సాక్షి, అమరావతి: రెవెన్యూ శాఖకు 670 కొత్త పోస్టులు మంజూరయ్యాయి. ప్రతి మండల రెవెన్యూ అధికారి కార్యాలయానికి ఒక్కొక్కటి చొప్పున 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మీసేవ, మీఇంటికి మీభూమి, ఈ–పంట, లోన్ ఛార్జి నమూనా నమోదు తదితర ఐటీ సేవల విషయంలో మండల రెవెన్యూ అధికారికి సహకారం అందించేందుకు ఈ పోస్టులను మంజూరు చేసింది. వీటిని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ద్వారా ప్రత్యక్ష నియామక విధానంలో భర్తీ చేసుకునేందుకు అనుమతించింది. ఈ పోస్టుకు రూ. 16,400 – 49,870 పేస్కేలుగా నిర్ణయించింది. ప్రస్తుతం అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న మండల స్థాయి రెవెన్యూ డేటా ఎంట్రీ అసిస్టెంట్ జాబ్ ఛార్టునే ఈ కొత్త పోస్టులకు అమలు చేస్తారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేసి ఏపీపీఎస్సీకి నియామక బాధ్యతలు అప్పగించాలని ఆర్థిక శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
రవాణాశాఖలో 579 పోస్టులకు ఓకే..
రవాణా శాఖలో అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్లు, జూనియర్ అసిస్టెంట్లు, ఇతర సిబ్బంది భర్తీకి సంబంధించి కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదనలు పంపించారు. అన్ని కేడర్‌లలో కలిపి మొత్తం 579 మంది ఖాళీలను ఏపీపీఎస్సీ ద్వారా వెంటనే భర్తీ చేయాలని అందులో కోరారు.
రెవెన్యూ శాఖకు 670 కొత్త పోస్టులు
Published Fri, Jan 20 2017 2:30 AM | Last Updated on Tue, Sep 5 2017 1:37 AM
Advertisement
Advertisement