UN Human Rights Council, deputy UN rights chief Nada: ఉక్రెయిన్ యుద్ధానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్న తమ దేశ ప్రజలపై బెదిరింపులకు దిగుతున్న రష్యా దుస్సాహాసాన్ని యూఎన్ తాత్కాలిక మానవ హక్కుల చీఫ్ నాడా అల్ నషిఫ్ తీవ్రంగా ఖండించారు. ప్రాథమిక హక్కలు అణగదొక్కే చర్యలకు పాల్పడవద్దంటూ హెచ్చరించారు. డిప్యూటీ యూఎన్ హక్కుల చీఫ్ నాడా అల్ నషిఫ్ యూఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ముందు మాట్లాడుతూ...ఉక్రెయిన్‌లో యుద్ధానికి వ్యతిరేకంగా గళం విప్పే వ్యక్తులపై బెదిరింపులు, నిర్బంధ చర్యలు, ఆంక్షలు విధించడటం తదితరాలన్నింటిని తప్పుపట్టారు.
ఇది రాజ్యంగబద్ధంగా ఇవ్వబడ్డ ప్రాథమిక హక్కులకు సంబంధించి.. భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు భంగం కలిగించినట్లేనని హెచ్చరించింది. అలాగే రష్యలో జర్నలిస్టులపై పెంచుతున్న ఒత్తిడి, ఇంటర్నెట్ వనరులను నిరోధించడం తదితరాలన్నింటిని వ్యతిరేకించారు. మిచెల్ బాచెలెట్ స్థానంలో కొత్త చీఫ్ వోల్కర్‌టర్క్ వచ్చే వరకు ప్రస్తుతం మానవ హక్కుల కోసం తాత్కాలికి హైకమిషనర్‌గా నాడా అల్ నషీఫ్ పనిచేస్తున్నారు. రష్యా ప్రభుత్వ వైఖరి మీడియా స్వేచ్ఛకు విరుద్ధంగా, సమాచారాన్ని యాక్సెస్ చేసే హక్కును ఉల్లంఘించేవిగా ఉన్నాయన్నారు.
అలాగే నిర్దేశిత విదేశీ లేదా అంతర్జాతీయ ప్రతినిధులతో అప్రకటిత పరిచయాలను రష్యన్ ఫెడరేషన్ భద్రతకు వ్యతిరేకమైన నేరంగా పరిగణించవద్దని రష్యాకి పులపునిచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌లో పూర్తి స్థాయి దాడి చేసినప్పటి నుంచి రష్యా దళాల ఉల్లంఘలపై ఉన్నత స్థాయి విచారణకు యూఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అదేశించింది. మరోవైపు రష్యాలో హక్కుల ఉల్లంఘనలపై దృష్టి పెట్టాలని ఒత్తిడి కూడా పెరుగుతోంది. అంతేగాదు అక్కడ పరిస్థితిని సమీక్షించే ఒక రిపోర్టర్‌ని నియమించాలని యూరోపియన్ యూనియన్ దేశాల హ్యూమన్ రైట్స్ కౌన్సిల్‌ని కోరాయి కూడా.
(చదవండి: 50 మిలియన్ల మందికి పైగా ప్రజలు బానిసత్వంలోనే: యూఎస్ రిపోర్ట్)
Comments
Please login to add a commentAdd a comment