శబరిమల భక్తుల కోసం 128 ప్రత్యేక రైళ్లు | 128 special trains for Sabarimala: Southern Central Railway | Sakshi
Sakshi News home page

శబరిమల భక్తుల కోసం 128 ప్రత్యేక రైళ్లు

Published Fri, Nov 22 2013 6:55 AM | Last Updated on Sat, Sep 2 2017 12:52 AM

128 special trains for Sabarimala: Southern Central Railway

సాక్షి, హైదరాబాద్: శబరిమల భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే 128 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్లు హైదరాబాద్, కాకినాడ, నిజామాబాద్, విజయవాడ, మచిలీపట్నం, నర్సాపూర్, సిర్పూర్ కాగజ్‌నగర్, కరీంనగర్, ఔరంగాబాద్, ఆదిలాబాద్, అకోల స్టేషన్‌ల నుంచి కొల్లాం వరకు ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ఈ నెల 25వ తేదీ ఉదయం 8 గంటలకు శబరి ప్రత్యేక రైళ్ల అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమవుతుంది.
 
     నిజామాబాద్-కొల్లాం (07613/07614) మధ్య 2 ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. డిసెంబర్ 22న మధ్యాహ్నం ఒంటి గంటకు నిజామాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11.30కు కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో డిసెంబర్ 24న తెల్లవారుజామున 1.45 గంటలకు కొల్లాం నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.35 గంటలకు నిజామాబాద్ చేరుకుంటుంది. ఈ రైళ్లు కామారెడ్డి, మేడ్చల్, బొల్లారం, మల్కాజిగిరి, కాచిగూడ, షాద్‌నగర్, జ డ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల, కర్నూలు, డోన్, గుత్తి, తా డిపత్రి, కొండాపురం, మద్దునూరు, ఎర్రగుంట్ల, కడప, రాజం పేట్, కోడూరు, రేణిగుంట, తిరుపతి స్టేషన్లలో ఆగుతాయి.
 
     కాకినాడ-కొల్లాం (07211/07212) మధ్య 38 సర్వీసులు రాకపోకలు సాగిస్తాయి. ఈ రైళ్లు డిసెంబర్ 12,13,15,16, 18,18,19,21,22 జనవరి 1,2,4,5,7,8,10,11,13,14,15 తేదీల్లో రాత్రి 10.30 గంటలకు కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11.45 గంటలకు కొల్లాం చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో డిసెంబర్ 14,15,17,18, 20,21,23,24 జనవరి 3,4,6,7,9,10,12,13,15,16,17 తేదీ ల్లో తెల్లవారుజామున 2.30 గంటలకు కొల్లాం నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు కాకినాడ చేరుకుంటాయి. సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, నిడుబ్రోలు, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయి.
 
     నర్సాపూర్-కొల్లాం (07217/07218) మధ్య 4 ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. డిసెంబర్ 30,31 తేదీల్లో రాత్రి 8.50 గంటలకు నర్సాపూర్ నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11.45 గంటలకు కొల్లాం చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో జనవరి 1,2 తేదీల్లో తెల్లవారు జామున 2.30 గంటలకు కొల్లాం నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.35కు నర్సాపూర్ చేరుకుంటాయి. పాలకొల్లు, వీరవాసరం, భీమవరం,  టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ,తరిగొప్పుల, విజయవాడ, తెనాలి, నిడుబ్రోలు, బాప ట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు స్టేషన్లలో ఈ రైళ్లు  ఆగుతాయి.
 
     విజయవాడ-కొల్లాం (07219/07220) మధ్య 4 సర్వీసులు నడుస్తాయి. జనవరి 3,9 తేదీల్లో రాత్రి 11.55 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11.45 గంటలకు కొల్లాం చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో జనవరి 5, 11 తేదీల్లో తెల్లవారు జామున 2.30 గంటలకు కొల్లాం నుంచి బయలుదేరి మరుసటి రోజు తెల్లవారు జామున 3 గంటలకు విజయవాడ చేరుకుంటాయి. తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు తదితర స్టేషన్లలో ఆగుతాయి.
 
     మచిలీపట్నం-కొల్లాం (07221/07222) మధ్య 4 ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. జనవరి 6,12 తేదీల్లో రాత్రి 11.20 గంటలకు మచిలీపట్నం నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11.45 గంటలకు కొల్లాం చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో జనవరి 8,14 తేదీల్లో తెల్లవారు జామున 2.30 గంటలకు కొల్లాం నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.30 గంటలకు మచిలీపట్నం చేరుకుంటాయి. చిలకలపూడి, పెడన, కౌతారం, గుడ్లవల్లేరు, గుడివాడజంక్షన్, తరిగొప్పుల, విజయవాడ, తెనాలి మీదుగా ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.
 
     విజయవాడ-కొల్లాం (07213/07214) మధ్య గుంటూరు, తిరుపతి మీదుగా 6 ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. డిసెంబర్ 7,11,18 తేదీల్లో రాత్రి 11.45 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి రెండవ రోజు తెల్లవారు జామున 3.45 గంటలకు కొల్లాం చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో డిసెంబర్ 9,13,20 తేదీల్లో ఉదయం 5.55 గంటలకు కొల్లాం నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకు విజయవాడ చేరుకుంటాయి.
 
     కరీంనగర్-కొల్లాం (07113) వరకు డిసెంబర్ 30న ఒక ప్రత్యేక రైలు బయలుదేరి వెళ్తుంది. ఇది రాత్రి 9.15 గంటలకు కరీంనగర్ నుంచి బయలుదేరి రెండవ రోజు తెల్లవారు జామున 3.45 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్, మహబూబ్‌బాద్, డోర్నకల్, ఖమ్మం, విజయవాడ మీదుగా వెళ్తుంది.
 
     ఔరంగాబాద్-కొల్లాం (07505) కు డిసెంబర్ 6,20 తేదీల్లో రెండు రైళ్లు వెళ్తాయి. ఉదయం 10.15 గంటలకు ఔరంగాబాద్ నుంచి బయలుదేరి రెండవ రోజు ఉదయం 3.45 గంటలకు కొల్లాం చేరుకుంటాయి. బాసర, నిజామాబాద్, కామారెడ్డి, మేడ్చల్, బొల్లారం, మల్కాజిగిరి, కాచిగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల, కర్నూలు, డోన్, గుత్తి, తాడిపత్రి తదితర స్టేషన్‌ల మీదుగా వెళ్తాయి.
     ఆదిలాబాద్-కొల్లాం (07509) వరకు నిజామాబాద్, డోన్, రేణిగుంట, తిరుపతి మీదుగా డిసెంబర్ 27 మధ్యాహ్నం 12 గంటలకు ఒక రైలు బయలుదేరుతుంది. ఇది రెండవ రోజు తెల్లవారు జామున 3.45 గంటలకు కొల్లాం చేరుకుంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement