కేంద్ర పథకానికి రాష్ట్రం తోడు
సాక్షి ప్రతినిధి, చెన్నై: కేంద్ర ప్రభుత్వ జాతీయ ఆహార భద్రతా చట్టం వచ్చే నెల 1వ తేదీ నుంచి తమిళనాడులో అమలులోకి రానుంది. రేషన్‌కార్డుదారులకు అదనంగా ఉచిత బియ్యం అందనుంది. ముఖ్యమంత్రి జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ప్రభుత్వాన్ని నడిపించే బాధ్యతలు నిర్వర్తిస్తున్న మంత్రి పన్నీర్ సెల్వం ఈనెల 24వ తేదీన సచివాలయంలో కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సహచర మంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో జాతీయ ఆహారభద్రతా చట్టం అమలు చేయాలన్న అంశం కూడా ఒకటి. ఈ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు ప్రభుత్వం గతంలో వ్యతిరేకత వ్యక్తం చేసింది.
జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని రాష్ట్రంలో వెంటనే అమలు చేయాలని, లేని పక్షంలో ప్రస్తుతం దారిద్రరేఖకు ఎగువన ఉన్న కుటుంబాలకు రేషన్ దుకాణాల ద్వారా అందజేసే బియ్యాన్ని కిలో రూ.8.30లకు బదులుగా రూ.22.54లకు సరఫరా చేయగలమని కేంద్రం స్పష్టం చేసింది. ప్రజా పంపిణీకి 3.23 ల క్షల మెట్రిక్ టన్నులు అవసరం. అరుుతే నెలకు 2.96 లక్షల టన్నుల బియ్యాన్ని మాత్రమే కేం ద్రం ఇస్తోంది. అదనంగా అవసరమవుతున్న 27,969 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఈ ఏడాది జూలై తరువాత నుంచి నిలిపివేసింది. దీంతో రాష్ట్రానికి 38.93 లక్షల మెట్రిక్ టన్నుల బియాన్ని సమకూర్చుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వంపై రూ.2,393 కోట్లు అదనంగా భారం పడుతోంది. ఈ ఆహారభద్రతా చట్టాన్ని యథాతథంగా అమలు చేసిన పక్షంలో రాష్ట్రంలోని 50.55 శాతం ప్రజలు మాత్రమే లబ్ధిపొందగలరు. జాతీయ చట్టాన్ని తమిళనాడు అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసి అమలు చేయాలని రాష్ట్రం భావిస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు భారమైనా రేషన్‌కార్డు దారులంతా చౌకధర బియ్యాన్ని పొందేలా మార్పులు చేశారు. ఈ చట్టం ప్రస్తుతం తమిళనాడులో అమలులో ఉన్నా జాతీయ స్థారుులో అనుసంధానం కావడం వల్ల బియ్యం సరఫరాలో రాష్ట్రవాటాతో పాటు కేంద్ర వాటా కూడా చేరుతుంది. జాతీయ చట్టం కింద ఒక కుటుంబంలో ఒక మనిషి మాత్రమే ఉంటే నెలకు 5 కిలోల బియ్యం ఇవ్వాల్సి ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం 12 కిలోల అందజేస్తోంది. అలాగే ఇద్దరికి 10కిలోలకుగానూ 16 కిలోలు అందజేయడం కొనసాగుతుంది. ఒక కుటుంబానికి రూ.20 కిలోల బియ్యం అందుతుండగా, ఇకపై 25 కిలోల చొప్పున అందజేస్తారు. అలాగే ఒక కుటుంబంలో 7 మంది సభ్యులు ఉంటే 35 కిలోలు, 10 మంది ఉంటే 50 కిలోలు అందజేస్తారు. అంత్యోదయా అన్నయోజన పథకం కింద ప్రస్తుతం అందజేస్తున్న 35 కిలోల ఉచిత బియ్యం యథావిధిగా పొందవచ్చు.
1 నుంచి జాతీయ ఆహార భద్రతా చట్టం
Published Sat, Oct 29 2016 2:09 AM | Last Updated on Mon, Sep 4 2017 6:35 PM
Advertisement
Advertisement