chadalavada
-
రమణీయం రఘునాయకుని కల్యాణం (ఫోటోలు)
-
‘సదావర్తి’కి సగం డబ్బు చెల్లింపు
సాక్షి, అమరావతి: సదావర్తి భూముల కొనుగోలుకు రెండో అత్యధిక పాటదారుడు సగం డబ్బులు చెల్లించారు. నాలుగు రోజుల క్రితం చెన్నైలో జరిగిన బహిరంగ వేలంలో 83.11 ఎకరాల భూములను రూ.60.25 కోట్లతో కొనేందుకు రెండో అత్యధిక బిడ్డరుగా నిలిచిన హైదరాబాద్‌కు చెందిన చదలవాడ లక్ష్మణ్ శుక్రవారం పాట మొత్తంలో సగం రూ.30 కోట్ల 12 లక్షల 50 వేలు చెల్లించారు. ఇందుకు సంబంధించి డబ్బులు అందినట్టు సదావర్తి సత్రం ఈవో శ్రీనివాసరెడ్డి ‘సాక్షి’ ప్రతినిధికి తెలిపారు. నిబంధనల ప్రకారం మిగిలిన సగం రూ.30.125 కోట్లను 90 రోజుల గడువు లోగా చెల్లించాల్సి ఉంటుంది. వేలంలో రూ.60.30 కోట్ల అత్యధిక ధరకు సత్రం భూమిని కొనుగోలు చేసేందుకు ముందు కొచ్చిన టీడీపీ నేత బద్వేలు శ్రీనివాసులు రెడ్డి వైదొలగడంతో లక్ష్మణ్‌కు అవకాశం వచ్చిన సంగతి విదితమే. -
’తానా’ 40వ వార్షికోత్సవం రోజే మహాసభలు
తెనాలి: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆవిర్భవించి 40 ఏళ్లవుతున్న సందర్భంగా 2017లో జరగాల్సిన 21వ తానా మహాసభలను అదేరోజు నిర్వహించాలని నిర్ణరుుంచారు. ఏటా జులైలో నిర్వహించే ఈ సభలను వార్షికోత్సవం సందర్భంగా 2017 మే 26, 28 తేదీల్లో జరిపేందుకు నిర్ణరుుంచినట్టు ’తానా’ అధ్యక్షుడు చౌదరి జంపాల పంపిన ఈ-మెరుుల్ సందేశంలో పేర్కొన్నారు. మహాసభల థీమ్‌గా ‘ఎల్లలు లేని తెలుగు - ఎప్పటికీ వెలుగు’ అని నిర్ణరుుంచారు. తానా కన్వీనర్ డాక్టర్ కూర్మనాధరావు చదలవాడ ఆధ్వర్యంలో మహాసభల బృందం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. -
స్విమ్స్ ఆస్పత్రికి ఏటా రూ.24 కోట్లు మంజూరు
– టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం – విదేశాల్లోనూ వైభవోత్సవాలు – 36.67 కోట్ల కొనుగోళ్లకు ఆమోదం సాక్షి, తిరుమల: తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రిలో మెరుగైన వైద్య సదుపాయాలు, మౌళిక వసతుల కల్పన కోసం ఇకపై ఏటా రూ.24 కోట్లు కేటాయించాలని మంగళవారం జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానం చేశారు. ప్రస్తుతం ఏటా రూ.12 కోట్లు ఇస్తున్న మొత్తాన్ని రూ.24 కోట్లు పెంచుతూ తీర్మానించామని టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు మీడియాకు వెల్లడించారు. మరికొన్ని నిర్ణయాలివి..., – విదేశాల్లో శ్రీవారి వైభవోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. నిర్దేశిత ప్రాంతాల్లో రెండు రోజులపాటు జరిగే ఈ వైభవోత్సవాలకు పూర్తి ఖర్చును దాతలే భరించాల్సి ఉంటుందని, లభించే హుండీ కానుకల మొత్తం టీటీడీకే చెందుతాయని తీర్మానించారు. – ధర్మప్రచారంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ మత్సకార ప్రాంతాల్లో 500 ఆలయాల నిర్మాణంకోసం రాష్ట్ర దేవాదాయశాఖకు రూ.25 కోట్లు మంజూరు చేస్తూ టీటీడీ ఇది వరకే తీర్మానించింది. ఇందులో భాగంగానే మంగళవారం రూ.5 కోట్లు నిధులు విడుదలకు ఆమోదించింది. – గుజరాత్రాష్ట్రం అహ్మదాబాద్‌లోని టీటీడీ కల్యాణ మండపం, ఆడిటోరియం నిర్మాణాకి రూ.3.45 కోట్లు, చిత్తూరుజిల్లా శ్రీకాళహస్తి మండలం ఊరందూరు గ్రామంలో టీటీడీ కల్యాణ మండపం నిర్మాణానికి రూ.1.25 కోట్లు, గుంటూరు జిల్లా ఎడ్లపాడులో కల్యాణ మండపం నిర్మాణానికి రూ.1.25 కోట్లు మంజూరు. – చిత్తూరు జిల్లా పాకాల మండలం ఉట్లవారిపల్లెలోని సుబ్రమణ్యస్వామి ఆలయం చెంత డార్మిటరిహాలు, అదనపు గదుల నిర్మాణానికి రూ.95 లక్షలు, తూర్పుగోదావరి జిల్లా కరప మండలం జడృభవరం గ్రామంలో వేణుగోపాల స్వామి ఆలయం పుననిర్మాణం కోసం రూ.20.70 లక్షలు, విజయనగరం జిల్లా శృంగవరపు కోటలో రాయాలయం పునర్నిర్మాణం కోసం రూ.22.50 లక్షలు మంజూరు. – కడప జిల్లా ఖాజీపేట మండలం పుల్లూరు గ్రామంలో నాగేశ్వరస్వామివారి ఆలయంలో ఆలయ మరమ్మతులకు రూ.19.80 లక్షలు, మైదుకూరు మండలం వనిపెంట గ్రామంలోని చెన్నకేశవస్వామి వారి ఆలయ గోపురం, సాలహారం నిర్మాణం కోసం రూ.22.50 లక్షల మంజూరు. – టీటీడీ ఆస్థాన సిద్దాంతిగా మూడు సంవత్సరాల కాలపరిమితితో తంగిరాల వెంకటకృష్ణ పూర్ణప్రసాద్ నియామకం. – 2017 సంవత్సరానికి 10 లక్షల డైరీల ముద్రణకు ప్రయివేట్ ముద్రణకు ఆమోదం. – టీటీడీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల దంత చికిత్స నిమిత్తం నిర్దేశిత ఆస్పత్రుల జాబితాలో కృష్ణతేజ సూపర్‌స్పెషాలిటీ దంతవైద్యశాలకు అనుమతి. రూ.36.67 కోట్ల కొనుగోళ్లకు ఆమోదం 2016–17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.36.67 కోట్ల కొనగోళ్లకు ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. ఇందులో రూ.3.01 కోట్లతో టీటీడీ ఆస్పత్రులకు మందుల కొనుగోలు. రూ.8.46 కోట్లతో హర్యానలోని కర్నాల్ మిల్క్‌ఫుడ్స్ లిమిటెడ్ సంస్థ ద్వారా 2.25 లక్షల కిలోలు ఆవు నెయ్యి కొనుగోలు. రూ.6.52 కోట్లతో ఏపీ, తెలంగాణ రైస్‌మిల్లర్ల ద్వారా 16.32 లక్షల కిలోల సోనమసూరి పాత బియ్యం కొనుగోలు. రూ.3.05 కోట్లతో 2 లక్షల కిలోల ఎండుద్రాక్ష కొనుగోలు. రూ.1.50 కోట్లతో 1.80 లక్షల కాటన్ ఉత్తరీయాలు కొనుగోలు. రూ.1.47 కోట్లతో 3.60 కోట్ల పేపర్ కప్పులు కొనుగోలు. రూ. 1.38 కోట్లతో 2.50 లక్షల కాటన్ బ్లౌజ్ఫీసులు కొనుగోలు. రూ.11.28 కోట్లతో 39.32 లక్షల లీటర్ల టోన్డ్పాలు కొనుగోలు. అలాగే, చింతపండును హిందూపురం చింతపండి మండీ వర్తకుల సమైఖ్యద్వారా, బెల్లం అనకాపల్లి వర్తకుల నుండి కొనుగోలుకు ఆమోదించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో వాహనసేవలు వివరాలతో కూడిన బుక్‌లెట్‌ను టీటీడీ చైర్మన్,ఈవో , సభ్యులు ఆవిష్కరించారు. బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకే పెద్దపీట – మీడియాతో చైర్మన్,ఈవో శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకే పెద్ద పీట వేస్తామని టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు మంగళవారం మీడియాకు వెల్లడించారు. ఆలయ వీధుల్లో వాహన సేవలతోపాటు ఆలయంలో మూలమూర్తి దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. బ్రహ్మోత్సవాల్లో కేవలం ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనాలు ఉంటాయని, వారి సిఫారసులకు ఉండబోవని స్పష్టం చేశారు. ఉత్సవాల రోజుల్లో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశామన్నారు. ఇటీవల నిర్వహించిన ఈ–వేలం ద్వారా టీటీడీకి జూలై,2016లో రూ.11.88 కోట్లు, ఆగస్టులో రూ.5.94 కోట్లు ఆదాయం లభించిందన్నారు. -
శ్రీవారి కల్యాణకట్టలో ఆధునిక వసతులు
సాక్షి,తిరుమల : శ్రీవారికి తలనీలాలు సమర్పించేందుకు భక్తుల సౌకర్యం కోసం కొత్త హాలును శనివారం టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు ప్రారంభించారు. ప్రధాన కల్యాణకట్టలో మొత్తం నాలుగు హాళ్లు ఉన్నాయి. ఇందులో ప్రయోగాత్మకంగా ఈ హాలు ఆధునికీకరించారు. అదనంగా ఆరు టోకెన్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ చదలవాడ మాట్లాడుతూ, తలనీలాలు సమర్పించేందుకు సామాన్య భక్తులు ఎక్కువ సమయం క్యూలో వేచి ఉండకుండా ఉండేందుకు ఈ కొత్త హాలు ఉపయోగపడుతుందన్నారు. భక్తుల కోసం కాఫీ, టీ కూడా ఉచితంగా అందిస్తారన్నారు. టీటీడీ ఈవో సాంబశివరావు మాట్లాడుతూ కొత్త హాలు, కొత్త టోకెన్ కౌంటర్లు అందుబాటులోకి తీసుకురావడంతో భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండే అవకాశం ఉండదన్నారు. అలాగే పూర్తి స్థాయి పారిశుద్ధ్యం వల్ల తలనీలాలు తీసుకునే భక్తులు, వృత్తిని కొనసాగించే క్షురకులకు ఆరోగ్య సమస్యలు రావన్నారు. దశలవారీగా మరో మూడు హాళ్లను కూడా పూర్తి స్థాయిలో ఆధునికీకరిస్తామన్నారు. కార్యక్రమంలో ఢిల్లీలోని ఏపీ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్రావు,టీటీడీ న్యాయాధికారి వెంకటరమణ, చీఫ్ ఇంజనీరు చంద్రశేఖరరెడ్డి, ఎస్ఈ రామచంద్రారెడ్డి, వీఎస్వో రవీంద్రారెడ్డి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ శర్మిష్ట, డెప్యూటీ ఈవో వెంకటయ్య పాల్గొన్నారు. -
స్విమ్స్ వైద్య సేవల విస్తరణ
–అన్ని వైద్య విభాగాల్లో కొత్త పరికరాల ఆవిష్కరణ –క్యాన్సర్ రోగులకు 2వ సత్రంలో వసతి సదుపాయం – టీడీపీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి తిరుపతి మెడికల్ : శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) వైద్య సేవలు రాయలసీమకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అందేలా అన్నివిధాలా అభివృద్ధి చేస్తామని టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. స్విమ్స్‌లో శుక్రవారం సాయంత్రం నూతన రేడియేషన్ ఆంకాలజి వార్డు, మెడకిల్ ఆంకాలజి వార్డు, బ్రాకీ వార్డు, బ్రాకీ థెరపీ, కార్డియాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, యూరాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, ఆంకాలజీ విభాగాల అధునాతన వైద్య పరికరాలను చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో చదలవాడ మాట్లాడుతూ వైద్య సేవలను మరింతగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్నిరకాల ఆర్థిక సదుపాయాలను టీటీడీ సమకూరుస్తుందని తెలిపారు. దూరప్రాంతాల నుంచి వచ్చే క్యాన్సర్ వ్యాధి గ్రస్తుల వసతి కోసం టీటీడీ 2వ సత్రంలో 50 గదులను స్విమ్స్‌కు కేటాయిస్తున్నట్టు వెల్లడించారు. ఈవో సాంబశివరావు మాట్లాడుతూ శ్రీబాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం కింద లభించే విరాళాలతో మరింత ఆర్థిక సహాయాన్ని స్విమ్స్‌కు అందజేస్తామని తెలిపారు. ప్రస్తుతం ఏడాదికి రూ.30 కోట్ల మేరకు ఆర్థిక సాయాన్ని అందిస్తోందని, దీనిని రూ.40 నుంచి రూ.70 కోట్లకు పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. క్యాన్సర్ రోగుల కోసం టీటీడీ సత్రంలో గదులు కేటాయించడంపై స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ కృతజ్ఞతలు తెలిపారు. టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు, టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.