టెన్త్ టాపర్ రాగిణికి ‘అమెరికా’ అవార్డు | america award to tenth topper ragini | Sakshi
Sakshi News home page

టెన్త్ టాపర్ రాగిణికి ‘అమెరికా’ అవార్డు

Published Wed, Aug 14 2013 4:36 AM | Last Updated on Fri, Sep 1 2017 9:49 PM

america award to tenth topper ragini

కొత్తకోట(రావికమతం), న్యూస్‌లైన్ : ఈ ఏడాది మార్చిలో విడుదలైన పదోతరగతి ఫలితాల్లో  9.8 పాయింట్లు సాధించి బాలికల్లో జిల్లా టాపర్‌గా నిలిచిన కొత్తకోట హైస్కూల్ విద్యార్థిని దివి పుష్ఫరాగిణికి అవార్డు లభించింది. అమెరికాలోని తెలుగు అసోషియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా సంఘం వారు 150 డాలర్లు (సుమారు రూ. 8,600లు) అవార్డుగా అందిస్తామని ప్రకటించినట్టు ఆ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు జి.ప్రకాశరావు మంగళవారం తెలిపారు.

ఈ అవార్డును వచ్చే నెల 14న హైదరాబాద్‌లోని రవీంధ్రభారతిలో అందజేసేందుకు అమెరికా నుంచి ఆ సంఘ సభ్యులు వస్తున్నారన్నారు. ఈ సందర్భంగా పుష్ఫరాగిణిని పాఠశాల హెడ్మాష్టరుతో పాటు, ఉపాధ్యాయులు, తల్లితండ్రులు, పలువురు అభినందించారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement