గోదావరి వంటకాలంటే తనకెంతో మక్కువని, ‘రాజమహేంద్రవరం’ అనే పేరే ఎంతో వైభవంగా ఉంటుందని హీరో నాని అన్నారు. ఆయన హీరోగా, లావణ్యా త్రిపాఠి హీరోయిన్‌గా మారుతి దర్శకత్వంలో రూపొందిన ‘భలే భలే మగాడివోయ్’ చిత్రం ఇటీవల విడుదలైంది. చిత్రం యూనిట్ శనివారం రాజమండ్రి స్వామి థియేటర్‌లో ప్రేక్షకుల్ని కలుసుకుని, విజయూనందాన్ని పంచుకుంది.హీరో నాని, హీరోరుున్ లావణ్యా త్రిపాఠి, దర్శకుడు మారుతి, నిర్మాత బన్ని వాసు సినిమాను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. నాని మాట్లాడుతూ తన రెండవ చిత్రనిర్మాణం గోదావరి పరిసరాల్లోనే ఇక్కడే జరిగిందన్నారు.
ఒక లోపమున్న పాత్రను సృష్టించి, చక్కని చిత్రాన్ని తీస్తే విజయం సాధిస్తుందని ఈ చిత్రం నిరూపించిందన్నారు. ‘భలే భలే మగాడివోయ్’ సీక్వెల్ ఉంటుందన్నారు. సినిమాలోని డైలాగులను చెప్పి ప్రేక్షకులను అలరించారు. రాజమండ్రి వస్తే తనకు సొంత ఊరు వచ్చినట్లుంటుందని దర్శకుడు మారుతి అన్నారు. ఇక్కడి వారి అభిమానం, ఆప్యాయత మరువలేనివన్నారు. అభిమానులను మెప్పించే మరిన్నిచిత్రాలను రూపొందిస్తానన్నారు. సినిమాలో అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు, విజయవంతం చేసిన ప్రేక్షకులకు హీరోయిన్ లావణ్యా త్రిపాఠి కృతజ్ఞతలు తెలిపారు.
- ఆర్యాపురం
‘రాజమహేంద్రవరం’.. ఆ పేరే వైభవోపేతం
Published Sun, Sep 13 2015 12:22 AM | Last Updated on Sun, Sep 3 2017 9:16 AM
Advertisement