స్పందన అంతంతే.. | - | Sakshi
Sakshi News home page

స్పందన అంతంతే..

Apr 29 2025 12:09 AM | Updated on Apr 29 2025 12:09 AM

స్పంద

స్పందన అంతంతే..

ఎల్‌ఆర్‌ఎస్‌ క్రమబద్ధీకరణకు ముందుకు రాని ప్లాట్ల యజమానులు

సద్వినియోగం చేసుకోవాలి

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఫీజు చెల్లించి ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలి. ఫీజు చెల్లించిన వారికి వెంటనే ప్రొసీడింగ్స్‌ అందజేస్తున్నాం. 25 శాతం రాయితీ గడువు మరో రెండు రోజులు మాత్రమే ఉంది. ఈ ప్రక్రియపై ఎలాంటి సందేహాలున్నా మున్సిపల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లను సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చు. మున్సిపల్‌ సిబ్బంది ఇప్పటికే దరఖాస్తుదారులకు లెటర్లు పంపించడం, ఫోన్‌ ద్వారా సమాచారం ఇవ్వడం జరిగింది. – యాదయ్య,

మున్సిపల్‌ కమిషనర్‌, అచ్చంపేట

అచ్చంపేట పట్టణ వ్యూ

అచ్చంపేట: అనధికార లే–అవుట్‌లోని స్థలాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం 25 శాతం రాయితీ కల్పించి గడువు పెంచినా మున్సిపాలిటీల్లో లక్ష్యం నెరవేరలేదు. నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు ప్రభుత్వం ఇటీవల అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మొదట మార్చి 31 నాటికి క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించారు. అయితే ప్రభుత్వం ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో ఈ నెల 30 వరకు మరోసారి గడువు పొడిగించింది. కాగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 19 మున్సిపాలిటీల్లో సోమవారం వరకు 32,781 దరఖాస్తుదారులు ఎల్‌ఆర్‌ఎస్‌ క్రమబద్ధీకరణ కోసం రుసుం చెల్లించడంతో ప్రభుత్వానికి రూ.55.38 కోట్ల ఆదాయం సమకూరింది.

25 శాతం రాయితీతో..

2020 ఆగస్టు 31 నాటికి ఉన్న అనధికార లే అవుట్లను క్రమబద్ధీకరించేందుకు గత ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే వివిధ కారణాలతో దరఖాస్తుదారులకు అనుమతులు మంజూరు చేసే ప్రక్రియలో ఆలస్యం కావడంతో ముందుకు సాగలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇందులో కొన్ని నిబంధనలు చేర్చింది. దీని ప్రకారం 2025 మార్చి 31లోగా క్రమబద్ధీకరణ చార్జీలు, ఓపెన్‌ స్పేస్‌ చార్జీలు చెల్లించిన వారికి 25 శాతం రాయితీ కల్పిస్తూ ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు అవకాశం కల్పించింది. అయితే పెద్దగా స్పందన రాకపోవడంతో 25 శాతం రాయితీ గడువును ఈ నెల 30 వరకు పొడిగించింది.

మొత్తం దరఖాస్తులు 1,95,963

ఆమోదించినవి 1,40,299

రుసుం చెల్లించినవి 32,781

క్రమబద్ధీకరించినవి 13,765

ప్రభుత్వానికి సమకూరిన ఆదాయం రూ.58.38 కోట్లు

ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల వారీగా ఇలా..

మున్సిపాలిటీ మొత్తం ఆ.వి రుసుం క్ర .వి సమకూరిన

దరఖాస్తులు చెల్లించినవి ఆదాయం

(రూ.కోట్లలో)

నాగర్‌కర్నూల్‌ 16,158 10,782 2,588 1,522 4.20

కల్వకుర్తి 11,482 9,491 1,936 806 4.11

అచ్చంపేట 12,045 10,765 1,765 94 2.53

కొల్లాపూర్‌ 4,595 3,718 662 238 1.17

అలంపూర్‌ 431 366 121 61 0.15

వడ్డేపల్లి 1,941 1,787 355 279 0.68

అయిజ 9,845 5,244 1,074 652 1.34

గద్వాల 14,387 4,000 1,700 848 2.74

జడ్చర్ల 17,684 11,070 2,597 819 5.68

మహబూబ్‌నగర్‌ 31,438 22,183 6,817 2,160 15.62

భూత్పూర్‌ 6,119 4,703 1,260 590 2.12

పెబ్బేరు 7,306 6,484 1,443 391 1.74

కొత్తకోట 7,582 7,318 1,284 648 1.50

ఆత్మకూర్‌ 3,812 3,150 731 623 0.86

అమరచింత 447 333 162 121 0.51

వనపర్తి 29,072 25,820 4,693 2,499 5.80

మక్తల్‌ 10,577 9,062 1,170 563 2.15

కోస్గి 3,982 1,987 904 135 1.81

నారాయణపేట 7,060 2,036 1,519 707 3.67

ఆ.వి: ఆమోదించినవి క్ర .వి: క్రమబద్ధీకరించినవి

25 శాతం రాయితీ ఇచ్చి గడువు

పెంచినా నెరవేరని లక్ష్యం

ఉమ్మడి జిల్లాలోని అన్ని

మున్సిపాలిటీల్లో అదే పరిస్థితి

విస్తృతంగా ప్రచారం కల్పించినా కనిపించని ఫలితం

మరో రెండు రోజులే అవకాశం

విస్తృతంగా ప్రచారం..

ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజులో 25 శాతం రాయితీ కల్పించిన ప్రభుత్వం వందశాతం లక్ష్యం నెరవేర్చాలని అధికారులను ఆదేశించింది. దీంతో ఈ పథకంపై అధికార యంత్రాంగం విస్తృత ప్రచారం కల్పించింది. ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో అధికారులు సామాజిక, ప్రసార మాధ్యమాలు, ఇతర విభాగాల ద్వారా అవగాహన కల్పించినప్పటికీ దరఖాస్తుదారులు పెద్దగా ముందుకు రాలేరు. సోమవారం వరకు క్రమబద్ధీకరణకు 32,781 మంది దరఖాస్తుదారులు రుసుం చెల్లించగా 13,765 మందికి క్రమబద్ధీకరణ ఉత్తర్వులు జారీ చేశారు. సుమారు 55,664 దరఖాస్తులను నిషేధిత జాబితాలో చేర్చడంతో సంబంధిత దరఖాస్తుదారులు వాటిని సరి చేయాలంటూ ఆయా శాఖల అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. సాంకేతిక కారణాలతో నిషేధిత జాబితాలోకి వెళ్లాయని, సంబంధిత స్థలాల ఆధారాలు అందిస్తేనే వాటిని సరి చేస్తామని ఓ అధికారి పేర్కొన్నారు. అయితే 25 శాతం రాయితీ గడువుకు బుధవారం (ఈ నెల 30) వరకు మాత్రమే గడువు ఉండటంతో ఎంత మేరకు లక్ష్యం చేరుకుంటారో వేచి చూడాల్సిందే.

స్పందన అంతంతే.. 1
1/1

స్పందన అంతంతే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement