వీళ్లింతే.. | civil supplies stores not opened timely | Sakshi
Sakshi News home page

వీళ్లింతే..

Published Sat, Dec 14 2013 4:56 AM | Last Updated on Sat, Sep 2 2017 1:34 AM

civil supplies stores not opened timely

ఏలూరు, న్యూస్‌లైన్ : రేషన్ డిపోలను నిర్ణీత వేళల్లో తెరవకపోతే డీలర్ షిప్పులను రద్దు చేస్తామని జారుుంట్ కలెక్టర్ టి.బాబూరావు చేసిన హెచ్చరి కలు సైతం బేఖాతర్ అవుతున్నారుు. ప్రజా పంపిణీ వ్యవస్థను గాడిన పెట్టేందుకు  జారుుంట్ కలెక్టర్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రతినెలా ‘నా రేషన్’ పేరిట నిత్యావసర సరుకుల పంపిణీపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు.  కొవ్వూరు, నరసాపురం పట్టణాల్లో ఆ డివిజన్ల పరిధిలోని డీలర్లతో గురువారం అవగాహన సదస్సులు సైతం నిర్వహిం చారు. సాక్షాత్తు జాయింట్ కలెక్టర్ రంగంలోకి దిగినప్పటికీ క్షేత్రస్థాయిలో మార్పు రావడం లేదు.

రేషన్ డిపోలను తనిఖీ చేయూల్సిన సివిల్ సప్లైస్ డెప్యూటీ తహసిల్దార్లు కార్యాలయూలకే పరిమితం కావడంతో ఈ దుస్థితి దాపురించింది. రేషన్ డిపోలు సకాలంలో తెరుచుకుంటున్నాయో లేదోననే విషయూన్ని తెలుసుకునేందుకు నగరంలోని పలు డిపోలను శుక్రవారం ‘న్యూస్‌లైన్’ పరిశీలించింది. నగరంలో మొత్తం 104 రేషన్ డిపోలు ఉండగా, వాటిలో చాలావరకు సమయూనికి తెరుచుకోలేదు. టూటౌన్ ప్రాంతంలోని 14  రేషన్ డిపోలు పూర్తిగా మూసివేసి ఉన్నారుు. డీలర్లు ఏదైనా సమావేశానికి వెళ్లినా.. వ్యక్తిగత కారణాల వల్ల అందుబాటులో లేకపోరుునా ఆ విషయూన్ని నోటీసు బోర్డులో రాయూలి. తెరుచుకోని డిపోల వద్ద ఇవేమీ కనిపించలేదు.

మరో రెండు రోజుల్లో బియ్యం, పంచదార పంపిణీకి గడువు ముగియనుంది. ఈ సమయంలో ఉదయం పూట డిపోలు తెరుచుకోకపోవటంతో లబ్ధిదారుల్లో కొందరికి అవి అందకుండా పోయే పరిస్థితి ఉంది. బియ్యూన్ని చాలామందికి పంపిణీ చేయకుండానే.. ఇచ్చినట్లుగా పుస్తకాల్లో రాసుకుని బహిరంగ మార్కెట్‌లో విక్రరుుస్తున్న ఉదంతాలు అనేకం ఉన్నారుు.
 పట్టించుకునే నాథుడేడీ
 రేషన్ డిపోలకు నిర్ణీత వేళలు ఉన్నారుు. ఉదయం 7.30నుంచి 11గంటల వరకు, సాయంత్రం 4నుంచి 7గంటల వరకు వాటిని తెరిచి ఉంచాలి. జిల్లాలో చాలాచోట్ల ఈ వేళలను పాటించడం లేదనే విమర్శలు ఉన్నారుు. జిల్లావ్యాప్తంగా 2,082 డిపోలు ఉండగా, వీటిద్వారా 12 లక్షల కుటుంబాలు నిత్యావసర సరుకుల్ని పొందుతున్నారుు. ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15 వరకు బియ్యం, అర కిలో పంచదార పంపిణీ చేయూల్సి ఉంది. 16వ తేదీనుంచి నెలాఖరు వరకు అమ్మహస్తం పథకం కింద ఇచ్చే 9 నిత్యావసర సరుకులను విక్రరుుంచాల్సి ఉంది. ఇవేమీ సకాలంలో లబ్ధిదారులకు అందడం లేదు. అధికా రులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారు.

Advertisement
Advertisement