సాక్షి, హైదరాబాద్: అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో పదిహేనేళ్ల వయసువారు సైతం విధిగా క్యాన్సర్ పరీక్షలు చేయించుకుంటున్నారని, కానీ భారత్‌లో మాత్రం క్యాన్సర్ వ చ్చిందని తెలిసినా చికిత్సను నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రిన్స్‌బర్గ్ ఆంకాలజీ వర్సిటీ చైర్మన్, ప్రముఖ గైనిక్ క్యాన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ స్టాన్లీమార్క్స్ ఆందోళన వ్యక్తం చేశారు.
క్యాన్సర్ వ్యాక్సిన్‌పై దేశంలో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక ఓ హోటల్‌లో శుక్రవారం అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ మెడికల్ డెరైక్టర్ డాక్టర్ బాబయ్యతో కలిసి స్టాన్లీమార్క్స్ విలేకరులతో మాట్లాడారు. విదేశాల్లో రొమ్ము క్యాన్సర్ ఎక్కువగా ఉందని, భారత్‌లో గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ ఎక్కువ ఉందని తెలిపారు. అమెరికాలో 75 శాతం మంది ముందస్తుగా వ్యాక్సిన్ వేయించుకుంటే, భారత్‌లో ఒక్కశాతం కూడా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి ఇకనుంచైనా మారేలా చర్యలు చేపట్టాలన్నారు.
క్యాన్సర్ వాక్సిన్‌పై అవగాహన పెంచాలి: స్టాన్లీమార్క్స్
Published Sat, Mar 8 2014 4:20 AM | Last Updated on Sat, Sep 2 2017 4:27 AM
Advertisement
Advertisement