పెడన, న్యూస్‌లైన్ : పట్టణంలోని శివాలయం ప్రాంగణంలో గల అయ్యప్పస్వామి ఉపాలయంలో హుండీని దొంగలు పగులగొట్టి నగదు అపహరించుకుపోయారు. వివరాలిలా ఉన్నాయి.. స్థానిక గుడివాడ రోడ్డులోని శ్రీ గంగా పార్వతి సమేత ఆగస్థేశ్వర స్వామి దేవాలయంలో అయ్యప్పస్వామి ఉపాలయం ఉంది.
శనివారం తెల్లవారుజామున పూజారి గూడూరు ఆగస్థయ్య వచ్చి చూడగా అయ్యప్పగుడిలోని హుండీ పగులగొట్టి ఉంది. కొన్ని నాణేలు ఆ ప్రదేశంలో పడి ఉన్నాయి. దీనిపై ఆలయ కమిటీ సభ్యులు, ఈవో జోగి రాం బాబుకు ఫోన్‌లో సమాచారం అందించారు. ఈవో ఫిర్యాదు మేరకు ఎస్సై శివరామకృష్ణ సిబ్బందితో వచ్చి దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. హుండీలోని నోట్లను మా త్రమే దుండగులు తీసుకెళ్లినట్లు గుర్తించారు. అపహరణకు గురైన మొత్తం రూ.25 వేలు వరకు ఉంటుందని భావిస్తున్నారు.
హుండీలో మిగిలిన నాణేలను సిబ్బంది లెక్కించగా మొత్తం రూ.3,011 ఉంది. ఈ ఘటనపై కేసు నమోదవగా, ఎస్సై శివరామకృష్ణ దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా ఇదే ఆలయంలో దొంగతనానికి విఫలయత్నం జరిగింది. గుడికి నైట్ వాచ్‌మెన్‌ను నియమించాలని దేవాదాయశాఖ అధికారులను ఆలయ కమిటీ సభ్యులు బండారు ఆనంద ప్రసాద్, కొల్లూరి నాగభూషణం కోరారు.
పెడన ఆలయంలో చోరీ
Published Sun, Jan 5 2014 12:54 AM | Last Updated on Sat, Sep 2 2017 2:17 AM
Advertisement
Advertisement