ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంకు మద్దతు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మంత్రి వలర్మతికి బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. శ్రీరంగం నియోజకవర్గానికి చెందిన ఒక మహిళ ఫోన్ ద్వారా వలర్మతిని బుధవారం సాయంత్రం బెదిరింపులకు గురిచేసినట్లుగా ఒక ఆడియో సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసిన వ్యక్తిగా చెబుతున్నా పన్నీర్‌సెల్వంకు మద్దతు పలకండి, ఆయన చేత బలవంతంగా రాజీనామా చేయించడం సరికాదంటూ బెదిరించినట్లుగా ఆ ఆడియోలో సంభాషణలు సాగాయి. మరోవైపు పన్నీర్‌సెల్వంకు మద్దతుగా నిలిచిన పుదుచ్చేరికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఓంశక్తిశేఖర్‌ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించినట్లు శశికళ ప్రకటించారు.