=తిరుపతి మీదుగా 3 డైలీ, 3 వీక్లీ రైళ్లు
=డిసెంబర్ 5 నుంచి 25 ప్రత్యేక రైళ్లు
తిరుపతి అర్బన్, న్యూస్‌లైన్: కేరళలోని శబరిమలై అయ్యప్పస్వామి దర్శనార్థం వెళ్లే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా ప్రస్తుతానికి తిరుపతి మీదుగా 3 డైలీ, 3 వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడుపుతున్నారు.
ఇవి కాకుండా డిసెంబర్-5వ తేదీ నుంచి తిరుపతి మీదుగా 25 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు స్థానిక రైల్వే చీఫ్ రిజర్వేషన్ ఇన్‌స్పెక్టర్ దాసరి రాధాకృష్ణ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ప్రతి ఏడాదీ శబరిమల యాత్రకు వెళ్లే భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. వీరిలో ఎక్కువమంది రైళ్ల ద్వారానే ప్రయాణిస్తుంటారు. తిరుపతి, చిత్తూరు మీదుగా ప్రస్తుతం నడుస్తున్న 6 రైళ్ల ద్వారా శబరిమల యాత్రకు వెళ్లాల్సిన భక్తులు ఇప్పటికే రిజర్వేషన్లు చేసుకున్నారు. ప్రత్యేక రైళ్లకు మాత్రం సోమవారం నుంచి రిజర్వేషన్ చేసుకోవచ్చు.
ప్రస్తుతం తిరుపతి మీదుగా నడుస్తున్న రైళ్లు..
జయంతి ఎక్స్‌ప్రెస్(ట్రైన్ నెం.16381) రైలు ప్రతిరోజూ తిరుపతిలో మధ్యాహ్నం 02:50 గంటలకు, కేరళ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్(12626) రాత్రి 9:15 గంటలకు, శబరి ఎక్స్‌ప్రెస్(17230) రోజూ అర్ధరాత్రి 12:30 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరుతాయి. వీటిలో వెళ్లే భక్తులు కొట్టాయంలో గానీ, చెగనూర్‌లో గానీ దిగి అక్కడి నుంచి ప్రైవేటు వాహనాల ద్వారా శబరిమలైకు చేరుకోవచ్చు. వీటిలో రిజర్వేషన్ రూ.335 నుంచి రూ.375 వరకు ఉంటుంది.
జనరల్‌లో అయితే కొట్టాయంకు రూ.180, చెంగనూర్‌కు రూ.185. ఇక ప్రతి శనివారం సాయంత్రం 5.10 గంటలకు స్వర్ణజయంతి సూపర్‌ఫాస్ట్(12644), గురువారం ఉదయం 9.50 గంటలకు రాజేంద్రనగర్ ఎక్స్‌ప్రెస్(16360), బుధవారం సాయంత్రం 5.10 గంటలకు మిలీనియం సూపర్ ఫాస్ట్(12646) రైళ్లు తిరుపతి నుంచి బయలుదేరుతాయి.
వివిధ రైల్వేస్టేషన్ల ఎంక్వైరీ నంబర్లు
తిరుపతి : 0877-2251131, 2253380
చిత్తూరు : 08572-228131
త్రివేండ్రం(తిరువనంతపురం) : 0471-2321568
కొట్టాయం : 0481-2563535
శబరిమలైకు ప్రత్యేక రైళ్లు
Published Mon, Nov 25 2013 2:18 AM | Last Updated on Sat, Sep 2 2017 12:57 AM
Advertisement
Advertisement