విజయవాడ : పదేళ్లలో రాష్ట్రానికి పూర్వ వైభవం వస్తుందని ఏపీఎన్జీవోస్ అధ్యక్షుడు అశోక్‌బాబు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నాన్-గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ పశ్చిమ కృష్ణా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడలోని వేదిక ఫంక్షన్ హాలులో రాష్ట్ర నాయకులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అశోక్‌బాబు మాట్లాడుతూ ఉద్యోగుల పీఆర్‌సీపై రెండు రోజులలో జీవో వస్తుందన్నారు. కేబినెట్ సబ్ కమిటీ ఎదుట ఏడు ప్రధాన డిమాండ్లను ఉంచినట్లు తెలిపారు.
కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని కోరినట్లు చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా అనేది పూర్తిగా రాజకీయపరమైన అంశమని అన్నారు. బీజేపీ, టీడీపీ ప్రత్యేక హోదా సాధిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజాసేవకు సంబంధించి కొన్ని శాఖలు ముందుగా విజయవాడకు వస్తాయని వివరించారు. అశోక్‌బాబు, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డిలను సన్మానించారు.