UN Human Rights Council
-
ప్రజల పై బెదిరింపు చర్యలకు దిగొద్దు! రష్యాని తిట్టిపోసిన యూఎన్
UN Human Rights Council, deputy UN rights chief Nada: ఉక్రెయిన్ యుద్ధానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్న తమ దేశ ప్రజలపై బెదిరింపులకు దిగుతున్న రష్యా దుస్సాహాసాన్ని యూఎన్ తాత్కాలిక మానవ హక్కుల చీఫ్ నాడా అల్ నషిఫ్ తీవ్రంగా ఖండించారు. ప్రాథమిక హక్కలు అణగదొక్కే చర్యలకు పాల్పడవద్దంటూ హెచ్చరించారు. డిప్యూటీ యూఎన్ హక్కుల చీఫ్ నాడా అల్ నషిఫ్ యూఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ముందు మాట్లాడుతూ...ఉక్రెయిన్‌లో యుద్ధానికి వ్యతిరేకంగా గళం విప్పే వ్యక్తులపై బెదిరింపులు, నిర్బంధ చర్యలు, ఆంక్షలు విధించడటం తదితరాలన్నింటిని తప్పుపట్టారు. ఇది రాజ్యంగబద్ధంగా ఇవ్వబడ్డ ప్రాథమిక హక్కులకు సంబంధించి.. భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు భంగం కలిగించినట్లేనని హెచ్చరించింది. అలాగే రష్యలో జర్నలిస్టులపై పెంచుతున్న ఒత్తిడి, ఇంటర్నెట్ వనరులను నిరోధించడం తదితరాలన్నింటిని వ్యతిరేకించారు. మిచెల్ బాచెలెట్ స్థానంలో కొత్త చీఫ్ వోల్కర్టర్క్ వచ్చే వరకు ప్రస్తుతం మానవ హక్కుల కోసం తాత్కాలికి హైకమిషనర్‌గా నాడా అల్ నషీఫ్ పనిచేస్తున్నారు. రష్యా ప్రభుత్వ వైఖరి మీడియా స్వేచ్ఛకు విరుద్ధంగా, సమాచారాన్ని యాక్సెస్ చేసే హక్కును ఉల్లంఘించేవిగా ఉన్నాయన్నారు. అలాగే నిర్దేశిత విదేశీ లేదా అంతర్జాతీయ ప్రతినిధులతో అప్రకటిత పరిచయాలను రష్యన్ ఫెడరేషన్ భద్రతకు వ్యతిరేకమైన నేరంగా పరిగణించవద్దని రష్యాకి పులపునిచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌లో పూర్తి స్థాయి దాడి చేసినప్పటి నుంచి రష్యా దళాల ఉల్లంఘలపై ఉన్నత స్థాయి విచారణకు యూఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అదేశించింది. మరోవైపు రష్యాలో హక్కుల ఉల్లంఘనలపై దృష్టి పెట్టాలని ఒత్తిడి కూడా పెరుగుతోంది. అంతేగాదు అక్కడ పరిస్థితిని సమీక్షించే ఒక రిపోర్టర్ని నియమించాలని యూరోపియన్ యూనియన్ దేశాల హ్యూమన్ రైట్స్ కౌన్సిల్‌ని కోరాయి కూడా. (చదవండి: 50 మిలియన్ల మందికి పైగా ప్రజలు బానిసత్వంలోనే: యూఎస్ రిపోర్ట్) -
ఉక్రెయిన్ హర్షం.. రష్యా రియాక్షన్ ఇది
రష్యా.. ఇక నుంచి ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో సభ్య దేశం కాదు. గురువారం రాత్రి సాధారణ అసెంబ్లీలో జరిగిన ఓటింగ్‌లో రష్యా తొలగింపునకు లైన్ క్లియర్ అయ్యింది. బుచాలో నరమేధానికి తెగబడ్డ రష్యా.. యుద్ధ నేరాలతో ఇప్పటికే శాంతి స్థాపనకు విఘాతం కలిగించిందని.. అలాంటి దేశానికి మండలిలో కొనసాగే అర్హత లేదంటూ తీర్మానాన్ని ప్రవేశపెట్టే సమయంలో వాదించింది అమెరికా. ఇక ఈ పరిణామంపై ఉక్రెయిన్ హర్షం వ్యక్తం చేసింది. రష్యాను మానవ హక్కుల మండలి నుంచి తొలగించడాన్ని గొప్ప చర్యగా అభివర్ణించింది. రష్యాకు ఈ మండలిలో కొనసాగే అర్హత ఏమాత్రం లేదంటూ సాధారణ అసెంబ్లీలో ఉక్రెయిన్ ప్రతినిధి వాదించారు. ‘‘మానవ హక్కులను కాపాడే లక్ష్యంతో ఉన్న UN సంస్థల్లో యుద్ధ నేరస్థులకు స్థానం లేదు’’ అంటూ ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కుబెల ట్వీట్ చేశారు. న్యాయం వైపు నిలబడిన సభ్యదేశాలకు రుణపడి ఉంటామంటూ పేర్కొన్నారాయన. ► యూఎన్ హెచ్ఆర్సీ నుంచి బహిష్కరణ పట్ల రష్యా మండిపడుతోంది. పూర్తి అక్రమ, రాజకీయ ప్రేరేపిత చర్యగా అభివర్ణించింది క్రెమ్లిన్. ఇప్పటికే ఐక్యరాజ్య సమితిలో ఒంటరిగా మారిపోయిన రష్యా ప్రతినిధి.. ఓటింగ్ సమయంలోనూ మౌనంగా చూస్తూ ఉండిపోయారు. ► మానవ హక్కుల పట్ల గౌరవంతో కొనసాగుతున్న మండలిలో రష్యాకు కొనసాగే అర్హత లేదు. ముఖ్యంగా ఉక్రెయిన్‌లోని బుచా, ఇర్పిన్, మారియుపోల్ ప్రాంతాల్లో.. అది కలిగించిన వినాశనం.. ప్రపంచం చూసిన దురాగతాలు యుద్ధ నేరాలకు సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా తన దురాక్రమణ యుద్ధాన్ని తక్షణమే, బేషరతుగా విరమించుకోవాలని.. UN చార్టర్లో పొందుపరచబడిన సూత్రాలను గౌరవించాలని ఈ తొలగింపు చర్య ద్వారా ప్రపంచం మరొక స్పష్టమైన సంకేతాన్ని పంపినట్లయ్యింది అంటూ అమెరికా ఒక ప్రకటనలో పేర్కొంది. చదవండి: పుతిన్‌ను బోనెక్కించగలరా? -
రష్యాకు ఐరాసలో భారీ షాక్
ప్రపంచ దేశాల ఐక్యవేదిక ఐక్యరాజ్య సమితిలో రష్యా భారీ షాక్ తగిలింది. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ (మానవ హక్కుల పరిరక్షణ మండలి) నుంచి రష్యాను తొలగిస్తున్నట్లు ప్రకటించింది ఐక్యరాజ్య సమితి. శాశ్వత సభ్యత్వం హోదా ఉన్న దేశం ఒకటి.. ఇలా ఒక ఉన్నత మండలి నుంచి సస్పెండ్‌కు గురికావడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్ బుచా పట్టణంలో మారణహోమం సృష్టించిందన్న నెపంతో రష్యాను మండలి నుంచి తొలగించాలంటూ అమెరికా గురువారం ఈ ప్రతిపాదన తీసుకొచ్చింది. ఉక్రెయిన్ ఈ ప్రతిపాదనను సమర్థించింది. ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీలో మొత్తం 193 సభ్యుల ఓటింగ్‌కుగానూ.. రష్యాను తొలగించాలంటూ 93 ఓట్లు వచ్చాయి. 24 వ్యతిరేక ఓట్లు రాగా.. 58 మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. పెద్ద దేశం చైనా రష్యాకు అనుకూలంగా ఓటింగ్‌లో వ్యతిరేకతను కనబర్చింది. ఇదిలా ఉండగా.. ఈ మండలిలో మొత్తం 47 దేశాలు ఉండేవి. 2011లో తొలిసారిగా లిబియాను మానవ హక్కుల మండలి నుంచి బహిష్కరించారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలు(P5+1) ఉన్న సంగతి తెలిసిందే. చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే, అమెరికాతో పాటు అదనంగా జర్మనీ కూడా ఉంది. ఈ లిస్ట్‌లో ఉన్న రష్యాను ఐరాసలోని ఒక ఉన్నత మండలి నుంచి తొలగించడం ఇదే ప్రప్రథమం. చదవండి: వీటోను రష్యా మారణహోమానికి లైసెన్స్‌గా వాడుతోంది -
తిరుగుబాటుకు ఏడాది పూర్తి.. వేల మంది బలిదానం!
అనూహ్యంగా మొదలైన సైన్యం తిరుగుబాటు పరిణామాలతో.. ఏడాదిగా పౌరుల వ్యతిరేక నిరసనలు కొనసాగుతూనే వస్తున్నాయి. ఈ నిరసనల్లో చెలరేగిన హింసతో వేలమంది బలికాగా.. కొన్ని వేలమందిని నిర్భంధానికే పరిమితం చేసింది సైన్యం. ఇక ఈ పరిస్థితులు కొనసాగుతుండగా.. మయన్మార్ సంక్షోభం గురించి ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కార్యాలయం అధికారికంగా ఒక నివేదిక విడుదల చేసింది. ఏడాదిపాటుగా మయన్మార్‌లో కొనసాగుతున్న సంక్షోభంపై ఐరాస మంగళవారం అధికారికంగా స్పందించింది. ఈ ఏడాది కాలంలో పదిహేను వందల మంది బలికాగా.. 11, 782 మందిని చట్టాన్ని అతిక్రమించి సైన్యం నిర్భంధించిందని, వీళ్లలో 8,792 మంది ఇంకా నిర్భంధంలోనే ఉన్నారని ఐరాస మానవ హక్కుల విభాగం ప్రతినిధి రవీనా శమ్దాసానీ తెలిపారు. అయితే మయన్మార్‌లో పాలక జుంటా సైన్యం.. హక్కుల సంఘాలు విడుదల చేసిన మరణాల సంఖ్యను ఖండించిన విషయం తెలిసిందే. జెనీవాలోని జరిగిన యూఎన్ సమావేశంలో ఏకపక్ష నిర్బంధాల గణాంకాలపై శమ్సదానీ వివరణ ఇచ్చారు. ఏడాది కాలంగా సైన్యానికి వ్యతిరేకంగా వినిపిస్తున్న నిరసన ఇది. శాంతియుత ప్రదర్శనలు, ఆన్లైన్ ద్వారా తమ నిరసన గళం వినిపిస్తున్నారు. కానీ, ప్రాణ నష్టం తప్పలేదు. చంపబడ్డ 1,500 మందిని మేం డాక్యుమెంట్ చేశాం. అయితే ఇది నిరసనల సందర్భంలో మాత్రమే’’ అని శామ్సదానీ వివరించారు. వీళ్లలో 200 మంది మిలిటరీ కస్టడీలో వేధింపుల ద్వారానే చనిపోయారు అని ఆమె ధృవీకరించారు. ఈ 1,500 మందిలో సాయుధ పోరాటం కారణంగా మరణించిన వ్యక్తులను చేర్చలేదు! ఎందుకంటే మరణించిన వాళ్లు వేలల్లో ఉన్నారని మేము అర్థం చేసుకోగలం’ ఆమె భావోద్వేగంగా ప్రసంగించారు. ఇదిలా ఉంటే ఫిబ్రవరిలో ఉవ్వెత్తున ఎగిసిన మయన్మార్ సైన్య దురాగతాలు.. వేలమంది పౌరులను బలిగొనడంతో పాటు ఆంక్షలతో, కఠిన నిర్భంధాలతో ఇబ్బందులు పెడుతూ వస్తోంది. మరోవైపు గత పాలకులపైనా సైన్యం ప్రతీకారం కొనసాగుతూ వస్తోంది. ఆంగ్‌సాన్ సూకీతోపాటు పలువురు నేతలను నిర్బంధంలో ఉంచి సైన్యం పలు అభియోగాలు మోపిన సంగతి తెలిసిందే. -
ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం
న్యూయార్క్ : ట్రంప్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి నుంచి తప్పుకుంటున్నట్టు అమెరికా ప్రకటించింది. వలసదారుల పిల్లలను తల్లిదండ్రుల నుంచి వేరుచేయటాన్ని ఖండిస్తూ ట్రంప్ పాలనపై ఐరాస మానవ హక్కుల మండలి అధ్యక్షడు హుస్సేన్ పలు వ్యాఖ్యలు చేశారు. హుస్సేన్ అమెరికాపై వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే ట్రంప్ ఇలాంటి నిర్ణయం తీసుకోవటం గమనార్హం. అమెరికా రాయబారి నిక్కీ హేలి మాట్లాడుతూ.. సంస్థ ఆ పేరుకు అనర్హమైనదని ఆమె ఆరోపించారు. మండలిలో మార్పులు చేయటానికి అమెరికా చాలా అవకాశాలు ఇచ్చిందన్నారు. ఇజ్రాయెల్ విషయంలో మండలి వ్యవహరిస్తున్న తీరు, మానవ హక్కులను వ్యతిరేకించే చైనా, క్యూబా, వెనిజులా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో వంటి దేశాలకు సభ్యత్వం ఇవ్వటాన్ని ఆమె తప్పుబట్టారు. మానవ హక్కులను పరిహాసం చేసే కపట సంస్థలో భాగంగా ఉండటం కుదరదన్నారు. సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో మాట్లాడుతూ.. ఒకప్పుడు మానవ హక్కుల మండలిలో ఉన్నత భావాలు ఉండేవని, నేడు మానవ హక్కులను కాపాడటంలో మండలి విఫమైందన్నారు. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో సాహసంతో కూడుకున్నదని ఇజ్రాయెల్ ప్రశంసించింది -
ఔను ప్రజల్ని చంపుతున్నా.. జైల్లో పెట్టే దమ్ముందా!
ఫిలిప్పీన్స్ నిరంకుశ అధ్యక్షుడు రోడ్రిగో ద్యుతర్తె ఐరాస మానవహక్కుల సంఘం చీఫ్‌పై తిట్లవర్షం కురిపించారు. ‘వేశ్య కొడుకా.. నన్నే సైక్రియాట్రిస్ట్ దగ్గరికి వెళ్లమంటావా?’ అంటూ విరుచుకుపడ్డారు. దేశంలో డ్రగ్స్ మాఫియా లేకుండా చేస్తానంటూ అత్యంత క్రూరంగా ద్యుతర్తె సాగిస్తున్న అణచివేతపై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ద్యుతర్తె సైక్రియాట్రిస్ట్ దగ్గరకు వెళ్లి.. మానసిక పరిస్థితిని బాగుపర్చుకోవాలని ఐరాస మానవహక్కుల సంఘం హైకమిషనర్ జీద్ రాడ్ అన్ హుస్సేన్ సూచించారు. ఐరాస ప్రతినిధులపై దుర్భాషలు ఆడితే.. తగిన బదులిస్తామని ఘాటుగా పేర్కొన్నారు. జోర్డానియన్ రాజకుమారుడైన జీద్ వ్యాఖ్యలపై ద్యుతర్తె చిందులు తొక్కారు. ‘మీరు బాగున్నారు మేయర్.. మీకు తిట్టడం అంటే కొంచెం ఇష్టం’ అని సైక్రియాట్రిస్ట్ నాకు చెప్పాడు. జీద్ వ్యాఖ్యలపై స్పందించవద్దని కొంతమంది నాకు చెప్పారు. కానీ ప్రతీకారం తీర్చుకునేందుకు మాట్లాడుతున్నా’ అని ఆయన చెప్పుకొచ్చారు. జీద్ తలకాయలో మెదడు లేదని, అది ఉత్త బుర్ర అని తిట్టిపోశారు. ‘అవును, నేను పరుషంగా ఉంటాను. చాలా పరుషంగా ఉంటాను. ఇందులో నేనే చేసేదేమీ లేదు. నేను ప్రజల్ని చంపుతున్నానా? అవును నేను డ్రగ్స్ అమ్ముతున్న వారిని చంపేస్తున్నాను. దీనిని ఆపాలని నేను ఇంతకుముందే చెప్పాను’ అని ద్యుతర్తే మంగళవారం తెలిపారు. ‘నన్ను జైల్లో వేయగలమని మీరు అనుకుంటే.. మీరు కల కంటున్నట్టే’ అని మానవ హక్కుల సంఘాలను ఉద్దేశించి ద్యుతర్తే పేర్కొన్నారు. దేశంలో పెరిగిపోయిన డ్రగ్స్ సంస్కృతిని ఆరునెలల్లో రూపుమాపుతానని 2016లో అధికారంలోకి వచ్చిన ద్యుతర్తే ప్రభుత్వం.. డ్రగ్స్ అణచివేతలో భాగంగా వందలమంది డీలర్లను, వేలమంది వినియోగదారులను హతమార్చింది. డ్రగ్స్ సేవిస్తున్నట్టు భావిస్తున్న 4,100 మందిని చంపేసినట్టు ఫిలిప్పీన్స్ పోలీసులు చెప్తుండగా.. అనధికారికంగా ఆ సంఖ్య మూడు రెట్లు అధికమని హక్కుల సంఘాలు చెప్తున్నాయి. ద్యుతర్తే ప్రభుత్వం చట్టవిరుద్ధంగా పౌరులను హతమారుస్తోందని, ఈ దుర్మార్గంపై దర్యాప్తు జరపాల్సిన అవసరముందని జీద్ గత నెలలో మండిపడ్డారు. ఐరాస ప్రతినిధిపై ద్యుతర్తె దుర్భాషలాడటాన్ని ఖండించారు. -
ఫేస్‌బుక్‌పై యూఎన్ తీవ్ర మండిపాటు
జెనీవా : మయన్మార్‌లోని రోహింగ్య ముస్లింల విషయంలో ఫేస్బుక్ వ్యవహరించిన తీరును అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం తప్పుబట్టింది. రోహింగ్యాలకు వ్యతిరేకంగా విద్వేషపూరిత ప్రచారం పెద్ద ఎత్తున జరగడానికి ఫేస్బుక్ వారధిగా ఉపయోగపడిందని మండిపడింది. మయన్మార్‌లో పర్యటించిన అంతర్జాతీయ నిజ నిర్ధారణ కమిటీకి చైర్మన్‌గా ఉన్న మార్జుకి దారుస్మాన్ మాట్లాడుతూ.. సోషల్ మీడియా అక్కడి పరిస్థితులను నిర్ణయించిందని తెలిపారు. ఆ సమయంలో మయన్మార్‌లో సోషల్ మీడియా అంటే ఫేస్బుక్, ఫేస్బుక్ అంటే సోషల్ మీడియా అనే పరిస్థితి ఏర్పడిందన్నారు. భద్రత దళాల దాడుల వల్ల 65వేల మంది రోహింగ్యాలు గత ఆగస్టులో బంగ్లాదేశ్‌కు తరలిపోయారని, అలాంటి పరిస్థితుల్లో కూడా రోహింగ్యాలకు వ్యతిరేకంగా ఫేస్బుక్లో వ్యాప్తి చెందుతున్న వివాదస్పద సమాచారాన్ని తొలగించడానికి మాత్రం ఆ కంపెనీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఒకప్పుడు ఎంతో ఉపయోగకరంగా ఉన్న ఫేస్బుక్ ప్రస్తుతం మృగంగా మారిందని కమిటీ పరిశీలకురాలు యంగీ లీ కూడా వ్యాఖ్యానించారు. మయన్మార్‌లో దాడులకు ఫేస్బుక్ ప్రచారమే కారణమని తెలిపారు. విద్వేషపూరిత వ్యాఖ్యల వ్యాప్తికి ఫేస్బుక్ దోహదపడిందన్నారు. మయన్మార్ రోహింగ్యాలపై మిలటరీ దాడులకు తానే ప్రత్యక్ష సాక్షినని తెలిపారు. గతంలో ఇలాంటి వార్తలపై స్పందించిన ఫేస్బుక్, తాజా వివాదంపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. -
రష్యాకు ఎదురుదెబ్బ!
ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో అగ్రరాజ్యం రష్యాకు ఎదురుదెబ్బ తగిలింది. సిరియా అధ్యక్షుడు అల్ బషర్ అసద్ అలెపో నగరంలో జరిపిన దాడికి మద్దతునివ్వడం ద్వారా రష్యా యుద్ధనేరాలకు పాల్పడిందన్న ఆరోపణల నేపథ్యంలో హక్కుల మండలిలో ఆ దేశానికి చుక్కెదురైంది. హక్కుల మండలిలో సభ్యత్వం కోసం రష్యా చేసుకున్న అభ్యర్థన తిరస్కరణకు గురైంది. 47 మందితో కూడిన హక్కుల మండలిలో తాజాగా 14 దేశాలకు సభ్యత్వం కల్పించేందుకు 193మంది సభ్యులతో కూడిన ఐరాస జనరల్ అసెంబ్లీ ఓటింగ్ నిర్వహించింది. ఈ ఓటింగ్‌లో 112 ఓట్లు మాత్రమే సాధించిన రష్యా హంగేరి, క్రోషియా చేతిలో ఓడిపోయింది. హక్కుల మండలిలో రష్యా సభ్యత్వాన్ని దాదాపు 87 హక్కుల సంఘాలు వ్యతిరేకించాయని హక్కుల మండలి ఐరాస డిప్యూటీ డైరెక్టర్ అక్షయకుమార్ తెలిపారు. ‘అలెపోలో జరిగిన అరాచకాలను మరిచిపోవడం అంత సులభం కాదు. ఓటు వేసిన వారి మనసులో ఆ ఘటనలు గుర్తుండిఉంటాయి’ అని ఆయన తెలిపారు. రష్యాకు ఇది చరిత్రాత్మక తిరస్కరణ ఆయన స్పష్టం చేశారు. అమెరికా-రష్యా కాల్పుల విరమణ ఒప్పందం విఫలమవ్వడంతో అలెపో నగరంలో పరిస్థితులు మరింత దారుణంగా మారి సంక్షోభం మరింత ముదిరింది. రష్యా మద్దతున్న అసద్ ప్రభుత్వం తూర్పు అలెప్పో నగరంలో బలంగా ఉన్న తిరుగుబాటుదారులను ఏరివేసేందుకు భారీ ఎత్తున దాడులు జరుపుతుండటంతో ఇక్కడ ప్రజలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు.