'మూడో వ్యక్తి సీఎం కావాలి'
Published Fri, Feb 10 2017 10:08 PM | Last Updated on Tue, Sep 5 2017 3:23 AM
తమిళనాడులో రాజకీయ సంక్షోభం తొలగాలంటే మూడో వ్యక్తి సీఎం కావాలని తమిళ తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. పన్నీరు సెల్వం, శశికళల స్ధానంలో అన్నాడీఎంకేలోని మరో బలమైన నాయకుడు పగ్గాలు చేపట్టాలని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొన్న కారణంగా గవర్నర్ చొరవ చూపి అసెంబ్లీని రద్దు చేయాలని అన్నారు. పరిస్ధితులు చక్కబడిన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే బావుంటుందని అభిప్రాయపడ్డారు. ఇరువురు నేతల మధ్య సాగుతున్న రాజకీయ చదరంగం కారణంగా ప్రజాజీవనం స్తంభించిందని చెప్పారు. దీనివల్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం లేకపోలేదని అన్నారు.
Advertisement
Advertisement