శక్తికి గ్రామీ అవార్డు.. ప్రధాని హర్షం | Grammys 2024 Shakti: PM Modi Congratulate Shankar Mahadevan etc | Sakshi

శక్తికి గ్రామీ అవార్డు.. ప్రధాని హర్షం

Feb 5 2024 2:26 PM | Updated on Feb 5 2024 3:03 PM

Grammys 2024 Shakti: PM Modi Congratulate Shankar Mahadevan etc - Sakshi

సంగీతం పట్ల మీ అసాధారణమైన ప్రతిభ, అంకితభావం ప్రపంచవ్యాప్తంగా హృదయాలను గెలుచుకున్నాయి. భారతదేశం గర్విస్తోంది.

అంతర్జాతీయ వేదికపై భారతీయ కళాకారులు విజయకేతనం ఎగరేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. భారతీయ సంగీత కళాకారులు జాకీర్‌ హుస్సేన్‌(తబలా),శంకర్‌ మహదేవన్‌ (సింగర్‌)లు ఉన్న శక్తి బ్యాండ్‌కు తాజాగా గ్రామీ అవార్డు దక్కింది. వీళ్లు కంపోజ్‌ చేసిన ‘దిస్‌ మూమెంట్‌’ ఉత్తమ గ్లోబల్‌ మ్యూజిక్‌ ఆల్బమ్‌ అవార్డును సొంతం చేసుకుంది.  

సంగీతం పట్ల మీ అసాధారణమైన ప్రతిభ, అంకితభావం ప్రపంచవ్యాప్తంగా హృదయాలను గెలుచుకున్నాయి. భారతదేశం గర్విస్తోంది. మీ కృషికి ఈ విజయాలే నిదర్శనం అని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. 

దిస్‌ మూమెంట్‌ పాటను జాన్‌ మెక్‌లాఫ్లిన్‌ (గిటార్‌), జాకిర్‌ హుస్సేన్‌ (తబలా), శంకర్‌ మహదేవన్‌(సింగర్‌), గణేశ్‌ రాజగోపాలన్‌ (వయోలిన్‌) వంటి ప్రతిభావంతులైన ఎనిమిది మంది ‘శక్తి’ బ్యాండ్‌ పేరిట కంపోజ్‌ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా పోటీని ఎదుర్కొని ‘శక్తి’ విజేతగా నిలవడంతో అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 

అంతకు ముందు.. శంకర్‌ మహదేవన్‌ మాట్లాడుతూ ‘నాకు ప్రతి విషయంలో ఎంతో ప్రోత్సాహం అందించిన నా భార్యకు ఈ అవార్డును అంకితం చేస్తున్నాను. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను’ అని ఆనందం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement