సూపర్‌ బాల్‌.. రోహిత్‌కు మైండ్‌ బ్లాంక్‌! వీడియో వైరల్‌ | Rohit Sharma gets out on a 9-ball duck on an unplayable delivery of Tim Southee | Sakshi

IND vs NZ: సూపర్‌ బాల్‌.. రోహిత్‌కు మైండ్‌ బ్లాంక్‌! వీడియో వైరల్‌

Oct 24 2024 4:30 PM | Updated on Oct 24 2024 6:34 PM

Rohit Sharma gets out on a 9-ball duck on an unplayable delivery of Tim Southee

పుణే వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ నిరాశ‌ప‌రిచాడు. మొద‌టి ఇన్నింగ్స్‌లో కివీస్ పేస‌ర్ టిమ్ సౌథీ అద్బుత‌మైన బంతితో హిట్‌మ్యాన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచే సౌథీ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు శ‌ర్మ ఇబ్బంది ప‌డ్డాడు. 

ఈ క్రమంలో భార‌త ఇన్నింగ్స్ 3 ఓవ‌ర్ వేసిన సౌథీ ఆఖ‌రి బంతిని మిడిల్ అండ్ ఆఫ్‌దిశ‌గా గుడ్ లెంగ్త్ డెలివ‌రీగా సంధించాడు. ఆ బంతిని హిట్‌మ్యాన్ డిఫెన్స్ ఆడే ప్ర‌య‌త్నం చేశాడు. కానీ బంతి ట‌ర్న్ అయ్యి రోహిత్ బ్యాక్ ప్యాడ్ తాకుతూ స్టంప్స్‌ను గిరాటేసింది. 

దీంతో సౌథీ దెబ్బ‌కు రోహిత్ త‌న‌ ఖాతా తెర‌వ‌కుండానే పెవిలియ‌న్ చేరాడు. రోహిత్ ఔటైన వెంట‌నే మైదానంలో ఉన్న ప్రేక్ష‌కులు అంతా ఒక్క‌సారిగా సైలెంట్ అయిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. ఇక8 ఓవ‌ర్లు ముగిసే స‌రికి భార‌త్ వికెట్ న‌ష్టానికి 10 ప‌రుగులు చేసింది. క్రీజులో గిల్‌(8), జైశ్వాల్‌(2) ప‌రుగులతో ఉన్నారు.

7 వికెట్ల‌తో చెల‌రేగిన సుంద‌ర్‌..
అంత‌కుముందు న్యూజిలాండ్ త‌మ మొద‌టి ఇన్నింగ్స్‌లో 259 ప‌రుగుల‌కు ఆలౌటైంది. భార‌త స్పిన్న‌ర్ వాషింగ్ట‌న్ సుంద‌ర్ 7 వికెట్లతో అద‌ర‌గొట్టాడు.

అత‌డితో పాటు ర‌విచంద్ర‌న్ అశ్విన్ 3 వికెట్ల‌తో స‌త్తాచాటాడు. కివీస్ బ్యాట‌ర్ల‌లో డెవాన్ కాన్వే(76) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. ర‌చిన్ ర‌వీంద్ర‌(65) కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement