‘సదావర్తి’కి సగం డబ్బు చెల్లింపు | Chalathavada Lakshman paid Rs 30.125 crore | Sakshi
Sakshi News home page

‘సదావర్తి’కి సగం డబ్బు చెల్లింపు

Published Sat, Sep 23 2017 1:19 AM | Last Updated on Fri, Aug 10 2018 8:31 PM

Chalathavada Lakshman paid Rs 30.125 crore - Sakshi

సాక్షి, అమరావతి: సదావర్తి భూముల కొనుగోలుకు రెండో అత్యధిక పాటదారుడు సగం డబ్బులు చెల్లించారు. నాలుగు రోజుల క్రితం చెన్నైలో జరిగిన బహిరంగ వేలంలో 83.11 ఎకరాల భూములను రూ.60.25 కోట్లతో కొనేందుకు రెండో అత్యధిక బిడ్డరుగా నిలిచిన హైదరాబాద్‌కు చెందిన చదలవాడ లక్ష్మణ్‌ శుక్రవారం పాట మొత్తంలో సగం రూ.30 కోట్ల 12 లక్షల 50 వేలు చెల్లించారు. ఇందుకు సంబంధించి డబ్బులు అందినట్టు సదావర్తి సత్రం ఈవో శ్రీనివాసరెడ్డి ‘సాక్షి’ ప్రతినిధికి తెలిపారు. 

నిబంధనల ప్రకారం మిగిలిన సగం రూ.30.125 కోట్లను 90 రోజుల గడువు లోగా చెల్లించాల్సి ఉంటుంది. వేలంలో రూ.60.30 కోట్ల అత్యధిక ధరకు సత్రం భూమిని కొనుగోలు చేసేందుకు ముందు కొచ్చిన టీడీపీ నేత బద్వేలు శ్రీనివాసులు రెడ్డి వైదొలగడంతో లక్ష్మణ్‌కు అవకాశం వచ్చిన సంగతి విదితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement