నమ్మి ఓట్లు వేస్తే మోసం చేస్తారా? | cm chandra babu naidu cheet in elections promises | Sakshi
Sakshi News home page

నమ్మి ఓట్లు వేస్తే మోసం చేస్తారా?

Published Tue, May 3 2016 4:29 AM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM

నమ్మి ఓట్లు వేస్తే మోసం చేస్తారా? - Sakshi

నమ్మి ఓట్లు వేస్తే మోసం చేస్తారా?

 ఎంపీపీని నిలదీసిన సీకరి మహిళలు
 
పెదబయలు: మిమ్మల్ని నమ్మి ఓట్లు వేస్తే గెలిచి పార్టీ పిరాయింపుతో మమ్మల్ని మోసం చేస్తారా అంటూ స్థానిక మండల పరిషత్ అధ్యక్షుడు సల్లంగి ఉమామహేశ్వరరావును సీకరి గ్రామ మహిళలు నిలదీశారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి, ఆయన తనయుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై అభిమానంతో మిమ్మల్ని గెలిపిస్తే డబ్బుకు ఆశపడి పార్టీని వీడి మా మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు. ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. కరువు, తాగునీటి సమస్య పరిష్కారంపై వైఎస్సార్ సీపీ సోమవారం చేపట్టిన ర్యాలీలో భాగంగా స్థానిక మండల పరిషత్ అధ్యక్షుడు సల్లంగి ఉమామహేశ్వరరావును మహిళలు నిలదీశారు. ఖంగుతున్న ఎంపీపీ నాకంటే పెద్ద కేడర్ ఉన్న ఎమ్మెల్యే వెళ్లడంతో అతని వెంట వెళ్లినట్టు చెప్పారు.

మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి రెండేళ్లుగా ఎటువంటి పనులు చేపట్టలేదని, ప్రస్తుతం అధికార పార్టీకి వెళ్లినందున మరింత అభివృద్ధి పనులు చేపట్టాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు గంగాభవాని, సందడి కొండబాబాబు, మాజీ ఎంపీపీ సూర్యనారాయణ, సీకరి, సీతగుంట గ్రామ మహిళలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement