BSF soldier
-
Namami Gange గంగానదిపై మహిళా జవాన్లు
శుభ్రత ఎక్కడుంటే మహిళలు అక్కడుంటారు. లేదా, మహిళలు ఎక్కడుంటే శుభ్రత అక్కడ ఉంటుంది. శుభ్రంగా ఉంచటం అన్నది మహిళల సహజ నైజం. మహిళలే కాదు, దైవత్వం కూడా శుభ్రత ఉన్న చోట కొలువై ఉంటుంది. ‘క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్›్ట టు గాడ్లీనెస్’ అనే మాట వినే ఉంటారు.ఇంటిని, సమాజాన్ని శుభ్రంగా ఉంచటంలో కీలక బాధ్యతను వహిస్తున్న మహిళలే ఇప్పుడు తాజాగా దైవకార్యం వంటి ‘స్వచ్ఛ గంగా’ ఉద్యమ ప్రచారాన్ని చేపట్టారు. గంగానదిని ప్రక్షాళన చేయవలసిన అవసరం గురించి, గంగా ప్రవాహానికి అడ్డుగా ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించటం గురించి ప్రజల్లో అవగాహన కలిగించటం కోసం మొత్తం 20 మంది మహిళలు గంగానదిపై నవంబర్ 4న రెండు తెప్పల్లో ర్యాలీగా బయల్దేరారు! ఉత్తరాఖండ్, తెహ్రీ ఘరేవాల్ జిల్లాలోని దేవప్రయాగ పట్టణం నుంచి మొదలైన ఈ ‘ఆల్ ఉమెన్ రివర్ ర్యాఫ్టింగ్’... మొత్తం 2,500 కి.మీ. దూరాన్ని 53 రోజుల పాటు ప్రయాణించి డిసెంబర్ 26న పశ్చిమబెంగాల్లోని గంగా సాగర్ వద్ద ముగుస్తుంది. అందరూ మహిళలే ఉన్న ఇలాంటి ఒక సుదీర్ఘమైన రివర్ ర్యాఫ్టింగ్ దేశంలో జరగడం ఇదే మొదటిసారి. మరొక విశేషం కూడా ఉంది. వీళ్లంతా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బి.ఎస్.ఎఫ్) దళానికి చెందిన మహిళలు. బి.ఎస్.ఎఫ్. మహిళా విభాగం, ‘నమామి గంగే’ ప్రాజెక్టు కలిసి ఉమ్మడిగా ఈ రివర్ ర్యాఫ్టింగ్ను నిర్వహిస్తున్నాయి. ర్యాఫ్టింగ్ ప్రారంభానికి ముందు మహిళా శక్తికి, సాధికారతకు సంకేతంగా 11 మంది బాలికల పాదాలకు నమస్కరించి పూజలు జరిపారు. ఆ తర్వాత ‘తెప్పలు’ కదిలాయి. ఈ ప్రచారానికి బి.ఎస్.ఎఫ్. సబ్ ఇన్స్పెక్టర్ ప్రియా మీనా నాయకత్వం వహిస్తున్నారు. దేశ సరిహద్దుల్లో విధి నిర్వహణలో ఉన్న మహిళా జవాన్లలో 20 మందిని కఠిన ర్యాఫ్టింగ్ శిక్షణ తర్వాత ఇందుకోసం ఎంపిక చేశామని మీనా అన్నారు. ‘‘రెండు తెప్పలుగా సాగే ఈ బోటింగ్ యాత్రలో భాగంగా గంగా తీరం వెంబడి 43 పట్టణాలలో ఈ తరం యువతీ యువకులకు ‘పరిశుభ్రతకు, నిరంతరాయ ప్రవాహానికి’ అనువుగా గంగానదిని ప్రక్షాళన చేయాలన్న సందేశాన్ని అందిస్తాం’’ అని ఆమె తెలి΄ారు. మరొక విశేషం.. వీరితో జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ‘నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగ’ చేతులు కలపటం. శుభ్రత దైవంతో సమానం అన్నప్పుడు, దైవ సమానంగా భారతీయులు కొలిచే గంగానదిని శుభ్రంగా ఉంచాలన్న సందేశంతో ప్రచారోద్యమం చేపట్టిన మహిళాశక్తి కూడా కొలవదగినదే. స్తుతించతగినదే. వారి మాట ఆలకించతగినదే. -
కేంద్రమంత్రికి చేరిన జవాను వీడియో
-
కేంద్రమంత్రికి చేరిన జవాను వీడియో
న్యూఢిల్లీ : జమ్ముకాశ్మీర్‌లో జవానుల ధీన స్థితిపై బీఎస్ఎఫ్ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ ఫేస్ బుక్‌లో పోస్ట్ చేసిన వీడియో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను చేరింది. సరిహద్దులో అత్యంత చలిలో విధులు నిర్వహిస్తున్న తమకు నాసిరకం ఆహారాన్ని పెడుతున్న వైనాన్ని వీడియోల్లో చిత్రీకరించి బయటి ప్రపంచానికి తెలిసేలా చేశాడు. సోషల్ మీడియాల్లో ఈ వీడియోను చూసిన వారందరూ తేజ్ బహదూర్ యాదవ్‌కు మద్దతుగా నిలిచారు. కేంద్ర ప్రభుత్వం జవాన్ల ఆహారం కోసం ఎన్ని సదుపాయాలు కల్పించినా మధ్యలో అధికారులు పందికొక్కుల్లా మింగేస్తున్నారని యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మాడిన రొట్టె, పసుపు రసం, సాంబార్ మాత్రమే ఆహారంగా ఇస్తున్నారని వీడియోలో చిత్రీకరించి మరీ ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశారు. తమ దీనగాథపై ప్రధాని మోదీ స్పందించాలని యాదవ్ కోరారు. యాదవ్ పోస్ట్ చేసిన వీడియోలు వైరల్ అవ్వడంతో కొద్దిసేపటికే ఆ వీడియోలు మీడియాల్లో దర్శనమిచ్చాయి. ఈ వీడియోలు ప్రసారమయ్యే సమయానికే తనపై సీనియర్ అధికారులు వేటు వేసే అవకాశం ఉందనే అనుమానాన్ని కూడా యాదవ్ వ్యక్తం చేశారు. మీడియాలో యాదవ్ వీడియోలు ప్రసారమైన వెంటనే రాజ్‌నాథ్ స్పందించారు. దర్యాప్తు జరిపి వివరాలు తెప్పించాలని దోషులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
విధి నిర్వహణలోనే దివికేగి..
గుజరాత్లో బీఎస్ఎఫ్ జవాన్ మృతి మృతుడు తూర్పు గోదావరి వాసి పేరాయి చెరువు (ఉప్పలగుప్తం), న్యూస్‌లైన్ : దేశ రక్షణ కోసం జీవితాన్ని అంకితం చేసిన ఓ బీఎస్ఎఫ్ జవాను రోడ్డు ప్రమాదంలో మరణించాడు. తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం పేరాయిచెరువుకు చెందిన కొల్లు గోపాలకృష్ణ (33) ఈ ప్రమాదంలో చనిపోయాడు. గురువారం తెల్లవారుజామున గుజరాత్ రా ష్ట్రం బరోడాలో చెక్‌పోస్ట్ వద్ద పహరా కాస్తున్న గోపాలకృష్ణను వేగంగా వచ్చిన వాహనం ఢీకొనడంతో మరణించాడని అతడి కుటుంబ సభ్యులు శుక్రవారం తెలిపారు. గోపాలకృష్ణకు భార్య అరుణ, కుమారులు సుభాష్, బాబు ఉన్నారు. పేరాయిచెరువుకు చెందిన నిరుపేద రైతు కుటుంబానికి చెందిన గోపాలకృష్ణ 16వ ఏటనే సైన్యంలో చేరి, జవాన్ అయ్యాడు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సాధించిన గోపాలకృష్ణ అతడి తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా అంచెలంచెలుగా ఎదిగాడు. వృద్ధాప్యంలో ఉన్న గోపాలకృష్ణ తల్లిదండ్రులు సుబ్బారావు, సుభద్ర తమ ఒక్కగానొక్క కుమారుడి మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. మరో ఏడాదిలో ఆర్మీ నుంచి వచ్చి కుటుం బంతో సంతోషంగా గడుపుతాడనుకున్న కుమారుడు ఇలా తిరిగిరాని లోకానికి వెళ్లిపోయాడంటూ రోదిస్తున్నారు. గుజరాత్ ప్రభుత్వం అతడి మృతదేహాన్ని స్వగ్రామానికి పంపే ఏర్పాట్లు చేసింది. శుక్రవారం అర్ధరాత్రి గోపాలకృష్ణ భౌతికకాయం ఇక్కడికి చేరుతుందని కుటుంబసభ్యులు తెలిపారు. అధికార లాంఛనాలతో స్వగ్రామమైన పేరాయిచెరువులో శనివారం గోపాలకృష్ణ అంత్యక్రియలు జరుగుతాయని చెప్పా రు. గతేడాది ఇదే గ్రామంలో ఉం టున్న చెల్లెలు అర్జునాంబ ఇంట జరి గిన శుభకార్యానికి హాజరై.. అందరితో సంతోషంగా గడిపిన గోపాలకృష్ణ ఇలా మరణించడంపై గ్రామస్తులు విచారం వక్తం చేస్తున్నారు.