విధి నిర్వహణలోనే దివికేగి..
- గుజరాత్‌లో బీఎస్‌ఎఫ్ జవాన్ మృతి
- మృతుడు తూర్పు గోదావరి వాసి
పేరాయి చెరువు (ఉప్పలగుప్తం), న్యూస్‌లైన్ : దేశ రక్షణ కోసం జీవితాన్ని అంకితం చేసిన ఓ బీఎస్‌ఎఫ్ జవాను రోడ్డు ప్రమాదంలో మరణించాడు. తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం పేరాయిచెరువుకు చెందిన కొల్లు గోపాలకృష్ణ (33) ఈ ప్రమాదంలో చనిపోయాడు. గురువారం తెల్లవారుజామున గుజరాత్ రా ష్ట్రం బరోడాలో చెక్‌పోస్ట్ వద్ద పహరా కాస్తున్న గోపాలకృష్ణను వేగంగా వచ్చిన వాహనం ఢీకొనడంతో మరణించాడని అతడి కుటుంబ సభ్యులు శుక్రవారం తెలిపారు. గోపాలకృష్ణకు భార్య అరుణ, కుమారులు సుభాష్, బాబు ఉన్నారు.
పేరాయిచెరువుకు చెందిన నిరుపేద రైతు కుటుంబానికి చెందిన గోపాలకృష్ణ 16వ ఏటనే సైన్యంలో చేరి, జవాన్ అయ్యాడు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సాధించిన గోపాలకృష్ణ అతడి తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా అంచెలంచెలుగా ఎదిగాడు. వృద్ధాప్యంలో ఉన్న గోపాలకృష్ణ తల్లిదండ్రులు సుబ్బారావు, సుభద్ర తమ ఒక్కగానొక్క కుమారుడి మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. మరో ఏడాదిలో ఆర్మీ నుంచి వచ్చి కుటుం బంతో సంతోషంగా గడుపుతాడనుకున్న కుమారుడు ఇలా తిరిగిరాని లోకానికి వెళ్లిపోయాడంటూ రోదిస్తున్నారు.
గుజరాత్ ప్రభుత్వం అతడి మృతదేహాన్ని స్వగ్రామానికి పంపే ఏర్పాట్లు చేసింది. శుక్రవారం అర్ధరాత్రి గోపాలకృష్ణ భౌతికకాయం ఇక్కడికి చేరుతుందని కుటుంబసభ్యులు తెలిపారు. అధికార లాంఛనాలతో స్వగ్రామమైన పేరాయిచెరువులో శనివారం గోపాలకృష్ణ అంత్యక్రియలు జరుగుతాయని చెప్పా రు. గతేడాది ఇదే గ్రామంలో ఉం టున్న చెల్లెలు అర్జునాంబ ఇంట జరి గిన శుభకార్యానికి హాజరై.. అందరితో సంతోషంగా గడిపిన గోపాలకృష్ణ ఇలా మరణించడంపై గ్రామస్తులు విచారం వక్తం చేస్తున్నారు.