తేదీ నిర్ణయించినా, చివరకు రెండు శిబిరాల ఒకే వేదిక మీదకు రాలేదు. దీంతో చర్చలు ఆగినట్టేనా అన్న ప్రశ్న బయలు దేరింది. ఈ నేపథ్యంలో మంగళవారం అర్ధరాత్రి ఓ హోటల్లో రెండు శిబిరాల మధ్య సుదీర్ఘచర్చ సాగడం వెలుగులోకి వచ్చింది. పన్నీరు శిబిరం నుంచి మాజీ మంత్రులు కేపీ మునుస్వామి, నత్తం విశ్వనాథన్, పళనిస్వామి శిబిరానికి చెందిన ఎంపీ వైద్యలింగం, మంత్రి సెంగోట్టయన్ రాత్రి ఎనిమిది గంటల నుంచి ఐదు గంటల మేరకు ఆ హోటల్లో చర్చలు సాగించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈసందర్భంగా తమ వైపు ఉన్న వాదనలు, డిమాండ్లను పళనిస్వామి శిబిరానికి తెలియజేసినట్టు సమాచారం. అదే రాత్రి పార్టీ బహిష్కృత ఉప ప్రధానకార్యదర్శి టీటీవీ దినకరన్ అరెస్టుతో ఉదయాన్నే పళని స్వామి శిబిరం దూకుడు పెంచడం గమనార్హం. చిన్నమ్మ బ్యానర్లు తొలగింపు: ఉదయాన్నే రాయపేటలోని పార్టీ కార్యాలయంలో ఉన్న చిన్నమ్మ బ్యానర్లన్నీ తొలగించారు. ఈ సమాచారంతో టీటీవీ మద్దతుదారులు అక్కడికి వచ్చి హడావుడి సృష్టించారు. గెంగవళ్లికి చెందిన రాయప్ప అనే మద్దతుదారుడు ఆత్మహత్యాయత్నం చేసుకుంటానని బెదిరించడంతో అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు పహార నడుమ ఆగమేఘాలపై ఆ బ్యానర్లు తొలగించారు. ఆ స్థానంలో అమ్మ జయలలిత ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం విశేషం. ఇక, మంగళవారం కొందరు జిల్లాల కార్యదర్శులు చెన్నైకు చేరుకున్నా, బుధవారం మరి కొందరు రావడంతో మొత్తంగా 31 జిల్లాల కార్యదర్శుల వద్ద సంతకాల సేకరణ సాగడం ఆలోచించదగ్గ విషయం. పార్టీకి పెద్ద దిక్కుగా ప్రస్తుతం సీఎం పళనిస్వామికే బాధ్యతల్ని అప్పగించే అంశాలు ఆ సంతకాలు చేసిన పత్రాల్లో ఉన్నట్టు సమాచారం. ఎన్నికల కమిషన్‌కు ఏదేని వివరాలు, సమాచారాలు ఇవ్వాల్సి ఉంటే, ఆ బాధ్యతలు, ఇతర నిర్ణయాధికారాలన్నీ సీఎంకే కల్పించి ఉండడం చూస్తే, మళ్లీ విలీనం చర్చ తెర మీదకు వచ్చినట్టేనన్న సంకేతాలు వెలువడుతున్నాయి. బుధవారం రాత్రి కూడా మళ్లీ మంతనాలు సాగనున్నట్టు సమాచారం. ఈ దృష్ట్యా, గురువారం మరింతగా దూకుడు పెంచే విధంగా పళనిస్వామి శిబిరం ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో తమ డిమాండ్ మేరకు చిన్నమ్మ బ్యానర్లను తొలగించడాన్ని పన్నీరుశిబిరం ఆహ్వానించడమే కాకుండా, అన్నీ కలిసి వస్తున్నాయని, చర్చలు సరైన సమయంలో జరుగుతాయని ఆ శిబిరానికి మాజీ మంత్రి కేపీ మునుస్వామి వ్యాఖ్యానించడం విశేషం. అలాగే, పళని శిబిరానికి చెందిన మంత్రి సీవీ షణ్ముగం పేర్కొంటూ, చర్చలకు ఆహ్వానించామని, ఎప్పుడు వచ్చినా సిద్ధంగానే ఉన్నట్టు స్పందించారు. చిన్నమ్మ బ్యానర్ల విషయంలో ముందుగానే నిర్ణయం తీసుకున్నా, తొలగింపునకు కొంత సమయం పట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. -
చర్చలకు స్వస్తి
► ఎంజీఆర్ ఉత్సవాలపై దృష్టి ► శశికళ ఫొటోలు తొలగించాలని డిమాండ్ ► అన్నాడీంకే విలీనం ఆగిపోయినట్లే సాక్షి ప్రతినిధి, చెన్నై: ఏకం అవుతున్నామంటూ ఇటీవల ఎగిరెగిరి పడిన అన్నాడీఎంకే నేతలు చతికిలపడ్డారు. విలీన చర్చలకు స్వస్థి పలికి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంజీ రామచంద్రన్ శత జయంతి ఉత్సవాలపై దృష్టి పెట్టారు. జయ మరణం తరువాత రెండుగా చీలిపోయిన అన్నాడీఎంకే, ఆర్కేనగర్ ఉప ఎన్నికల అనుభవాలతో తిరిగి ఏకం కావాలని నిర్ణయించుకున్నారు. రాజీపై పన్నీర్ వర్గం డిమాండ్లు అనేక పిల్లిమొగ్గలు వేసిన తరువాత తమ ప్రథమ శత్రువైన శశికళ, ఆమె కుటుంబీకులను పార్టీ నుంచి శాశ్వతంగా తొలగించడం, జయలలిత మరణంపై సీబీఐ విచారణను కోరడం అనే డిమాండ్ల వద్ద ఆగింది. శశికళ, దినకరన్ ప్రధాన కార్యదర్శి, ఉప ప్రధాన కార్యదర్శులుంటూ ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన ప్రమాణ పత్రాలను వెనక్కు తీసుకోవాలని ఎడపాడి వర్గంపై పన్నీర్ వర్గం పట్టుపడుతోంది. పన్నీర్ సీఎంగా ఉన్నపుడు జయ మరణంపై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించలేదని ఎడపాడి వర్గం వాదన లేవనెత్తింది. శశికళ అంశం ఎన్నికల కమిషన్ విచారణలో ఉన్నందున తాము హామీ ఇవ్వలేమని ఎడపాడి వర్గం దాటవేయడంతో చర్చలకు పెద్ద విఘాతం ఏర్పడింది. విలీన చర్చలు ఇక ఇప్పట్లో ఉండవనేలా అ«ధికార వర్గం వ్యవహరిస్తోంది. చర్చల ప్రయత్నాలకు తెరదించి జూన్ 8, 9 తేదీల్లో ఎంజీ రామచంద్రన్ శతజయంతి ఉత్సవాలపై దృష్టి మరల్చారు. పత్రాలను సమర్పించిన పన్నీరు వర్గం: రెండాకుల చిహ్నం పొందడంలో జూన్ 16వ తేదీలోగా అదనపు డాక్యుమెంట్లు సమర్పించాలని ఎన్నికల కమిషన్ ఇటీవల ఆదేశించింది. ఈ పత్రాల సమర్పణకు మరింత సమయం ఉన్నందున పార్టీ జిల్లా కార్యదర్శుల సమావేశం, ఎంజీ ఆర్ శత జయంతి ఏర్పాట్లపై ఎడపాడి వర్గాలు దృష్టి పెట్టాయి. అయితే పన్నీర్‌సెల్వం వర్గాలు ఎన్నికల కమిషన్ కోరిన అదనపు డాక్యుమెంట్లను మంగళవారం సమర్పించారు. మరో బాంబు పేల్చిన మదుసూధనన్: విలీన చర్చలపై ఇప్పటికే ప్రతిష్టంభన నెలకొనగా, అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలోని శశికళ ఫొటోలను తొలగించాలని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం వర్గానికి చెందిన మధుసూదనన్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసి మరో బాంబు పేల్చారు. జయలలిత మరణం వల్ల ప్రజల్లో ఏర్పడిన ఆవేదన ఇంకా తొలగిపోలేదని ఆయన అన్నారు. జయలలిత మరణంపై ప్రజల్లో ఉన్న అనుమానాలు తొలగిపోయి న్యాయం దక్కాల్సి ఉందని చెప్పారు. అమ్మ మరణం తరువాత కనుమరుగు కాకుండా అన్నాడీఎంకేను కాపాడుకోవాలనే ప్రజల గళాన్ని విశ్వాసపాత్రులుగా తాము వినిపిస్తున్నామని తెలిపారు. పార్టీని కాపాడుకునే వరకు తమ ధర్మయుద్ధం కొనసాగుతూనే ఉంటుందని ఆయన అన్నారు. పార్టీ పవిత్రను కాపాడాలంటే కార్యాలయంలోని శశికళ ఫొటోలను తొలగించక తప్పదని ఆయన చెప్పారు. లక్ష్యసాధనకు వేర్వేరు మార్గాలు: ఎంజీ రామచంద్రన్ నెలకొల్పిన అన్నాడీఎంకే, రెండాకుల చిహ్నంపై ఎన్నికల కమిషన్ విధించిన నిషేధాన్ని తొలగింపజేసుకుని పార్టీని కాపాడుకోవాలన్న ఏకైక లక్ష్యంతోనే ఇరువర్గాలు విలీన చర్చకు సిద్ధమయ్యారు. ఇరువురం రాజీపడకుంటే రెండాకు చిహ్నం ఎవ్వరికీ దక్కకుండా పోతుందని, ఈ పరిణామంతో ప్రజల నుంచి ఆగ్రహానికి గురికాకతప్పదని ఎడపాడి, పన్నీర్ వర్గాలు భయపడ్డాయి. ఏదో ఒక కోణంలో రాజీ కుదుర్చుకోవాలని వారం రోజులుగా ప్రయత్నాలు చేశాయి. విలీన చర్యలకు ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీలు వేసుకున్నాయి. అయితే విలీన చర్చల సారాంశానికి విరుద్ధంగా పరస్పర ఆరోపణలు దిగడం ద్వారా ఇరువర్గాలు చెడగొట్టుకున్నాయి. ఎన్నికల కమిషన్‌కు అదనపు ఆధారపత్రాలను సమర్పించేందుకు ఇంకా కొంత సమయం ఉందని ఎడపాడి వర్గం భావించడం, పన్నీర్‌వర్గం మంగళవారమే సమర్పించేయడం ద్వారా చర్చలకు తావులేకుండా విలీనానికి ఇక శాశ్వతంగా తెరదించారు. -
విలీనం.. అనుమానం
► స్వరం మార్చిన పన్నీరు వర్గం ► అభిప్రాయ సేకరణ తరువాతే చర్చలన్న ఎడపాడి వర్గం ► నేటి నుంచి పార్టీ కార్యదర్శుల సమావేశం అన్నాడీఎంకేలోని వైరివర్గాల విలీన చర్చలపై ఇరువర్గాల్లోనూ మరోసారి అభిప్రాయ భేదాలు తలెత్తాయి. విలీనంపై అందరి అభిప్రాయాలను సేకరించాల్సి ఉందని సీఎం ఎడపాడి వర్గం, ప్రధాన డిమాండ్లను అంగీకరిస్తే చర్చలకు ఆమోదం తెలుపుతామని పన్నీర్ వర్గం భీష్మించుకోవడంతో పాటూ పరస్పర విమర్శలు చేసుకోవడంతో మరోసారి బ్రేక్ పడింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: పార్టీని, రెండాకుల చిహ్నాన్ని కాపాడుకునేందుకు చెన్నై రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం చర్చలు ప్రారంభించాలని రెండు రోజుల క్రితం ఇరువర్గాలు నిర్ణయం తీసుకున్నాయి. ఇందుకోసం ఇరువర్గాలు చర్చల కోసం ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీలను వేసుకున్నాయి. ఈ నిర్ణయం మేరకు ఇరువర్గాల కమిటీలు సోమవారం సాయంత్రం 4 గంటలకు కూర్చుని చర్చలు ప్రారంభించాల్సి ఉంది. ఇందుకు సంబంధించి చర్చల్లో ఏమేమి మాట్లాడాలనే అవగాహన కోసం సీఎం ఎడపాడి తన ఇంటిలో సీనియర్ మంత్రులతో సమావేశమయ్యారు. కొందరు నేతలు పార్టీ కార్యాలయంలో మీటింగ్ పెట్టుకున్నారు. ఎడపాడి సీఎం అయిన తరువాత ప్రజలకు ఆయనపై అభిమానం పెరిగింది, దీనికి తోడు 122 మంది ఎమ్మెల్యేల బలం ఉంది కాబట్టి సీఎం పదవిని వదులుకునేది లేదని మంత్రులు, సీనియర్ నేతలు స్పష్టం చేశారు. ఇక ప్రధాన కార్యదర్శి పదవి ఎన్నికల కమిషన్ వద్ద విచారణలో ఉన్నందున చర్చల అజెండాలో చేర్చవద్దని వారించారు. అయితే తన ఆధీనంలో ఉన్న ఆర్థిక మంత్రి పదవిని పన్నీర్‌కు అప్పగించేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని జయకుమార్ చేసిన ప్రకటన ఇరువర్గాల మధ్య మళ్లీ నిప్పు రాజేసింది. డిమాండ్లపై రాజీలేదు పన్నీర్ సెల్వం సైతం గ్రీన్‌వేస్ రోడ్డులోని తన ఇంటిలో తన వర్గ నేతలతో చర్చలు జరిపారు. సీఎం, ప్రధాన కార్యదర్శుల పదవులు కాదు, పార్టీ, రెండాకుల చిహ్నంను నిలబెట్టుకోవడం ముఖ్యమని పన్నీర్‌వర్గం నేతలు అభిప్రాయపడ్డారు. పన్నీరుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇవ్వడం ఆయన అంతస్తును తగ్గించాలని ఎడపాడి వర్గం భావిస్తున్నదని వ్యాఖ్యానించారు. శశికళ, దినకరన్ నుంచి రాజీనామాలు తీసుకోవాలని, జయ మృతిపై సీబీఐ విచారణకు ఆదేశించాలన్న తమ రెండు ప్రధాన డిమాండ్లపై రాజీపడే ప్రసక్తే లేదని పన్నీర్ వర్గానికి చెందిన మాజీ మంత్రి కేపీ మునుస్వామి పేర్కొన్నారు. ఈ రెండు డిమాండ్లను ఎడపాడి వర్గం ఆమోదించిన తరువాతనే చర్చలని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిణామాలతో విలీన చర్చలకు విఘాతం ఏర్పడింది. ఇదిలా ఉండగా పన్నీర్‌సెల్వంను వై కేటగిరికి భద్రతలోకి తీసుకుంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర రాజకీయాల్లో పన్నీర్‌సెల్వం ప్రాధాన్యతను పెంచుతున్నట్లు తద్వారా కేంద్రం సంకేతాలు ఇచ్చింది. శశికళ, దినకరన్‌ల నుంచి రాజీనామాలు తీసుకోవడం అంత సులువు కాదు కాబట్టి చర్చలకు శాశ్వతంగా తెరపడినట్లు అనుమానించక తప్పదు. నేటి నుంచి జిల్లా కార్యదర్శుల సమావేశం మంగళవారం నుంచి మూడురోజులపాటూ అన్నాడీఎంకే అమ్మ జిల్లా కార్యదర్శుల సమావేశాలను నిర్వహించనున్నారు. ఈ సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాల్సిందిగా సీఎం ఎడపాడి పళనిస్వామి తరఫున రాష్ట్రంలోని కార్యదర్శులందరికి పిలుపునిచ్చారు. జిల్లా కార్యదర్శులను మూడుగా విభజించి ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు మూడురోజులపాటూ సమావేశాలు జరుపుతారు. రెండాకుల చిహ్నం, ప్రధాన కార్యదర్శి, ఉప ప్రధాన కార్యదర్శి, ప్రిసీడియం చైర్మన్, కోశాధికారి పదవులపై జిల్లా సర్వసభ్య సమావేశాల ద్వారా స్వీకరించిన అభిప్రాయాల్లో సవరణలు చేసేందుకే ఈ సమావేశాలు జరుపుతున్నట్లు సమావేశం. పనిలో పనిగా విలీనంపై కూడా జిల్లా కార్యదర్శుల అభిప్రాయాలను సేకరించనున్నట్లు తెలుస్తోంది. -
విలీనంపై నేటి నుంచి చర్చలు
-
విలీనంపై నేటి నుంచి చర్చలు
- అన్నాడీఎంకేలో ఆసక్తికర పరిణామాలు - పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని దినకరన్ ప్రకటన సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ, డిప్యూటీ జనరల్ సెక్రటరీ దినకరన్‌పై వేటుపడిన నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరమైన మలుపు తిరిగాయి. దినకరన్, ఆయన కుటుం బ సభ్యులను పార్టీ, ప్రభుత్వ కార్యకలా పాల కు దూరంగా పెట్టాలని నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి జయకుమార్ మంగళవారం రాత్రి ప్రకటించిన నేపథ్యంలో అన్నాడీఎంకే లోని వైరి వర్గాల విలీనంపై నేటి నుంచి చర్చలు ప్రారంభం కానున్నాయి. అధికార వర్గానికి సీఎం ఎడపాడి పళనిస్వామి, మరో వర్గానికి మాజీ సీఎం పన్నీర్‌సెల్వం సారథ్యం వహిస్తూ చర్చలకు శ్రీకారం చుట్టనున్నారు. అయితే ఇరువురు నేతలు ముఖాముఖిగా చర్చలు జరపకుండా ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసుకున్నారు. చర్చలు ఫలప్రదమైన తరు వాత ఎడపాడి, పన్నీర్ కలుసుకునేలా నిర్ణయించుకున్నారు. ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం, ఉప ముఖ్యమంత్రిగా ఎడపాడి పళని స్వామి అనే కోణంలో చర్చలు ఆరంభం కానున్నట్లు సమాచారం. అయితే ప్రధాన కార్యదర్శి పదవి ఎవరికి అనే అంశాన్ని తాత్కాలికంగా పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. వాంటెడ్ దినకరన్ రెండాకుల చిహ్నాన్ని దక్కించుకునేందుకు ఎన్నికల కమిషన్‌కు రూ.50 కోట్ల లంచం ఇవ్వజూపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న దినకరన్ విదేశాలకు పారిపోకుండా ఢిల్లీ పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. దినకరన్ పేరును ‘వాంటెడ్’ (పోలీసులు గాలిస్తున్న వ్య క్తుల జాబితా) జాబితాలో చేర్చారు. ఢిల్లీ పోలీసులు టీటీవీ దినకరన్‌కు బుధ వారం రాత్రి 10.45 గంటల సమయంలో అతని ఇంటికి వెళ్లి సమన్లు జారీ చేశారు. ఆ సమయంలో అక్కడున్న మైలాపూర్‌కు చెందిన దినకరన్ మద్దతుదారుడు రవిచంద్రన్ ఒంటి పై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నిం చగా అక్కడున్న వారు అతన్ని అడ్డుకున్నారు. పార్టీకి దూరంపై బాధలేదు: దినకరన్, అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండా లని ఆదేశిస్తూ పార్టీ తీసుకున్న నిర్ణయంపై నాకు బాధలేదు. పార్టీ చీలిపోకూడదన్నదే నా అభిమతం. నేను దూరంగా ఉండడం పార్టీకి మేలని భావిస్తే అందుకు కట్టుబడి ఉంటా. కోమాలో తమిళ సర్కార్: స్టాలిన్, ప్రతిపక్ష నేత సాక్షి, చెన్నై: తమిళనాడు ప్రభుత్వం కోమాలో ఉంది. తమిళనాట రైతు సమస్యలు, నీటి ఎద్దడి తాండవం చేస్తుంటే, పాలకులు వారి స్వలాభాన్ని చూసుకునే పనిలో పడ్డారు. అందుకే ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపర చాలని స్పీకర్‌కు వినతిపత్రం సమర్పించాం. ధర్మయుద్ధంలో తొలి విజయం ఎంజీఆర్ స్థాపించిన అన్నాడీఎం కేను జయలలిత 29 ఏళ్లపాటు జయప్ర దంగా ముందుకు తీసుకెళ్లి ప్రజల పార్టీగా తీర్చిదిద్దారు. అమ్మ మరణం తరువాత పార్టీని శశికళ కుటుంబ సభ్యుల కబంధహస్తాల నుంచి పార్టీని కాపాడుకునేందుకే ధర్మయుద్ధం సాగిం చాను. రెండువర్గాలూ ఏకమయ్యే దిశగా సాగుతున్న ఈ పయనం మా ధర్మయు ద్ధానికి లభించిన తొలి విజయం. – పన్నీర్‌సెల్వం, మాజీ ముఖ్యమంత్రి -
అన్నాడీఎంకేలో విలీనంపై మంతనాలు
-
అన్నాడీఎంకేలో విలీనంపై మంతనాలు
తమిళనాట వేడిక్కిన రాజకీయం చెన్నై: తమిళనాట రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. అన్నాడీంఎకేలోని రెండు చీలిక వర్గాలు విలీనం కానున్నాయన్న ఊహాగానాల నేపథ్యంలో సోమవారం ఉదయం నుంచి చకచకా సాగిన పరిణామాలు తీవ్ర ఉత్కంఠ రేపాయి. రెండు వర్గాల మధ్య విలీన చర్చలపై మాజీ సీఎం పన్నీర్ సెల్వం మాట్లాడిన అనంతరం... సోమవారం ఉదయం కేబినెట్ మంత్రులతో సీఎం పళనిస్వామి సుదీర్ఘంగా చర్చించారు. మరోవైపు రాత్రి బాగా పొద్దుపోయాక తమిళనాడు సీనియర్ మంత్రులు అత్యవసరంగా భేటీ అయ్యారు. గ్రీన్‌వేస్ రోడ్డులోని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కె.తంగమణి అధికారిక నివాసంలో చర్చలు కొనసాగాయి. ఈ భేటీలో శశికర, పన్నీర్ సెల్వం వర్గాల విలీనంపై చర్చించారు. భేటీ అనంతరం డిప్యూటీ స్పీకర్ తంబిదురై మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన విధివిధానాలు, సమైక్యంగా పార్టీని ముందుకు నడపడంపై సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. విలీనంపై పన్నీర్‌సెల్వం ఆలోచనను భేటీలో మంత్రులు, ఎమ్మెల్యేలంతా స్వాగతించారని ఆర్థిక శాఖ మంత్రి జయకుమార్ వెల్లడించారు. అమ్మ పాలన కొనసాగాలని, రెండాకుల చిహ్నం తిరిగి దక్కించుకోవాలనేదే అందరి అభిప్రాయమన్నారు. పార్టీ డిప్యూటీ చీఫ్ దినకరన్ బెంగళూరులో ఉన్నందున తిరిగివచ్చాక ఈ అంశంపై ఆయనతో చర్చిస్తామని న్యాయ శాఖ మంత్రి సి.వి.షణ్ముగం అన్నారు. మరోవైపు అధికార పార్టీ ఎమ్మెల్యేలంతా మంగళవారం చెన్నైకు రావాలని ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. -
చెరో ఆకూ ఇస్తే పోలా..!
ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సరదాగా ఒక హ్యూమరస్ ఔట్లుక్! ‘పాపం శశికళ వర్గానికి అన్నేయం జరిగిందెహె’ అన్నాడు ఏకాంబరం నిట్టూర్పుగా. ‘అంత అన్నాయం ఏం జరిగిందేటి? ఆయమ్మ చెప్పినోళ్లే పెబుత్వంలో ఉన్నారు కదా’ అన్నాడు చిదంబరం. ‘అది కాదేస్... ఆర్కే నగర్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా. ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది? శశికళకి రెండాకుల గుర్తు ఇచ్చేది లేదని చెప్పేసింది. పాపం శశికళ జైల్లో మనసు బాధపెట్టేసుకుని కూకుంది’ అన్నాడు ఏకాంబరం. ‘అర్రెర్రె... మరయితే రెండాకుల గుర్తును కొంపదీసి పన్నీరు సెల్వం బాబు వర్గానికి కానీ ఇచ్చారేటి?’ అని ఆతృతగా అడిగాడు చిదంబరం. ‘వాళ్లకీ ఇవ్వలేదేస్. ఒకళ్లకేమో దీపపు స్థంభం ఇచ్చారు... మరొకరికి ఎంజీఆర్ బాబుగోరి టోపీ ఇచ్చారు. రెండాకులు మాత్రం ఎవరూ వాడకండర్రా అని రూలు పెట్టారు. ఏం న్యాయంరా ఇది?’ అన్నాడు ఏకాంబరం.‘ఎలక్షన్ కమిషనర్ అంటే బోలెడు సదూకుంటారు కదా... వాళ్లకి కూడా ఈ పాటి చిన్న సమస్య తీర్చడం రాదేంట్రా?’ అన్నాడు చిదంబరం.‘ఇక్కడ కూకుని కబుర్లు చెప్పడం కాదురా ఎర్రినాయాలా? ఇడవమంటే పాముకి కోపం... కరవమంటే కప్పకు కోపం అని... రెండాకుల గుర్తు ఎవరికి ఇచ్చినా రెండోవాళ్లకి కోపం వస్తాది. అందుకే మరి ఈసీ బాబుగారు బాగా ఆలోచిత్తూ కూకున్నారు’ అన్నాడు ఏకాంబరం. చిదంబరం గట్టిగా నవ్వేసి – ‘అదే నేనయితే ఒక్క నిముషంలో ఇసయం తేల్చేద్దును తెలుసా’ అన్నాడు గర్వంగా.ఏకాంబరానికి కోపమూ... ఆశ్చర్యమూ ఒకేసారి వచ్చాయి. ‘సోది ఆపరా. నువ్వయితే ఏటి సేత్తావేటి?’ అని కోపంగానే అడిగాడు.‘దాందేముందిరా... ఉన్నవి రెండాకులు. ఇద్దరికీ చెరో ఆకు ఇస్తే పోలా. అపుడు ఇద్దరికీ నేయం చేసినట్లయ్యేది. పైగా గొడవా ఉండేది కాదు’ అన్నాడు చిదంబరం. ఏకాంబరం నోట మాట లేదు. -
చివరి అవకాశం
► పన్నీర్ ఫిర్యాదుపై శశికళకు సీఈసీ నోటీసు ► నేటి సాయంత్రం వరకు తుది గడువు ► రెండాకుల కోసం కొనసాగుతున్న పోరు అన్నాడీఎంకే కోసం నువ్వా నేనా అంటూ పన్నీర్ సెల్వం, శశికళ మధ్యసాగుతున్న పోరుకు బుధవారం తెరపడనుంది. పన్నీర్‌సెల్వం వర్గం ఇచ్చిన ఫిర్యాదుల పరంపరపై మంగళవారం సాయంత్రంలోగా బదులివ్వాలని ప్రధాన ఎన్నికల కమిషన్ (సీఈసీ) శశికళకు చివరిసారిగా గడువిచ్చింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకే రెండుగా చీలిపోగా తమదే అసలైన అన్నాడీఎంకే అంటూ శశికళ, పన్నీర్‌సెల్వం వర్గాలు పోటీపడుతున్నా యి. ఐదేళ్ల సభ్యత్వం లేనందున ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపిక చెల్లదంటూ పన్నీర్ వర్గం ఎంపీలు సుమారు నెలరోజుల క్రితం ఢిల్లీలో సీఈసీకి ఫిర్యాదు చేశారు. పన్నీర్ వర్గం ఎంపీలు చేసిన ఫిర్యాదుపై బదులివ్వాల్సిందిగా శశికళకు సీఈసీ నోటీసు జారీ చేయగా ఆమె అక్క కుమారుడు, పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ బదులిచ్చి, ఎన్నికల కమిషన్ ఆగ్రహానికి గురయ్యాడు. దీం తో శశికళ బదులివ్వాల్సి వచ్చింది. ఇలా సీఈసీ ఆదేశాల మే రకు శశికళ, పన్నీర్‌సెల్వం వరుసగా తమ తరఫు వాదనలను వినిపించారు. ఇదిలా ఉండగా, ఆర్కేనగర్లో ఉప ఎన్నికలు ముంచుకు రావడంతో శశికళ వర్గం తరఫున దినకరన్, పన్నీర్ అభ్యర్థిగా మధుసూదనన్ రంగంలోకి దిగారు. ఈ నెల 24వ తేదీలోగా తమ అభ్యర్థులకు బీఫారం జారీ చేయాల్సి ఉంది. బీఫారం ఆధారంతో అభ్యర్థులకు సీఈసీ ఎన్నికల చిహ్నం కేటాయిస్తుంది. అయితే అన్నాడీఎంకే అభ్యర్థులమంటూ ఇద్దరు వ్యక్తులు పోటీపడుతుం డగా రెండాకుల చిహ్నం ఎవరికి దక్కుతుందో అనే సంశయం నెలకొంది. ప్రధా న కార్యదర్శిగా శశికళ ఎంపికపై సీఈసీ తీసుకున్న నిర్ణయంపై ఎన్నికల చిహ్నం కేటాయింపు ఆధారపడి ఉంది. ఈ నెల 22వ తేదీ సీఈసీ తన తీర్పును వెల్లడిస్తుందని నమ్మకంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆదివారం సాయంత్రం దినకరన్ నేతృత్వంలో సీఎం ఎడపాడి తదితరులు అత్యవసరంగా సమావేశమయ్యారు. శశికళ తరఫు వాదనను మరోసారి వినిపించుకునేందుకు మరికొంత గడువు ఇవ్వాల్సిందిగా సీఈసీని కోరారు. ఇందుకు అంగీకరించిన సీఈసీ మంగళవారం సాయంత్రం లోగా తమకు అందజేయాలని శశికళకు తుది గడువు విధించింది. ఈ నెల 23వ తేదీతో నామినేషన్ల గడువు ముగుస్తున్న పరిస్థితిలో 22వ తేదీన సీఈసీ తన తీర్పు వెల్లడించనున్నట్లు ఖాయంగా తెలుస్తోంది. శశికళ తాజా వివరణతో చివరి ప్రయత్నం చేసిన తరుణంలో పన్నీర్ సైతం తన చివరి అస్త్రాన్ని సంధించారు. తమ వాదనను మరోసారి సమర్థించుకుంటూ సిద్ధం చేసుకున్న పత్రాలను సోమవారం పన్నీర్ వర్గంవారు సీఈసీకి సమర్పించారు. అంతేగాక ఆరువేల మంది పన్నీర్ మద్దతుదారులు ప్రమాణ పత్రాలను సైతం సీఈసీకి అందజేయడంతోపాటూ మరో 60 లక్షల మంది ప్రమాణపత్రాలను సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నారని విన్నవించుకున్నారు. రేపు ఇరువర్గాలతో ప్రత్యక్ష విచారణ ఇరువర్గాల నుంచి లిఖితపూర్వక వివరణలు పూర్తికావడంతో ఈ నెల 22వ తేదీన ప్రత్యక్ష విచారణకు సీఈసీ సిద్ధమైంది. 22వ తేదీ ఉదయం 10.30 గంటలకు హాజరు కావాలి్సందిగా పన్నీర్, శశికళ వర్గాలకు ఢిల్లీలోని సీఈసీ కార్యాలయం నంచి ఆదేశాలు అందాయి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నజీమ్ జైదీ, కమిషనర్లు జ్యోతి, రావత్‌లతో ముగ్గురు సభ్యులతో కూడిన బెంచ్ ఇరువర్గాల ప్రతినిధులతో విచారణ చేపడుతుంది. అదేరోజు సాయంత్రం సీఈసీ తన తీర్పును ప్రకటిస్తుంది. క్షేత్రస్థాయి కార్యకర్తలు పన్నీర్ వైపే ఉండడంతో శశికళ వర్గం ఆత్మరక్షణలో పడిపోయింది. -
పన్నీర్ జీరో, ఆయనతో మాకు పోటీ ఏంటీ?
చెన్నై : తమ ప్రధాన ప్రతిపక్షం డీఎంకే పార్టీయేనని అన్నాడీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ టీటీవీ దినకరన్ వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి ఆర్కేనగర్ ఉప ఎన్నికకు పన్నీర్ సెల్వం తమకు పోటీ కాదని, ఆయన సున్నఅని దినకరన్ అభివర్ణించారు. కాగా జయలలిత మరణంతో ఆర్కేనగర్ అసెంబ్లీ నియోజకవర్గంకు ఖాళీ ఏర్పడింది. కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ 12న ఆర్కేనగర్ ఉప ఎన్నిక జరగనుంది. మరోవైపు జయలలిత మేనకోడలు ఆర్కేనగర్ స్థానం నుంచే పోటీకి దిగుతున్నట్లు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అలాగే అధికార అన్నాడీఎంకేతో పాటు పన్నీర్ సెల్వం, డీఎంకేలు ఈ స్థానంపై కన్నేయడంతో ఈ ఉప ఎన్నిక రసవత్తరంగా మారనుంది. -
తమిళ అసెంబ్లీలో ఐపీఎస్‌లు!
బలపరీక్ష సమయంలో సభలోకి రావడంపై వివాదం ► పళని విశ్వాస పరీక్షపై సమగ్ర నివేదిక సమర్పించండి ► తమిళనాడు అసెంబ్లీ కార్యదర్శికి గవర్నర్ ఆదేశం ► స్టాలిన్ , పన్నీర్ ఫిర్యాదుల నేపథ్యం సాక్షి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి కె.పళనిస్వామి విశ్వాస పరీక్ష సందర్భంగా శనివారం ఆ రాష్ట్ర అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు ఆదేశించారు. వాస్తవానికి అసెంబ్లీలో చోటు చేసుకున్న సంఘటనలపై అసెంబ్లీ కార్యదర్శి జమాలుద్దీన్ ఆదివారం ఉదయమే ఓ లేఖను గవర్నర్‌కు పంపించారు. అయితే ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్, మాజీ సీఎం పన్నీర్ సెల్వంలు వేర్వేరుగా తనతో భేటీ అయ్యి ఇచ్చిన ఫిర్యాదుల్ని గవర్నర్ పరిగణనలోకి తీసుకున్నారు. పూర్తి వివరాలతో సమగ్ర నివేదికను సమర్పించాలని అసెంబ్లీ కార్యదర్శికి ఆదివారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా సభలో ప్రతిపక్ష సభ్యులు లేకుండా జరిగిన ఓటింగ్‌పై వివరాలు అందజేయాలని కోరినట్లు తెలిసింది. మరోవైపు శనివారం నిబంధనలు ఉల్లంఘించి ఏకంగా తొమ్మిది మంది ఐపీఎస్‌లు సభలోకి రావడం వివాదానికి తెరతీసింది. ముందస్తు వ్యూహం ప్రకారమే ఐపీఎస్‌లను రంగంలోకి దించారనే డీఎంకే వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఆదివారం డీఎంకే ఎంపీలు తిరుచ్చి శివ, ఆర్ఎస్ భారతి, టీకేఎస్ ఇళంగోవన్ ఉదయం రాజ్‌భవన్ లో గవర్నర్ విద్యాసాగర్‌రావును కలిశారు. స్టాలిన్ తరఫున వినతిపత్రాన్ని సమర్పించారు. స్టాలిన్ పై దాడిని వివరించడంతో పాటు బలపరీక్షలో పళనిస్వామి గెలుపును రద్దు చేయాలని, మరోమారు బల పరీక్షకు ఆదేశించాలని విన్నవించారు. మాజీ సీఎం పన్నీర్‌సెల్వం సైతం గవర్నర్‌ను కలసి అసెంబ్లీలో శనివారం నాటి పరిణామాలను, స్పీకర్ వ్యవహరించిన తీరును వివరించారు. పళనిస్వామి గెలుపు చెల్లదంటూ ప్రకటించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. సీఎం పళని స్వామి కూడా ఆదివారం గవర్నర్‌తో భేటీ అయ్యారు. అసెంబ్లీలో డీఎంకే పనిగట్టుకుని వీరంగాన్ని సృష్టించిందని విద్యాసాగర్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. 22న డీఎంకే దీక్షలు స్టాలిన్ మీద జరిగిన దాడిపై డీఎంకే వర్గాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఆదివారం తేనాంపేటలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలతో స్టాలిన్ సమావేశం అయ్యారు. ఈనెల 22న అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. తిరుచ్చిలో జరిగే దీక్షకు స్టాలిన్ నేతృత్వం వహించనున్నారు. రాష్ట్రపతిని కలసి ఫిర్యాదు చేసేందుకు అపాయింట్మెంట్ కోరనున్నామని స్టాలిన్ తెలిపారు. మెరీనా తీరంలో నిషేధాజ్ఞల్ని ఉల్లంఘించి నిరసన దీక్ష నిర్వహించారంటూ ఇద్దరు డీఎంకే ఎంపీలు, స్టాలిన్ తో పాటు 69 మంది డీఎంకే ఎమ్మెల్యేలపై కేసులు నమోదు చేశారు. ఐపీఎస్‌ల గుర్తింపు! తమిళనాడు అసెంబ్లీలో ఐపీఎస్ అధికారులు ప్రవేశించారనే వార్త సంచలనం సృష్టిస్తోంది. శనివారం నాడు డీఎంకే సభ్యులను అసెంబ్లీ నుంచి బయటకు తరలించేందుకు మార్షల్స్ రంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. అయితే మార్షల్స్ యూనిఫామ్‌లో నిబంధనలు ఉల్లంఘించి తొమ్మిది మంది ఐపీఎస్‌లు అసెంబ్లీలోకి అడుగు పెట్టినట్లుగా గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు ఆదేశాల మేరకు సాగిన విచారణలో తేలినట్టు తెలిసింది. సభలో ప్రవేశించిన 9 మంది ఐపీఎస్ అధికారులను గుర్తించినట్టు కూడా తెలిసింది. ముందస్తు పథకం ప్రకారమే ఐపీఎస్‌లను రంగంలోకి దింపారని, ప్రతిపక్ష నేత స్టాలిన్ పై దాడి కూడా పథకం ప్రకారమే జరిగిందన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. శనివారం నాటి పరిణామాలపై స్టాలిన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గవర్నర్ విచారణకు ఆదేశించినట్టు సమాచారం. మార్షల్స్ యూనిఫామ్ ధరించి పలువురు ఐపీఎస్ అధికారులు సభలో ప్రవేశించారని, అదికూడా స్పీకర్ సభలో లేని సమయంలో ప్రవేశించారని తెలుస్తోంది. వీరిలో చెన్నైలో అసిస్టెంట్, డిప్యూటీ, సహాయ కమిషనర్లుగా పనిచేస్తున్న శ్రీధర్, సంతోష్‌కుమార్, జోషి నిర్మల్ కుమార్, ఆర్.సుధాకర్, రవి, గోవిందరాజ్, ముత్తలగు, శివ భాస్కర్, దేవరాజ్‌లను గుర్తించినట్లు తెలిసింది. సభలో చెలరేగిన గందరగోళం నేపథ్యంలో ఆగమేఘాలపై ఐపీఎస్‌లను రంగంలోకి దించాల్సి వచ్చినట్టు అసెంబ్లీ కార్యదర్శి తన లేఖలో పేర్కొన్నట్టు తెలిసింది. ఇలావుండగా కొద్ది రోజులుగా చెన్నైలోనే ఉన్న గవర్నర్ ముంబైకి బయలుదేరి వెళ్లారు. -
చిన్నమ్మ శపథం నెరవేర్చాం: దినకరన్
సాక్షి, చెన్నై: ‘‘శాసనసభలో బల పరీక్షలో గెలుపుతో అమ్మ జయలలిత సమాధి సాక్షిగా చిన్నమ్మ శశికళ చేసిన వీర శపథం నేరవేర్చాం’’ అని అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ ఆనందం వ్యక్తం చేశారు. ఆయన శనివారం ముఖ్యమంత్రి పళనిస్వామితో కలిసి మెరీనా బీచ్ తీరంలో ఉన్న జయలలిత సమాధి వద్ద నివాళులర్పించారు. అనంతరం పోయెస్ గార్డెన్‌కు చేరుకుని మీడియాతో మాట్లాడారు. పన్నీర్ సెల్వం చేత చిన్నమ్మ ఎందుకు రాజీనామా చేయించారన్న ప్రశ్నకు అసెంబ్లీలో జరిగిన తాజా పరిణామాలే సమాధానమని పేర్కొన్నారు. ప్రతిపక్ష డీఎంకేతో కలిసి అన్నాడీఎంకేను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా పన్నీర్‌సెల్వం కుట్రకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. పన్నీర్‌కు డీఎంకేతో రహస్య సంబంధాలున్నాయన్న విషయాన్ని గుర్తించి పదవి నుంచి తప్పించారేగానీ, చిన్నమ్మ సీఎం కావాలన్న ఆశతో మాత్రం కాదన్నారు. పార్టీ వర్గాల ఒత్తిడి, జరుగుతున్న పరిణామాలను ఎదుర్కొనేందుకే ఆమె ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు, నేతలంతా ఐక్యతతో ప్రజా సంక్షేమంపై దృష్టి సారిస్తామని, అమ్మ చూపిన మార్గంలో సుపరిపాలనే లక్ష్యంగా ముందుకు సాగుతామని దినకరన్ వెల్లడించారు. బల పరీక్షలో పళనిస్వామి నెగ్గడంతో రాష్ట్రవ్యాప్తంగా శశికళ మద్దతుదారులు సంబరాల్లో మునిగిపోయారు. -
అన్నీ ఉన్నా.. ‘పరీక్ష’లో ఫెయిల్
⇒ కేంద్రం, ప్రతిపక్షాల అండ ఉన్నప్పటికీ బలపరీక్షలో ఓటమి ⇒ ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టడంలో విఫలం ⇒ శశికళకే జై కొట్టిన అన్నాడీఎంకే శాసనసభ్యులు ⇒ మరో నాలుగేళ్లు అధికారం వదులుకునేందుకు విముఖత సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా అధికార హోదా, వెన్నంటి ఉన్న అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు, బాసటగా నిలిచిన ప్రతిపక్షాలు, సామాన్య ప్రజల అండ, సినీ ప్రముఖుల మద్దతు, సోషల్ మీడియాలో వెల్లువెత్తిన సంఘీభావం, అన్నింటికీ మించి కేంద్రం ప్రభుత్వం నుంచి పూర్తి భరోసా... ఇవేవీ పన్నీర్ సెల్వంను ముఖ్యమంత్రిగా గద్దెనెక్కించేందుకు ఉపయోగపడలేదు. ఆయనకు అన్నివిధాలా అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ బలపరీక్షలో మాత్రం ప్రతికూల ఫలితాలు రావడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. 122 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు సీఎం ఎడప్పాడి పళనిస్వామిని బలపరచడం, కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే పన్నీర్ పక్షాన నిలవడం వెనుక కారణాలు ఏమిటనే దానిపై రాజకీయ వర్గాలు పలు రకాలుగా విశ్లేషిస్తున్నాయి. చిన్నమ్మ నిర్బంధంలో ఎమ్మెల్యేలు మొదట పన్నీర్ సెల్వం తిరుగుబాటు చేసిన వెంటనే శశికళ అప్రమత్తమయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా జాగ్రత్తపడ్డారు. వారందరినీ రిసార్టుకు తరలించారు. ఎమ్మెల్యేలకు నిత్యం హితబోధ చేశారు. తనకు మద్దతిస్తేనే వారి భవిష్యత్తు బాగుంటుందనే భరోసా కల్పించారు. ఒక్కో ఎమ్మెల్యేకు ఐదుగురు చొప్పున బౌన్సర్లను రక్షణగా పెట్టారు. చివరకు టాయిలెట్‌కు వెళ్లినా బౌన్సర్లు ఉండాల్సిందే. తమ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో ఎమ్మెల్యేలు తెలుసుకోకుండా వారి సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గోల్డన్ బే రిసార్టులోని టీవీల్లో కేవలం ‘జయ టీవీ’ మాత్రమే ప్రసారమయ్యేలా చేశారు. ఒకరకంగా బాహ్య ప్రపంచంతో వారికి సంబంధాలు లేకుండా తెలివిగా వ్యవహరించారు. అధికారం ఎందుకు వదులుకోవాలి? అన్నాడీఎంకే ఎమ్మెల్యేల్లో చాలామంది చిన్నమ్మ ఆశీస్సులతో టిక్కెట్లు పొంది గెలిచినవారే. అంతేకాకుండా తటస్థ, వ్యతిరేక ఎమ్మెల్యేలను కూడా బెదిరించి, మభ్యపెట్టి ఆమె తన దారికి తెచ్చుకున్నారు. ఇప్పుడున్న ఎమ్మెల్యేల్లో ఎక్కువమంది తొలిసారిగా ఎన్నికైనవారే. ‘‘ఎన్నికల్లో ఎంతో ఖర్చుపెట్టి ఎమ్మెల్యేగా గెలిచి, ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని నిండా ఏడాది కూడా ముగియలేదు. ఇప్పుడు ప్రభుత్వం పడిపోతే మళ్లీ ఎన్నికలకు వెళ్లాలి. గెలుస్తామో లేదో తెలియదు. శశికళ వైపు నిలిస్తే మరో నాలుగేళ్లపాటు మనకు తిరుగు ఉండదు’’ అని మెజారిటీ ఎమ్మెల్యేలు భావించినట్లు తెలుస్తోంది. అందుకే పన్నీర్‌సెల్వం వర్గంలో చేరేందుకు వారు ఆసక్తి చూపలేదు. ఎమ్మెల్యేలపై పట్టు లేకపోవడమే పన్నీర్ ఓటమికి కారణమని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. శశికళ లాగా పన్నీర్ ఎమ్మెల్యేలకు వల వేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. దాదాపు రెండు వారాల సమయం లభించినప్పటికీ ఆయన దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. చివరి క్షణంలో శశికళ వర్గంలోని ఎమ్మెల్యేల తనకే మద్దతు ఇస్తారని పన్నీర్ సెల్వం ధీమా వ్యక్తం చేసినప్పటికీ అది వాస్తవరూపం దాల్చలేదు. పన్నీర్‌ను ముంచిన మెతక వైఖరి ప్రజల అండదండలు, అమ్మ జయలలిత పట్ల విధేయత ఉన్నా రాజకీయాల్లో పన్నీర్ సెల్వం అనుసరించిన మెతకవైఖరే ఆయనను ముంచేసింది. అమ్మ పట్ల ఉన్న అభిమానంతో ప్రత్యర్థి వర్గంలోని ఎమ్మెల్యేలు తన వైపునకు వస్తారని నింపాదిగా ఇంట్లో కూర్చొని వేచి చూడడం మినహా పన్నీర్ ప్రత్యేక ప్రయత్నాలేం చేయలేదు. రాజకీయంగా ఎత్తులకు పై ఎత్తులు వేయడం ఆయనకు అలవాటు లేదని అన్నాడీఎంకే వర్గాలు చెబుతున్నాయి. ఇదే ఇప్పుడు ఆయన కొంప ముంచింది. మరిన్ని తమిళనాడు విశేషాలు చూడండి జయ కేసుల ఖర్చు కర్ణాటక ఖాతాలోకి చెన్నైకు చిన్నమ్మ? విజేత పళని నాడూ.. నేడూ.. అదే డ్రామా! చిన్నమ్మ శపథం నెరవేర్చాం: దినకరన్ స్టాలిన్‌కు అవమానం.. డీఎంకే ఆందోళనలు -
బలాబలాలు తేలేది రేపే
-
బలాబలాలు తేలేది రేపే
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులోని ఉత్కంఠ భరిత రాజకీయాలకు శనివారం తెరపడ నుం ది. సీఎం పళనిస్వామి, మాజీ సీఎం పన్నీర్ సెల్వం బలాబలాలు తేలేందుకు 18న అసెంబ్లీ సమావేశం వేదిక కానుంది. పళనికి గవర్నర్ విద్యాసాగర్‌రావు బల నిరూపణకు 15 రోజుల గడువిచ్చారు. ఈ సమయంలో ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ఎమ్మెల్యేలపై ఒత్తిడి తీసుకురావడం ద్వారా మరికొంద రిని ఆకట్టుకోవాలని పన్నీర్ ఎత్తుగడవేశారు. మరోవైపు గవర్నర్ నిర్ణయంపై కోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో పళని వేగంగా స్పందించారు. బల పరీక్షకు 15 రోజుల సమయం తీసుకోకుండా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మూడోరోజునే అంటే శనివారం నాడు అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని బలపరీక్షకు సిద్ధమయ్యారు. ఎమ్మెల్యేలను ఆకట్టుకునేం దుకు 15 రోజులు చాలనే పన్నీర్ ఆశలపై నీళ్లు చల్లారు. ప్రమాణస్వీకారోత్సవానికి రాజ్‌భవన్‌కు వచ్చిన ఎమ్మెల్యేలను ఎంతో జాగ్రత్తగా మరలా రిసార్టుకు చేర్చారు. రిసార్టులోని ఎమ్మెల్యేలను ఇక నేరుగా శనివారం నాటి అసెంబ్లీ సమావేశంలోనే హాజరుపరచాలనే నిర్ణయం తీసుకున్నారు. తిరుప్పూరు ఉత్తర ఎమ్మెల్యే విజయకుమార్ పినతల్లి ఈనెల 15న చనిపోగా ఆయనను అంత్యక్రియలకు కూడా వెళ్లనివ్వలేదు. ఎనిమిది రోజుల గడువులో తొమ్మిది మంది ఎమ్మెల్యేలను మాత్రమే తనవైపు తిప్పుకోగలిగిన పన్నీర్‌సెల్వం కేవలం రెండు రోజుల్లో మెజార్టీ ఎమ్మెల్యేలను ఆకట్టుకోవడం ఎంత వరకు సాధ్యమనే అనుమానం నెలకొంది. శశికళ శిబిరంలో బందీలుగా ఉన్న ఎమ్మెల్యేలకు విముక్తి కల్పిస్తే తన వద్దకు రావడం ఖాయమని పన్నీర్ చెబుతున్నారు. తమకు 124 మంది ఎమ్మెల్యే స్పష్టమైన మద్దతు ఉన్నందునే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారని మంత్రి జయకుమార్ అన్నారు. పైగా పన్నీర్‌సెల్వం మినహా మిగతా ఎంపీలు, ఎమ్మెల్యేలను తిరిగి పార్టీలోకి స్వీకరించేందుకు సిద్ధమని శశికళ వర్గీయుడైన డిప్యూటీ స్పీకర్ తంబిదురై ప్రకటించడం ద్వారా 11మంది ఎమ్మెల్యేలకు ఎరవేశారు. ఆ రెండింటిపైనే పన్నీర్ ఆశ ప్రస్తుతం కువత్తూరు శిబిరంలో 124మంది ఎమ్మెల్యేలున్నారు. ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి బలపరీక్ష నుంచి సీఎం పళనిస్వామి గట్టెక్కడం ఖాయం. అయితే అమ్మ సెంటిమెంట్, ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపిక చెల్లదంటూ ఎన్నికల కమిషన్ వద్ద పరిశీలనలో ఉన్న ఫిర్యాదు తనను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొనబెడతాయని పన్నీర్ సెల్వం ఆశపడుతున్నారు. ఎమ్మెల్యేలను ఆకట్టుకునే సమయం లేకపోవడంతో పళనిస్వామికి అనుకూలంగా ఓటుపడకుండా ప్రజలను ఉత్తేజితులను చేసేందుకు శుక్రవారం సిద్ధమయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా, తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన శశికళపై అనర్హత వేటువేయాలని పన్నీర్‌సెల్వం మద్దతుదారులైన 12 మంది ఎంపీలు ఎన్నికల కమిషన్‌ను కలిసి గురువారం ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించి శశికళపై అనర్హత వేటుపడిన పక్షంలో పార్టీ మళ్లీ మాజీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్, పన్నీర్‌సెల్వం చేతుల్లోకి వస్తుంది. శశికళ ఎంపికపై ఎన్నికల కమిషన్ తన నిర్ణయాన్ని శుక్రవారం ప్రకటించవచ్చు. ఈ రెండు కోణాలు బలపరీక్ష నుంచి గట్టెక్కించగలవని పన్నీర్ సెల్వం నమ్మకంతో ఉన్నారు. చివరి ఘట్టం: సీఎం పదవికి తన చేత బలవంతంగా రాజీనామా చేయించారని ప్రక టించడం ద్వారా శశికళపై తిరుగుబావుటా ఎగురవేసిన పన్నీర్‌ను పార్టీ బహిష్కరించింది. అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన శశికళను ప్రజలు హర్షించరని, ఎమ్మెల్యేలను బెదిరించి, మభ్యపెట్టి సీఎం అయ్యేందుకు ఆమె సిద్ధమయ్యారని పన్నీర్ చేసిన ఆరోపణలతో పార్టీ రెండుగా చీలిపోయింది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవడం పన్నీర్‌కు అనివార్యమైంది. అసెంబ్లీలో అన్నాడీఎంకే బలం 136 కాగా, జయ మరణంతో 135కి తగ్గింది. కేవలం ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతుతో పన్నీర్ ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించగా క్రమేణా ఈ సంఖ్య 11కు పెరిగింది. అలాగే 12 మంది ఎంపీలు సైతం పన్నీర్ పక్షాన చేరారు. శశికళ తన వర్గంలోని ఎమ్మెల్యేలతో చెన్నైకి 93 కిలోమీటర్ల దూరంలోని గోల్డన్ బే రిసార్టులో శిబిరం నిర్వహించారు. ప్రభుత్వ ఏర్పాటుకు శశికళను గవర్నర్ ఆహ్వానించడంలో జరుగుతున్న జాప్యం తనకు కలిసి వస్తుందని ఆశించిన పన్నీర్‌సెల్వంకు భంగపాటే మిగిలింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో శశికళ జైలు కెళ్లినా ఎమ్మెల్యేలు పన్నీర్‌వైపు పయనించలేదు. శశికళ, ఎడపాడిల చేత కిడ్నాప్‌నకు గురైన ఎమ్మెల్యేకు విముక్తి ప్రసాదించేలా పోలీసుశాఖను ఆదేశించాలంటూ కువత్తూరు శిబిరం నుంచి పన్నీర్‌వైపునకు వచ్చిన ఎమ్మెల్యే శరవణన్ ఇచ్చిన ఫిర్యాదును హైకోర్టు కొట్టివేసింది. ఎమ్మెల్యేలను రాబట్టుకునేందుకు పన్నీర్ చేసిన కిడ్నాప్ కేసు ప్రయత్నం ఫలించలేదు. దీంతో పన్నీర్‌కు మద్దతు పలికే ఎమ్మెల్యేల సంఖ్య 11తోనే ఆగిపోయింది. -
చిన్నమ్మ శపథం.. సీఎంగా పళని
పన్నీర్ని ఒంటరిని చేసిన వైనం చెన్నై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: పురచ్చి తలైవి జయలలిత సమాధి వద్ద నిచ్చెలి చిన్నమ్మ చేసిన శపథంలో మొదటి ఘట్టం విజయవంతమైంది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు సీఎం పీఠం దక్కకుండా చేశారు. శశికళ నమ్మిన బంటు పళనిస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన కొన్నిగంటలకే బలనిరూపణకు సిద్ధమవుతున్నారు. ఈనెల 18 తేదీనే అసెంబ్లీని ఏర్పాటు చేస్తున్నట్లు.. అదే రోజు బలాన్ని నిరూపించనున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు ఇచ్చిన 15 రోజుల గడువును కేవలం రెండు రోజులకే కుదించి తన రాజకీయ చతురతను ప్రద ర్శించారు. గవర్నర్ ఇచ్చిన 15 రోజుల సమయాన్ని సద్వి నియోగం చేసుకొని రిసార్ట్స్‌లో ఉన్న ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోవచ్చని భావించిన సెల్వానికి సీఎం ఊహించని షాక్ ఇచ్చారు. జైలు నుంచే చక్రం తిప్పారా? శశికళ జైలుకు వెళ్లినా పన్నీర్‌కు పదవి దక్కకుండా చేసి తొలిపంతం నెగ్గించుకున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జైలుకు వెళ్లే ముందే వ్యూహాత్మకంగా తన అనుచరులకు దిశా నిర్దేశం చేసి వెళ్లడం... ఆ తరువాత సీఎం, మంత్రులు ప్రమాణం చేయడంతో చిన్నమ్మ కారాగారం నుంచి ప్రభుత్వాన్ని నడపనుందని తేలిపోయింది. -
గవర్నర్ ముందు నాలుగు దారులు
-
పన్నీర్‌కు మద్దతు ప్రకటించిన దీప
-
తమిళనాడు సీఎం పన్నీరా..పళనినా!
-
కోర్టు తీర్పుతో శశికళ వ్యూహాత్మక నిర్ణయం
-
పళనికే పట్టం
⇒ అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నిక ⇒ కోర్టు తీర్పుతో శశికళ వ్యూహాత్మక నిర్ణయం సాక్షి, చెన్నై: తమిళుల అమ్మ దివంగత సీఎం జయలలితకు నమ్మిన బంటుల్లో ఒకరిగా, చిన్నమ్మ శశికళకు విధేయుడిగా ఉన్న ఎడపాడి ఎమ్మెల్యే కే. పళనిస్వామికి అన్నాడీఎంకేలో పట్టం కట్టారు. శశికళకు జైలుశిక్ష తీర్పు నేపథ్యంలో మంగళవారం అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కువత్తూరు గోల్డెన్ బే రిసార్ట్ వేదికగా పళనిస్వామిని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. అన్నాడీఎంకేలో ప్రిసీడియం చైర్మన్, శాసనసభా పక్ష నేత పదవులు గౌండర్ సామాజిక వర్గానికి దేవర్ సామాజిక వర్గానికి చెందిన శశికళ అప్పగించి ఉండడం గమనార్హం. పన్నీర్ సెల్వం తిరుగుబాటు నేపథ్యంలో సీఎం పగ్గాలు లక్ష్యంగా చిన్నమ్మ శశికళ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. మళ్లీ జైలు కెళ్లాల్సిన పరిస్థితి రావడంతో కువత్తూరు క్యాంప్ వేదికగా శశికళ వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. దేవర్ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు అత్యధికంగా పార్టీలో ఉన్నా, గౌండర్ సామాజిక వర్గాన్నే కాదు, ఇతర సామాజిక వర్గాల్ని ఆకర్షించే నిర్ణయం తీసుకోవడం ఆహ్వానించదగ్గ విషయం. ఇప్పటికే ఆ పార్టీ ప్రిసీడియం చైర్మన్‌గా గౌండర్ సామాజిక వర్గానికి చెందిన సెంగోట్టయన్ వ్యవహరిస్తున్న నేపథ్యంలో శాసన సభా పక్ష నేత పదవి అదే సామాజిక వర్గానికి కట్టబెట్టడం విశేషం. నమ్మినబంటుకే పట్టం సేలం జిల్లా ఎడపాడి నియోజకవర్గం నెడుంగులం సమీపంలోని శిలవన్ పాళయంకు చెందిన కరుప్ప గౌండర్ తనయుడిగా రాజకీయాల్లోకి మూడు దశాబ్దాల క్రితం అడుగుపెట్టిన కే.పళనిస్వామి దివంగత సీఎం జయలలితకు నమ్మినబంటుల్లో ఒకరిగా ఉన్నారు. జయలలిత కష్టకాలంలో వెన్నంటి ఉన్న నాయకుల్లో పళనిస్వామి కూడా ఒకరు. నాలుగుసార్లు ఒకే నియోజకవర్గం నుంచి అసెంబ్లీ మెట్లు ఎక్కడంతో ఆయన పేరు ఎడపాడి కే పళనిస్వామిగా మారింది. పన్నీర్ తదుపరి స్థానాన్ని పళనిస్వామికి అప్పగించాలన్న లక్ష్యంతో కొన్నేళ్లపాటు చిన్నమ్మ శశికళ తీవ్రంగానే ప్రయత్నిస్తూ వచ్చారు. అయితే, విశ్వాసపాత్రుడు పన్నీర్‌కే అమ్మ జయలలిత అండగా నిలిచారు. అమ్మ మరణం నేపథ్యంలో పళనిస్వామి చేతికి సీఎం పగ్గాలు అప్పగించడం లక్ష్యంగా చిన్నమ్మ వ్యూహరచన చేసినా, కేంద్రం ఒత్తిడితో పన్నీర్‌కు అప్పగించక తప్పలేదు. పన్నీర్ ధిక్కారస్వరంతో సీఎం పగ్గాలు తానే చేపట్టాలని ప్రయత్నించి చివరకు జైలుశిక్షతో వెనక్కు తగ్గారు. ఎమ్మెల్యేలు చేజారిపోకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించి తన విధేయుడు పళనిస్వామిని శాసనసభాపక్ష నేతగా తెరమీదకు తెచ్చి సఫలీకృతులయ్యారు. దేవర్ల అడుగులెటు? అన్నాడీఎంకేలోని ఎమ్మెల్యేల్లో మెజారిటీ శాతం దేవర్ సామాజిక వర్గానికి చెందినవారు ఉన్నారు. తదుపరి గౌండర్, నాడర్ ఇతర సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. గౌండర్ సామాజిక వర్గానికి రెండు కీలక పదవులు అప్పగించిన దృష్ట్యా, దేవర్, నాడార్ సామాజిక వర్గానికి చెందినవారు ఎలా స్పందించబోతున్నారో అన్న ప్రశ్న బయలు దేరింది. దేవర్ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు అన్నాడీఎంకేలో 50 శాతం మేరకు ఉండడం గమనార్హం. శాసనసభాపక్ష నేతగా... తనకు జైలు శిక్ష పడ్డ సమాచారంతో శశికళ కాసేపు ఉద్వేగానికి లోనైనా తదుపరి అన్నాడీఎంకేను రక్షించుకోవడం, ప్రభుత్వాన్ని చేపట్టాలన్న కాంక్షతో శాసనసభాపక్ష నేత ఎంపిక మీద దృష్టి పెట్టారు. కువత్తూరులోని క్యాంప్ వేదికగా ఎమ్మెల్యేలతో చర్చించారు. ముగ్గురి పేర్లను తెర మీదకు తెచ్చినట్టు సంకేతాలు ఉన్నాయి. ఇందులో పార్టీ ప్రిసీడియం చైర్మన్ సెంగోట్టయన్, రహదారుల శాఖ మంత్రి కె.పళనిస్వామి, ఆరోగ్య శాఖ మంత్రి విజయ భాస్కర్ పేర్లు ఉన్నట్టు సమాచారం. అదే సమయంలో అమ్మ జయలలిత అన్న కుమారుడు దీపక్ పేరు ప్రస్తావనకు వచ్చినా, రాజకీయ అనుభవం లేని దృష్ట్యా, సాహసం చేయకూడదన్న సూచనను పలువురు ఎమ్మెల్యేలు చేసినట్టు తెలిసింది. చివరకు శాసనసభాపక్ష నేత ఎంపిక బాధ్యతను శశికళకే అప్పగించారు. ఇక్కడ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించి తన విధేయుడు పళనిస్వామి పేరును అటవీ శాఖ మంత్రి దిండుగల్ శ్రీనివాసన్ ద్వారా తెర మీదకు తెచ్చారు. క్షణాల్లో మంత్రి నిర్ణయాన్ని ప్రిసీడియం చైర్మన్ సెంగోట్టయన్ ఆమోదించారు. దీంతో అన్నాడీఎంకే శాసన సభా పక్ష నేతగా ఎడపాడి కే పళనిస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తక్షణం ఫ్యాక్స్ ద్వారా ఇన్చార్జ్ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావుకు లేఖను పంపించారు. తనను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న కాసేపటికి మీడియా ముందుకు వచ్చిన పళనిస్వామి 125 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉందని ప్రకటించారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ ఉందని, తనను ఆహ్వానించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. -
కథ మారింది!
⇒ పన్నీర్ అభిమానుల ఆనందోత్సాహాలు ⇒ సుప్రీం తీర్పుతో నిస్పృహల్లో కువత్తూరు శిబిరం ⇒ తీర్పు వెలువడిన వెంటనే శశికళ కన్నీళ్లు సాక్షి ప్రతినిధి, చెన్నై: రోజుకో మలుపు తిరుగుతున్న అన్నాడీఎంకే రాజకీయాలు ఒక్క రోజులో, ఒక్క తీర్పుతో తలకిందులయ్యాయి. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి, శాసనసభాపక్ష నేత శశికళకు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు మంగళవారం ఇచ్చిన తీర్పు అన్నాడీఎంకేలోని వైరివర్గాల పరిస్థితిని తారుమారు చేసేసింది. సోమవారం వరకు ఎంతో ధీమాతో ఉండిన శశికళ కంట కన్నీరు కారగా... ఎమ్మెల్యేల సంఖ్యాబలం లేకున్నా ప్రజాబలంతో నెట్టుకొస్తున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంపై పన్నీటి జల్లు కురిసింది. ఆస్తుల కేసులో మంగళవారం ఉదయం 10.30 గంటలకు తీర్పు వెలువడుతుందనే సమాచారం శశికళ, పన్నీర్‌సెల్వం మద్దతుదారుల్లో భరించలేని ఉత్కంఠను రేకెత్తించింది. పోయెస్‌గార్డెన్, అన్నాడీఎంకే కేంద్ర కార్యాలయం వైపు శశికళ అనుచరగణం, చెన్నై అడయారు గ్రీన్‌వేస్ రోడ్డులోని పన్నీర్‌సెల్వం నివాసం వైపు ఆయన మద్దతుదారులు ఉదయం తొమ్మిది గంటల నుంచే వందలాదిగా తరలిరావడం ప్రారంభించారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అటు కువత్తూరులో, ఇటు పన్నీర్‌సెల్వం ఇంటి వద్ద బందోబస్తును పెంచారు. సుప్రీం తీర్పు వెలువడగానే పన్నీర్‌సెల్వం అభిమానులు ఆనందోత్సాహాలతో కేకలు వేశారు. రాష్ట్రవ్యాప్తంగా టపాసులు కాల్చి ప్రజలకు మిఠాయిలు పంచిపెట్టారు. సుప్రీంతీర్పు తమకు అనుకూలమని భావించిన పన్నీర్ ఇదే అదనుగా శశికళ మద్దతుదారు ఎమ్మెల్యేలను కలుసుకునేందుకు కువత్తూరు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. శాంతి భద్రతల సమస్య ఏర్పడగలదని కొందరు అనుచరులు, అధికారులు సూచించడంతో ఆయన తన ప్రయాణాన్ని విరమించు కున్నారు. అయితే ఈ కేసులో దివంగత జయలలితనే తొలిముద్దాయి అన్న విషయాన్ని విస్మరించి పన్నీర్ వర్గం సంబరాలు చేసుకోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. జయలలిత మరణించారు కాబట్టే ఆమెకు వ్యతిరేకంగా వచ్చిన అప్పీళ్లను రద్దు చేశామని తీర్పులో స్పష్టంగా పేర్కొన్నారని గుర్తుచేస్తున్నారు. దుఃఖంతో కుంగిపోయిన కువత్తూరు... సుప్రీం తీర్పుతో శశికళ, ఆమె మద్దతుదారులు నిరాశానిస్పృహల్లో కూరుకుపోయారు. సోమవారం రాత్రి అక్కడే బస చేసిన శశికళ తీర్పు ప్రతికూలమైనా, అనుకూలమైనా తన వెంటే ఉండాలని ఎమ్మెల్యేలను కోరారు. మద్దతుదారులైన ఎమ్మెల్యేతో కలిసి టీవీ చూస్తున్న శశికళ తీర్పు వెలువడగానే నిశ్చేష్టురాలై కన్నీళ్లు పెట్టుకున్నారు. దుఃఖంతో కుంగిపోయిన శశికళను మహిళా ఎమ్మెల్యేలు ఓదార్చే ప్రయత్నం చేశారు. కొద్దిసేపటిలో తేరుకున్న శశికళ మరలా ఎమ్మెల్యేలతో సమావేశమై, న్యాయనిపుణులతో చర్చించారు. తీర్పు శశికళకు ప్రతికూలంగా రావడంతో అదనంగా వేలాదిమంది పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మంగళవారం మధ్యాహ్నానికి ఆమెను అరెస్ట్ చేస్తారనే సమాచారంతో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు బైటకు వచ్చి పోలీసులను అడ్డుకుని వాగ్వివాదానికి దిగారు. రిసార్టు వద్ద ప్రయివేటు బందోబస్తు విధుల్లో ఉన్నవారిని, శశికళ అనుచరులను పోలీసులు ఐదు ప్రభుత్వ బస్సుల్లో ఎక్కించి చెన్నైకి పంపివేశారు. తీర్పును పునఃసమీక్షించాల్సిందిగా కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ఢిల్లీలో ఉన్న లోక్‌సభ ఉప సభాపతి తంబిదురై ప్రకటించారు. నిత్యం రద్దీగా ఉండే పోయెస్‌గార్డెన్‌లో జనం పలుచబడగా, ఉన్న కొద్దిపాటి అనుచరులు తీర్పు వెలువడిన కొద్దిసేపటికే నిష్క్రమించడంతో వెలవెలపోయింది. అలాగే అన్నాడీఎంకే కార్యాలయం ప్రధాన ద్వారాన్ని పాక్షికంగా మూసివేసి పార్టీ శ్రేణులంతా లోపలే దిగాలుగా ఉండిపోయారు. డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి ఇంటి వద్ద కూడా అదనంగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు ముందు జాగ్రత్తగా 1,100 మందిని అరెస్ట్ చేశారు. -
పన్నీర్ ఇంట ‘దీప’o
పన్నీర్‌కు మద్దతు ప్రకటించిన దీప సాక్షి, చెన్నై: తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వానికి అమ్మ జయలలిత మేనకోడలు దీప తోడయ్యారు. మెరీనాతీరం వేదికగా జయలలిత సమాధి సమక్షంలో మంగళవారం రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో ఆమె పన్నీర్ శిబిరంలో చేరారు. అన్నాడీఎంకేలోకి ఇదే తన రాజకీయ అరంగ్రేటమని ప్రకటించారు. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు వ్యతిరేకంగా దీప గళమెత్తిన విషయం తెలిసిందే. ఈనెల 24న మేనత్త జయంతి రోజున రాజకీయంగా కీలక నిర్ణయం ప్రకటిస్తానని ఆమె ఇప్పటికే ప్రకటించారు. ఆ మేరకు దీప పేరవై వర్గాలతో, తన ఇంటికి తరలివస్తున్న అమ్మ అభిమానులతో సంప్రదింపులు జరిపారు. ఈ పరిస్థితుల్లో పన్నీర్‌సెల్వం తిరుగుబాటు చేయడంతో శశికళ వ్యతిరేకులు అటువైపు తరలడం మొదలెట్టారు. అదే సమయంలో తమ శిబిరంలోకి రావాలని పన్నీర్ ఇప్పటికే పలుమార్లు దీపకు ఆహ్వానం పలికారు. ఆ మేరకు ఆమె మంగళవారం రాత్రి పన్నీర్ శిబిరంలో చేరారు. -
పన్నీర్‌కు శాశ్వత ఉద్వాసన
తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ నిర్ణయం సాక్షి, చెన్నై: ఆపద్ధర్మ సీఎం పన్నీర్‌సెల్వంకు మద్దతుగా నిలిచిన పార్టీ నేతలపై అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ తిరుగుబాటుదారులుగా ముద్రవేశారు. పన్నీర్‌సెల్వం, మంత్రి పాండియరాజన్తో పాటు 20 మందిని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి మంగళవారం శాశ్వతంగా తొలగించారు. కోర్టు తీర్పు వెలువడ్డ కాసేపటికి ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేలు మినహా, పార్టీ పదవుల్లో ఉన్న ఇతర నాయకుల్ని ప్రాథమిక సభ్యత్వం నుంచి శాశ్వతంగా తొలగిస్తూ శశికళ ప్రకటించారు. ఇందులో ఆపద్ధర్మ సీఎం పన్నీర్‌సెల్వం, విద్యాశాఖ మంత్రి పాండియరాజన్ కూడా ఉన్నారు. అలాగే, పార్టీ అధికార ప్రతినిధి పొన్నయ్యన్, మాజీ మంత్రులు నత్తం విశ్వనాథన్, కేపీ.మునుస్వామి, పి. మోహన్లతో పాటు మొత్తం 20 మందిని అన్నాడీఎంకే ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించినట్టు ప్రకటించారు. -
పన్నీరా... పళనినా!
⇒ న్యాయ నిపుణులతో సంప్రదింపులు ⇒ గవర్నర్‌తో పళనిస్వామి భేటీ సాక్షి, చెన్నై: బలనిరూపణకు లేదా ప్రభుత్వ ఏర్పాటుకు తమిళనాడు ఇన్చార్జ్ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు ఎవర్ని ఆహ్వానిస్తారోనన్న ఉత్కంఠ తమిళనాట బయలుదేరింది. ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వంను ఆహ్వానిస్తారా? అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన కె.పళనిస్వామిని ఆహ్వానిస్తారా? అన్న విషయమై విస్తృతచర్చ జరుగుతోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మంగళవారం తనకు వ్యతిరేక తీర్పు వెలువడడంతో శశికళ... అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా పళనిస్వామిని ఎంపిక చేశారు. దీంతో ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ సాయంత్రం ఐదు గంటలకు 13 మంది మంత్రులతో కలసి పళనిస్వామి రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. 5:30 గంటలనుంచి 15 నిమిషాలపాటు గవర్నర్‌తో భేటీ జరిగింది. తనను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటూ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు పెట్టిన సంతకాలతో కూడిన లేఖను గవర్నర్‌కు పళనిస్వామి అందజేశారు. లేఖను స్వీకరించిన గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుపై ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. పళనిస్వామి, మంత్రులు భేటీ అనంతరం మీడియా ముందుకు సైతం రాకుండా నేరుగా కువత్తూరు క్యాంప్‌కు వెళ్లారు. పన్నీర్ సెల్వంను అన్నాడీఎంకే ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించినట్లు శశికళ ప్రకటించడాన్ని కూడా పరిగణించి, న్యాయనిపుణులతో చర్చించినానంతరం గవర్నర్ తన నిర్ణయాన్ని ఒకటి రెండు రోజుల్లో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. -
అమ్మ ఆత్మ ఇచ్చిన తీర్పు
సెంటిమెంట్ పండిస్తున్న పన్నీర్‌సెల్వం సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు వ్యతిరేకంగా వెలువడిన సుప్రీంకోర్టు తీర్పుకు అమ్మ సెంటిమెంట్‌ను జోడించి తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం. తనది అమ్మ ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఇది అమ్మ ఆత్మ ఇచ్చిన తీర్పు అని ఆయన ప్రచారం ప్రారంభించారు. సుప్రీంకోర్టు శశికళకు వ్యతిరేకంగా తీర్పువెలువడగానే మీడియా ముందుకు వచ్చిన పన్నీర్‌సెల్వం మరోసారి అమ్మ సెంటిమెంట్‌ను తెరపైకి తెచ్చారు. ‘అమ్మ మరణించలేదు, ఆమె ఆత్మ మనచుట్టూ తిరుగుతూనే ఉంది. ఆమె ఆశించిన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు జయ అత్మనే ఈ తీర్పు చెప్పిందన్నారు. అమ్మ పాలన సాగేందుకు దోహదపడడం మన కర్తవ్యం, తరలిరండని శశికళ శిబిరంలోని ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. కాగా, మంగళవారం మేట్టూ పాళయం ఎమ్మెల్యే చిన్నరాజ్, ఎమ్మెల్యే సెమ్మలైలు çపన్నీర్ శిబిరంలో చేరడంతో సెల్వంకు మద్దతిచ్చే వారి సంఖ్య పదికి చేరింది. శశికళని తొలగించాలని ఈసీకి వినతి పన్నీర్ మద్దతుదారులైన 12 మంది ఎంపీల లేఖ అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళను తొలగించాల్సిందిగా కోరుతూ పన్నీర్‌సెల్వంకు మద్దతు పలుకుతున్న 12 మంది అన్నాడీఎంకే ఎంపీలు ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. ఐదేళ్లపాటు నిరంతరాయంగా సభ్యులుగా ఉన్నవారే ప్రధాన కార్యదర్శి పదవికి అర్హులని పార్టీ విధివిధానాల్లో ఉందని చెప్పారు. అంతేగాక నిబంధన 20 (2) ప్రకారం పార్టీ ప్రధాన కార్యదర్శిని తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, అండమాన్–నికోబార్ దీవుల్లోని పార్టీ సభ్యులు మాత్రమే ఎన్నుకోవాలని తెలిపారు. పార్టీ చట్టంలో మార్పులు, చేర్పులు, కొత్తవాటిని రూపొందించడం అన్నాడీఎంకే సర్వసభ్యులకు మాత్రమే హక్కు ఉందని నిబంధన 43లో పేర్కొని ఉందని వారు పేర్కొన్నారు. అయితే ఇవేమీ పాటించకుండా నిబంధనలకు విరుద్ధంగా శశికళ ఎన్నిక చెల్లదని వారు వాదించారు. ఈ కారణంగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళను అనర్హురాలిగా ప్రకటించాలని కోరుతూ పన్నీర్‌సెల్వం మద్దతుదారులైన 12 మంది ఎంపీలు మంగళవారం ఎన్నికల కమిషన్‌కు ఉత్తరం రాశారు. -
గవర్నర్ ముందు నాలుగు దారులు
ఆస్తుల కేసులో సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో.. ముఖ్యమంత్రి పీఠంపై శశికళ ఆశలు ఆవిరయ్యాయి. ఆమె తక్షణమే జైలుకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో అన్నా డీఎంకే శాసనసభా పక్ష నేతగా ఇ.పళనిస్వామిని నియమించింది. మరోవైపు.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తనకు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని ధీమాగా ఉన్నారు. దీంతో గవర్నర్ విద్యాసాగర్‌రావు మరోసారి రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువుగా నిలిచారు. నిపుణుల అంచనా ప్రకారం ప్రస్తుతం ఆయన ముందు నాలుగు మార్గాలు కనిపిస్తున్నాయి. అవేమిటంటే... –(సాక్షి నాలెడ్జ్సెంటర్) 1 ముఖ్యమంత్రి పదవి కోసం మళ్లీ ఇద్దరు నాయకులు పోటీపడుతున్నపుడు.. వారిలో ఎవరో ఒకరిని ప్రభుత్వ ఏర్పాటుకు ఎంపిక చేసే అధికారం గవర్నర్‌కు ఉంది. అంటే.. పన్నీర్ సెల్వం, పళనిస్వామిల్లో ఎవరో ఒకరిని తొలుత ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి.. ఆ తర్వాత సభలో మెజారిటీ నిరూపించుకోవాల్సిందిగా నిర్దేశించవచ్చు. 2 రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిని ఎన్నుకుని, ఆ పేరును తనకు తెలియజేయాల్సిందిగా శాసన సభను గవర్నర్ కోరవచ్చు. 3 ఒకవేళ ఇరు వర్గాల వారూ.. సీఎం పదవి చేపట్టడానికి తమకు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పినట్లయితే, గవర్నర్ అందుకు సంబంధించిన నిర్ణయాన్ని శాసనసభకు వదిలిపెట్టవచ్చు. 4 మరో కీలకమైన మార్గం.. రాష్ట్ర సీఎం ఎంపిక కోసం రహస్య బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించడం. ఏ వర్గానికి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉందనే దానిపై గందరగోళం తలెత్తినపుడు, దానిని పరిష్కరించలేనపుడు ఈ దారిని ఎంచుకోవచ్చు. రాజ్యాంగంలోని 175 (2) అధికరణ ప్రకారం.. శాసనసభ రహస్య బ్యాలెట్ ద్వారా తదుపరి ముఖ్యమంత్రిని ఎన్నుకోవాల్సిందిగా గవర్నర్ కోరవచ్చు. అదే బలపరీక్ష అవుతుంది. 1998లో ఉత్తరప్రదేశ్‌లో జగదాంబికాపాల్ ఉదంతంలో ఈ రహస్య బ్యాలెట్ పద్ధతిని చివరిసారిగా ఉపయోగించారు. జగదాంబి కాపాల్, కళ్యాణ్ సింగ్‌లలో ఒకరిని సీఎంగా ఎన్నుకోవడం కోసం శాసనసభలో బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేశారు. అప్పుడు కళ్యాణ్ సింగ్ 29 ఓట్ల ఆధిక్యంతో గెలిచి సీఎం పదవి చేపట్టారు. -
శశి వర్గం కొత్త సీఎం అభ్యర్థి ఇతనే
చెన్నై: అనుకున్నట్లే అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ ప్లాన్ బీ అమలు మొదలైంది. శశివర్గం సీఎం అభ్యర్థిని ప్రకటించింది. తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పళనిస్వామి అంటూ స్పష్టం చేసింది. ఆయనే తమ శాసనసభా పక్ష నేత అంటూ ప్రకటించారు. అదే సమయంలో పన్నీర్ సెల్వాన్ని అన్నాడీఎంకే పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి పూర్తిగా తొలగించారు. ప్రస్తుతం పళని స్వామి రహదారులు, ఓడ రేవుల మంత్రిగా ఉన్నారు. ఈయన సేలం జిల్లా ఎడప్పాడి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ముఖ్యమంత్రి బాధ్యతలకు రాజీనామా చేసిన పన్నీర్ సెల్వం.. శశికళకు ఎదురుతిరిగిన విషయం ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు, తాను ముఖ్యమంత్రి అయ్యి తీరుతానని శశికళ ప్రకటించడంవంటి పరిణామాలు తెలిసిందే. ఈలోగా సుప్రీంకోర్టు తీర్పు శశికళ సీఎం ఆశలపై పిడుగులా పడిన నేపథ్యంలో శశివర్గానికి వేరే ముఖ్యమంత్రి అభ్యర్థిని తీసుకోవాల్సిరాడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. అయితే, వాస్తవానికి తొలుత శశివర్గం నుంచి ముఖ్యమంత్రి రేసులో కే పళని స్వామి, తంబిదురై, సెంగొట్టయన్ తాజాగా జయలలిత మేనళ్లుడు దీపక్ జయకుమార్ పేర్లు కూడా వినిపించాయి. అయితే, తమిళనాడు రహదారులు, ఓడరేవుల బాధ్యతలు నిర్వహిస్తున్న పళని స్వామికి జయలలిత వద్ద మంచి పేరున్నట్లు తెలుస్తోంది. పన్నీర్ తర్వాత అంతటి స్థాయి సౌమ్యుడు కూడా పళని స్వామి అని శశివర్గం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయననే సీఎం అభ్యర్థిగా తెరమీదికి తీసుకొచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. శశికళ కేసు.. మరిన్ని కథనాలు శశికళ దోషి: సీఎం పదవి ఆశలపై నీళ్లు జయలలిత ఉండి ఉంటే... సుప్రీం తీర్పుతో ఎన్నికలకు దూరం ఫుల్ జోష్‌గా పన్నీర్.. సంబురాల్లో శ్రేణులు శశికళ వద్ద ప్లాన్ బీ ఉందా? గవర్నర్ కు ముందే తెలుసా? ‘న్యాయం గెలిచింది’ శశికళ కేసు పూర్వాపరాలివి.. ఎమ్మెల్యేలను బయటికి రప్పించే యత్నాలు స్టాలిన్ సహా డీఎంకే శ్రేణుల సంబరాలు! 'తమిళనాడులో దీపావళి చేసుకుంటున్నారు' శశికళ దోషి: ట్విట్టర్ రియాక్షన్ ఎలా ఉందంటే... జయ నుంచి జైలు దాకా శశి పయనం? -
శశికళ కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఇతనే
-
శశికళ వద్ద ప్లాన్ బీ ఉందా?
చెన్నై: అక్రమాస్తుల కేసులో ప్రస్తుతం అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఉన్న శశికళ దోషి అంటూ సుప్రీకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ఇప్పుడు శశికళ వర్గం ఏం చేయబోతోంది? 131మంది తనతోనే ఉన్నారంటూ పలువురు ఎమ్మెల్యేలో ప్రస్తుతం గోల్డెన్ బే రిసార్ట్‌లో ఉన్న శశికళ ఎలాంటి అడుగువేయబోతున్నారు? ఆమెతో ఉన్న మద్దతుదారులంతా ఇప్పుడు ఏం చేస్తారు? అనే తదితర అంశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అంతేకాదు.. నిజంగానే స్వచ్ఛందంగా శశికి మద్దతుగా 119మంది ఎమ్మెల్యేలు రిసార్టులో ఉన్నారని ప్రభుత్వం తరుపు ప్రతినిధి ఇప్పటికే మద్రాస్ హైకోర్టుకు నివేదిక ఇచ్చారు. ఇప్పుడా 119మంది ఎమ్మెల్యేల దారి ఎటు? ఈ తీర్పు తర్వాత శశికళ కుంగిపోకుండా ధైర్యంగా ముందడుగువేసి తనతో ఉన్న ఎమ్మెల్యేల్లో ఎవరికో ఒకరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకు తీసుకొస్తారా? లేదంటే భవిష్యత్ మరింత చీకటిగా మారుతుందేమో అనే భయంతో మధ్యేమార్గంతో రాజీయత్నాలకు దిగుతారా? ఒక వేళ ఆమె ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుకు తెస్తే ఆ వ్యక్తి ఎవరై ఉంటారు? ఇలా సవాలక్ష ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ విశ్లేషకులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కొత్త సీఎం అభ్యర్థిగా ఎవరొస్తారు..! తనకు వ్యతిరేకంగా తీర్పు వస్తే ఏం చేయాలో అనే విషయంలో కూడా ఇప్పటికే శశి వర్గం కూడా ముందస్తు వ్యూహాలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. తమిళనాడు సీఎం అభ్యర్థులుగా కే పళని స్వామి, తంబిదురై, సెంగొట్టయన్ ముందు వరుసలో ఉన్నారు. వీరిలో ప్రస్తుతం పార్టీ ప్రిసీడియం చైర్మన్ సెంగొట్టయన్ ఉన్నారు. ఈయన ఎమ్మెల్యేగా గెలవడం ఇది ఎనిమిదో సారి. అలాగే, తంబిదురై లోక్ సభ డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నారు. ఇక కే పళని స్వామి మాత్రం ప్రస్తుతం తమిళనాడు జాతీయ రహదారులు, మైనర్‌పోర్ట్స్ శాఖను నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా జయలలిత వద్ద ఈయనకు మంచి పేరుంది. అది కాకుండా శశివర్గంలోనే ప్రస్తుతం కే పళని స్వామి ఉన్నాడు. అయితే, ముఖ్యమంత్రి అవడానికి యత్నిస్తున్న శశికళపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే మన్నార్ గుడి వర్గం సెంగుట్టయన్ పేరును ప్రతిపాదించినట్లు వార్తలొచ్చాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు నేపథ్యంలో పళనిస్వామిని ముఖ్యమంత్రిగా తీసుకొస్తే బావుంటుందని ఆమె వర్గం భావిస్తోందట. అంతేకాదు, చాలామంది ఎమ్మెల్యేలు తనను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో పళనిస్వామినికానీ, సెంగొట్టయన్‌ను కానీ, ముఖ్యమంత్రిగా కొనసాగించే యోచనలో శశికళ ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. అంతేకాకుండా, జయ మేనళ్లుడు దీపక్ జయకుమార్‌కు కూడా ముఖ్యమంత్రిగా తెరపైకి తీసుకొచ్చే అవకాశం లేకపోలేదని అంటున్నారు. ఏదీ ఏమైనా తాను కాకుంటే ముఖ్యమంత్రిగా మరో వ్యక్తిని పెడదాం అనే ప్లాన్ బీ శశిదగ్గర అసలు ఉందా లేదా అనేది తర్వాత పరిణామాలు తెలిసే వరకు కూడా అనుమానమే. శశికళ కేసు.. మరిన్ని కథనాలు శశికళ దోషి: సీఎం పదవి ఆశలపై నీళ్లు జయలలిత ఉండి ఉంటే... సుప్రీం తీర్పుతో ఎన్నికలకు దూరం ఫుల్ జోష్‌గా పన్నీర్.. సంబురాల్లో శ్రేణులు శశికళ వద్ద ప్లాన్ బీ ఉందా? గవర్నర్ కు ముందే తెలుసా? ‘న్యాయం గెలిచింది’ శశికళ కేసు పూర్వాపరాలివి.. -
ఫుల్ జోష్‌గా పన్నీర్.. సంబురాల్లో శ్రేణులు
-
ఫుల్ జోష్‌గా పన్నీర్.. సంబురాల్లో శ్రేణులు
చెన్నై: అక్రమాస్తుల కేసులో శశికళ దోషి అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పుతో నిజంగా పన్నీర్ సెల్వంపై పన్నీర్ జల్లు పడినట్లయింది. శశికళ ముఖ్యమంత్రి ఆశలపై నీళ్లు జల్లినట్లయింది. ఈ తీర్పుతో పన్నీర్ వర్గం మొత్తం కూడా దాదాపు సంబురాల్లో మునిగిపోయింది. ఇప్పటికే పన్నీర్‌తో ఉన్న నేతలు, కార్యకర్తలంతా కూడా సెల్వం ఇంటికి వెళుతున్నారు. కొన్ని చోట్ల బాణాసంచాలు కూడా పేలుస్తున్నారు. సెల్వం మద్దతుదారులు వీధుల్లోకి వచ్చి చిందులేస్తున్నారు. పన్నీర్ సెల్వం మరికాసేపట్లో మీడియా సమావేశానికి సిద్ధమయ్యారు. తాము ఊహించిన తీర్పే వచ్చిందని, శశికళ ఈ కేసులో ముద్దాయి అవుతుందని తమకు ముందే తెలుసని పన్నీర్ వర్గం చెబుతోంది. మరోపక్క, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది కీలకంగా మారనుంది. -
శశికళ రిసార్టుకు ఎందుకు వెళ్లారు: సెల్వం
చెన్నై: అన్నాడీఎంకే ప్రధానకార్యదర్శి శశికళను మీడియా ద్వారా తానొక ప్రశ్న వేయాలనుకుంటున్నానని తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం అన్నారు. ఎమ్మెల్యేలను దాచిన గోల్డెన్ బే రిసార్టుకు ఎందుకు వెళ్లారని శశికళను ప్రశ్నించారు. పార్టీకి చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు తనకు ఫోన్ చేస్తున్నారని చెప్పారు. రిసార్టు నుంచి బయటకు రానీకుండా ఒక్కో ఎమ్మెల్యే దగ్గర ముగ్గురు గుండాలను పెట్టారని వారు చెబుతున్నారని వెల్లడించారు. కేవలం పార్టీ సభ్యులే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా శశికళ తమిళనాడు సీఎంగా ఉండటాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఇన్ని సంవత్సరాలుగా అమ్మ తనకు అండగా నిలిచిందని చెప్పారు. అమ్మని ఆఖరి చూపు చూసేందుకు కూడా దీపను ఎందుకు అనుమతించలేదని ప్రశ్నించారు. శశికళ మొసలి కన్నీరు కారుస్తున్నారని అన్నారు. అసెంబ్లీలో తమ బలం రుజువు చేసుకుంటామని చెప్పారు. -
మా కూరల్లో ఉప్పు ఉంది: ఎంపీల మద్దతు ఓపీఎస్‌కే
చెన్నై: తమిళనాడు రాజకీయాలు క్షణక్షణానికి మారిపోతున్నాయి. తాజాగా లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై మినహా ఎంపీలంతా సెల్వం గూటికి చేరుతున్నట్లు ఇద్దరు ఎంపీలు పేర్కొన్నారు. పొద్దన లేస్తే నియోజకవర్గంలో తిరగాలని.. అలా జరగాలంటే పన్నీరు సెల్వం క్యాంపులో చేరడమే మంచిదని ఎంపీ అశోక్‌కుమార్ అన్నారు. ప్రత్యర్ధి వర్గంలోకి చేరితే తినే కూరల్లో ఉప్పు ఉందా? అని ప్రజలు తనను ప్రశ్నిస్తారని చెప్పారు. జయ మృతిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అమ్మ తమను వదిలిన రోజున అందరూ కన్నీటి సంద్రంలో మునిగిపోతే శశికళ మాత్రం 15మంది కుటుంబసభ్యులను వెంటబెట్టుకుని వచ్చారని మరో ఎంపీ సుందరం అన్నారు. తాము ఒకరినొకరు చూసుకునే లోపే వారందరూ వచ్చి తర్వాతి ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై చర్చలు మొదలుపెట్టినట్లు తెలిపారు. శశికళ కంట్లో నుంచి ఒక్క కన్నీటి చుక్క కూడా రాలలేదని ఆవేదన చెందారు. అమ్మను దగ్గరగా చూసేందుకు కూడా శశికళ అనుమతించలేదని చెప్పారు. -
తమిళ కాంగ్రెస్‌లో మద్దతు చిచ్చు
శశికళకు మద్దతు ఇస్తామన్న టీఎన్‌సీసీ అధ్యక్షుడు వ్యతిరేకిస్తున్న సీనియర్లు ∙ఢిల్లీకి చేరిన రాజకీయం రాహుల్‌తో సమాలోచన సాక్షి, చెన్నై: ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు అన్నాడీఎంకేలో సాగుతున్న సంక్షోభం తమిళ కాంగ్రెస్‌లో చిచ్చుపెట్టింది. మెజారిటీ తగ్గిన పక్షంలో చిన్నమ్మ శశికళకు మద్దతిస్తామంటూ తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు తిరునా వుక్కరసుర్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. ఆయన వ్యాఖ్యల్ని తమిళ కాంగ్రెస్ సీనియర్లు వ్యతిరేకిస్తున్నారు. వ్యవహారం ఢిల్లీకి చేరడంతో నేతలు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ ముందు పంచాయితీ పెట్టారు. ప్రస్తు తానికి తటస్థంగా వ్యహరించడం మంచిదన్న రాహుల్ సూచనకు అంగీకరించారు. చిన్నమ్మకు మద్దతు ఎమ్మెల్యేలు శశికళకు మద్దతుగా ఓట్లు వేయా లని తిరునావుక్కరసర్ గురువారం చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ సీనియర్లలో ఆగ్రహాన్ని రేపాయి. టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షుడు ఈవీకే ఎస్ ఇళంగోవన్, కాంగ్రెస్ శాసనసభా పక్షనేత కేఆర్.రామస్వామి, సీనియర్ ఎమ్మెల్యే వసంత కుమార్ ఆయన వ్యాఖ్యలను దుయ్య బట్టారు. మిత్రపక్షం డీఎంకేతో కలసి వ్యూహాలకు పదునుపెట్టాలే గానీ, ఏకపక్ష నిర్ణయాలు తగదని హెచ్చరించడంతో నేతల మధ్య మాట ల తూటాలు పేలాయి. వ్యవహారం ముద రడంతో పంచాయితీ శుక్రవారం ఢిల్లీకి చేరింది. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ పిలుపుతో చిదంబరం, ఈవీకేఎస్, కేఆర్.రామస్వామి, తిరునావుక్కరసుర్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రాహుల్ సమాలోచన ఢిల్లీలో నేతలతో రాహుల్‌గాంధీ తమిళ రాజకీయ పరిస్థితులపై సమాలోచించారు. అన్నాడీఎంకేలో సాగుతున్న పరిణామాలపై ఆరా తీశారు. తటస్థంగా వ్యవహరించడం మంచిదన్న కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం సూచననే తన అభిప్రాయంగా రాహుల్ వ్యక్తం చేసినట్టు తెలిసింది. డీఎంకే తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ముందుకు సాగాలన్న ప్రతిపాదనను ఈవీకేఎస్ రాహుల్ ముందు ఉంచినట్టు ఆయన మద్దతుదారులు పేర్కొం టున్నాయి. పన్నీర్ వెనుక బీజేపీ హస్తం ఉన్నందున, శశికళకు మద్దతుగా నిలవడం ద్వారా లోక్‌సభ ఎన్నికల్లో కలసి పనిచేయ డానికి వీలుంటుందన్న అభిప్రాయాన్ని తిరునావుక్కరసుర్ వ్యక్తం చేసినట్టు సమాచా రం. అధిష్టానం నుంచి వచ్చే సూచనలు, సమాచారాల మేరకు ప్రతి ఒక్కరూ స్పందిం చాలని, అంతవరకు ఎవ్వరూ మాట్లాడవద్దం టూ రాహుల్ సూచించినట్టు తెలిసింది. ఈ సమావేశానంతరం మీడియాతో మాట్లాడిన తిరునావుక్కరసుర్ అధిష్టానం నిర్ణయం శిరోధార్యం అని ముందుకు సాగడం గమనార్హం. కేడర్‌తో కెప్టెన్ మంతనాలు సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అందుబాటులో ఉన్న నేతలతో డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ శుక్రవారం అత్యవ సరంగా సమావేశం అయ్యారు. పెరంబ లూరులో పార్టీ కోశాధికారి ఇళంగోవన్, నిర్వాహక కార్యదర్శి పార్థసారథిలతోపాటు అందుబాటులో ఉన్న జిల్లాల కార్యదర్శులతో సమావేశం అయ్యారు. అన్నాడీఎంకేలో సాగుతున్న రాజకీయ పరిస్థితులపై ఇందులో చర్చించినట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. పన్నీరుకు మద్దతుగా స్పందించాలని ఈ సందర్భంగా పలువురు కార్యదర్శులు విజయకాంత్ దృష్టికి తీసుకెళ్లగా... ఆలోచించి నిర్ణయం తీసుకుందామని సూచించినట్టు ఆ పార్టీ నేతల ఒకరు పేర్కొన్నారు. -
నేను ముఖ్యమంత్రి కావడం ఖాయం
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ స్పష్టీకరణ జయలలిత తరహాలోనే పాలన అందిస్తా.. పన్నీర్‌సెల్వం పచ్చిద్రోహి సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకేలో ఉంటూ, ‘అమ్మ’ అండతో ఎదిగిన పన్నీర్‌సెల్వం పచ్చి ద్రోహిగా వ్యవహరిస్తున్నారని పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ నిప్పులు చెరిగారు. మెజారిటీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నందున తాను ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఒక ప్రైవేట్ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వూ్యలో ఆమె పలు అంశాలపై స్పందించారు. గవర్నర్‌ను నమ్మాను ‘‘ఈ నెల 5వ తేదీన అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో జరిగిన ఎమ్మెల్యేల సమావే శంలో నేను శాసనసభాపక్ష నేతగా ఎన్నిక య్యా. తమిళనాడు ఇన్చార్జి గవర్నర్ విద్యాసా గర్‌రావు ఆ రోజు ఊటీలో ఉన్నట్లు తెలిసింది. నేను శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన తీర్మాన ప్రతిని ఊటీలోని గవర్నర్ క్యాంప్ కార్యాల యానికి ఫ్యాక్స్ ద్వారా పంపాను. అయితే, ఆయన ఊటీ నుంచి ముంబైకి వెళ్లిపోవడంతో అక్కడి రాజ్‌భవన్‌కు తీర్మాన ప్రతిని మరోసారి పంపించాను. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయా ల్సిందిగా నన్ను ఆదేశించడంలో జరుగుతున్న జాప్యం వెనుక రాజకీయం ఉందని నేను ఊహించలేదు. చట్టప్రకారం, ప్రజాస్వామ్య పద్ధతిలో గవర్నర్ వ్యవహరిస్తారని నమ్మాను. అన్నాడీఎంకేకు చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు నన్ను శాసనసభాపక్ష నేతగా ఎన్ను కున్నందున ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావని నమ్మకంతో ఎదురు చూశాను’’ అని శశికళ చెప్పారు. పన్నీర్ సెల్వం వెనుక డీఎంకే ‘‘మీకు అండగా మేమున్నామని అసెంబ్లీలో పన్నీర్‌సెల్వంను ఉద్దేశించి డీఎంకే సభ్యులు అన్నప్పుడు.. పూర్తి మెజారిటీతో మేము అధికారంలోకి వచ్చాం, మీ అండ మాకు అవసరం లేదని ఆయన బదులివ్వకుండా నింపాదిగా కూర్చున్నారు. పన్నీర్‌సెల్వం మళ్లీ అధికారంలోకి వస్తారని ప్రతిపక్ష నేత స్టాలిన్ అంటున్నారు. పన్నీర్‌సెల్వం అన్నాడీఎంకేకు చెందిన వ్యక్తి అని ప్రతిపక్ష డీఎంకే భావించడం లేదు. మీకు అండగా మేమున్నామని అసెంబ్లీలో అన్నప్పుడే పన్నీర్‌సెల్వం వెనుక డీఎంకే ఉందని రుజువైంది. ఈ సంఘటన తరువాతే నన్ను సీఎం చేయాలని ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నారు. డీఎంకే పట్ల జయలలిత ఎలా వ్యవహరించేవారో నేను సైతం అలాగే ఉంటున్నాను’’ అని చిన్నమ్మ వివరించారు. అమ్మ మరణంపై ఉద్దేశపూర్వక రాద్ధాంతం ‘‘ఆసుపత్రిలో ‘అమ్మ’కు జరిగిన చికిత్సపై డీఎంకే నేతలు ఉద్దేశపూర్వకంగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. 75 రోజులపాటు ఆసు పత్రిలో ఉన్న జయను ఎంత జాగ్రత్తగా చూసుకున్నానో అక్కడి వైద్యులకు తెలుసు. నా గురించి అవాకులు చవాకులు పేలే వారిని పట్టించుకోకుండా మనస్సాక్షి ప్రకారం నడుచు కుంటున్నాను. ‘అమ్మ’ను దూరం చేసుకుని జీవించడం ఎంతటి దుర్లభమో నాకు తెలుసు. ఇన్నాళ్లూ మాతో ఉన్న పన్నీర్‌సెల్వం ఇప్పుడు ‘అమ్మ’కు జరిగిన చికిత్సపై విచారణ కమిషన్ వేయాలని కోరడం బా«ధాకరం. ‘అమ్మ’కు గుండెపోటు వచ్చిన రోజు కూడా ఫిజియో థెరపీ చేశారు. ఆ రోజున ‘అమ్మ’ టీవీ చూస్తున్నారు, 29వ తేదీన ఇంటికి తీసుకెళ్లాల ని నిర్ణయించుకున్నాను. అయితే ఈలోగా మరణం సంభవించింది. జయలలిత మరణం పై విచారణ కమిషన్ వేయాలని కోరినందుకు నాకు బాధలేదు, ‘అమ్మ’కు పన్నీర్ చేస్తున్న పచ్చి ద్రోహమే నన్ను బాధిస్తోంది. తమిళనాడు సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తానని నమ్మకంగా చెబుతున్నాను. తమిళనాడు ప్రజలకు జయలలిత ఏమి చేయాలని ఆశించా రో.. నేను కూడా అదే తరహా పాలన అందిస్తా ను. ఆస్తుల కేసులో వారం రోజుల్లో తీర్పు వెలువడనున్నట్లు ప్రచారం జరుగుతున్నం దున కోర్టు అంశాలపై నేనేమీ వ్యాఖ్యానించ ను’’ అని శశికళ పేర్కొన్నారు. మమ్మల్ని బంధించలేదు: అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు చెన్నై: తమను ఎవరూ నిర్బంధించలేదని శశికళ శిబిరంలోని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలుS తెలిపారు. తాము బస చేసిన రిసార్ట్ వద్ద కొందరు ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ‘‘మమ్మల్ని ఎవరూ బంధించలేదు. మమ్మల్ని శశికళ దాచిపెట్టారంటూ ప్రతిపక్ష డీఎంకే అసత్యాలు ప్రచారం చేస్తోంది. బెదిరింపులు వస్తుండడం వల్లే సెల్ఫోన్లను స్విచ్చాఫ్ చేసుకున్నాం’’ అని వెల్లడించారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేల ఆచూకీ కనిపెట్టాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో పలువురు వ్యాజ్యాలు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. -
సెల్వం... పన్నీర్ సెల్వం!
సామాజిక మాధ్యమాల్లో పన్నీర్ కబాలి వైరల్ పన్నీర్ ఇంటి నుంచే పార్టీ ఐటీ విభాగం ప్రచారం సోషల్ మీడియా ద్వారా ప్రజా మద్దతు చెన్నై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: పార్టీ శ్రేణుల మద్దతు కూడగట్టడానికి గట్టిగా ప్రయత్నిస్తున్న ఆపద్ధర్మ ముఖ్య మంత్రి పన్నీర్ సెల్వం మరో వైపు ప్రజల మద్దతు కూడా సంపాదించేందుకు అన్నాడీఎంకే ఐటీ విభాగాన్ని రంగంలో కి దించారు. వారు 3 రోజులుగా పన్నీర్ ఇంటినుంచే సోషల్ మీడియాలో ప్రజల నుంచి ఎమ్మెల్యేల మీద ఒత్తిడి పెంచే వ్యూహం అమలు చేస్తున్నారు. పార్టీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) విభాగాన్ని పన్నీర్ తన శిబిరంలోకి చేర్చు కున్నారు. ఈ విభాగం బాధ్యులకు తన ఇంటి ఆవరణలోనే కొంత స్థలం ఇచ్చి వాట్సాప్, ట్వీటర్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా శశికళకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్యేల ఫోన్ నంబర్లన్నీ సామాజిక మాధ్య మాల్లో పోస్టు చేసి మీ ఎమ్మెల్యేను పన్నీర్‌కు మద్దతు ఇవ్వమని సందేశాలు పంపాలని అభ్యర్థించారు. ప్రజలు కూడా తమ ఎమ్మెల్యేలకు, వారి కుటుంబ సభ్యులకు సెల్వంకు మద్దతు ఇవ్వాలని పోస్టింగ్‌లు, మెసేజ్‌లు పంపు తున్నారు. ఈ రకంగా ఎమ్మెల్యేల మీద ఒత్తిడి పెంచి శశికళ శిబిరం నుంచి బయటకు తెచ్చేందుకు ఒక ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియా ప్రచారంలో భాగంగా కబాలి సినిమాలో రజనీకాంత్ పాపులర్ డైలాగ్ ‘ముఖం మీద గాటుపెట్టుకుని, మీసం తిప్పి, లుంగీకట్టుకుని పాత విలన్ ‘ఏయ్ కబాలి’ అనగానే ఒంగొని ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నార్రా’ అనే డైలాగ్‌ను ‘పాత రోజుల్లోలా నుదుటున బొట్టు పెట్టుకుని పంచె కట్టుకుని ‘ఏయ్ పన్నీర్’ అని పిలవగానే చిత్తం చిన్నమ్మా అని వినయంగా నిల్చుంటాననుకున్నావా? సెల్వం.. పన్నీర్ సెల్వం’ అంటూ రజనీకాంత్ ఫొటోలో పన్నీర్ తల పెట్టి గ్రాఫిక్ చేసిన ఫొటో, వీడియో ఇప్పుడు తమిళ, తెలుగు భాషల్లో వైరల్‌గా మారింది. కబాలి సినిమాలో రజనీ డైలాగ్ జనాన్ని ఎంత ఆకట్టుకుందో ఇప్పుడు పన్నీర్ò డైలాగ్ కూడా టైమ్లీగా అంతే స్థాయిలో పేలింది. -
'మూడో వ్యక్తి సీఎం కావాలి'
తమిళనాడులో రాజకీయ సంక్షోభం తొలగాలంటే మూడో వ్యక్తి సీఎం కావాలని తమిళ తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. పన్నీరు సెల్వం, శశికళల స్ధానంలో అన్నాడీఎంకేలోని మరో బలమైన నాయకుడు పగ్గాలు చేపట్టాలని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొన్న కారణంగా గవర్నర్ చొరవ చూపి అసెంబ్లీని రద్దు చేయాలని అన్నారు. పరిస్ధితులు చక్కబడిన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే బావుంటుందని అభిప్రాయపడ్డారు. ఇరువురు నేతల మధ్య సాగుతున్న రాజకీయ చదరంగం కారణంగా ప్రజాజీవనం స్తంభించిందని చెప్పారు. దీనివల్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం లేకపోలేదని అన్నారు. -
వారసుడు పన్నీరు సెల్వమే..!
పన్నీర్ సెల్వమే నా తదనంతర ముఖ్యమంత్రి అని అమ్మే చెప్పారు. సెల్వంను అమ్మ దూరం పెట్టడం, పార్టీ నుంచి గెంటేయడం, తన దరిదాపుల్లోకి రాకూడదని చెప్పడం లాంటివి ఒక్కసారైనా జరిగాయా? తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఏమాత్రం మంచివి కాదని, జయలలిత రాజ కీయ ఎంపిక ఇప్పటికీ పన్నీరు సెల్వమేనని, ఆయన ముఖ్యమంత్రిగా ఉంటేనే రాష్ట్ర ప్రజలు జయలలితకు ఇచ్చిన తీర్పునకు గౌరవం ఉంటుందని ప్రముఖ నటి గౌతమి తేల్చి చెబుతున్నారు. శశికళ రాజకీయాలు, ముఖ్యంగా ఎమ్మెల్యేల తరలింపు అనేవి తమిళనాడుకు సంబంధించినంతవరకు మంచి సంప్రదాయం కాదని ఆమె చెబుతున్నారు. తమిళ ప్రజలు గతంలో ఎన్నడూ చూడని సంక్షోభంలో తమిళ రాజకీయాలు చిక్కుకున్న నేపథ్యంలో ఒకవైపు శశికళ, మరోవైపు పన్నీర్ సెల్వం మధ్య అన్నాడీఎంకేలో జరుగుతున్న ఈ కుమ్ములాట గురించి సాక్షి పత్రికకు గౌతమి ఇచ్చిన ఇంటర్వూ్యలోని ముఖ్యాంశాలు.... తమిళనాడు ప్రస్తుత పరిణామాలకు కారణం ఎవరు? నేటి తమిళనాడు రాజకీయ పరిస్థితులకు కారణం ఒకరిపై పెట్టి చూపలేం. రాజకీయం చాలా అరుదైన పరిస్థితుల్లోనే ఏకముఖంగా నడుస్తుంటుంది. చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే ఇన్ని విష యాలు ఇంతవరకు ప్రజలకు తెలీకుండా పోవటం. ప్రజాస్వామ్యంలో ఇంత స్పష్టత లేకపోవడం చాలా బాధ కలిగిస్తోంది. అయిదేళ్ల పాలనా కాలంలో ప్రతి క్షణం ప్రజలకు బాధ్యత పడాలనేది గుర్తుంచుకో వాలి. అయితే చాలా కాలంగా ప్రభుత్వాలు ఈ విషయం మర్చిపోయినట్లనిపిస్తుంది. పార్టీలో సంక్షోభానికి కారణం శశికళా? సెల్వమా? తమిళనాడు చరిత్రలో పదవిలో ఉన్నవారు వరు సగా రెండోసారి మళ్లీ అధికారంలోకి రావడం చాలా అరుదు. అమ్మ అలా రెండోసారి గెలిచారు. పెద్ద మార్జిన్‌తో గెలిచారామె. ప్రజలకు ఆమెపట్ల ఉన్న నమ్మకం అలాంటిది. రాష్ట్రంలోని ప్రజలందరి మేలు కోరే భరోసా ఆమె మీద పెట్టామన్న ఆలోచనతోటే ప్రజలు తిరుగులేని విధంగా తీర్పు చెప్పారు. అలాంటి అమ్మే ఇప్పుడు లేరు. తన తర్వాత ఆమె ఎవరిని చూపించారు. మీకోసం నేను చేయాలనుకు న్నది నా మార్గంలో చేయగలిగేవారు వీరు అని చాలాసార్లు ఆమె పన్నీరు సెల్వంనే చూపించారు. తన విజన్‌ని సాధ్యం చేయగల వ్యక్తి ఎవరో అమ్మే తేల్చిచెప్పాక దాన్ని కొనసాగించడమే ధర్మం. సెల్వంను శశికళ తప్పించిన విధానం సరైందేనా? ఈరోజు మనం చూస్తున్న పరిణామాలు సరైన పద్ధతిలో జరిగాయి అని ఎవరైనా చెప్పగలుగు తారా? పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంపిక కూడా తాత్కాలిక ప్రాతిపదికనే జరిగింది అని ఇవ్వాళ తెలు స్తోంది. ఇలాంటి రహస్యాలు ఇంకా ఎన్ని ఉన్నా యి? పార్టీవరకు మాత్రమే అయితే అది అంతర్గత విషయం. కానీ ప్రజలను పాలించవలసిన సంద ర్భం వచ్చేసరికి అది అంతర్గత విషయంగా ఉండ దు. అది మన రోజువారీ జీవితాన్ని ప్రతి క్షణమూ ప్రభావితం చేసే నిర్ణయం. అలాంటి నిర్ణయం తీసు కునే హక్కు ప్రజలకు మాత్రమే ఉంది. వారు తమ నిర్ణయాన్ని చెప్పేశారు. ఆ నిర్ణయాన్ని మార్చే అధి కారం ప్రజలకే తప్ప మరెవరికీ లేదు. జయలలిత వారసురాలు శశికళేనా? అమ్మ అన్నిసార్లు చేయెత్తి చూపి మరీ పన్నీర్ సెల్వమే నా తదనంతర సీఎం అని చెప్పిన తర్వాత ఆమె వారసురాలు వీరు, వారు, మరొకరు అని ఎలా అనుకుంటాం? ఇన్నేళ్లుగా సెల్వం అమ్మతో ఉన్నారు. ఆయన్ని అమ్మ దూరం చేయడం, పార్టీ నుంచి బయటకు గెంటడం, తన దరిదాపుల్లోకి రాకూడదని చెప్పడం.. ఒక్కసారైనా జరిగిందా.. ఆయన స్థిరత్వం, విశ్వాసం, ముక్కుసూటితనమే కదా అమ్మ ఆయన్ని నమ్మడానికి కారణం. మీ మద్దతు పన్నీరు సెల్వంకేనా? తప్పకుండా. అది అమ్మ నిర్ణయం. ఓటు అమ్మకు వేశారు. అందరి నమ్మకం ఆమె మీదే ఉంది. ఎమ్మెల్యేలు నాతోటే ఉన్నారని శశికళ చెబుతున్నారే? మనస్సాక్షి అనేది ఉంటే దాని మాట మనం విని, ఆ ప్రకారం నడిస్తేనే.. మనల్ని మనం మనిషి అని చెప్పుకునే హక్కు ఉంటుంది. అర్హత ఉంటుంది మనకు. డబ్బు ప్రభావాలు చాలా వస్తుంటాయి. పోతుంటాయి. కానీ మనిషిగా, మానవత్వంతో ఆలోచించి నిర్ణయించుకోవడమే జీవితంలో అతి పెద్ద విశ్వసనీయత. ఎమ్మెల్యేలను బస్సుల్లో తరలించడం ఏమిటి? విషాదకరం. అత్యంత విషాదకరం. ఇలాంటి కథలు మనం ఎక్కడో, ఎప్పుడో విని ఉండవచ్చు. ఇతర రాష్ట్రాల్లో ఇలా జరిగింది అని విన్నాం. కాని తమిళనాడులో ఈరోజు అదే జరుగుతోంది అని ఒక రూమర్ వచ్చినా అది బాధాకరమండి. దీనిగురించి ఆలోచించాలన్నా బాధ కలుగుతోంది. ఎమ్మెల్యేల మద్దతుతో శశికళే సీఎం అయితే? అలా జరగదని నేను నమ్ముతున్నాను. మానవత్వం మీద నాకు చాలా నమ్మకం ఉంది. ఒకవేళ దానికి భిన్నంగా జరిగితే, ఎమ్మెల్యేల దన్నుతో శశికళ సీఎం అయితే అది కచ్చితంగా అమ్మమీద ఉన్న తీర్పు కాదు. ప్రజలు ఇచ్చిన తీర్పు కాదది. పన్నీర్ సెల్వమే నెగ్గితే.. పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పటివరకూ ఆయన పాలించిన తీరు, అన్న మాటలు చూస్తే.. తప్పకుండా ఆయన అమ్మ వార సత్వాన్ని కొనసాగిస్తారు, అమ్మ విజన్‌కి ఆయన కట్టుబడి ఉంటారన్న నమ్మకం ఉంది. ఇంటర్వూ: ఇస్మాయిల్, సాక్షి ప్రతినిధి -
దూకుడు పెంచిన పన్నీర్‌సెల్వం
-
ఎప్పటికీ ధర్మమే విజయమం సాధిస్తుంది
-
పన్నీర్ రాజీనామా ఉపసంహరణకు వీలుకాదు
సాక్షి ప్రతినిధి, చెన్నై: ముఖ్యమంత్రి పదవికి పన్నీర్‌సెల్వం ఇచ్చిన రాజీనామాను ఉపసంహరిం చుకోవడం సాధ్యపడదని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. శశికళ తన చేత బలవంతంగా రాజీనామా చేయించారని, ప్రజలు, పార్టీ కార్యకర్తలు కోరితే రాజీనామా ఉపసంహ రణకు తాను సిద్ధమని పన్నీర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పన్నీర్ రాజీనామాను గవర్నర్ ఆమోదించిన పరిస్థితిలో ఉపసంహరణ సాధ్యమా అనే సందేహం తలెత్తింది. ఈ అంశంపై మద్రాసు హైకోర్టు ప్రముఖ న్యాయవాది ఆర్ బాలకనకరాజ్ మాట్లాడుతూ... పన్నీర్‌సెల్వం రాజీనామాను గవర్నర్ ఆమోదించడంతోపాటు కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించేవరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కూడా ఆదేశాలు జారీచేయడం వల్ల ఉపసంహరణ సాధ్యం కాదని తెలిపారు. రాజీనామా ఉపసంహరణ కంటే తనకు మద్దతుగానిలిచిన ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్‌కు సమర్పించి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరవచ్చని చెప్పారు. శశికళ ప్రభుత్వ ఏర్పాటుకు విజ్ఞప్తి చేస్తున్నందున ఎవరికి తొలిసారి అవకాశం ఇవ్వాలో గవర్నర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. -
మంత్రి వలర్మతికి ఓటర్ బెదిరింపులు
ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంకు మద్దతు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మంత్రి వలర్మతికి బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. శ్రీరంగం నియోజకవర్గానికి చెందిన ఒక మహిళ ఫోన్ ద్వారా వలర్మతిని బుధవారం సాయంత్రం బెదిరింపులకు గురిచేసినట్లుగా ఒక ఆడియో సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసిన వ్యక్తిగా చెబుతున్నా పన్నీర్‌సెల్వంకు మద్దతు పలకండి, ఆయన చేత బలవంతంగా రాజీనామా చేయించడం సరికాదంటూ బెదిరించినట్లుగా ఆ ఆడియోలో సంభాషణలు సాగాయి. మరోవైపు పన్నీర్‌సెల్వంకు మద్దతుగా నిలిచిన పుదుచ్చేరికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఓంశక్తిశేఖర్ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించినట్లు శశికళ ప్రకటించారు. -
పన్నీర్‌సెల్వం దూకుడు
- ప్రభుత్వం, పార్టీని చేతుల్లోకి తెచ్చుకునేందుకు ఎత్తుగడలు - ప్రభుత్వంలో శశికళ విధేయులపై వేటు చెన్నై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్షాల అండతో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం దూకుడు మరింత పెంచారు. ఆయన విసురుతున్న రాజకీయ పాచికలను కాచుకోలేక శశికళ శిబిరం విలవిల్లాడుతోంది. మొన్నటి దాకా ప్రభుత్వాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలనుకున్న పన్నీర్ గురువారం నుంచి పార్టీని కూడా హస్తగతం చేసుకునే దిశగా రాజకీయ సమీకరణలకు తెరలేపారు. ప్రభుత్వంలో శశికళ విధేయులపై వేటు వేస్తున్నారు. ఆమెకు వ్యతిరేకులైన ఇద్దరు ఐఏఎస్‌లపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేశారు. తద్వారా అధికార వర్గాల మద్దతును కూడగడుతున్నారు. శశికళ ప్రస్తుతం నివాసం ఉంటున్న పోయెస్ గార్డెన్ ఇంటిని జయలలిత స్మారక భవనంగా మారుస్తా మని పన్నీర్ సెల్వం ప్రకటించారు. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చించారు. ఈ నిర్ణయాలన్నీ శశికళను దిమ్మ తిరిగేలా చేసి ఆత్మరక్షణలో పడేశాయి. పన్నీర్‌సెల్వం పార్టీ వ్యతిరేకి, పార్టీ ద్రోహి అంటూ శశికళ వర్గం చేస్తున్న ఆరోపణలు జనంపై పెద్దగా ప్రభావం చూపడం లేదు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా మధుసూదనన్ ఇన్నాళ్లూ శశికళ మద్దతుదారుడిగా ఉన్న అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్ అనూహ్యంగా పన్నీర్ సెల్వం పక్షాన చేరిపోయారు. ఎమ్మెల్యేలంతా పన్నీర్ వద్దకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ‘అమ్మ’ ఆత్మ ఇచ్చిన ఆదేశాల మేరకు మధుసూదనన్‌ను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా నియమిస్తానని పన్నీర్‌సెల్వం ప్రకటిం చారు. అన్నాడీఎంకేలో జయలలితకు ప్రతినిధిగా పార్టీ వ్యవహారాలన్నీ నడిపిన మధుసూదనన్ ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించడం శశికళకు పెద్ద షాక్ అనే చెప్పాలి. పన్నీర్‌కు పార్టీల మద్దతు పన్నీర్ సెల్వంకు శాసన సభలో బలనిరూపణ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత స్టాలిన్ గురువా రం ఒక ప్రకటన ద్వారా గవర్నర్‌ను కోరారు. బల నిరూపణకు అవకాశం ఇస్తే తాము మద్దతు ఇస్తామని ఈ చర్య ద్వారా స్టాలిన్ పరోక్షంగా సంకేతాలిచ్చారు. సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు కూడా పన్నీర్‌కు మద్దతు ప్రకటించడం శశికళను ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టింది. బీజేపీ సైతం పన్నీర్‌కు పరోక్షంగా సహకరిస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామాలన్నీ అంచనా వేసుకున్నందు వల్లే పన్నీర్ సెల్వం రెండు రోజులుగా ధీమాగా కనిపిస్తున్నారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి బయటకు వచ్చాక ఆయన మరింత ధీమాగా కనిపించారు. గవర్నర్, కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఆయనకే అనుకూలంగా ఉంటుందేమోననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
రిమోట్ కాదు.. తుపాకీ
చిన్నమ్మపై పన్నీరు సెల్వం తిరుగుబాటు ‘అమ్మ’ సెంటిమెంటే అస్త్రం చెన్నై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: అన్నా డీఎంకేకు విధేయుడిగా, ‘అమ్మ’ చేతిలో రిమోట్‌గానే తమిళనాడు ప్రజలకు తెలిసిన పన్నీర్ సెల్వం పెద్ద గన్ను పేల్చారు. తాను జయలలితకు మాత్రమే రిమోట్ననీ, శశికళ లాంటి వాళ్లకు తుపాకీ లాంటి వాడినని చెప్పకనే చెప్పారు. సౌమ్యుడు, వివాదరహితుడు, మృదు స్వభావి, భయానికి బ్రాండ్ అంబాసిడర్‌గా గుర్తింపు పొందిన సెల్వం ఈ తరహా తిరుగుబాటు చేయడం రాజకీయ వర్గాలనే కాకుండా ప్రజలను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ‘అమ్మ’ సెంటిమెంట్‌తో ఆయన పేల్చిన తుపాకీ చిన్నమ్మను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అప్పుడే తెరచాటు తిరుగుబాటు: జయలలిత మృతి చెందిన వెంటనే శశికళ దూకుడు పెంచారు. అయితే, ప్రధాని నరేంద్రమోదీ అండతో పన్నీర్‌సెల్వం అప్పట్లోనే పరోక్షంగా తిరుగుబాటు చేశారు. ఆయన మద్దతుతో రాత్రికి రాత్రే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. శశికళ ఒత్తిడి మేరకు సీఎం పదవికి రాజీనామా చేశాక రెండు రోజులు మౌనంగా ఉన్న పన్నీర్ సెల్వం ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత స్టాలిన్ అండతో గళం విప్పారు. జయలలిత సమాధి సాక్షిగా చిన్నమ్మపైనే నేరుగా తుపాకీ ఎక్కుపెట్టారు. జయలలిత మృతిపై విచారణ కోసం సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఒక కమిషన్ వేయాలన్నారు. ‘అమ్మ’ మృతిపై ప్రజల్లో ఇప్పటికే ఉన్న అనుమానాలకు మరింత బలం చేకూర్చారు. ‘అమ్మ’ ఆత్మ ఆదేశం మేరకు పార్టీని, ప్రభుత్వాన్ని రక్షించడానికే తాను తిరుగుబాటు చేశానని చెప్పుకుని పార్టీ శ్రేణులు, ప్రజల్లో సానుభూతి సంపాదించే పాచిక విసిరారు. అలాగే జయ కుటుంబ సభ్యుల మద్దతు కూడగట్టేందుకు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే జయ అన్న కుమార్తె దీపను తనతో చేతులు కలపాల్సిందిగా ఆహ్వానించారు. రాష్ట్ర పర్యటనకు ఏర్పాట్లు: శశికళపై పార్టీలోనే కాకుండా ప్రజల్లో కూడా వ్యతిరేకత ఉందనే విషయాన్ని కేంద్ర ం దృష్టికి తీసుకెళ్లడానికి పన్నీర్ సెల్వం రాష్ట్ర పర్యటనకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. శాసనసభలో బల నిరూపణకు తనకు సమయం లభిస్తుందని ఆయన నమ్ముతున్నారు. ఈలోగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించాలని నిర్ణయించారు. యువత మద్దతుకు వ్యూహం: తమిళనాడు యువత మద్దతు కూడగట్టేందుకు పన్నీర్ సెల్వం ప్రయత్నాలు చేస్తున్నారు. గురువారం నుంచి మెరీనా బీచ్ వేదికగా యువతతో ఉద్యమం చేయించేందుకు వ్యూహ రచన చేశారు. -
తమిళనాడులో ఏం జరగొచ్చు?
-
తమిళ నాట ఆసక్తిగా మారిన రాజకీయాలు
-
తమిళనాడులో ఏం జరగొచ్చు?
చెన్నై: జయలలిత మరణం తర్వాత తమిళనాడు అసెంబ్లీలో 233 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు 117 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. పన్నీర్ సెల్వంకు 50 మందికిపైగా ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. మరికొంత మంది తన వర్గంలో చేరితే ఆయన బలం పెరుగుతుంది. అంతేకాకుండా ప్రతిపక్ష నేత స్టాలిన్ సైతం పన్నీర్‌కు అండగా నిలుస్తున్నారు. డీఎంకేకు 89 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. పన్నీర్ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. ఆయన తన రాజీనామాను వెనక్కి తీసుకుంటే.. సీఎం పదవిలో కొనసాగేం దుకు అవకాశం ఉంది. పన్నీర్‌సెల్వంను ముఖ్యమంత్రిగా కొనసాగించేందుకు రాజ్యాంగపరంగా గవర్నర్‌కు ఎలాంటి అడ్డంకులు ఉండబోవు. సీఎం రాజీనామా చేసినా, రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తినా ఇప్పటికిప్పుడు ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేమీ లేదు. ప్రభుత్వం యథావిధిగానే పనిచేస్తుంది. ఎందుకంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేవరకూ పన్నీర్ సెల్వం కేబినెట్ కొనసాగాలంటూ గవర్నర్ కోరారు. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థ కుప్పకూలిందని గవర్నర్ భావిస్తే రాష్ట్రపతి పాలన విధించేందుకు అవకాశం ఉంటుంది. తమిళనాడు పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుచక్రం వేస్తోంది. గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు అందుబాటులో లేకపోవడంతో ఆమె ప్రమాణ స్వీకార కార్యక్రమం వాయిదా పడిన సంగతి తెలిసిందే. శశికళపై తిరుగుబాటు చేస్తున్న పన్నీర్‌సెల్వంకు బీజేపీ ఆశీస్సులు ఉన్నట్లు సమాచారం. సెల్వంతో బలవంతంగా రాజీనామా చేయించడం చట్టవిరుద్ధమని బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్.రాజా ట్వీటర్లో పేర్కొన్నారు. -
చిన్నమ్మే చీఫ్ మినిస్టర్
అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా శశికళ ఏకగ్రీవ ఎన్నిక - పేరును ప్రతిపాదించిన పన్నీరు సెల్వం - జైకొట్టిన ఎమ్మెల్యేలు - 9న సీఎంగా చిన్నమ్మ ప్రమాణ స్వీకారం - ముఖ్యమంత్రి పదవికి పన్నీరు రాజీనామా సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో రాజకీయ పరిణామాలు అత్యంత వేగంగా మారాయి. ఊహించినట్టుగానే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, దివంగత జయలలిత నెచ్చెలి వీకే శశికళ తమిళనాడు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించేందుకు మార్గం సుగమమైంది. అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా శశికళ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం జరిగిన అత్యవసర సమావేశంలో 136 మంది ఎమ్మెల్యేలు శశికళను తమ నేతగా ఎన్నుకున్నారు. శశికళను పార్టీ శాసనసభాపక్ష నేతగా ప్రతిపాదిస్తూ స్వయంగా ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం తీర్మానాన్ని ప్రవేశపెట్టగా అందరూ హర్షధ్వానాలతో ఆమోదం తెలిపారు. ఈనెల 9వ తేదీన సీఎంగా చిన్నమ్మ ప్రమాణస్వీకారం చేయనున్నారు. శాసనసభాపక్ష నేతగా ఎంపికైన అనంతరం పార్టీ సభ్యులనుద్దేశించి 60 ఏళ్ల శశికళ మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం కోసం, ‘అమ్మ’ ఆశయసాధన కోసం తాను సీఎం పగ్గాలు చేపట్టేందుకు అంగీకరించినట్లు పేర్కొన్నారు. శరవేగంగా మారిన పరిణామాలు... అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి జయలలిత గతేడాది డిసెంబర్ 5న కన్నుమూయడంతో ఆమె నిర్వర్తిస్తున్న రెండు బాధ్యతలను పన్నీర్‌సెల్వం, శశికళలు పంచుకోవడం తెలిసిందే. అయితే పార్టీ సంప్రదాయం ప్రకారం రెండు పదవుల్లో ఒక్కరే ఉన్నప్పుడే పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయం సాధ్యమని శశికళ విధేయులైన కొందరు మంత్రులు, సీనియర్ నేతలు వాదన లేవనెత్తారు. ఇది కాలక్రమేణా బలపడుతూ రాగా మరోవైపు పన్నీర్‌సెల్వం తన పని తాను చేసుకుంటూ పోతూనే పదవిని కాపాడుకునే ప్రయత్నం చేయసాగారు. దీంతో అప్రమత్తమైన శశికళ శరవేగంగా పావులు కదిపారు. ఈ నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలంతా ఆదివారం నాటి అత్యవసర సమావేశానికి హాజరుకావాలంటూ పోయెస్‌గార్డెన్ నుంచి టెలిఫోన్ద్వారా శనివారం ఆదేశాలు పంపారు. దీంతో పన్నీర్‌సెల్వంకు ఉద్వాసన ఖాయమని శనివారంరాత్రే తేలిపోయింది. చెన్నై సమీపంలోని సముద్రతీరంలో రెండు నౌకలు ఢీకొనగా వెలువడిన చమురుతెట్టు తొలగింపు పనులను పర్యవేక్షించేందుకు సీఎం పన్నీర్‌సెల్వం ఆదివారం ఉదయాన్నే ఎన్నూరు హార్బర్‌కు వెళ్లారు. అక్కడినుంచి సచివాలయానికొచ్చి అధికారులతో సమావేశం జరుపుతుండగా పోయెస్‌గార్డెన్ నుంచి పిలుపొచ్చింది. దీంతో సమావేశాన్ని అర్ధాంతరంగా ఆపేసి 11.45 గంటలకు హడావుడిగా శశికళ వద్దకు చేరుకున్నారు. ఆమెతో రెండు గంటలపాటు మంతనాలు జరిపారు. శశికళ పేరును ప్రతిపాదించిన పన్నీరుసెల్వం అనంతరం మధ్యాహ్నం 2గంటలకు పార్టీ ప్రధాన కార్యాలయంలో శాసనసభాపక్ష సమావేశం ప్రారంభమైంది. శాసనసభాపక్ష నేతగా తాను రాజీనామా చేస్తున్నట్లు సీఎం పన్నీర్‌సెల్వం ప్రకటించడంతోపాటు ఆ స్థానానికి శశికళను ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు. సీఎంసహా సమావేశానికి హాజరైన 136 మంది ఎమ్మెల్యేలు శశికళను శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఎంపిక అనంతరం శశికళ మాట్లాడుతూ ఆనాడు పార్టీ ప్రధాన కార్యదర్శిగా, నేడు శాసనసభాపక్ష నేతగా తనను ముందుగా ప్రతిపాదించింది పన్నీర్సెల్వమేనన్నారు. పార్టీ కష్టకాలాలను ఎదుర్కొన్న సమయాల్లో, గతంలో సీఎంగా అమ్మ కొనసాగడానికి ఇబ్బంది ఎదురైన సమయాల్లోను పన్నీర్‌సెల్వం అండగా నిలిచారని ప్రశంసించారు. జయలలిత మరణాంతరం తనను పార్టీ ప్రధాన కార్యదర్శిగా, సీఎంగా బాధ్యతలు చేపట్టాలని తొలుత పన్నీరుసెల్వమే కోరారని, అయితే అప్పట్లో అమ్మను కోల్పోయిన బాధలో ఏదీ వినే పరిస్థితిలో తాను లేకపోయానని చెప్పారు. అయితే రెండు పదవుల్ని ఒక్కరే నిర్వహించాలని పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి పదేపదే వస్తున్న వినతులతో ఇందుకు ఆమోదిస్తున్నానని తెలిపారు. తమిళనాడు ప్రజల సంక్షేమంకోసం అన్నాడీఎంకే తన కృషిని కొనసాగిస్తుందన్నారు. గతేడాది డిసెంబర్ 31న పార్టీ ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు చేపట్టిన శశికళ నెల రోజులు తిరిగేసరికల్లా ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకోవడం విశేషం. జయలలిత మరణించిన తరువాత సరిగ్గా 60 రోజులకు చిన్నమ్మ సీఎంగా మారనున్నారు. శశికళ శాసనసభాపక్ష నేతగా ఎంపికవడంతో ఆమె మద్దతుదారులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. విధేయతకు మారుపేరు ‘పన్నీరు’ విధేయుడంటే ఇలాఉండాలని పన్నీరు సెల్వం మరోమారు చూపారు. అమ్మ జయలలితకే కాదు, చిన్నమ్మ శశికళకూ తాను విధేయుడేనని చాటుకున్నారు. పదవులు తనకు శాశ్వతం కాదన్నట్టు, విధేయతే ముఖ్యమని మరోమారు చాటుకున్నారు. జయలలితకు అత్యంత నమ్మినబంటుల్లో ఆ పార్టీ కోశాధికారి ఓ పన్నీరుసెల్వం ఒకరు. అమ్మ సంక్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నప్పుడల్లా, ఆమెకే కాదు.. తమిళనాడుకు ఆపద్భాందవుడిగా సీఎం పగ్గాలు చేపట్టారు. తేని జిల్లా పెరియకులం గ్రామంలో పుట్టి పెరిగి, టీ దుకాణం నడుపుకుంటూ రాజకీయాల్లో పన్నీరు సెల్వం అడుగిడారు. పెరియకులం మున్సిపల్ చైర్మన్‌గా పగ్గాలు చేపట్టిన ఆయన జయలలితకు అత్యంత విధేయుడిగా అవతరించారు. 2001ఎన్నికలతో తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టగానే, కేబినెట్ పదవి దక్కించుకున్నారు. అదేఏడాది టాన్సీభూముల కేసులో జయలలిత జైలుశిక్షను ఎదుర్కొనడంతో, సీఎం పదవి చేపట్టే భాగ్యాన్ని దక్కించుకున్నారు. ఆ ఏడాది సెప్టెంబర్ 21 నుంచి 2002 మార్చి 1 వరకు ఐదున్నర నెలలు సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో అక్రమాస్తుల కేసులో జయలలిత మళ్లీ జైలుశిక్ష ఎదుర్కోవాల్సి రావడంతో రెండోసారి సీఎం పగ్గాలు చేపట్టారు. ఆ ఏడాది సెప్టెంబర్ 29 నుంచి 2015 మే 22 వరకు 8 నెలలు పనిచేశారు. ఇక గత డిసెంబర్ 5న జయలలిత మరణం అనంతరం మూడోసారి సీఎం పగ్గాలు చేపట్టారు. ఇప్పుడు చిన్నమ్మ శశికళకు పగ్గాలప్పగిస్తూ విధేయత చాటుకున్నారు. ప్రజలు కోరుకున్న సీఎంలు కారు – శశికళ ఎంపికపై ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ వ్యాఖ్య ‘‘పోయెస్‌గార్డెన్ ఇంట్లో నివసించేవారిని ప్రజలు సీఎంగా ఆశించి ఓటు వేయలేదు. ఇప్పుడు రాష్ట్రంలో ఉండేది ప్రజలెన్నుకున్న ప్రభుత్వం కాదు’’అని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ వ్యాఖ్యానించారు. అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా శశికళను ఎన్నుకోవడంపై ఆయన స్పందిస్తూ.. గతేడాది జరిగిన ఎన్నికల్లో సీఎంగా జయలలిత ఉండాలని ఆశించి ప్రజలు ఓట్లేశారని, ఆమె మరణం తరువాత నిన్నటివరకు పన్నీర్‌సెల్వం, ఆ తరువాత శశికళ ప్రజలు కోరుకున్న ముఖ్యమంత్రులు కారని వ్యాఖ్యానించారు. శశికళకు పార్టీలోగానీ, ప్రభుత్వంలోగానీ ఏనాడూ జయలలిత కనీస ప్రాధాన్యమివ్వలేదని, జైలు కెళ్లినప్పుడు సైతం పన్నీర్సెల్వంకే బాధ్యతలు అప్పగించారని అన్నారు. అయితే ఈరోజు శశికళను సీఎంగా చేస్తూ పార్టీ ఎమ్మెల్యేలు తీసుకున్న నిర్ణయం జయలలిత మనోభీష్టానికి, ప్రజాభిప్రాయానికి విరుద్ధమని చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న ఈ పరిస్థితులను ప్రజాస్వామ్యబద్ధంగానే ఎదుర్కొంటామని చెప్పారు. తమిళనాడు చరిత్రలో బ్లాక్‌డే: ఈవీకేఎస్ ఇళంగోవన్ అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా శశికళ ఎంపిక తమిళనాడు రాజకీయాల్లో బ్లాక్‌డేగా పరిగణిస్తున్నామని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ(టీఎన్‌సీసీ) మాజీ అ«ధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ అన్నారు. శశికళ ప్రజల నుంచి రాలేదు, ఎన్నికల్లో పోటీ చేస్తే ఆమెకు డిపాజిట్టూ దక్కదన్నారు. శాసనసభాపక్ష నేతగా ఎవరిని ఎన్నుకోవాలనే స్వేచ్ఛ ఆ పార్టీ ఎమ్మెల్యేలకుందని టీఎన్‌సీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ సమర్థించారు. అంత అవసరం ఏమిటి: బీజేపీ అన్నాడీఎంకేలో చోటుచేసుకుంటున్న పరిణామాలను అంతర్గత వ్యవహారంగా పరిగణించడానికి వీలులేదని బీజేపీ తమిళనాడుశాఖ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ అన్నారు. కేవలం రెండు నెలల్లో పన్నీర్‌సెల్వంను సీఎం పదవి నుంచి తప్పించాల్సిన అవసరమేంటో ప్రజలకు చెప్పాలన్నారు. దురదృష్టకరం: జయలలిత మేనకోడలు దీప సీఎంగా పన్నీర్‌సెల్వంను తప్పించి శశికళ బాధ్యతలు తీసుకోవడం దురదృష్టకరమని జయలలిత మేనకోడలు దీప ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల చేత ఎన్నకోబడని శశికళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం ఖండించదగిన అంశమన్నారు. ప్రజాస్వామ్య పాలనను కాదని అకస్మాత్తుగా సైనిక పరిపాలన వచ్చినట్లు భావిస్తున్నానని చెప్పారు. -
ఎంజీఆర్ బతికుంటే ఇలా జరిగేదా?
జల్లికట్టుపై కమల్ హాసన్ సాక్షి, ప్రతినిధి, చెన్నై: జల్లికట్టు కోసం పోరాడుతున్న తమిళనాడు విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జీ, బాష్పవాయు ప్రయోగాలను ప్రముఖు నటుడు కమల్ హాసన్ తీవ్రంగా తప్పుబట్టారు. ‘విద్యార్థులనే కాకుండా మహిళలను, బాలలను కూడా బలవంతంగా తరలించారు. ఎంజీఆర్ (దివంగత సీఎం) బతికుంటే ఇలా జరిగేదా? ఆయన విద్యార్థులను కలసి మాట్లాడేవారు. సీఎం పన్నీర్ సెల్వం కూడా అలా చేసి ఉండాల్సింది. జల్లికట్టుకు అడ్డంకుల్లేకుండా శాశ్వత చట్టం చేయాలని 20 ఏళ్లుగా కోరుతున్నాం. ఈ ఆటను నిషేధించినవారు పల్లెలపై దాడి చేసే మదపుటేనుగులను ఎందుకు నిషేధించడం లేదు?’ అని ప్రశ్నించారు. ఆయన మంగళవారమిక్కడ విలేకర్లతో మాట్లాడారు. సాధారణ స్థితికి: జల్లికట్టు మద్దతుదారులకు, పోలీసులకు మధ్య ఘర్షణలతో సోమవారం అట్టుడికిన తమిళనాడులో మంగళవారం సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. చెన్నై మెరీనా బీచ్‌తోపాటు పలు ప్రాంతాల్లో అదనపు పోలీసు పికెటింగ్‌లను ఏర్పాటు చేశారు. జల్లికట్టు కోసం శాశ్వత చట్టం తేవాలని వందమంది నిరసనకారులు బీచ్‌లో ధర్నా చేశారు. అరెస్ట్ చేసిన తమ వందమంది సహచరులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం రాత్రి వడపళని పోలీస్‌స్టే షన్ ను ముట్టడించేందుకు యత్నించిన నిరసనకారులను పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి చెదరగొట్టారు. విరుదునగర్ జిల్లా కాన్సాపురంలో జల్లికట్టులో ఓ ఎద్దు పొడవడంతో ఒక పోలీసు చనిపోయాడు. జల్లికట్టును అనుమతిస్తూ 2016లో జారీచేసిన నోటిఫికేషన్ ను వాపసు తీసుకుంటామని సుప్రీం కోర్టుకు కేంద్రం తెలిపింది. -
జల్లి 'కట్టు' పై తంబి పట్టు
జల్లికట్టు అంటే.. గిత్తను లొంగదీసే సంప్రదాయ తమిళ ఆట. మదురై, తిరుచిరా పల్లి, తేని, పుదుకొట్టాయ్, దిండిగుల్ జిల్లాలో పోంగల్ సందర్భంగా కోలాహలంగా ఆడుతారు. నిర్దిష్ట స్థలంలో కొందరు యువకుల మధ్యకు బలిష్టమైన గిత్తను వదులుతారు. ఉత్తిచేతులతో దాన్ని లొంగదీసిన వారు విజేత. మరికొన్ని చోట్ల వీధుల్లో ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి... మధ్యనున్న దారిలో గిత్తను వదులుతారు. దాన్ని కరుచుకొని ఎవరు ఎక్కువ దూరం ప్రయాణించగలిగితే వారే విజేత. ఓ దండేసి విజేతను సన్మానిస్తారు. మొదట్లో 101 రూపాయల చిల్లర నాణేలు ఎద్దు కొమ్ముకు కట్టేవారు. వాటితో పాటు ఓ ధోవతి, టవల్... ఇవే విజేతలకు దక్కే బహుమతి. తర్వాతి కాలంలో గ్రైండర్లు, ఫ్రిజ్‌లాంటి గృహోపకరణాలను కొన్నిచోట్ల బహుమతు లుగా ఇస్తున్నారు. ఆర్థిక ప్రయోజనాలు లేకున్నా జల్లికట్టులో నెగ్గడాన్ని తమిళ యువత ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. రాజకీయ కోణం.. విపక్ష డీఎంకే నేత స్టాలిన్ జల్లికట్టుపై నిషేధాన్ని రాజకీయం చేశారు. నిషేధం ఎత్తి వేతకు రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శలు మొదలుపెట్టారు. డీఎంకే భాగస్వామిగా ఉన్న యూపీఏ ప్రభుత్వమే మొదట జల్లికట్టును అడ్డు కుందని ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ప్రతి విమర్శ చేశారు. తేవర్ కులం ప్రాబల్యం కలిగిన జిల్లాలో దీన్ని ఎక్కువ గా ఆడతారు. అన్నా డీఎంకేలో తేవర్ల ప్రాబల్యం ఎక్కువ. రాజకీయం గా ప్రాబల్యం కలిగిన కులం. సీఎం, శశికళ ఇద్దరూ ఈ కులానికి చెందిన వాళ్లే. అందువల్ల ప్రభుత్వం ఒత్తిడికి లోనైంది. ఉప్పెనలా యువత... కొంతమంది నిరసనకారులను అరెస్ట్ చేశారనే వార్తలతో మంగళవారం ఉదయం ఓ 50 మంది మెరీనా బీచ్‌కు చేరుకొని నిరసనకు దిగారు. గంటల్లోనే ఈ సంఖ్య వేలకు చేరింది. సామాజిక మాధ్యమాల్లో ప్రచారంతో... యువత ఉప్పెనలా కదిలింది. ఐటీ నిపుణులు, ఉద్యోగులు, కాలేజీ విద్యార్థులు స్వచ్ఛందంగా తరలివచ్చారు. బుధ వారం రాత్రయ్యేసరికి నిరసనకారుల సంఖ్య 15 వేలకు చేరుకుంది. రాత్రి చల్లని చలిలో బీచ్‌లోనే పడుకున్నారు. గురువారం ఉదయం పరిసరాలను శుభ్రం చేశారు. తోటి నిరసనకారులకు కొందరు ఇంటి నుంచి భోజనాలు తెచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది యువత రోడ్డెక్కారు. నిరసనకారులు శాంతియుతంగా ఆందోళన చేస్తూనే... రాజకీయ నాయకులను తమ ఆందోళనకు దూరంగా ఉంచారు. నాయకుడెవరూ లేని నయా సమష్టి ఉద్యమమిది. సినీనటులు, ఇతర రంగాల ప్రముఖులు వీరికి మద్దతు పలుకుతున్నారు. జల్లికట్టును అనుమతించాలి, విదేశీ సంస్థ పెటాను నిషేధించాలి... అనేవి నిరసనకారుల డిమాండ్లు. ఎందుకంత మద్దతు.. ద్రవిడ ఉద్యమం, హిందీ భాషకు వ్యతిరేక ఉద్యమాలు చేసిన తమిళుల్లో అస్థిత్వ భావన ఎక్కువ. తమిళ సంప్రదాయాల్లో ఇతరుల జోక్యమేమిటి? ఇది తమిళుల ఆత్మగౌరవానికి భంగకరమని వీరి భావన. ఈ భావనతోనే యువత ఒక్కసారిగా స్వచ్ఛందంగా కదిలింది. పైగా స్పెయిన్ బుల్‌ఫైట్‌లో లాగా తాము గిత్తలను హింసించి చంపడం లేదనేది వీరి వాదన. వివాదం ఏంటి? జంతువులకు శిక్షణ (కోతులు, ఎలుగుబంట్లు, పులులు తదితర) ఇచ్చి... వాటితో ప్రదర్శనలు ఇవ్వడాన్ని కేంద్ర ప్రభుత్వం 1991లో నిషేధించింది. 2011లో ఈ జాబితాలో గిత్తను కూడా చేర్చారు. దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయగా... 2014లో అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ జల్లికట్టుపై నిషేధం విధించింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను (2016 మే) దృష్టిలో పెట్టుకొని గత ఏడాది ఆరంభంలో అమిత్ షా జోక్యంతో ఎద్దు నిషేధిత జాబితాలో ఉన్నా జల్లికట్టు ఆడుకోవచ్చని కేంద్రం ఆదేశించింది. ఇది కోర్టు ధిక్కారమని జంతు పరిరక్షణ సంస్థ ‘పెటా’ సుప్రీం తలుపు తట్టింది. ఈ ఆదేశాలను సుప్రీం తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో క్రీడ మద్దతుదారులు కొందరు అనుమతించాలని మళ్లీ సుప్రీంకు వెళ్లారు. పొంగల్ సమీపిస్తున్నందున అత్యవసరంగా విచారించాలని కోరగా... ఈనెల 12 సుప్రీం వారి విజ్ఞప్తిని తిరస్కరించింది. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ మదురై తదితర ప్రాంతాల్లో జల్లికట్టును నిర్వహించారు. అప్పటి నుంచి అక్కడక్కడ నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఢిల్లీకి పన్నీరు... శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉండటంతో సీఎం పన్నీర్ సెల్వం బుధవారం రాత్రే ఢిల్లీకి వెళ్లారు. గురువారం ప్రధాని నరేంద్ర మోదీని కలిసి పరిస్థితిని వివరించారు. జల్లికట్టుకు అనుమతిస్తూ ఆర్డినెన్స్ తెచ్చి ఆందోళనకారులను శాంతింపజేయాలని మొరపెట్టుకున్నారు. జల్లికట్టుకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపుతామన్నారు. కాగా తమిళనాడులో నిరసన ఉధృతమవుతున్న దృష్ట్యా సుమోటోగా తీసుకొని విచారించాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం తోసిపుచ్చింది. మద్రాసు హైకోర్టుకు వెళ్లమని సూచించింది. ప్రధాని ఏమన్నారు జల్లికట్టుపై తమిళుల సెంటిమెంట్లను మేము గౌరవిస్తాం. అయితే కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. జల్లికట్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా అండగా నిలబడతాం. ‘పెటా’ వాదనేంటి... జల్లికట్టు ముమ్మాటికీ జంతు హింసే. గిత్తలు అదుపు తప్పి రెచ్చిపోయేలా పోటీకి ముందు వాటికి మత్తుమందులు ఇస్తున్నారు. కళ్లలో కారం జల్లుతున్నారు. దీనికి వీడియో సాక్ష్యాలు కూడా కోర్టుకు సమర్పించాం. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
జల్లికట్టుపై ముందుకే...: పన్నీర్
న్యూఢిల్లీ/సాక్షి, చెన్నై: కేంద్రం సహకారంతో జల్లికట్టును నిర్వహించేందుకు త్వరలో చర్య లు తీసుకుంటామని తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం ప్రకటించారు. జల్లికట్టుపై ప్రధానిని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడు తూ... తమ ప్రభుత్వం తీసుకునే చర్యలేంటో త్వరలో చూస్తారంటూ ఉత్కంఠకు తెరతీశారు. జల్లికట్టు తమిళ ప్రజల సంప్రదాయక హక్కు, ధైర్యాన్ని ప్రతిబింబించే క్రీడని ప్రధానికి చెప్పినట్లు సెల్వం పేర్కొన్నారు. తమిళనాడుకు అధికారం ఉంది: అటార్నీ జల్లికట్టును సంప్రదాయ క్రీడగా పరిగణిస్తూ చట్టం చేసే అధికారం తమిళనాడు ప్రభుత్వానికి ఉందని కేంద్ర అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ స్పష్టతనిచ్చారు. అయితే జంతువుల్ని గాయపర్చడం, హింసించడం చేయకూడదని చెప్పారు. క్రీడలకు సంబంధించినంత వర కూ... ప్రత్యేక అధికారం రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉంటుందన్నారు. నేడు బంద్: జల్లికట్టుపై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ చెన్నై మెరీనాబీచ్‌లో ఆందోళనలు గురువారం మూడో రోజుకు చేరాయి. విద్యార్థులకు మద్దతుగా వేలాది మంది తరలివస్తున్నారు. మెరీనా తీరం రణరంగాన్ని తలపిస్తోంది. షూటింగులను రద్దు చేసి సినీ కళాకారులు ఆందోళనకు మద్దతు పలికారు. శుక్రవారం రాష్ట్రబంద్ చేపట్టాలని విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఆందోళనలో పాల్గొనాలని ప్రభుత్వ ఉద్యోగులు నిర్ణయించారు. తమిళ సినిమా రంగం నేడు నిరాహారదీక్ష చేపట్టనుంది. దర్శకుడు లారెన్స్ జల్లికట్టు నిర్వహణకు రూ.కోటి విరాళం ప్రకటించారు. -
తమిళనాట డిసెంబర్ 29 టెన్షన్
-
అన్నాడీఎంకే పార్టీలో చీలిక తప్పదా ?
-
ఇక పన్నీర్ వర్సెస్ చిన్నమ్మ
-
రెండు కుర్చీలపై శశికళే!
-
రెండు కుర్చీలపై శశికళే!
► పార్టీ సాంప్రదాయమని వాదన ► సీఎం, ప్రధాన కార్యదర్శిగా శశికళ ► 127 మంది మృతుల కుటుంబాలకు తలా రూ.3లక్షలు సాక్షి ప్రతినిధి, చెన్నై: జయలలిత మరణంతో ఖాళీ అయిన సీఎం, ప్రధాన కార్యదర్శి.. ఈ రెండు కుర్చీల్లోనూ శశికళను కూర్చోబెట్టడమే ఆనవాయితీ అనే వాదనతో అన్నాడీఎంకే శ్రేణులు అడుగులు వేస్తున్నాయి.జయలలిత మరణించగానే ముఖ్యమంత్రి పదవికి పన్నీర్‌సెల్వం ఎంపిక ఎటువంటి వివాదానికి తావు లేకుండా ఏకగ్రీవంగా సాగిపోయింది. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి భర్తీపై మాత్రం కొన్నిరోజులుగా తర్జనభర్జనలు జరిగినా క్రమేణా పార్టీ ఏకతాటిపై నిలిచి శశికళకు మద్దతు పలుకుతోంది. వారం రోజులు గా రాష్ట్రవ్యాప్తంగా తీర్మానాలు సైతం చేస్తూ వచ్చారు. అయితే రెండు రోజుల క్రితం అన్నాడీఎంకేలో అకస్మాత్తుగా సీ ను మారిపోయింది. పార్టీ బాధ్యతలతోపాటూ ప్రభుత్వ పగ్గాలు సైతం శశికళ చేపట్టాలని కోరడం ప్రారంభమైంది. ఈ మేరకు తీర్మానాలు కూడా చేసి శశికళకు సమర్పిస్తున్నారు. చివరకు పన్నీర్‌సెల్వం కేబినెట్లోని మంత్రి వర్గ సహచరులు సైతం చిన్నమ్మే సీఎం కావాలని పట్టుబట్టడం విచిత్రం. ఇదేమి చోద్యం, సీఎం పన్నీర్‌సెల్వంకు మీరు వ్యతిరేకమా అని ప్రశ్నించిన మీడియాకు మంత్రి ఉదయకుమార్ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. పన్నీర్‌సెల్వంతో తమకు ఎలాంటి విభేదాలు లేవని అన్నారు. జయ సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నపుడు మాత్రమే పన్నీర్‌సెల్వంకు బాధ్యతలు అప్పగించారని గుర్తు చేశారు. పార్టీకి నాయకత్వం వహించేవారే ప్రభుత్వాన్ని నడిపించడం అన్నాడీఎంకేలో ఆనవాయితీగా వస్తోందని చెప్పారు. అంతేగాక సీఎం పన్నీర్ సెల్వం పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉండే శశికళ వద్దకు పదేపదే వస్తే ప్రజల్లో విమర్శలు తలెత్తే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. రెండు బాధ్యతల్లోనూ శశికళ ఉండడం ఉత్తమమని భావించే మంత్రులంతా ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆయన వివరించారు. ఇదిలా ఉండగా అమ్మ సమాధిని దర్శించుకునేందుకు వచ్చేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సోమవారం సైతం రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చి అమ్మకు అంజలి ఘటించారు. మీంజూరుకు చెందిన అన్నాడీఎంకే నేత ముత్తుకుమార్ అమ్మ సమాధి వద్ద ఆమె విగ్రహాన్ని అమర్చారు. జయలలిత మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన 127 మృతుల కుటుంబాలకు తలా రూ.3 లక్షలు అందజేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జయ మరణంపై సందేహాలు: జీకే వాసన్ అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేయాలని తమిళ మానిల కాంగ్రెస్ అధ్యక్షుడు జీకే వాసన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. జయ మరణాన్ని రాజకీయం చేయడం సరికాదు, అలాగని గోప్యంగా ఉంచడం కూడా మంచిది కాదని అన్నారు. ప్రజల మనసుల్లోని ప్రశ్నలకు సమాధానం చెప్పడంలో ప్రభుత్వం వెనకడుగు వేయరాదని ఆయన హితవు పలికారు. -
శశికళకు మద్దతుగా ఎమ్మెల్యేల తీర్మానం
-
శశికళకు మద్దతుగా ఎమ్మెల్యేల తీర్మానం
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళను ఎన్నుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించినట్లు తమిళనాడు సీఎం పన్నీర్‌సెల్వం శనివారం తెలిపారు. పార్టీ కార్యాలయంలో 135 మంది ఎమ్మెల్యేలతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించారు. మాజీ మంత్రి వలర్మతి నేతృత్వంలో శశికళకు మద్దతుగా శనివారం మరో తీర్మానాన్ని ఆమోదించారు. శశికళతో నటి విజయశాంతి భేటీ నటి విజయశాంతి శనివారం చెన్నైలోని పోయెస్‌గార్డెన్ లో శశికళను కలుసుకున్నారు. అరగంటసేపు ఇద్దరూ మాట్లాడుకున్నారు. తర్వాత జయలలిత సమాధి వద్దకు వెళ్లి జయకు విజయశాంతి నివాళులర్పించారు. పొత్తుకోసం బీజేపీ చర్చలు: మురళీధరరావు అన్నాడీఎంకేతో పొత్తుకోసం చర్చలు జరుగుతున్నట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు శుక్రవారం కేరళలో జరిగిన ఒక సభలో వెల్లడించారు. కాగా, అన్నాడీఎంకేను చీల్చే ఆలోచన బీజేపీకి లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు సౌందరరాజన్ స్పష్టంచేశారు. -
జయ మరణం తర్వాత పరిస్థితి ఏంటి ?
-
అర్ధరాత్రి కుట్ర! శశి సామర్థ్యంపైనే దృష్టి..!
-
అధికార మార్పిడి వెనుక చీకటి రాజకీయం
- పళని స్వామిని సీఎం చేయాలనే ఆలస్యంగా జయ మరణ వార్తను ప్రకటించారా? - అమ్మ మరణ వార్త ముందుగానే తెలిసి మంత్రులు, ఎమ్మెల్యేలను అపోలోకు పిలిపించిన శశికళ.. పన్నీర్ లేకుండానే వారితో తెల్లకాగితాల మీద సంతకాలు - అర్ధరాత్రి 12 గంటలకు అన్నా డీఎంకే శాసనసభాపక్ష భేటీ - 12.30 గంటలకు శాసనసభా పక్ష నేతగా పన్నీర్ ఎన్నిక - ఆగమేఘాల మీద తెల్లవారుజామున 1.25 గంటలకు పన్నీర్ ప్రమాణం - అపోలో ఆసుపత్రిలో జయ పార్థివదేహం చుట్టూ శశికళ బంధువులు ఎలా చేరారు? - అంత్యక్రియల్లో శశికళ.. జయ కుటుంబీకులను అక్కడికి ఎందుకు రానీయలేదు? - ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా బయటపడుతున్న వాస్తవాలు చెన్నై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తమిళనాడులో అధికార మార్పిడి పైకి కనిపించినంత సులువుగా జరగలేదు. సోమవారం అర్ధరాత్రి 11.30 గంటలకు జయలలిత మృతి చెందినట్లు అధికారిక ప్రకటన వెలువడటానికి ముందు చాలా తతంగం చోటుచేసుకుంది. జయలలిత నెచ్చెలి శశికళ ఒక్కసారిగా ప్రభుత్వాన్ని, పార్టీని సొంతం చేసుకోవడానికి పావులు కదిపారు. జయలలిత దూరంగా పెట్టిన శశికళ భర్త నటరాజన్‌తో పాటు ఆమె బంధువర్గం అంతా ఒక్కసారిగా అక్కడికి వచ్చి వాలింది. పన్నీర్ సెల్వంకు బదులు తనకు నమ్మకస్తుడైన మంత్రి పడపాటి పళని స్వామిని ముఖ్యమంత్రిని చేయడానికి శశికళ శరవేగంగా వ్యూహం రచించారు. తమిళనాడు అధికార పీఠం కోసం జరగరానిది జరిగిపోతోందని సమాచారం అందడంతో కేంద్ర ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగారు. ఆగమేఘాల మీద కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చెన్నై రావడం, రాత్రికి రాత్రే పన్నీర్ సెల్వంతో పాటు మంత్రి వర్గంతో గవర్నర్ విద్యా సాగరరావు పదవీ ప్రమాణ స్వీకారం చేరుుంచడం చకచకా జరిగిపోరుుంది. జయలలిత పార్థివదేహం ఆసుపత్రిలో ఉండగానే అపోలో ఆసుపత్రి వేదికగా శశికళ రాజకీయం నడిపిన తీరు ఒక్కొక్కటిగా ఇపుడు బయటకు వస్తోంది. జయలలిత అంత్యక్రియలు ముగిసి పార్టీలో పదవులు, కుల సమీకరణల ముసలం మొదలైన నేపథ్యంలో శశికళ వ్యతిరేక వర్గం గళం విప్పుతోంది. అన్నాడీఎంకేలో విశ్వసనీయ వర్గాలు వెల్లడించిన సమాచారం మేరకు.. అపోలో ఆసుపత్రి వేదికగా సోమవారం ఏం జరిగిందంటే.. ► సోమవారం (5-12-16) మధ్యాహ్నం 2.30 గంటలకు అమ్మ చనిపోరుునట్లేనని వైద్య బృందాలు శశికళతో పాటు పన్నీర్ సెల్వంకు సమాచారం ఇచ్చాయి. ► కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డా, గవర్నర్ విద్యా సాగరరావుకు అపోలో ముఖ్యులు ఈ విషయం చేరవేశారు. ►ఈ పరిణామాల నేపథ్యంలోనే శశికళ సాయంత్రం 4 గంటలకు అపోలో ఆసుపత్రి రెండో అంతస్తులో పన్నీర్ సెల్వం లేకుండానే మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. సమావేశానికి హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలతో మూడు తెల్లకాగితాల మీద సంతకాలు చేరుుంచుకున్నారు. ఈ సంతకాలు ఎందుకు అని తెలుసుకునే అవకాశం కూడా వారికి ఇవ్వలేదు. ఇందులో ‘ఒకటి పళని స్వామిని సీఎంగా చేయడానికి, రెండోది తనను (శశికళ)పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నట్లు, మూడోది అమ్మ మృతికి అపోలో ఆసుపత్రి యాజమాన్యానికి సంబంధం లేదు.. వారు ఆమెను బతికించడానికి శక్తికి మించి ప్రయత్నం చేశారు’ అని తర్వాత వారికి తెలిసింది. అపోలో వేదికగా జరుగుతున్న రాజకీయ నాటకం కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. ► రాత్రి 7గంటలకు వెంకయ్య నాయుడు చెన్నై అపోలో ఆసుపత్రికి వచ్చారు. శశికళతో మాట్లాడారు. ► రాత్రి 8 గంటలకు శశికళ మరోసారి తన మద్దతు దారులతో సుదీర్ఘంగా సమావేశం అయ్యారు. ►రాత్రి 12 గంటలకు పన్నీర్ సెల్వంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. పన్నీర్ సెల్వంను శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ► సరిగ్గా ఇదే సమయంలో అపోలో ఆసుపత్రి వర్గాలు రాత్రి 11.30 గంటలకు జయలలిత చనిపోయినట్లు ప్రకటించాయి. ► రాత్రి 12.45 గంటలకు పన్నీర్ సెల్వంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు రాజ్ భవన్‌కు చేరుకున్నారు. ► మంగళవారం తెల్లవారు జామున 1.25 గంటలకు పన్నీర్ సెల్వంతో పాటు జయలలిత కేబినెట్లోనిమంత్రులందరితో పదవీ ప్రమాణా స్వీకారం చేరుుంచారు. భౌతికకాయం చుట్టూ శశికళ బంధువులే.. జయలలిత చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించక ముందే శశికళతో పాటు, జయలలిత దూరం పెట్టిన వారంతా ఆమె చుట్టూ చేరారు. తెల్లవారు జామున 2.30 గంటలకు ఆసుపత్రి నుంచి జయ పార్థివ దేహం పోయెస్ గార్డెన్‌కు చేరుకుంది. అక్కడ కూడా జయలలిత బంధువులెవరికీ అవకాశం ఇవ్వకుండా శశికళ, ఆమె భర్త నటరాజన్, శశికళ బంధువులు ఇళవరసి, సుధాకర్, రావణన్, దివాకరన్ శవం చుట్టూ చేరిపోయారు. అక్కడి నుంచి రాజాజీ హాల్‌కు, మెరీనా బీచ్ ఒడ్డున అంతిమ సంస్కారం పూర్తయ్యే వరకు కూడా జయ భౌతికకాయం చుట్టూ గుమికూడి వేరెవరికీ చోటేలేకుండా చేశారు. ఖననం చేసే సమయంలోనూ జయలలిత కుటుంబ సభ్యులను దగ్గరికి రానివ్వకుండా శశికళే ఈ తంతు ముగించడం విమర్శలకు దారి తీసింది. మొదట తెలిసింది శవపేటికల వ్యాపారికే జయలలిత మరణించిన విషయం అపోలో వర్గాలు అర్ధరాత్రి 12 గంటలకు ప్రకటిస్తే శవపేటికలు తయారు చేసే ఫ్లరుుంగ్ స్క్వాడ్ అండ్ హోమేజ్ కంపెనీ ఎండీ శాంతకుమార్‌కు సాయంత్రం 5.30 గంటలకే తెలిసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శాంతకుమార్ స్వీయ పర్యవేక్షలో కఫిన్‌తో కూడిన హెవీ డ్యూటీ ఫ్రీజర్ బాక్స్ గంటల వ్యవధిలోనే అపోలో ఆసుపత్రికి తీసుకుని వచ్చారు. -
పన్నీర్ సెల్వం చిన్నమ్మ చేతిలో రిమోటేనా?
-
అశ్రునివాళి
కడసారి వీడ్కోలు పలికేందుకు తరలివచ్చిన ప్రముఖులు - కన్నీళ్లుపెట్టిన పన్నీర్ సెల్వం, శశికళ ఓదార్చిన ప్రధాని మోదీ - రాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, 8 రాష్ట్రాల ముఖ్యమంత్రుల నివాళి - అంత్యక్రియలకు హాజరైన జాతీయ నేతలు, వైఎస్సార్సీపీ ప్రతినిధులు సాక్షి, చెన్నై: పురచ్చితలైవీ జయలలితకు నివాళులర్పించేందుకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజలు పెద్ద సంఖ్యలో మంగళవారం చెన్నైకు తరలివచ్చారు. ఆమె పార్థివ దేహాన్ని సందర్శించి ‘అశ్రు’నివాళులర్పించారు. అమ్మ భౌతికకాయాన్ని రాజాజీ హాల్‌కు తీసుకువచ్చినప్పటి నుంచి పెద్ద సంఖ్యలో ప్రముఖులు, ప్రజలు సందర్శించారు. ప్రధాని మోదీ మధ్యాహ్నం 1.15 సమయంలో రాజాజీ హాల్‌కు చేరుకుని జయలలిత పార్థివ దేహం వద్ద నివాళులర్పించారు. మోదీ అక్కడికి రాగానే తమిళనాడు సీఎం పన్నీరు సెల్వం కొంత ఉద్వేగానికి లోనయ్యారు. దీంతో ఆయన్ని మోదీ ఆలింగనం చేసుకుని ఓదార్చారు. అలాగే జయలలిత నెచ్చెలి శశికళను మోదీ పరామర్శించారు. ఆమె తలపై ఆప్యాయంగా చేరుు వేసి ఓదార్చారు. అక్కడే ఉన్న జయలలిత అన్న జయకుమార్ కుమారుడు దీపక్‌ను పరామర్శించారు. తమిళనాడుకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ప్రధాని హామీ ఇచ్చినట్టు కేంద్ర మంత్రి వెంకయ్య మీడియాకు తెలిపారు. అనంతరం మూడున్నర గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అక్కడికి చేరుకుని జయలలిత పార్థివ దేహం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ జయలలిత భౌతికకాయానికి నివాళులర్పించారు. డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్, తమ పార్టీకి చెందిన ముఖ్యనేతలతో కలసి జయలలిత భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆమె లేని లోటు అన్నాడీఎంకే వర్గాలకు తీర్చలేనిదని, పన్నీర్‌సెల్వం ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని స్టాలిన్ మీడియాతో పేర్కొన్నారు. జయకు నివాళులర్పించిన వారిలో ఏపీ సీఎం చంద్రబాబు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కేరళ సీఎం విజయన్, యూపీ సీఎం అఖిలేశ్‌యాదవ్, కేంద్ర మంత్రులు వెంకయ్య, నిర్మలా సీతారామన్, మాజీ గవర్నర్ రోశయ్య, వైఎస్సార్సీపీ నేతలు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ వరప్రసాద్ ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రులు నారుుని నర్సింహారెడ్డి, హరీశ్‌రావు హాజరయ్యారు. ఇక, దక్షిణభారత చలన చిత్ర సూపర్‌స్టార్ రజనీకాంత్ సతీమణి ప్రేమలత, అల్లుడు ధనుష్, కుమార్తె ఐశ్వర్యలతో కలసి జయలలిత పార్థివదేహం వద్ద నివాళులర్పించారు. జయలలిత మరణవార్త విని తమిళనాడులో 36 మంది మృతి సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణవార్త విని తమిళనాడులో 36 మంది మరణిం చారు. వీరిలో 31 మంది గుండె పోటు తో మరణించగా, ఐదుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు. సోమవా రం రాత్రి నుంచి దిగాలుగా ఉన్న అరుం బు కోటైకి చెందిన సుబ్బురాజ్ (42) అనే అన్నాడీఎంకే కార్యకర్త మంగళ వారం ఉదయం విధులకు హాజరై అక్కడి తోటలోని పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వేదార ణ్యంకు చెందిన కాలియప్పన్ (77) అనే అన్నాడీఎంకే సభ్యుడు పురుగుమందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు. కోయం బత్తూరు హరిజన కాలనీకి చెందిన వడివేలు అనే డ్రైవర్ ఇంటిలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. వేలూరు సామివేల్ నగర్‌కు చెందిన పేరరసు, ఆరణికి చెందిన సురేష్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. -
చిన్నమ్మ చేతిలో రిమోటేనా?
- విభేదాలు మరిచి విధేయుడిగా మారతారా? - స్వతంత్రంగా వ్యవహరిస్తే సమీకరణాలేంటి? - పన్నీర్ సెల్వంపై ఏఐఏడీఎంకే వర్గాల్లో చర్చ చెన్నై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: జయలలితకు అత్యంత విధేయుడు, నమ్మకస్తుడిగా కొనసాగిన తమిళనాడు సీఎం ఓ.పన్నీర్ సెల్వం పార్టీ పగ్గాలు చేపట్టబోతున్న శశికళకు కూడా విధేయుడిగా ఉంటారా? ’’అమ్మ చెబుతుంది, నేను చేస్తాను’’ అని జయలలిత మీద తనకున్న భక్తిని చాటుకున్న సెల్వం ఇప్పుడు స్వతంత్రంగా వ్యవహరిస్తే సమీకరణలు ఎలా ఉంటారుు? ఆ పార్టీలో శశికళ శకం ప్రారంభం అవుతుందా? జయలలిత అంతిమ సంస్కారం ముగిసిన అనంతరం తమిళనాడు రాజకీయ వర్గాల్లో ఈ తరహా చర్చలు జోరందుకున్నారుు. శశికళకు, పన్నీర్ సెల్వంకు మధ్య ఉన్న అభిప్రాయాల భేదాల నేపథ్యంలో తమిళనాట అనేక రాజకీయ ఊహాగానాలు సాగుతున్నాయి. జయలలిత నెచ్చెలిగా ముద్రపడి అన్నాడీఎంకే రాజకీయాల్లోనూ తనవంతు పాత్ర పోషిస్తున్న శశికళ పార్టీలో, ప్రభుత్వంలో తన పట్టు పెంచుకోవడానికి చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. ఒక దశలో జయలలిత ఆత్మ శశికళ అనేంతగా తన హవా నడిపారు. ఇదే క్రమంలో 2011లో జయలలితకే ఎసరు పెట్టేందుకు తెరచాటు ప్రయత్నాలు చేశారు. తన కులస్తుడైన (దేవర ) పన్నీర్ సెల్వంను కూడా జట్టులోకి ఆహ్వానించారు. అమ్మ విధేయుడైన సెల్వం జయకు ఈ విషయం చెప్పేయడంతో శశికళకు, సెల్వంకు మధ్య అప్పటినుంచే విభేదాలు ఉన్నాయి. ప్రస్తుతం జయ మరణంతో వీరి మధ్య విభేదాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. శశికళ చక్రం తిప్పాలనుకున్నా.. జయలలిత మరణానంతరం ఏఐఏడీఎంకేలో లుకలుకలు, అనిశ్చితి నేపథ్యంలో శశికళ పార్టీతో పాటు ప్రభుత్వాన్ని కూడా తానే నడిపించేందుకు అవసరమైన బలసమీకరణకు పూనుకున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. అరుుతే ప్రధాని నరేంద్ర మోదీ భవిష్యత్తులో తమకు అనుకూలంగా మెలిగేందుకు అవకాశం ఉన్న పన్నీర్ సెల్వం వైపు మొగ్గు చూపారు. జయలలిత సోమవారం సాయంత్రమే కన్ను మూసినా అధికారికంగా ప్రకటించకుండా చేసి మంత్రి వెంకయ్య నాయుడును చెన్నైకు పంపి శశికళ- పన్నీర్ మధ్య రాజీ కుదిర్చే వ్యూహం అమలు చేశారు. ఆ తర్వాతే సెల్వంను శాసనసభా నాయకుడిగా ఎన్నుకున్నట్లు ప్రకటన వెలువడింది. పార్టీ బాధ్యతలు శశికళకు అప్పగించడానికి ప్రాథమికంగా నిర్ణయం జరిగింది. పార్టీని తన చేతుల్లోకి తెచ్చుకుని, ప్రభుత్వాన్ని తన కనుసన్నల్లో నడిపించే ఆలోచనతోనే శశికళ ఈ ప్రతిపాదనకు అంగీకరించారనే ప్రచారం జరుగుతోంది. జయలలిత భౌతిక కాయానికి నివాళులు అర్పించడానికి వచ్చిన ప్రధాని మోదీతో చనువుగా మెలగడం, ఆయన ప్రత్యేకంగా తనతో సంభాషించి ఓదార్చేలా చేసుకోవడం ద్వారా ప్రధాని వద్ద తనకు కూడా గట్టి మద్దతే ఉందని పన్నీర్ సెల్వంకు సంకేతాలు పంపే ప్రయత్నం చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఇద్దరూ కొంతకాలం పాటు సర్దుబాటు ధోరణితో వ్యవహరించే అవకాశం ఉంటుందని అంటున్నారు. మరోవైపు అన్నాడీఎంకేలో జరిగే చిన్న పరిణామాలను కూడా ప్రతిపక్ష డీఎంకే పార్టీ నిశితంగా గమనిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆశీస్సులు ఎంత ఉన్నప్పటికీ అన్నా డీఎంకేలోని కలహాల కుంపటి ఆర్పడం వీలు కాదనీ, అరుుతే ఇది తమకు ఎంత మేరకు కలిసొస్తుందని మాత్రం ఇప్పుడే చెప్పలేమని డీఎంకే నేతలు అంటున్నారు. కాగా జయలలిత మరణం తమిళనాడులో సరికొత్త రాజకీయ సమీకరణలకు దారితీసే అవకాశాలు కొట్టి పారేయలేమని విశ్లేషకులంటున్నారు. టీ దుకాణం యజమాని నుంచి సీఎం దాకా... తమిళనాడు రాష్ట్రం తేని జిల్లా పెరియకులం గ్రామానికి చెందిన ఒట్టికార దేవర్, పళనియమ్మాల్‌కు 1951 జనవరి 14వ తేదీ పన్నీర్‌సెల్వం జన్మించారు. గ్రాడ్యుయేషన్ వరకు చదువుకున్న ఆయన వారసత్వంగా వచ్చిన కొంత వ్యవసాయ భూమిలో వ్యవసాయం చేస్తూ పెరియకులంలో టీ దుకాణం నిర్వహించే వారు. ఎంజీ రామచంద్రన్ అభిమాని అరుున సెల్వం అనూహ్య పరిణామాల నేపథ్యంలో 1996లో పెరియకులం మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 2001 ఎన్నికల్లో అమ్మ ఆశీస్సులతో బోడినాయకనూరు నుంచి అన్నాడీఎంకే అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అప్పటినుంచే జయకు నమ్మినబంటుగా మారారు. -
1 నుంచి జాతీయ ఆహార భద్రతా చట్టం
కేంద్ర పథకానికి రాష్ట్రం తోడు సాక్షి ప్రతినిధి, చెన్నై: కేంద్ర ప్రభుత్వ జాతీయ ఆహార భద్రతా చట్టం వచ్చే నెల 1వ తేదీ నుంచి తమిళనాడులో అమలులోకి రానుంది. రేషన్‌కార్డుదారులకు అదనంగా ఉచిత బియ్యం అందనుంది. ముఖ్యమంత్రి జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ప్రభుత్వాన్ని నడిపించే బాధ్యతలు నిర్వర్తిస్తున్న మంత్రి పన్నీర్ సెల్వం ఈనెల 24వ తేదీన సచివాలయంలో కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సహచర మంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో జాతీయ ఆహారభద్రతా చట్టం అమలు చేయాలన్న అంశం కూడా ఒకటి. ఈ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు ప్రభుత్వం గతంలో వ్యతిరేకత వ్యక్తం చేసింది. జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని రాష్ట్రంలో వెంటనే అమలు చేయాలని, లేని పక్షంలో ప్రస్తుతం దారిద్రరేఖకు ఎగువన ఉన్న కుటుంబాలకు రేషన్ దుకాణాల ద్వారా అందజేసే బియ్యాన్ని కిలో రూ.8.30లకు బదులుగా రూ.22.54లకు సరఫరా చేయగలమని కేంద్రం స్పష్టం చేసింది. ప్రజా పంపిణీకి 3.23 ల క్షల మెట్రిక్ టన్నులు అవసరం. అరుుతే నెలకు 2.96 లక్షల టన్నుల బియ్యాన్ని మాత్రమే కేం ద్రం ఇస్తోంది. అదనంగా అవసరమవుతున్న 27,969 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఈ ఏడాది జూలై తరువాత నుంచి నిలిపివేసింది. దీంతో రాష్ట్రానికి 38.93 లక్షల మెట్రిక్ టన్నుల బియాన్ని సమకూర్చుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వంపై రూ.2,393 కోట్లు అదనంగా భారం పడుతోంది. ఈ ఆహారభద్రతా చట్టాన్ని యథాతథంగా అమలు చేసిన పక్షంలో రాష్ట్రంలోని 50.55 శాతం ప్రజలు మాత్రమే లబ్ధిపొందగలరు. జాతీయ చట్టాన్ని తమిళనాడు అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసి అమలు చేయాలని రాష్ట్రం భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు భారమైనా రేషన్‌కార్డు దారులంతా చౌకధర బియ్యాన్ని పొందేలా మార్పులు చేశారు. ఈ చట్టం ప్రస్తుతం తమిళనాడులో అమలులో ఉన్నా జాతీయ స్థారుులో అనుసంధానం కావడం వల్ల బియ్యం సరఫరాలో రాష్ట్రవాటాతో పాటు కేంద్ర వాటా కూడా చేరుతుంది. జాతీయ చట్టం కింద ఒక కుటుంబంలో ఒక మనిషి మాత్రమే ఉంటే నెలకు 5 కిలోల బియ్యం ఇవ్వాల్సి ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం 12 కిలోల అందజేస్తోంది. అలాగే ఇద్దరికి 10కిలోలకుగానూ 16 కిలోలు అందజేయడం కొనసాగుతుంది. ఒక కుటుంబానికి రూ.20 కిలోల బియ్యం అందుతుండగా, ఇకపై 25 కిలోల చొప్పున అందజేస్తారు. అలాగే ఒక కుటుంబంలో 7 మంది సభ్యులు ఉంటే 35 కిలోలు, 10 మంది ఉంటే 50 కిలోలు అందజేస్తారు. అంత్యోదయా అన్నయోజన పథకం కింద ప్రస్తుతం అందజేస్తున్న 35 కిలోల ఉచిత బియ్యం యథావిధిగా పొందవచ్చు. -
జయకు గవర్నర్ పరామర్శ
- సీఎం కోలుకోవడంపై హర్షం.. వైద్యులను అభినందించిన విద్యాసాగర్‌రావు - పరిస్థితి వివరించిన అపోలో చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సీ రెడ్డి సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు సీఎం జయలలిత దాదాపుగా కోలుకున్న నేపథ్యంలో తమిళనాడు ఇన్‌చార్జ్జి గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు శనివారం అపోలో ఆస్పత్రికి వెళ్లారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. జయలలిత అనారోగ్యంపై గత నెల 30వ తేదీన అనేక వదంతులు వ్యాపించడంతో ఈనెల 1వ తేదీ రాత్రి విద్యాసాగర్‌రావు హుటాహుటిన ముంబయి నుంచి చెన్నై చేరుకుని నేరుగా అపోలోకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత శనివారం ఉదయం 11.30 గంటలకు రెండోసారి ఆయన ఆస్పత్రికి వచ్చారు. పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురై, మంత్రులు పన్నీర్ సెల్వం, తంగమణి, వేలుమణి, డాక్టర్ విజయభాస్కర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.రామమోహన్‌రావు, ప్రభుత్వ గౌరవ సలహాదారు షీలా బాలకృష్ణన్, ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ రాధాకృష్ణన్ తదితరులతో మాట్లాడి సీఎం ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మంత్రుల బృందం గవర్నర్‌ను సీఎంకు చికిత్స సాగుతున్న రెండో అంతస్తులోని వార్డుకు తీసుకె ళ్లింది. అయితే జయ ఉన్న గదిలోకి గవర్నర్ వెళ్లలేదు. అపోలో చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సీ రెడ్డి.. సీఎంకు అందిస్తున్న చికిత్స గురించి గవర్నర్‌కు వివరించారు. జయలలిత బాగా మాట్లాడుతున్నారని చెప్పారు. అర గంటపాటు ఆస్పత్రిలో గడిపిన గవర్నర్ 12 గంటలకు తిరిగి వెళ్లిపోయారు. అనంతరం వైద్యుల బృందం కృషిని అభినందిస్తూ రాజ్‌భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.జయలలిత పూర్తిగా కోలుకోవాలని మంత్రులు, అన్నాడీఎంకే కార్యకర్తలు శనివారం కూడా ప్రత్యేక పూజలు జరిపారు. ఎంపీ విజయకుమార్.. చెన్నై రాణీమేరి కళాశాలలో 1500 మంది విద్యార్థినులతో కలిసి ప్రార్థనలు చేశారు. -
మరింత మెరుగ్గా జయ ఆరోగ్యం!
-
మరింత మెరుగ్గా జయ ఆరోగ్యం!
- మాట్లాడేందుకు ప్రయత్నించిన సీఎం - మాజీ గవర్నర్ రోశయ్య,కరుణానిధి సతీమణి రాజాత్తి అమ్మాళ్ పరామర్శ - జయ ఆరోగ్యంపై బెంగతో మరొకరు ఆత్మహత్య సాక్షి ప్రతినిధి, చెన్నై: అపోలో ఆస్పత్రిలో 23 రోజులగా చికిత్స పొందుతున్న ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం శుక్రవారం నాటికి మరింత మెరుగుపడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. చిన్నపాటి గొంతుతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. లండన్ నుంచి వచ్చిన వైద్య నిపుణుడు డాక్టర్ రిచర్డ్ జాన్ బిలే, ఢిల్లీ నుంచి ఎయిమ్స్ వైద్యుల బృందం రోజుకు రెండుసార్లు అపోలో వద్దకు వచ్చి జయ పరిస్థితిని పరిశీలిస్తున్నారు. చికిత్సకు జయలలిత స్పందిస్తున్నందున అవసరమైనపుడు మాత్రమే వెంటిలేటర్‌ను అమరుస్తున్నారు.కాగా తమిళనాడు రాజకీయాల్లో కేంద్రం జోక్యం చేసుకోదని హోంశాఖ ఉన్నతాధికారి స్పష్టం చేశారు.సీఎం జయ అనారోగ్యంపై అవమానకరంగా మాట్లాడిన నేరంపై కోయంబత్తూరు జిల్లాకు చెందిన సురేష్, రమేష్ అనే ఇద్దరు బ్యాంకు ఉద్యోగులను శుక్రవారం అరెస్ట్ చేశారు. జయలలిత ఆరోగ్యంపై దిగులుపెట్టుకున్న మరో ఇద్దరు అన్నాడీఎంకే కార్యకర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఒకరు మృతి చెందగా.. మరొకరు చికిత్స పొందుతున్నారు. నేరుగా చూడలేదు: రోశయ్య ముఖ్యమంత్రి జయలలితను పరామర్శించేందుకు తమిళనాడు మాజీ గవర్నర్ కే రోశయ్య శుక్రవారం రాత్రి అపోలో ఆస్పత్రికి వచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, జయలలిత వద్దకు ఎవ్వరినీ అనుమతించడం లేదనీ, తనకూ నేరుగా చూసే అవకాశం కలగలేదన్నారు. వైద్యుల సమాచారం ప్రకారం ఆమె బాగా కోలుకుంటున్నారని చెప్పారు. సీఎంగా జయ మళ్లీ బాధ్యతలు స్వీకరించి రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి సతీమణి రాజాత్తి అమ్మాళ్ కూడా శుక్రవారం ఆస్పత్రికి వచ్చారు. శశికళను కలుసుకుని మాట్లాడారు. కాగా అమ్మ కోలుకోవాలని కోరుకుంటూ అన్నాడీఎంకే నేతలు అనేక ఆలయాల్లో ప్రార్థనలు, పేదలకు అన్నదానాలు నిర్వహించారు. పన్నీర్ సెల్వంతోస్టాలిన్ భేటీ ప్రతిపక్ష నేత స్టాలిన్ శుక్రవారం ఉదయం సచివాలయంలో మంత్రి పన్నీర్ సెల్వంతో భేటీ అయ్యారు.రాష్ట్రంలోని రైతన్నల కన్నీరు తుడవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కావేరీ అంశంలో ప్రజలు ఏకతాటిపై ఉన్నారని కేంద్రానికి తెలియజేయాలని, సుప్రీం తీర్పును కర్ణాటక ప్రభుత్వం ధిక్కరించడాన్ని తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా ఖండించే విధంగా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. అసెంబ్లీ అత్యవసర సమావేశాలు జరిపి కావేరీపై తీర్మానాన్ని ఆమోదించాలని డీఎంకే చేసిన తీర్మానాల ప్రతిని పన్నీర్ సెల్వంకు అందజేశానని స్టాలిన్ చెప్పారు. -
కమల్ ఇంటికి కరెంట్ కట్
-
కమల్ ఇంటికి కరెంట్ కట్
చెన్నై వరద బాధితులకు సహాయక చర్యలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించిన ఫలితంగా హీరో కమల్‌హసన్ మూల్యం చెల్లించుకున్నాడు. ఈ సూపర్ స్టార్ ఇంటికి కరెంటు కట్ చేసినట్లు చెన్నై వర్గాలు చెబుతున్నాయి. వరద బాధితులను ఆదుకోండి అంటూ ప్రభుత్వం ప్రకటనలు చేయడం పట్ల కమల్ విమర్శలు చేశారు. పన్నుల రూపేణ ప్రజలు చెల్లిస్తున్న డబ్బు ఎక్కడికి పోయిందని ఆయన ప్రశ్నించారు. అయితే కమల్ చేసిన విమర్శ ప్రజల్లోనూ, అధికార అన్నాడీఎంకేలో కలకలం రేపింది. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఆర్థిక మంత్రి ఓ.పన్నీర్ సెల్వం ఏకంగా ఆరు పేజీల బహిరంగ ప్రకటనతో కమల్‌పై విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో ఈ నెల 1 నుంచి 8వ తేదీ వరకు కమల్ ఇల్లు, కార్యాలయం ఉన్న ఆళ్వార్‌పేట ఎల్డామ్స్రోడ్డులో విద్యుత్ నిలిపివేశారు. తాను బహిరంగంగా విమర్శించలేదని, ఒక మీడియా మిత్రునికి ఈ-మెయిల్ మాత్రమే ఇచ్చానని 7వ తేదీన కమల్ వివరణ ఇచ్చుకోవడంతోపాటూ క్షమాపణ కోరారు. ఆ మరుసటి రోజే అధికారులు కమల్ హాసన్ ఇంటికి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. కమల్‌పై కక్ష సాధించేందుకు విద్యుత్ సరఫరా నిలిపివేశారని.. పెద్దల రాజకీయాలకు తాము ఇబ్బంది పడ్డామని ఆళ్వార్ పేట వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
మిస్డ్ కాల్ వివాహం
టీనగర్: చెన్నై తిరువొత్తియూరు కాలడిపేట మేట్టు వీధికి చెందిన పన్నీర్ సెల్వం. ఇతని కుమార్తె కలైవాణి (24). ఈమెకు, పన్నీర్ సెల్వం బంధువు కుమారునికి కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. రెండేళ్లయినప్పటికీ వీరికి సంతానం కలగలేదు. దీంతో భార్యాభర్తల మధ్య అభిప్రాయభేదాలు ఏర్పడ్డాయి. కొన్ని నెలల క్రితం కలైవాణి భర్తను విడిచి పుట్టింటికి చే రిది. ఈనెల మూడవ తేదీన ఆమె ఇంట్లోనుంచి హఠాత్తుగా మాయమైంది. తిరువొత్తియూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు. దీంతో ఆమె కన్యాకుమారి జిల్లా, కుళచ్చల్ ప్రాం తంలో వున్నట్లు తెలిసింది. దీంతో తిరువొత్తియూరు పోలీసులు కుళచ్చల్ వెళ్లి స్థానిక పోలీసుల సాయంతో వారున్న చోటును గుర్తించారు. అక్కడ కలైవాణి, కుళచ్చల్ పండగశాలైపురానికి చెందిన అబుదాగీర్ (28) అనే యువకుడు ఉన్నారు. పోలీసులు వారి వద్ద విచారణ జరపగా తమ మధ్య మిస్డ్‌కాల్‌తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారినట్లు తెలిపారు. వారు అక్కడ రిజిస్టర్ వివాహం చేసుకున్నట్లు పేర్కొన్నారు. కలైవాణి తన పేరును ఆలియాగా మార్పుకున్నట్లు తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న కలైవాణి బంధువులు కుళచ్చల్ చేరుకున్నారు. ఆమె తల్లిదండ్రులు తమ వెంట రమ్మని ఆమెను కోరారు. అందుకు కలైవాణి సమ్మతించక అబుదాగీర్‌తోనే జీవిస్తానని తెలిపింది. వీరిని తిరువొత్తియూరు కోర్టులో జూన్ రెండవ తేదీన హాజరుపరచనున్నారు. -
రంగంలోకి ‘అమ్మ’
అప్పీలు పిటిషన్ దాఖలు వ్యవహారాల ప్రక్రియ ముగియడంతో ఇక ప్రభుత్వ పాలన, పార్టీ మీద అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత దృష్టి పెట్టారు. ప్రభుత్వ వ్యవహారాల్ని, పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను పరిశీలించే పనిలో తలమునకలై ఉన్నారు. పలువురు మంత్రుల్ని పిలిచి క్లాస్ పీకడంతో పాటుగా వారి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసి హెచ్చరించి పంపినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. సాక్షి, చెన్నై : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అండ్ బృందానికి జైలు శిక్ష పడ్డ విషయం తెలిసిందే. బెయిల్ మీద బయటకు వచ్చిన జయలలిత పోయేస్ గార్డెన్‌కు పరిమితమయ్యారు. సీఎం పన్నీరు సెల్వం, నలుగురు మంత్రులతో తప్ప, మిగిలినెవ్వరితోను సంప్రదింపులు జరపడం లేదు. అవసరం అనుకుంటే ఆ నలుగురు మంత్రుల్ని పోయేస్ గార్డెన్‌కు పిలిపించడం లేకుంటే పన్నీరు సెల్వం, సలహాదారు షీలా బాలకృష్ణన్‌తో మాత్రమే సమీక్షిస్తున్నారు. జయలలిత ప్రభుత్వ వ్యవహారాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టని దృష్ట్యా, పన్నీరు ప్రభుత్వం గాడి తప్పిందంటూ ప్రతిపక్షాలు విమర్శించే పరిస్థితులు నెలకొన్నాయి. రంగంలోకి.. : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తనకు పడ్డ శిక్షను వ్యతిరేకిస్తూ అప్పీలు పిటిషన్ దాఖలు చేసే పనిలో జయలలిత ఇన్నాళ్లు నిమగ్నమయ్యూరు. వేలాది పేజీలతో కూడిన అప్పీలు పిటిషన్‌లోని వివరాలన్నీ పరిశీలించాల్సి రావడంతో జయలలిత ప్రభుత్వ వ్యవహారాల్లో ఇన్నాళ్లు పూర్తి స్థాయిలో జోక్యం చేసుకోలేక పోయారని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. తాజాగా, కర్ణాటక హైకోర్టులో అప్పీలు పిటిషన్ దాఖలు చేయడంతో ఇక, పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలపై దృష్టి పెట్టేందుకు ఆమె సిద్ధమయ్యారు. అప్పీలు పిటిషన్ దాఖలు సజావుగా ముగియడంతో మంత్రులు, పార్టీ వర్గాల పని తీరును పరిశీలించడం మొదలెట్టారు. సీఎం పన్నీరు సెల్వం, సలహాదారులు షీలా బాలకృష్ణన్, రామానుజం, మంత్రులందర్నీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మరుసటి రోజు రాత్రి పోయెస్ గార్డెన్‌కు పిలిపించారు. క్లాస్ : ప్రభుత్వ వ్యవహారాలను పరిశీలించి, ప్రభుత్వ ఆదాయం పెంపు లక్ష్యంగా కొన్ని సూచనల్ని సలహాల్ని ఇచ్చారు. కుంటు పడ్డ పథకాల్ని కొనసాగించేందుకు ఆగమేఘాలపై చర్యలు తీసుకునే రీతిలో సూచించారు. కొందరు మంత్రుల పనితీరు మీద తీవ్ర ఆగ్రహాన్ని ఆమె వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇటీవల తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు ఆనందన్, షణ్ముగనాథన్‌ను తీవ్రంగా మందలించినట్టు తెలుస్తోంది. చక్కెర పరిశ్రమల కార్మికుల సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టని మంత్రి తంగమణి, తమ తమ శాఖల్లో పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందంటూ మంత్రులు వలర్మతి, పూనాక్షిలను మందలించారు. అలాగే , పార్టీ సంస్థాగత ఎన్నికలపై జిల్లాల వారీగా సమాచారం సేకరించిన జయలలిత ఏదేని వివాదాలు బయలు దేరినా, ఘర్షణలు చోటు చేసుకున్నా మూకుమ్మడిగా అందర్నీ బయటకు పంపించాల్సి ఉంటుందని ఆయా జిల్లాల ఇన్చార్జ్ మంత్రులకు హెచ్చరికలు చేసినట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. తమ అమ్మ జయలలిత పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల మీద దృష్టి పెట్టడంతో నెలరోజుల వ్యవధిలో పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా ఎవరెవ్వరు ఏఏ తప్పులు చేశారో వాటిని ఫిర్యాదుల రూపంలో జయలలితకు పంపిం చేందుకు పలువురు నాయకులు సిద్ధమయ్యారు. జయలలిత కొందరు మంత్రుల్ని తీవ్రంగా మందలించిన సంకేతాలతో త్వరలో మంత్రి వర్గం లో మార్పులు తప్పని సరి..! అన్న చర్చ అన్నాడీఎంకేలో మొదలైంది. -
అతిథి ముఖ్యమంత్రులు
‘ఏక్ దిన్కా సుల్తాన్’! ఈ పేరుతో చాటుమాటుగా పిలిపించుకునే దురదృష్టవంతుల తెగ ఒకటి భారత రాజకీయాలలో కనిపిస్తూ ఉంటుంది. వీరి పదవీ వైభోగం మరీ క్షణికం కాదుగానీ, దక్కిన ఆ హోదాను బట్టి విశ్లేషకులు అలా ముద్దుగా పిలుస్తూ ఉంటారు. అధిరోహించిన పదవిని పూర్తిస్థాయిలో చలాయించే అవకాశం గానీ, పూర్తికాలం అనుభవించే అదృష్టం కానీ వీరికి సాధారణంగా ఉండవు. వెండితెర మీద అతిథి పాత్రల్లా వస్తారు. అలాగే నిష్ర్కమిస్తారు. ఇలాంటి త్రిశంకుయోగం అడపా దడపా ప్రధాని పదవికి, సర్వ సాధారణంగా ముఖ్యమంత్రి పదవికి పడుతూ ఉంటుంది. వారిలో కొందరు తరువాత ముఖ్యమంత్రి పదవిని పూర్తి స్థాయిలో దక్కించుకుని ఉండొచ్చు. అలాంటి అదృష్టవంతులు లేకపోలేదు కూడా. లేదా పూర్తిగా కనుమరుగైపోవచ్చు. అలా అని వీరిని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అని కూడా పిలవరు. కాబట్టి అతిథి ముఖ్యమంత్రి అని పిలుచుకోవచ్చు. అలాంటి అతిథులే ఈవారం మన ‘వివరం’. ఈ సెప్టెంబర్ ఆఖరున తమిళనాడుకు ఇలాంటి అతిథి ముఖ్యమంత్రి పదవీ స్వీకారం చేశారు. ఆయన పేరు పన్నీర్‌సెల్వం. 2016లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరిగే వరకు ఆయనే పదవిలో కొనసాగే అవకాశం మెండుగా ఉంది. సీబీఐ ప్రత్యేక కోర్టు జైలు శిక్ష విధించడం వల్ల జయలలిత శాసనసభ్యత్వం రద్దయింది. కాబట్టి గతంలో మాదిరిగా ఆమె జైలు నుంచి రాగానే సెల్వం కుర్చీ ఖాళీ చేయవలసిన అవసరం ఇప్పటికి లేదు. ఇలాంటి అతిథి ముఖ్యమంత్రులు భారత రాజకీయాలలో కోకొల్లలు. అన్ని రాష్ట్రాలలోను వీరి ఉనికి కనిపిస్తుంది. ఒక రాజకీయ సంక్షోభంలో ఆ పదవిని చేపడతారు కాబట్టి ఇలాంటి వారి పేర్లను చరిత్ర గుర్తు పెట్టుకుంటూ ఉంటుంది. తమిళ రాజకీయాలకీ, సినిమా రంగానికీ మధ్య బంధం విడదీయలేనిది. రాజకీయాలలో, రాజకీయ నేతల లో సినిమా పోకడలు ఇబ్బడిముబ్బడిగా ఉంటాయి. జయలలిత సంగతే తీసుకుందాం. ఆమె ప్రజలకి అభివాదం చేసే తీరు, గజగమనిలా ఠీవిగా నడిచి వచ్చే తీరు, ముఖంలో సందర్భానికి తగ్గట్టు తూకం వేసినట్టు ఉండే చిరునవ్వు లేదా గాంభీర్యం అంతా ఒక మహారాణి పాత్ర మీద చిత్రీకరిస్తున్న సినిమా దృశ్యాలని గుర్తుకు తెస్తుంది. ఆమె వస్తున్నపుడు అమాత్యులూ ఎమ్మెల్యేలూ, పార్టీ నాయకులూ బారులు తీరి, అమ్మవారి పాదాలపై మోపడానికి తొందరపడుతున్నట్టు ఉండే శిరస్సులతో నిమిషాల కొద్దీ వంగి ఉండే దృశ్యాలు కూడా ద్రవిడ రాజకీయాలకు ప్రత్యేకం. ఆఖరికి అక్కడి ప్రజల ప్రేమాభిమానాలు కూడా సినిమా టైపులోనే ఉంటాయి. ఇక్కడ అతిథి ముఖ్యమంత్రులు అచ్చంగా అతిథి పాత్రలను పోలి ఉండడం వింతేమీ కాదు. 65 కోట్ల రూపాయల అవినీతి ఆరోపణల మీద పురచ్చితలైవి జయలలిత ముఖ్యమంత్రి పదవి కోల్పోయిన తరువాత పన్నీర్‌సెల్వం అనే ఈ వీర విధేయుడు ముఖ్యమంత్రి అయిన తీరు, ప్రమాణ స్వీకార వేళ పన్నీరు కన్నీరు మున్నీరుగా విలపించిన దృశ్యం, తరువాత ప్రమాణాలు చేసిన మంత్రివర్గ సభ్యుల ఏడుపుల కోరస్ - సర్వం వెండితెర దృశ్యమాలికనే తలపించింది. పన్నీర్‌సెల్వం అతిథి ముఖ్యమంత్రిగా రెండుసార్లు పనిచేశారు. ఆ రెండు సందర్భాలు జయలలిత అవినీతి ఆరోపణల మీద జైలుకు వెళ్లినప్పటివే కావడం విశేషం. మే 14, 2001లో ముఖ్యమంత్రి అయిన జయ సెప్టెంబర్ 21, 2001న అంటే, ఆరుమాసాలు కూడా పూర్తికాకుండానే అరెస్టయ్యారు. అప్పుడు మొదటిసారి పన్నీర్‌సెల్వం 21 సెప్టెంబర్ 2001 నుంచి మార్చి1, 2002 వరకు ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వర్తించారు. మళ్లీ సెప్టెంబర్ 29, 2014న అదే దృశ్యం రిపీట్ అయింది. ఆమె జైలుకు వె ళ్లారు. సెల్వం తాత్కాలిక ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. 2016లో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వరకు ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే గతంలో మాదిరిగా జయ బెయిల్ మీద బయటకు వచ్చినా, ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశం లేదు. తమిళనాడు ఇటీవలి తమిళ రాజకీయాల నేపథ్యంలో చూస్తే వీఆర్ నెడుంజెళియన్ అనే పెద్దాయన తాత్కాలిక ముఖ్యమంత్రి పదవి చేపట్టిన సందర్భం కనిపిస్తుంది. 1984-85 ప్రాంతంలో అప్పటి ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ ఆస్పత్రిలో చేరారు. అప్పుడు మంత్రివర్గ సమావేశాలకు వీఆర్ అధ్యక్షత వహించేవారు. ఆ సేవలు వృథా కాలేదు. 1987లో ఎంజీఆర్ కన్నుమూసినపుడు వీఆర్ ‘యాక్టింగ్ సీఎం’గా వ్యవహరించారు. తరువాత అన్నా డీఎంకేలో వారసత్వ పోరు రణరంగాన్ని తలపించింది. ఒకవైపు జయలలిత, ఇంకొకవైపు ఎంజీఆర్ భార్య జానకీ రామచంద్రన్ ఆధిపత్యం కోసం పోటీ పడ్డారు. నిన్నటిదాకా పార్టీలో తిరుగులేని నేతగా ఉన్న జయకు అప్పుడు చుక్కెదురైంది. ముఖ్యమంత్రి పదవికి జానకితో పోటీ పడిన నెడుంజెళియన్ కూడా ఓడిపోయారు. అయితే పూర్తిస్థాయి ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన జానకిని రాజకీయ కారణాలు అతిథిపాత్రకు పరిమితం చేశాయి. జనవరి 7, 1988న పదవీ స్వీకారం చేసిన జానకి ఆ జనవరి 30న పదవిని కోల్పోయారు. ఆమె ప్రభుత్వాన్ని రాజీవ్‌గాంధీ బర్తరఫ్ చేశారు. 24 రోజులు ముఖ్యమంత్రిగా పనిచేసిన జానకి ‘తమిళనాడు తొలి మహిళా ముఖ్యమంత్రి’ అన్న ఒక్క ప్రత్యేకతను తప్ప మరేదీ మిగుల్చుకోలేదు. తరువాత ఎన్నికలలో ఆమె నాయకత్వంలోని అన్నాడీఎంకె వర్గం ఓడిపోయింది. ఆంధ్రప్రదేశ్ ఇలా వచ్చి, అలా వెళ్లిపోయిన ముఖ్యమంత్రులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా విరివిగా కనిపిస్తారు. ఇందిర ప్రధానిగా ఉన్నపుడు ముఖ్యమంత్రులను పేకముక్కల్లా మారుస్తారని ఒక విమర్శ ఉండేది. అలాంటి అనేక పేకముక్కలలో భవనం వెంకటరామ్ కూడా ఒకరు. ఫిబ్రవరి 24, 1982న పదవిని చేపట్టిన భవనం ఆ సంవత్సరం సెప్టెంబర్ 20న రాజీనామా చేశారు. తెలుగుదేశం అధినేత ఎన్టీఆర్ జీవితంలోని ‘వెన్నుపోటు -1’ లేదా ‘ఆగస్ట్ సంక్షోభం’ తరువాత ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నాదెండ్ల భాస్కరరావు సరిగ్గా ఒక్కమాసమే ఆ పదవిలో (ఆగస్ట్ 16-సెప్టెంబర్ 16, 1984) ఉన్నారు. నిజానికి నాదెండ్ల ‘అనుకోని’ అతిథి ముఖ్యమంత్రి. రోశయ్య అచ్చమైన స్టాప్ గ్యాప్ ముఖ్యమంత్రి కోవలోకి వస్తారు. కేరళ దక్షిణాదిన రాజకీయ అస్థిరతకు మారుపేరు కేరళ. అత్యవసర పరిస్థితి తరువాత అక్కడ ముఖ్యమంత్రులు తరుచు మారిపోతూ ఉండేవారు. అక్కడ లెఫ్ట్ కూటమి లేదా కాంగ్రెస్ నాయకత్వంలోని డెమాక్రటిక్ కూటమి అధికారంలోకి వస్తూ ఉండేవి. కాంగ్రెస్ హయాంలో ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి మారిపోతాడో ఎవరికీ తెలిసేది కాదు. నిజానికి అక్కడ ఈ సంస్కృతి 1947లోనే ఆరంభ మైంది. ఆగస్ట్ 14, 1947న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన పినంపిల్లి గోవింద మేనన్ కేవలం 51 రోజులే ఆ పదవిలో ఉండి, అక్టోబర్ 22న వైదొలిగారు. సంకీర్ణ రాజకీయాలను నడపడం ఎలాగో దేశానికి నేర్పిన వాడు కె. కరుణాకరన్ కావచ్చు. కానీ ఈయన మొదటి సారి మార్చి 25, 1977న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. కానీ 32 రోజులకే ఏప్రిల్ 25న రాజీనామా చేశారు. తరువాత రెండుసార్లు ముఖ్యమంత్రి పదవిని చేపట్టి దాదాపు 11 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. ముస్లిం లీగ్ నాయకుడు సీహెచ్ మహ్మద్ కొయ అక్టోబర్ 12, 1979న ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసి, 51 రోజుల తరువాత డిసెంబర్ 1న వైదొలిగారు. కేరళ వామపక్ష పాలనలో కూడా ఇలాంటి ఉదాహరణ ఒకటి కనిపిస్తుంది. ఈకే నాయనార్ డిసెంబర్ 28, 1981న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 81 రోజలు తరువాత మార్చి 17, 1982న వైదొలిగారు. పక్కనే ఉన్న కర్ణాటకలో కూడా కదిదల్ మాంజప్ప ఉదాహరణ ఇలాంటిదే. మాంజప్ప ఆగస్ట్ 19, 1956న ప్రమాణం చేసి 73 రోజుల తరువాత అక్టోబర్ 31న రాజీనామా చేశారు. ఈయన కర్ణాటక మూడో ముఖ్యమంత్రి. ఈయన ముందు ముఖ్యమంత్రిగా పని చేసిన హనుమంతయ్య రాజీనామాతో తాత్కాలికంగా మాంజప్పను నియమించారు. అయితే అదే రాష్ట్రంలో ఎస్ ఆర్ కాంతి ఉదాహరణ మరో విధంగా ఉంది. ఈయన మార్చి 14, 1962న ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి, జూన్ 20న త్యజించారు. ఇంకొక్క రెండు రోజులు ఉంటే వందరోజులు పూర్తయ్యేవి. మధ్యప్రదేశ్ ఇందిరా గాంధీ హయాంలో ముఖ్యమంత్రుల తీరు మీద అనేక వ్యంగ్యాస్త్రాలు ఉండేవి. మధ్యప్రదేశ్‌లో నరేశ్ చంద్రసింగ్ మార్చి 13, 1969న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి, సరిగ్గా 13 రోజులకి మార్చి 25న బుద్ధిగా రాజీనామా చేసి వెళ్లిపోయారు. రవిశంకర్ శుక్లా అనే మరో కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా నవంబర్ 1, 1956న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 61 రోజుల తరువాత డిసెంబర్ 31న పదవీ త్యాగం చేశారు. అంటే నెహ్రూ హయాంలోనూ ఇలాంటి విన్యాసాలకు లోటు లేదు. మధ్యప్రదేశ్‌లోనే జనవరి 1, 1957న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన భగవంతరావ్ మాండ్లోయ్ జనవరి 31కి రాజీనామా చేయవలసి వచ్చింది. అయితే ఈయనకు 1962లో మరో అవకాశం వచ్చి రెండేళ్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. ఉత్తర ప్రదేశ్‌లో చంద్రభాను గుప్త మార్చి 14, 1967న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి 19 రోజులు పనిచేసి ఏప్రిల్ 2న వైదొలిగారు. సుందర్‌లాల్ పట్వా ఎంపీ ముఖ్యమంత్రిగా రెండుసార్లు పని చేశారు. మొదటిసారి జనతా పార్టీ అభ్యర్థిగాను, తరువాత బీజేపీ ముఖ్యమంత్రిగాను పదవిని అలంకరించారు. అయితే మొదటిసారి జనవరి 20, 1980న పదవి స్వీకరించి 29 రోజులకే ఫిబ్రవరి 17న రాజీనామా చేశారు. మళ్లీ 1990 లో బీజేపీ ముఖ్యమంత్రిగా రెండేళ్లు పనిచేశారు. రాజస్థాన్, మహారాష్ట్ర రాజస్థాన్‌లో శివచరణ్ మాధుర్ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగిన తరువాత హీరాలాల్ దేవ్‌పురా అనే కాంగ్రెస్ నాయకుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. మళ్లీ హరిదేవ్ జోషిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టే వరకు మాత్రమే దేవ్‌పురా అధికారంలో ఉన్నారు. దేవ్‌పురా వైభవం ఫిబ్రవరి 23- మార్చి 10, 1985 వరకే. అంటే పదహారు రోజుల పండగ. మహారాష్ట్రలో మరుత్రావ్ కన్నమ్వార్ మరణంతో ముఖ్యమంత్రిగా పీకే సావంత్ నవంబర్ 25న ప్రమాణస్వీకారం చేశారు. సరిగ్గా పదకొండు రోజుల తరువాత అంటే డిసెంబర్ 4న పూర్తి స్థాయి ముఖ్యమంత్రి కోసం సీటు ఖాళీ చేస్తూ పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీ ఢిల్లీ రాష్ట్రం ఏర్పడిన తొలి దశలో కొంత రాజకీయ అనిశ్చితి కనిపిస్తుంది. బీజేపీ అక్కడ అధికారం చేపట్టినా ముఖ్యమంత్రులను మార్చడం, అంతర్గత కలహాల విషయంలో కాంగ్రెస్‌కు తీసిపోదని సంకేతాలు ఇచ్చినట్టు వ్యవహరించింది. 1993లో అధికారం చేపట్టిన తరువాత 1996 వరకు మదన్‌లాల్ ఖురానా ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. తరువాత అంతర్గత కలహాలతో ఖురానా వైదొలగి, 1996 నుంచి 1998 అక్టోబర్ వరకు సాహెబ్ సింగ్ వర్మ సీఎం పదవిని చేపట్టారు. ఇక ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో నష్ట నివారణ చర్యలు తీసుకుందామని బీజేపీ అక్టోబర్ 12, 1998న ఆ పార్టీ ప్రముఖురాలు, అప్పుడు వాజపేయి మంత్రివర్గంలో పని చేస్తున్న సుష్మ స్వరాజ్‌కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించారు. ఆమె కేవలం 52 రోజులు ఆ పదవిలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఘోర పరాజయం పాలు కావడంతో ఆమె డిసెంబర్ 3న రాజీనామా చేశారు. ఐదు నిముషాల ముఖ్యమంత్రి మొన్నటి లోక్‌సభ ఎన్నికలలో జేడీ(యు) ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ రాజీనామా చేశారు. తరువాత జీతన్ రామ్ మాంఝీ ముఖ్యమంత్రి అయ్యారు. సీఎం పదవి స్వీకరించమని ఈ సంవత్సరం మే 19వ తేదీన నితీశ్ కుమార్ జీతన్‌రామ్‌ను ఆదేశించారు. జీతన్ నితీశ్ మంత్రివర్గంలో ఎస్సీ,ఎస్టీ సంక్షేమ మంత్రి. ఆయన కూడా దళితుడే. ఆ పదవికి తననే ఎందుకు ఎంపిక చేశారని మాత్రం జీతన్ ప్రశ్నించలేదు. అయితే ఆ పదవిలో తాను ఉండేది ఎంతకాలం? అన్న మాటను కూడా నిక్షిప్తం చేసి ఒక ప్రశ్నను సంధించారు జీతన్. ‘‘ఇది దశరథ్ బాబాకు ఇచ్చిన అవకాశం వంటిదేనా?’’- అదీ ప్రశ్న. ఎవరీ దశరథ్ బాబా? లేదా దశరథ్ మాంఝీ. ఈయనే బీహార్‌కు ఐదు నిముషాల ముఖ్యమంత్రి. గయ సమీపంలోని ఘెలార్ గ్రామానికి చెందిన దశరథ్ 2007లో నితీశ్ కుమార్ నిర్వహించిన ప్రజా దర్బార్‌కు హాజరయ్యారు. ఆయనను చూసి పరమానందభరితుడైన ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్, ‘ఓ ఐదు నిముషాలు నీవే ముఖ్యమంత్రివ’ని తన కుర్చీ మీద కూర్చోబెట్టారు. ఇంతకీ దశరథ్ చేసిన ఘనకార్యం ఏమిటి? అత్రి బ్లాక్‌లోని ఒక ఆస్పత్రితో తన కుగ్రామాన్ని అనుసంధానం చేయడానికి 22 సంవత్సరాలు అవిశ్రాంతంగా పాటుపడి, ఒంటి చేత్తో రోడ్డు నిర్మించారు. అది తెలిసి, సంతోషం పట్టలేక అలా తన సింహాసనాన్ని ఐదు నిముషాల పాటు ఆ కర్మయోగికి ధారాదత్తం చేశారు నితీశ్. కేజ్రీవాల్ 49 రోజుల ప్రహసనం ఆమ్ ఆద్మీ పార్టీతో భారత రాజకీయాలలో సంచలనం సృష్టించిన అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా అపహాస్యం పాలయ్యారు. ఢిల్లీ అసెంబ్లీలో అధిక స్థానాలలో ఆప్ మెజారిటీ పార్టీగా నిలిచింది. కానీ అధికారంలోకి రావడానికి తగినన్ని స్థానాలు లేవు. తను దుమ్మెత్తిపోసిన కాంగ్రెస్ మద్దతుతోనే ప్రభుత్వం ఏర్పాటు చేశారు. పెద్ద హడావిడి చేశారు. నలభయ్ తొమ్మిది రోజులకు రాజీనామా ఇచ్చారు. ఆయన అచ్చమైన అతిథి ముఖ్యమంత్రి. ఎవరూ గాయపడని యుద్ధం అసమ్మతి కార్యకలాపాలతో, సీల్డ్ కవర్ ద్వారా ముఖ్యమంత్రులైనవాళ్లు ఉన్నారు. ఐదేళ్లు పాలన సాగించవలసిన ముఖ్యమంత్రిని అర్థంతరంగా దించేసి, తాత్కాలిక ముఖ్యమంత్రులను ప్రతిష్టించే విన్యాసానికి ‘లోపలి మనిషి’లో పీవీ నరసింహారావు ఇచ్చిన విశ్లేషణ భారత రాజకీయ చరిత్రలోనే విశిష్టమైనది. ముఖ్యమంత్రులను తొలగించడం, వారిని కేంద్రానికో, గవర్నర్ గిరీకో పంపించడం; అసమ్మతి నేతను ముఖ్యమంత్రిని చే యడం భారత రాజకీయాలలో కనిపిస్తుంది. దీనికే ఎవరూ గాయపడకుండా చేసే యుద్ధం అని పీవీ పేరు పెట్టారు. రాజకీయ రంగం వరకు పీవీ చెప్పింది అక్షర సత్యం. కానీ ఆ యుద్ధం వల్ల గాయపడే వ్యవస్థలు ఎప్పుడూ ఉన్నాయి. అవే ప్రజా ప్రయోజనాలు, అభివృద్ధి వ్యూహాలు. - డా॥గోపరాజు నారాయణరావు -
తమిళనాడు సీఎంగా పన్నీర్ సెల్వం ప్రమాణం
కొత్త కేబినెట్లోకి 30 మంది మంత్రులు కంటతడి పెట్టిన నేతలు చెన్నై/బెంగళూరు: తమిళనాడు 28వ ముఖ్యమంత్రిగా ఒ. పన్నీర్ సెల్వం(63) సోమవారం ప్రమా ణ స్వీకారం చేశారు. ఈ సమయంలో ఆయన తీవ్ర భావోద్వేగానికి గురై పలుమార్లు కంటతడి పెట్టుకున్నారు. ఆయనతో పాటు 30 మంది మంత్రులుగా ప్రమాణం చేయగా... వారిలో కూడా చాలా మంది ‘అమ్మ’(జయలలిత)ను తలచుకుని కంటతడి పెట్టారు. రాజ్‌భవన్‌లో సోమవారం మధ్యాహ్నం 1.25 గంటలకు నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో వీరితో గవర్నర్ రోశయ్య ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి స్వల్ప సంఖ్యలో ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు. హోం, ఆర్థిక, ప్రజాపనులు సహా కీలక శాఖలను ముఖ్యమంత్రి అట్టిపెట్టుకున్నట్లు గవర్నర్ కార్యాలయం ప్రకటించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితను బెంగళూరులోని సీబీఐ కోర్టు దోషిగా ప్రకటించడమే కాకుండా, నాలుగేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. చట్ట ప్రకారం ఆమె ఎమ్మెల్యేగా అర్హత కోల్పోవడంతో... అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు పార్టీ శాసనసభా పక్ష నేతగా పన్నీర్ సెల్వంను ఆదివారం ఎన్నుకున్నారు. పన్నీర్ సెల్వంను ఓదార్చిన గవర్నర్ జయలలితకు నమ్మిన బంటుగా పేరు తెచ్చుకున్న పన్నీర్ సెల్వం... అమ్మ ఫొటోను పోడియం బల్లపై పెట్టి, ఆ తర్వాతే ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె ఫొటోను చూస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. తర్వాత గవర్నర్ రోశయ్య అభినందనలు తెలిపినప్పుడు కూడా పన్నీర్ సెల్వం విచారంతోనే కనిపించారు. దీంతో ఆయన్ను గవర్నర్ ఓదార్చాల్సి వచ్చింది. మంత్రుల్లో కూడా చాలా మంది ప్రమాణ స్వీకారం సందర్భంగా కంటతడి పెట్టారు. ఈ కార్యక్రమానికి ఇతర పార్టీల నేతలు, మీడియాకు సైతం ఆహ్వానం అందలేదు. కాగా, ముఖ్యమంత్రిగా జయలలిత ఉపయోగించిన చాంబర్‌ను తాను వినియోగించరాదని, ప్రస్తుత కార్యాలయం నుంచే పాలన కొనసాగించాలని పన్నీర్ సెల్వం నిర్ణయించుకున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి. 2001లో తాన్సీ కేసులో జయలలితను ముఖ్యమంత్రి పదవికి అనర్హురాలిగా సుప్రీంకోర్టు ప్రకటించడంతో, ఆయన తొలిసారిగా సీఎం పీఠాన్ని అధిష్టించారు. వెంటనే ‘అమ్మ’ దర్శనం తమిళనాడు నూతన ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, ముగ్గురు మంత్రులతో కలసి ప్రమాణ స్వీకారం అనంతరం హుటాహుటిన బెంగళూరుకు చేరుకుని పార్టీ అధినేత్రి జయలలితను పరప్పన అగ్రహార జైలులో కలుసుకున్నారు. ‘అమ్మ’ కోసం జయ జైలుకు వెళ్లడాన్ని జీర్ణించుకోలేక తమిళనాడు వ్యాప్తంగా ఆదివారం నాటికి 20 మంది వరకు ప్రాణాలు విడిచినట్లు సమాచారం. వీరిలో కొందరు ఆత్మహత్యలకు పాల్పడగా, మరికొందరు గుండె ఆగి మరణించారు. మరోవైపు, సోమవారం కూడా అన్నాడీఎంకే శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను నిర్వహించాయి. జయకు మద్దతుగా మంగళవారం సినిమా ప్రదర్శనలు నిలిపివేస్తున్నట్లు థియేటర్ల యాజమాన్యాలు ప్రకటించాయి. జయలలితకు కాంగ్రెస్ ఎంపీ పి.కన్నన్ కూడా బహిరంగ మద్దతు పలికారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా ప్రకటించడం, రాజకీయంగా ఆమెకు ప్రతిబంధకం కాబోదని, ఆమె మరిన్ని శిఖరాలను చేరుకుంటారని చెప్పారు. కర్ణాటక హైకోర్టులో జయ బెయిల్ పిటిషన్ బెంగళూరు: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత సోమవారం కర్ణాటక హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. జయతో పాటు కోర్టు దోషులుగా ప్రకటించిన శశికళ, ఇళవరసి, సుధాకరన్ కూడా బెయిల్ కోసం పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లను మంగళవారం వేకేషన్ బెంచ్ విచారణకు స్వీకరించే అవకాశం ఉంది. అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్లు తనపై మోపిన అన్ని అభియోగాలు అసత్యమని, సినిమాల్లో నటించడం ద్వారా వచ్చిన ఆదాయంతో చట్టబద్ధంగానే ఆస్తులు కొనుగోలు చేసినట్లు జయ తన పిటిషన్లో పేర్కొన్నారు. జయకు విధించిన శిక్షపై హైకోర్టు స్టే విధిస్తే ఎమ్మెల్యేగా ఆమె అనర్హత రద్దవుతుంది. జయకు అనారోగ్యం.. ఏ క్షణమైనా ఆస్పత్రికి: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితను ఏ క్షణమైనా ఆస్పత్రికి తరలించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్న జయలలిత బీపీ, షుగర్‌తో బాధపడుతున్నారు. ఆమె సోమవారం రాత్రి కొంత ఉద్వేగానికి గురయినట్లు సమాచారం. దీంతో ఆమెను ఏక్షణమైనా జయదేవ్ లేదా విక్టోరియా ఆస్పత్రుల్లో ఒకదానికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆమె జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నందున అన్ని ఏర్పాట్లతో, ‘ఓ’ పాజిటివ్ బ్లడ్ గ్రూపు రక్తంతో సిద్ధంగా ఉండాలని ఆయా ఆస్పత్రుల సూపరింటెండెంట్లకు సిటీ పోలీస్ కమిషనర్ ఎం.ఎన్ రెడ్డి సమాచారమిచ్చారు. అయితే జయలలిత అవసరాలు తెలుసుకోవడానికి ఆదివారం పలుమార్లు పురుష పోలీసులు వెళ్లడం వివాదానికి దారితీసింది. దీంతో ఆమె అవసరాలు కనుక్కునేందుకు హుటాహుటిన మైసూరు జైలులోని మహిళా అధికారి దివ్యాశ్రీని నియమించారు. -
తమిళనాడు సీఎంగా పన్నీర్ సెల్వం ప్రమాణ స్వీకారం
-
తమిళనాడు సీఎంగా పన్నీర్ సెల్వం ప్రమాణ స్వీకారం
చెన్నై : తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ రోశయ్య ఈరోజు మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. పన్నీర్ సెల్వంతో పాటు, పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా పన్నీర్ సెల్వం భావోద్వేగానికి గురయ్యారు. పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి పదవిని అధిష్టించటం ఇది రెండోసారి. 2001లో జయ జైలుకు వెళ్లిన ఇటువంటి పరిస్థితుల్లోనే పన్నీర్ సీఎం బాధ్యతలు చేపట్టారు. ఇక ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితకు బెంగళూరు కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించడంతో.. ఎమ్మెల్యే సభ్యత్వాన్ని తద్వారా సీఎం పదవిని అమ్మ కోల్పోయారు. దీంతో కొత్త ముఖ్యమంత్రి ఎన్నిక అనివార్యమైంది. తమిళనాడులో రాజకీయంగా పలుకుబడి ఉన్న దేవర్ కులం నుంచి సీఎం పీఠాన్ని అధిరోహించిన తొలివ్యక్తిగా పన్నీర్ రికార్డు సృష్టించారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఆదివారం సమావేశమై పన్నీర్‌సెల్వంను శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. -
పన్నీర్‌కే పట్టం..
నమ్మినబంటుకే సీఎంగా ఓటేసిన జయ పన్నీర్‌ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నఅన్నాడీఎంకే ఎమ్మెల్యేలు నేడు ప్రవూణస్వీకారం చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు జైలు శిక్ష పడిన నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి, అమ్మకు అత్యంత నమ్మకస్తుడైన ఒ.పన్నీర్ సెల్వం(63) ఆమె వారసునిగా ఎన్నికయ్యారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఆదివారం సమావేశమై పన్నీర్‌సెల్వంను శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశం అనంతరం లెజిస్లేచర్ పార్టీ నిర్ణయుం గురించి పన్నీర్ గవర్నర్ కె.రోశయ్యను కలసి వివరించారు. దీంతో గవర్నర్ ఆయనను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. ఆయన సోమవారం ఉదయం తమిళనాడు తదుపరి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయకు బెంగళూరు కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించడంతో.. ఎమ్మెల్యే సభ్యత్వాన్ని తద్వారా సీఎం పదవిని అమ్మ కోల్పోయారు. దీంతో కొత్త సీఎం ఎన్నిక అనివార్యమైంది. బెంగళూరు కోర్టులో 27న జయ కేసు విచారణ సమయంలోనే.. మధ్యలో వెలుపలకు వచ్చిన జయ, పన్నీర్‌ను పిలిపించుకుని కొద్దిసేపు మాట్లాడారు. అప్పుడే అమ్మ వారసుడు పన్నీర్ అనే ప్రచారం మొదలైంది. చివరికి అదే నిజమైంది. 2001లో జయ జైలుకు వెళ్లిన ఇటువంటి పరిస్థితుల్లోనే పన్నీర్ సీఎం బాధ్యతలు చేపట్టారు. ఈసారి పన్నీర్ సెల్వం పేరుతోపాటూ రవాణా మంత్రి బాలాజీ, రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి షీలా బాలకృష్ణన్ పేర్లు వినిపించాయి. అయితే పిన్న వయసు, అనుభవ లోపం బాలాజీని వెనక్కునెట్టగా.. పార్టీవారిని కాదని మాజీ ఐఏఎస్‌ను సీఎంను చేస్తే క్యాడర్లో అసంతృప్తి బయలుదేరే అవకాశం ఉందనే అనుమానంతో షీలాను పక్కనపెట్టారు. జయ జైలుకెళ్లడంతో తమిళనాట వెల్లువెత్తిన ఆగ్రహజ్వాలలు ఆదివారానికి చల్లబడ్డాయి. చెన్నై: ఓ పక్క పొలం పనులు చూసుకుంటూనే రాజకీయ నేతగా రాణించిన ఓ.పన్నీర్‌సెల్వం(63) రెండోసారి తమిళనాడు సీఎం కాబోతున్నారు. పన్నీర్ 1951లో తేనీ జిల్లా పెరియకుళంలో జన్మించారు. ఆయన గతంలో టీ కొట్టు కూడా నడిపారు. ప్రస్తుతం దాన్ని ఆయన కుటుంబసభ్యులు నడుపుతున్నారు. పన్నీర్ 1990లో పెరియకుళం మునిసిపాలిటీ చైర్మన్‌గా ఎన్నికయ్యూరు. 2001 అసెంబ్లీ ఎన్నికల్లో పెరియకుళం నుంచే ఎమ్మెల్యేగా గెలుపొంది జయ కేబినెట్లో మంత్రిగా చేరారు. టాన్సీ భూముల కేసులో జయ అదే ఏడాది జైలుకెళ్లడంతో ఆయన సీఎం అయ్యారు. 2001 సెప్టెంబరు నుంచి 2002 మార్చి దాకా ఆ పదవిలో ఉన్నారు. జయ జైలు నుంచి రాగానే రాజీనామా చేసి ఆమె కేబినెట్లో మంత్రిగా చేరారు. 2011లో తేనీ జిల్లా బోడీ స్థానం ఎమ్మెల్యేగా ఎన్నికై జయ కేబినెట్లో ఆర్థిక శాఖ చేపట్టారు. తమిళనాడులో రాజకీయంగా పలుకుబడి ఉన్న దేవర్ కులం నుంచి సీఎం పీఠాన్ని అధిరోహించిన తొలివ్యక్తిగా పన్నీర్ రికార్డు సృష్టించారు.