
సాక్షి, పశ్చిమగోదావరి: ఏలూరు రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీలో ఇండోర్ స్టేడియాన్ని ఏపీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మంగళవారం ప్రారంభించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ జయంతిని పురస్కరించుకొని.. కలామ్ చిత్రపటానికి పూలమాల వేసి ఆళ్ల నాని నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశ భవిష్యత్తు.. భావి విద్యార్థులదే అని అన్నారు. పలు కంపెనీలలో రామచంద్ర విద్యార్థులకు ప్లేస్‌మెంట్ ఉద్యోగాలు రావటంతో వారిని అభినందించారు. ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటున్న రామచంద్ర ఇంజనీరింగ్ యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరిగినప్పుడు ఈ కాలేజీకి వచ్చానని.. ఇక్కడి నుంచే తాను విజయం సాధించాననే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకొన్నారు. ఏపీలో విద్య, వైద్యానికి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment