
ప్రపంచ దేశాల ఐక్యవేదిక ఐక్యరాజ్య సమితిలో రష్యా భారీ షాక్ తగిలింది. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ (మానవ హక్కుల పరిరక్షణ మండలి) నుంచి రష్యాను తొలగిస్తున్నట్లు ప్రకటించింది ఐక్యరాజ్య సమితి. శాశ్వత సభ్యత్వం హోదా ఉన్న దేశం ఒకటి.. ఇలా ఒక ఉన్నత మండలి నుంచి సస్పెండ్‌కు గురికావడం ఇదే తొలిసారి.
ఉక్రెయిన్ బుచా పట్టణంలో మారణహోమం సృష్టించిందన్న నెపంతో రష్యాను మండలి నుంచి తొలగించాలంటూ అమెరికా గురువారం ఈ ప్రతిపాదన తీసుకొచ్చింది. ఉక్రెయిన్ ఈ ప్రతిపాదనను సమర్థించింది. ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీలో మొత్తం 193 సభ్యుల ఓటింగ్‌కుగానూ.. రష్యాను తొలగించాలంటూ 93 ఓట్లు వచ్చాయి. 24 వ్యతిరేక ఓట్లు రాగా.. 58 మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. పెద్ద దేశం చైనా రష్యాకు అనుకూలంగా ఓటింగ్‌లో వ్యతిరేకతను కనబర్చింది.
ఇదిలా ఉండగా.. ఈ మండలిలో మొత్తం 47 దేశాలు ఉండేవి. 2011లో తొలిసారిగా లిబియాను మానవ హక్కుల మండలి నుంచి బహిష్కరించారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలు(P5+1) ఉన్న సంగతి తెలిసిందే. చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే, అమెరికాతో పాటు అదనంగా జర్మనీ కూడా ఉంది. ఈ లిస్ట్‌లో ఉన్న రష్యాను ఐరాసలోని ఒక ఉన్నత మండలి నుంచి తొలగించడం ఇదే ప్రప్రథమం.
Comments
Please login to add a commentAdd a comment