పాక్‌, కివీస్‌లకు అంత సీన్‌ లేదు.. సెమీస్‌లో ఆ 4 జట్లే! ఫైనల్లో: ఆండర్సన్‌ | I Can See England Beating India In Tight Final: Anderson Prediction WC 2023 | Sakshi

WC 2023: పాక్‌, కివీస్‌లకు అంత సీన్‌ లేదు.. సెమీస్‌లో ఆ 4 జట్లే! ఫైనల్లో: ఆండర్సన్‌

Oct 9 2023 7:43 PM | Updated on Oct 9 2023 8:59 PM

I Can See England Beating India In Tight Final: Anderson Prediction WC 2023 - Sakshi

టీమిండియా

ICC WC 2023 Winner Prediction: వన్డే వరల్డ్‌కప్‌-2023లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌ టైటిల్‌ నిలబెట్టుకుంటుందని ఆ జట్టు వెటరన్‌ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌ ధీమా వ్యక్తం చేశాడు. ఐసీసీ ఈవెంట్‌ ఫైనల్లో ఈసారి టీమిండియాను ఓడించి ట్రోఫీ గెలుస్తుందంటూ అతి విశ్వాసం ప్రదర్శించాడు. 

కాగా 2019 ప్రపంచకప్‌ హీరో బెన్‌ స్టోక్స్‌ రాకతో ఇంగ్లిష్‌ జట్టు మరింత పటిష్టంగా మారిన విషయం తెలిసిందే. అయితే, ప్రపంచకప్‌-2023లో భారత్‌ వేదికగా ఆడిన తొలి మ్యాచ్‌కే స్టోక్సీ దూరం కావడం ఇంగ్లండ్‌పై ప్రభావం చూపింది.

ఆరంభ మ్యాచ్‌లో కివీస్‌ చేతిలో చిత్తుగా ఓడి
ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో ఈవెంట్‌ ఆరంభ మ్యాచ్‌లో ఏకంగా 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది  బట్లర్‌ బృందం. -2.149 రన్‌రేటుతో పాయింట్ల పట్టికలో ప్రస్తుతం అట్టడుగున పదో స్థానంలో ఉంది. ఈ క్రమంలో మంగళవారం ధర్మశాల వేదికగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు సన్నద్ధమవుతోంది.

రెండో మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ టెస్టు క్రికెటర్‌గా కొనసాగుతున్న ఆండర్సన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్‌కప్‌ 13వ ఎడిషన్‌లో సెమీస్‌ చేరే జట్లు, టైటిల్‌ విన్నర్‌పై తన అంచనాను తెలియజేశాడు.


ఆండర్సన్‌(PC: X)

సెమీస్‌లో ఆ 4 జట్లే.. ఇక ఫైనల్లో
‘‘ఇంగ్లండ్‌, ఇండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ఈసారి సెమీ ఫైనలిస్టులుగా నిలుస్తాయి. ఆసీస్‌తో ఇటీవలి సిరీస్‌లో సౌతాఫ్రికా(3-2తో గెలుపు) అదరగొట్టింది. నిజానికి ప్రస్తుతం ప్రొటిస్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పటిష్టంగా ఉంది. బౌలింగ్‌లోనూ మంచి ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇక.. పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌ కూడా సెమీస్‌ దిశగా పయనిస్తాయి.

కానీ.. టాప్‌-4లో నిలవలేవు. నా అంచనా ప్రకారం.. హోరాహోరీ ఫైనల్లో ఇంగ్లండ్‌ టీమిండియాను ఓడించి టైటిల్‌ గెలుస్తుంది’’ అని దిగ్గజ బౌలర్‌ ఆండర్సన్‌ బీబీసీ టెస్టు మ్యాచ్‌ స్పెషల్‌ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా నవంబరు 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరుగనుంది. 

చదవండి: నువ్వెందుకు ఉన్నట్లు? అయినా రాహుల్‌ను ఎందుకు ఆడించట్లేదు: యువీ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement