రాహుల్‌ హత్య కేసు: పోలీసుల అదుపులో గాయత్రి? | Vijayawada Rahul Assassination Case Update | Sakshi

రాహుల్‌ హత్య కేసు: పోలీసుల అదుపులో గాయత్రి?

Sep 3 2021 9:16 AM | Updated on Sep 3 2021 10:22 AM

Vijayawada Rahul Assassination Case Update - Sakshi

గాయత్రి ( ఫైల్‌ ఫోటో )

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన వ్యాపారి కరణం రాహుల్‌ హత్య కేసులో కీలక నిందితురాలైన గాయత్రి పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. నేడు విజయవాడ కోర్టులో గాయత్రిని హాజరుపరిచే అవకాశం ఉంది.

సాక్షి, విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన వ్యాపారి కరణం రాహుల్‌ హత్య కేసులో కీలక నిందితురాలైన గాయత్రి పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. నేడు విజయవాడ కోర్టులో గాయత్రిని హాజరుపరిచే అవకాశం ఉంది. ఇప్పటికే రాహుల్‌ హత్య కేసులో 11 మందిని పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

తన కూతురికి ఎయిమ్స్‌లో మెడికల్‌ సీటు ఇప్పించాలని రాహుల్‌కు గాయత్రి రూ.6 కోట్లు ఇచ్చింది. మెడికల్‌ సీటు రాకపోగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో విజయకుమార్‌, కోగంటి సత్యంలతో కలిసి రాహుల్‌ హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసులు వెల్లడించిన విషయం విదితమే. కాగా, ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కోగంటి సత్యాన్ని గురువారం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆయనను విజయవాడ సబ్‌జైలు నుంచి మాచవరం పీఎస్‌కు తరలించారు.

ఇవీ చదవండి:
చార్జర్‌ వైర్‌తో చంపేశారు...
ఇలాంటి పందుల పోటీలు ఎప్పుడైనా చూశారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement